పార్వత్యువాచ- పార్వతీదేవి శంకరునితో నిట్లనినది-
కోవా సుయజ్ఞో నృపతి: కుత్రవంతే బభూవ సః।
కథం విప్రాభిశప్తశ్చ కథం సంప్రాప రాధికాం॥
సర్వాత్మనశ్చకృష్ణస్య పత్నీం శ్రీకృష్ణపూజితాం ।
కథం విణ్మూత్రధారీ చ సిషేవ పరమేశ్వరీం॥
షష్టివర్ష సహస్రాణి తపస్తేపే పురావిధిః ।
యత్పాదాంభోజరేణూనాం లబ్దయే పుష్కరే విభుః ॥
కథం దదర్శ తాం దేవీం మహాలక్ష్మీం పురాసతీం।
దుర్దర్శామపియుష్మాకం దృశ్యా సాఽభూత్కథం నృణాం॥
కథం త్రిజగతాం ధాతా తస్మై తత్కవచం దదౌ।
ధ్యానం పూజావిధిం స్తోత్రం తన్మే వ్యాఖ్యాతుమర్హసి ॥
మహాదేవా! సుయజ్ఞుడను రాబెవ్వరు? అతడే వంశమున పుట్టెను? అతనికి బ్రాహ్మణశాపమెందులకు తగిలినది? పరమాత్మయగు శ్రీకృష్ణుని ధర్మపత్ని, శ్రీకృష్ణునిచే పూజలనందుకొనిన రాధాదేవిని మానవమాత్రుడగు సుయజ్ఞుడెట్లు పూజించెను.
శ్రీరాధాదేవియొక్క పాదపద్మములను దర్శింపవలెనని బ్రహ్మదేవుడు ఆరవై వేల సంవత్సరములు పుష్కరక్షేత్రమున ఆమెనుగురించి తపస్సుచేసినను ఆ దేవిని దర్శించుకొనలేకపోయెనుగదా. అట్లే వైష్ణవులలో పరమశ్రేష్ఠులగు మీకు కూడ దర్శనమివ్వని ఆదేవి మానవులకెట్లు దర్శనమొసగినది. ముల్లోకములను సృష్టించు బ్రహ్మదేవుడు ఆ సుయజ్ఞునకు కవచమును, ధ్యానమును, స్తోత్రమును, పూజావిధిని, ఎట్లిచ్చెనో ఈవిషయములనన్నీటిని సవివరముగా నాకు తెలుపుడు.
శ్రీ మహాదేవ ఉవాచ- శ్రీమహాదేవుడు పార్వతితో ఇట్లు పలికెను-
స్వాయంభువో మనుర్దేవి మనూనామాదిరేవ చ ।
బ్రహ్మాత్మజస్తపస్వీ చ శతరూపాపతిః ప్రభుః ॥
ఉత్తాన పాదస్తత్పుత్రః తత్పుత్రో ధ్రువ ఏవ చ ।
ధ్రువస్య కీర్త్విఖ్యాతః త్రైలోక్యే శైల కన్యకే ॥
ఉత్కలస్తస్య పుత్రశ్చ నారాయణపరాయణః ।
సహస్రం రాజసూయానాం పుష్కరే స చకార హ ॥
సర్వాణి రత్నపాత్రాణి బ్రాహ్మణేభ్యో దదౌ ముదా ।
అమూల్య రత్నరాశీనాం సహస్రం తేజసావృతం ॥
బ్రాహ్మణేభ్యో దదౌ రాజా యజ్ఞాంతే స మహోత్సవే ।
దృష్ట్యా తచ్చోభనం యజ్ఞం విధాతా జగతాం ప్రియే॥
ఓ పార్వతీ! స్వాయంభువుడను మనువు మనువులందరిలో మొదటివాడు. ఆతడు బ్రహ్మదేవుని పుత్రుడు. అతని భార్యపేరు శతరూప. ఆ స్వాయంభువ మనువుయొక్క పుత్రుడు ఉత్తానపాదుడు. అతని పుత్రుడు ధ్రువుడు. ధ్రువుని పుత్రుడు కీర్తియనువాడు. ఆతని పుత్రుడు ఉత్కళుడు, అతడు గొప్ప నారాయణభక్తుడు. అతడు పుష్కరక్షేత్రమున వేయి రాజసూయయాగములు చేసెను. ఆ యాగమున బ్రాహ్మణులకు రత్నపాత్రలను, అమూల్యరత్న రాసులను దానముచేసెను. ఆ ఉత్కళమహారాజు చేసిన యజ్ఞము చాలా గొప్పగానుండెను.
సుయజ్ఞం నామ నృపతిం చకార సురసంపది ।
స చ రాజా సుయజ్ఞశ్చ మనువంశసముద్భవః ॥
అన్నదాతా రత్నదాతా దాతాపై సర్వసంపదార।
దశలక్షం గవాంచైవ రత్నశృంగపరిచ్ఛదం ॥
నిత్యం దదౌ స విపేభ్యో ముదాయుక్తః సదక్షిణం।
గవాం ద్వాదశలక్షాణాం దదౌ నిత్యం ముదాన్వితః ॥
సుపక్వాని చ మాంసాని బ్రాహ్మణేభ్యశ్చ పార్వతి ।
షట్కోటీర్భ్రాహ్మణానాం చ భోజయామాస నిత్యశః ॥
చోష్యైశ్చవైర్లేహ్య పేయైరతి తృప్తం దినదినే ।
విప్రలక్షం సూపకారం భోజయామాస తత్సరం॥
పూర్ణమన్నం చ సూపాక్తం సగవ్యం మాంసవర్జితం ।
విప్రాభోజన కాలేచ మనువంశసముద్భవం॥
న తుష్టువు: సుయజ్ఞం చ తుష్టువుస్తత్పతౄంశ్చ తే ।
దినే సుయజ్ఞయజ్ఞాంతే పట్ త్రింశలక్ష కోటయః ॥
చక్షుః సుభోజనం విపాశ్చాతితృప్రాశ్చ సుందరి ।
గృహీతాని చ రత్నాని స్వగృహం వోడుమక్షమా:॥
వృషలేభ్యో దదు: కించిత్ కించిత్పథచ తత్యజుః ।
విప్రాణాం భోజనాంతే చ వీప్రాన్యేభ్యో దదౌ నృపః॥
తథాప్యుర్వరీతం తచాన్నరాశి సహస్రకం ।
కృత్వా యజ్ఞం మహాబాహుః సమువాస స్వసంసది॥
ఉత్కళ మహారాజు గొప్పయజ్ఞమును చేసినందువలన బ్రహ్మదేవుడతనికి దేవతలందరి సన్నిధిలో సుయజ్ఞాడను పేరును (బిరుదును) పెట్టెను. ఆవిధముగా సుయజ్ఞుడను పేరును ధరించి రత్నములను, సమస్తసంపదలను రత్నములచే అలంకరింపబడిన కొమ్ములు గల పదిలక్షల గోవులను దక్షిణలతో బ్రాహ్మణులకు దానముచేసెను. ఇంకను పన్నెండు లక్షల గోవులను సంతోషముతో బ్రాహ్మణులకు ఇచ్చేను. "అట్లే ఆరుకోట్ల బ్రాహ్మణులకు భక్ష్యభోజ్య పరమాన్నములతో భోజనము పెట్టెను. ఆదేవిధముగా లక్ష బ్రాహ్మణులకు చక్కగా భోజనమును పెట్టెను.
సంతృప్తిగా భోజనము చేసిన ఆ బ్రాహ్మణులు మనువంశమున పుట్టిన ఆ మహారాజును పొగడక ఆతని పితృదేవతలను కొనియాడిరి. సుయజ్ఞమహారాజయజ్ఞముయొక్క చివరిదినమున ముప్పైఆరు లక్షల కోట్ల బ్రాహ్మణులు తృప్తిగా భోజనము చేసిరి. బ్రాహ్మణభోజనము తరువాత వారికి దానమిచ్చిన రత్నరాశులను వారు తమ ఇంటికి తీసికొని పోలేక కొంత ధనమును ఇతరులకిచ్చి, మిగిలిపోయిన ధనరాశిని మోయలేక తోవలోనే వదిలి పెట్టిపోయిరి..
మహారాజు, బ్రాహ్మణ భోజనము తరువాత ఇతరులకందరికి భోజనము పెట్టెను. ఐనను అన్నరాశులు అచ్చట చాలా మిగిలిపోయెను.
రత్నేందసార సంక్లుప్త చ్ఛత్ర కోటి సమన్వితే।
రత్నసింహాసనే రమ్యేపట్టవస్త్రై సుసంస్కృతే ॥
చందనాది సుసంసృష్టే రమ్యే చందనపల్లపైః ।
శాఖాయుత్తైః పూర్ణకుంభై రంభా వృక్తైశ్చ శోభితే ॥
చందనాగురు కస్తూరీ ఘనసిందూర సంస్కృతి ।
వసు వాసవ చంద్రేంద్ర రుద్రాదిత్య సమన్వితే॥
ముని నారద మన్వాదిబ్రహ్మవిష్ణు శివాన్వితే ।
సుయజ్ఞమహారాజు యజ్ఞమును పూర్తిచేసి తన భవనమున నున్న రత్నసింహాసనమున కూర్చొనేను. ఆ సింహాసనమున రత్న నిర్మితములైన అనేక ఛత్రములున్నవి. అందమైన రంగురంగుల వస్త్రములచే అదీ ఆలంకరింపబడియున్నది. చందనము మొదలగు సుగంధద్రవ్యములతో సువాసితమైనది. పూర్ణకలశములు, చందన వృక్షపల్లవములు, ఆరటి చెట్లచే ఆలంకరింపబడినది. అచ్చట వస్తువులు, వాసవుడు, చంద్రుడు, రుద్రులు, ఆదిత్యులు మునులు మొదలగు దేవతలుండిరి.
ఏతస్మిన్నంతరే తత్ర వీప్రఏకః సమాయయౌ ।
రూక్షో మలినవాసాశ్చ శుష్క కంఠౌష్ఠ తాలుకః ।
రత్నసింహాసనస్థం చ మాల్యచందన చర్చీతం॥
రాజినమాశిషం చక్రే సస్మిత: సంపుటాంజలిః ।
ప్రణనామనృపస్తం చ నోత్తస్థౌ కించిదేవ హి ॥
సభా దశ్చ నోత్తస్థు: జిహసు: స్వల్పమేవ చ ।
సుయజ్ఞాడు సింహాసనమున కూర్చుండి విశ్రాంతి తీసుకొనుచున్న సమయమువ మాసిన బట్టలతో తడి ఆరిపోవుచున్న కంఠముతో నున్న ఒక బ్రాహ్మణుడచ్చటికి వచ్చెను. వెంటనే అతడు రత్నసింహాసనమున మాటలు ధరించీ చందనమునద్దుకొని కూర్చొనియున్న సుయజ్ఞాని ఆశీర్వదించెను. రోజా చిరునవ్వుతో చేతులు జోడించుకొని ఆ బ్రాహ్మణునకు నమస్కరించెను. కాని సింహాసనమున ఏమాత్రము లేచి నిలబడలేదు. అట్లే అచ్చటనున్న సభాసదులందరు ఏమాత్రము ఆసనములనుండి లేచి నిలబడలేదు. పైగా చిన్నగా నవ్విరి.
మునిభ్యోఽపి చ దేవేభ్యో నమస్కృత్య ద్విజోత్తమః ॥
శశాప నృపతిం క్రోధాత్తత్రాతిష్ఠనిరంకుశః ।
గచ్ఛదూరమతో రాజ్యాత్ భ్రష్టశ్రీర్భవ పామర ॥
భవాచిరం గళత్కుష్ఠీ బుద్ధిహీనోఽప్యుపద్రుతః ।
ఇత్యుక్త్వా కంపితః క్రోధాత్ సభాస్థాన్ శప్తుముద్యతః ॥
ఆ బ్రాహ్మణుడు అచ్చటనున్న మునులకు దేవతలకు నమస్కరించి కోపముతో రాజును ఇట్లు శపించెను. “ఓ సుయజ్ఞా! నీవు రాజ్యమదమున నన్ను అవమానపరచినందువలన వెంటనే రాజ్యమును కోల్పోయెదపు. ఆట్లే నీవు త్వరలో కుష్టురోగమువలన బాధచెందెదవు, బుద్దిని కోల్పోయి, ఉపద్రవములతో కష్టపడెదవు అనీ సుయజ్ఞుని శపించి కోపముతో ఊగిపోవుచు అచ్చటనున్న సభాసదులను శపింపబోయెను.
యేయత్ర జహసు: సర్వే సముత్తస్థు: సభాసదః ।
సర్వే చక్రు: ప్రణామం తే క్రోధం తత్యాజ బాడబః ॥
ఆంతకుముందు ఆ బ్రాహ్మణుని చూచి నవ్విన సభాసదులందరు వెంటనే లేచి అతనికి నమస్కరించిరి. అందువలన ఆ బాపడు కోపమును ఉపసంహరించుకొనెను.
ప్రణమ్యాగత్య రాజా తం రురోధ భయకాతరః ।
నీస్ససార సభామధ్యాత్ హృదయేన వీదూయతా ॥
బ్రాహ్మణోగూడరూపీ చ ప్రజ్వలన్ బ్రహ్మ తేజసా ।
తత్పశ్చాత్ మునయః సర్వే ప్రయయుః భయకాతరాః ॥
హే విప్ర తిష్ఠ తిష్ఠేతి సముచ్చార్య పునః పునః ।
పులహశ్చ పులస్త్యశ్చ ప్రచేతా భృగురాంగిరాః ॥
మరీ: కశ్యప శైవ వసిష్ఠ క్రతు రేవ చచి క ।
శుక్రో బృహస్పతిశ్చైవ దుర్వాసా లోమశస్తథా ॥
గౌతమశ్చ కణాదశ్చ కణ్వ: కాత్యాయనః కఠః ।
పాణినిర్జజలిశ్చైవ ఋష్యశృంగో విభాండకః ।
తైత్తిరీప్యాపిశలి: మార్కండేయో మహాతపాః ।
సనకశ్చ సనందశ్చ వోడు: పైల: సనాతనః ॥
సనత్కుమారో భగవన్నరనారాయణావృషీ ।
పరాశరో జరత్కారు: పరివర్త: కరభస్తథా ॥
భరద్వాజశ్చ వాల్మీకి రౌరశ్చ చ్యవనస్తథా ।
అగస్త్యోఽత్రిరుతథ్య సంకర్ణాఽస్త్రీక ఆసురిః ॥
శిలాలిర్లాంగలిశ్చైవ శాకల్య శాకటాయనః ।
గర్గో వత్ప; పంచశిఖో జమదగ్నిశ్చ దేవళః ॥
జైగీషన్యో వామదేవో వాలఖిల్యదయస్తథా ।
శక్తిర్లక్షః కర్దమశ్చ ప్రసన్న: కపిలస్తథా ॥
విశ్వామిత్రశ్చ కౌత్సశ్చా పచీకోప్యసమర్షణః ।
ఏతే చాన్యే చ మునయః పితరోగ్నిర్హరిప్రియాః॥
దిక్పాలా దేవతా: సర్వా: విప్రం పశ్చాత్పమాయయుః ।
బ్రాహ్మణం బోధయామాసుర్వాసయామాసురీశ్వరి ॥
సమూచుస్తం క్రమేణైవ నీతిం నీతివిశారదాః ॥
సుయజ్ఞమహారాజు బ్రాహ్మణుని సమీపమునకు వచ్చి అతనిని నమస్కరించి భయముతో బాధపడుచు, ఏడ్చుచు సభలోనుండి బయలుదేరెను.
గొప్పని బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న గూడరూపియైన ఆ బ్రాహ్మణుడు కూడ సభనుండి బయలుదేరెను. అప్పుడు అచ్చటనున్న పులహుడు, పులస్త్యుడు, ప్రచేతసుడు, భృగుమహర్షి, ఆంగీరసుడు, మరీచి, కశ్యపుడు, వసిష్ఠమహర్షి క్రతువు. శుక్రుడు, బృహస్పతి, దుర్వాసుడు, లోమశుడు, గౌతముడు కణాదుడు, కణ్వుడు, కాత్యాయనుడు, కథుడు, పాణిని, జాజులి, ఋష్యశృంగుడు, విభాండకుడు, తైత్తిరి, ఇదిశలి, మార్కండేయుడు, మహాతపుడు, సనకుడు, సనందుడు, వోడుమహర్షి పైలుడు, సనాతనుడు, పవచ్కుమారుడు. నరనారాయణులు, పరాశరుడు. జరత్కారువు, సంవర్తుడు. కరభుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఔర్వుడు, చ్యవమడు, అగస్త్యుడు, అత్రి, ఉతథ్యుడు, సంకర్త, ఆస్తీకుడు, ఆసురి, శిలాలి, లాంగలి, శాకల్యుడు శాకటాయమడు. గర్గుడు, వళ్పుడు. పంచశీఖుడు, జమదగ్ని, దేవళుడు, జైగీషవ్యుడు, వామదేవుడు, వాలఖిల్యులు, శక్తి, దక్షుడు, కర్దముడు, ప్రసన్నుడు, కపిలుడు, విశ్వామిత్రుడు, కౌత్సుడు. ఋచీకుడు, అఘమర్షణుడు మొదలగు ఋషులు, పితృదేవతలు, అగ్ని, శ్రీహరికి ప్రియమైన వైష్ణవులు, దిక్పాలకులు మొదలగు దేవతలందరు భయపడుచు ఆ బ్రాహ్మణుని వెంట నడచిరి.
వారందరు బ్రాహ్మణుని నిలునీలుమని వారించుచు నీతిని బోధించుచు ఒక చోట అతనిని నిలిపిరి.
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాదే రాధో పాఖ్యానే సుయజ్ఞోపాఖ్యానం నామ పంచాశత్తమోఽధ్యాయః॥
శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధాచరిత్రలోని సుయజ్ఞ మహారాజు ఉపాఖ్యానమను యాభయ్యవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 49 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This chapter unveils the secret spiritual cause behind the descent of Goddess Śrī Rādhā and Lord Śrī Kṛshṇa to the earthly realm through the narrative of Śrīdāmā's curse. During a transcendent pastime in Goloka, an unexpected misunderstanding arose between Goddess Śrī Rādhā and Śrīdāmā, an intimate cowherd friend of Lord Śrī Kṛshṇa. In the heat of divine emotion, Śrīdāmā cursed Goddess Śrī Rādhā to take birth on earth as a human princess and suffer a hundred-year separation from Her beloved Lord Śrī Kṛshṇa, a curse that was accepted by the Divine Mother as the hidden pathway to perform Her sublime Rāsalīlā on earth.