బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

60 –  శ్రీకృష్ణుడు దేవతలకు తారమద్ధరించు విధానముచెప్పుట

నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునీతోనిట్లు పలికెను-

నారాయణ మహాభాగ వేదవేదాంగ పారగ

విపీతం చ మహాభ్యాసం త్వన్ముఖేందు వీనిస్సృతం

ఆధునా శ్రోతుమిచ్ఛామి కిమువాచ బృహస్పతిః

 శివం చ గత్వా కైలాసం దాతారం సర్వసంపదాం

జగత్కర్తా విధాతా చ కిం వా తం ప్రత్యువాచ సః

 ఏతత్పర్వం సమాలోచ్య వదవేదవిదాం వర

వేదములు, వేదాంగములు అన్నియు తెలిసిన నారాయణుడా! నీవలన అనేక ఉపాఖ్యానములను వింటిని. ఇప్పుడు సమస్త సంపదల నొసగు పరమశివుడు కైలాసమునకు వెళ్ళిన బృహస్పతితో ఏమనెను? ఈ విషయమును సంపూర్ణముగా నాకు తెలుపుమని అడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లనెను-

శీఘ్రం గత్వా చ కైలాసం భ్రష్టశ్రీ శంకరం గురుః

ప్రణమ్య తస్థౌ పురతో లజ్జావనత కంధరః

దృష్ట్వా గురుసుతం శంభురుదతిష్ఠత్కుశాసనాత్

ఆలింగనం దదౌతస్మై శీఘం మాంగళికాశిషః

స్వాసనే వాసయిత్వా వై పప్రచ్ఛ కుశలం వచః

ఉవాచ మధురం వాక్యం భీతం తం లజ్జితం శివః

బృహస్పతి బ్రహ్మదేవుని మాటలనమసరించి శీఘ్రముగా కైలాసపర్వతమునకు వెళ్ళి అచ్చట పిగ్గుతో తలవంచుకొని నమస్కరించి నిలబడెను. గురుసుతుడగు బృహస్పతి కనిపించగానే శంకరుడు దర్భాసనమునుండి లేచి బృహస్పతిని కౌగలించుకొని ఆశీర్వదించెను. తరువాత ఆతనిని తనతోపాటు ఆసనమున కూర్చుండబెట్టుకొని యోగక్షేమములు విచారించెను. అటుపిమ్మట శంకరుడు భయముతో, సిగ్గుతోనున్న బృహప్పతితో మధురముగా ఇట్లు మాట్లాడ దొడగెను.

శ్రీశంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను-

కథమేవంవిధస్యం చ దుఃఖీమలిన విగ్రహః

సాశ్రునేత్రో లజ్జితశ్చ భ్రాతస్తత్కారణం వద

కిం వా తపస్యాపాసా సంధ్యా హీనాధునా మునే

కిం వా శ్రీకృష్ణసేవా సా విహీనా దైవదోషతః

కిం వా గురౌభక్తి హీనోభిష్ట దేవేథవా గురౌ

కిం వా నరక్షితుం శక్తః ప్రపన్నం శరణాగతం

కిం వాఽతిథిస్తే విముఖః కిం వా పోష్యా బుభుక్షితాః

కిం వా స్వతంత్రా స్త్రీవాతే కిం వా పుత్రోఽవతప్కరః

సుశాసితో న శిష్యోవా కిం భృత్యాశోత్తరప్రదాః

కింవా తే విముఖాలక్ష్మీః కిం వా రుష్టో గురుస్తవ

గరిష్ఠశ్చ వరిష్ఠశ్చ శశ్వతంతుష్టమానసః

గురుస్తవ వసిష్ఠశ్చ ప్రేష్ఠ శ్రేష్ఠ సతామహో

 కిం వా రుష్టోభీష్టదేవః కిం వా రుష్టోశ్చబాడబాః

 కిం వా రుష్టా వైష్ణవాశ్చ కిం పొతే ప్రబలో రిపుః

 కిం వా తే బంధువిచ్చేదో విగ్రహో బలీనా సహ

 కిం వా పదం పరగ్రస్తం కిం వా బంధుధనం చవా

 కేన తే వా కృతానందా ఖలైర్వా పాపిభిర్మునే

కేనచ్చ త్వం పరిత్యక్తో బాంధవేన ప్రియేణ వా

 బంధుస్త్యక్తస్యయా కిం హ వైరాగ్యేణ కృగాథవా

 కిం వా తీర్థి న హి స్నాతం న దత్తం పుణ్యవాసరే

గురునీందా బంధునిందా ఖలవక్త్రాత్ శ్రుతాఽథవా

గురువిందా హి సాధూనాం మరణాదతీరిచ్యతే

ఆపద్వంశ ప్రజానాం ఖలానాం సౌందనం తథా

దౌశ్శీల్యమేవమషతాం శశ్వన్నారాకిణామిహ

పరప్రశంసకాః సంతః పుణ్యవంలో హి భారతే

శశ్వన్మంగళయుక్తాశ్చ రాజంతే మనసా పది

పుత్రే యశసి తోయే చ సమృద్దే చ పరాక్రమే

ఐశ్వర్య వా ప్రతాపే చ ప్రజాభూమి ధనేషు చ

వచనేషు చ బుద్దౌ చ స్వభావే చ చరిత్రతః

ఆచారే వ్యవహారే చ జయతే హృదయం నృణాం

 యాదృగ్యేషాం చ హృదయే తాదృక్తేషాం చ మంగళం

యాదృగ్వేషాం పూర్వపుణ్యం తాదృక్తేషాం చ మానసం

ఓ బృహస్పతీ! నీవెందులకిట్లున్నావు? మలినమైన శరీరముతో కన్నీళ్ళతో దుఃఖించుచున్నట్లున్నావు. నీ దుఃఖమునకు కారణమేమిటో చెప్పుము. నీ తపస్పున కేమైన అవాంతరమేర్పడినదా? లేక సంధ్యావందనమునకు ఇబ్బంది కలిగినదా? దురదృష్టము వలన నీవు శ్రీకృష్ణపరమాత్మను ధ్యానింపలేక పోవుచున్నావా? నీగురుభక్తికి గాని దైవభక్తికిగానీ ఆవాంతరము కలిగినదా? నీన్ను శరణుచెందిన ప్రపన్నుని రక్షింపలేక పోయితివా? నీ ఇంటికి వచ్చిన ఆతిథి నీవు. చక్కగా సత్కారము చేయలేదని వెనుదిరిగి పోయినాడా?

లేక నీ ఇంటిలోనున్న ఆనుచరవర్గమునకు భోజనము పెట్టలేక పోవుచున్నావా? మీ భార్యకాని పుత్రుడుకాని స్వతంత్రులై ఎదురుతిరిగి మాట్లాడుచున్నారా? లేక నీ శిష్యులుగానీ భృత్యులుగాని ఎదురుతిరిగివారా? లక్ష్మీదేవి నిన్ననుగ్రహించకుండ ఉన్నదా? నీ గురువు నీపై కోపపడినాడా? నీ అభీష్టదేవత కానీ బ్రాహ్మణులుకాని నీపై కోపగించినారా? నీబంధువులెవరైన పోయిరా? బలవంతుడైన వానీతో కయ్యమేమైనా జరిగినదా? నీ స్థానమును ఇతరులాక్రమించుకొనిరా? నీ బంధువుల ధనమును ఎవరైనను దోచుకొనీరా? పావులు దుష్టులైన వారు నిన్ను నిందించరా? నీకు మిక్కిలి ఇష్టమైన బంధువులు నిన్ను వదిలిపోయిరా?

లేక నీవే, ఏమైన వైరాగ్యమువలన లేక కోపమువలన నీ బంధువులను వదలుకొంటివా? నీవు పుణ్యతీర్థములలో స్నానము చేయలేదా? అచ్చట పుణ్యదినమున దానము చేయలేకపోతివా? లేక దుష్టులు నీ గురువును కాని బంధువులను కానీ నిందించరా?

మంచివారు తన గురువును ఇతరులు నిందించుచున్నచో దానీని మరణముకంటె ఎక్కువగా భావింతురు. చెడువంశములో పుట్టిన దుస్తులు వృథాగా ఇతరులను నిందింతురు, సత్పురుషులు ఎల్లప్పుడు పరప్రశంస సేయుదురు. అందువలననే వారు పుణ్యవంతులగుచున్నారు. వారి మనస్సులో సైతము సద్భావనయుండుమ.

మానవులు సాధారణముగా, పుత్రుని, కీర్తిని, సమృద్ధమగు నీటిని, మంచి పరాక్రమమును, ఐశ్వర్యమును, సంతానమును, భూమిని ధనమును, మంచిమాటలను, చక్కని స్వభావమును ఇష్టపడుదురు.

తమ మనస్సులో ఎట్టి భావన చేయుదురో మానవులకు అట్టి పనులే జరుగును. వారి పూర్వపుణ్యముననుసరించి ఈజన్మలో వారీ చిత్తముండును.

ఇత్యుక్త్యా చ మహాదేవో వీరరామ స్వసంసది

 తముహచ మహాశక్తా స్వయమేవ బృహస్పతిః

మహాదేవుడిట్లు బృహస్పతితో ననగా బృహస్పతి పరమశివునీలో ఈవిధముగా మాటలాడసాగెను.

బృహస్పతిరువాచ- బృహస్పతి ఇట్లనెను-

అకథ్యమేవ వృత్తాంతం కథయామి కిమీశ్వర

లోకాః కర్మనశాన్నిత్యం నానాజన్మపు యత్కృతం

స్వకర్మణాం ఫలం భుంక్తే జంతుర్జన్మని జన్మని

న హ నష్టం చ తత్కర్మ వివాభోగాచ్ఛ భారతే

సుఖందుఃఖం భయం శోకో వరాణాంభారత ప్రభో

 కేచి ద్వదంతి హి భవేత్ స్వకృతేన చకర్మణా

కేచిద్వదంతి దైవేన స్వభావేనేతి కేచన

త్రివిధా గతయో యస్యవేద వేదాంగ పారగ

స్వయం చ కర్మజనకః కర్మ వై దైవకారణం

స్వభావో జాయతే వృణాం ప్వాత్మనః పూర్వకర్మణః

స్వకర్మణాం చ జంతూనాం సర్వేషాం ప్రతిబన్మనీ

సుఖం దుఖం భయం శోకం స్వాత్మవశ్చ ప్రజాయతే

స్వకర్మఫలభోక్తా చ జీవో హ స గుణః సదా

ఆత్మభోజయితా సాక్షి నీర్గుణః ప్రకృతేః పరః

 స ఏవాత్మా సర్వసేవ్యః సర్వేషాం చ ఫలప్రదః

స వై సృజతీ దైవం చ స్వభావం కర్మ చైవ హి

కర్మణా చ నృణాం లజ్జా ప్రశంసా చ ప్రఫుల్లతా

లజ్జాబీజం చ వృత్తాంతం తథాపి కథయామి తే

ఓ మహేశ్వర! నా వృత్తాంతము చెప్పదగనిదైనను చెప్పెదను.

జీవులు కర్మవలన అనేక జన్మలనొందుచున్నారు. ప్రతిజన్మలోను వారు తాము చేసిన కర్మఫలముననుభవించుచున్నారు. కర్మఫలమనుభవింపనిదే కర్మ ఈ భారతభూమీపై నశింపదు. సుఖము, దుఃఖము, భయము, శోకమనునవి మానవులకు తాము చేసిన కర్మవలన ఈ భారతభూమిపై ఏర్పడుచున్నవని కొందరనగా మరికొందరు వారివారి అదృష్టమువలన సుఖదుఃఖాదులు కలుగుచున్నవందురు. దీనికి కర్మ, అదృష్టము, స్వభావము అను మూడు కారణములగుచున్నవి.

మానవుడు స్వయముగా కర్మకు కారణమగుచుద్నాడు. ఆ కర్మ అదృష్టమునకు కారణమగుచున్నది. జీవులు తాము పూర్వజన్మలో చేసికొన్న కర్మవలన స్వభావము పొందుచున్నారు. సుఖము, దు:ఖము, భయము, శోకమనునవి తన ఆత్మనుండి పుట్టుచున్నవి.

సగుణుడైన జీవుడు తాను చేసిన కర్మలనెల్లప్పుడు అనుభవించుచుండును. నిర్గుణుడు ప్రకృతికంటే శ్రేష్ఠుడైన పరమాత్మ  సర్వసాక్షిగానుండును.

ఆ పరమాత్మయే సమస్తజీవులచే సేవింపదగినవాడు. అందరకు అన్ని ఫలితముల నొసగువాడు. ఆ పరమాత్మయే అదృష్టమును, స్వభావమును, కర్మను సృష్టించుచున్నాడు. ఆ కర్మవలననే మానవులకు సిగ్గ, ప్రశంస, సంతోషము కలుగుచున్నవి.

ఐనను నేను సిగిపడుటకు గల కారణమును నీకెలిగింతును.

ఇత్యుక్త్యా సర్వవృత్తాంతమవోచత్తం బృహస్పతిః

శ్రుత్వా బభూవ నమ్రోస్యో గౌరీశోలజ్ఞయా తదా

జపమాలా కరాద్భష్టా కోపావిష్టస్య శూలినః

బభూవ సద్యః కంపశ్చ రక్త పంకబిలోచనే

సంహర్తురీతో రుద్రస్య విష్ణోః పాతుః సఖా శివః

స్రష్టుస్తుత్యశ్చ మాన్యశ్చ స్వోత్మనః పరమాత్మనః

నిర్గుణస్య చ కృష్ణస్య ప్రకృతి శస్య నారద

కోపాత్ప్రవకుమారేభే శుష్క కంఠౌష్ఠ తాలుకః

బృహస్పతి ఈవిధముగానని విషయమంతయు నెరిగించగా విని శివుడు సిగ్గుతో తలవంచుకొనెను. అతనికి వెంటనే కోపము కలిగెను. దానివలన అతని చేతినుండి అక్షమాల జారిపడెను. అతని శరీరము కంపించెను, కండ్లు ఎట్టబడినవి. ఆ పరమేశ్వరుడు లోక సంహరము చేయు రుద్రునకు ఆధిపతియు, లోకములను రక్షించు విష్ణుమూర్తికి స్నేహితుడు, లోకములను సృజించు బ్రహ్మదేవునిచే స్తుతింపబడువాడు. ఆతడు పరమాత్మ, నిర్గుణ స్వరూపుడు, ప్రకృతికి ఆధిపతి, శివునకు ఆత్మస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మకు మాన్యుడు. ఆట్టి పరమశివుడు కోపముచే గొంతు నాలుక ఎండిపోగా బృహస్పతితో ఇట్లనెను.

శివ ఉవాచ- పరమశివుడిట్లనెను-

శివమస్తు చ సాధూనాం వైష్ణవానాం సతామిహ

ఆవైష్ణవానా మసలా మశివం చ పదేపదే

దదాతి వైష్ణవేభ్యశ్చ యోదుఃఖం సుస్థితో జనః

శ్రీకృష్ణస్తస్య సంహర్తా విఘ్నస్తస్య పదేపదే

ఆవైష్ణవానాం హృదయం నహి శుద్ధం సదామలం

శ్రీకృష్ణమంత్రస్మరణం మనోనైర్మల్య కారణం

భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయాః

విష్ణుమంత్రోపాసనయా క్షీయతే కర్మ తన్నృణాం

అహో శ్రీకృష్ణదాసానాం కః స్వభావః సునిర్మల

హృతభార్యం మూర్చితశ్చ న శశాప రీపుం గురుః

గురుర్యశ్చ వరిష్ఠశ్చ క్రోధహీనశ్చ ధార్మికః

శతపుత్రఘ్నుమప్యేనం న శశాప రీపుంగురుః

 నిశ్వాసాధ్యై సురగురోర్చాతుర్మము బృహస్పతేః

 భస్మీభూతో నిమేషేణ శతచంద్రో భవేత్ ధ్రువం

తథాపి తం నో శశాప ధర్మభంగభయేన చ

తపస్యా హీయతే శప్తుః కోపావిష్టస్య నిత్యశః

ఆహో హ్యత్రేరసత్పుత్రః పరస్త్రీలుబ్ధకః శఠః

తపస్వినో వైష్ణవస్య బ్రహ్మపుత్రస్య ధీమతః

ధర్మిష్ఠా బ్రహ్మణః పుత్రా వైష్ణవా బ్రాహ్మణాస్తథా

కేచిద్దేవా ద్వీ దైత్యా పౌత్రాశ్చ త్రివీధాః స్మృతాః

యే సాత్విక బ్రాహ్మణాస్తే దేవా రాజనీకాఃతథా

దైత్యాస్తావుసికా రౌద్రాః బలిషాశ్బోద్ధతా స్తథా

సాధువులు, సత్పురుషులు, అగు వైష్ణవులకు ఎల్లప్పుడు మేలు జరుగును. అట్లే సత్పురుషులు కాని అవైష్ణవులకు ఎల్లప్పుడు కీడు జరుగును. వైష్ణవులగువారిని కష్టపెట్టువారికి ఎల్లప్పుడు విఘ్నములు కలుగును. శ్రీకృష్ణుడు వారిని బ్రతుకనీయడు. వైష్ణవులు కానివారీ హృదయము ఎల్లప్పుడు ఆపరిశుద్ధముగా నుండును.

శ్రీకృష్ణుని మంత్రమును స్మరించినచో మనస్సు నిర్మలమగును. అతని హృదయగ్రంథి విడిపోగా సంశయములన్నియు పటాపంచలగును. శ్రీకృష్ణమంత్రమును ఉపాసించినచో ఆతని కర్మఫలము నశించును. శ్రీకృష్ణభక్తుల మనస్సు చాల నిర్మలముగానుండును.

అందువలననే తన భార్యను చంద్రుడెత్తుకొని పోయినను అతనిని గురువు శపింపలేదు. శ్రేష్ఠుడు, కోపములేనివాడు ధార్మికుడగు గురువు తన శాపమువలన నూరుమందినైనను చంపగలడు. కాని గురువగు బృహస్పతి తనకు ఆపకారము చేసిన చంద్రుని శపింపలేదు. నాకు సోదరునీవంటివాడు దేవతలకు గురువైన బృహస్పతి తన బాధాపూరితమగు నీటూర్పుచే చంద్రుని ఒక నిమిషములోనే భస్మము చేయగలడు. అతనీ నూరు: ముక్కలుగా చేయగలుగును. ఐనను బృహస్పతి ధర్మమునకు భంగము కలుగునని చంద్రుని శపింపలేదు. కోపముచే శపించువాని తపస్సు క్షీణించును కాన బృహస్పతి చంద్రునీ శపింపలేదు, , తపస్వి, విష్ణుభక్తుడు, బ్రహ్మదేవుని పుత్రుడు, మహాజ్ఞానియగు అత్రిమహర్షికి పరస్త్రీ వ్యామోహము కలవాడు, ధూర్తుడైన ఇటువంటి చెడు పుత్రుడు కలిగెను. ఇది చాలా ఆశ్చర్యము.

బ్రహ్మదేవుని పుత్రులందరు. ధర్మపరాయణులు, విష్ణుభక్తులు అందరు బ్రాహ్మణులే. ఆతని మనుమలు దేవతలు, ద్విదాలు, రైత్యులని మూడు విధములుగా నున్నారు. సాత్విక గుణము కలవారు బ్రాహ్మణులు కాగా రజోగుణము కలవారు దేవతలు. తమోగుణ సంపన్నులు, రౌద్రులు, బలవంతులు, ఉద్ధులైనవారు దైత్యులు.

స్వధర్మ నిరతా ఏప్రా నారాయణ పరాయణాః

శైవా శాక్తాశ్చ తే దేవా దైత్యా పూజావివర్జితాః

ముముక్షవో విష్ణుభక్తా బ్రాహ్మణా దాస్యలప్పవః

ఐశ్వర్య లిప్పవో దేవాశ్చాసురాస్తామహస్తథా

బ్రాహ్మణాహం స్వధర్మశ్చ కృష్ణస్యార్చన మీప్సితం

నిష్కామాసాల వీర్గుణస్య పరస్య ప్రకృతేరపి

 యే బ్రాహ్మణా వైష్ణవాశ్చ స్వతంత్రాః పరమం పదం

యాంత్యన్యోపాసకోశాన్యై సార్థం చ ప్రాకృతే లయే

 వర్ణానాం బ్రాహ్మణాః శ్రేష్ఠాః సాధవో వైష్ణవా యది

 విష్ణుమంత్ర విహీనేభ్యో ద్విబేభ్యో శ్వపచో వరః

పరిపక్వ వీపక్వ వా వైష్ణవాః సాధవశ్చ తే

సతతం పాతి తాంశ్చైవ విష్ణుచక్రం సుదర్శనం

 యథావహ్నౌ శుష్కతృణం భస్మీభూతం భవేత్సదా

తథా పాపం వైష్ణవేషు కాష్ఠానీవ హుతాశనే

గురువక్రాద్విష్ణమంత్రో యస్య కర్ణే ప్రవేశ్యతి

తరీ వైష్ణవం మహాపూతం ప్రవదంతి మనీషిణః

పుంసాం శతం పితృణాంచ శతం మాతామహస్య చ

స్వసోదరాంశ్చ జననీముద్ధరం త్యేన వైష్ణవాః

గయాయాం పిండదావేసి పిండదా పిండ భోజవం

సముద్ధరంతి పుంపాం చ ర శతం గతం

 మంత్రగ్రహణమాత్రేణ జీవన్ముక్తో భవేన్నరః

యమస్తస్మాన్మహాలీతో వైనతేయాదివోరగః

పునంత్యేవ హి తీర్థానీ గంగాదీని చ భారతే

 కృష్ణమంత్రోపాసకార ప్పర్శమాత్రేణ వాక్పతే

పాపాని పాపీనాం తీర్థ యావంతి ప్రభవంతి చ

వశ్యంతి అని సర్వాణి వైష్ణవసుధ్ళమాత్రత

 కృష్టమంత్రోపాసకానాం రజసా పాదపద్మయోః

 సద్యోముక్త పాతకేభ్యో కృత్నా పూతావసుంధరా

 వాయుశ్చ పవనో వహ్నిః సూర్యః సర్వం పునాతి చ

ఏతే పూతా వైష్ణవానాం స్పర్శమాత్రేణ లీలయా

అహం బ్రహ్మా చ శేషశ్చ ధర్మః సాక్షీ చ కర్మణాం

ఏతే హృష్టాశ్చ వాంఛంతి వైష్ణవానాం సమాగమం

బ్రాహ్మణులు స్వధర్మనిరతులై శ్రీమహావిష్ణు పాదాబ్జములనెల్లప్పుడు సేవించుచుందురు. దేవతలు శిపుని, శక్తిని పూజింతురు. దైత్యులకు పూజయుండదు. విష్ణుభక్తులగు బ్రాహ్మణులు ముక్తిని గోరుచు శ్రీకృష్ణదాస్యమునెల్లప్పుడు ఆభిలషింతురు. దేవతలు ఐశ్వర్యమును కోరుదురు. అసురులు తొమసప్రవృత్తి కలవారు.

కోరికలేమియు లేని బ్రాహ్మణులయొక్క ధర్మము నిర్గుణుడు, ప్రకృతీకన్నను పరుడగు శ్రీకృష్ణుని అర్చించుట. వైష్ణవులగు బ్రాహ్మణులు స్వతంత్రముగా పరమపదమునకు పోవుదురు. కాని ఇతరదేవతలనుపాసించువారు. ప్రాకృతలయమున ఆ ఇతర దేవతలతో కలసి పరమపదమునకు పోవుదురు. చతుర్వర్ణములలో బ్రాహ్మణజాతి చాలా శ్రేష్ఠమయినది. వారు వైష్ణవులైనచో సాధుపురుషులగుదురు. నారాయణ మంత్రోపదేశము పొందని బ్రాహ్మణులకంటే చండాలుడు పరమశ్రేష్ఠుడు. వైష్ణవులు పరి పక్వతను పొందినను పొందకున్నను సాధుపు లేయగుచున్నారు. వైష్ణవుల నందరను సుదర్శన చక్రము అహర్నిశలు రక్షించుచుండును. అగ్నిలో పడిపోయిన ఎండు గడ్డిపోచ ఏవిధముగా క్షణములో భస్మమగునో అట్లే వైష్ణవులందు పాపము క్షణములో భస్మమైపోవును.

గురువుయొక్క ముఖతః విష్ణుమంత్రము ఎవరి చెవిలో ప్రవేశించునోఆతడే పరమ పవిత్రుడైన వైష్ణవుడని విద్వాంసులందురు. చెవులు తమ తండ్రివంకనున్న నూరు తరములవారిని తల్లివంశమునకు చెందిన నూరు తరములవారినీ, తన సోదరులను, తల్లిని ఉద్దరింతురు. గయలో పిండప్రదానము చేసినందువలన ఆ పిండమును భక్షించువాడు మాత్రము ముక్తుడు కాగా ఇపులు నూరుతరములవారిని సముద్ధరింతురు. నారాయణమంత్రమును గురుముఖతః పొందినంతమాత్రముననే అతడు జీవన్ముక్తుడగును. ఆ వైష్ణవుని చూచి యముడు గరుత్మంతుని చూచిన సర్పమువలే భయపడిపోవును. ఓ బృహస్పతీ! భారత భూభాగముననున్న గంగాది, పుణ్యతీర్ధములు మానవుల పవిత్రము చేయును. శ్రీకృష్ణమంత్రోపాసకులు తమ స్పర్శమాత్రమున జీవులను పవిత్రులుగా చేయుదురు. శ్రీకృష్ణమంత్రోపాసకులు భూమిపై తిరుగుచున్నందువలన వారి పాదపద్మములయొక్క ధూళివలన పాపాత్ములందరు విముక్తులగుదురు. భూమి పహితము పవిత్రమగుచున్నది.

వాయువు, అగ్ని, సూర్యుడు వీరందరు లోకమును పవిత్రముగా చేయుదురు. కానీ ఈ దేవతలు వైష్ణవులయొక్క స్పర్శమాత్రమున పవిత్రులైరి. వేను, బ్రహ్మదేవుడు, సర్వకర్మలకు సాక్షీభూతుడైన ధర్మదేవత మేమందరము వైష్ణవులతో కలిసియుండవలెనని సంతోషముగా కోరుకొందుము.

ఫలం కర్మానురూపేణ సర్వేషాంభారతే భవేత్

న భవేత్తదైష్ణవే చ సిద్దధాన్యే యథాంకురం

 హంతి తేషాం కర్మపూర్వం భక్తానాం భక్తవత్సలః

 కృపయా స్వపదం తేభ్యో దదాత్యేవ కృపానిధిః

తేజస్వినాం చ ప్రవరం వైష్ణవం భృగునందనం

స చంద్రో దుర్బలో భీతః శుక్రం చ శరణం యయౌ

సుదర్శనో బలిష్ఠం చ శుక్రం కేతుం న శక్తిమాన్

తథాపి చోద్ధరిష్యామి తారాం మంత్రేణ మద్గురోః

భజ సత్యం పరంబ్రహ్మ కృష్ణమాత్మానమీశ్వరం

సుప్రసన్నే భగవతి పత్నీం ప్రాప్స్యసి లీలయా

ఈ భారతదేశమున ఆందరకు వారువారు చేసికొన్న కర్మలననుసరించి ఫలితము లభించును. కాని వైష్ణవులకు కర్మఫలమంటదు. భక్తవత్సలుడైన శ్రీహరి తన భక్తులయొక్క పూర్వకర్మ ఫలమును నశింపజేయును. పైగా దయా సముద్రుడగు ఆ పరమాత్మ కృపతో తన స్థానమునే వారికిచ్చివేయును.

దుర్బలుడు, భయముచెందిన చంద్రుడు పరమవైష్ణవుడు ఆధిక తేజస్వీయగు శుక్రుని శరణుపొందెను. శక్తిమంతుడైన సుదర్శనచక్రము కూడ ఆ భృగునందనుని ఏమి చేయలేదు. ఐనను నా గురువగు శ్రీకృష్ణుని మంత్రప్రభావమువలన తారను ఉద్ధరించి నీకీయగలను. నీవు సత్యరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మను సేవింపుము. ఆ పరమాత్మ సంతోష పడినచో నీ భార్య నీకు తప్పక లభించును.

మంత్రం తస్య ప్రదాస్యామి భ్రాతః కల్పతరుం పరం

కోటిజన్మాఘ నిఘ్నం చ సర్వమంగళ కారణం

బ్రహ్మాది సంబపర్యంతం నశ్వరం జలబింబవత్

శరణం యాహి గోవిందం పరమాత్మాన మీశ్వరం

తావద్బవేచ్చా భోగేచ్చా స్త్రీసుఖేచ్చా నృణామిహ

యావద్గురు ముఖాంభోజాన్న ప్రాప్నోతి మసుం హరేః

సంప్రాప్య దుర్లభం మంత్రం పితృష్ణో హి భవేన్నరః

ఇంద్రత్వమమరత్వం చ నహి వాంఛంతి వైష్ణవాః

నవాంఛంతి మోక్షం చ దాస్యం భక్తిం వినా భహరేః

భక్తినిర్మథనం భక్తో మోక్షం నో వాంఛతిప్రభోః

జ్ఞానం మృత్యుంజయత్వం చ సర్వసిద్ధిం తదీప్సితం

వాక్సిద్ధిం చైవ ధాతృత్వం భక్తానాం నహి వాంఛితం

భక్తిం నీహాయ కృష్ణస్య విషయం యోహివాంఛతి

విషమత్తి సుధాం త్యక్త్యా వాంఛతో విష్ణుమాయయా

అహంబ్రహ్మా చ విష్ణుశ్చ ధర్మోజనంతశ్చ కశ్యపః

కపిలశ్చ కుమారశ్చ నరనారాయణావృషీ

స్వాయంభువో మనుశ్చైవ ప్రహ్లాదశ్చ పరాశరః

భృగుః శుక్రశ్చ దుర్వాసా వసిష్థః క్రతురంగిరాః

బలిశ్చ వాలఖిల్యశ్చ వరుణశ్చ హుతాశనః

వాయుః సూర్యశ్చ గరుడో దక్షో గణపతిః స్వయం

 ఏతే పరా భక్తవరా కృష్ణస్య పరమాత్మనః

యే చ తస్య కళాశ్రేష్థాః తే తద్భక్తి పరాయణాః

ఇత్యుక్త్యా శంకరస్తస్మై దదౌ కల్పతరుం మనుం

ఓ సోదరుడా! నీకు కల్పతరువువంటి శ్రీకృష్ణమంత్రమును ఉపదేశింతును. ఇది కోటి జన్మలలో పొందిన పాపములనన్నిటిని తోలగించును. సమస్త ముంగళములను కలిగించును.

బ్రహ్మమొదలు స్తంబ పర్యంతమున్న ఈ చరాచర సృష్టి జలమునందు కన్పించు నీడవలె నశించిపోవును. అందువలన నీత్యుడగు శ్రీకృష్ణ పరమాత్మను నీవు సేవింపుము.

గురువుయొక్క ముఖమునుండి శ్రీకృష్ణమంత్రోపదేశము పొందనంతవరకు సంసారమున, భోగములపై, స్త్రీసుఖమున ఇచ్ఛ కలుగును. దుర్లభమైన శ్రీకృష్ణమంత్రము లభించినంతమాత్రమున మానవునకు కోరికలన్నియు నశించును. వైష్ణవులు ఇంద్రత్వమును, దేవత్వమును, మోక్షమును కోరుకొనరు. వారెల్లప్పుడు శ్రీహరి దాస్యమును, శ్రీహరి భక్తిని మాత్రము కోరుకొనెదరు, వైష్ణవులు శ్రీహరి భక్తిని తొలగించు మోక్షమును జ్ఞానమును, మృత్యుంజయత్వమును, సమస్త సిద్దులను, తన ఇతర కోరికలను, వాక్సిద్ధిని, బ్రహ్మపదవిని ఎట్టి స్థితిలోను కోరుకొనరు. శ్రీకృష్ణభక్తికాక ఇతర విషయములను వైష్ణవుడు కోరుకొనినచో అమృతమును వదలి విషమును భుజించువాడగును,

నేను, బ్రహ్మదేవుడు, విష్ణువు, ధర్ముడు. అనంతుడు, కశ్యపుడు, కపిలుడు, కుమారస్వామి, నరనారాయణమునులు, స్వాయంభువమనువు. ప్రహ్లాదుడు, పరాశరుడు, భృగువు, శుక్రుడు, దుర్వాసుడు, వసిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, బలి, వాలఖిల్యులు, వరుణుడు, అగ్నిదేవుడు, వాయువు, సూర్యుడు, గరుడుడు, దక్షుడు గణపతి వీరందరు శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తులు. ఆ శ్రీకృష్ణదేవుని భక్తిగలవారందరు అతని అంశరూపులే.

అని చెప్పుచు బృహస్పతికి మహదేవుడు శ్రీకృష్టమంత్రమును ఉపదేశించెను.

లక్ష్మీమాయా కామబీజం జేంతం కృష్ణపదం మునే

పరం పూజావిధానం చ స్తోత్రం చ కవచం మునే

 తత్పురశ్చరణం ధ్యానం శుద్ద మందాకినీ తటే

గురుః సంప్రాప్య తం మంత్రం శంకరాచ్చ జగద్గురోః

విషణ్ణో హి భవాబ్దౌ చ బభూవ తమువాచ హ

లక్ష్మీమాయా కానుబీజాక్షరములు చతుర్థివిభక్త్యంతమైన కృష్ణుపదము కలది ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయనమః అను శ్రీకృష్ణమంత్రము. ఆ మంత్రముతోపాటు శ్రీకృష్ణ పూజావిధానమును, స్తోత్రమును, కవచమును, తత్పురశ్చరణమును, ధ్యానమును శంకరుడు గంగాతీరమున బృహస్పతికి, ఉపదేశించెను. సంసార సాగరమున కొట్టుమిట్టాడుచున్న బృహస్పతి శంకరునితో ఇట్లనెను.

ఆజ్ఞాం కురు జగన్నాథ యామి తప్తుం హరేస్తవః

తారా తిష్ఠతు తత్రైవ న తయా మే ప్రయోజనం

పశ్యామీ విషతుల్యం చ సర్వం నశ్వర మీశ్వర

 శ్రీకృష్ణం శరణం యామి సత్యం నిత్యం చ నిర్గుణం

ఓ మహాదేవ! నన్ను ఆజ్ఞాపించినచో శ్రీహరి తపస్సుచేసికొనుటకు పోవుదును. తార చంద్రుని దగ్గరనే ఉండనిమ్ము, ఆమెవలన నాకెట్టి ప్రయోజనము లేదు. సమస్తము నాకు విషముతో సమానముగా కన్పించుచున్నది. ఇది అంతయు అశాశ్వతమైనది. అందువలన నిత్యుడు, సత్యస్వరూపుడు, నిర్గుణుడగు శ్రీకృష్ణపరమాత్మను శరణు వేడెదను అని బృహస్పతి అనెను.

శ్రీమహాదేవ ఉవాచ-  మహాదేవుడిట్లనెను-

పరగ్రస్తాం స్త్రీయం త్యక్యా న ప్రశస్యం తపోమునే

సంభావితస్య దుశ్చర్చా మరణాదతీరుచ్య తే

పురోగచ్చ మహాభాగ తమేతం నర్మదాతటం

యత్రబ్రహ్మాదయో దేవాస్తత్రాహం యామీ సత్వరం

బృహస్పతీ! తన భార్య ఇతరుల ఆధీనమునందుండగా తపస్సు చేయుట మంచిదికాదు. మంచివానికి కలిగిన కష్టము మరణముకంటె గొప్పనిది. అందువలన నీవు బ్రహ్మాది దేవతలున్న నర్మదా నదీ తీరమునకు పొమ్ము, నేను కూడ నీవెంటనే అచ్చటికి వచ్చెదనని శంకరుడను.

శివస్య వచనం శ్రుత్వా యయా సురగురుః స్వయం

ఆయయౌ చ మహాభాగః శంకరో నర్మదాతటం

సగణం శంకరం దృష్ట్యా ప్రసన్నవదనేక్షణం

ప్రణీముర్దేవతాః స పరా మనవో మునయస్తథా

ననామ శంభుః శిరసా విష్ణుం చ కమలోద్భవం

దదతుస్తా మహేశాయ ప్రేమ్ణాఽలింగనమాసనం

ఏతస్మిన్నంతరే తత్ర చాగమచ్చ బృహస్పతిః

ప్రణనామ మహాదేవం విష్ణుం చ కమలోద్భవం

శివునియొక్క మాటలు విని వెంటనే బృహస్పతి నర్మదానదీ తీరమునకు బయలుదేరెను. శంకరుడు కూడ వెంటనే అచ్చటకు వచ్చెను. శంకరుడు తన పరివారముతో ఆక్కడకు రాగా నర్మదానదీ తీరముననున్న దేవతలు, మునులు. మనువులందరు ఆ పరమశివునికి నమస్కరించిరి. శంకరుడు కూడ బ్రహ్మ, విష్ణువులకు నమస్కారము చేసెను. బ్రహ్మావిష్ణువు లా శివుని ప్రేమతో ఆలింగనము చేసికొనిరి.

ఆ సమయమున అక్కడకు వచ్చిన బృహస్పతి బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులకు నమస్కరించెను.

సూర్యం ధర్మమనంతం చ నరం మాం చ మునీశ్వరాన్

స్వగురుం పితరం భక్త్యా చావసత్తత్ర సంసది

సంచింత్య మనసా యుక్తిమూచే తత్ర చ సంసది

స్వయం విష్ణుశ్చ భగవాన్ బ్రహ్మాణం చంద్రశేఖరం

బృహస్పతి ఆక్కడకు వచ్చి సూర్యుని, ధర్మదేవతను, అనంతుని, నరుని, నన్ను (నారాయణుని), మునీశ్వరులను, తన గురువును, తండ్రిని భక్తితో నమస్కరించి ఆ సభలో కూర్చుండెను. అప్పుడు విష్ణుమూర్తి బృహస్పతి గురించి ఒక ఆలోచన చేసి బ్రహ్మదేవుడు చంద్రశేఖరులతో ఇట్లు వివరించెను.

విష్ణురువాచ- విష్ణుమూర్తి ఇట్లు పలికెను-

యువాం చ మునయశ్చైవ సముద్ర పులినం ద్రుతం

శుక్రం కంచిచ్చ మధ్యస్థం ప్రస్థాపయితుమర్హథ

విగ్రహేణైన విషమం భవిష్యతి నసంశయః

మధాశిషా సురగురుస్తారాం ప్రాప్య్సతి నిశ్చితం

 సురైః స్తుతశ్చ సంతుష్టః శుక్రాచార్యో భవిష్యతి

సురైః శుక్రోహి వ జీతః కృష్ణచక్రేణ రక్షితః

 యువాభ్యాం ప్రార్థ్యమానోహర యువయోః స్తవనేన చ

శ్వేతద్వీపాదాగతోస్మి పరీతుష్టః స్తవేన చ

 శుక్రాశ్రమమనీపర్ణం సర్వగచ్ఛంతు దేవతా

రీపుర్బలిష్ఠః స్తోత్రేణ వశీభూత ఇతిశ్రుతిః

 ఇత్యుక్త్యా జగతీం నాథస్తత్రైవాంతరధీయత

స్తుతోబ్రహ్మాదిభిర్దేవైః ప్రణతైః పరిపూజితః

మీరిద్దరు మునులు అందరు కలిసి సముద్రతీరమునకుపొండు. అచ్చట శుక్రుని దగ్గరకు ఒక దూతను పంపుడు. యుద్ధమువలన చాలా కష్టములు ఏర్పడును. అందు సంశయము లేదు.

ఆందువలన నా ఆశీర్వచనము వలన బృహస్పతి తనభార్యను తిరిగిపొందును. దేవతలు స్తుతించినచో శుక్రాచార్యులు సంతోషపడుమ. అందువలన ఆసీసర్లమను శుక్రుని ఆశ్రమమునకు మీరందరు కలిసిపోయి అతనిని స్తుతింపుడు. శత్రువు ఎంతటి బలవంతుడైనను పొగిడినచో వశమైపోవునని వేదము చెప్పుచున్నది. శుక్రాచార్యుడు శ్రీకృష్ణుని చక్రముచే రక్షింపబడుచున్నందువలన ఆడవిని దేవతలు జయింపలేరు. అందువలన అతనిని పొగడి పనివి సానుకూలము చేయుటయే మంచిది.

మీరు నన్ను ప్రార్థించినందువలన సంతోషపడి తద్వీపము మండి ఇచ్చటకు వచ్చితిని అని శ్రీమన్నారాయణుడు ఆచ్చటనే అదృశ్యమయ్యెను.

గతే చ జగతాం నాథే శ్వేతద్వీపం చ నారద

 చింతితాశ్చ సురాః సర్వే విషణ్ణమనసస్తథా

శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపమునకు పోగానే దేవతలందరు చాలా బాధపడిరి.

మునీన్దేవాంశ్చ సంబోధ్య బ్రహ్మా వై తత్రసంపదీ

ఉవాచ నీతిసారం తత్సమ్మతం శంకరస్య సః

మునులు దేవతలున్న ఆ సభలో బ్రహ్మదేవుడు వారిని సంబోధించి శంకరునకు సమ్మతమైనది, వీటిపారమగు మాటను ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

 మమ శంభోశ్చ ధర్మస్య విష్ణోర్వా సర్వసాక్షిణః

అస్మాకం చ సమం స్నేహో దైత్యే దేవే చ పుత్రకాః

దైత్యానాంచ గురుం శుక్రం ప్రపన్నశ్చ నిశాకరః

 ననాజితశ్చ సురైః శుక్రః పూజితో దిలీనందనైః

తారాహేతోరహం యామి శుక్రస్య భవనం సురాః

సర్వే సముద్రపులినం యాంతు విష్ణోర్నిదేశతః

ఇత్యుక్త్యా జగతాం ధాతా చాగమతో శుక్రసన్నీధిం

ప్రయయుర్దేవతా విప్రాః సముద్రపులినం మునే

ఓ దేవతలారా! నాకు శంకరునకు, ధర్మదేవతకు సర్వసాక్షియగు విష్ణువునకు కూడ దైత్యుల పై దేవతల పై సమానమైన ప్రేమకలదు. ఇప్పుడు చంద్రుడు దైత్యులకు గురువగు శుక్రుని శరణుజొచ్చెను. శుక్రునీ దేవతలు జయించలేదు. అందువలన అతడు మీమాట వినడు. పైగా అతనిని మీ శత్రువులగు దైత్యులు పూజించుచున్నారు,

అందువలన తారకొరకు నేను శుక్రుని ఇంటికి వెళ్ళేదను. మీరందరు సముద్రతీరముననే ఉండుడని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి తాను శుక్రుని దగ్గరకు పోయెను. బ్రహ్మదేవుని మాటవనుసరించి దేవతలందరు సముద్రతీరమువకు పోయిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే శ్రీకృష్ణాపదీష్టతారోద్దరణోపాయజ్ఞానం నామ షష్టితమోధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన శ్రీకృష్ణుడుపదేశించిన తారాదేవి ఉద్దరణోపాయజ్ఞానమను అరవయవ అధ్యాయము సమాప్తము.