నారద ఉవాచ- నారదుడిట్లనెను-
లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ లోకపావనీ ।
ఏతా నారాయణస్యైవ చతస్రశ్చ ప్రియా ఇతి ॥
గంగా జగామ వైకుంఠమిదమేవ మయా శ్రుతం ।
కథం సా తస్య పత్నీ చ బభూవ బ్రూహి కేశవ ॥
లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి ఈ నలుగురు శ్రీకృష్ణునకు ప్రియమైనవారు. వారిలో గంగ వైకుంఠమునకు వెళ్ళినట్లు నేను వింటిని. ఐతే ఆ గంగ నారాయణునకు ప్రియురాలైన విషయమును నాకు వివరించుడు.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-
గంగా జగామ వైకుంఠం తత్పశ్చాచ్ఛ గతో విధిః ।
గత్వోవాచ తయా సార్థం ప్రణమ్య జగదీశ్వరం ॥
గంగ వైకుంఠమునకు వెళ్ళగా బ్రహ్మదేవుడు తరువాత వైకుంఠలోకమునకు పోయెను. వారు అక్కడకు వెళ్ళిన తరువాత బ్రహ్మ శ్రీమన్నారాయణుని నమస్కరించి ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
రాధాకృష్ణాంగ సంభూతా యా దేవీ ద్రవరూపిణీ ।
తదధిష్ఠాతృ దేవీయం రూపేణాప్రతిమా భువి ॥
నవయౌవన సంపన్నా సుశీలా సుందరీ వరా ।
శుద్ధ సత్యస్వరూపా చ క్రోధాఽహంకార వర్జితా ॥
యదంగ సంభవా నాఽన్యం వృణోతీయం చ తం వినా ।
తత్రాపి మానినీ రాధా మహాతేజస్వినీవరా ॥
సముద్యతాం పాతుమియం భీతేయం బుద్దిపూర్వకం ।
వివేశ చరణాంభోజే కృష్ణస్య పరమాత్మనః ॥
సర్వం విశుష్కం గోలోకం దృష్ట్యాహమగమం తదా ।
గోలోకం యత్రకృష్ణశ్చ సర్వవృత్తాంత లబ్దయే ॥
సర్వాంతరాత్మా సర్వం నో జ్ఞాత్వాఽభిప్రాయమేవచ ।
బహిశ్చకార గంగాంచ పాదాంగుష్ఠ నఖాగ్రతః ॥
దత్వాఽస్యై రాధికామంత్రం పూరయిత్వా చ గోళకం ।
సంప్రణమ్య చ రాధేశం గృహీత్వాఽత్రాగమం విభో ॥
ఈగంగ రాధా కృష్ణుల యొక్క అంగములనుండి ద్రవరూపముతో ఆవిర్భవించినది. జలరూపిణియైన గంగకు ఆధిష్ఠాన దేవతయగు ఈమె నవయౌవనముకలది. సుందరి, శుద్ధ సత్వస్వరూప, క్రోధాహంకారములు లేనిది. కృష్ణుని యొక్క శరీరమునుండి పుట్టినందువలన అతనిని తప్ప ఇంకొకరిని వివాహము చేసికొనుటకు ఇష్టపడలేదు. తన భర్తను వివాహము చేసికొనదలచిన గంగపై కోపముతో రాధాదేవి ఆ జలమునంతయు త్రాగుటకు మొదలిడెను. అందువలన గంగ భయపడి శ్రీకృష్ణపరమాత్మ పాదములను శరణువేడినది. శ్రీకృష్ణుని పాదములయందు లీనమై గంగయుండుట వలన ప్రపంచమంతయు శుష్కించి పోయినది. అందువలన నేను విషయమును తెలిసికొనవలెనని గోలోకమునకు వెళ్ళితిని. సర్వాంతరాత్మయగు శ్రీకృష్ణుడు మా అభిప్రాయమును గుర్తించి తన పాదాంగుష్ఠము నుండి ఆమెను బయటకు పంపెను. అట్లే ఆమెకు రాధికామంత్రమును ఉపదేశించగా గంగ ప్రపంచమందంతట నిండిపోయినది. అందువలన నేను పరమాత్మకు నమస్కరించి ఇక్కడకు తిరిగివచ్చితిని.
గాంధర్వేణ వివాహేన గృహాణేమాం సురేశ్వరీం ।
సురేశ్వరస్త్వం రసికో రసికాం రసభావనః ॥
పుంరత్నం పుంసుదేవేషు స్త్రీరత్నం స్త్రీష్వియం సతీ ।
విదగ్ధయా విదగ్ధేన సంగమో గుణవాన్భవేత్ ॥
ఉపస్థితాం చ యః కన్యాం న గృహ్ణాతి మదనేనచ ।
తం విహాయ మహాలక్ష్మీ రుష్టా యాతి న సంశయః ॥
యో భవేత్సండితః సోఽపి ప్రకృతిం నావమన్యతే ।
సర్వే ప్రాకృతికాః పుంసః కామిన్యః ప్రకృతేః కళాః ॥
త్వమేవ భగవానాద్యో నిర్గుణః ప్రకృతేః పరమః।
ఆర్ధాంగో ద్విభుజః కృష్ణోఽప్యర్ధాంగేన చతుర్భుజః ॥
కృష్ణవామాంగసంభూతా పరమారాధిక పురా ।
దక్షిణాంగాత్ స్వయం సాచ వామాంగాత్కమాలా యథా ॥
తేన త్వాం సా వృణోత్యేవ యతస్త్వద్దేహా సంభవా ।
స్త్రీ పుంసౌ పై తథైకాంగౌ యథా ప్రకృతి పూరుషౌ ॥
ఇత్యేవముక్త్వా ధాతా చ తాం సమర్ప్య జగామ సః ।
గాంధర్వేణ వివాహేన తాo జగ్రాహ హరిః స్వయం ॥
ఈ గంగను గాంధర్వరీతిలో వివాహము చేసికొమ్ము. మీరిద్దరు అన్యోన్యము తగినవారు. కోరికతో వచ్చిన కన్యను వివాహము చేసికొననివానిని మహాలక్ష్మి వదలిపోవును. పండితుడైనను ప్రకృతిని అవమానించవద్దు. ఈ జగత్తులోని పురుషులందరు ప్రాకృతికులు స్త్రీలు ప్రకృతి యొక్క ఆంశసంభూతలు.
నీవు ఆద్యుడవైన పరమాత్మవు. అర్ధాంగుడైన శ్రీ కృష్ణుడు ద్విభుజుడు కాగా అతనికి అర్ధాంగభూతుడవైన నీవు చతుర్భుజుడవైతివి.
రాధ శ్రీకృష్ణుని ఎడమ భాగమునుండి పుట్టగా గంగ కుడి పార్శ్వమునుండి పుట్టినది. అందువలన నీ దేహమునుండి పుట్టిన గంగ నిన్ను వివాహము చేసికొనదలచినది. ప్రకృతి పురుషులవలె స్త్రీ పురుషులిద్దరు ఒకే శరీరము కలవారు.
ఈ విధముగా బ్రహ్మదేవుడు నారాయణునితో పలికి గంగను అతనికి సమర్పించెను. అప్పుడు శ్రీహరి గంగాదేవిని గాంధర్వ వివాహమున స్వీకరించెను.
శయ్యాం రతికరీం కృత్వా పుష్పచందన చర్చితాం ।
రేమే రమాపతిస్తత్ర గంగయా సహితో ముదా ॥
గాం పృథ్వీం చ గతా యస్మాత్ స్వస్థానం పునరాగతా ।
నిర్గతా విష్ణుపాదాచ్చ గంగా విష్ణుపదీ స్మృతా ॥
మూర్ఛాం సంప్రాప సా దేవీ నవసంగమ మాత్రతః ।
రసికా సుఖసంభోగా ద్రసికేశ్వర సంయుతా ॥
శ్రీహరి గంగతో సుఖముగా నుండెను గాం, గతా అనగా భూమిపైకి పోయినది కావున గంగయైనది. అట్లే విష్ణుపాదమునుండి బయల్వెడలినందువలన విష్ణుపది ఐనది.
తద్దృష్ట్వా దుఃఖితా వాణీ సాపత్న్యేర్ష్యా వివర్జితా ।
నిత్యమీర్ష్యతి తాం వాణీ న చ గంగా సరస్వతీం ॥
గంగయా సహితస్యైవ తిస్రోభార్యా రమాపతేః ।
సార్థం తులస్యా పశ్చాచ్చ చతస్రోహ్యభవన్మునే ॥
శ్రీహరి గంగతో సుఖముగా నుండుటను చూచి సవతియొక్క అసూయతో సరస్వతి దుఃఖించినది. ఆట్లే ఆమెను ఎల్లప్పుడు ఈర్ష్యాభావముతో చూచినది. కాని గంగ సరస్వతిపై ఈర్ష్యపడలేదు.
శ్రీహరికి గంగతో కలిపి ముగ్గురు భార్యలు. తరువాత వచ్చిన తులసితో అతనికి భార్యలు నలుగురు.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే గంగోపాఖ్యానం నామ ద్వాదశోఽధ్యాయః ॥
శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదమున తెల్పబడిన గంగోపాఖ్యానమను పన్నెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 12 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Born on earth as the mighty son of King Dambha, Shankhachūḍa possessed great inherent nobility and a deep desire for spiritual power. Retiring to the sacred forest of Pushkara, he performed rigorous penance for thousands of years, meditating upon Lord Brahmā with unwavering focus and strict vows of abstinence. Pleased by his intense austerity, Lord Brahmā appeared before the Asura prince and granted him an invincible divine armor known as the Śrī Kṛshṇa Kavacha, along with the boon that no deity or weapon in the three worlds could slay him as long as his divine armor remained intact and his wife maintained her absolute marital chastity.