నారద ఉవాచ- నారదుడిట్లు నారాయణునితో పల్కెను-
తులస్యుపాఖ్యానమిదం శ్రుతమీశ మనోహరం ।
యత్తు సావిత్ర్యుపాఖ్యానం తన్మేవ్యాఖ్యాతు మర్హసి॥
పురా యేన సముద్భూతా సాశ్రుతా చ శ్రుతిప్రసూః ।
కేన వా పూజితాదేవీ ప్రథమే కైశ్చ వా పరే ॥
ఓ నారాయణుడా! అందమైన తులస్యుపాఖ్యానమును ఇంతవరకు వింటిని. ఇక నీవు సావిత్ర్యుపాఖ్యానమును వివరించీ చెప్పుము. వేదములకు తల్లియగు ఆ సావిత్రి ఎవరివలన జన్మించినది. ఆమెను తొలుత ఎవరు పూజించిరి! ఆ తరువాత ఎవరు పూజించిరో నాకు విశదీకరింపుడు.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు చెప్పెను-
బ్రహ్మణా వేదజననీ పూజితా ప్రథమే మునే ।
ద్వితీయే చ దేవగణైః తత్పశ్చాత్ విదుషాంగణైః ॥
తథా చాశ్వపతిః పూర్వం పూజయామాస భారతే ।
తత్పశ్చాత్ పూజయామాసుః: వర్ణాశ్చత్వార ఏవ చ ॥
వేదములకు మాతయైన సావిత్రీదేవిని తొలుత బ్రహ్మదేవుడు పూజించెను. తరువాత దేవతలు, ఆ తరువాత విద్వాంసులు పూజించిరి. భారత దేశమున తొలుత అశ్వపతి యనురాజు ఆమెను పూజించగా తర్వాత జనులందరు ఆమెను పూజింపసాగిరి.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
కోవా సోఽశ్వపతి: బ్రహ్మన్ కేన వా తేన పూజితా ।
సర్వ పూజ్యా చ సావిత్రీ తన్మే వ్యాఖ్యాతు మర్హసి॥
ఓ నారాయణుడా! అశ్వపతి ఎవరు? అతడెందుకు సావిత్రీదేవిని పూజించెను. ఆమె అందరిచే పూజులనెట్లందుకొన్నది ఈవిషయములనన్నిటినీ నాకు వివరించి చెప్పుడు అని పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-
మద్రదేశే మహారాజో బభూవాశ్వపతిర్మునే ।
వైరీణాం బలహర్తా చ మిత్రాణాం దుఃఖనాశనః ॥
ఆసేత్తస్య మహారాజ్జీ మహిషీ ధర్మచారిణీ ।
మాలతీతి చ సా ఖ్యాతా యథా లక్ష్మీర్గదాభృతః ॥
సా చ రాజ్ఞీ మహాసాధ్వీ వసిష్ఠస్యోపదేశతః ।
చకొరారాధనం భక్త్యా సావిత్ర్య శైవ నారద ॥
ప్రత్యాదేశం న సా ప్రాప మహిషీ న దదర్శతాం ।
గృహాం జగామ సా దు:ఖాల్ హృదయేన విదూయణా ॥
రాజా తాం దుఃఖాతం దృష్ట్యా బోధయిత్వా నయనపై ।
సావిత్ర్యాస్తపసే భక్త్యా జగామ పుష్కరం తదా ॥
తపశ్చచార తత్రస సంయతః శతవత్సరం ।
న దదర్శచ సావిత్రం ప్రత్యాదేశో బభూవ హ ॥
శుకొవాకాశ వాణీం చ నృపేంద్రశరీరిణీం ।
గాయత్రీ దశలక్షం చ దీపం కుర్వితీ నారద ॥
ఏతప్మిన్నంత తత్రైప్రజగామ పరాశరః ।
ప్రణనామ నృపస్తం చ మునిర్నృపమువాచ హ ॥
ఓనారద! మద్రదేశమున అశకతీయను రాజుండేవాడు. అతడు మహా బలవంతుడు. శత్రు సైన్యమును నాశనము చేసెడివాడు. మిత్రులకు సంతోషము కలుగజేసెడివాడు. అతని ధర్మచారిణి పేరు మాలతి. ఆమె వసిష్ఠ మహర్షి ఉపదేశముననుసరించి సావిత్రీ దేవి నారాధించెను.
కాని మాలతీదేవికి సావిత్రీదేవత సాక్షాత్కారముగాని, ఆమె అనుగ్రహము కాని లభించలేదు. అందువలన అపట్టపురాణి బాధాపంతప్తహృదయముతో ఇంటికి తిరిగి వెళ్ళెను.
అశ్వపతి తన భార్య పడుచున్న దుఃఖమును చూచి ఆమెను ఓదార్చి తాను సావిత్రీదేవి తపస్సును చేయుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళాను. అచ్చట ఆ మహారాజు యమనియమములతో వంద సంవత్సరములు తపస్సు చేయగా సావిత్రి దేవి . ప్రత్యక్షము కాకపోయినను ఆమె అనుగ్రహమును మాత్రము పొందెను. వదిలక్షల గాయత్రీ మంత్ర జపమును అనుష్ఠించమని ఆకాశవాణి అతనితో పలికినది.
ఆ సమయమున పరాశరముని అచ్చటికి రాగా అశ్వపతి మహారాజు ఆ మునికి నమస్కరించగా అతడు ఆరాజుతో నిట్లనెను.
పరశర ఉవాచ- పరాశరమహర్షి ఇట్లనెను-
సకృజ్ఞశ్చ గాయత్ర్యాః పాపం దీనకృతం హరేత్ ।
దశధా ప్రజపాన్నౄణాం దివారాత్ర్యఘమేవచ ॥
శతధా చ జపాచ్చైవం పాపం మాసార్జితం పరం ।
సహస్రదా జపాచ్చైవం కల్మషం వత్సరార్జితం॥
లక్షం జన్మకృతం పాపం దశలక్షం త్రిజన్మనః ।
సర్వజన్మకృతం పాపం శతలక్షం వినశ్యతి ॥
గాయత్రీ జపమును ఒక మారు చేసినచో ఆ దీనము (పగలు) చేసిన పాపము నశించును. పదిమార్లు జపించినచో ఆ దీనము (రాత్రింబగళ్లు చేసిన పాపము తొలగిపోవును. వంద మార్లు గాయత్రీ జపము చేసిన ఆ నేలలో చేసికొన్న పాపము నశించిపోవును. వేయిమార్లు జపము చేసినచో ఆ సంవత్సరములో చేసికొన్న పాపమంతయు నశించును. లక్షసార్లు జపము చేసిన ఆ జన్మలో చేసిన పాపము హరించును. పదిలక్షల జపము మూడు లక్మలలో చేసికొన్న పాపములను తొలగించును. నూరు లక్షల గాయత్రి జపము చేసికోన్నవానికి అతడు ఆన్ని జన్మలలో చేసికొన్న పాపములన్ని నశించును.
కరోతి ముక్తిం విప్రాణాం జపో దశగుణస్తథా ।
కరం నర్సఫణాకారం కృత్వాతు ఊర్ధ్వముద్రితం ॥
అనమ్ర మూర్థ మచలం ప్రజపేత్ ప్రాణ్ముఖో ద్విజః ।
అనామికా మధ్య దేశాదధో వామక్రమేణ చ ॥
తర్జని మూలపర్యంతం జపస్యైష క్రమ: కరే ।
శ్వేత పంకజ బీజానాధ స్ఫటికానాం చ సంస్కృతాం ॥
కృత్వా వా మౌలికాం రాజన్ జపేత్తీర్థే సురాలయే ।
సంస్థావ్య మాలామశ్వత్ధ పత్ర సప్తసుప సంయతః ॥
కృత్వా గోరోచనాక్షాం చ గాయత్రీం స్నపయేత్సుధిః ।
గాయత్రీ శతకం తస్యా జపేచ్చ విధిపూర్వకం ॥
అథవా పంచగవ్యేన స్నాతా మాలా చ సంస్కృతా ।
అథ గంగోదకేనైవ స్నాతా వాతి సుసంస్కృతా ॥
ఏవం క్రమేణ రాజర్షే దశలక్షం జపం కురు ।
సాక్షత్ ద్రక్ష్యసి సావిత్రీం త్రిజన్మపాతక క్షయాత్ ॥
నిత్యం నిత్యం త్రిసంధ్యం చ కరిష్యసి దినే దినే ।
మధ్యాహ్నే చాపి సాయాహ్నే ప్రాతరేవ శుచిః సదా॥
సంధ్యాహీనోఽ శుచిర్నిత్యం అనర్హః సర్వ కర్మసు ।
యదహ్నే కురుతే కర్మ న తస్య ఫల భాగ్భవేత్ ॥
నోపతిస్థతి యః పూర్వాం నోపాస్తే యశ్చ పశ్చిమాం ।
స శూద్ర వద్బహిష్కార్యః సర్వస్మాత్ ద్విబకర్మణః ॥
యావజ్జీవనపర్యంతం యస్త్రిసంధ్యాం కరోతి చ ।
పచ సూర్యసమో ఏప్ర: తేజసా తపసా సదా ॥
విప్రుడు గాయత్రీ జపమును చేసినచో ద్విజాతులగు క్షత్రియ వైశ్యులకంటే పదిరెట్లు ఎక్కువ ఫలితమును పొందును. చేతిని పాము పడగవలె చేసి, ఊర్దముద్రను వేసి, తూర్పు దిక్కు ముఖము చేసి, తలవంచుకొని స్థిరముగా నుండి జపము చేయవలెను. జపము చేయునపుడు కుడిచేతి ఉంగరపు వేలు మధ్య కణుపుమండి క్రిందికి వెళ్ళి ఎడమవైపు తిరిగి పైకి వెళ్ళి చుట్టు తిరుగుచు చూపుడువేలు క్రింది కణుపు వరకు రావలెను. ఇది జపము చేయువిధానము. లేనిచో తెల్లకలువబీజముల యొక్క మాలతోనైనా స్పటికమాలతోనైన నదీతీరమున లేక దేవాలయమున జపము చేయవలెను. ఆ జపమాలను రావి ఆకులపై నుంచి గోరోచనముతో ఆర్ధి గాయత్రీ మంత్రముచే ఆమాలను ఆభిషేకింపవలెను. తరువాత విధి విధానముగా శతగాయత్రీ మంత్ర జపమును చేయవలెను. జపమాలను పంచగవ్యముతోనైనా గంగోదకముతోనైనా ఆభిషేకింపవలెను,
ఇట్టి జపమాలతో నీవు దశలక్షగాయత్రి జపమును చేసినచో మూడు జన్మల పాపములన్ని వశీంచగా పావిత్రి దేవి దర్శనము నీకు లభించును. ప్రతిదినము మధ్యాహ్నము, సాయంకాలము, ఉదయము అను మూడు సంధ్యలయందు శుచియై గాయత్రీ జపమును చేయుము.
ప్రతిదినము సంధ్య చేయనివాడు అపవిత్రుడగును. అన్ని పుణ్యకర్మములు చేయుటకు అనర్హుడగును. ఆ దినము చేసిన పుణ్యఫలమును పొందలేడు. ప్రాతస్సంధ్యను సాయం సంధ్యను చేయనిచో అతడు బ్రాహ్మణులు చేయు సమస్త కర్మలనుండి
బహిష్కరించ తగినవాడగును. తన జీవిత కాలము త్రిసంధ్యలలో గాయత్రీ జపము చేయువాడు తేజస్సున, తపస్పున సూర్యునితో సమానుడగును.
తత్పాదపద్మరజసా సద్యః పూతా వసుంధరా ।
జీవమ్మక్తః సతేజస్వీ సంధ్యాపూతో హియో ద్విజః ॥
తీర్థాని చ పవిత్రాణి తస్య స్పర్శన మాత్రతః ।
తతః పాపాని యాంత్యేవ వైనతేయాదివోరగాః ॥
న గృహ్ణంతి సురాః పూజాం పితర: పిండతర్పణం ।
స్వేచ్చయా చ ద్వీజాతేశ్చ త్రిసంధ్యారహితస్య చ ॥
విష్ణుమంత్ర విహీనశ్చ త్రిసంధ్యారహితో ద్విజః ।
ఏకాదశీ విహీనశ్చ విషహీనో యథోరగః ॥
హరేరనైవేద్యభోజీ ధావకో వృషవాహకః ।
శూద్రాన్నభోజీ విప్రశ్చ విషహీనో యధోరగః ॥
శవదహీ చ శూద్రాణాం యో విప్రో వృషలీపతిః ।
శూద్రాణాం సూపకారశ్చ విషహీనో యథోరగః ॥
శూద్రాణాం చ ప్రతిగ్రాహి శూద్రయాజీ చ యథోద్విజః ।
ఆసిజీవి మషీజీపీ విషహీనో యథోరగః ॥
యో విప్రోఽవీరాన్నభోజీ ఋతుస్నాతాన్న భోజకః ।
భగజీవి వార్ధుషికో విషహీనో యధోరగః ॥
యః కన్యావిక్రయీ విప్రో యోహరేర్నామవిక్రయీ ।
యో విద్యా విక్రయీ భూప విషహీనో యధోరగః ॥
సూర్యోదయే చ ద్విర్భోజీ మత్స్యభోజీ చ యోద్విజః ।
శిలాపూజాదరహితో విషహీనో యథోరగః ॥
మూడు సంధ్యలలో సంధ్యావందనమాచరించిన ద్విజుని పాదధూళిచే ఈభూమి పవిత్రమగుచున్నది. సంధ్యావందనమువలన పవిత్రు డగు నా ద్విజుడు తేజస్వి, జీవన్ముక్తుడు కూడ అగుచున్నాడు. అతని స్పర్శ తగులగనే పాపములన్నియు పటాపంచలగును.
త్రిసంధ్యలలో సంధ్యావందనము చేయని ద్విజాలు చేసిన పూజను దేవతలు పరిగ్రహించరు, అట్లే అతడు చేసిన పిండతర్పణములను పితృదేవతలు స్వీకరింపరు. విష్ణుమంత్రరహితుడు, సంధ్యావందనమాచరింపనివాడు, ఏకాదశీవ్రతము చేయనివాడు, శ్రీహరికి నివేదింపబడని ఆహారమును తీసుకొనువాడు, శూద్రులయొక్క ఇండ్లలో అన్నము తినువాడు, శాస్త్రములపై బ్రతుకు బ్రాహ్మణుడు (యుద్ధములు చేయువాడు), లెక్కలు వ్రాసి బ్రతుకు బ్రాహ్మణుడు, ఋతుపాతయైన స్త్రీ చేసిన వంటను తిన బ్రాహ్మణుడు, తవ కన్యలను అమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరి నామము అమ్ముకొని బ్రతుకువాడు, తన విద్యనమ్ముకొనువాడు, సూర్యోదయముననే భోజనము చేయువాడు, చేపలు తినువాడు, సాల గ్రామపూజారహితుడైన బ్రాహ్మణుడు విషములేని సర్పమువలె తేజోహీనులగుచున్నాడు.
ఇత్యుక్త్యా చ మునిశ్రేష్ఠ సర్వం పూజావిధిక్రమం ।
తమువాచ చ సావిత్య్రాః ధ్యానాదికమభీప్సితంభీప్సితం ॥
దత్వా సర్వం నృపేంద్రాయ ప్రయయౌ స్వాలయం మునిః ।
రాజా సంపూజ్య సావిత్రిం దదర్శ వరమాద చ ॥
ఈవిధముగా పరాశరముని ఆశపతి మహారాజునకు సావిత్రి దేవియొక్క ధ్యానాదికమునంతయు తెలిపి తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. అశ్వపతి పరాశరమహాముని చెప్పినట్లు సావిత్రి దేవిని పూజింపగా ఆ దేవి ప్రత్యక్షమై మహారాజునకు వరమిచ్చెను.
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు నారాయణునితో ననెను-
కింవా ధ్యానం చ సావిత్ర్యాః కిం వా పూజా విధానకం ।
స్తోత్రం మంత్రం చ కిం దత్వా ప్రయయౌ స పరాశరః ॥
నృప: కేన విధానేన సంపూజ్య శ్రుతి మాతరం ।
వరం కిం వా సంప్రాప వద సోఽశ్వపతి: నృప: ॥
సావిత్రి దేవత యొక్క ధ్యానము, పూజావిధానము, స్తోత్రము మంత్రము ఏవిధముగామన్నవి? ఆశ్వపతి మహారాజు వేదమాతయగు సావిత్రిని ఏ పద్ధతిలో పూజించి ఆమెచే పరమును పొందెనో వాటినన్నిటిని నాకు విపులముగా తెలుపుడని ఆనెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను
జ్యేష్ఠ కృష్ణత్రయోదశ్యాం శుద్ధీకాలే చ సంయతః ।
వ్రతమేవ చతుర్థశ్యాం ప్రతీ భక్త్యా సమాచరేత్ ॥
వ్రతం చతుర్దశాబ్దం చ ద్విసప్తఫలసంయుతం ।
దత్వా ద్వి సప్తనైవేద్యం పుష్ప ధూపాదికం తథా ॥
వస్త్రం యజ్ఞోపవీతం చ భోజ్యం చ విధిపూర్వకం ।
సంస్థాప్య మంగళఘటం ఫలశాఖా సమన్వితం ॥
గణేశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం ।
సంపూజ్య పూజయేదిష్టం ఘటే ఆవాహితే మునే ॥
జ్యేష్ఠ మాసమున బహుళ త్రయోదశినాడు మంచి ముహూర్తమున ప్రతదీక్షను పూని చతుర్దశినాడు ఈవ్రతమును ప్రారంభింపవలెను. ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములాచరింపవలెను. ఈ వ్రతమున పదునాలుగు పండ్లు పదునాలుగు విధములైన నైవేద్యములు, పుష్పము, ధూపము, వస్త్రము, యజ్జోపవీతము భోజ్యము మొదలగువానిని శాస్త్ర పద్ధతిననుసరించి సమర్పింపవలెను.
ప్రారంభమున ఫలములు, శాఖలు గల మంగళకలశమును స్థాపింపపలెను. తరువాత గణపతిని, సూర్యునీ, అగ్నిని, శ్రీమహావిష్ణువును, శివుని, శక్తిని పూజించి మంగళకలమున ఇష్టదేవతను ఆవాహన చేయవలెను.
శ్రుణు ధ్యానం చ సావిత్య్రాః చోక్తం మధ్యందినే చయత్।
స్తోత్రం పూజా విధానం చ మంత్రంచ సర్వకామదం॥
నారదా! మధ్యందిన సంహితయందు పేర్కొనబడిన స్తోత్రమును పూజావిధాపమును, మంత్రమును నీకు తెలిపెదను.
తప్తకాంచనవర్ణాభాం జ్వలంతీం బ్రహ్మతేజసా ।
గ్రీష్మమధ్యాహ్న మార్తండ సహస్ర సమసుప్రభాం ॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం రత్నభూషణ భూషితాం ।
వహ్ని శుద్ధాంశుకాధానాం భక్తానుగ్రహాకాతరాం॥
సుఖదాం ముక్తిదాం శాంతాం కాంతాం చ జగతాం విధేః ।
సర్వ సంపత్య్సరూపాం చ ప్రదాత్రీం సర్వసంపదాం ॥
వేదాధిష్ఠాతృదేవీం చ వేదశాస్త్ర స్వరూపిణీం ।
వేదే బీజస్వరూపాం చ భబేత్వాం వేదమాతరం॥
పరిశుద్ధమైన బంగారు వన్నెగలది, బ్రహ్మతేజస్సుచే ప్రకాశించునది, వేయి గ్రీష్మకాలమధ్యాహ్న సూర్యులవటి వెలిగిపోవుచున్నది, చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము కలది, రత్నాలంకార సుశోభిత, బంగారు కాంతిగల వస్త్రములను ధరించునది, భక్తుల ససుగ్రహింపవలయునని ఉలూతలూగునది, సర్వ సంపదల యొక్క స్వరూపిణి, సర్వసంపదలనొసగునది. వేదములకు అధిష్టాన దేవత, వేద శాస్త్ర స్వరూపిణి, వేదమునందున్న బీజాక్షర స్వరూప, వేదములకు తల్లియైన నిన్ను (పావిత్రీదేవిని) సేవింతును.
ధ్యాత్వా ధ్యానేన చానేన దత్వాపుష్పం స్వమూర్ధని ।
పునర్ధ్వాత్వా ఘటే భక్త్యా దేవీమావాహయేత్ ప్రతీ॥
దత్వా షోడశోపచారం వేదోక్తమంత్రపూర్వకం ।
సంపూజ్య స్తుతి ప్రణమేదేవం దేవీం విధానతః ॥
పై ధ్యాన శ్లోకములతో సావిత్రీ దేవిని ధ్యానించి పూజాపుష్పమును తన శిరస్సుపై నుంచుకొని మరల దేవిని ధ్యానించి పూజా కలశమందు దేవిని ఆవాహన చేయవలెను. వేదమంత్ర పూర్వకముగా షోడశోపచారములలో దేవిని శాసొక విధానముగా ఆరాధించి స్తుతించి నమస్కరింపవలెను.
ఆసనం పాద్యమర్ఘ్యం చ స్నానీయం చానులేపనం ।
ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం శీతలంజలం॥
పసనం భూషణం మాల్యం గంధమాచమనీయకం ।
మనోహరం సుతల్పం చ దేయాన్యేతాని షోడశ॥
ఆసనము, పాద్యము, ఆర్ఘ్యము, సానీయము, అనులేపనము, రూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, చల్లనినీరు, వస్త్రము, భూషణము, పుష్పమాల, గంధము, ఆచమనీయము, శయ్య అనునవి షొడశోపచారములు.
ఆసన మంత్రము -
దారుపారవికారం. చ హేమాది విర్మితం చవా ।
దేవాధారం పుణ్యదం చ మయా నిత్యం నివేదితం ॥
చక్కని చెక్కతో నిర్మితమైనది లేక బంగారముతో నిర్మితమైనది, దేవతలకు ఆసనయోగ్యమైనది పుణ్యప్రదమైన ఆసనమును నీకు సమర్పించుచున్నాను.
పాద్య మంత్రము -
తీర్ధోదకం చ పాద్యం చ పుణ్యదం ప్రీతిదం మహత్।
పూజాంగభూతం శుద్ధంచ మయా భక్త్యా నివేదితం ॥
పుణ్యప్రదమైనది. మిక్కిలి సంతోషమునిచ్చునది. పుణ్యతీర్థములకు చెందిన ఈపాద్యము పూజాంగభూతమైనది. ఇట్టి పాద్యమును నీకు నేను భక్తితో సమర్పించుచున్నాను.
అర్ఘ్య మంత్రము -
పవిత్రరూపముర్ఘ్యం చ దూర్వాపుష్పాక్షతాన్వితం ।
పుణ్యదం శంఖతోయక్తం మయా తుభ్యం నివేదితం॥
గరక, పుష్పములు, అక్షతలతో నున్న ఈ ఆర్ఘ్యజలము పవిత్రమైనది. ఇది పుణ్యప్రదమైన శంఖతీర్థముతో కలిసియున్నది. ఇట్టి ఆర్ఘ్యజలమును నీకు నివేదించుచున్నాను.
స్నానీయ మంత్రము -
సుగంధి ధాత్రీ తైలం చ దేహసౌందర్య కారణం !
మయా నివేదితం భక్త్యా స్నానీయం ప్రతి గృహ్యతాం॥
దేహ సౌందర్యమును పెంచునది, సువాసన కలదియగు ఉసిరకనూనెను నీకు స్నానీయముగా ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.
అమలేపన మంత్రము -
మలయాచల సంభూతం దేహశోభావివర్ధనం ।
సుగంధియుక్తం సుఖదం మయాతుభ్యం నివేదితం ॥
శరీరకాంతిని పెంచునది. మలయ పర్వతారణ్యమున పుట్టినది, మంచి వాసన కలదియగు అనులేపనమును నీకు ఒనగుచున్నాను.
ధూపమంత్రము -
గంధద్రవ్యోద్భవః పుణ్యః ప్రీతిదో దివ్యగంధదః ।
మయా నివేదితో భక్త్యా ధూపోఽయం ప్రతిగృహ్యతాం ॥
సుగంధద్రవ్యముల వలన ఉత్పన్నమైనది, చక్కని సువాసనను, సంతోషమును ఒసగు ధూపమును నీకు భక్తితో ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.
దీపమంత్రము -
జగతాం దర్శనీయం చ దర్శనం దీప్తాకారణం ।
అంధకారధ్వంస బీజం మయా తుభ్యం నివేదితం ॥
జగములన్నిటికీ దర్శనీయమైనది, ప్రకాశమునకు కారణమైనది చీకటిని పారద్రోలునది అగు దీపమును నీకు సమర్పించుచున్నాను.
నైవేద్య మంత్రము -
తుష్టిదం చైవ ప్రీతిదం క్షుద్వినాశనం।
పుణ్యదం స్వాదురూపంచ నైవేద్యం ప్రతి గృహ్యతాం॥
తుష్టి పుష్టి ప్రీతిని కలిగించునది. ఆకలిని పొగొట్టునది రుచియైనది అగు నైవేద్యమును సమర్పించుచున్నాను. దానిని నీవు స్వీకరింపుము.
తాంబూలమంత్రము -
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం ।
తుష్టిదం పుష్టిదం చైవ మయా భక్త్యా నివేదితం ॥
ఈ తాంబూలము కడు శ్రేష్టమైనది, రమ్యమైనది. కర్పూరాది సుగంధ ద్రవ్యములచే ఘుమఘుమలాడుచున్నది. ఇది తుష్టిని, పుష్టిని కలిగించును, ఆట్టి తాంబూలమును నీకు నివేదించుచున్నాను.
శీతల జల మంత్రము -
సుశీతలం వాసితం చ పిపాసానాశకారణం ।
జగతాం జీవ రూపంచ జీవనం ప్రతి గృహ్యతాం॥
మిక్కిలి చల్లనిదీ, సువాసనగలది, దప్పిని తీర్చునది, లోకములకన్నిటికి ప్రాణరూపమైన నీరును నీవు తీసికొనుము.
వస్త్ర మంత్రం -
దేహశోభా స్వరూపం చ సభాశోభా వివర్ధనం ।
కార్పాసజం చ క్రిమిజం వసనం ప్రతి గృహ్యతాం ॥
శరీరమునకు శోభను కలిగించునది అట్లే సభల యందు గొప్పదనమును కలిగించునది యగు ప్రత్తిలో నేయబడిన వస్త్రము లేక పట్టుపురుగులవల్ల ఉత్పన్నమైన పట్టు వస్త్రమును నీకు సమర్పించుచున్హ్నాను. దీనిని నీవు స్వీకరింపుము.
ఆభరణ మంత్రము -
కాంచనాదీభిరాబద్ధం శ్రీయుక్తం శ్రీకరం సదా ।
సుఖదం పుణ్యదం చైవ భూషణం ప్రతి గృహ్యతాం ॥
బంగారు మొదలగు ద్రవ్యములచే నిర్మితమైనది, శోభాయుతము, శోభాకరము, సుఖమును కలిగించు ఆభరణములను ఇచ్చుచున్నాను. వీటిని నీవు పరిగ్రహింపుము.
మాలా మంత్రము-
నానాపుష్పలతా కీర్ణం బహుభాషా సమన్వితం ।
ప్రీతిదం పుణ్యదం చైవ మాల్యంపై ప్రతిగృహ్యతాం ॥
అనేకమైన పుష్పములు, లతలతో నిండినది, వివిధములైన కాంతులనిచ్చునది, సంతోషమును, పుణ్యమును కలిగించు ఈ మాలను నీవు ప్రతిగ్రహింపుము.
గంధ మంత్రము-
సర్వమంగళరూపశ్చ సర్వమంగలదోవరః ।
పుణ్యప్రదశ్చ గంధాడ్యో గంధశ్చ ప్రతిగృహ్యతాం ॥
సర్వ మంగళస్వరూపిణి, అన్ని విధములైన మంగళములను కలిగించునది. పుణ్యప్రదము సుగంధయుతమైన గంధమును నీకు సమర్పించుచున్నాను. దీనిని స్వీకరింపుము.
ఆచమన మంత్రము-
శుద్ధం శుద్ధిప్రదం చైవ శుద్ధానాం ప్రీతిదం మహత్ ।
రమ్యమాచమనీయం చ మయా దత్తం ప్రగృహ్యతాం ॥
పరిశుద్ధమైనదీ, శుద్దిని కలిగించునది, పరిశుద్ధమైన వారికి మిక్కిలి ప్రీతిని కలిగించునది, సంతోషమును కలిగించు ఈ ఆచమనమును నీకు ఇచ్చుచున్నోను. దీనిని నీవు స్వీకరింపుము.
శయ్యామంత్రము-
రత్నసారాది నిర్మాణం పుప్పుచందన సంయుతం ।
సుఖదం పుణ్యదం చైవ సుతల్పం ప్రతిగృహ్యతాం ॥
విలువైన రత్నములచే నిర్మించబడినది, పుష్పములు, చందనద్రవ్యము మొదలగు సుగంధ ద్రవ్యభరీతము, సుఖమును కలిగించు శయ్యను నీవు ప్రతిగ్రహింపుము.
ఫలమంత్రము-
నానా వృక్షసముద్భూతం నానా రూప సమన్వితం ।
ఫల స్వరూపం ఫలదం ఫలం చ ప్రతిగృహ్యతాం ॥
అనేక వృక్షములనుండి పుట్టినవి. అనేక రూపములు కలవి, భగవదనుగ్రహ ఫలితము నిచ్చునవి ఆగు ఫలములను నీవు స్వీకరింపుము.
సిందూర మంత్రము-
సిందూరం చ వరం రమ్యం భాలశోభావివర్ధనం ।
భూషణం భూషణానాం చ సిందూరం ప్రతిగృహ్యతాం ॥
ఈ సిందూరము చాలా అందమైనది. నొసలునకు ఒక క్రొత్తనైన శోభను కలిగించును. అలంకరణములలోకెల్లను. అలంకారభూతమైన ఈ తిలకమును నీవు స్వీకరింపుము.
యజ్ఞోపవీత మంత్రము -
విశుద్ధగ్రంథి సంయుక్తం పుణ్యసూత్ర వినిర్మితం ।
పవిత్రం వేదమంత్రేణ యజ్ఞ సూత్రం చ గృహ్యతాం ॥
పరిశుద్ధమైన దారములు కలదీ, పవిత్రమైన గ్రంథి (ముడి) కలది, వేదమంత్రోచ్చారణ వల్ల పవిత్రమైనది అగు యజ్ఞోపవీతమును నీకు ఇచ్చుచున్నాను. నీవు దీనిని దయతో స్వీకరింపుము.
ద్రవ్యాణ్యేతాని మూలేన ధ్యాత్వా స్తోత్రం పఠేత్సుధీః ।
తతః ప్రణమ్యవిప్రాయ ప్రతీ దద్యాచ్ఛ దక్షిణాం ॥
పైన పేర్కొనబడిన ద్రవ్యములనన్నిటిని మూలమంత్రము చదువుచు సమర్పించిన ఆ పిమ్మట నియమ నిష్ఠలు గల ఒక విప్రునకు కొంత దక్షిణను సమర్పించవలెను.
సావిత్రితి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవచ ।
లక్ష్మీమాయాకామపూర్వం మంత్రమష్టాక్షరం విదుః ॥
శ్రీం హ్రీం క్లీం సావిత్ర్యై స్వాహా అనునది –
చతుర్థివిభక్తి గల సావిత్రీ శబ్దము అగ్నిభార్యయగు పదో శబ్దాంతము కాగా, దీనికి ముందు 'లక్ష్మీ బీజమైన శ్రీం మాయాబీజీక్షరమైన హీర, కామ బీజాక్షరమైన క్లీం అనునవి కలిగిన ఆస్టాక్షరీ మంత్రము ఈ సావిత్రీ మంత్రము. దాని స్వరూపము శ్రీం హ్రీం క్లీం , సావిత్ర్యై స్వాహా
మధ్యందినోక్తస్తోత్రం చ సర్వవాంఛా ఫలప్రదం ।
విప్ర జీవన రూపం చ నిబోధ కథయామి తే ॥
సమస్తమైన కోరికలను తీర్చునది బ్రాహ్మణులకు జీవపొధార భూతమైనది, మధ్యందిన సంహితయందు చెప్పబడిన సావిత్రీ స్తోత్రమును నీకు చెప్పుచున్నాను.
కృష్ణేవ దత్తా సావిత్రి గోలోకే బ్రహ్మణి పురా ।
న యాతి సా తేన సార్థం బ్రహ్మలోకం తు నారద॥
బ్రహ్మా కృష్ణ్వాజ్ఞయా భక్త్యా పర్యష్టౌత్ వేదమాతరం ।
తదా సా పరితుష్టా చ బ్రహ్మాణం చకమే సతీ ॥
పూర్వకాలమున శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు పావిత్రీ నీయగా ఆమె బ్రహ్మలోకమునకు వెళ్ళుట కంగీకరించలేదు. కాని శ్రీకృష్ణుని ఆజ్ఞ నమసరించి బ్రహ్మదేవుడు ఆమెను స్తుతింపగా వెంటనే అతనిని కామించెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-
నారాయణ స్వరూపే చ నారాయణి సనాతని ।
నారాయణ సముద్భూతే ప్రసన్నాభవ సుందరి ॥
నిత్యే నిత్య ప్రియే దేవి నిత్యానంద స్వరూపిణి ।
సర్వమంగళ రూపేణ ప్రసన్నా భవ సుందరి ॥
పర్వ స్వరూపే విప్రాణాం మంత్రసారే పరాత్పరే ।
సుఖదే మోక్షదే దేవి ప్రసన్నా భవ సుందరి॥
విప్రసాపేద్మ దాహాయ జ్వలదగ్ని శిఖోపమే।
బ్రహ్మతేజః ప్రదే దేవి ప్రసన్నా భవ సుందరి ॥
కాయేన మనసా వాచా యత్పాం కురుతే ద్విజః ।
తత్తే స్మరణమాత్రేణ భస్మీభూతం భవిష్యతి ॥
ఇత్యుక్యా జగతాం ధాతా తత్ర తస్థౌ చ సంసది ।
సావిత్రీ బ్రహ్మణా సార్థం బ్రహ్మలోకం జగామ సా ॥
ఓ సావిత్రీదేవి! నీవు నారాయణుని స్వరూపము కల దానవు. నారాయణివి. సనాతనీవి. నారాయణుని మండి ఉద్భవించిన దానవు. తేజస్వరూపిణివి, చాలా శ్రేష్ఠురాలివి. పరమానంద రూపిణివి. బ్రాహ్మణజాతికి చిహ్నమవు. నీవు నిల్యురాలవు. ఎల్లప్పుడు అందరికి. ప్రియమైన దానవు. నిత్యానంద స్వరూపము. సమస్త మంగళరూపిణివి. బ్రాహ్మణులకు సర్వస్వమవు. సుఖమును, మోక్షమునిచ్చుదానవు. బ్రాహ్మణులు చేసిన పాపములను సమూలముగా నాశనము చేయగలవు. నీవు బ్రహ్మతేజస్సును కలిగించుదానవు. ద్విజులు మనో వాక్కాయముల ద్వారా చేసిన పాపములన్నియు నీ నామస్మరణ చేసినంత మాత్రముననే భస్మమగును. అట్టి నీవు నాకు ప్రసన్నురాలపుకమ్ము.
ఈవిధముగా బ్రహ్మదేవుడు సావిత్రిని స్తుతించి ఆ సభలోనుండగా సావిత్రీ సంతోషపడి బ్రహ్మదేవునితో కలసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను.
అనేన స్తవ రాజేవ సంస్తూయాశ్వపతిర్నృపః ।
దదర్శ తాంచ సావిత్రీం వరం ప్రాప మనోగతం ॥
స్తనరాజమిదం పుణ్యం త్రిసంధ్యాయాం చ యః పఠేత్ ।
పారే చతుర్ణాం వేదానాం యత్ఫలం తల్లభేత్ ధ్రువం ॥
సావిత్రీ దేవి యొక్క ఈస్తోత్రమును పఠించి అశ్వపతి మహారాజు సావిత్రీ దేవిని ప్రత్యక్షము చేసికొనగలిగామ. ఈమాత అశ్వపతి కోరుకున్న కోరికను. (సంతానమును) వరముగా నిచ్చెను.
ఈ సావిత్రీస్తోత్రమును మూడు పూటలయందు భక్తిలో చదివినచో వాళువేదములు పారాయణము చేసిన ఫలితమును పొందుదురు.
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వీతీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదె సావిత్ర్యుపాఖ్యానే సావిత్రిస్తోత్రకథనం నామ త్రయోవింశతితమోఽధ్యాయ: ॥
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున వారద నారాయణుల సంవాద సమయమును.
పేర్కొనబడిన సావిత్ర్యుపాఖ్యానములో సావిత్రీత్ర కథనమను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Narrating one of the most famous histories of marital devotion, the text recounts how the virtuous princess Sāvitrī married prince Satyavān, knowing fully well through astrologers that his life span was destined to end within one year. When the fateful day arrived in the forest and Satyavān collapsed under a banyan tree, Yamarāja, the lord of death, personally arrived and extracted the soul of Satyavān to carry it to his subterranean realm. Undeterred by fear or physical exhaustion, the resolute Sāvitrī followed Yamarāja on foot into the dangerous cosmic pathways of the dead, using her brilliant spiritual wisdom and selfless prayers to engage the lord of death in a profound discourse.