బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

49 - రాధాదేవిని  సుధాముడు శపించుట

పార్వత్యువాచ- పార్వతి ఇట్లనెను-

కథం సుదాము శాపం చ సా దేవీ చ లలాభ హ

కథం శశాప భృత్యో హి స్వాభీష్టాం దేవకామినీం

మహానుభావా! సుదాముడు రాధాదేవికి భృత్యుడుకదా! అతడు తనకభీష్టదేవత, తన దేవునకు భార్యయగు రాధాదేవికి శాపమెందుకు ఇచ్చాను.

శ్రీభగవానువాచ- భగవంతుడగు మహదేవుడు పార్వతితో ఇట్లనెను-

శ్రుణు దేవి ప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతం

గోప్యం సర్వపురాణేషు శుభదం భక్తిముక్తిదం

ఏకదారాధికేశశ్చ గోలోకే రాసమండలే

శతశృంగాఖ్య గిర్యేకదేశే బృందావనే వనే

గృహీత్వా వీరజాం గోపీం సుభాగ్యం రాధికా సమాం

క్రీడాం చకార భగవానత్న భూషణ భూషితః

రత్నప్రదీప సంయుకే రత్ననిర్మాణమండలే

అమూల్య రత్నఖచిత మంచకే పుషతల్పకే

కస్తూరీ కుంకుమార సుచందనసుధూపితే

సుగంధీ మాలతి మాలా సమూహ పరిమండితే

సురతాద్వీరతిరాస్తి దంపతీ రతీపండితా

 తౌ ద్వౌ పరస్పరాక్తౌ చ సుఖసంభోగ తంత్రి తౌ

మన్వంతరాణాం లక్షశ్చ కాల పరిమితో గతః

గోలోకస్య స్వల్పకాలే జన్మాదిరహితస్య చ

ఓ పార్వతీదేవి! రహస్యమైనదీ, సమస్తపురాణములందు రహస్యముగానున్నది, శుభమును, భక్తినీ, ముక్తిని కలిగించు పరమాద్భుతమైన రాధాదేవి కథను వినుము.

ఒకప్పుడు రాధాపతియగు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసమండలమున శతశృంగ పర్వతమున నున్న బృందావనమున “విరజ” అను గోపకన్యను వెంట పెట్టుకొని ఆమెతో క్రీడింపసాగెను. వారు పడుకొన్న మంచము అమూల్యములైన రత్నములతో నున్నది. దానికి సమీపముననున్న దీపములు రత్నములచే నిర్మితమైనవి. వారు పడుకొన్న పుషతల్పము కస్తూరీ కుంకుమ, మంచి చందనములతో సువాసితమై ఉన్నది. ఆ మంచముచుట్టు సువాసనగల మాలతీ పుష్పమాలలు కట్టుబడినవి.

రతీపండితులైన వారి రతిక్రీడ లక్షమన్వంతరములవరకు సాగినది. ఆ సమయము జన్మమరణములు లేని గోలోకమున స్వల్పకాలమే. అయినను వారిద్దరు సుఖసంభోగమున మునిగియుండిరి.

దూత్యశ్చతస్రో జ్ఞాత్వాఽథ జగదుస్తాంతు రాధీకాం

శ్రుత్వా పరమరుష్టా సా తత్యాజ హరిమీశ్వరీ

ప్రబోధితా చ సఖిభీ: కోపరక్తస్యలోచనా

విహాయ రత్నాలంకారం వహిశుద్ధాంశుకే శుభే

క్రీడా పద్మం చి సద్రత్నామూల్య దర్పణముజ్వలం

 నిర్మార్జ యామాస సతీ సిందూరం చిత్రపత్రకం

ప్రక్షాళ్య తోయాంజలిభిర్ముఖ రాగమలక్తకం

విస్రస్త కబరీభారా ముక్తకేశి ప్రకంపితా

శుక్ల వస్త్రపరీధానా రూక్షా వేషాదివర్జితా

 యయౌ యానాంతీకం తూర్ణం ప్రీయాశీభిర్నివారిలా

ఆజుహావ సఖీసంఘం రోషవిసురీతాధరా

శశ్వత్కంపాన్వితాంగీ సా గోపీభిః పరివారితా

రాధాదేవియొక్క చెలికత్తెలు విరజా శ్రీకృష్ణులు సమాగతులైన విషయమును రాధాదేవికి తెలియజేసిరి. అందువలన రాధాదేవి కోపముతో ఎరుపెక్కిన ముఖముతో రత్నాలంకారములను బంగారువన్నెగల వస్త్రములను క్రీడాపద్మమును, రత్ననిర్మితమైన అద్దమును, సిందూరమును, చెక్కిలిపై చేసికొన్న మకరిపకా పత్రములను తొలగించి నీటితో ముఖమును, పెదవులకున్న లత్తుకను కడుగుకొని కొప్పును విప్పుకొని, తెల్లని వస్త్రములు ధరించి రథము దగ్గరకు పోయెను.

ఆట్లే ఆమే కోపముతో వణకిపోవుచు తన చెలికత్తెలను, గోపికొస్త్రీలను పిలుచుకొని పోయినది.

తాభిర్భక్త్యాయుతాభిశ్చ కాతరాభిశ్చ సంస్తుతా

ఆరురోహ రథం దివ్యమమూల్యం రత్ననిర్మితం

దశయోజన విస్తీర్ణం దైర్ఘై తచ్ఛతయోజనం

సహస్ర చక్రయుక్తం చ నానాచిత్రసమన్వితం

నానావిచిత్రవసనైః సూక్ష్మే క్షోపైర్విరాజితం

 అమూల్యరత్న నిర్మాణ దర్పణైః పరిశోభితం

మణీంద్రజాల మాలాభైః పుష్పమాలా సహస్రకై:

సద్రత్న కలనైర్యుక్తం రమ్యై మందిర. కోటిభిః

 త్రిలక్ష కోటిభిః పార్థం గోపీభిశ్చ ప్రియాళిభిః

రాధాదేవి తనవెంట రమ్మని తనచెలికత్తెలను అనుచరులను ఆజ్ఞాపించగానే వారిలో కొందరు భక్తితో ఆమె వెంటరాగా వారిని వెంటబెట్టుకొని ఆమె తన రథమునెక్కెను. రాధాదేవియొక్క రథము దివ్యమైనదీ, రత్నములతో నిర్మింపబడినది. ఆది చాలా విశాలమైనది. ఆరథమున అనేక చిత్రములున్నవి. ఆది చిత్ర విచిత్రములైన గుడ్డలతోను, మిక్కిలి పలుచనైన పట్టువస్త్రములతో (పరదాలు) అలంకరించబడినది. ఆందు ఆమూల్యమైన రత్నదర్పణములు అమర్చబడినవి. మణులు, పుష్పములు మాలలుగా అలంకరింపబడినవి. ఆమూల్యమైన రత్నకలశములు ఆ రథమున కమర్పబడినవి.

ఆట్టి రథమునెక్కి తన చెలికత్తెలు, అనుచరులు వెంటరాగా కృష్ణుడున్న ప్రదేశమునకు పోయెను.

యయౌ రథేన తేనైవ సుమనోమాలినా ప్రియే

శ్రుత్వా కోలాహలం గోపః సుదామా కృష్ణపార్షదః

కృష్ణం కృత్వా సావధానం గోసైస్సార్దం పలాయితః

భయేన కృష్ణః సంత్రస్తో ఏహాయ విరజాం సతీం

స్వప్రేమమగ్న: కృష్ణోఽపి తిరోధానం చకార సః

సా సతీ సమయం జ్ఞాత్వా వీచార్య సహృది కృధా

 రాధాప్రకోపభీతా చ ప్రాణాంస్తత్యాజ తక్షణం

విరజాళిగణాస్తత్ర భయవిహ్వల కాతరాః

ప్రయయుః శరణం సాధ్వీం విరజాం తక్షణంభియా

గోలోకే సా సరిద్రూపా జాతా వై శైలకన్యకి

 కోటియోజన విస్తీర్ణా దీర్ఘే శతగుణా తథా

గోలోకం వేష్టయామాస పరిఖేవ మనోహరా

బభూవుః క్షుద్రనద్యశ్చ తదాన్యా గోప్య ఏవ చ

సర్వా నద్యస్తదంతాశ్చ ప్రతివిశ్వేషు సుందరి

ఇమే సప్త సముద్రాశ్చ విరజానందనా భువి  

రాధాదేవి సుమనోమాలియను తన రథమునెక్కి శ్రీకృష్ణుడున్న ప్రదేశమునకు పోయెను. రాధాదేవి చెలికత్తెల కోలాహలమును దూరమునుండే గమనించిన సుదాముడను శ్రీకృష్ణుని అనుచరుడు శ్రీకృష్ణుని హెచ్చరించి తన తోటి గోపకులతో ఆ ప్రదేశమునుండి పరుగెత్తుకొనిపోయెను.

శ్రీకృష్ణుడు కూడ రాధాదేవి వచ్చుచున్నదనగానే భయపడి వీరజాదేవి ప్రేమలో మగ్నుడైనను వెంటనే ఆమెను వదలి పెట్టి ఆంతర్థానమునొందెను.

వీరబాదేవీ అప్పటి పరిస్థితిని గమనించి మనస్సులో చేయవలసిన విషయమును చక్కగా ఆలోచించీ రాధాదేవియొక్క కోపమునకు భయపడి గోలోకమున ఆ లోకమునంతయు చుట్టిముట్టియున్న గడ్డవలె నదీరూపమును చెందినది, వీరబాదేవి స్నేహితురాండ్రు సైతము భయముతో విరజాదేవిని శరణు వేడి చిన్న చిన్న నదులుగా మారిపోయిరి. ఈ ప్రపంచమున నున్న నదులన్నియు విరజాదేవియొక్క చెలికత్తెలైన గోపికలే. అట్లే ఈ భూమి పైనున్న సప్తసముద్రములు విరజాదేవియొక్క సంతానమే.

 అథాగత్య మహాభాగా రాధారాసేశ్వరీ పరా

న దృష్ట్యా విరజాo కృష్ణం స్వగృహం చ పునర్యయౌ

జగామ కృష్ణస్తాం రాధాం గోపాలైరష్టభిః సహ

 గోపీబీ: ద్వారయుక్తాభిః వారితోఽపి పునః పునః

దృష్ట్యా కృష్ణం చ సా దేవీ భర్తృయామాస తం తదా

 సుదామా భర్తృయామాస తాం తథా కృష్ణసన్నిధౌ

కృద్ధా శశాప సా దేవీ సుదామానం సురేశ్వరీ

గచ్చ త్వమాసురీం యోనిం గచ్ఛ దూరమతోద్రుతం

శశాప తాం సుదామా చ త్వమితో గచ్చ భారతం

భవ గోపీ గోపకన్యాముఖ్యాభిః స్వాభిరేవ చ

తత్ర తే కృష్ణవిచ్చేదో భవిష్యతి శతం సమాః

తత్ర భారావతరణం భగవాంశ్చ కరిష్యతి

ఇతి శప్త్వా సుదామాఽసౌ ప్రణమ్య జననీం హరిం

 సాశ్రునేత్రో మోహయుక్తస్తతో గంతుం సముద్యతః

రాసేశ్వరియగు రాధాదేవి అచ్చటకు వచ్చి విరజనుగాని శ్రీకృష్ణునిగాని కనుగొనక తిరిగి తన ఇంటికి పోయెను. అప్పుడు శ్రీకృష్ణుడు తన సహచరులైన ఎనమండుగురు గోపాలకులతో రాధాదేవి మందిరమునకు వెళ్ళెను. అచ్చట ద్వారముననున్న ద్వారపాలికలు శ్రీకృష్ణుని వెళ్ళవద్దని నివారించినను వారిమాటలు పట్టించుకొనక తన అనుచరులతో రాధాదేవి మందిరమునకు ఆతడు పోయెను.

రాధాదేవీ శ్రీకృష్ణుని చూడగానే కోపముతో ఆతనిని నిందింపసాగినది. రాధాదేవియొక్క నూటలు వినలేక శ్రీకృష్ణుని అనుచరుడైన సుదాముడు రాధాదేవిని శ్రీకృష్ణుని సమీపముననే నిందింపసాగెను. అందువలన రాధాదేవి కోపముతో నీవు రాక్షసుడవై భూలోకమున జన్మించువని, ఇచ్చటినుండి వెంటనే వెళ్ళిపొమ్మనీ సుదాముని శపించెను.

సుదాముడు సహితము కోపముతో నీవు చెలికత్తెలతో భూలోకమందలి భరతఖండమునకు వెళ్ళుమని, ఆచ్చట నీకు శ్రీకృష్ణునితో వంద సంవత్సరములవరకు వియోగము ప్రాప్తించుననీ, శ్రీకృష్ణుడుకూడ భూలోకమున జన్మించి భూమియొక్క భారమును తగ్గించునని శపించెను.

తరువాత సుదాముడు పశ్చాత్తాపముతో తల్లియగు రాధాదేవిని, తండ్రియగు శ్రీకృష్ణుని నమస్కరించి మోహమువలన ఏడ్చుచు గోలోకమునుండి భూలోకమునకు పోవుచుండెను.

 రాధా జగామ త త్పశ్చాత్ సాశ్రునేత్రాజఽతీవీహ్వలా

వత్స క్వ యాసీత్యుచ్చార్య పుత్రవిచ్చేదకాతరా

కృష్ణస్తాం బోధయామాస విద్యయా చ కృపానిధిః

శీఘ్రం సంప్రాప్స్యసి సుతం మా రుదస్యం వరాననే

స చాసురః శంఖచూడో బభూవ తులసీపతిః

మచ్చూల  భిన్నకాయేన గోలోకం వై జగామ స:

రాధాదేవి సుదామునివెంట ఏడ్చుచు, పుత్రవియోగమును సహింపలేక వత్స! నీవెక్కడికి పోవుచున్నావని అమచు పోను, అప్పుడు దయా సముద్రుడగు శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి రాధాదేవి! నీపేడకుము. నీ పుత్రుని నీవు తొందరగా తిరిగి పొందగలవు అని చెప్పెను.

ఆ సుదాముడే శంఖచూడుడను రాక్షస రాజుగా జన్మించి తులసీదేవిని వివాహమాడి నా శూలముయొక్క దెబ్బచే ప్రాణములను కోల్పోయి గోలోకమునకు తిరిగివెళ్ళాను.

రాధా జగామ వారాహే గోకులంభారతం సతీ

వృషభానోశ్చ వైశ్యస్య సాచ కన్యా బభూవ హ

ఆయోనీ సంభవా దేవీ వాయుగరా కళావతి

సుషునే మాయయా పాయుం సా తత్రావీర్బభూవ హ

అతీతే ద్వాదశాబ్ధే తు దృష్ట్యా తార నవయౌవనాం

సార్థం రాయాణ వైశ్యన తత్సంబంధం చకార సః

ఛాయాం సంస్థాప్య తద్గేహే సౌఽతంర్ధానమవాప హ

బభూవ తస్య వైశ్యస్య వివాహః ఛాయయా సహ

వరాహ కల్పమున రాధాదేవి భారతఖండముననున్న గోకులమునకు వచ్చినది. ఆమె అచ్చట వృషభాను అను వైశ్యునకు పుత్రికగా జన్మించెను. ఆయోనిజయైన ఆ దేవి వృషభానువుయొక్క భార్యయగు కళావతికి వాయురూపమున జన్మించినది. ఆ దేవికి పన్నెండు సంవత్సరముల వయసు రాగానే వృషభానుడామెను రాయాణుడను వైశ్యపుత్రునకిచ్చి వివాహము చేసెను.

రాధాదేవి వృషభానునీంట్లో తన ఛాయనుఉంచి అదృశ్యమైనందువలన రాయాణు డా ఛాయనే వివాహమాడెను.

 గతే చతుర్దశాబ్ధేతు కంస భీతిచ్చలేన చ

జగామ గోకులం కృష్ణ: శిశురూపే జగత్పతిః

కృష్ణమాతా యశోదా యా రాయణస్తత్సహోదరః

గోలోకే గోప కృష్ణాంశః సంబంధాత్ కృష్ణమాతులః

కృష్ణేన సహ రాధేయా: పుణ్యే బృందావనే వనే

వివాహం కారయామాస విధినా బగళాం వీధిః

స్వప్నే రాధాపదాంభోజం నహిపశ్యంతీ బల్లవాః

స్వయం రాధా హరేః క్రోడే ఛాయా రాయాణమందిరే

షష్టిపర్ష సహస్రాణి తపస్తేపే పురావిధిః

రాధికా చరణాంభోజదర్శనార్టీ చ పుష్కరే

భారావతరణేభ్భూమే: భారతే నందగోకులే

దదర్శ తత్పదాంభోజం తపసస్తత్ఫలేవ చ

రాధాదేవికి పదునాలుగు సంవత్సరములు గడపగా శ్రీకృష్ణుడు కంసభయమను వ్యాజముతో గోకులమునకు విచ్చేపెను. కృష్ణునకు యశోద తల్లి కాగా రాయాణుడు ఆమెకు గోకులమున సోదరుడుగానుండెమ, రాయాణుడు గోలోకమున శ్రీకృష్ణాంశ కల గోపుడు కాగా భూలోకమున యశోదా సంబంధము వలన శ్రీకృష్ణునకు మేనమామ యయ్యెను.

గోపకులు స్వప్నమున సైతము రాధాదేవి పాదపద్మములను దర్శించుకొనలేరు. బ్రహ్మదేవుడు ఆరవైవేల సంవత్సరములు ఆ దేవీ పదపద్మముల చూడవలెనని తపస్సు చేసెను. ఆతని తపః ఫలితముగా శ్రీకృష్ణుడు భూభారమును పాపుటకై భూమిపై ఆవతరించినప్పుడు రాధాదేవీయొక్క పాదపద్మములను చూడగలెను.

రాధాదేవి రాయణుని దగ్గర ఛాయారూపిగా శ్రీకృష్ణుని వక్షస్థలమున స్వయముగా నుండినది.

కించిత్కాలం స వై కృష్ణ పుణ్యే బృందావనే వనే

రేమే గోలోకనాథశ్చ రాధయా సహా భారతే

తతః సుదామ శాపేన విచ్ఛేదశ్చ బభూవ హ

తత్ర భారావతరణం భూమేః కృష్ణశ్చకార సః

శతాబ్దే సమతీతే తు తీర్థయాత్రా ప్రసంగతః

 దదర్శ కృష్ణం సా రాధా సచ తాం చ పరస్పరం

తతో జగామ గోలోకం రాధయా సహతత్వవిత్

కళావతీ యశోదా చ పర్యగార్రాధయా సహా

వృషభానుశ్చ నందశ్చ యయా గోలోకముత్తమం

సర్వే గోపాశ్చ గోప్యశ్చ యయుస్తా; యాః సమాగతాః

ఛాయా గోపాశ్చ గోప్యశ్చ ప్రావుర్ముక్తిం చ సన్నిధౌ

రేమిరే తాశ్చ తత్రైవ సార్థం కృష్ణేన పార్వతి

గోలోకవాథుడగు శ్రీకృష్ణుడు భారతఖండమందలి బృందావనమున రాధాదేవితో కొంతకాలము గడి పెను. కాని సుదామునియొక్క శాపముననుసరించి తరువాత వీరిద్దరిమధ్య వియోగము కల్గినది.

శ్రీకృష్ణుడు భూమియొక్క భారమును తగ్గించునపుడు నూరుసంవత్సరములు గడచిన తరువాత అతడు తీర్థయాత్రలు చేయుచున్నప్పుడు రాధాదేవి శ్రీకృష్ణులు పరస్పరము చూచుకొనిరి.

తరువాత శ్రీకృష్ణుడు , రాధాదేవితో కలసి గోలోకమునకు వెళ్ళను, కళావతి, యశోదలిద్దరు రాధాదేవితో గోలోకమును చేరిరి. అట్లే వృషభానుడు, నందుడు గోలోకమునకు వెళ్ళిరి. వారివెంట గోపికలు గోపాలురందరు గోలోకమును చేరుకొనిరి. ఆ గోలోకమున గోపాలురు గోపికలందరు కృష్ణునితో కలిసి రమించసాగిరి.

షట్త్రింశత్ లక్ష కోట్యశ్చ గోప్యోగోపాశ్చ తత్సమాః

గోలోకం ప్రయయుర్ముక్తా: సార్థం కృష్ణేన రాధయా

ద్రోణః ప్రజాపతీర్నందో యశోదా తత్ప్రియా ధరా

 సంప్రాప పూర్వతపసా పరమాత్మానమీశ్వరం

వసుదేవః కశ్యపశ్చ దేవకీ చాదితిః పతీ

దేవమాతా దేవపితా ప్రతీకల్పే స్వభావతః

పితృణాం మానసీకన్యా రాధామాతా కళావతీ

వసుదామాపి గోలోకాల్ వృషభామ: సమా యయౌ

శ్రీకృష్ణునితో, రాధాదేవితో సమానులైన ముప్ఫైఆరు లక్షలకోట్ల గోపకులు, గోపికాసీలు, రాధాశ్రీకృష్ణులతో కలసి గోలోకమునకు వెళ్ళిరి.

విందుడు ద్రోణుడను ప్రజాపతీ, నందుని భార్యయగు యశోద భూదేవి. వీరు తాము పూర్వము చేసికొన్న తపస్సువలన శ్రీకృష్ణ పరమాత్మను పుత్రునిగా పొందిరి, అట్లే వసుదేవుడు కశ్యప ప్రజాపతి కాగా దేవకీదేవీ అదీతీదేవి. వీరిద్దరు ప్రతీకల్పమున పరమాత్మకు తలిదండ్రులుగా ఉందురు. భూలోకమున రాధాదేవికి తల్లియైన కళావతి పూర్వము పితృదేవతలయొక్క మానసీకన్య ఇక గోలోకముననున్న వసుదాముడను గోపుడు భూలోకమున వృషభానుడయ్యెను.

ఇత్యేవం కథితం దుర్గే రాధికాఖ్యాన ముత్తమం

సంపత్కరం పాపహరం పుత్రపౌత్రవివర్ధనం

శ్రీకృష్ణశ్చ ద్విధారూపో ద్విభుజశ్చ చతుర్భుజః

చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజః స్వయం

చతుర్భుజస్య పత్నీ చ మహాలక్ష్మీః సరస్వతి

గంగా చ తులసీ చైవ దేవ్యో నారాయణ ప్రియాః

శ్రీకృష్ణపత్నీ సారాధా తదర్ధాంగ సముద్భవా

తేజసా వయాసా సాధ్వీ రూపేణ చ గుణేన చ

అదో రాధాం సముచ్చార్య పశ్చాత్కృష్ణం వదేత్ బుధః

వ్యతిక్రమే బ్రహ్మహత్యాం లభతే నాత్ర సంశయః

ఓ పార్వతీ! ఈ విధముగా నీకు సంపదలను కలిగించునదీ పాపముల నశింపజేయునది సంతతిని పెంచునదియగు రాధికా ఉపాఖ్యానమును తెలిపితిని..

శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడుగా, చతుర్భుజుడుగా రెండురూపాలతో నున్నాడు. ద్విభుజుడు శ్రీకృష్ణపరమాత్మయే, అతడు గోలోకముననుండును. ఇక చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠముననుండును.

చతుర్భుజుడగు శ్రీహరికి మహాలక్ష్మి, సరస్వతి, గంగ, తులసి ఆను నలుగురు భార్యలు. శ్రీకృష్ణుని వామపార్వమునుండి ఆవిర్భవించినది తేజస్పున, యశస్సు, గుణమున, రూపమున అతనితో సమానురాలైన రాధాదేవి మాత్రమే.

విజ్ఞుడు తొలుత రాధాదేవి నామమునుచ్చరించి శ్రీకృష్ణనామమును ఉచ్చరింపవలెను. అట్లుకాక తొలుత శ్రీకృష్ణనామమునుచ్చరించి రాధాదేవి పేరునుచ్చరించినచో బ్రహ్మహత్యాపాపము లభించును.

కార్తీక పూర్ణిమాయాం చ గోలోకే రాసమండలే

చకార పూజాం రాధాయాస్తత్సంబంధి మహోత్సవం

 సద్రత్నఘటికాయాశ్చ కృత్వా తత్కవచం హరి:

దధార కంఠే బాహౌ చ దక్షిణే సహ గోపకైః

 కృత్వా ధ్యాసం చ భక్త్వా చ సోలమేతచ్చకార సః

రాధాచర్వీత తాంబూలం చఖాద మధుసూదనః

 రాధా పూజ్యా చ కృష్ణస్య తత్పూజ్యో భగవాన్ ప్రభుః

 పరస్పరాభీష్టదేవే భేదకృన్నరకం వ్రజేత్

ద్వితీయే పూజితా సా చ ధర్మేణ బ్రహ్మణా మయా

అనంత వాసుకిభ్యాం చ రవిణా శశినా పరా

మహేంద్రేణ చ రుద్రైశ్చ మనునా మానవేన చ

సురేంద్రైశ్చ మువీంద్రైశ్చ సర్వవిశ్చ పూజితా

తృతియే పూజితా సా చ సప్తద్వీపేశ్వరేణ చ

భారతే చ సుయజ్ఞేన పుత్రైర్మిత్రైద్ముదాని

బ్రహ్మణేనాభిశప్తేన దైవదో షేణ భూభృతా

 వ్యాధిగ్రస్తేన హస్తేన దుఃఖినా చ విదూయతా

సంప్రాప్య రాజ్యం భ్రష్టశ్రీః స చ రాధావరేణ చ

స్తోత్రేణ బ్రహ్మదత్తైన స్తుత్వా చ పరమేశ్వరీం

ఆభేద్యం కవచం తస్యాః కంఠే బాహౌ దధార సః

ధ్యాత్వా చకార పూజాం చ పుష్కరే శతవత్పరాన్

ఆంతే జగామ గోలోకం రత్నయానేన భూమిప:

శ్రీకృష్ణుడు గోలోకమునందలి రాసమండలమున ఒకనాటి కార్తిక పూర్ణిమనాడు రాధాదేవిని పూజించి దానిని మహోత్సవముగా జరిపించేను. రాధాదేవి కవచమును రత్నగుళికలోనుంచి దానిని తన కంఠమున, కుడిభుజమున తాను స్వయముగా ధరించుటమాత్రమే కాక అనుచరులగు గోపకులు కూడ ధరించునట్లు చేసెను. రాధాదేవిని ధ్యానించి ఆమె స్తోత్రమును తాను పఠించెను.

రాధాదేవియన్న శ్రీకృష్ణునకు ఎనలేని గౌరవము కలదు. అట్లే శ్రీకృష్ణునిపై రాధాదేవికి అమితమైన గౌరవము కలదు. ఒకరికొకరు ఇష్టదేవతలు. ఇట్టి రాధాకృష్ణులమధ్య భేదభావమునెరుపువాడు నరకమునకు పోవును.

రాధాదేవిని మొదలు శ్రీకృష్ణపరమాత్మయే పూజించగా తరువాత నేను, బ్రహ్మదేవుడు, ధర్మదేవత, అనంతుడు, వాసుకి, చంద్రసూర్యులు, మహేంద్రుడు, రుద్రులు, మనువు, మానవులు, దేవతలు, మునీంద్రులు ఈవిధముగా అందరు పూజించిరి. ఆ తర్వాత భారతఖండమున సప్తద్వీపములకు ప్రభువైన సుయజ్ఞడు పుత్రులతో, మిత్రులతో కలసి ఆ దేవిని పూజించెను. ఆ రోజు దైవమునకు ఆపచారముచేసి బ్రాహ్మణునిచే శపింపబడెను. అందువలన అతని చేయి వ్యాధిగ్రస్తమైనది. అందువలన ఆతడు దు:ఖముతో రాజ్యభ్రష్టుడయ్యెను. అప్పుడతనికి బ్రహ్మదేవుడు చెప్పిన స్తోత్రముచే రాధాదేవిని స్తుతించి, రాధారుడగు శ్రీకృష్ణుని అనుగ్రహమువలన తిరిగి రాజ్యమును పొందెను. తరువాత ఆ దేవియొక్క కవచమును కంఠమున, బాహువున కట్టుకొని పుష్కర క్షేత్రమున నూరు సంవత్సరములు ఆ దేవిని పూజించెను. చివరి కారాజు రత్న విమానమునెక్కి గోలోకమును చేరుకొనెను.

ఇతి తే కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి

ఈవిధముగా రాధాదేవిచరిత్రను నీకు చెప్పితిని. పార్వతీ! ఇంకను వీపు వినవలసినదేమైన ఉన్నచో ఆడుగుము. ఆని అనెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే వారదనారాయణ సంవాదాంతర్గత పోరగౌరీపంవాదే రాధోపాఖ్యానే రాధాయా: సుదామశాపాది కథనం నామ ఏకోన పంచాత్తమోఽధ్యాయః

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీ శంకరుల సంవాదమున తెల్పబడిన రాధాదేవి చరిత్రలో సుదామునకు ఇచ్చిన శాపవృత్తాంతము గల వలభై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.