బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

18 - శంకర శంఖచూడుల సంభాషణ

నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు నారదునితో అనెను-

శ్రీకృష్ణం మనసా ధ్యాత్వా రాజా కృష్ణపరాయణః

బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ పుష్పతల్ఫాన్మనోహరాత్

రాత్రివాసః పరిత్యజ్య స్నాత్నా మంగళవారణా

ధౌతే చ వాపపీ ధృత్వా కృత్వా తిలకముజ్వలం

చకారాహ్నికమావశ్యం అభీష్ట గురువందనం

దధ్యాజ్యం మధు లోయాంశ్చ పోఽ పశ్యద్వస్తుమంగళం

 రత్న శ్రేష్ఠం మణిశ్రేష్ఠo వస్త్ర శ్రేష్ఠం చ కాంచనం

బ్రాహ్మణేభ్యో దదే క్యా యథా నిత్యం చ నారద

అమూల్యరత్నం యత్కించిన్ము క్తా మాణిక్య హీరకం

దదౌ విప్రాయ గురవే యాత్రా మంగళహేతవే

గజరత్నం చాశ్వరత్నం ధనురత్నం మనోహరం

దదౌ సర్వం దరిద్రాయ ప్రార్థం మంగళాయ చ

కోశాగార సహస్రంచ నగరాణాం త్రి లక్షకం

గ్రామా నాం శతకోటించ బ్రాహ్మణేభ్యో దదౌ ముదా

పుత్రం కృత్వా చ రాజేంద్రం సుచంద్రం దానవేషు చ

 పుత్రే సమర్వ్యా భార్యాం చ రాజ్యం వై సర్వ సంపదం

ప్రజామచరసంఘం చ కోసం వాహనాదికం

స్వయం సన్నాహాయుక్తశ్చ ధనుష్పాణిర్బభూవ హ

 భృత్యద్వారా క్రమేణేన స చక్రే సైన్య సంచయం

ఆళ్వానాం చ త్రిలక్షేణ పంచలక్షిణ హస్తీనాం

రథావామయునైవ ధానుష్కాణాం త్రికోటిభిః

త్రికోటిభిశ్చర్మిణాం చ శూలీనాం చ త్రికోటిభిః

కృతా సేనాఽపరిమితా దానవేంద్రోణ నారద

యస్యాం సేనాపతిశ్చైవ యుద్ధ శాస్త్ర విశారదః

మహారథః స విజ్జీయో రథినాం ప్రవరో రణే

త్రిలక్షాక్షౌహిణీ సేనాసలీం కృత్వా నరాధిపః

త్రింశదక్షౌహిణీ వాద్యభాండౌఘం చ చకార సః

బహిర్బభూవ శిబిరాన్మనసా శ్రీహరిం స్మరన్

రత్నేంద్ర సార ఖచితం విమానం హ్యారురోహ సః

గురువర్గాన్ పురస్కృత్య ప్రయణా శంకరాంతికం

పుష్పభద్రానదీతీరే యత్రాక్షయవట: శుభ:

సిద్దాశ్రమం చ సిద్దావారి పిద్దిక్షేత్రం చ నామతః

కపిలప్య తపః స్థానం పుణ్యక్షేత్రం చ భారత

 పశ్చిమోదధివూర్వే చ మలయస్య చ పశ్చిమే

శ్రీశైలోత్తర భాగేచ గంధమాదన దక్షిణే

పంచయోజన విస్తీర్ణా దైర్ఘ్యే శతగుణా తథా

శాశ్వతీ జలపూర్ణా చ పుష్పభద్రానదీ శుభా

లవణోదప్రియా భార్యా శశ్వత్సౌభాగ్య సంయుతా

శుద్ధ స్ఫటిక సంకాశా భారతే చ సుపుణ్యదా

శరావతి మిశ్రితా చ నీర్గతా సా హిమాలయాత్

గోమంతం వామతః కృత్వా ప్రవిష్టా పశ్చిమోదదౌ

రాజగు శంఖచూడుడు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించుకొని, బ్రాహ్మీముహూర్తమున పుష్పశయ్యనుండి లేచి, రాత్రి ధరించిన ప్రములమ వదిలివేసి, మంగళస్నానమును చేసి, ఉతికిన వస్త్రములు ధరించి, ముఖమున తిలకమును పెట్టుకొనెను. ఆతరువాత. ఆహ్నిక కృత్యములన్నియు తీర్చుకొని పెరుగు, నేయి తేనె మొదలగు మంగళవస్తు దర్శనము చేసెను. అటుపిమ్మట ప్రతిదినము చేయునట్లుగానే " మణిని, రత్నమును, వస్త్రమును బ్రాహ్మణులకు దానముచేసి యాత్రయందు మంగళము జరుగునట్లు రత్నమాణిక్యములను గురువువకు దానము చేసెను. అట్లే మంచి ఏనుగును, గుజమును, ఆవును దరిద్రుడైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ తరువాత పుత్రుడగు నుచంద్రునకు రాజ్యభిషేకము చేసి అతనికి తన భార్యయగు తులసిని రాజ్యమును, అనుచరులను, కోశమును అప్పగించి యుద్ధమునకు బయలుదేరిను. అతని వెంట మూడులక్షల గుజములు, ఐదులక్షల ఏమగులు, పదివేల రథములు మూడుకోట్ల ధమర్ధరులు మూడుకోట్ల ఖడ్గధారులు, మూడుకోట్ల శూలాయుధ ధరులు బయలుదేరిరి.

యుద్ధశాస్త్ర విశారదుడు రథికులలో శ్రేష్టుడైన సేనాధిపతిని మహారథుడందురు. శంఖచూడుడు మూడులక్షల అక్షౌహిణుల సేవకు సేవాధిపతీని నియమీంచీ ముపై అక్షోహిణుల పేన వాద్యములో శిబిరమునుండి యుద్ధమునకై బయలుదేరెను. అతని ముందు గురువుల సమూహముండెను. శంఖచూడుడు పరమేశ్వరుడు నివసించియున్న పుష్పభద్రానదీతీరమందలి అక్షయ వట ప్రాంతమునకు బయలుదేరెను. ఆ ప్రాంతము సిద్దులకు సిద్దిక్షేత్రము. పిద్దామమను పేర ప్రసిద్ధిగాంచినది. ఆ పుణ్యక్షేత్రమున కపిలమహర్షి తపమాచరించెను. ఆ క్షేత్రము పశ్చిమ సముద్రమునకు తూర్పు, మలయ పర్వతమువకు పడమరదిశలో, శ్రీశైలమునకు ఉత్తర దిశలో గంధమాదన పర్వతమునకు దక్షిణమున నున్నది. పుష్పభద్రానది ఐదు యోజనములు విస్తరించి ఐదువందల యోజనముల పొడవై యున్నది. ఆ నదిలో ఎల్లప్పుడు నీరు నిండుగానుండును. ఆ వది వీత్యము సముద్రునితో సంగమించుటవలన సముద్రునకు ప్రియమైన భార్య యగుచున్నది శరావతీనది, గోమతీనదులలో కలిపి పశ్చిమ సముద్రమున ఆ నది కలియుచున్నది అని నారాయణుడు నారదునీతోననెను.

తత్ర గత్వా శంఖచూడో లులోకే చంద్రశేఖరం

వటమూలే సమాసీనం సూర్యకోటి సమప్రభం

కృత్వా యోగాసనే స్థిత్వా ముద్రాయుక్తం చ సస్మితం

శుద్ధ స్ఫటిక సంకాశం జ్వలంతం బ్రహ్మ తేజసా

త్రిశూలపట్టిశధరం వ్యాఘ్ర చర్మాంబరం వరం

తప్త కాంచన వర్ణాభం జటాజాలం చ బిభ్రతం

త్రినేత్రం పంచవక్తం చ నాగయజ్ఞోపవీతినం

మృత్యుంజయం కాలమృత్యుం విశ్వమృత్యుకరం వరం

భక్త మృత్యుహరం శాంతం గౌరీకాంతం మనోహరం

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం

ఆశుతోషం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం

విశ్వనాథం విశ్వరూపం విశ్వబీజం చ విశ్వజం

విశ్వంభరం విశ్వవరం వీశ్వసంహార కారణం

కారణం కారణానాం చ నరకార్ణవ తారణం

జ్ఞాన ప్రదం జ్ఞానబీజం జ్ఞానానందం సనాతనం

ఆవరుహ్య విమానాచ్చ స దృష్ట్వా దానవేశ్వరః

సర్వై: సార్థం భక్తియుతః శిరసా ప్రణనామ సః

వామతో భద్రకాళీం చ స్కందం తత్పురతః స్థితం

ఆశిషం చ దుస్తస్మై కాళిస్కందశ్చ శంకరః

ఉత్తస్థు: దానవం దృష్ట్యా సర్వే నందీశ్వరాదయ:

పరస్పరం చ సంభాషాం తే చక్రుస్తత్ర సాంప్రతం

రాజా కృత్వా చ సంభాషామువాస శివ సన్నిధౌ

ప్రసన్నాత్మా మహాదేవో భగవాం స్తమువాచ హ

శంఖచూడుడు రత్నవిమానమున వెళ్ళి పుష్పభద్రానదీ తీరమున వటవృక్షము కిందనున్న పరమశివుని చూచెను. అతడు సూర్యకోటి సమప్రభుడు. యోగాసనమున చిన్ముద్రలో నున్నవాడు. ఆ పరమశివుడు త్రిశూలమును, పట్టిశమము, పులి తోలుమ ధరించినవాడు. బంగారు మేనిపోడు. జటాజూటదారీ త్రినేత్రుడు మృత్యుంజయుడు, జ్ఞానదాత.

శంఖచూడుడు తన ఏమానమునుండి దిగి పరమేశ్వరునకు భక్తితో నమస్కరించెను. అట్లే శంకరుని ఎడమప్రక్కనున్న భద్రకాళికి ముందున్న కుమారస్వామికి భక్తితో, నమస్కరించెను. శంఖచూడుని నమస్కారములనందుకొన్న కాళి. స్కందుడు శంకరుడు అతనికి ఆశీస్సులనొసగిరి.

పరమేశ్వరుని దగ్గరనున్న గణమంతయు శంఖచూడుని చూడగనే నిలబడిరి. ఆ తర్వాత వారు పరస్పరము పంభాషణములు గావించుకొనిరి. సంభాషణానంతరము తన సమీపమున కూర్చున్న శంఖచూడునితో పరమేశ్వరుడిట్లు మాట్లాడెను.

శ్రీమహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లు శంఖచూడునితో అనెను-

విధాతా జగతాం బ్రహ్మా పితా ధర్మస్య ధర్మవిత్

మరీచిస్తస్య పుత్రశ్చ వైష్ణవశ్చాఽపి ధార్మిక:

 కశ్యపశ్చాఽపి తత్పుత్రో ధర్మీష్టశ్చ ప్రజాపతిః

దక్ష: ప్రీత్యా దదౌ తస్మై భక్త్యా కన్యా స్త్రయోదశ

తాస్వేకా చ దను: సాధ్వీ తత్సౌభాగ్యేన వర్ధితా

చత్వారింశద్దనో: పుత్రా; దానవాస్తేబిసోజ్వలాః

తేష్వేకో విప్రచిత్తీశ్చ మహాబల పరాక్రమః

తత్పుత్రా ధార్మికో దంభో విష్ణుభక్తీ జితేంద్రియః

జజాప పరమం మంత్రం పుష్కరే లక్షవత్సరం

శుక్రాచార్యం గురుం కృత్వా కృష్ణస్య పరమాత్మనః

తదా త్వాం తనయం ప్రాప పరం కృష్ణ పరాయణం

పురా త్వం పార్షదో గొపో గోష్యష్టపు ధార్మిక

ఆధునా రాధికా శాపాద్భారతే దానవేశ్వరః

ఆబ్రహ్మస్తంబ పర్యంతం భ్రమం మేనే చ వైష్ణవః

 సాలోక్య సాష్టి సారూప్య సామీప్యైక్యం హరేరపి

 దీయమానం న గృష్ణాంతి వైష్ణవాః సేవనం వినా

 బ్రహ్మత్వమమరత్వం వా తుచ్ఛం మేనే చ వైష్ణవః

ఇంద్రత్వం వా కుబేరత్వం న మేనే గణనాసు చ

కృష్ణభక్తస్య తే కిం వా దేవానాం విషయే భ్రమే

దేహి రాజ్యం చ దేవానాం మత్రీతిం కురు భూమిప

సుఖం ప్వరాణ్యే త్వం తిష్ఠ దేవాసంతు ప్వకే పదే

ఆలం భ్రాతృవిరోధేన సర్వే కశ్యపవంశజా:

యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికానిచ

జ్ఞాతి ద్రోహస్య పాపస్య కలాం నార్హంతి షోడశీం

స్వసంపదాం చ హానిం చ యది రాజేంద్ర మవ్యసే

సర్వావస్థాసు సమతా కేషాం యాతి చ సర్వదా

బ్రహ్మణశ్చ తిరోభానో లయే ప్రాకృతికే సతీ

ఆవిర్భావః పునస్తస్య ప్రభవేదీశ్వరేచ్ఛయా

జ్ఞానం బుద్ధిశ్చ తపసా స్మతిర్లోకస్య నిశ్చితం

కరోతి సృష్టిం జ్ఞానేన స్రష్ట సోఽపి క్రమేణచ

ఓ శంఖచూడుడా! లోకములను సృష్టించు బ్రహ్మదేవుడు అందరికి తండ్రివంటివాడు. అతని పుత్రుడు పరమ వైష్ణవుడైన మరీచి మహర్షి, ఆతని పుత్రుడు ధర్మిషుడైన కశ్యప ప్రజాపతి. దక్షప్రజాపతి కశ్యపునకు తన కుమార్తెలు పదముప్వురసు భక్తిలో ఇచ్చెను. ఆ దక్షప్రజాపతి పుత్రికలలో దనువు ఒక కూతురు. దనువునకు మంచీతేజస్సంపన్నులైన నలుబదిమంది పుత్రులు కలిగిరి. వారిలో మహాబలవంతుడగు విప్రచిత్తి ఒకడు. ఆతని పుత్రుడు పరమ ధార్మికుడు విష్ణుభక్తుడునైన దంభుడు. ఆతడు శుక్రాచార్యుని గురువుగా చేసికొని పుష్కరక్షేత్రమున శ్రీకృష్ణమంత్రమును లక్షసంవత్సరములు జపము చేసెను. అందువలన గొప్ప కృష్ణభక్తుడవగు నిన్ను పుత్రునిగా పొందెను.

నీవు పూర్వము శ్రీకృష్ణుని అనుచరులైన ఎనమండుగురు గోపకులలో ఒకడవు. రాధికాదేవి శాపమువలన దానవేశ్వరుడవై భారత భూమిపై నున్నావు.

విష్ణుభక్తుడు బ్రహ్మమొదలు స్తంబమువరకు అన్నియు ఆసత్యములని తలచును. అట్లే చతుర్విధమోక్షములను కూడ ఇష్టపడడు. బ్రహ్మత్వమైనను దేవత్వమైనను అతని దృష్టిలో తుచ్ఛమైనవి. ఇంద్రపదవిని. కుబేరత్వమును అసలే ఇష్టపడడు. అతనికి హరిసేవనమే శ్రేష్టమైనది.

కావున కృష్ణభక్తుడవగు నీకు దేవతల విషయము భ్రమరూపమైనది. అందువలన దేవతల రాజ్యమును వారికిచ్చివేసి సుఖముగా నీరాజ్యమున నుండుము. దేవతలు తమ రాజ్యమును తాము పాలించుకొందురు. మీరందరు కశ్యప ప్రజాపతి పుత్రులు. భాతృవిరోధము ఎవ్వరికిని కూడదు. బ్రహ్మహత్యాది పాపములు భాతృద్రోహపాతకమునకు పదునారవ వంతైన కాజాలపు, నీ సంపద కొంత నశించునని నీవు భావించినచో సమత యనునది ఎక్కడను సంభవించదు.

బ్రహ్మదేవుడు కూడ ప్రాకృతికలయ సమయమున నశించును. తరువాత భగవంతుని ఇచ్ఛవలన పునర్జన్మనెత్తుచున్నాడు. ఆతడు తపస్సుచేసి జ్ఞానమును సంపాదించుకొని క్రమముగా సృష్టిని చేయుచున్నాడు.

పరిపూర్ణతమోధర్మ: సత్య సత్యాశ్రయః సదా

సోఽపి త్రిభాగస్త్రేతా యాం ద్విభాగో ద్వాపరే స్మత:

ఏకభాగః కలే: పూర్వే తత్ప్రసశ్చ క్రమేణ చ

కళామాత్రం కలే: శేషే కుహ్యాం చంద్రకళా యథా

యాదృక్తేజో రవేర్గ్రీష్మే నరాదృక్ శీతీరే పునః

దీనే చ యాదృజ్మధ్యాహ్నే సాయం ప్రాతర్నతత్సమం

ఉదయం యాతి కాలేన బాల్యతాం చ క్రమేణ చ

ప్రకాండతాం చ తత్పశ్చాత్కాఽలేస్తం పునరేవ సః

దీనే ప్రచ్ఛన్నతాం యాతా కాలిపై దుర్దినే ఘనే

రాహుగ్రస్తే కంపితశ్చ పునరేవ ప్రసన్నతాం

పరిపూర్ణతమశ్చంద్రః పూర్ణిమాయాం చ యాదృశః

తాదృశో నభవేన్నిత్యం క్షయం యాతి దినే దినే

పునః స పుష్టతాం యాతి పరకుహ్వా దినే దినే

సంపద్యుక్త: శుక్ల పక్షే కృష్ణ మౌనశ్చ యక్ష్మణా

రాహు గ్రాస్తే దినే మ్మ్లానో దుర్దినే నిబిడే ఘనే

కాలే చంద్రో భవేత్ శుద్దో భ్రష్టశ్రీ: కాలభేదకే

 భవిష్యతి బలిశ్చంద్రో భ్రష్టశ్రీ; సుతలేఽధునా

కాలేన పృద్వీ సప్యాడ్యా సర్వాధారా వసుంధరా

కాలే జలే నిమగ్స్ పా తిరోభూతా విధe

కాలే నశ్యంతి విశ్వాని ప్రభవంత్యేవ కాలతః

చరాచరాశ్చ కాలేన నశ్యంత ప్రభవంతీ చ

ఈశ్వరస్యైవ సమతా కృష్ణస్య పరమాత్మనః

ఆహా మృత్యుంజయో యస్మా దసంఖ్యం ప్రాకృతం లయం

అదృశ్యం చాపీ పశ్యామీ వారం వారం పునః పునః

స చ ప్రకృతి రూపశ్చ స ఏవ పురుషః స్మృతః

స చార్మా సర్వజీవశ్చ వానారూపధరః పరః

కరోతి సతతం యోహి తన్నోమగుణ కీర్తనం

కాలం మృత్యుం స జయతి జన్మరోగం జురాం భయం

స్రష్టా కృతో విధిస్తేన పొతా విష్ణుః కృతో భవే

అహం కృతశ్చ సంహర్తా వయం విషణో యతః

కాలాగ్ని రుద్రం సంహారే నియుజ్య విషయే నృప

అహం కృతశ్చ సతతం తన్నామ గుణ కీర్తనం

తేన మృత్యుంజయోఽహం చ జ్ఞానేనానేన నిర్భయః

మృత్యుర్మత్తో భయాద్యాతి వైనతేయాది వోరగః

కృతయుగమున ధర్మము పరిపూర్ణముగానుండెను. త్రేతాయుగమున మూడు భాగములుండినది. ద్వాపరమున రెండు భాగములు మాత్రమే ధర్మముండినది. కలియుగమున తొలుత ఒక భాగముండి క్రమక్రమముగా క్షీణించుచుప్నది. కలియుగము యొక్క, చివరి భాగమున అమావాస్యనాడు చంద్రకళ యున్నట్లు ధర్మముండును.

సూర్యుని ప్రకాశము గ్రీష్మ ఋతువున ఉన్నట్లు శిశిరఋతువున ఉండదు. మధ్యాహ్నమున నున్నట్లు ఉదయమున సాయంకాలమున ఉండదు. మేఘములు కప్పినప్పుడు పగటిపూటనైనను సూర్యప్రకాశము ప్రచ్ఛన్నముగా నుండును. చంద్రుడు పున్నమవాడు ఎంత ప్రకాశించుచుండునో మీగిలిన దినములలో అంతగా ప్రకాశించడు. పూర్లిన తరువాత క్రమక్రమముగా క్షీణించి అమావాస్య తరువాత వృద్ధిపొందును. మేఘములు కప్పినప్పుడు రాహువు గ్రహించినపుడు అతనీ కొంత క్షీణించును.

బలి చక్రవర్తి ఇప్పుడు తన సంపదలన్నియు కోల్పోయి పాఖాళముననున్నాడు. భూమి ఒకప్పుడు సస్యశ్యామలమై కనీపించును. మరియొకప్పుడు నీటిలో మునిగిపోవును. ఈచరాచర సృష్టియంతయు పుట్టుచున్నది, నశించుచున్నది. ఆందువలన, సమతయనువది ఎచ్చటను లేదు.

నేను మృత్యుంజయుడను, ఆందువలననే అసంఖ్యాకమైన ప్రాకృతలయములు చూడగలుగుచున్నాను. పరమాత్మయే. ప్రకృతరూపుడు. అతడు సర్వజీవాత్మ, అనేక రూపములను ధరించువాడు, ఎవరు ఆ పరమాత్మ నామగుణ సంకీర్తనము ఎల్లప్పుడు చేయుచుందురో వారు కాలమును మృత్యువును జన్మ, రోగ, జరాభయమును జయింతురు. ఆ పరమాత్మయే. బ్రహ్మదేవుని సృష్టికొరకు. లోకరక్షణకై విష్ణువును, లోకసంహారమునకై నన్ను సృష్టించెను. నేను రుద్రులలో ఒకడైన కాలాన్ని రుద్రుని సంహార కార్యమున నియోగించీ ఆ పరమాత్మయొక్క నామగుణ సంకీర్తనమునెల్లప్పుడు చేయుచుందును. అందువలననే చేను మృత్యుంజయుడనైతిని. గరుత్మంతుని చూచిన సర్పము వలె నన్ను చూడగనే మృత్యువు పరుగెత్తుకొని పోపును అని శంకరుడు శంఖచూడునితో అనెను.

ఇత్యుక్త్యా స చ సర్వేశః సర్వజ్ఞః సర్వభావనః

విరరామాథ శర్వశ్చ సభామధ్యే చ నారద

రాజా తద్వచనం శ్రుత్వా ప్రశశంస పునః పునః

ఉవాచ సుందరం దేవం పరం వినయపూర్వకం

శంకరుడు ఈ విధముగా సభలో శంఖచూడునితో అనిన పిమ్మట అతడు మిక్కిలి వినయముతో పరమశివునితో ఇట్లనెను.

శంఖచూడ ఉవాచ - శంఖచూడుడిట్లు పలికెను-

త్వయా యత్కథితం సాథ సర్వం సత్యం చ నానృతం

తథాపీ కించిద్యత్సత్యం బ్రూయతాం మన్నివేదనం

జ్ఞాతీద్రోహే మహతాపం త్వయోక్తమధునా త్రయం

గృహీత్వా తస్య సర్వస్వం కుతః ప్రస్థాపితో బలి

మయా సముద్ధతం సర్వమైశ్వర్యం వీక్రమేణ చ

సుతలాచ్చ సముద్దృతం నాలం సోఽపి గదాధరః

సభ్రాతృకో హిరణ్యాక్షః కథం దేవైశ్చ హింసితః

శుంభాదయశ్చాసురావై కథం దేవైర్నిపాతితో

పురా సముద్రమథనే పీయూషం భక్షితం సురైః

క్లేశభాబోవయం తత్ర తై; సర్వఫలభాజనైః

క్రీడాభాండమిదం సర్పం కృష్ణస్య పరమాత్మనః

 యదా దదాతి యస్మై స తస్యైశ్వర్యం భవేత్తదా

దేవదానవయోర్వాదః శశ్వన్నైమిత్తకః సదా

పరాజయో జయస్తేషాం కాలేఽస్మాకం క్రమేణచ

తత్రావయోర్వీరోధే చ గమనం నిష్ఫలం తవ

సమసంబంధినోర్బంధ్వో: ఈశ్వరస్య మహాత్మనః

 జాయతే మహతీ లజ్జా స్పర్దఽస్మాభిః సహాధునా

తతోఽధికా చ సమరే కీర్తిహానీ: పరాజయే

శంఖచూడవచ: శ్రుత్వా ప్రహస్యాహ త్రిలోచనః

యథోచితం సుమధురం ఆత్యుగ్రం దానవేశ్వరం

పరమశివా! మీరు చెప్పినదంతయు సత్యమే. నేను కాదనజలను. ఐనను నా నివేదనమును కొంతమీరు కూడ వినవలెను.

జాతి ద్రోహమువల్ల గొప్ప పాపము సంభవించునని మీరు మాటిమాటికి ఆంటిరి. కాని బలిచక్రవర్తి సర్వస్వమును అపహరించి అతనిని ఎక్కడికి పంపిస్తారు. ఈ ఐశ్వర్యమంతయు నా పరాక్రమముచే సంపాదింపబడినది. దానిని కాదని ఎవ్వరందురు. హిరణ్యాక్షుని అతని తమ్ములతో సహా దేవతలేవిధముగా హింసించినది అందరకు తెలియును. శుంభనిశుంభాదీ రాక్షసులను దేవతలెట్లు చంపిలో ఆందరకు తెలియును, ఇంకను సముద్ర మథన సమయమున మేము కష్టపడగా దేవతలు అమృత రూపఫలితమును పొందినారు.

ఈప్రపంచమంతయు పరమేశ్వరునికి క్రీడా భాండమువంటిది. అతడు ఎవరికి ఎంత ఇచ్చిన అది వారికి ఆంతే చెందును. దేవదానవ యుద్ధము ఎల్లప్పుడు ఏదో ఒక నిమిత్తమున జరుగుచున్నదే. వారికి పరాజయము జయము సంభవించినవి. అట్లే మాకును జయపరాజయములు లభించినవి.

అందువలన పరనూత్మకు సమబంధువులమైన మన మధ్య జోక్యము నిష్పలమగును. ఈమాటలతోటి తగపును చూచిన నాకు చాలా సిగ్గువేయుచున్నది. ఇది యుద్ధమున జరిగినచో గొప్ప కీర్తి కలుగును. లేక ఆందు ఏరోబియమే లభించిన కీర్తి హాని సంభవించును అను శంఖచూడుని మాటలు విని త్రిలోచనుడు నవ్వి మహాభయంకరుడైన దానవేశ్వరునితో ఇట్లు పలికెను.

శ్రీమహాదేవ ఉవాచ- శ్రీ మహాదేవుడిట్లనెను –

యుష్మాభి: సహ యుద్దం మే బ్రహ్మవంశ సముద్భవైః

కా లజ్జా మహతీ రాజన్ అకీర్తిర్వా పరాజయే

యుద్ధమాదౌ హరేరేవ మధునా కైటభేన చ

హిరణ్య కశిపోశ్చైవ సహ తేనాత్మనా నృప

హిరణ్యాక్షస్య యుద్ధం చ పునస్తేన గదాభృతా

త్రిపురై: సహ యుద్ధం చ మయా చాపి పురా కృతం

సర్వైశ్వర్యాః సర్వమాతుః ప్రకృత్యాశ్చ బభూవహ

సహశుంభాదిభీః పూర్వం సమరం పరమాద్భుతం

పార్షదప్రవరస్త్వం చ కృష్ణస్య పరమాత్మనః

యేయేహతాశ్చ తే దైత్యా నహి కేఽపి త్వయా సమాః

కా లజా మహతీ రాజన్ మమ యుద్ధే త్వయా సహ

 సురాణాం శరణస్యైవ ప్రేషితస్య హరేరహో

దేహి రాజ్యం చ దేవానాం వాగ్వ్యయే కిం ప్రయోజనం

యుద్ధం మా కురు మత్సార్థమితీ మే నిశ్చితం వచ:

ఇత్యుక్త్యా శంకరస్తత్ర విరరామ చ నారద

ఉత్తస్థౌ శంఖచూడశ్చ స్వామాత్యై: సహ సత్వరః

ఓ శంఖచూడుడా! బ్రహ్మదేవుని వంశములో పుట్టిన మీతో యుద్దము చేసినచో సిగ్గుపడుటెందులకు? పరాజయము వలన చెడు పేరు వచ్చునని భయమెందులకు? మీతో తొలుత శ్రీహరియే యుద్ధమునాచరించినాడు. మధుకైటభులతో హరీణ్యకశిప, హిరణ్యాక్షులతో శ్రీహరియే యుద్ధమొనర్చినాడు.

నేను త్రిపురాసురులతో యుద్ధము చేసితిని. సర్వమాతయగు దుర్గాదేవి శుంభనిశుంభులతో పరమాద్భుతముగా యుద్దమొనరించినది.

నీవు శ్రీకృష్ణదేవుని అనుచరుడవు. ఇంతవరకు చనిపోయిన రాక్షసులందరు నీకంటే తక్కువ వారే. అందువలన నీతో యుద్దము చేసినచో నేను సిగ్గుపడవలసిన పని ఏమాత్రము లేదు, ఐనను వ్యర్థమైన మాటలు కట్టి పెట్టి నాతో యుద్ధము మాత్రమే చేయవద్దనీ నిశ్చయముగా నేను చెప్పుచున్నాను.

శంకరుని మాటలు విని లాభము లేదనుకొని శంఖచూడుడు తన అమాత్యులతో కలసి . అచ్చటినుండి లేచెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానేశివ శంఖచూడ సంవాదో నామ అష్టాదశోఽధ్యాయః

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములోని రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదములో చెప్పబడిన తులస్యుపాఖ్యానములో శివ శంఖచూడుల సంవాదమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.