బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

8 - పృథ్వీ స్తోత్రము

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

హరేర్నియేషమాత్రేణ బ్రహ్మణః పాతఏవ చ

తస్యపాతే ప్రాకృతికః ప్రళయః పరికీర్తితః

ప్రళయే ప్రాకృతే చోక్తం తత్రాఃఽదృష్టా వసుంధరా

 జలప్లుతాని విశ్వాని సర్వే లీనా హరావీతి

వసుంధరా తిరోభూతా కుత్ర వా తత్ర తిష్ఠతి

సృష్టేర్విధానసమయే సాఽవిర్భూతా కథం పునః

కథం బభూవ సా ధన్యా మాస్యో సర్వాశ్రయా జయా

తస్యాశ్చ జన్మవిస్తారం వద మంగళకారణం

శ్రీహరి యొక్క ఒక నిమేషకాలములో బ్రహ్మదేవుని ఆయుర్దాయము తీరిపోవుననీ, అప్పుడు ప్రాకృతిక ప్రళయము జరుగుననియు, ఆసమయమున భూమీ కన్పింపకపోవుననియు, సమస్త లోకములు నీటిలో మునిగిపోవునని, సమస్తజీవులు శ్రీహరిలో విలీన మగుననీ మీరింతకు పూర్వము తెలిపితిరి.

ప్రాకృతిక ప్రళయ కాలమున భూమి అంతర్ధానమై ఎక్కడ ఉండును? సృష్టిజరుగునప్పుడు మరల ఎట్లు ఆవిర్భవించును. అన్ని జీవులకు ఆశ్రయభూతమైన ఆ భూమి పూజ్యురాలెట్లయ్యెను, ఆ భూమి జన్మవృత్తాంతమెట్టిది? మొదలగు విషయములను మీరు నాకు వివరింపుడు.

 శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-

సర్వాదిసృష్టౌ సర్వేషాం జన్మ కృష్ణాదీతి శ్రుతిః !

ఆవిర్భావస్తిరోభావః సర్వేషు ప్రళయేషు చ

సృష్టి ప్రారంభ సమయమున సమస్తజీవులు శ్రీకృష్ణునినుండి పుట్టునని సమస్త ప్రళయకాలములందు శ్రీకృష్ణుని యందే ఆంతర్జానము చెందునని తీరిగి అతని నుండే ఆవిర్భవించునని వేదములు తెల్పుచున్నవి.

శ్రూయతాం వసుధాజన్మ సర్వమంగళ మంగళం

విఘ్ననిఘ్నం పరం పాపనాశనం పుణ్యవర్ధనం

ఆహో కోచిద్వదంతీత మధుకైటభమేదసా

 బభూవ వసుధా ధన్యా తద్విరుద్ధమతం శ్రుణు

ఊచతుర్తి పురా విష్ణుం తుష్టా యుద్దేన తేజసా

ఆవాం జహి న యత్రోర్వీ పయసా సంవతేతీ చ

తయోర్జీవన కాలేన ప్రత్యక్షా చ భవేత్ స్ఫుటం

తతో బభూవ మేదశ్చ మరణానంతరం తయోః

మేదినీతి చ విఖ్యాతా ఇత్యుక్తాయైస్తన్మతం శ్రుణు

జలధౌతా కృశాపూర్వం వర్ధిలా మేదసా యతః

అందరకు మంగళముల నిచ్చునది విఘ్నముల పోగొట్టునదీ, పుణ్యమును కలిగించునది ఐన భూమి జన్మవృత్తాంతమును వినుము.

కొందరు ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మెదళ్ళవలన ఏర్పడినదందురు. మధుకైటభుల విష్ణుమూర్తితో యుద్ధము చేయునప్పుడు విష్ణువు యొక్క తేజస్సునకు సంతోషపడి వారు విష్ణువుతో ఇట్లనీరి, మమ్ము నీరు కన్పించని స్థలమున చంపుమని కోరుకొనిరి. అట్లే శ్రీహరి వారినీ చంపగా వారి మేదస్సు దానిపై బడుటవలన భూమి మేదినీ యను పేర ఖ్యాతి నందినది. అనగా ప్రళయ కాలమున నీటిలో మునిగి యున్న భూమి వారు బ్రతికి యుండగనే నీటినుండి పైకి వచ్చినందువలన స్పష్టముగా కన్పించినది. అట్లే వారి మరణానంతరము మధుకైటభుల మేదస్సువలన పెరిగి స్పష్టముగా కన్పించినదని ఆందురు.

కథయామీ చ తజ్జన్మ సార్థకం సర్వసమ్మతం

పురాశ్రుతం చ శ్రుత్యుక్తం ధర్మవక్రాచ్చ పుష్కరే

మహావిరాట్ శరీరస్య జలస్థస్య చిరం స్ఫుటం

మలో బభూవ కాలేన సర్వాంగ వ్యాపకో ధ్రువం

స చ ప్రవిష్ట సర్వేషాం తల్లోమ్నాం ఏవరేషుచ

కాలేన మహతా తస్మాద్బభూవ వసుధా మునే

ప్రత్యేకo ప్రతిలోమ్నాం చ  కూపేషు్స్థి తి థిరా

ఆవిర్భూతా తిరోభూతా సా చలా చ పునః పునః

ఆవిర్భూతా సృష్టికాలే తజ్జలాత్పర్యుపస్థితా

 ప్రళయే చ తిరోభూతా బలాభ్యంతరవస్థితా

కానీ ధర్ముని వలన పుష్కర క్షేత్రమున భూమి పుట్టుక గురించి విని యుంటిని, ఆది పేదప్రోక్తము సమస్త జన సమ్మతమైనది. ఆ విషయమేమనగా నీటిలో నున్న మహావిరాట్పురుషుని శరీరమున ఏర్పడిన మలము కాలక్రమముగా సమస్త శరీరమున వ్యాపించినది. ఆమలము. మహావీరాట్పురుషుని ప్రతీ రోమ కూపమున నిండిపోయినది. అది మరల మరల ఆవిర్భవించినది. తిరోధానము చెందినది. ఆ మలమే భూమిగా ఏర్పడినది. సృష్టికాలమున జలమునుండి పైకి వచ్చినందువలన ఆవిర్భవించిన దని, ప్రళయకాలమున జలమునందు మునిగియున్నందువలన అంతర్ధానము చెందినదని చెప్పబడినది.

ప్రతి విశ్వేషు వసుధా శైలకానన సంయుతా

సప్త సాగర సంయుక్తా సప్తద్వీపమితా సతీ

హిమాద్రిమేరు సంయుక్తా గ్రహచంద్రార్క సంయుతా

బ్రహ్మవిష్ణు శ్రీవాద్యైశ్చ సురైః లోకైస్తథా నుతా

పుణ్య తీర్థసమాయుక్తా పుణ్యభారత సంయుతా

కాంచనీ భూమీ సంయుక్తా సర్వదుర్గసమన్వితా

పాతాలాః సప్త తదధః తదూర్ద్వే బ్రహ్మలోకకః

ధ్రువలోకశ్చ తథైవ సర్వం వీశ్వం చ తత్రవై

 ఏవం సర్వాణి విశ్వాని పృథివ్యాం నిర్మితానివై

ఊర్ద్వం గోలోకవైకుంఠౌ నిత్యా విశ్వపరౌ చ తా

 నశ్వరాణి చ విశ్వాని కృత్రిమాకృత్రిమాణి చ

ప్రళయే ప్రాకృతే బ్రహ్మన్ బ్రహ్మణశ్చ నిపాతనే

మహావిరాడాదిసృష్టి సృష్టు కృష్ణేన చాత్మనా

 నిత్య: స్థిత: స ప్రళయే కాష్ఠాకాళేశ్వరై: సహ

 క్షత్యధిష్ఠాతృ దేవీ సా వారాహీ పూజితా సురైః

మనుభీర్మునిభి: వివప్రైః గంధర్వాదిభిరేవ చ

విష్ణో: వరాహరూపస్య పత్నీ సా శ్రుతి సమ్మతా

 తత్పుత్రో మంగళో జ్ఞేయః సుయశా మంగళాత్మజః

ప్రతిలోకమున భూమి కలదు. ఆభూమీయందు పర్వతములు ఆడవులు, సప్తసముద్రములు, సప్తద్వీపములు హిమాలయము, మేరువువంటి పర్వతములు కలవు. అట్లే అచ్చట గ్రహములు, చంద్రుడు. సూర్యుడు, బ్రహ్మవిష్ణు శివాది దేవతలుందురు. అనేక పుణ్యతీర్ణములు పుణ్యభూమియైన భారతదేశము, అచ్చట ఉన్నవి. ఆ భూమీ క్రింద సప్త పాతాళములు పైన బ్రహ్మలోకము, ధ్రువలోకము ఆ పైన శ్వతమైన గోలోక వైకుంఠలోకములుండును. ఈలోకములన్నియు సహజమైనవీ ఆసహజమైనవి కూడ. ప్రాకృత ప్రళయమున బ్రహ్మదేవుని ఆయుస్సు ముగియగనే అసహజమైన లోకములు నశించును.

సృష్టి ప్రారంభకాలమున శ్రీకృష్ణునిచే మహావిరాట్పురుషుడు సృష్టించబడును. వారాహీ దేవత భూమికి అధిష్టాన దేవత. ఆమె దేవతలు గంధర్వులు మానవులందరిచే పూజలనందుకొనుచున్నది. వారాహీదేవీ వరాహరూపమున నున్న విష్ణుమూర్తి యొక్క భార్య. వారి పుత్రుడే మంగళుడను కుజుడు. అతని కొడుకు సుయశుడు.

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

పూజీతా కేన రూపేణ వారాహీ చ సురైర్మహీ

వరాహేణ చవారాహీ సర్యై: సర్వాశ్రయా సతీ

తస్యా పూజా విధానం చాప్యధశోద్ధరణ క్రమం

మంగళం మంగళస్యాఽపి జన్మవ్యాసం వద ప్రభో

సమస్త జీవులకు ఆశ్రయమైన ఈ భూమిని ఏరూపముతో ఆందరు పూజించినారు. ఆ పృథివియొక్క పూజావిధానమును ఉద్ధరణ క్రమమును వివరముగా తెలుపుడు. ఆట్లే కుజుని యొక్క జన్మ ప్రకారమును కూడ వివరించుడని నారదుడు వేడుకొనెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

వారాహే చ వరాహశ్చ బ్రహ్మణా సంస్తుతః పురా

ఉద్దధార మహీం హత్వ హిరణ్యాక్షం రసాత లాత్

జలే తాం స్టాపయామాస పద్మపత్రం యథార్ణవే

తత్రైవ నిర్మమే బ్రహ్మా సర్వం విశ్వం మనోహరం

దృష్ట్యా తదధిదేవీం చ సకామాం కాముకో హరీః

వరాహరూప్ భగవాన్ కోటి సూర్యసమప్రభః

 కృత్వా రతీకరీం శయ్యాం మూర్తిం చ సుమనోహరాం

క్రీడాం చకార రహసి దివ్యవర్షమహర్నిశం

సుఖ సంభోగ సంస్పర్శాత్ మూర్చోం సంప్రాప సుందరీ

వీదగ్ధా విదగ్ధేన సంగమోఽపి సుఖప్రదః

 విష్ణుస్తదంగ సంస్పర్శాత్ బుబుధే న దీవానీశం

వర్షాంతే చేతనాం ప్రాప్య కామీ తత్యాజ కాముకీం

దధార పూర్వ రూపం హి వారాహం చైవ లీలయా

 పూజాం చకార భక్త్యా చ ధ్యాత్యా చ ధరణీం సతీం

ధూ ఫైర్ది పైశ్చ నైవేద్యైః సిందూరై రనులేపనైః

వస్త్రై: పుష్పైశ్చ బలీభిః సంపూజ్యోవాచ తాం హరిః

బ్రహ్మదేవునిచే నుతులు గొన్న ఆదివరాహస్వామి హిరణ్యాక్షుని చంపి భూమిని పాతాళమునుండి ఫైకెత్తెను. అతడు భూమిని సముద్రపు నీటిపై. పద్మపత్రమువలె నుంచెను. నీటినుండి పైకి వచ్చిన భూమిపై బ్రహ్మ దేవుడు జీవులనన్నిటినీ సృష్టించెను.

భూమికి అధిదేవతయైన. వారాహీ దేవియొక్క మనసు నెరిగిన 'ఆదీవరాహామూర్తీ దివ్య వర్షకాలము రాత్రింబగళ్ళు ఆమెతో క్రీడింపసాగెను. వారాహీదేవియొక్క ఆంగస్పర్శవలన వరాహమూర్తి మైమరచి పోయెను. దీవ్యవర్షము తరువాత సుహలోనికి వచ్చిన ఆ స్వామి భూమిని గొప్పగా పూజించి ఇట్లు పలికెను.

మహావరాహ ఉవాచ- మహావరాహమూర్తి ఇట్లు పలికెమ-

సర్వాధారా భవ శుభే సర్యై: సంపూజితా శుభం

మునిభిర్మనుభిర్ధేవై: సిద్దెర్వా మానవాదిభిః

జలోచ్చ్వాసాత్ బలత్యాగ గృహారంభ ప్రవేశమే

వాపీతడాగారంభే చ శుభే చ కృషి కర్మణి

తన పూజాం కరిష్యంతి సంభ్రమేణ సురాదయః

మూడా యే న కరిష్యంతి యాస్యంతి నరకం చ తే

మంగళమూర్తియైన ఓ భూదేవీ! నీవు జీవులందరకు ఆధారముకమ్ము, నీన్ను దేవ గంధర్వ మానవులందరు ఎల్లప్పుడు గౌరవింతురు. గృహారంభసమయమున, గృహప్రవేశసమయమున బావులు, చెరువుల త్రవ్వునపుడు, వ్యవసాయము చేయు సమయమున దేవతలు మొదలైనవారందరు నీ పూజను. తప్పక చేయుదురు. పై కర్మలలో నీ పూజను చేయనీవారు నరకమునకు తప్పక పోవుదురు.

వసుధోవాచ- భూదేవి ఇట్లు పలికెను-

వహామి సర్వం వారాహరూపేణాఽహం తవాజ్ఞయా

లీలామాత్రేణ భగవన్ విశ్వం చ సచరాచరం

ముక్తాం శుక్తిం హరేరర్చాం శివలింగం శీలాం తథా

 శంఖం ప్రదీపం రత్నం చ మాణిక్యం హీరకం మణం

 యజ్ఞసూత్రం చ పుష్పం చ పుస్తకం తులసీదళం

జపమాలాం పుష్పమాలాం కర్పూరం చ సువర్ణకం

 గోరోచనం చందనం చ శాలగ్రామజలం తథా

ఏతాన్వోడు మశక్తాఽహం క్లిష్ట చ భగవన్ శ్రుణు

భగవన్ నీయొక్క ఆజ్ఞననుసరించి చరాచర విత్వమును అవలీలగా మోయగలను. కానీ ముత్యమును, ముత్యపుచిప్పను. శివలింగమును, శాలగ్రామళీలను, శంఖమును, దీపమును, రత్నమును, మాణిక్యముమ, యజ్ఞ సూత్రమును, పుష్పముమ, పుస్తకమును, తులసీదళమును, జపమాలను, పుష్పమాలను, కర్పూరమును, బంగారమును, గోరోచనముమ, చందనమును, సాలగ్రామజలమును మాత్రము ఏమాత్రము మోయలేను. అనగా వీటిని భూమిపై పరాసరి పెట్టకుండ ఏ ఆకో, ఏ పీటనో వేసి వాటిపై పెట్టవలెను.

శ్రీ భగవానువాచ- భగవంతుడైన నారాయణుడిట్లనెను-

ద్రవ్యాణ్యేతాని యే మూడా ఆర్పయిష్యంతి సుందరి

యాస్యంతి తే కాలసూత్రం దివ్యం వర్షశతం త్వయి

ఇత్యేవముక్త్యా భగవాన్వీరరామ చ నారద

బభూవ తేన గర్భేణ తేజస్వీ మంగళగ్రహః

పూజాం చక్రుః పృథివ్యాశ్చ తే సర్వే చాజ్ఞయా హరేః

దధ్యు: కాణ్వోక్తమార్గేణ తుష్టువు:స్తపనేన చ

దద్యుర్మూలేన మంత్రేణ నైవేద్యాదికమేవచ

సంస్తుతా త్రిపులోకేషు పూజితా సా బభూవ హ

ఓ భూదేవీ! నీవు పేర్కొనిన ద్రవ్యములను జ్ఞానము లేక ఎవడు భూమిపై ఉంచునో వాడు మారు సంవత్సరములు నరకలోకమున నుండును అని చెప్పి ఊరకుండెను.

భూదేవి విష్ణువూర్తియొక్క తేజస్సుచే మంచి తేజస్సుగల కుజుని కన్నది. శ్రీహరియొక్క ఆజ్ఞపై దేవతలందరు భూమిని పూజించిరి. కాణ్వశాఖలో చెప్పబడిన పద్ధతి ప్రకారము ఆమెను ధ్యానించి స్తుతించిరి. అట్లే మూలమంత్రముతో నైవేద్యము మొదలగు వాటినిచ్చిరి.

ఈవిధముగా భూదేవి మూడులోకములయందు పూజనీయురాలాయెను.

నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-

 కిం ధ్యానం స్తవనం కిం వా తస్యా మూలం చ కిం వద

గూడం పర్వపురాణేషు శ్రోతుం కౌతూహలం మను

భూదేవతా ధ్యాన మేవిధముగానుండును? ప్రోత్ర పద్దతి, ఆదేవతయొక్క మూలమంత్రము మొదలగునవి పురాణములలో నీగూఢముగా నున్నవి. వాటిని తెలుసుకొనవలెనను కుతూహలము నాకు గలదు అని అడి గెను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-

ఆదౌ చ పృథివీ దేవీ వరాహేణ సుపూజితా

తతో హి బ్రాహ్మణా పశ్చాత్ తతశ్చ పృథునా పురా

తతః సర్వైః మునీంధ్రైశ్చ మనుభిరారదాదిభిః

ధ్యానం చ స్రవనం మంత్రం శ్రుణు వక్ష్యామి నారద

ఓం హ్రీం శ్రీం వాం వసుధాయై స్వాహా

ఇత్యసేన తు మంత్రేణ పూజితా విష్ణునా పురా

 శ్వేత చంపక వర్ణాభాం శతచంద్ర సమప్రభాం

చందనోత్క్షిత సర్వాంగీం సర్వభూషణ భూషితాం

రత్నాధారాం రత్నగర్భాం రత్నాకర సమన్వితాం

 వహ్ని శుద్ధాంశుకాధానాం సస్మితాం  వందితాం భజే

ధ్యాసేనానేన సా దేవీ సర్త్వేర్త్వే పూజితా భవేత్

 స్తవనం శ్రుణు విప్రేంద్ర కాణ్వశాఖోక్త మేవచ

భూదేవిని తొలుత వరాహమూర్తి పూజించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు, అతని తర్వాత పృథు చక్రవర్తి, ఆ తర్వాత దేవతలు, మునులు, మానవులు భూమిని పూజించిరి. భూదేవత మూలమంత్రము ధ్యానమంత్రము స్తోత్రము ఈ విధముగా ఉన్నవి.

"ఓం హ్రీం శ్రీం వాం వసుధాయై స్వాహా" అనునది మూలమంత్రము. తెల్లని చంపకపుష్పములవంటి శరీరము కలది, మారు చంద్రులతో సమానమైన కాంతి గలది, శరీరరమునందంతట చందనము కలది! సర్వ భూషణములను ధరించినది, రత్నములకు ఆధారమైనది, రత్నగర్భ, సముద్రములతో నున్నది, మేలిమి బంగారము వంటి వస్త్రములు ధరించునది, చిరునవ్వుతో కూడుకున్నది. ఆగు భూదేవిని నేను ధ్యానింతును. ఇది ధ్యానశ్లోకము,

ఈధ్యానశ్లోకముతో భూదేవి సమస్తజనులచే పూజింపబడినది. ఇక కాణ్వ శాఖయందు చెప్పబడిన స్తోత్రము ఈప్రకారముగా ఉన్నది.

విష్ణురువాచ- విష్ణుమూర్తి ఇట్లు పలికెను-

 యజ్ఞసూకరజాయా త్వం జయందేహి జయాప

జయేఽజయే జయధారే జయశీలే జయప్రద

సర్వాధారే సర్వబీజే సర్వశక్తి సమన్వితే

సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే స్థిరే

సర్వ సస్యాలయే సర్వ సస్యాడ్యే సర్వ సస్యదే

సర్వ సస్యహరే కాలే సర్వసస్యాత్మికే క్షిత

 మంగళే మంగళాధారే మంగళ్యే మంగళప్రదే

మంగళార్దేమంగళాం మంగళం దేహి మే పరం

భూమే భూమిపసర్వపే భూమిపాలపరాయణే

 భూమిపాహంకారరూపే భూమిం దేహి వసుంధరే

ఓ భూదేవి ! నీవు యజ్ఞవరాహమునకు భార్యవు. నీవు నాకు సర్వకార్యములందు జయము కలునట్లు చేయుము. నీవు జయ స్వరూపిణివి ఆజయ స్వరూపిణివి కూడ. నీవు జయమునిచ్చుదానవు. జయశీలవు. సమస్త చరాచరసృష్టికి ఆధారభూతురాలపు, సమస్తమునకు కారణభూతురాలవు, సర్వశక్తి సమన్వితవు. అన్నికోరికలు తీర్చుదానవు, స్థిరముగా ఉండుదానవు. సమస్త సస్యములకు నీలయమైనదానవు, సమస్త సస్యముల నిచ్చుదానవు. సమస్త సస్యములను హరించుదానవు, సర్వ సస్య స్వరూపిణివి. నీవు మంగళ స్వరూపవు. మంగళ వస్తువులకు ఆధారభూతవు. మంగళములనిచ్చు నీవు మాకు మంగళములనొసగుము. ఓ భూదేవి! నీవు రాజులకు సర్వస్వమవు, రాజుల యొక్క ఆహంకార రూపిణివి. అట్టి నీవు మాకు భూ సమృద్ధిని కలుగజేయుము.

ఇదం స్తోత్రం మహాపుణ్యం తం సంపూజ్య చ యః పఠేత్

 కోట్యంతరే జన్మని న సంభవే ధ్భూమీ పేశ్వరః

భూమీదానకృతం పుణ్యం తార సంపూజ్య చ యః పఠేత్

దత్తాపహారజాత్పాపాన్ముచ్యతే నాత్ర సంశయః

 అంబువీచీ భూమనసాతాపాన్ముచేత స ధ్రువం

అన్యకూపే కుపదజాతాపాన్ముచ్యత స ధ్రువం

పరభూశ్రాద్ధజాతాపాన్ముచ్యతే నాత్ర సంశయః

 భూమౌ వీర్యత్యాగ పాపాత్ దీపాది స్థాపనాత్తథా

 పాపేన ముచ్యతే ప్రాజ్ఞః స్తోత్రస్య పఠనాన్మునే

అశ్వమేధ శతం పుణ్యం లభతే నాత్ర సంశయః

ఆత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాసమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడ కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందువలన భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తోలగును. భూమీని త్రవ్వినచో కలుగు పాపము, దిగుడుబావులలో మైల ఉంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరుల ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య జ్యోగము చేసినందువలన, దీపాదీ ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. ఆంతేకాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే పృథివ్యుపాఖ్యానే పృథివీస్తోత్రం సామ ఆష్టమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమందున్న పృథివ్యుపాఖ్యానములో పృథివీస్తోత్రమను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.