7 - యుగములు మన్వంతరములు మొ. కాలవివరణ

సారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

 పుణ్యక్షేత్రే హాజగామ భారతే సా సరస్వతీ ।

గంగాశాపేన కళయా స్వయం తస్థౌ హరేః పదే ॥

భారతీ భారతం గత్వా బ్రాహ్మీ చ బ్రహ్మణః ప్రియా ।

వాగధిష్ఠాతృదేవీ సా తేన వాణీ చ కీర్తితా ॥

సర్వం విశ్వం పరివ్యాప్య ప్రోతస్యేవహి దృశ్యతే ।

హరి: సరస్వతస్యేఽయం తేన నామ్నా సరస్వతీ ॥

సరస్వతీ నదీ సాచి తీర్థరూపాతీపావనీ ।

పాపిపా పేద్మ దాహాయ జ్వులదగ్ని స్వరూపిణీ ॥

పశ్చాద్భగీరథానీతా మహీం భాగీరథీ శుభా ।

సమాజగామ కళయా వాణీశాపేన నారద ॥

తత్రైవ సమయేతాంచ దధార శిరసా శివః ।

వేగం సోడు మశక్తా యా భువః ప్రార్థనయా విభుః ॥

గంగాదేవి యొక్క శాపము వలన సరస్వతి వారికి స్థానము పుణ్యక్షేత్రమైన భారత భూమియందు ఆవతరించెను. భారత భూమిని పొందినందువలన భారతీయని, బ్రహ్మదేవునికి ప్రియురాలు కావున బ్రాహ్మియని, వాక్కులకు ఆధిష్టాన దేవత కావున వాణియని పిలువబడుచున్నవి.

శ్రీహరి సమస్త విశ్వమునందంతట ఉన్నప్పటికిని సముద్రమునందు శేషతల్పమున ఉన్నందువలన శ్రీహరికి సరస్వాన్" అని పేరు కలదు. అతనికి సంబంధించినది కావున

ఈమెకు “సరస్వతి" యను పేరు కలిగినది. ఆ సరస్వతీ నది అతి పవిత్రమైనది. పాపుల యొక్క పాపము లనే కట్టేలను దహించు ఆగ్నిశిఖవంటిది.

గంగాదేవి పాణీదేవియొక్క శాపమున తన అంశ స్వరూపముతో భూమిపై అవతరించినది. భగీరథుని ప్రయత్నము వలన భూమికి వచ్చినందువలన ఆమెను భాగీరథీ యని పిలుచుచున్నారు. గంగాదేవి నదీరూపమున భూమిపైకి దిగునప్పుడు ఆమే వేగముమ భూమి సహించుకొనలేక పోయినది. అందువలన పరమశివుడామెను తన శిరస్సున నిలుపుకొనెను.

పద్మాజగామ కళయా సా చ పద్మావతి నదీ ।

భారతే భారతీశాపాత్ స్వయం తస్థౌ హరేః పదే ॥

తతోఽన్యయా సా కళయా చాలభజ్జన్మ భారతే ।

ధర్మధ్వజ సుతాలక్ష్మీర్విఖ్యాతా తులసీతీ చ॥

పురా సరస్వతీ శాపాత్ తత్పశ్చాత్ హరీ శేషతః ।

బభూవ వృక్షరూపా సా కళయా విశ్వపావనీ ॥

కలే పంచ సహస్రంచ వర్షం స్థిత్వా చ భారతే ।

జగ్ముస్తాశ్చ సరిద్రూపం విహాయ శ్రీహరేః పదం ॥

లక్ష్మీదేవి ఇంకొక అంశముతో ధర్మర్వజ మహారాజు కుమార్తెగా సరస్వతీ దేవి శాపమున భారతదేశమున ఆవతరించినది. తరువాత శ్రీహరి శాపము వలన వృక్షరూపముగా మారినది.

ఈగంగా, లక్ష్మీ, సరస్వతులు భారతదేశమున కలియుగమున ఐదువేల సంవత్సరములవరకుండి తమ నదీ రూపమును వదలి శ్రీహరి పదమును చేరుకొందురు.

యాని సర్వాణి తీర్థానీ కాశీం వృందావనం వినా ।

యాస్యంత సార్థం తాభిశ్చ హరేర్త్వేకుంఠమాజ్ఞయా ॥

శాలగ్రామోహరేర్మూర్తీః: జగన్నాథశ్చ భారతం ।

కలేః దశహస్రాంతే యయౌ త్వక్త్వా హరేః పదం॥

 వైష్ణవాశ్చ పురాణాని శంఖాశ్చ శ్రాద్ధ తర్పణం ।

వేదోక్తాని చ కర్మాణి యయుస్తైః: సార్థమేవచ ॥

 హరిపూజా హరేరామ తత్కీర్తీ గుణకీర్తనం।

 వేదాంగాని చ శాస్త్రాణి యయుస్తైః: సార్థమేవచ ॥

 సత్యం చ సత్యం ధర్మశ్చ వేదాశ్చ గ్రామ్యదేవతాః ।

వ్రతం తపస్యానశనం యయుస్తైః: సార్థమేవచ ॥

కలియుగమున పదివేల సంవత్సరములు గడచిన తరువాత కాశి, బృందావనము తప్ప మిగిలిన సమస్త తీర్థములు, శ్రీహరికి మూర్తి రూపమైన శాలగ్రామము, జగన్నాథుడు, వైష్ణవులు, పురాణములు, వేదోక్తకర్మలు, హరిపూజ, హరినామ సంకీర్తనం, సత్యం, ధర్మం, వేదములు చివరకు గ్రామములలో ఉండు గ్రామ్యదేవతలు సహితము శ్రీహరి ఆజ్ఞననుసరించి వైకుంఠమునకు వెళ్ళుదురు (అనగా వీటిపై ఆదరము తగ్గును.)

వామాచారరతాః సర్వే మీథ్యేకాపట్య సంయుతా: ।

తులసీ వర్జితా పూజ భవిష్యతి తతః పరం ॥

ఏకాదశీ విహీనాశ్చ సర్వే ధర్మ వివర్జితాః ।

హరి ప్రసంగ విముఖా భవిష్యత్ తతః పరం ॥

శఠాః క్రూరా దాంభికాశ్చ మహాహంకార సంయుతా: ।

చోరాశ్చహింసకాః సర్వే భవిష్యంతి తతః పరం।

పుంసాంభేదస్తథా స్త్రీణాం వివాహో వాద నిర్ణయః ।

స్వస్వామీదో వస్తూనాం నభవిష్యత్యతః పరం ॥

సర్వే జనాః స్త్రీవశాశ్చ పుంశ్చల్యశ్చ గృహే గృహే ।

తర్జనైః భర్తృనై: శశ్వత్ స్వామీనం తాడయంతి చ ॥

గృహేశ్వరీ చ గృహిణీ గృహే భృత్యాధికోఽధమః ।

చేటీభత్యా సమావద్వః శ్వశ్రూశ్చ శ్వశురసథా ॥

కర్తారో బలినో గేహే యోని సంబంధ బాంధవాః ।

విద్యా సంబందిభిః సార్థం సంభాషాఽపి న విద్యతే ॥

యథాఽపరిచితాలోకాః తథా పుంసశ్చ బాంధవాః ।

సర్వకర్మాక్షమా: పుంసః యోషితామాజ్ఞయా వినా ॥

ఆ సమయమున శ్రీహరీపూజు తులసీపత్రములు లేకుండ . జరుగును. అప్పుడు ప్రజలందరు అబద్ధములాడుచు కపటములో వామాచార పరాయణులై యుందురు. ఏకోదశీవ్రతములు లోపించును. ప్రజలందరు ధర్మదూరులై శ్రీహరి గుణ కీర్తమునకు విముఖులగుదురు, క్రూరులు, డాంబికులు, మహాహంకార యుతులు, చోరులు, హింసించువారై యుందురు. స్త్రీ పురుష భేదము కాని స్వామి, భృత్యభేదము కాని కనిపింపదు.

స్త్రీలందరు స్వేచ్ఛగా తిరుగుచు భర్తలను తమ అదుపాజ్ఞలలో ఉంచుకొందురు. తర్జన భర్జనలతో తమ భర్తలను కొట్టుటకైనను వెనుకాడరు. ఇంటి యజమానురాలు సామాన్యపలే ఉండును. ఇంటి యజమాని భృత్యునివలె ఉండును. ఇంటికోడళ్ళు తమ గౌరవమును కోల్పోయి పనివారివలె ప్రవర్తింతురు. బాంధవ్యము కేవలము యోని సంబంధులతో మాత్రముండును. విద్యా సంబంధము కలవారితో పలుకనైనా పలుకరు, అందరు పరస్పర సంచయము లేనివారీవలె మెలగుదురు. పురుషులు తమ భార్యల మాటలను తప్పక విందురు.

బ్రహ్మక్షత్రియ వీట్ శూద్రా జాత్యాచార వినిర్ణయః ।

సంధ్యా చ యజ్ఞసూత్రం చ భావలుప్తం న సంశయః ॥

 మేచ్చాచారా భవిష్యంతి వర్ణాశ్చత్వార ఏవచ ।

మేచ్ఛశాస్త్రం పఠిష్యంతి స్వశాస్త్రాణి విహాయతే ॥

బ్రహ్మ క్షత్ర వీర వంశాః శూద్రాణాం సేవకాః కలౌ ।

సూపకారా భవిష్యంతి ధావకా వృషవాహకా: ॥

సత్యహీనాః జనాః సర్వే సస్యహీనా చ మేదినీ ॥

ఫలహీనాశ్చ తరవోఽఫత్యహీనాశ్చ యోషితః ।

క్షీరపీనాస్తథా గావః క్షీరం సర్పీవీవర్జితం ॥

దంపతీ ప్రీతి హీనౌ చ గృహిణః సుఖ వర్జితాః ।

ప్రతాపహీనా భూపాశ్చ ప్రజాశ్చ కరపీడితాః ॥

జలహీనా నదానద్యో దీర్ఘికా: కందరాదయః ।

ధర్మహీనా: పుణ్యహీన వర్ణాశ్చత్వారా ఏవచ ॥

బ్రాహ్మణాది చాతుర్యర్ఘ్యముల యొక్క - కులాచార పద్ధతులు లోపించిపోవును. జనులందరు తమ ప్రాచీనశాస్త్ర గ్రంథములను వదలి మ్లేచ్చుల శాస్త్రములు పఠించుచు వారీ ఆచార వ్యవహారముల స్వీకరింతురు. ఉత్తమ వంశమున జన్మించిన వారందరు తమ తమ ఆచారవ్యవహారములను వదిలి పెట్టి భ్రష్టాచారులగుదురు. జనులందరు సత్యదూరులు కాగలరు. భూమి చక్కగా పండదు. చెట్లకు పండ్లు ఉండవు. స్త్రీలు సంతానరహితలు కాగలరు. ఆవులు పాలనివ్వవు. భార్యాభర్తలు సుఖములేక సంతోషమునకు దూరము కాగలరు. నదీనదములు బావులు మొదలగు వాటిలో నీరుండదు. అందరు ధర్మహీనులు పుణ్యహీనులు కాగలరు.

లక్షేషు పుణ్యవాస్ కోఽపి న తిష్ఠతి తతః పరం ।

కుత్సితా వీకృతాకారా నర నార్యశ్చ బాలకాః ॥

కువార్తా: కుత్సితపథాః భవిష్యంతి తతః పరం ।

కేచిత్ గ్రామాశ్చ నగరా నరశూన్యా భయానకాః ॥

 కేచిత్ స్వల్ప కుటీరేణ నరేణ చ సమన్వితాః।

ఆరణ్యాని భవిష్యంతి గ్రామేషు నగరేషు చ ॥

అరణ్యవాసినః సర్వే జనాశ్చ కరపీడితాః ।

సస్యాని చ భవిష్యంతి తడాగేషు నదీషు చ ॥

క్షేత్రాణి సస్యహీనాని ప్రకృష్టాన్యర్థతః పరం ।

హీనాః ప్రకృష్ణా ధనినో బలదర్ప సమన్వితాః ॥

 ప్రకృష్ట వంశజాహీనా భవిష్యంతి కలో యుగే ।

అలీకవాదినో ధూర్తా: శఠాపై సత్యవాదిన: ॥

పాపినః పుణ్యవంతశ్చాపశిష్ట శిష్టఏవచ ।

జితేంద్రీయా లంపటాశ్చ పుంశ్చల్యశ్చ పతివ్రతాః ॥

తపస్వినః పాతకితో విష్ణుభక్తా ఆవైష్ణవాః ।

హింసకాళ్ళ దయాయుక్తా: చౌరాశ్చ నరపతినః ॥

 భిక్షువేషధరో ధూర్త నిందుత్యువహసంతి చ ।

భూతాది సేవా నిపుణాః జనానాం మోదకారిణః ॥

పూజితాస్తే భవిష్యంతి వంచకా జ్ఞాన దుర్బలాః ।

వామనా వ్యాధియుక్తాశ్చ సరా నార్యశ్చ సర్వతః ॥

అల్పాయుషో జరాయుకా యావనేషు కలౌ యుగే ।

పలితాః షోడశ వర్ష మహావృద్ధాస్తు వింశతౌ ॥

అష్టవర్జా చ యువతీ రజోయుక్తా చ గర్భిణీ ।

వత్సరాంతే ప్రసూత స్త్రీ షోడశేన బిరాన్వితా ॥

ఏతా: కాశ్చిత్ సహస్రపు వంద్యాశ్చాపి కలౌ యుగే ।

కన్యా విక్రయిణః సర్వే వర్ణాశ్చత్వారా ఏవచ ॥

మాతృజాయా వధూనాం చ జారోపార్జన తత్పరాః ।

కన్యానాం భగినీనాం చ జారోపార్జనజీవినః॥

హరేర్నామ్నాం విక్రయిణో భవిష్యంతి కలౌ యుగే ।

 స్వయముత్సృజ్య దానం చ కీర్తివర్ధన హేతవే ॥

తత్పశ్చాన్మనసాలోచ్య స్వయముల్లంఘయిష్యతి ।

దేవవృత్తిం బ్రహ్మవృత్తం వృత్తింగురుకులస్య చ ॥

స్వదత్తాం పరదత్తాంవా సర్వముల్లంఘయిష్యతి ।

కన్యకాగామినః కేచిత్ కేచిత్ శ్వశ్రబిగామినః ॥

ఈ కలియుగమున లక్షలమంది జనులలో ఎవడో ఒకడు పుణ్యవంతుడు కాగలడు. అందరు దుష్టులు, వికృతమైన ఆకారము కలవారు కాగలరు. కొన్ని గ్రామములు, పట్టణములు జనరహితమై భయంకరముగా ఉండును. కొన్ని గ్రామములలో, పట్టణములలో తక్కువ ఇండ్లు మాత్రముండును. ఆరణ్యములలో నున్న వారి దగ్గర కూడ మిక్కిలిగా పన్నులు తీసికొని పీడింతురు. నీరులేక నదులలో చెరువులలో పంటలు పండింతురు. అట్లే చక్కని పంటభూములందు పంటలు పండవు. నికృష్టులు ధనము, బలము, అహంకారము కలవారై గొప్పవారుగా పరిగణింపబడుదురు. అదేవిధముగా ఉన్నత వంశమున పుట్టినవారు నికృష్టులుగా చూడబడుదురు. అబద్ధములు మాటాడు దుష్టులు సత్యము పలుకుచున్నట్లు కనిపింతురు. పాపులు పుణ్యవంతులుగాను, పాతకము చేయువారు తపస్సుచేసి కొనువారివలె, అవైష్ణవులు విష్ణుభక్తులవలె కన్పింతురు. అట్లే ఈ కలియుగమున దయ్యములను పూజించువారు. జానములేని మోసగాళ్ళు గౌరవింపబడుదురు. స్త్రీ పురుషులందరు పొట్టివారుగానో వ్యాధులతో బాధలు పడుదురు. పదునారు సంవత్సరములకే తలంతయు పండి ఇరువది సంవత్సరముల వయసు వచ్చు వరకు ఒడలు ముడుత బడి పూర్తిగా ముసలివారగుదురు. స్త్రీలు ఎనిమిది సంవత్సరములకే యువతులగుదురు. పదునారుసంవత్సరముల వరకు వారు ముసలివారగుదురు. డబ్బుకు కక్కుర్తిపడి తమ కూతుళ్ళను అమ్ముకొందురు. అట్లే తల్లిని, భార్యను, కోడలిని, చెల్లెలిని జారత్వమునకు ప్రోత్సహించి ఆ ధనముచే బ్రతుకజూతురు. కీర్తికొరకు తాము చేసిన దానమును వెనుకకు తీసికొనెదరు. ఆట్లే తానిచ్చినవి, పరులిచ్చినవి ఐన దేవ బ్రాహ్మణ గురువృత్తులను వెనుకకు తీసికొందురు.

కేచిద్వధూగామినశ్చ కేచిత్ సర్వత్రగామినః।

భగినీ డామినః కేచిత్ సపత్నీ మాతృగామినః॥

 భ్రాతృజాయాగామినశ్చ భవిష్యంతి కలౌయుగే ।

ఆగమ్యాగమనం చైవ కరిష్యంతి గృహే గృహే ॥

ఆత్మయోనింపరిత్యజ్య విహరీష్యంతి సర్వతః ।

పత్నీనాం నిర్ణయోనాస్తి భర్తౄణాం చ కలౌయుగే ॥

ప్రజానాం చైవ వస్తూనాం గ్రామాణాంచ విశేషతః ।

 ఆలీకవాదినః సర్వే సర్వే చౌర్యార్థలంపటాః ॥

పరస్పరం హింసకాశ్చ సర్వే చ నరఘాతినః ।

 బ్రహ్మక్షత్రవిశాం వంశా భవిష్యంతి చ పాపినః ॥

లోక్షాలోహ రసానాం చ వ్యాపారం లవణస్య చ ।

వృషవాహా విప్రవంశాః శూద్రాణాం శవదాసీనః ॥

 శూద్రాన్నభోజినః సర్వే సర్వే చ వృషలీ రతాః ।

పంచపక్వపరిత్యక్తా కుహూరాత్రిషు భోజనః ॥

యజ్ఞసూత్రవిహీనాశ్చ సంధ్యాశౌచవిహీనకా: ॥

పుంశ్చలి వార్దుషాఽవీరా కుట్టినీ చ రజస్వలా ।

విప్రాణాం రంధనాగారే భవిష్యంతి చ పాచిక: ॥

అన్నొనాం నిర్లయో నాస్తి యోనీనాం చ విశేషతః ।

 ఆశ్రమానాం జనానాం చ సర్వేఘ్చ్చాః కలౌయుగే ॥

తన కూతురు, అత్త, కోడలు, చెల్లెలు, సోదరుని భార్య అనే వావివరుసలు లేకుండా వ్యభిచరింతురు. ఈకలియుగమున ఒక పురుషునకు భార్యలెందరో ఒక స్త్రీకి భర్తలెందరో చెప్పలేము. అందరు అసత్యమాడువారే. అన్యాయముగా దొంగతనము చేసి ధనము సంపాదించువారే. ప్రజలందరు ఒకరి నొకరు హింసించుకొందురు. చంపుకొందురు. లత్తుక, లోహాము, రసము, ఉప్పును అమ్ముకొని బ్రతుకుదురు. బ్రాహ్మణులు తమ ధర్మములను వదలివేయుదురు. అమావాస్య రాత్రివేళలలో భుజింతురు. జందెములను తీసివేసి సంధ్యావందనములాచరింపరు. తమ ఇంట్లోని సదాచారములనన్నిటిని వదులుకొందురు. అన్ని ఆశ్రమములయందు వర్ణముల యందు సంకరమేర్పడగలదు.

ఏవం కలౌ సంప్రవృత్తే సర్వే మ్లేచ్ఛమయా భవే ।

హస్త ప్రమాణీ వృక్ష చాంగుష్ఠమానే చ మానవే ॥

వీప్రస్య విష్ణుయశసః పుత్రః కల్కీ భవిష్యతి ।

నారాయణ కలాంశశ్చ భగవాన్ బలికాం బలీ ॥

దీక్షేణ కరవాలేన దీర్ఘఘోటకవాహనః ।

మ్లేచ్ఛశూన్యాం చ పృథివీం త్రిరాత్రేణ కరిష్యతి ॥

నిర్ణ్మీచ్ఛాం వసుధాం కృత్వా చాంతర్ధానం కరిష్యతి ।

అరాబికా చ వసుధా దస్యుగ్రస్తా భవిష్యతి ॥

ఈ విధముగా కలియుగమున సమస్తము మ్లేచ్ఛమయము కాగా వృక్షములు హస్త ప్రమాణముననే ఉండును. మానవులు బొటన వ్రేలియంత ఎత్తు మాత్రముందురు.

అప్పుడు విష్ణు యశుడను బ్రాహ్మణునికి నారాయణుని అంశాంశములో కల్కియను పుత్రుడు కలుగును. అతడు మిక్కిలి బలవంతుడు. ఎత్తైన గుట్టమునెక్కి పొడవైన కరవాలముతో మూడు దినములలో ఈ భూమిపైనున్న మేచ్చులసందరిని వధించి అందర్ధానమునొందును. అందువలన: భూమీ అరాజకమై దస్యుల వశము కాగలదు.

స్థూలప్రమాణం షడ్రాత్రం వర్షధారాప్లుతా మహీ ।

లోక శూన్యా వృక్షశూన్యా గృహశూన్యా భవిష్యతి ॥

తతశ్చ ద్వాదశాదిత్యాః కరిష్యంత్యుదయం మునే ।

ప్రాప్నోతి శుష్కతాo పృద్వీ సమా తేషాం చ తేజసా  ॥

అప్పుడు ఆరు దినములు రాత్రింబగళ్ళు కుండపోతగా వర్షము కురియును. దానివలన ఇండ్లు, చెట్లు, అన్ని కూడా పూర్తిగా మునిగిపోవును. తరువాత ద్వాదశాదిత్యులందరు ఉదయించినందువలన ఆ ఎండచే భూమీయంతయు ఎండిపోవుమ.

కలేగతౌ చ దుర్థయే సంప్రవృత్తే కృతే యుగే ।

తపస్సత్య సమాయుక్తో ధర్మః పూర్ణో భవిష్యతి ॥

తపస్వినశ్చ ధర్మిష్ఠా వేదజ్ఞా బ్రాహ్మణా భువి ।

పతివ్రతాశ్చ ధర్మిష్ఠా యోషితశ్చ గృహే గృహే ॥

రాజానః క్షత్రియా: సర్వే విప్రభక్తా: స్వధర్మిణః ।

ప్రతాపవంతో ధర్మిష్ఠా: పుణ్యకర్మరతా: సదా ॥

వైశ్యా వాణిజ్యనిరతా: విప్రభక్తాశ్చ ధార్మికా: ।

శూద్రాశ్చ పుణ్యశీలాశ్చ ధర్మిణి విప్ర సేవిసః ॥

విప్రక్షత్రవిశాం వంశా విష్ణు యజ్ఞపరాయణాః ।

విష్ణుమంత్రరతాః సర్వే విష్ణుభక్తాశ్చ వైష్ణవాః ॥

శ్రుతీస్మృతి పురాణజ్ఞా ధర్మజ్ఞా ఋతుగామిసః ।

లేశో నాస్తి హ్యధర్మాణాం ధర్మపూర్ణే కృతే యుగే॥

కలియుగము తరువాత కృతయుగము వచ్చును. అప్పుడు తపస్సు, సత్యములతో ధర్మము పరిపూర్ణము కాగలదు. బ్రాహ్మణులు వేదజ్జులై ధర్మిష్ఠులై తపస్సు నాచరింతురు. స్త్రీలందరు ధర్మము కలిగి పతివ్రతలై యుందురు. రాజులు తమ తమ ధర్మముల నాచరించుచు పుణ్యకర్మలు చేయుచుందురు. వైశ్యులు, శూద్రులు తమ తమ ధర్మములననుసరించి పుణ్యకర్మలు చేయుచుందురు. వైష్ణవులందరు విష్ణుమంత్రమును జపించుచు విష్ణుయజ్ఞములనాచరింతురు. ఆందరు ప్రతిసృతి. పురాణముల చదువుచు ధర్మకార్యముల నాచరింతురు. ధర్మము సంపూర్ణముగానుండు కృతయుగమున ఆధర్మము లేశమాత్రము కన్పించదు.

ధర్మస్త్రిపాచ్చ త్రేతాయాం ద్వీపాచ్చ ద్వాపరే స్మృతః ।

కలౌ ప్రవృత్తే పాదాత్మా సర్వలోపస్తతః పరం॥

త్రేతాయుగమున ధర్మము మూడు పాదములతో నుండగా ద్వాపరమున రెండు పాదములతో, కలియుగమున, ఒకే పాదమున ఉండును. తరువాత సమస్త ధర్మలోపము జరుగును.

వారాః సప్తయథా విప్ర తిధయః షోడశ స్మృతాః ।

యథా ద్వాదశ మాసాశ్చ ఋతవశ్చ షడేవ హి ॥

 ద్వౌ పక్షౌ చాయనే ద్వేచ చతుర్భిః ప్రహరై ర్దినం ।

చతుర్భిః ప్రహరై రాత్రి; మాసః త్రింశద్దినైస్తథా ॥

వర్ష: పంచవిధో జ్ఞేయ: కాలసంఖ్యాం నిబోధమే ।

యథా చాయాంతి యాంత్యేవ తథా యుగ చతుష్టయం ॥

వర్షే పూర్ణే నరాణాం చ దేవానాం చ దివానీశం ।

శతత్రయే షష్ఠ్యధికే నరాణాంచ యుగే గతే ॥

దేవానాం చ యుగోజ్ఞేయ: కాలసంఖ్యావిదాం మత: ॥

మన్వంతరం తు దివ్యానాం యుగానామేకసప్తతిః ।

మన్వంతరసమం జ్ఞేయం చేంద్రాయుః పరికీర్తితం ॥

ఆష్టావింశతిమే చేంద్రీగతే బ్రాహ్మం దివానీశం ।

అష్టోత్తరే వర్షశతే గతే పాతో విధేర్భవేత్ ॥

కాల ప్రమాణమిట్లున్నది.

వారములు ఆరుకలవు. అట్లే ప్రతిపదారీతిథులు పదహారు కలవు. (ప్రతిపత్ నుండి చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అనునవి).

సంవత్సరములో ఉత్తర, దక్షిణాయనములు రెండు. నాలుగుజాములు దీనము, నాలుగుజాములు రాత్రి. ఎనిమిదో జాములు గల దివములు ముప్పదీయైనచో నెల. నెలలో శుక్ల, కృష్ణపక్షములు రెండు. ఇట్టి సంవత్సరములు గడువగా, గడువగా యుగమగుచున్నది. అట్టి యుగములు నాలుగున్నవి.

మానవుని సంవత్సరము దేవతలకు ఒక దినము. మానవులకు మూడువందల అరువది యుగములు గడిచినచో దేవతలకది ఒక యుగము. దేవయుగములు డెబ్బదిఒకటి గడచినచో అది ఒక మన్వంతరము. ఇంద్రుని వయస్సు ఒక మన్వంతర కాలముండును. ఇరువది ఎనిమిది ఇంద్రులవయస్సు బ్రహ్మకు ఒక దినమగును. ఆ బ్రహ్మకు నూటెనిమిది సంవత్సరములు పూర్తియైనచో ఆతనీ ఆయుర్దాయము పూర్తియగును.

ప్రళయః ప్రకృతోజ్ఞేయః తత్రాఽదృష్టా వసుంధరా ।

 జలప్లుతాని విశ్వాని బ్రహ్మవిష్ణుశివాదయః ॥

ఋషయోజీవినః సర్వే లీనా కృష్ణే పరాత్పరే ।

తత్రైవ ప్రకృతిర్లీనా తేన ప్రాకృతికో లయ: ॥

 లయే ప్రాకృతికిఽతీతే పాతే చ బ్రాహ్మణో మునే ।

 నిమేషమాత్ర: కాలశ్చ కృష్ణస్య పరమాత్మనః ॥

ఏవం నశ్యంతి సర్వాణి బ్రహ్మాండాన్యఖిలాని చ ।

 స్థితౌ గోలోకవైకుంఠౌ శ్రీకృష్ణశ్చ సపార్షదః ॥

నిమేషమాత్రః ప్రళయో యత్రవిశ్వం జలప్లుతం ।

నిమేషానంతరే కాలే పునః సృష్టి క్రమేణ చ ॥

బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తియైనచో అప్పుడు ప్రాకృతప్రళయము సంభవించును. ఆప్రళయమున భూమి కనిపింపదు. లోకములన్నియు జలమున మునిగిపోవును. అప్పుడు బ్రహ్మవిష్ణు, శివాదిదేవతలు, మునులు, జీవులన్నియు పరాత్పరుడైన శ్రీకృష్ణునీయందు లీనమగును. ప్రకృతియంతయు పరమాత్మయందు లయము చెందును కావున అది ప్రాకృతిక లయము. బ్రహ్మదేవుని జీవితకాలము లేక ప్రాకృతిక లయ కాలము పరమాత్మయగు శ్రీకృష్ణదేవునకు ఒక నిమేషకాలము.

ఈ విధముగా సమస్తలోకములు సమస్తజీవులు నశించుచుందురు. గోలోకము వైకుంఠము మాత్రము శాశ్వతముగానుండును అచ్చట శ్రీకృష్ణపరమాత్మ తన అనుచరులతో శాశ్వతముగా నుండును.

పరమాత్మయొక్క నిమేషకాలమువరకు ప్రళయముండును. ఆటుపిమ్మట సృష్టి మరల ప్రారంభమగును.

ఏవం కతివిధా సృష్టి లయః కతివిధోఽపివా ।

కతికృత్వో గతాఽయాత: సంఖ్యాం జానాతి కః పుమాన్ ॥

సృష్టినాంచ కళానాం చ బ్రహ్మాండానాం చ నాదర ।

బ్రహ్మాదీనాం చ విధ్యండే సంఖ్యాం జానాతి కః పుమాన్ ॥

ఈ విధముగా అనేక సృష్టిలయములు జరిగినవి. ఈసృష్టిలయముల సంఖ్య, బ్రహ్మాండముల సంఖ్య, బ్రహ్మాది దేవతల సంఖ్య ప్రపంచమున ఎవరికిని తెలియదు.

బ్రహ్మాండానాం చ సర్వేషామీశ్వరశ్చైక ఏష సః ।

సర్వేషాం పరమాత్మా చ శ్రీకృష్ణ ప్రకృతేః పరః ॥

బ్రహ్మాదయశ్చ తస్యాంశా: తస్యాంశశ్చ మహావిరాట్ ।

తస్యాంశశ్చ విరాట్క్షుద్రః తస్యాంశా ప్రకృతి: స్మృతా॥ 

స చ కృష్ణో ద్విధాభూతో ద్విభుజశ్చ చతుర్భుజః ।

చతుర్భుజశ్చ వైకుంఠే గోలోకే ద్విభుజః స్వయం॥

బ్రహ్మాది తృణపర్యంతం సర్వం ప్రాకృతికం భవేత్ ।

యద్యత్ప్రాకృతికం సృష్టం సర్వం నశ్వరమేవ చ ॥

విధ్యేకం సృష్టిమూలం తత్సత్యం నిత్యం. సనాతనం ।

 స్వేచ్ఛామయం పరం బ్రహ్మ నిర్లిప్తం నిర్గుణం పరం ॥

బ్రహ్మాండములకు సమస్త జీవులకు ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అతడు ప్రకృతి కంటే అతీతుడు. బ్రహ్మాది దేవతలు ఆ పరమాత్మయొక్క ఆంశస్వరూపులు. అతని ఆంశాంశ స్వరూపము మహావిరాణ్మూర్తి, దానియొక్క అంశము విరాట్స్వరూపము. విరాట్ స్వరూపముయొక్క అంశస్వరూపమే ఈ ప్రకృతి.

కృష్ణపరమాత్మ గోలోకమున ద్విభుజుడుగాను, వైకుంఠమున చతుర్భుజుడుగాను కనిపించును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపరకవరకు అంతయు ప్రకృతికి సంబంధించినది. ఈ ప్రకృతికి సంబంధించిన ప్రతీది కూడ నశించుచునేయున్నది. అదినశ్వరమైనది. ఈ సృష్టికంతయు మూలస్వరూపమనతగిన పరమాత్మ నిత్యము సనాతనము కూడ.

నిరుపాధిం నిరాకారం భక్తానుగ్రహ విగ్రహం ।

ఆతీయ కమనీయం చ నవీన ఘన సన్నిభం ॥

ద్విభుజం మురళీహస్తం గోపవేషం కిశోరకం ।

సర్వజ్ఞం సర్వసేవ్యంచ పరమాత్మానమీశ్వరం ॥

ఆ పరమాత్మ స్వేచ్చామయుడు, నిర్లిప్తుడు, నిర్గుణుడు, నిరాకారీ, అయినను భక్తులననుగ్రహించుటకై ఆకారమును ధరించిన వాడు, మిక్కిలి అందగాడు, మేఘమువలె నల్లనివాడు రెండు భుజములు కలవాడు, మురళిని ధరించిన గొల్లవాడు, సర్వజ్ఞుడు. అందరిచే సేవించబడినవాడు, పరమాత్మ, ఈశ్వరుడు కూడ.

కరోతి ధాతా బ్రహ్మాండం జ్ఞానాత్మా కమలోద్భవః ।

శివోమృత్యుంజయశ్చైవ సంహార్తా సర్వతత్వవిత్ ॥

యస్యజ్ఞానాద్యత్తపసా సర్వేశః తత్సమో మహాన్ ।

మహావిభూతీయుక్తశ్చ సర్వజ్ఞ సర్వదా స్వయం॥

 సర్వవ్యాపీ సర్వపాతా సదాతా సర్వసంపదాం ।

విష్ణు: సర్వేశ్వరః శ్రీమాన్ యస్యజ్ఞానాత్ జగత్పతిః ॥

మహామాయాచ ప్రకృతి: సర్వశక్తిమతిశ్వరీ ।

యజ్ఞానార్యస్య తపసా యద్భక్త్యా యస్య సేవయా ॥

సావిత్రీ వేదమాతా చ వేదాధిష్ఠాతృదేవతా ।

పూజ్యో ద్వీఙానాం వేదజ్ఞా యజ్ఞాత్ యస్యాశ్చ సేవయా ॥

సర్వ విద్యాధిదేవీ సా పూజ్యా చ విదుషాం పురా ।

యత్సేవయా యత్తపసా యస్య జ్ఞానాత్ సరస్వతీ ॥

యత్సేవయా యత్తపసా ప్రదాత్రీ సర్వసంపదాం ।

ధనసస్యాధి దేవీ సా మహాలక్ష్మీ: సనాతనీ ॥

యత్సవయా యత్తపసా సర్వవిశ్వేషు పూజితా ।

సర్వ గ్రామాధిదేవీ సా సర్వసంపత్ర్పదాయినీ ॥

 సర్వేశ్వరీ సర్వవంద్యా సర్వేశం ప్రాప యా పతిం ।

 సర్వస్తుతా చ సర్వజ్ఞో దుర్గా దుర్గతినాశినీ ॥

 కృష్ణవామాంశ సంభూతా కృష్ణ ప్రేమాధి దేవతా ।

కృష్ణ ప్రాణాధికా ప్రేమ్ణా రాధికా కృష్ణ సేవయా ॥

కమలమునుండి జన్మించినవాడు. జ్ఞానస్వరూపుడు ఐన బ్రహ్మదేవుడు విశ్వములనన్నిటిని సృష్టించును. సమస్త తత్వజ్ఞానము నెరిగినవాడు, మృత్యువును జయించినవాడు అగు శివుడు విశ్వసంహారము చేయుచున్నాడు. జ్ఞానమువలన, తపస్సువలన పరమాత్మతో సమానమైనవాడు, మహావిభూతులతోనున్నవాడు, సర్వజ్ఞుడు, విశ్వమంతయు వ్యాపించినవాడు, సమస్తసంపదలను ఇచ్చువాడు, సర్వేశ్వరుడైన విష్ణువు ఆందరిని రక్షించుచుండును.

ప్రకృతి సర్వశక్తులు కలది, ఈశ్వరి, మహామాయకూడ. బ్రాహ్మణులకు పూజ్యురాలు, వేదములకు అధిష్టాన దేవత, వేదములకు తల్లి వంటిదీ సావిత్రీదేవి. విద్యాంసులందరిచే పూజింపతగిన దేవత సరస్వతి. పరమాత్మను సేవించి తపమాచరించి సర్వసంపదలను ఇవ్వగలిగిన దేవత మహాలక్ష్మి. ఆమె ధనధాన్యములకు అధిదేవత. అట్లే పరమాత్మను సేవించి తపస్పుచేసి సమస్తలోకములందు పూజ్యురాలైన దుర్గాదేవి సమస్త గ్రామాధిదేవత. సమస్తసంపదలనిచ్చునది. ఆందరిచే స్తుతింపబడినది, సర్వజ్ఞారాలు దు:ఖములను పోగొట్టునది. శ్రీకృష్ణ ప్రేమకు అధిదేవత, ఆపరమాత్మ వామభాగమునుండి ఆవిర్భవించిన రాధికాదేవి శ్రీకృష్ణుని సేవించి ప్రేమించి అతని ప్రాణములకన్న మిన్నయైనది.

సర్వాధికం చ రూపం చ సౌభాగ్యం మానగౌరవం ।

కృష్ణవక్షస్థలస్థానం పత్నీత్వం ప్రావ సేవయా ॥

తపశ్చకార సా పూర్వం శతశృంగే చ పర్వతే ।

దివ్యం యుగసహస్రం చ నిరాహారాతీకర్శితా ॥

కృశాం నిశ్వాసరహితాం దృష్ట్యా చంద్రకళాపమాం ।

కృష్ణో వక్షస్థలే కృత్వా రురోధ కృపయా విభుః ॥

వరం తస్యై దదౌ సారం సర్వేషామపి దుర్లభం ।

 మమ వక్షస్థలే తిష్ఠ మయి తే భక్తి రస్త్వితి ॥

సౌభాగ్యన చ మానేన ప్రేమ్ణా వై గౌరమేణ చ ।

 త్వం మే శ్రేష్ఠ పరం ప్రేమ్ణా జ్యేష్ఠ త్వం సర్వయోషితాం ॥

 వరిష్ణా చ గరిష్ఠా చే సంస్తుతా పూజితా మయా ।

సంతతం తవ సాద్యోఽహం బాధ్యశ్చ ప్రాణవల్లభే ॥

రాధ శ్రీకృష్ణపరమాత్మను సేవించి అందరికంటే ఆందమైన రూపును, సౌభాగ్యమును, గౌరవమును, శ్రీకృష్ణుని వక్షస్థలమున స్థానమును పొందినది. శతశృంగపర్వతమున విరాహారయై, నిశ్వాసరహితయై పరమాత్మను గురించి తపస్సుచేసి మిక్కిలి కృశించిపోయినందువలన శ్రీకృష్ణుడు ఆ రాధికను తన రొమ్మునకు 'హత్తుకొని దయలో స్త్రీలందరకు దుర్లభమైన వరమును ఆమెకిచ్చెను. ఓ రాధా! నీవెల్లప్పుడు నా వక్షస్థలముననే ఉండుము. నీ పౌభాగ్యము, ప్రేమ, గౌరవముల వలన స్త్రీలందరిలో నీవు గౌరవింపబడుదువు. నేను నికెల్లప్పుడు అందుబాటులో ఉందును అనెను.

ఇత్యుక్త్వా జగతీనాథః. చక్రీ తచ్చేతనాం తతః ।

సపత్నీరహితాం తాం చ చకార ప్రాణవల్లభాం ॥

యేషాం యాయాశ్చ దేవ్యో వై పూజితాస్తస్య సేవయా ।

తపస్యా యాదవశీ యాసాంతాసాం తాదృక్ఫలం మునే ॥

 దివ్యవర్షసహస్రంచ తపస్తప్త్వా హిమాలయే ।

దుర్గా చ తత్పదం ధ్యాత్వా సర్వపూజ్యా బభూవహా ॥

పరస్వతి తపసహ్య పర్వత గంధమాదనే ।

 లక్షవర్షం చ దీవ్యం చ సర్వ వంద్యా బభూవ హ ॥

లక్ష్మీర్యుగశతం దివ్యం తపస్తవ్య చ పుష్కరే ।

సర్వ సంపత్ర్పదాత్రీ పా చాఽభవత్తస్య సేవయా ॥

సావిత్రి మలయే తప్త్వా ద్విజపూజ్యా బభూవ పా ।

షష్టివర్షసహస్రం చ దివ్యం ధ్యాత్వా చ తత్పదం ॥

శతమన్వంతరం తప్తం శంకరేణ పురా విభో ।

శతమన్వంతరం చైవ బ్రహ్మణా తస్య భక్తితః ॥

శతమన్వంతరం విష్ణుస్తప్త్వా పారా బభూవ హ ।

శతమన్వంతరం ధర్మస్తప్త్వా పూజ్యో బభూవ హ॥

మన్వంతరం తపస్తేపే శేషో భక్త్యా చ నారద ।

మన్వంతరం చ సూర్యశ్చ శక్రశ్చంద్రస్తథా గురుః ॥

దివ్యం శతయుగం నైవ వాయుఘ్రష్యా చ భక్తితః ।

సర్వప్రాణ: సర్వపూజ్యః సర్వాధారో బభూవ సః ॥

ఈవిధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు రాధాదేవిని తన ప్రియురాలుగా సపత్నీ రహితగా చేసెను.

ఏయే దేవతలు, పరమాత్మగురించి ఎంత తపస్సు చేసినారో వారి వారి తపస్సుననుసరించి ఫలితమును పొందినారు.

దుర్గాదేవి హిమాలయ పర్వతముపై వేయి దివ్య వర్షములు తపస్సు చేసి అందరికి పూజనీయురాలైనది. సరస్వతీదేవి గంధమాదన పర్వతముపై లక్ష దీవ్య వర్షములు తపస్సు చేసినది. లక్ష్మీదేవి పుష్కర తీర్థమున నూరు దీవ్యయుగములు తపస్సు చేయగా, సావిత్రిదేవి మలయ పర్వతమున - ఆరుపై వేల దివ్య వర్షములు తపస్సుచేసి పూజనీయురాలైనది.

శంకరుడు, బ్రహ్మ, విష్ణువు, ధర్ముడు శతమన్వంతరములు పరమాత్మను గురించి తపస్సు చేయగా ఆదిశేషుడు ఒక మన్వంతరము, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు కూడ ఒక మన్వంతరము, వాయువు నూరు దివ్యయుగములు తపస్సు చేసి లోక పూజ్యులైరి.

ఏవం కృష్ణస్య తపసా సర్వే దేవాశ్చ పూజితాః ।

మునయో మానవా భూపా బ్రాహ్మణాశ్చైవ పూజితాః ॥

ఏవం తే కథితం సర్వం పురాణంచ తథాగమం ।

గురువక్త్రాద్యథా జ్ఞాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసీ ॥

ఈవిధముగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సుచేసి సమస్త దేవతలు, మునులు, రాజులు బ్రాహ్మణులు తదితరులు రసమును పొందిరి.

నాగురువు వలన ఎన్నో పురాణ విషయమును నాకు తెలిసినంతవరకు నీకు తెల్పితిని.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితియే ప్రకృతిఖండి నారద నారాయణ సంవాదే యుగతన్మాహాత్మ్య మన్వంతరకాలేశ్వరగుణ నీరూపణం నామ సప్తమోఽధ్యాయః॥

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సమయమున యుగము, దాని మహాత్మ్యము, మన్వంతరకాలము, ఈశ్వరుని గుణములను తెలుపు ఏడవ అధ్యాయము సమాప్తము.