శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-
అథాండం తజ్జలేఽతిష్ఠత్ యావద్వై బ్రహ్మణ్యః ।
తతఃస్వకాలే సహసా ద్వీధారూపో బభూవ సః ॥
తన్మద్యే శిశురేకశ్చ శతకోటి రవిప్రభః ।
క్షణం రోరూయమాణశ్చ స శిశుః పీడితః క్షుధా ॥
పితృ మాతృ పరిత్యక్తా జలమద్యే నిరాశ్రయః ।
నైకబ్రహ్మాండనాయో దదర్షొఽర్ద్వమనాథవత్ ॥
స్థూలాత్ స్థూల తమః సోఽపి నామ్నా దేవో మహావీరాట్ ।
పరమాణుర్యథా సూక్ష్మాత్పరః స్థూలాత్తథాప్యనీ ॥
తేజసాం షోడశాంశోఽయం కృష్ణస్య పరమాత్మనః ।
ఆధారోఽసంఖ్యవిశ్వానాల మహావిష్ణసురేశ్వరః॥
ప్రత్యేకం రోమ కూపేషు విశ్వాని నిఖిలానీ చ ।
ఆద్యాఽపి తేషాం సఖ్యాంచ కృష్ణో వక్తుం నహి క్షమః ॥
యథాస్తి సంఖ్యా రజసాం విశ్వానాం న కదాచన ।
బ్రహ్మ విష్ణు శీవాదీనాం తథా సంఖ్యా న విద్యతే ॥
ప్రతి విశేష సంఖ్యేవం బ్రహ్మవిష్ణుశివాయః ।
పాతాళాత్ బ్రహ్మలోకాంతం బ్రహ్మాండం పరికీర్తితం ॥
స్త్రీ రూపిణియైన శ్రీకృష్ణశక్తిచే నీటిలో వదలి పెట్టబడిన అండము ఆ జలములో బ్రహ్మయొక్క నూరు సంవత్సరాల వరకుండెమ. ఆ తరువాత అది రెండు రూపముల పొందినది. అందొకటి అండాకారముననే ఉండగా రెండవది శిశురూపము చెందినది. శతకోటి సూర్యకాంతులలో ప్రకాశించు ఆ శిశువు ఆకలితో బాధ చెంది ఏడ్చుచుండెను. తల్లి తండ్రులచే వదలిపెట్టబడిన ఆ శిశువు నీటిలోపల ఆశయము లేక అనాథపలే పైకి చూచాను. అనేక బ్రహ్మాండనాయకుడు. స్థూలమైన వాటికంటే మిక్కిలి స్టూలమైనవాడు ఆగు ఆ శిశువును మహావీరాట్ అనీ పిలుతురు. ఆతడు శ్రీ కృష్ణ పరమాత్మ తేజస్సులో పదుపార భాగము. ఆసంఖ్యాకమైన విశ్వములకతడు ఆధారభూతుడు. అతనినీ మహావిష్ణువని కూడ అందురు. ఆతని రోమ కూపములయందు సమస్త విశ్వములున్నవి. అసంఖ్యాకమైన ఆ విశ్వముల సంఖ్యను శ్రీ కృష్ణుడు కూడ చెప్పలేడు. రేణువుల సంఖ్యనైనా చెప్పవచ్చును గాని విశ్వముల సంఖ్యను మాత్రము చెప్పలేము. ఆట్టే ఆయా విశ్వములందున్న బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల సంఖ్యను కూడా చెప్పలేము. ప్రతి విశ్వమునందు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలున్నారు.
పాతాళలోకమునుండి బ్రహ్మలోకము వరకున్న దానిని బ్రహ్మాండముగా పేర్కొనుచున్నారు.
తత ఉర్ద్వే చ వైకుంఠ బ్రహ్మాండాద్బహిరేవ సః ।
సచ సత్య స్వరూపశ్చ శశ్వన్నారాయణో యథా ॥
తదూర్ద్వే గోళకశ్చైవ పంచాశత్కోటి యోజనాత్ ।
నిత్యః సత్యస్వరూపశ్చ యథా కృష్ణస్తథాఽప్యయం ॥
సప్తద్వీపమీతా పృధ్వీ సప్తసాగర సంయుతా ।
ఏకోన పంచాశదుపద్వీపాంఽఖ్యవనాన్వీతా ॥
ఊర్ధ్వం సప్త సువర్లోకా బ్రహ్మలోక సమన్వితాః ।
పాతాళాని చ సప్తాధశ్చైవం బ్రహ్మాండమేవచ ॥
ఊర్ధ్వం ధరాయా భూర్లోకో భువర్లోక స్తతః పరః ।
సువర్లోకస్తు తతః పశ్చాన్మహర్లోకస్థతో జనః ॥
తతః పరస్తపోలోకః సత్యలోకస్తతః పరః ।
తతః పరబ్రహ్మలోక స్తప్తకాంచన నిర్మితః ॥
ఏవం సర్వం కృత్రిమం తదాహ్యాభ్యంతర ఏవచ ।
తద్వీనాశే వినాశశ్చ సర్వేషామేవ నారద ॥
జలబుద్బుదవత్సరం విశ్వసంఘమనిత్యకం ।
నిత్యౌ గోలోక వైకుంఠౌ సత్యౌ శశ్వదకృత్రిమౌ ॥
బ్రహ్మాండము కన్న భిన్నముగా దానికి పై భాగముననున్నది. వైకుంఠము. ఆ వైకుంఠము నారాయణుని వలె నిత్యమైనది, సత్యమైనది. వైకుంఠమున కంటె ఏబదికోట్ల యోజనముల పైన గోలోకము కలదు. ఆది శ్రీకృష్ణదేవునీవలె నిత్యమైనది, సత్యమైనది.
భూమి ఏడు ద్వీపములతో, సప్తసాగరములతో, నలుబది తొమ్మిది ఉపద్వీపములతో అసంఖ్యాకమైన అడవులతో ఉన్నది. దానికి పైన బ్రహ్మలోకముతో నున్న ఏడు సువర్లోకములున్నవి. ఈ భూమికింద ఏడు పాతాళ లోకములున్నవి. ఈ విధముగా సువరాది సప్తలోకములు పాల్గోళాది సప్తలోకములతోనున్న భూమి బ్రహ్మాండమనమడును.
భూమికి పై భాగమున భూకము, భువర్లోకము, స్వర్లోకము, మహార్లోకము, ఆతరువాత జనోలోకము, అటుపిమ్మట తపోలోకము, దాని పైన సత్యలోకము, సత్యలోకము పైన మేలిమి బంగారముచే నిర్మింపబడిన బ్రహ్మలోకము కలవు. ఈలోకములన్నియు కృత్రిమమైనవి. అశాశ్వతమైనవి. ఈ విశ్వములన్నియు నీటి బుడగలవలె అశాశ్వతమైనవి.
కాని గోలోక వైకుంఠలోకములు మాత్రము సత్యమైనవి. శాశ్వతమైనవి, ఆకృత్రిమమైనవి.
లోమకూపే చ విధ్యండం ప్రత్యేకం తస్య నిశ్చితం ।
ఏషాం సంఖ్యాం న జానాతి కృష్ణాఽన్యస్యాఽబికా కథా ॥
ప్రత్యేకం ప్రతివిధ్యండే బ్రహ్మ విష్ణు శివాదయ: ।
తిస్రః కోట్యః సురాణాంచ సంఖ్యా సర్వత్ర పుత్రక ॥
దిగీశాశ్చైవదిక్పాలా: నక్షత్రాణి గ్రహాదయః ।
భువి వర్ణాశ్చ చత్వారోఽధో నాగాశ్చ చరాచరాః ॥
విరాట్పురుషుని యొక్క ప్రతి రోమ కూపమందు బ్రహ్మాండమున్నది. ఈ బ్రహ్మాండములయొక్క సంఖ్య శ్రీ కృష్ణపరమాత్మకే తెలియదన్నచో ఇతరుల కేవరికి తెలియును?
ప్రతి బ్రహ్మాండమున ప్రత్యేకముగా బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ముప్పది కోట్ల సురలు, దిక్పాలకులు, నక్షత్రములు, గ్రహాదులు కలవు. భూమిపై నాల్గు వర్ణముల జనులున్నారు. భూమిక్రింద నాగులు చరాచర జగత్తు కలదు.
ఆథ కాలేన సవిరాడూర్ధ్వం దృష్ట్వా పునః పునః ।
డింభాంతరం చ శూన్యం చ న ద్వితీయం కథంచన ॥
చింతామవాప క్షుద్యుక్తో రురోద చ పునః పునః ।
జ్ఞానం ప్రాప్య తదా దధ్యో కృష్ణం పరమ పూరుషం ॥
తతో దదర్శ తత్రైవ బ్రహ్మ జ్యోతి: సనాతనం ।
నవీన నీరదశ్యామం ద్విభుజం పీతవాససం ॥
సస్మితం మురళీహస్తం భక్తానుగ్రహకారకం ।
జహాస బాలకస్తుష్టో దృష్ట్యా జనకమీశ్వరం॥
వరం తస్మై దదౌ తుష్టా పరేశః సమయోచితం ।
మత్సమోక్షాన యుక్తశ్చ క్షుత్పిపాసా వివర్జితః ॥
బ్రహ్మాండోసంఖ్య నిలయో భవ వత్స లయవధి ।
నిష్కామో నిర్భయశ్చైవ సర్వేషాం వరదో వరః ॥
కొంతకాలమునకా విరాట్పురుషుడు పైకి మాటి మాటికి చూచుచు ఇంకొక శిశువును కాని, ఇతరమైన వస్తువును గానీ చూడక చింతగలవాడై ఆకలితో చాలాసేపు ఏడ్చెను.
కొంతకాలమునకు జ్ఞానము బడసి పరమపురుషుడైన శ్రీకృష్ణుని తన మనసులో ధ్యానించుకొనెను. అందువలన పరబ్రహ్మ స్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, రెండు భుజములు కలవాడు, పీతాంబరసుశోభితుడు, చేతిలో మురళీ కలవాడు, భక్తులననుగ్రహించువాడగు శ్రీకృష్ణుడు దర్శనమొసగెను.
విరాట్పురుషుడు పరమేశ్వరుడు, ఆత్మజనకుడైన ఆ శ్రీకృష్ణుని చూచి నవ్వి అవేక విధములుగా స్తుతించెను. అందువలన ఆ పరమేశ్వరుడు సంతోషించి ఆకలి దప్పులు లేక నావలేనే జ్ఞాన యుక్తుడవు కమ్మని, నిష్కాముడవై, నిర్భయుడవై ఆందరకు వరములను ఇచ్చుచు, లయకాలమువరకు అసంఖ్యాకమైన బ్రహ్మాండములకు నిలయము కమ్మని ఆ బాలకునకు వరమిచ్చెను.
ఇత్యుక్త్యా తద్దక్షకర్లే మహామంత్రం షడక్షరం ।
శ్రీః కృత్వా ప్రజజాపాదౌ వేదాంగమవరం పరం ॥
ప్రణవాది చతుర్థ్యంతం కృష్ణ ఇత్యక్షరద్వయం ।
వహ్ని జ్వాలాంత మిష్టం చ సర్వవిఘ్నహరం పరం ॥
మంత్రం ద్వ తదాఽహారం కల్పయామాస వై ప్రభుః ।
శ్రుయతాం తత్ బ్రహ్మపుత్ర నిబోధ కథయామి తే ॥
ప్రతివిశ్వేషు నైవేద్యం దద్యాద్వై వైష్ణవో జనః ।
షోడశాంశం విషయిణో విష్ణోః పంచదశాస్య వై ॥
నిర్గుణప్యాత్మవశ్చైవ పరిపూర్ణతమస్య చ ।
నైవేద్యే న చ కృష్ణస్య నహి కించిత్ప్రయోజనం ॥
యద్దదాతి చ నైవేద్యం యస్మై దేవాయ యో జనః ।
సచ భాదతి తత్సర్వం లక్ష్మీదృష్ట్యా పునర్భవేత్ ॥
తం చ మంత్రం వరం దత్వా తముచ పునర్విభుః ।
అన్యో వరః క ఇష్టస్తే తం మే బ్రూహి దదామి తే ॥
విరాడ్రూపుడైన బాలకునకు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వరమిచ్చి, అతని కుడిచెవిలో వేదాంగము, మిక్కిలి శ్రేష్టమైన షడక్షరీ మంత్రమును మూడు మార్లు ఉచ్చరించెను. ఓంకారముతో ప్రారంభమై చతుర్థ్యంతమైన కృష్ణ శబ్దము కలిగి స్వాహాకారాంతమైన ఓం కృష్ణాయ స్వాహా అను మంత్రము అన్ని విఘ్నముల తొలగించును.
ఆమంత్రమునుపదేశించి పరమాత్మ ఆ బాలున కాహారమును కల్పించెను.
ప్రతి విశ్వమున వైష్ణవులైనవారు పరమాత్మకు నైవేద్యమిడుదురు. దానిలో పదునారవ భాగము విష్ణువునకు చెందగా మిగిలిన పదునైదులుభాగము శ్రీకృష్ణునకు చెందును.
నిర్గుణుడు, సర్వపరిపూర్ణుడైన శ్రీకృష్ణునకు నైవేద్యముయొక్క అవసరము లేకున్నను, భక్తుడు ఇచ్చిన నైవేద్యమును స్వీకరించి తన చల్లని దృష్టితో ఆ భక్తునకు మరల అన్ని సంపదలు కలుగునట్లు చేయును.
శ్రీ కృష్ణుడా బాలకునకు మంత్రమును, వరమును ఇచ్చి ఇంకను మీకు కావలసిన దేదియైన ఉన్నచో అడుగుమని, దానిని సంతోషముతో ఇత్తునని పేర్కొనెను.
కృష్ణస్య వచనం శ్రుత్వా తమువాచ మహావిరాట్ ।
అదంతో బాలకస్తత్ర వచనం సమయోచితం॥
శ్రీకృష్ణుని పలుకులు విని దంతములు సహితము రాని బాలకుడైన మహావీరాట్పురుషుడు సమయోచితముగా ఇట్లు పలికెను.
మహావీరాడువాచ- మహావిరాట్పురుషుడిట్లనెను-
వరం మే త్వత్పదాంభోజే భక్తిర్భవతు నిశ్చలా ।
సంతతం యావదాయుర్మే క్షణం నా సుచిరం చవా ॥
త్వద్భక్తియుక్తో యో లోకే జీవన్ముక్తః స సంతతం ।
త్వద్భక్తి హీనో మూర్ఖశ్చ జీవన్నపి మృతో హి స ॥
కిం తబ్జిపేన తపసా యజ్ఞేన యజమేన చ ।
వ్రతేనైవోపవాసేన పుణ్యతీర్థని సేవయా ॥
యావదాత్మా శరీరే తావత్ స్యాచ్ఛక్తి సంయుతం ।
పశ్చాద్యాంతి గతే తస్మిన్ న స్వతంత్రాశ్చ శక్తయః ॥
స చ త్వం చ మహాభాగ సర్వాత్మా ప్రకృతేః పరః ।
స్వేచ్చామయశ్చ పర్వాద్యో బ్రహ్మ జ్యోతిః సనాతనః॥
ఇత్యుక్త్వా బాలకస్తత్ర వీరరామ చ నారద ।
ఉవాచ కృష్ణ: ప్రత్యుక్తిం మధురాం శ్రుతీసుందరీం ॥
భగవన్! నేను బ్రతికి యుండునంతవరకు ఎల్లప్పుడు నీ పాదపద్మములపై భక్తియుండునట్లు నన్ననుగ్రహింపుము. నీభక్తి కలవాడు ఈ లోకమున బ్రతికియున్నను మోక్షమందినవాడు, నీభక్తిలేని మూర్ఖుడు బ్రతికియున్నను చనిపోయినవానితో సమామడు. వీభక్తిలేనిచో జపించినను తపస్సు చేసినను, యాగములు చేసినమ, ప్రతములాచరించినను, ఉపవాసములు చేసినను, పుణ్య తీర్ధములు సేవించినను ఫలితముండదు.
శరీరమున ఆత్మ ఉండునంతవరకే మానవుడు శక్తి కలిగి యుండును. ఆ ఆత్మ శరీరమునుండి దూరమైనచో ఆ శక్తులేవి పనికిరావు.
ఆట్టి పరమాత్మవైన నీవు ప్రకృతి కంటె శ్రేష్ఠుడవు. స్వేచ్ఛామయుడవు. పరబ్రహ్మవు. జ్యోతి స్వరూపుడవు. సనాతనుడవు.
ఈ విధముగా మహావిరాడ్రూపుడైన బాలకుడు పలుకగా శ్రీకృష్ణుడు చెవులకింపు కలిగించునట్లు మధురముగా ఇట్లు పలికెమ.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-
సుచిరం సుస్థిరం తిష్ఠ యథాఽహం త్వం తథా భవ ।
ఆసంఖ్య బ్రహ్మణాం పొతే పాతస్తే న భవిష్యతి॥
అంశేన ప్రతి విధ్యండే త్వం చ పుత్ర విరాట్ భవ ।
త్వన్నాభిపద్మే బ్రహ్మా చ విశ్వస్రష్టా భవిష్యతి ॥
లలాటే బ్రహ్మణశ్చైవ రుద్రాశ్చైకాదశైవ తు ।
శివాంశేవ భవిష్యంతి సృష్టి పంచరణాయ వై ॥
కాలాగ్నిరుద్రక్షేష్వేకో విశ్వసంహార కారకః ।
పాతా విష్ణుశ్చ వీషయీ క్షుద్రాంశేన భవిష్యతి ॥
మద్భక్తియుక్తః సతతం భవిష్యసి వరేణ మే ।
ధ్యాన కమనీయం మాం వీత్యం ద్రక్ష్యసి నిశ్చితం ॥
మాతరం కమనీయం చ మమ వక్షస్థలస్థితాం ।
యామీ లోకం తీర్థవతత్యుక్త్యా సోఽతరధీయత ॥
బాలకా! నావలె నీవుమ చాలాకాలము స్థిరముగా మండుము. ఆసంఖ్యాకులైన బ్రహ్మదేవులు గతించినను వీకు మాత్రము మరణమురాదు. ప్రతి బ్రహ్మాండమున ఏ అంశచేత విరాట్ స్వరూపుడవుగా కమ్ము, వీయొక్క నాభిపద్మమున వ్వీములను సృష్టించు బ్రహ్మదేవుడు ఉద్భవించును. బ్రహ్మదేవుని లలాటమున శివాంశవలన సృష్టిస్థితికై పదకొండుగురు రుద్రులు ఉద్భవింతురు. ఆ రుద్రులలో సంహారకుడైన కాలాగ్ని రుద్రుడొకడు. నీయొక్క అతి తక్కువనైవ ఆంశవలన లోకరక్షకుడైన విష్ణువు ఉద్భవించును.
నాయొక్క వరమువలన ఎల్లప్పుడు నా భక్తి కలిగి యుందువు. ధ్యానమున నన్ను ఎల్లప్పుడు చూడగలప్పు, అట్లే నా వక్షస్థలముపై నున్న నీ తల్లిని కూడా ధ్యానమున చూడగలవు. ఇక నేను పోయివత్తునని చెప్పి ఆ శ్రీకృష్ణపరమాత్మ అంతర్ధావము చెందెను.
గత్వా చ నాకం బ్రహ్మాణం శంకరం స ఉవాచ హ ।
స్రష్టారం స్రష్టుమీశం చ సంహర్తారం చ తక్షణం ॥
శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకమునకు వెళ్ళి విశ్వసష్ట యగు బ్రహ్మతో, విశ్వ సంహారకుడైన శంకరునితో ఇట్లు పలికను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీ కృష్ణుడిట్లనెను-
సృష్టి స్రష్టుం గచ్చ వత్స వాభిపద్మోద్భవో భవ ।
మహావిరాట్ రోమకూపే క్షుద్రస్య చ విధేః శ్రుణు॥
గచ్చ వత్స మహాదేవ బ్రహ్మభాలోద్భవో భవ ।
అంశేన చ మహాభాగl స్వయం చ సుచిరం తపః ॥
ఇత్యుక్త్యా జగతాం నాథో విరరామ విధేః సుత ।
జగామ నర్వా తం బ్రహ్మ శివశ్చ శివదాయకః ॥
బ్రహ్మదేవా! నీవు మహావీరాట్ స్వరూపుని యొక్క రోమకూపమునందున్న, చిన్నవి విరాడ్రూపముయొక్క వాలి పద్మమున పుట్టి సృష్టిని చేయుటకై వెళ్ళుము. అట్లే మహాదేవుడా వీపు స్వయముగా అంతులేని తపమాచరించి విరాడ్రూపుని అంశవలన బ్రహ్మదేవుని పాలభాగమునండి జన్మనెత్తుము.
ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ శిపులతో మాట్లాడి వారి నమస్కారములను స్వీకరించి గోలోకమునకు వెళ్ళను.
మహావిరాట్ రోమకూపే బ్రహ్మాండే గోళకి జలే ।
సబభూవ విరాట్ క్షుద్రో నిరాడంశేన సాంప్రతం ॥
శ్యామో యువా పీతవాసాః శయానో జలతల్పకే ।
ఈషద్ధాసః ప్రసన్నాస్న్యో విశ్వరూపే జనార్ధనః ॥
తన్నాభికమలే బ్రహ్మా బభూవ కమలోద్భవః ।
సంభూయ పద్మ దండంచ బభ్రామ యుగలక్షకం ॥
నాంతం జగామ దండస్య పద్మనాభస్య పద్మజః ।
వాభిజస్య చ పద్మస్య చింతామా పితామహః ॥
స్వస్థానం పునరాగత్య దద్యౌ కృష్ణపదాంబుజం ।
తతో దదర్శ క్షుద్రం తం ధ్యాత్వా తద్దివ్య చక్షుషా ॥
శయానం జలతల్పేచ బ్రహ్మాండ పిండమావృతే ।
యల్లోమకూపే బ్రహ్మాండం తంచ తత్పరమీశ్వరం ॥
శ్రీకృష్ణం చాపి గోలోకం గోప గోపీ సమన్వితం ।
తం సంస్తూయ వరం ప తతః సృష్టిం చకార సః ॥
బభూవుగ్రహ్మణః పుత్రా మానసా సనకాదయః ।
ఈ రుద్రా: కపాలాచ్చ శివస్యైకాదశ స్మృతాః ॥
బభూవ పాతా విష్ణుశ్చ వామే క్షుద్రస్య పార్వతః ।
చతుర్భుజశ్చ భగవాన్ శ్వేత ద్వీప నివాసకృత్ ॥
క్షుద్రస్య నాభిపద్మే చ బ్రహ్మా విశ్వం ససర్ణ సః ।
స్వర్గం మర్త్యంచ పాతాళం త్రిలోకం సచరాచరం ॥
ఏవం సర్వం రోమకూపే విశ్వం ప్రత్యేక మేవచ ।
ప్రతి విశ్వం క్షుద్రవిరాట్ బ్రహ్మ విష్ణు శివాయ:॥
మహావిరాట్ స్వరూపుని యొక్క రోమకూపమునందలి బ్రహ్మాండమున గోళక జలమున విరాడంశతో చిన్న విరాట్ స్వరూపుడు ఉద్భవించెను. ఆ. చిన్ననైన విరాడ్రూపుడే శ్యామవర్ణముగలవాడు, యువకుడు, పీతాంబరుడు, జలతల్పముపై పరుండువాడు, విశ్వరూపియగు జనార్దనుడు. ఆతని నాభికమలమున కమలోద్భవుడైన బ్రహ్మదేవుడు జన్మించెను. బ్రహ్మదేవుడు పుట్టిన తరువాత తాను పుట్టిన కమల వాళమున లక్షయుగములు తిరిగెను. ఐనను పద్మనాభుని నాభికమల నాళముయొక్క ఆంతుమ మాత్రమతడు చూడలేకపోయెను. అందువలన నతడు మిక్కిలి చింతించి, తిరిగి స్వస్థానమును చేరి, శ్రీకృష్ణుని పాదపంకజములనతడు ధ్యానించెను.
ఆ ధ్యానప్రభావమువలన దీవ్యచక్షువులను పొంది వాటిలో క్షుద్ర. (చిన్న) విరాడ్రూపునీ జలతల్పమున పడుకొనియున్న జనార్దనువి, ఆతవి రోము కూపములందున్న బ్రహ్మాండమును, తరువాత గోలోకముమ, గోపగోపికలలోనున్న పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని చూచి అతనిని స్తుతించి ఆతవి అనుగ్రహము పొందీ, పృష్టిని ప్రారంభించెను. ఆ బ్రహ్మకు మానసపుత్రులగు పనకాది మహర్షులుదయించిరి.
తరువాత అతని నోటినుండి శ్రీవాంశకలిగిన ఏకాదశరుద్రులు ఉదయించిరి.
క్షుద్ర విరాడ్రూపుని యొక్క ఎడమ భాగమున లోకరక్షకుడైన విష్ణువు చతుర్భుజములతో శ్వేత ద్వీపనివాసుడుగా ఆవిర్భవించెను. ఆ క్షుద్రవిరాడ్రూపుని నాభిపద్మమున ఉద్భవించిన బ్రహ్మదేవుడు చరాచరసృష్టి సహితమైన త్రిలోకములను సృష్టించెను.
ఈవిధముగా మహావిరాట్ స్వరూపుని రోమకూపములయందు అనంత విశ్వములు ప్రతివిశ్వమున క్షుద్రవీరాట్ స్వరూపుడు బ్రహ్మ విష్ణు శివాది దేవతలుద్భవించిరి.
ఇత్యేవం కథితం వత్స కృష్ణసంకీర్తనం శుభం ।
సుఖదం మోక్షదం పారం కిం భూయః శ్రోతు మిచ్చపి ॥
నారదా! ఈవిధముగా సుఖమును, మోక్షమును ఇచ్చు అనవరతమును తెలిపితిని. ఇంకను వీపు పైన దల్చుకొన్న దేదియైన ఉన్నచో తెలుపుము.
ఇతి శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణి ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే విశ్వబ్రహ్మాండ వర్ణనం నామ తృతీయోఽధ్యాయః ॥
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవ దగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున చెప్పబడిన విశ్వబ్రహ్మాండముల వర్ణనమను మూడవ అధ్యాయము సమప్తము.
Summary of chapter 3 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
This chapter illuminates the glorious manifestation, formal worship rites, and secret spiritual armor of Goddess Sarasvatī, the divine queen of wisdom, arts, and sacred eloquence. Originating from the mind of the Supreme Lord Śrī Kṛshṇa, Goddess Sarasvatī bestows intellectual clarity, poetic inspiration, and spiritual knowledge upon all who seek Her divine grace with a pure heart. Lord Brahmā and Lord Śrī Vishṇu worshipped Her with delicate white lotus flowers, fragrant sandalwood paste, and sublime hymns of praise, revealing the secret Sarasvatī Kavacha that protects the intellect of spiritual aspirants from ignorance, mental delusion, and spiritual blindness.