బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

56 -  రాధాకవచము

శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి మహేశునితో నిట్లు పలికెను-

పూజావిధానం స్తోత్రం చ శ్రుతమత్యద్భుతం మయా

అధునా కవచం బ్రూహి శ్రోష్యామి త్వత్ప్రసాదతః

మహేశ్వర! రాధాదేవియొక్క పూజావిధానమును ఆ దేవియొక్క స్తోత్రమును చక్కగా తెలిపితిరి. నాకు ఇప్పుడు రాధాదేవియొక్క కవచమును తెలుపగలరు.

శ్రీమహేశ్వర ఉవాచ- మహేశ్వరుడు పార్వతితో ఇట్లనెను-

శ్రుణువక్ష్యామి హే దుర్గే కవచం పరమాద్భుతం

పురా మహ్యం నిగదితం గోలోకే పరమాత్మనా

అతిగుహ్యం పరం తత్వం సర్వమంత్రౌసు విగ్రహం

యద్ధృత్వా పఠనాద్భ్రహ్మా సంప్రాప్తో వేదమాతరం

యద్ధృత్వాఽహం తవ స్వామీ సర్వమాతా సురేశ్వరీ

నారాయణశ్చ యద్ధృత్వా మహాలక్ష్మీమవాప సః

యద్ధృత్వా పరమాత్మా చ నిర్గుణ: ప్రకృతేః పరః

బభూవ శక్తిమాన్ కృష్ణు సృష్టి కర్తుం పురా విభుః

విష్ణు: పాతా చ యద్ధృత్వా సంప్రాప్త స్సింధుకన్యకాం

శేషో బీభర్తి బ్రహ్మాండం మూర్ద్ని సర్షపవద్యతః

ప్రత్యేకం లోమకూపేషు బ్రహ్మాండానీ మహావీరాట్

 బీభర్తి ధారణాద్యస్య సర్వాధారో బభూవ సః

యద్ధారణాచ్చ పఠనాద్ధర్మః సాక్షీ చ సర్వతః

యద్ధారణాత్కుబేరశ్చ ధనాధ్యక్షశ్చ భారతే

ఇంద్రః సురాణామీశశ్చ పఠనాద్ధారణాద్విభుః

నృపాణాం మనురీశశ్చ పఠనాద్ధారణాద్విభుః

శ్రీమాంశ్చంద్రశ్చ యద్ధృత్వా రాజసూయం చకారసః

 స్వయం సూర్యస్త్రిలోకేశః పఠనాద్ధారణాద్ధరి:

యద్ధృత్వా పఠనాదగ్ని: జగత్పూతం కరోతి చ

 యద్ధృత్వా పాతి పాతోఽయం పునాతిభువన త్రయం

యద్ధృత్వా చ స్వతంత్ర హి మృత్యుశ్చరతి జంతుషు

త్రీ:సప్తకృత్వో నీఃక్షత్రాo చకార చ వసుంధరాం

జామదగ్న్యశ్చ రామశ్చ పఠనాద్ధారణాత్ప్రభుః

పపౌ సముద్రో యద్ధృత్వా పఠనాత్కుంభ సంభవః

సనత్కుమారో భగవాన్ యద్ధృత్వా జ్ఞానినాంగురుః

జీవన్ముక్తౌ చ సిద్దౌ చ నరనారాయణావృషీ

యద్ధృత్వా పఠనాత్సిద్దో వసిష్ఠో బ్రహ్మపుత్రకః

సిద్దేశః కపిలో యస్మాత్ యస్మాదక్ష: ప్రజాపతిః

యస్మాద్భృగుశ్చ మాం ద్వేష్టి కూర్మ: శేషం బిభర్తీచ

 సర్వాధారో యతో వాయుః వరుణ: పవనో యతః

ఈశానో దిక్పతీశ్చైవ యమ: శాస్తా యతః శివే

 కాలః కాలాగ్ని రుద్రశ్చ సంహర్తా జగతాం యతః

 యద్ధృత్వా గౌతమః సిద్ధః కశ్యపశ్చ ప్రజాపతిః

 వసుదేవసుతాం ప్రాప చైకాంశేన తు తత్కళాం

 పుజా స్వజాయవిచ్చేదే దుర్వాసా మునిపుంగవః

సంప్రాప రామ: సీతాం చ రావణేన హృతాం పురా

పురానలశ్చ సంప్రాప దమయంతీం యతః సతీం

శంఖచూడో మహావీరో దైత్యానామీశ్వరో యతః

ఓదుర్గాదేవి! పూర్వము నాకు శ్రీకృష్ణపరమాత్మ తెలిపిన రాధా కవచమును నీకు చెప్పెదను. అదీ పరమాద్భుతమైనది. మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములే మూర్తీభవించినట్లున్నది. పరతత్వరూపమైనది.

ఈ రాధాదేవి కవచమును పఠించుచు బాహుమూలమున్ల దానిని ధరించుటవలననే బ్రహ్మదేవుడు వేదములకన్నీటికి తల్లియగు సావిత్రీదేవిని పొందెను. నేను నీకు భర్తనైతిని. నారాయణుడు మహాలక్ష్మీదేవికి భర్త అయ్యెను. రాధాకవచమును ధరించి పఠించుచున్నందువలననే పరమాత్మ, నిర్గుణరూపుడు, ప్రకృతికంటే శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు సృష్టిరచన చేయుచున్నాడు. విష్ణుమూర్తి సర్వజన రక్షకుడు సింధుకన్యకాప్రతీ యయ్యెను. ఆదిశేషుడు ఈ బ్రహ్మాండమునంతయు తన శిరస్సుపై ఆవగింజను మోయుచున్నట్లు అవలీలగా మోయుచున్నాడు, మహావీరాట్స్వరూపుడగు శ్రీ మహావిష్ణువు . తన రోమకూపములందు బ్రహ్మాండములనన్నిటిని ధరించి సర్వాధారుడు కాగలిగెను. ధర్మదేవత సైతము ఈ కవచమును ధరించినందువలన పఠించుచున్నందువలన సర్వసాక్షిగా అయ్యేను. ఈ కవచముయొక్క మహిమవల్లనే కుబేరుడు ధనపతిగాను, ఇంద్రుడు దేవతాపతిగాను.. మనువు మానవులందరకు అధిపతిగాను, సూర్యుడు ముల్లోకములయందు పూజితుడుగాను, ఆగ్నిదేవుడు పరమ పవిత్రుడుగానున్నారు. వాయుదేవుడు ఈ కవచముయొక్క మహిమవలన ముల్లోకములను పవిత్రముచేయగలుచున్నాడు. మృత్యువు అందరను సమానముగా చూచుచున్నాడు. జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు ఇరువది యొక్కమారులు ఈ భూమండలమంతయు తిరిగి దీనిని క్షత్రీయరహితముగా చేయగలిగెను. సనత్కుమారముని మిక్కిలి జ్ఞానవంతుడాయెను. నరనారాయణ ఋషులు జీవన్ముక్తులు, సిద్దులైనారు. వసిష్ఠుడు బ్రహ్మదేవుని పుత్రుడయ్యెను. దీనివలననే కపిలమహర్షి సిద్ధేశుడుగను, దక్షుడు ప్రజాపతిగాను, భృగుమహర్షి నన్ను ద్వేషించునంతవాడుగాను, ఆదీకూర్మము ఆదిశేషుని భరించువాడుగనునైరి. వాయుదేవుడు సర్వాధారుడయ్యేను. ఈశ్వరుడు దిక్పాలకుడయ్యెను. యమధర్మరాజు సమస్తమును శాసించగలుగుచున్నాడు. కాలుడు, కాలాగ్ని రుద్రుడు సమస్తజగములను సంహరింపగల్గిరీ. ఈ కవచము యొక్క ప్రభావము వలన గౌతముడు, సిద్దుడుగాను, కశ్యపమునీ ప్రజాపతిగాను కాగలిగిరి. దుర్వాస మహాముని తన భార్యగతించినప్పుడు రాధాదేవి అంశగలస్తీని భార్యగా పొందెను. ఆట్లే రామచంద్రుడు రావణాసురునిచే అపహరింపబడిన సీతాదేవిని పొందగలిగెను. కలిదోషమువలన దూరమైన తన భార్యను నలుడు పొందగలిగెను. ఈ కవచముయొక్క గొప్పతనము వలన శంఖచూడుడను మహావీరుడు దానవవీరుడు కాగలిగెను.

వృషో వహతి మాం దుర్గే యతో గరుడో హరీం

ఏవం సంప్రాప సంసిద్ధిం సిద్దాశ్చ మునయ: పురా

యద్ధృత్వామహాలక్ష్మీః ప్రదాత్రీ సర్వసంపదాం

సరస్వతీ సతాంశ్రేష్ఠా యత: క్రీడావతీ రతిః

సావిత్రి వేదమాతా చ యతః సిద్ధిమవాప్నుయాత్

సింధుకన్యా మర్త్యలక్ష్మీర్యతో విష్ణుమవాప సా

 యద్ధృత్వా తులసీ పూజా గంగా భువన పావనీ

యద్ధృత్వా సర్వసస్యాడ్యా సర్వాధారా వసుంధరా

యద్ధృత్వా మనసా దేవీ సిద్ధావై విశ్వపూజితా

యద్ధృత్వా దేవమాతా చ విష్ణుం పుత్రమ వాప సా

 పతివ్రతా చ యద్ధృత్వా లోపా ముద్రాఽప్యరుంధతీ

లేభే చ కపిలం పుత్రం దేవహూతీ యతః సతీ

ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ ప్రాప చ తత్ర్పసూః

త్వన్మాతా చాపి సంప్రాప త్వాం దేవీం గిరిజా యతః

ఏవం సర్వే సిద్ధగణాః సర్యైశ్వర్య మవాప్నుయుః

శ్రీరాధాదేవియొక్క కవచ మాహాత్మ్యము వలన నందీశ్వరుడు నన్ను, గరుత్మంతుడు శ్రీహరిని మోయగలుగుచున్నారు. ఇట్లే మునులు సిద్ధులు ఆ కవచము వలన సిద్ధిని పొందిరి. ఆ కవచ మహిమవలన మహాలక్ష్మీదేవి సమస్త సంపదలనొసగగలిగినది. ఆట్లే సరస్వతీదేవి పరమపూజ్యురాలైనది. రతీదేవి క్రీడావతియయ్యెను. అదేవిధముగా సావిత్రీదేవి వేదములకు మాతయై సిద్దిని పొందెను. మర్త్యలక్ష్మియగు ఫింధుసుత శ్రీమహావిష్ణువును భర్తగా పొందినది. ఆ కవచ మహిమవలననే తులసీదేవి పరమపవిత్రమైనది. గంగాదేవి ముల్లోకములను పవిత్రము చేయగలిగినది. అట్లే మనసాదేవి సిద్దురాలై ప్రపంచమునందంతట పూజలను అందుకొన్నది. దేవమాతయగు ఆదితీదేవి శ్రీమహావిష్ణువును ఉపేంద్రరూపమున పుత్రునిగా పొందగలిగినది, ఈ కవచము వలననే ఆరుంధతి మరియు లోపాముద్రలు పతివ్రతలైరి. దేవహూతీదేవి మహావిష్ణురూపుడైన కపిలుని పుత్రునిగా పడసినది. నీ తల్లియగు మేనాదేవి నిన్ను పొందినది.

ఇట్లు రాధాదేవియొక్క కవచ మహిమవలన సిద్ధులందరు సమస్తిశ్వర్యముల పొందగలిగిరి.

శ్రీ జగన్మంగళస్యాస్య కవచస్య ప్రజాపతిః

ఋషిశ్చందోఽస్య గాయత్రీ దేవీ రాసేశ్వరీ స్వయం

శ్రీకృష్ణభక్తిపంప్రాప్తౌ వినియోగః ప్రకీర్తితః

శిష్యా య కృష్ణభక్తాయ బ్రాహ్మణాయ ప్రకాశయేత్

శఠాయ పరశిష్యాయ దత్వా మృత్యుమవాప్నుయాత్

రాజ్యం దేయం శిరోదేయం న దేయం కవచం ప్రియే

కంఠే ధృతమీదం భక్త్యా కృష్ణేన పరమాత్మనా

మయాదృష్టం చ గోలోకి బ్రహ్మణా విష్ణుణా పురా

ఓం రాధేతి చతుర్ధ్యంతం వహ్నిజాయాంతమేవచ

కృష్ణైనోపాసితో మంత్ర కల్పవృక్ష శిరోఽవతు

ఓ హ్రీం శ్రీం రాదికాం జేంతం వహ్నిజాయాంతమేవ చ

కపాలం నేత్రయుగ్మం చ శ్రోత్రయుగ్మం సదాఽవతు

ఓం ఐం హ్రీం శ్రీం రాధికాయై వహ్నిజాయాంతమేవ చ

మస్తకం కేశ సంఘాంశ్చ మంత్రరాజుః సదాఽవతు

 ఓం రాం రాధాచతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవ చ

 సర్వసిద్ది ప్రదః పాతు కపోలం నాసికాం ముఖం

 క్లీం కృష్ణప్రియాజేంత కంఠంసాoతు నమోoఽతకం

ఓం రాం రాసేశ్వరీం జేంతం స్కంధం పాతుమోంతకం

ఓం రాం రాసవిలాసిన్యై స్వాహా పృష్ఠం సదాఽవతు

బృందావన విలాసిన్యై స్వాహా వక్షః సదాఽవతు

తులసీ వనవాసిన్యై స్వాహా పాతు నీతంబకం

కృష్ణప్రాణాధీజేంతం స్వాహాంతం ప్రణవాదీకం

పాదయుగ్మం చ సర్వాంగం సంతతం పాతు సర్వతః

 ప్రాచ్యాం రక్షతు సారాధా వహ్నౌ కృష్ణప్రియాఽవతు

దక్షే రాసేశ్వరీ పాతు గోపీ నైఋతేఽవతు

పశ్చిమే నిర్గుణా పాతు పాయవ్యే కృష్ణుపూజితా

ఉత్తరే సంతతం పాతు మూలప్రకృతిరీశ్వరీ

సర్వేశ్వరీ సదైశాన్యాం పాతుమాం సర్వపూజితా

జలేస్థలే చాంతరిక్షే స్వప్నే జాగరణే తథా

 మహావిష్ణోశ్చ జననీ సర్వతః పాతు సంతతం

జగన్మంగళకారకమైన ఈ కవచమునకు బ్రహ్మదేవుడు ఋషి గాయత్రీ ఛందస్సు, రాసేశ్వరియగు రాధాదేవి దేవత. శ్రీకృష్ణుని యందు భక్తి కలుగుటకై ఈ కవచమును ఉపయోగింపవలెను. దీనిని శ్రీకృష్ణభక్తునకు మాత్రము ఉపదేశముచేయవలేను. దుష్టుడైన ఇతర దేవభక్తునకు దీనిని ఉపదేశించినచో ఆ గురువు వెంటనే చనిపోవును. రాజ్యమివ్వవచ్చును. తన ప్రాణమునైన ఇవ్వవచ్చును. కానీ అయోగ్యుడగువానికి ఈ కవచమును ఎట్టి పరిస్థితిలోను ఉపదేశింపరాదు.

ఈ కవచమును శ్రీకృష్ణపరమాత్మ తన కంఠమున ధరించెను. నేను, బ్రహ్మ, విష్ణువు కూడ ఈకవచమును ధరించుచున్నాము.

ఓం రాధాయై స్వాహా అను కల్పవృక్షమువంటి మంత్రమును శ్రీకృష్ణుడు ఉపాసనచేసెను. ఈ మంత్రము నాశిరస్సును కాపాడుగాక.

ఓం హ్రీం శ్రీం రాధికాయై స్వాహా అనుమంత్రము నా శిరస్సును, వెంట్రుకలను ఎల్లప్పుడు రక్షించుగాక.

ఓం రాం రాధాయైస్వాహా అనుమంత్రము నా చెక్కిళ్ళను నాసికను ముఖమును రక్షించుగాక.

ఓం క్లీం కృష్ణప్రియాయై స్వాహా ఆనుమంత్రము నా కంఠమును రక్షించుగాక, ఓం రాం రాసేశ్వర్యైస్వాహా అనునది నా భుజములను రక్షించుగాక, ఓం రాం రాసవిలాసిన్యై స్వాహా అనుమంత్రము నా వీపును కాపాడుగాక, ఓం బృందావన విలాసిన్యై స్వాహా అనుమంత్రము నా రొమ్మును రక్షించుగాక, ఓం తులసీవన వాసిన్యై స్వాహా అనునది నా నితంబముల రక్షించుగాక, ఓం కృష్ణ ప్రాణాధీకాయై స్వాహా అనునది నా పాదములను సమస్త అవయవములను ఎల్లప్పుడు రక్షించుగాక.

రాధాదేవి నా తూర్పుదిక్కున, కృష్ణప్రియ ఆగ్నేయ దిశలో, రాసేశ్వరి దక్షిణ దిశలో, గోపీశ నైఋతి దిశలో, నిర్గుణ పశ్చిమ దిశలో, కృష్ణపూజిత వాయవ్యదిశలో, మూలప్రకృతి ఈశ్వరి ఉత్తర దిశలో, సర్వేశ్వరి ఈశాన్యమున, సర్వపూజిత జలమున, స్థలమున, నిద్రించు సమయమున జాగ్రదావస్థలోను నన్ను ఎల్లప్పుడు రక్షించుగాక. శ్రీమహావిష్ణువునకు జననియగు రాధాదేవి నన్ను అన్నివైపులనుండి. ఎల్లప్పుడు రక్షించుచుండుగాక.

కవచం కథితం దుర్గే శ్రీ జగన్మంగళం పరం

యస్మై కస్మై న దాతవ్యం గుహ్యాద్గుహ్యతరం పరం

 తవస్నేహాన్మయ్యా ఖ్యాఽతం ప్రవక్తవ్యం న కస్యచిత్

 గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకార చందనైః

కంఠే వా దక్షిణే బాహౌ ధృత్వో విష్ణు సమో భవేత్

 శతలక్ష జపేనైవ సిద్దం చ కవచం భవేత్

యది స్యాత్ సిద్దకవచో న దగ్ద వహ్నినా భవేత్

ఏతస్మాత్కవచా ద్గుర్గే రాజా దుర్యోధనః పురా

విశారదో జలస్తంభం వహ్నిస్తంభం చ నిశ్చితం

మయా సనత్కుమారయ పురా దత్తం చ పుష్కరే

సూర్యపర్వణీ మేరౌ చ స సాందీపనయే దదౌ

బల్లాయ తేన దత్తం చ దదో దుర్యోధనాయసః

కవచస్య ప్రసాదేన జీవన్ముక్తో భవేన్నరః

నిత్యం పఠతి భక్త్యేదం తన్మంత్రోపాసకశ్చ యః

 విష్ణుతుల్యో భవేన్నిత్యం రాజసూయాఫలం లభేత్

స్నానేన సర్వతీర్థానాం సర్వదానేన యత్ఫలం

సర్వవ్రతోపవాసేన పృథివ్యాశ్చ ప్రదక్షిణె:

 సర్వయజ్ఞేషు దీక్షాయాం నిత్యం వై సత్యరక్షణే

నిత్యం శ్రీకృష్ణసేవాయార్ కృష్ణనైవేద్యభక్షణే

పాఠే చతుర్ణాం వేదానాం యత్ఫలం చ లభేన్నరః

 తత్ఫలం లభతే నూనం పఠనాత్కవచస్య చ

రాజద్వారే స్మశానే చ సింహవ్యాఘ్రాన్వితే వనే

దావాగ్నౌ సంకటే చైవ దస్యు చోరాన్వితే భయే

కారాగారే రిపుగ్రస్తే ఘోరే చ దృఢబంధనే

వ్యాధియుక్తో భవేన్ముక్తో ధారణాత్కవచస్య చ

పార్వతీ! లోకములకు మంగళమును కలిగించు రాధాదేవి కవచమును నీపైగల ప్రేమ చెప్పితిని. కాని దీనిని అందరకు చెప్పరాదు.

మంత్రోపదేశము చేయుచున్న గురువును శాస్తోక్తముగా వస్త్రములు, అలంకారములు చందనము మొదలగు వాటిచే గౌరవించి అతనిచే ఉపదేశించబడిన ఈ కవచమును కుడిచేతికో లేక కంఠమునకో కట్టుకొనవలెను. అట్లు చేసినచో అతడు విష్ణుమూర్తితో సమానుడు అగును.

ఈ కవచమును కోటిమార్లు జపించినచో అది. సిద్ధించును. కవచము సిద్ధించినచో ఆతనిని నిప్పు కాల్చలేదు. ఈ కవచముయొక్క సిద్దిపొందినందువలననే దుర్యోధనుడు జలస్తంభ వహ్నిస్తంభవిద్యలలో నిష్ణాతుడయ్యెను.

దీనిని నేను పుష్కరక్షేత్రమున సనత్కుమారున కుపదేశింపగా అతడు సూర్యసంక్రమణ సమయమున మేరు పర్వతమున సాందీపనికి ఉపదేశించెను. సాందీపని బల్లున కుపదేశింపగా బల్లుడు దుర్యోధనునకుపదేశించెను.

ఈ కవచముయొక్క మహిమవలన మానవుడు జీవన్ముక్తుడగును. దీనిని ప్రతిదినము చదువుచు రాధామంత్రమును ఉపాసన చేసినచో అతడు విష్ణుమూర్తితో సమానుడగును. రాజసూయయాగ ఫలితమును కూడ పొందును. సమస్త పుణ్యతీర్థములలో స్నానముచేసినచో, సమస్త దానములు చేసినచో, అన్ని వ్రతములను అనుష్ఠించినచో, భూప్రదక్షిణలు చేసినచో, సమస్త యజ్ఞములు చేసినచో, సత్యధర్మమును చక్కగా పరిపాలించినచో, ప్రతిదినము శ్రీకృష్ణుని అర్చించినచో, శ్రీకృష్ణునకు నివేదితమైన అన్నమును భుజించినచో, నాలుగువేదములను పఠించినచో కలుగు పుణ్యము ఈ రాధాదేవి కవచమును శ్రద్దగా పఠించినచో కలుగును.

రాజసన్నిధిలోను, స్మశానములోను, సింహములు, పులులు మొదలైన క్రూర మృగములున్న అడవిలోను, దోపొగ్నియందును, కష్టములందును, దస్యులు చోరులవల్లను, కారాగారమునను, శత్రువులు పైనబడినప్పుడు, దృఢముగా బంధించినపుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు కలుగు భయమంతయు ఈ కవచమును చదివినంత మాత్రముననే లేక ఈ కవచమును కంఠముననో లేక కుడిచేతికి కట్టుకున్నంతమాత్రమున నశించిపోవును. అతడు జీవన్ముక్తుడు కూడ అగుచున్నాడు.

ఇత్యేతత్కథితం దుర్గే తవైవేదం మహేశ్వరి

త్వమేవ సర్వరూపా మాం మాయా పృచ్ఛసి మాయయా

ఓ దుర్గా ఈ విధముగా నీకు శ్రీ రాధాకవచమును తెల్పితిని. నీవు సమస్తము తెలిసినదానవు, సమస్త భూత రూపిణీవి. ఐనను నన్ను కావలెనని అడుగుచున్నొవని మహేశ్వరుడనెను. శ్రీనారాయణ ఉవాచ- సారాయణముని నారదునితో నిట్లనెను-

ఇత్యుక్త్వా రాధికాఖ్యానం స్మారం స్మారం చ మాధవం

పులకాంకిత సర్వాంగః సాశ్రునేత్రో బభూవ సః

 న కృష్ణసదృశో దేవో న గంగా సదృశీ సరిత్

న పుష్కరాత్పరం తీర్థం న వర్ణో బ్రాహ్మణాత్పరః

పరమాణోః పరం సూక్ష్మం మహావిష్ణోః పరో మహాన్

నభః పరం చ విస్తీర్ణం యథా నాస్త్యైవ నారద

యథా న వైష్ణవాత్ జ్ఞానీ యోగీంద్రః శంకరాత్పరః

కామక్రోధలోభమోహో జీతాస్తేనైవ నారద

స్వప్నే జాగరణే శశ్వత్ కృష్ణధ్యానరతః శివః

యథా కృష్ణస్తథా శంభు ర్నభేదో మాధవేశయో:

యథా శంభుర్వైష్ణవేషు యథా దేవేషు మాధవః

తథేఽదం కవచం వత్స కవచేషు ప్రశస్తకం

మహేశ్వరుడు ఈ విధముగా పార్వతీదేవికి రాధాదేవియొక్క ఉపాఖ్యానమును చెప్పుచు మాటిమాటికి రాధాపతియగు మాధవుని తలచుకొని అవయవములన్నియు పులకించిపోగా, ఆనందబాష్పములు రాలుచుండగా ఇట్లు చెప్పెను.

శ్రీకృష్ణపరమాత్మవంటి దేవుడు, గంగానదివంటి పవిత్రమైననది, పుష్కర కాలమున పవిత్రమైయున్న తీర్థము, బ్రాహ్మణుని వంటి జాతి, పరమాణువునకంటే చిన్నని వస్తువు, మహావిష్ణువుకన్న గొప్పవాడు, ఆకాశముకంటె విశాలమైన వస్తువు. వైష్ణవున కన్న గొప్ప జ్ఞాని, శంకరుని మించిన యోగి ఏవిధముగా లేడో అట్లే రాధా కవచముకంటె గొప్పకవచమేది లేదు.

పరమశివుడు నిద్రలోను, జాగ్రదవస్థలోను ఎల్లప్పుడు శ్రీకృష్ణునే ధ్యానించుచుండును. శివకేశవులమధ్య లేశమైనను భేదములేదు.

విష్ణుభక్తులలో శంకరుడు, దేవతలలో శ్రీ మహావిష్ణువు ఏ విధముగా ఉత్తములో అట్లే కవచములన్నిటిలోను రాధికా కవచమును సర్వోత్తమమైనది.

శి శబ్దోమంగళార్థశ్చ వకారోదాతృవాచకః

మంగళానాం ప్రదాతా యః స శివః పరికీర్తితః

 నరాణాం సంతతం విశ్వేశం కల్యాణం కరోతి యః

కల్యాణం మోక్ష ఇత్యుక్తం స ఏవం శంకరః స్మృతః

బ్రహ్మాదీనాం సురాణాం చ మునీనాం వేదవాదీనాం

తేషాం చ మహతాం దేవో మహాదేవః ప్రకీర్తితః

 మహతీ పూజితా విశ్వే మూలప్రకృతిరీశ్వరీ

తయా దేవః పూజితశ్చ మహదేవః స చ స్మృతః

విశ్వస్థానాం చ సర్వేషాం మహతామీశ్వర: స్వయం

మహేశ్వరం చ తేనేమం ప్రవదంతి మనీషిణః

హే బ్రహ్మపుత్ర ధన్యోసి యద్గురుశ్చ మహేశ్వరః

 శ్రీకృష్ణభక్తిదాతా యో భవాన్ పృచ్ఛతి మాంచ కిం

'శి' అను శబ్దము మంగళమను అర్థమునిచ్చును. 'వ' అను శబ్దము దాత అను అర్థమునిచ్చును. మంగళప్రదాత కావున అతనిని శివుడని పిలుచుచున్నారు. అట్లే మానవులందరకు 'శం'' అనగా కల్యాణము లేక మోక్షమునిచ్చువాడు కావున అతడు శంకరుడయ్యెను. బ్రహ్మాది దేవతలకు మునులందరిలోను మహాత్ములైన వారందరకు దేవుడు కావున మహాదేవుడయ్యేను. అట్లే ప్రపంచముననున్న మహాత్ములందరకు ఈశ్వరుడు కావున మహేశ్వరుడని పిలువబడుచున్నాడు.

ఓ నారదా! నీవు చాలా ధన్యుడవు. నీ గురువు శ్రీకృష్ణభక్తిని కలిగించు సాక్షాత్ మహేశ్వరుడు. ఐనను నీవునన్ను శ్రీకృష్ణసంబంధములైన విషయములను తెల్పుమని అడుగుచున్నందువలన నేను కూడ ధన్యుడనైతిని.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే రాధికోపాఖ్యానే తన్మంత్రాది కథనం నామ షట్పంచాశత్తమోఽధ్యాయః ఇతి రాధోపాఖ్యానం

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానములో రాధాదేవి మంత్రాది విషయములు గల యాభైయారవ అధ్యాయము సమాప్తము.

రాధోపాఖ్యానము సమాప్తమైనది.