బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

36 – ఇంద్రునకు దుర్వాసమహర్షి శాపము పెట్టుట

నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-

నారాయణప్రీయా సా చ వరా వైకుంఠవాసినీ

వైకుంఠాధిష్ఠాతృదేవీ మహాలక్ష్మీః సనాతనీ

కథం బభూవ సా దేవీ పృథివ్యాం సింధు కన్యకా

 కిం తత్ ధ్యానం చ కవచం సర్వం పూజావిధి క్రమం

పురా కేనస్తుతాఽదౌ సా తన్మే వ్యాఖ్యాతుమర్హసి

వైకుంఠవాసిని, శ్రీమన్నారాయణునకు పత్నియగు మహాలక్ష్మి సింధుకన్యకగా ఎట్లు మారెను. ఆమె యొక్క ధ్యానము, కవచము, పూజావిధి మొదలగు వాని. నన్నిటిని నాకు వివరించుమని ఆడిగెను.

నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

పురా దుర్వాససః శాపాత్ భ్రష్టశ్రీకః పురందరః

బభూవ దేవసంఘశ్చ మర్త్యలోకశ్చ నారద

 లక్ష్మీ: స్వర్గాదికం త్యక్త్యా రుషా పరమ దుఃఖితా

గత్వా లీనా చ వైకుంఠే మహాలక్ష్మ్యాం చ నారద

తదా శోకాద్యయుర్దేవాః దుఃఖితాః బ్రహ్మణః సభాం

బ్రహ్మాణం చ పురస్కృత్య యయు: వైకుంఠమేవ చ

వైకుంఠే శరణాపన్నా దేవా నారాయణే పరే

ఆతీవ దైన్యయుక్తాశ్చ శుష్క కంఠౌష్ఠ తాలుకాః

తదా లక్ష్మీశ్చ కళయా పురా నారాయణాజ్ఞయా

బభూవ సింధుకన్యా సా శక్ర సంపత్స్వరూపిణీ

పూర్వము దూర్వాస మహర్షి శాపమున దేవేంద్రుడు, దేవతాసమూహము, మానవలోకము లక్ష్మిని కోలుపోయినది. లక్ష్మీదేవి స్వర్గమును, భూమిని వదలి వైకుంఠమునకు పోయి మహాలక్ష్మిలో లీనమైనది. ఆందువలన దేవతలు మిక్కిలి దుఃఖమునంది బ్రహ్మదేవుని దగ్గరకు పోయిరి. ఆక్కడ బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని వైకుంఠమునకు పోయి పొరందరు మిక్కిలి దీనులై శ్రీమన్నారాయణుని శరణువేడిరి.

ఆప్పుడు నారాయణుని ఆజ్ఞవలన లక్ష్మీదేవి దేవేంద్రుని సంపత్స్వరూపిణియై క్షీరాబ్ది కన్యగా జన్మించినది.

తదా మధిత్వా క్షీరోదం దేవా దైత్య గణైః సహా

సంప్రాపుశ్చ వరం లక్ష్మ్యా దద్రుశుస్తాం చ తత్ర హి

సురాదిభ్యోపరం దత్వా వనమాలాం చ విష్ణవే

దదౌ ప్రసన్నవదనా తుష్టా క్షీరోదశాయినే

దేవాశ్చాప్యసురాక్రాంతం రాజ్యం ప్రాపుశ్చ తద్వరాత్

తాం సంపూజ్య చ సంస్తూయ సర్వత్ర చ నిరాపదః

దేవతలందరు శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞవలన రాక్షసులతో కలసి క్షీరసముద్రమును మథించి ఆచ్చట లక్ష్మీదేవిని దర్శించగలిగిరి. అట్లే వారు లక్ష్మీదేవి వలన వరమును పొందిరి. లక్ష్మీదేవి దేవతలకు అనుగ్రహమునొసగి, శ్రీమహావిష్ణువునకు పరమాలను సమర్పించి శ్రీమహావిష్ణువు పై తన సంతోషమును వ్యక్తపరచినది.

లక్ష్మీదేవి అనుగ్రహమువలన దేవతలు రాక్షసులాక్రమించుకొన్న రాజ్యమును తిరిగి సంపాదించుకొని ఆమెను స్తుతించిరి. పూజించిరి.

నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-

కథం శశాప దుర్వాసాః మునిశ్రేష్ఠ: పురందరం

కేన దోషేణ వా బ్రహ్మన్ బ్రహ్మిష్ఠం బ్రహ్మవిత్పురా

మమంథ కేన రూపేణ జలధిస్తైః సురాదిభిః

కేన స్తోత్రేణ సా దేవీ శక్తే సాక్షాద్బభూవ హ

కోవా తయోశ్చ సంవాదో హ్యభవత్తద్వద ప్రభో

ముని శ్రేష్టుడగు దుర్వాసుడు దేవేంద్రుని ఏకారణమువలన శపించెను? సముద్రము పోరితో ఏవిధముగా మధింపబడినది? దేవేంద్రుడామెను ఏవిధముగా స్తుతించెను, లక్ష్మీదేవి దేవేంద్రులమధ్య ఎటువంటి సంభాషణ నడిచెను. దానినంతయు నాకు వివరింపుము. అని అడిగాను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

మధుపాన ప్రమత్తశ్చ త్రైలోక్యాధిపత: పురా

క్రీడాం చకార రహసి రంభయా సహ కాముకః

కృత్వా క్రీడాం తయా సార్థం కాముక్యా హృత చేతసః

తస్థౌ తత్ర మహారణ్యే కామోన్మథత చేతనః

కైలాస శిఖరం యాంతం వైకుంఠాదృషిపుంగవం

దుర్వాససం దదర్శేంద్రో జ్వలంతం బ్రహ్మతేజసా

గ్రీష్మ మధ్యాహ్న మార్తండ సహస్ర ప్రభమీశ్వరం

ప్రతప్త కాంచనాభాసం జటా భార మహేశ్వరం

శుక్ల యజ్ఞోపవీతం చ చీరం దండం కమండలుం

 మహోజ్వలం చ తిలకం బిభ్రతం చంద్రసన్నిభం

సమవ్వితం శిష్యవర్గైర్వేద వేదాంగ పారగైః

దృష్ట్వా నవామ శిరసా సంభ్రమత్తం పురందరః

శిష్యవర్గం సభక్త్యా వై  తుష్టావ చ ముదాన్వితః

మునీనా చ సశిష్యేణ తస్మై దత్తాశ్శుభాశీషః

విష్ణుదత్తం పారిజాత పుష్పం చ సుమనోహరం

మృత్యురోగ జలాశోకహరం మోక్షకరం దదౌ

ఒకప్పుడు త్రిలోకాధిపతియైన దేవేంద్రుడు మధుపానము చేసి రహస్యప్రదేశమున రంభతో క్రీడింపసాగెను. అచ్చట ఆతడు కామము వలన కన్ను - గానకయుండెను.

ఆసమయమున వైకుంఠమునుండి కైలాసమున కేగుచు ఋషిపుంగవుడగు దుర్వాసమహర్షి అచ్చటికి వచ్చెను. ఆ ముని గ్రీష్మకాలమునందలి మధ్యాహ్న సూర్యునివలె వెలిగిపోవుచుండెను. బంగారు వన్నెతో గొప్పని జటాభారమును, తెల్లనీ యజ్ఞోపవీతమును, తెల్లని వస్త్రమును, దండకమండలువులను, చంద్రబింబమంత తిలకమును ఆ మహర్షి ధరించి యుండెను. అతని వెంట వేదవేదాంగపారంగతులైన అతని శిష్యులుండిరి.

వారిని చూచి దేవేంద్రుడు. వెంటనే వారి కందరకు నమస్కరించెను. ఆప్పుడు దుర్వాసుడు అతని శిష్యులు అతనికి ఆశీస్సులనొసగిరి. దుర్వాసుడతనికి విష్ణుమూర్తి తనకిచ్చిన పారిజాతపుష్పమును ఇచ్చెను. ఆ పుష్పము మృత్యువు, ముసలితనము, రోగము, దుఃఖము మొదలగు వానినన్నిటిని తొలగించునది. మోక్షమును కలిగించునది. మిక్కిలి మనోహరమైనది.

శక్ర: పుష్పం గృహీత్వా చ ప్రమత్తో రాజసంపదా

భ్రమేణ స్థాపయామాస తత్రవై హస్తిమస్తకే

హస్తీ తత్ స్పర్శమాత్రేణ రూపేణ చ గుణేనన

 తేజసా వయసా కాంత్యా విష్ణుతుల్యో బభూవ హ

త్వక్త్వా శక్రం గజేంద్రశ్చాప్యగచ్ఛత్ ఘోరకాననం

నశశాక మహేంద్రస్తం రక్షితుం తేజసా మునే

దేవేంద్రుడు దుర్వాసుడిచ్చిన పారిజాతపుష్పమును తీసికొని రాజ్యమదమువలన దానిని తన ఐరావతముయొక్క శిరస్సుపై నుంచెను. ఆ ఏనుగు పారిజాతపుష్పముయొక్క స్పర్శమాత్రముననే గుణమున, వయస్సున, కాంతితో, విష్ణుమూర్తిలో సమానమయ్యెను. అందువలన ఆ గజేంద్రము దేవేంద్రుని వదలి భయంకరమైన అడవికి వెళ్ళిపోయెను. ఆ సమయమున దేవేంద్రుడు దానిని పట్టుకొనలేకపోయెను.

తత్పుష్పం త్యక్తవంతం చ దృష్ట్యా శక్రం మునీశ్వరః

తం శశాప మహాతేజాః క్రోధసంరక్తలోచనః

దుర్వాసుడు తానిచ్చిన పుష్పమును దేవేంద్రుడు గౌరవించక, పారవేసిన విషయమును గమనించి కోపముతో అతనినిట్లు శపించెను.

దుర్వాసా ఉవాచ- దుర్వాసుడిట్లనెను-

 ఆరే శ్రీయా ప్రమత్తస్యం కథం మా మనమన్యసే

మద్దత్త పుష్పం గర్వణ వ్యక్తవాన్ హస్తిమస్తకే

 విష్ణోర్శివేదీతం పుష్పం నైవేద్యం వా జలం ఫలం

 ప్రాప్తిమాత్రేణ భోక్తవ్యం త్యాగేన బ్రహ్మహాజనః

భ్రష్టశ్రీర్భృష్ట బుద్ధిశ్చ భ్రష్టజ్ఞానో భవేన్నరః

యస్త్యజేత్ విష్ణునైవేద్యం భాగ్యేనోపస్థితం శుభం

ప్రాప్తిమాత్రేణ యో భుంక్తే భక్త్యా విష్ణు నివేదీతం

పుంసాం శతం సముద్ధత్య జీవన్ముక్త స్వయం భవేత్

విష్ణునైవేద్యభోజీ యో నిత్యం తు ప్రణమేద్ధరిం

పూజయేత్ స్థౌతి వా భక్త్యా స విష్ణుసదృశో భవేత్

ఓరే దేవేంద్రుడా! నీవు ధనము వలన మదించి నన్ను అవమానపరచితివి. నేను నీకిచ్చిన పుష్పమును గర్వించి ఏనుగుతలపై వదలి వేసితిని.

ఇదం పుష్పం యస్యమూర్ద్ని తస్య వై పూజనం పురః

మూర్ద్ని ఛిన్నే శివశీతో: చీత్వేదం యోజయిష్యతి

ఇతి శ్రుత్వా మహేంద్రశ్చ ధృత్వా తచ్చరణ ద్వయం

ఉచ్చైరురోద శోకార్త సమువాచ భయాకులః

ఈపారిజాతపుష్పము ఎవరి శిరస్సున ఉండునో అతనిని తొలుత పూజింపవలెను. శివుని పుత్రుని శిరస్సు ఛేదింపబడినప్పుడు దీనినే (ఏనుగు శిరస్సుమ) ఛేదించి అతనికి అతుకుదురు. ఆని దుర్వాసుడనగానే ఇంద్రుడు దుర్వాసుని పాదములు పట్టుకొని ఏడ్చుచు ఇట్లనెను.

ఇంద్ర ఉవాచ- ఇంద్రుడిట్లనెను-

 దత్త: సముచిత: పో మహ్యం మత్తాయ హే ప్రభో

గతాత్వయా చేత్సంపత్తి: కియత్ జ్ఞానం చ దేహిమే

ఐశ్వర్యం విపదాం బీజం ప్రచ్ఛన్న జ్ఞాన కారణం

ముక్తి మార్గార్గళం దార్ద్యర్దరి భక్తి వ్యపాయకం

జన్మమృత్యు జరా రోగ శోక దుఃఖాంకురం పరం

సంపత్తీ తిమిరాంధశ్చ ముక్తిమార్గం న పశ్యతి

సంపన్నమత్తః సుమూడశ్చ సురామత్తః సచేతనః

బాంధవైర్వేష్ఠితః సోఽపి బంధుద్వేషకరో మునే

సంపన్నదే ప్రమత్తశ్చ విషయాంధశ్చ విహ్వల:

మహాకామీ సాహసికః సత్వమార్గం వపశ్యతి

ఓ మహర్షీ! నీవు ఐశ్వర్యమదమత్తుడనైన నాకు తగిన శాపము విచ్చితివి. నీళాపమువలన వా సంపద పోయినను, సాకు కొద్ది జ్ఞానమును ప్రసాదించుము. ఐశ్వర్యము ఆపదలకు కారణమగుచున్నది. జ్ఞానమును పోగొట్టుచున్నది. ముక్తిమార్గమునకు ఆడ్డంకిగా ఉండును. శ్రీహరిభక్తినీ కలుగనీయదు. జన్మ, మృత్యువు, ముసలితనము, రోగము మొదలగువాటికి మూలకారణమగుచున్నది.

సంపదవలన మత్తుడైనవాడు ముక్తిమార్గమును చూడలేడు. ఆతడు సురామత్తుడైన వానివలె కన్పించును. అతని చుట్టు బంధువులున్నను ఆందరిని ద్వేషించును. సంపన్మత్తుడు. విషయంపటుడు, ఆతీకాముకుడు, ఆతిసాహసికుడు వీరు సత్వమార్గమును చూడలేరు.

 ద్వివిధో విషయాంధశ్చ రాజసస్తామసః స్మృతః

అశాస్త్రజ్ఞప్తామనశ్చ శాస్త్రజ్జోరాజసః స్మృతః

శాస్త్రే చ ద్వివిధం మార్గం నిర్దిష్టo మునిపుంగవ

ప్రవృత్తిబీజమేకం చ నివృత్తే: కారణం పరం

 చరంతి జీవినశ్చాఽదౌ ప్రవృత్తే దు:ఖవర్త్మని

స్వచ్ఛందే చాప్రసన్నే చ నిర్నిరోధి చ సంతతం

ఆపాతమధురే లోభాత్ క్లేశే చ సుఖమానినః

పరిణామోత్పత్తిబిజే జన్మమృత్యుజరాకరే

అనేక జన్మపర్యంతం కృత్వా చ భ్రమణం ముదా

స్వకర్మవిహితాయాం చ నానాయోన్యాం క్రమేణ చ

తతః కృష్ణానుగ్రహాచ్చ సత్సంగం లభతే జనః

విషయలంపటులు రాజసులు తామసులనీ రెండు విధములుగా ఉందురు. శాస్త్ర జనములేనివాడు తామసుడు కాగా శాస్త్రములన్నీ తెలీసినవాడు రాజసుడు, ఆభ్ శాస్త్రమున ప్రవృత్తిమార్గము నివృత్తిమార్గమని రెండు విధములు కల్పించుచున్నవి. ప్రాణులు ఎక్కువగా దు:ఖకారణమైన ప్రవృత్తి మార్గము నెంచుకొందురు. ఆది ఉత్పత్తి పరిణామములకు, జన్మ మృత్యు, జరాదులకు కారణమగుచున్నది. ప్రవృత్తి మార్గమున సంచరించువారు అనేక జన్మలెత్తుచు తాము చేసికొన్న కర్మలననుసరించి అనేక యోనులలో జన్మించుచున్నారు.

తరువాత శ్రీకృష్ణుని అనుగ్రహమువలన వారు సంత్సంగమును పొందుచున్నారు.

సహస్రేషు శతే ష్వేకో భవాబ్ధేః పారకారణం

సాధుః సత్వప్రదీపేన ముక్తిమార్గం ప్రదర్శయేత్

తదా కరోతి యత్నం చ జీవీ బంధన ఖండనే

అనేక జన్మయోగేన తపసాఽనశనేన చ

తదా లభేన్ముక్తిమార్గం నిర్విఘ్నం సుఖదం పరం

అనేక లక్షలమందిలో ఒకడు సంసార సాగరమునుండి తరించును, సాధుపురుషుడు సత్వగుణమనే దీపమునందుకొని ఇతరులకు ముక్తి మార్గమును చూపించును. అప్పుడు సాధారణ జీవుడు అనేక జన్మలలో చేసిన యోగములవలన, తపస్సువలన, నిరాహార దీక్షలవలన సుఖమునిచ్చు ముక్తిమార్గమును పొందును.

ఇదం శ్రుతం గురోర్వక్త్రాత్ ప్రసంగావసరేణ చ

న హి పృష్టమతోఽన్యచ్చ భవదుఃఖౌఘవేష్టితాః

ఆధునా వీధినా దతో విపత్తౌ జ్ఞానసాగరః

సంపద్రూపా విపదియం మమనిస్తార కారిణీ

జ్ఞానసింధో దీనబంధో మహ్యం దీనాయ సాంప్రతం

దేహి కించిత్ జ్ఞానసారం భవపారం దయానిధే

ఈ విషయమంతయు నా గురువగు బృహస్పతితో మాటలాడుచున్నప్పుడు తెలిసికొంటిని. ఇంతకంటే నేను ఎక్కువగా తెలిసికొనలేకపోతివి. ఇప్పుడు ఈ కష్టసమయమున జ్ఞానసముద్రులైన మీమ్ము ఆదృష్టవశమున పొందీతీని, ఈ ఆపద వా పంపడవలన ఏర్పడినది ఐనను నన్ను తరింపజేయుటకు (మీవలన) ఇది. కారణమైనది.

అందువలన జ్ఞానముద్రుడపు దీనులకు బంధువు ఐన దుర్వాసమహర్షీ! ఈ దీనునకు సంసారమును తరింపజేయు జానము కొంతదైన ఉపదేశింపుము.

ఇంద్రస్య వచనం శ్రుత్వా ప్రహస్య జ్ఞానినాం గురుః

జ్ఞానం కథతుమారభే హ్యతీతుష్ట: సనాతనః

పరమజ్ఞానీ, సనాతనుడగు దుర్వాసమహర్షి ఇంద్రుని మాటలు విని సంతోషముతో ఈవిధముగా చెప్పనారంభించెను.

దుర్వాసా ఉవాచ- దుర్వాస మహర్షి ఇట్లు పలికెను-

 అహో మహేంద్ర మాంగల్యమాత్మానం ద్రష్టుమిచ్చశి

ఆపాతతో దుఃఖబీజం పరిణామ సుఖావహం

 స్వగర్భయాతవాహ పీడా ఖండన కారణం

దుష్పారాసార దుర్విర సంసారార్ణవ తారకం

కర్మవృక్షాంకురచ్ఛేద కారణం సర్వతారకం

సంతోష సంతతికరం ప్రవరం సర్వవర్త్మనాం

దానేన తపసా వాఽపి ప్రతేనాఽవశనాదినా

 కర్మణా స్వర్గభోగాదీ సుఖం భవతి జీవినాం

కామ్యావాం కర్మణాంచైవ మూలం సంఛిద్య యత్నతః

ఆధునేదం మోక్షబీజం పంకల్పాభావ ఏవ చ

ఓ మహీంద్ర! నీవు సుఖముగా ఉండవలెననీ ఆనుకొనుచు వన్సు ఈ ప్రశ్నవేసితివి. నేను తెలుపునది మొదలు దుఃఖముసు కలిగించినను పరిణామదశలో సుఖమును కలిగించును. ఇవీ గర్బయాతనలను తొలగించును. సంసార సముద్రమును తరింపజేయును. కర్మలనే చెట్ల మొలకలను తుంచివేయును, ఆవేక విధములగు పంతోషములను కలిగించును. అన్నిటికంటే ఇది చాలా శ్రేష్ట్రమైనది,

దానము, తపస్సు, వ్రతములు, ఉపవాసము మొదలగు కర్మలచేత ప్రాణులు స్వర్గాది భోగములననుభవింతురు. అందువలన కామ్యకర్మలయొక్క మూలముమ కష్టపడి చేదించి మోక్షమును పొందించు జ్ఞానమును పొందవలెను. అది సంకల్పా భావము అనగా కోరికలను కోరుకొనకుండుట.

 యత్కర్మసాత్వికం కుర్యాదసంకల్పితమేవ చ

సర్వం కృష్ణార్పణం కృత్వా పరే బ్రహ్మణి లీయతే

 సాంసారికాణా మేతత్తు నిర్వాణం మోచకం విదు:

నేచ్ఛంతి వైష్ణవాస్తత్తు సేవావిరహ కాతురా:

సేవాo కుర్వంతి తే నిత్యం విధాయోత్తమ దేహకం

గోలోకే వాపి వైకుంఠే తస్యైవ పరమాత్మనః

హరిసేవాదీరూపాం చ ముక్తిమిచ్ఛంతి వైష్ణవాః

జీవన్ముక్తాశ్చ తే శక్ర స్వకులోద్ధారకారిణః

సాత్వికమైన కర్మను పంకల్పము లేకుండనే చేయవలెను. శ్రీకృష్ణార్పణముగా సమస్త కర్మలు చేయువాడు పరబ్రహ్మలో విలీనమగును. సాధారణ సంసారులు మోక్షము కావలెనని కోరుకొందురు. కాని విష్ణుభక్తులు మాత్రము మోక్షమును కాక శ్రీహరి సేవాదీరూపమైన ముక్తిని కోరుకుందురు. వారు దివ్య శరీరమును ధరించి వైకుంఠముననో, గోలోకముననో ఉన్న పరమాత్మను అనుక్షణము సేవించుచుందురు. వారు జీవన్ముక్తులు మాత్రమే కాక తన కులమును కూడ ఉద్దరింతురు.

స్మరణం కీర్తనం విష్ణోరర్చనం పాదసేవనం

వందనం స్తవనం నిత్యం భక్త్యా నైవేద్య భక్షణం

చరణోదికపానం చ తన్మంత్ర జపనం పరం

ఇదం నిస్తారబీజం చ సర్వేషా మీప్సితం భవేత్

శ్రీ మహావిష్ణువును స్మరించుట, కీర్తించుట, అతనిని సదా ఆర్చించుట, అతని పాదములను సేవించుట, నమస్కరించుట, పోత్రములు చేయుట, ప్రతిదినము భక్తిలో శ్రీహరి నైవేద్యమును తీసుట, ఆతని పాదోదకమును త్రాగుట, ఆతని మంత్రమును బిపించుట అనువది సంసారమును తరింపజేయునవి. ఇవి అందరికి ఇష్టమైనవి.

ఇదం మృత్యుంజయజ్ఞానం దత్తం మృత్యుంజయేవ మే

తచ్చిష్యోఽహం చ నిశ్శంకః తత్ప్రసాదాచ్చ పర్వతః

స జన్మదాతా స గురుః స చ బంధుః సతాం పరః

యోదధాతి హారేర్భక్తిం త్రైలోక్య చ సుదుర్లభం

దర్శయేదన్యమార్గం చ వివా శ్రీకృష్ణసేవనం

 ప చ తం వాశయత్యేవ ధ్రువం తద్వధభాగ్భవేత

సంతతం జగతాం కృష్ణనామ మంగళకారణం

మంగళం వర్ధతే నిత్యం న భవేదాయుషో వ్యయ:

తేభ్యోఽప్యపైతి కాలశ్చ మృత్యుః స్యాద్రోగ ఏవచ

సంతాపశ్చైవ శోకశ్చ పైనతేయాదివోరగా:

కృష్ణమంత్రోపాసకశ్చ బ్రాహ్మణః శ్వపచోఽపి వా

బ్రహ్మలోకం సముల్లంఘ్య యాతి గోలోకముత్తమం

 బ్రహ్మణా పూజితః సోఽపి మధుపర్కాదీవా చ యః

స్తుతః సురైశ్చ సిద్దైశ్చపరమానందభావనః

జ్ఞానసారం తపఃసారం బ్రహ్మసారం పరం శివం

 శివేనోక్తం యోగసారం శ్రీకృష్ణసదసేవనం

బ్రహ్మాదిస్తంబపర్యంతం సర్వం మీథ్యైవ కేవలం

భజ సత్యం పరం బ్రహ్మ రాధేశం ప్రకృతేః పరం

ఈ విషయమును వాకు గురువైన మృత్యుంజయుడు తెల్పినందువలన దీనిని మృత్యుంజయ జ్ఞానమని అందురు. వెను ఆ మృత్యుంజయుని అనుగ్రహము వలన ఎట్టి సందేహములు లేక తిరుగుచున్నాను. ముల్లోకములలో దుర్లభమైన శ్రీహరిభక్తి కలిగించినవాడే నిజమైన తండ్రి, నీజమైన గురుపు, బంధువు, సజ్జనుడు. ఆ విధముగా కాక ఇతర మార్గములను చూపించు తండ్రి, గురువు, బంధువు మొదలగువారు అతనిని చెడగొట్టుచున్నారు. అతనిని చంపినవారగుచున్నారు:

ప్రపంచమున అందరికి శ్రీకృష్ణనామము మేలు కల్గించును. అతని ఆయుస్సును కూడ పెంచును. శ్రీకృష్ణ నామమున సంతతము స్మరించువానిని చూచి కాలుడు, మృత్యువు, రోగము, సంతాపము, శోకము, మొదలైవవి గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తిపోవును.

శ్రీకృష్ణమంత్రమున ఉపాసన చేయు బ్రాహ్మణుడు, అంత్యజుడైనను, బ్రహ్మలోకమునండీ గోలోకమునకు పోవును. తన లోకమున దాటి గోలోకమునకు పోవుచున్న ఆ విష్ణుభక్తుని చూచి బ్రహ్మదేవుడు, సిద్ధులు, దేవతలు అందరు అతనిని రవింతురు.

పరమశివుడు చెప్పిన శ్రీకృష్ణ విషయమైన జ్ఞానము అన్ని జానములకు, తపస్సుకు సారభూతమైనది. ఈ ప్రపంచమున కన్పించు బ్రహ్మాది దేవతలు, జడ్జడ పదార్థములన్నియు క్షణికమైనవి. ప్రకృతికి అతీతుడు రాధాప్రియుడు శ్రీకృష్ణ పరబ్రహ్మయే తమైన వాడు.

ఆతీవ సుఖదం సారం భుక్తిదం ముక్తిదం పరం

సిద్ధయోగప్రదం చైవ దాతారం సర్వసంపదాం

యోగినామపి సిద్ధానాం యతీనాం చ తపస్వినాం

సర్వేషాం కర్మభోగొఽస్తి వ పారాయణ పేనాం

భస్మసాచ్చ భవేత్పాపం యదుపస్పర్శమాత్రతః

జ్వలదగ్నౌ పాతీతం చ యథా శుష్కేంధవం యథా

తతో రోగా హి వేపంతే పాపానీ చ భయావి చ

దూరతశ్చ పలాయంనే యమదూతాస్త్రతో భయాత్

తావనిబద్దః సంసారే  కారాగారే వీధేర్జనః

న యావత్కృష్ణమంత్రం ఛ ప్రాప్నోతి గురువక్రతః

కృతకర్మౌను భోగాఖ్య నిగడచ్ఛేద కారణం

మాయా జాలోచ్చేద కరం మాయాసానికృంతనం

 గోలోకమార్గ పోపానం నిస్తారే బీజ కారణం

భక్త్వంకుర ప్వరూపం చ నిత్యం వృద్ధమనశ్వరం

 సారం చ సర్వతపసాం యోగాసాo సాధనం తథా

సిద్దికాం వేదపాఠాహం ప్రతాదీనాం చ విశ్చితం

దానానాం తీర్థ శౌచానాం యజ్ఞాదీనాం పురందర

పూజానాముపవాసానామిత్యాహా కమలోద్భవః

పుంసాం లక్షం పితృణాం చ శతం మాలమహాప్య చ

పూర్వం పరం చ తత్పుంఖ్యం పితరం మాతరం గురుం

సహోదరం కళత్రం చ బంధుం శిష్యం చ కింకరం

సముద్ధరేచ్ఛ క్వశురం త్వత్రూం కన్యాం చ తత్పుతం

 స్వాత్మానం చ సతీర్థ్యంగురుపత్నీం  గురోః పతం

ఉద్దరేద్భలవాoభక్తో మంత్రగ్రహణమాత్రత

మంత్రగ్రహణమాత్రేణ జీవన్ముక్తి భవేన్నరః

తత్స్పర్శపూతస్తీర్దౌష: సద్యః పూలో వసుంధరా

శ్రీకృష్ణమంత్రము. సుఖమును, భుక్తిని, ముక్తిని, ఇచ్చుమ. ఆ మంత్రము సిద్ధయోగములను సమస్త సంపదలవిచ్చును, - యోగులు, సిద్ధులు, యతులు, మహర్సులు అందరు కర్మ ఫలమును తప్పక అనుభవింతురు. కాని శ్రీహరి భక్తులు దానికి ఆడితులు. వారి స్పర్శ తగిలినంతమాత్రముననే పాపములు భస్మీపటలమగును. రోగములు, పాపములు వారిని చూచి భయపడును. ఆయై గురువునుండి శ్రీకృనమంత్రమును పొందగగానే మానవులు పంపారకారాగారమునుండి విముక్తులగుదురు. ఆ. మంత్రము కర్మభోగమమ ఇనుపపంకెళ్లను ఛేదించును. పూయాజాలమును మాయాపాశములను తొలగించును.

ఇంకను ఆది గోలోకమునకు మార్గము చూపుమ, ముక్తికి ప్రధాన కారణము. భక్తియను వృక్షాంకురమును దినదినము ప్రవర్ధమానమగునట్లు చేయును. తపస్సులన్నింటికి ఆదిపారభూతమైనది. యోగములకు, సిద్ధులకు, వేదములకు, వ్రతములు పూజలు, దానములు, తీర్థస్నానములు యజ్ఞములు మొదలగువాటికన్నిటికీ సారమైనది.

ఆ మంత్రము నిష్టలో జపించినవారి. తండ్రివంశమువారు లక్షతరములవరకు, తల్లి వంశమువారు మారు తరములవరకు ఉద్ధరింపబడుదురు. ఆట్లే తల్లి, తండ్రి, గురువు, సోదరుడు, భార్య, బంధువులు, శిష్యులు, సేవకులు, అత్తామామలు వారి సంతానమునంతను ఈ మంత్రము పవిత్రము చేయును. అట్లే అతనిని అతనితోటివానినీ గురుపత్నిని, గురుపుత్రుని అందరిని శ్రీకృష్ణ భక్తుడు ఉద్ధరించును.

శ్రీకృష్ణమంత్రమును గురువు వలన ఉపదేశము పొందినంత మాత్రమున ఆతడు జీవన్ముక్తుడై తన స్పర్శవలన తీర్థ స్థానములను,  భూమీవి పవిత్రము చేయును.

అనేక జన్మపర్యంతం దీక్షాహీనో భవేన్నరః

 తదన్య దేవమంత్రం చ లభతే పుణ్య లేశతః

 సప్తజన్మసు దేవానాం కృత్వాసేవాం స్వకర్మతః

లభతే చ రవేర్మంత్రం సాక్షిణః సర్వకర్మణాం

జన్మత్రయం భాస్కరంచ సేవ్య మానవః శుచిః

లభేద్గణేశమంత్రంచ సర్వవిఘ్నహరం పరం

జన్మత్రయం తం విషేవ్య వీర్వప్నశ్చ భవేన్నరః

 విఘ్నేశస్య ప్రసాదేన దివ్యజ్ఞానం లభేన్నరః

తదా జ్ఞాన ప్రదీపేన సమాలోచ్య మహామతిః

అజ్ఞానాంధ తమశ్ఛిత్వా మహామాయాం భజేన్నరః

ప్రకృతిం విష్ణుమాయాం చ దుర్గాం దుర్గతినాశినీం

సిద్ధిదాం సిద్ధిరూపాం చ పరమాం సిద్ధయోగినీం

వాణీరూపాం చ పద్మాం చ భద్రాం కృష్ణప్రియాత్మికాం

నానారూపాం తార నిషేన్య జన్మనార శతకం నరః

తత్ప్రసాదాత్ భవేత్ జ్ఞావీ జ్ఞానానందం తదాభజీత్

కృష్ణ జ్ఞానాధిదేవం చ మహాదేవం సనాతనం

శివం శివస్వరూపం చ శివదం శివకారణం

ఆమరత్వప్రదం చైవ దీర్ఘమాయుష్యదం పరం

ఇంద్రత్వం చ మసుత్వం చ దాతుం శక్తం చ లీలయా

రాజేంద్రత్వప్రదం చైవ జ్ఞానదం హరిభక్తిదం

జన్మత్రయం తమారాధ్య చాశుతోష ప్రసాదతః

సర్పదస్య ప్రసాదిన శంకరస్య మహాత్మనః

పరదస్య పరేణైవ హరిభక్తిం లభేత్ ధ్రువం

 తదాతద్భక్త సంసర్గాల్ కృష్ణమంత్రం లభేత్ ధ్రువం

అనేక జన్మలవరకు కృష్ణమంత్రము లభించని మానవునకు ఆతనీ పుణ్యవిశేషమువలన ఇతర దేవతామంత్రమును లభించును.

ఆ మంత్రముచే ఆ దేవతను ఏడు జన్మలవరకు ఆరాధించి, సేవించి తానొచ్చిన పుణ్యకర్మవలన సూర్యమంత్రమును పొందుమ, సమస్త కర్మలకు సాక్షియగు. ఆ సూర్యుని మూడు జన్మలవరకు ఆరాధించి ఆతని అమగ్రహమువలన గణపతి మంత్రోపదేశము పొందును.

సమస్త విఘ్నములను తొలగించు ఆ వినాయకుని మూడు జన్మలవరకు ఆరాధించి, విఘ్నములన్ని తొలగిపోగా గణపతియొక్క అనుగ్రహమువలన దివ్యజ్ఞానమును పొందును. వీఘ్న నాయకుడొసగిన జ్ఞానదీపమువలన అజ్ఞానాంధకారము తొలగిపోయి మహామాయయైన దుర్గామంత్రమతనికి లభించును.

విష్ణమాయాస్వరూపిణి, దుర్గతిని పోగొట్టు దుర్గాదేవిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, రాధను అందరిని భజించి వారి అనుగ్రహమువలన జ్ఞానానంద రూపుడు, కృష్ణజ్ఞానమునకు ఆధిదేవతయగు మహాదేవమంత్రమును అతడు పొందును.

మహాదేవమంత్రము మంగళరూమైనది, సమస్త మంగళములను కలిగించునది. ఆనందదాయకమైనది. అది అమరత్వమును, దీరాయుస్సును ప్రసాదించును. ఇంద్రత్వము, మనుత్వము, రాజేంద్రత్వము ఆ మంత్రానుగ్రహమువలన తేలికగా లభించును. అట్లే ఆ మంత్ర ప్రభావమువలన శ్రీహరి భక్తికూడ లభించును. ఆ పరమశివుని మంత్రమును మూడుజన్మలవరకు జపించి అన్ని కోరికలు తీర్చు ఆ పరమేశ్వరుని అనుగ్రహమువలన శ్రీహరి భక్తిని పొందును.

అప్పుడతనికి శ్రీహరి భక్తుల సాహచర్యమువలన శ్రీకృష్ణమంత్రము తప్పక లభించును.

నిర్మల జ్ఞాన దీపేన ప్రదీప్తేన చ తత్వవిత్

బ్రహ్మాది స్తంబపర్యంతం సర్వం మిథ్యైవ పశ్యతి

దయానిధేః ప్రసాదేన నిర్మలజ్ఞానమాలభేత్

వరదస్య వరేణైవ హరిభక్తిం లభేత్ ధ్రువం

తదా నిర్వృతీమాప్నోతి సారాత్సారాం పరాత్పరాం

యత్ర దేహో లభన్మంత్రం దద్దేహావధి భారతే

తత్పాంచభౌతికం త్యక్త్యా బిభృయార్దివ్యరూపకం

కరోతి దాస్యం గోలోకే వైకుంఠే నా హారీ: పదే

పరమశివుని అనుగ్రహమువలన లభించిన జ్ఞానమువలన తత్వమును తెలిసికొని ఈ చరాచర సృష్టియంతయు క్షణికమైనదని భావించి నిర్మల జ్ఞానమును పొంది మరల ఆ మహాదేవుని అనుగ్రహమువలననే, హరిభక్తిని పొందును. తరువాత శ్రీకృష్ణమంత్రమును ఉపదేశముపొంది పాంచ భౌతిక దేహమువదలిన తరువాత వైకుంఠమునకో లేక గోలోకమునకో పోయి ఆచ్చట భగవద్ధాప్యమును చేయుచుండును.

పరమానంద సంయుక్తో మోహాదిషు వివర్జితః

న విద్యతే పునర్జన్మ పునరాగమనం హరే

పునశ్చ నపిబేతక్షరం ధృత్వా మాతృస్తనం పరం

విష్ణుమంత్రోపాసకానాం గంగాదేస్తీర్థ సేవినాం

 స్వధర్మిణాం చ భిక్షూణాం పునర్జన్మ న విద్యతే

తీర్థే పరిత్యజేత్పాతం క్రియాం కృత్వా హరిం భజేత్

అయం నిరూపితో ధాత్రా స్వధర్మస్తీర్థ సేవిస్తాం

తన్నామమంత్రం ప్రజపేత్తత్సేవాదిషు తత్పరః

వ్రతోపవాసరత ఇత్యుక్తో విష్ణుపేవివాం

సదన్నే వా కదన్నే వా లోష్టి కాంచనే తథా

సమా బుద్ధిర్యస్య శశ్వత్ స పన్యాసీతి కీర్తితః

దండం కమండలుం రక్తవస్త్రమాత్రం చ ధారయేత్

నిత్యం ప్రవాపీ వైకత్ర స్యాత్సవ్యాసీతి కీర్తితః

శుద్ధాచార ద్విజాన్నం చ భుంక్తే లోభాదివర్జితః

కింతు కించిన్న యాచేత స సన్యాసీతి కీర్తితః

న వ్యాపారీ నామీ చ సర్వకర్మ వివర్జితః

ధ్యాయేన్నారాయణం శశ్విల్ ప సన్యాసీతి కీర్తితః

శశ్వన్మానీ బ్రహ్మచారీ సంభాషా పరివర్జితః

సర్వం బ్రహ్మమయం పశ్యత సన్యాసీతి కీర్తితః

సర్వత్ర సమబుద్ధీశ్చ హింసామాయా వివర్జితః

క్రోధాహంకార రహితః స సవ్యాపీతి కీర్తితః

ఆయాచితోపస్థితం చ మిష్టామిష్టం చ భుక్తవాన్

న యాచతే. భక్షణార్థి స సన్యాసీతి కీర్తితః

 న చ పశ్యేన్ముఖం స్త్రీణాం న తీష్థేత్తత్సమీపతః

దారవీమపి యోషాం చ న స్వృచేద్య స భిక్షుకః

అయం సన్యాసినాం ధర్మ ఇత్యాహ కమలోద్భవః

విష్ణుమంత్రోపాసకులు, గంగాదీపుణ్యతీర్థముల సేవించువారు తమతమ ధర్మమును చక్కగా నిర్వర్తించు భిక్షుకులకు పునర్జన్మ అనునది ఉండదు.

పుణ్యతీర్థముల సేవించువారు ప్రతిదినము ఆ పుణ్యతీర్థములందు స్నానము చేయుచు తమ పాప ప్రక్షాళనము చేసికొనవలెను. అట్లే పుణ్యకార్యములు చేయుచు సదా శ్రీహరి భజనము చేయవలెను, ఇది పుణ్యతీర్థములను సేవించువారి ధర్మము.

విష్ణుమంత్రోపాసకులు ఎల్లప్పుడు శ్రీహరిమంత్రమును జపించుచుండవలెను. అట్లే శ్రీహరి సేవాకార్యక్రమములయందు పదా నిమగ్నులై యుండవలెను. ఇంకను శ్రీహరి వ్రతములు, ఉపవాసము చేయుచుండవలెను. ఇదీ విష్ణు సేవకుల ధర్మము.

సన్యాసులు మంచి అన్నమైనా, చెడిపోయిన అన్నమైనా సమానముగా చూడవలెను. రాయి, బంగారములను సమానముగా చూడవలెను. దండము, కమండలము, కాషాయవస్త్రములను ధరింపవలెను. స్థిరముగా ఒకచోటనుండక ప్రతిదినము ఒక చోటినుండి మరియొకచోటికి పోవలెను. లోభము మొదలగు గుణములను వదిలి పెట్టి మంచి ఆచారముకల బ్రాహ్మణుల ఇంటిలో భోజనము చేయవలెను. ఎవరినీ స్వార్థమునకై యాచించరాదు. వ్యాపారము చేయరాదు. ఆశ్రమమును ఏర్పరచు కొనరాదు. అన్ని విధములైన చెడ్డపనులను వదిలివేసి శ్రీమన్నారాయణునీ ఎల్లప్పుడు ధ్యానించుచుండవలెను. అట్లే బ్రహ్మచారిగానుండి ఎవరితోను ఎక్కువగా మాట్లాడక మౌనముగా నుండవలెను. సమస్త విశ్వమును బ్రహ్మమయముగా భావించుకొనవలెను. ఆందరిపై సమానమైన బుద్ధి కలిగి హింస, మోసము, కోపము, అహంకారము మొదలగు గుణములను వదలి పెట్టవలెను. యాచన చేయకుండ లభించిన ఆన్నము మృష్టాన్నమైనను, కాకపోయినను సంతోషముతో భుజింపవలెను. భోజనమునకై ఎవరిని యాచనచేయకూడదు. స్త్రీల ముఖమును చూడరాదు, స్త్రీల సమీపమున కూర్చోవరాదు. చివరకు స్త్రీయొక్క బొమ్మనైన తాకరాదు. ఇవన్నియు సన్యాసులు అనుష్ఠింపవలసిన ధర్మములని బ్రహ్మదేవుడు తెలిపెను.

విపర్యయే వినాశశ్చ జన్మయామ్యం భయం భవేత్

జన్మదు:ఖం యామ్యదుఃఖం జీవినామతీదారుణం

సుర సూకరయోనౌ వా గర్భే దు:ఖం సమర సుర

యోనౌ వా క్షుద్రజంతూనాం పశ్వాదీనాం తథైవ చ

గర్భే స్మరంతి సర్వేతేకర్మజన్మశతోద్భవం

విస్మరేన్నిర్గతో జీవో గర్భాద్యై విష్ణుమాయయా

స్వదేహం పాతి యత్నేన సురో వా కీట ఏవ వా

తీర్థముల సేవించువారు. శ్రీహరి మంత్రోపాసకులు, సన్యాసులు తమతమ ధర్మములను వదలి ప్రవర్తించినచో వారు చెడిపోవుదురు. పైగా జీవులకందరకు అతిభయంకరమైన జన్మదు:ఖమును నరక దుఃఖముననుభవింతురు.

దేవతాస్త్రీల యోనియందున్నను, పందుల యోనులందున్నను, క్షుద్రజంతువులు, పశువులు మొదలగుపోని యోనులందున్నను గర్భదుఃఖము అన్నీ ప్రాణులకు సమానముగానే యుండును. ఆ ప్రాణులు గర్భమునందుండగా పూర్వజన్మలలో చేసిన పాపకార్యములనన్నిటిని స్మరించుకొనును. గర్భమునుండి బయటకు రాగానే విష్ణుమాయవలన అన్నీటినీ మరచిపోవుచున్నారు, దేవతలైనా కీటకములైనా జన్మించునపుడు గర్భమున తమ దేహమును కష్టపడి తామే రక్షించుకొనును.

యోనే రభ్యంతరే శుక్రే పతితే పురుషస్య చ

శుక్రం శోణితయుక్తం చ సహసా తక్షణం భవేత్

లక్షాధికే మాతృసమ: చేతరే పితురాకృతిః

యుగ్మాహే చ భవేత్ పుత్ర: కన్యకా తద్వీపర్యయే

రవి భౌమగురూణాం చ వారే చేత్తద్భవేత్సుతః

ఆయుగ్మాహే తదితరే వారే వా కన్యకా భవేత్

ప్రథమ ప్రహారే జన్మ యస్య సోఽల్పాయురేవ చ

ద్వితీయే మధ్యమశ్చైవ తృతీయ తత్పరో భవేత్

చతుర్థే చీరజీవీ స్యాత్ క్షణానామనురూపకః

దుఃఖీవాఽథసుఖివాఽపి పూర్వకర్మానురూపతః

శుక్రశోణితములు స్త్రీయొక్క యోనిలో పురుషుని శుక్రము పడినప్పుడు వెంటనే రెండు కలిసిపోవును. ఆ పిండమున స్త్రీ రక్తము ఎక్కువగా వున్నప్పుడు తల్లిపోలిక వచ్చును. లేక శుక్రము ఎక్కువగా నున్నచో ఆ శిశువునకు తండ్రి పోలిక వచ్చును. .

సరిసంఖ్యగల తిథులలో గర్భమేర్పడినచో పుత్రుడగును. అట్లే ఆది, మంగళ, గురువారములలో గర్భముకలిగినచో పుత్రుడు కలుగును. లేక బేసిసంఖ్యగల తిథులలో సోమ, బుధ, శుక్ర, శనివారములలో గర్భము కలిగినచో స్త్రీ యగును.

ప్రథమ యామములో జన్మించినవాడు ఆల్పాయుష్కుడగును. రెండవజామున, మూడవజామున జన్మించినవారి వయస్సు ఎక్కువగా ఉండును. నాల్గవ జామున జన్మించినవాడు చాలాకాలము బ్రతుకును. అట్లే జీవి తమతమ పూర్వ కర్మలననుసరించి సుఖవంతుడగనో దుఃఖవంతుడుగనో అగుచున్నది.

యాదృశేచ క్షణే జన్మ ప్రసవస్తాదృశో భవేత్

ప్రసూతీక్షణచర్చాంచ కుర్వంత్యేవం విచక్షణాః

కలలం ల్వేకరాత్రేణ ప్రవృద్ధః స్యాద్దినే దినే

సప్తమే బదరాకారో మాసే గండుసమో భవేత్

మాసత్రయే మాంసపిండో హస్తపాదాదివర్జితః

సర్వావయవ సంపన్నో దేహీ మాసే చ పంచమే

భవేత్తు జీవసంచారః షణ్మాసే సర్వతత్వవిత్

దు:ఖీ స్వల్పస్థలస్థాయీ శకుంత ఇవ పంజరే

మాతృ జగ్ధాన్నపానం చ భుంక్తేమేధ్యస్థలే స్థితః

హాహేతి శబ్దం కృత్వా చ చింతయే దీశ్వరం, పరం

ఏవం చ చతురో మాసాన్ భుక్త్యా పరమయాతనాః

ప్రేరితో వాయునా కాలే గర్భాద్యై నిర్గతో భవేత్

తాను పుట్టిన సమయమెటువంటిదో ఆ శిశువు అట్లే యుండును. అనగా పుట్టిన సమయముననుసరించి శిశువు స్వభావము భాగ్యము ఏర్పడుచున్నవి.

విజ్ఞాలు ప్రసూతి విషయమున ఇటువంటి చర్చచేయుచున్నారు.

 రక్తశుక్లములు కలిసిపోయిన తరువాత ఒకరాత్రికి కలలాకారమునొందును. ఆటుపిమ్మట దినదిన వృద్ధి కనిపించును. ఏడు దినములలో ఆది రేగుపండంత యగును. తరువాత నెలలో అది బొంగరమంతయగును. మూడు నెలలలో చేతులు కాళ్ళులేని పిండముగా రూపొందును. ఐదవనెలలో ఆ పిండమునకు అన్ని అవయవములు చేకూరును. తరువాత ఆరవనెలలో జీవమేర్పడి సమస్త తత్వమును తెలసినందువలన పంజరములో నున్న పక్షివలె దుఃఖించుచు స్వల్పస్థలమున ముడుచుకొనియుండును. తల్లియొక్క ఆమేధ్యస్థలముననుండి తల్లి తీసికొను ఆహారమును తినుచుండును. తత్వమునెరిగియున్నందువలన హాహాకారము చేయుచు పరమేశ్వరుని సదా చింతించుచుండును. ఈవిధముగా మాతృగర్భములో నాలుగు నెలలు వరకయాతనలననుభవించి తగు సమయమున గర్భమునుండి బయటికి వచ్చును.

దిగ్ధేశకాల వ్యుత్పన్నో విస్మృతో విష్ణుమాయయా

శశ్వరిణ్మూత్రసంయుక్తః శిశుః స్యాత్ శైశవావధి

పరాయత్తోఽప్యక్షమశ్చ మశకాదనివారణే

కీటాదిభుక్తో దు:ఖీ చ రౌతితత్ర పునః పునః

స్తనాందోఽప్యసమర్థశ్చ యజ్ఞాం కర్తు మభీప్సితం

న వాణీ నీస్సరేత్తస్య పౌగండావధి సుస్ఫుటా

పౌగండే యశవాం భుక్త్యా ప్రాప్నుతే యౌనం పునః

స స్మరేన్మాయయా దే హే గర్బాదేర్యాతనాం పునః

ఆహార మైథునార్తశ్చ వానామోహాదివేష్టితః

పుత్రం కళత్రమనుగం యత్నేన పరిపాలయేత్

ఏవం యావత్సమర్థశ్చ భావదేవహి పూజితః

అసమర్థం చ మన్యంతే బాంధవా గోజరం యథా

యదాఽతీవ జరాయుక్తో జడోఽతి బధిరో భవేత్

కాస శ్వాసాదీ యుక్తశ్చ పరాయత్తోఽతిమూఢవత్

తదంతరేఽనుతాపం చ కురుతే సంతతం పునః

 న సేవితం హరేషీర్థం సత్సంగశ్చాపి కామతః

పునశ్చ మానవీం యోనిం లభామి భారతే యదీ

తదా తీర్థం గమిష్యామి భజేపై కృష్ణమిత్యహో

విష్ణుమూర్తియొక్క మాయవలన జన్మనెత్తగానే తన పూర్వజ్ఞానము నంతయు మరచిపోవును. వాటినుండి శైశవమువరకు మలమూత్రముల మధ్యనుండును. తన స్వాతంత్ర్యమును కోల్పోయి ఇతరులకధీనమై దోమలు మొదలగువానిని సైతము నివారించుకొనలేడు. అట్లే పురుగులు కుట్టుచున్నప్పుడు దుఃఖముతో మాటిమాటికి ఏడ్చును. పాలుకూడ తాగలేడు తనకు కావలసినవాటిని అడుగుకొనలేడు.

ఆ విధముగా బాల్యమువరకు ఆతని మాటలు స్పష్టముగా ఉండవు. బాల్యమున అనేక యాతనలననుభవించి యావనమును పొందును. ఆప్పుడు విష్ణుమాయవలన గర్బాది యాతనలనన్నిటిని మరచిపోవును. తరువాత ఆహారము, మైథునము మొదలగు వాటికై అనేక మోహములలో మునిగి. పుత్రులు, కళత్రము మొదలగువారిని కష్టపడి పోషించును.

ఈ విధముగా తన వారినెంతవరకు పోషింపగలగునో అంతవరకే అతనికి గౌరవముండును. తనవారిని పోషింపలేని దశలో బంధువులు ఆతనిని చులకనగా చూతురు, తాను పూర్తిగా ముసలివాడైనప్పుడు చెపుడు, దగ్గు, దమ్ము మొదలగు రోగములచే పూర్తిగా పరాయత్తుడగును. అప్పుడు అయ్యో పుణ్యతీర్థములను సేవించలేదు, సత్సంగము చేయలేదని బాధపడుచు మరల భారతభూమిపై మానవ జన్మనెత్తినచో పుణ్యక్షేత్ర దర్శనము చేయుచు శ్రీకృష్ణుని దర్శించుకొందునని తలచును.

ఇత్యేవమాది మనసి కుర్వంతం తం జడం సుర

గృహ్ణాతి యమదూతశ్చ కాలే ప్రాప్తేఽతిదారుణః

స పశ్యేద్యమదూతం చ పాశహస్తం చ దండినం

ఆతీవ కోపరక్తాక్షం వికృతాకారాముల్బణం

దుర్నివార్యముపాయైశ్చ బలిష్ఠం చ భయంకరం

దుర్దృశ్యం సర్వసిద్ధిజ్ఞం సర్వాదృష్టం పురఃస్థితం

దృష్టమాత్రాన్మహాబీతో విణ్మూత్రం చ సముత్సృజేత్

తదా ప్రాణాంస్యజేత్సద్యో దేహం వై పాంచ భౌతికం

ఈవిధముగా మనస్సులో అనుకుంటున్న ఆ బుద్దిహీనుని యమదూతలు మృత్యుకాలము దాపురించగనే తీసికొనిపోవుదురు. యమదూతలు చేతిలో పాశమును, దండమును ధరించి, అధిక కోపమున ఎజ్జుని కన్నులు కలవారై వీకృతాకారములో భయంకరముగానుందురు. వారు ఎవ్వరికిని కనిపించరు. కానీ ఇట్టి బుద్ది హీనులకు కనిపింతురు, వారు మహాభయంకరులైన ఆ యమదూతను చూడగానే ఆతిభయముతో మలమూత్రములను వదలి తమ పాంచభౌతికమైన దేహమును వదలిపెట్టుదురు.

అంగుష్ఠమాత్రం పురుషం గృహీత్వా యమకింకరః

విన్యస్య భోగదే హే చ స్వస్థానం ప్రాపయేత్ ద్రుతం

జీవో గత్వా యమం పశ్యేత్ సర్వధర్మజ్ఞమేవ చ

రత్నసింహాసనస్థం చ సస్మితం సుస్థితంపరం

ధర్మాధర్మ విచారజ్ఞం సర్వజ్ఞం సర్వతోముఖం

విశ్వప్యేకాధికారం చ విధాత్రా నిర్మితం పురా

వహ్నిశుద్ధాంశుకాధానం రత్నభూషణ భూషితం

వేష్టితం పార్షదగణైః దూతైశ్చాపి త్రికోటిభిః

జపంతం శ్రీకృష్ణనామ శుద్ధస్ఫటికమాలయా

ధ్యాయమానం తత్పదాబ్జం పులకాంకిత విగ్రహం

 సగద్గదం సాశ్రనేత్రం సర్వత్ర సమదర్శినం

ఆతీవ కమనీయం చ శశ్వత్ సుస్థిర యౌవనం

స్వతేజసా ప్రజ్వలంతం సుఖదృశ్యం విచక్షణం

శరత్పార్వణ చంద్రాభం చిత్రగుప్తపురః స్థితం

పుణ్యాత్మనాం శాంతరూపం పాపినాం చ భయంకరం

తం దృష్ట్యా ప్రణమేద్దేహీ మహాభీతశ్చ తిష్ఠతి

బొటనవేలంత ఉన్న జీవుని పాశములతో కట్టి ఆ జీవీని భోగదేహముననుంచి నరకమునకు వెంటనే తీసికొని వెళ్ళును. జీపుడు యమలోకమునకు పోయి అచ్చట రత్నసింహాసనముపై కూర్చొనియున్న యమధర్మరాజును చూచును.

యమధర్మరాజు సమస్త ధర్మములు తెలిసినవాడు. ధర్మాధర్మ విచారము తెలిసియున్నందువలన బ్రహ్మదేవుడతనిని ఆ స్థలమున నీయోగించెను.

అతడు మేలిమి బంగారము చిన్నెలు కల వస్త్రమును, రత్నభూషణములను ధరించి మూడుకోట్ల భటులు సేవింపుచుండగా శ్రీకృష్ణనామమును శుద్ద స్పటిక మాలతో జపముచేయును. అట్లే శ్రీకృష్ణుని పాదములను మనస్సులో ధ్యానము చేయుచు పులకించిన శరీరముతో, గద్గద కంఠముతో, కన్నీళ్ళు కారుచుండగా అందరినీ సమానముగా చూచును.

అతడు మంచీ తేజస్సుతోనున్నను మహాభయంకరుడు. శరత్కాలమందలి పున్నమిచంద్రునివంటి దేహకాంతి కలవాడు. అతనికెదురుగా చిత్రగుప్తుడున్నాడు. అతడు పుణ్యము చేసినవారికి శాంతస్వరూపుడై కనిపించును. కాని పాపులకు మాత్రము ఆతీ భయంకరముగా నుండును.

చిత్రగుప్త విచారేణ యేషాం యదుచితం ఫలం

శుభాశుభం చ కురుతే తదేవ రవినందనః

ఏవం తేషాం గతాయాతే నివృత్తిర్నాస్తి జీవినాం

నివృత్తి హేతురూపం చ శ్రీకృష్ణపద సేవనం

చిత్రగుప్తు డాజీవుని విచారించుచుండగా ఆ జీవి చేసిన పుణ్యపాప కర్మలకు తగిన ఫలమును యమధర్మరాజిచ్చును. ఈవిధముగా జన్మలెత్తుచున్న జీవులకు శ్రీకృష్ణుని పాదములను సేవించునటువంటి నివృత్తి మార్గము లభించదు.

ఇత్యేవం కథితం సర్వం వరం ప్రార్థయ వాంఛితం

సర్వం దాస్యామి తే వత్స నమేఽసాధ్యం చ కించన

దుర్వాస మహర్షి ఈవిధముగా తెలిపి నీ కోరికలనన్నిటిని ఆడుగుమని, అవి ఏవియు నాకు అసాధ్యముకావు కావున వాటినన్నీటిని నీకిత్తునని చెప్పెను.

మహేంద్ర ఉవాచ- దేవేంద్రుడిట్లు పలికెను-

 ఇంద్రత్వం చ గతం భద్రం కిమైశ్వర్యే ప్రయోజనం

కల్పవృక్ష మునిశ్రేష్ఠ దేహిమే పరమం పదం

మహేంద్రస్య వచః శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః

తమువాచ వచ: సత్యం వేదోక్తం సారమేవ చ

కల్పవృక్షమువంటి ఓ మహర్షీ! నా ఇంద్రపదవి పోయిన తరువాత ఎంత ఐశ్వర్యమున్నను ఫలితమేమున్నది. అందువలన నాకు మీరు పరమపదమును ఇప్పించుడు అని ఇంద్రుడనగానే మునిశ్రేష్ఠుడైన దుర్వాసుడు నవ్వి వేదసారమని చెప్పదగిన మాటను ఇట్లు చెప్పెను.

దుర్వాసా ఉవాచ- దుర్వాసమహర్షి ఇట్లనెను-

పరం పదం విషయిణాం మహేంద్రాతీసుదుర్లభం

ముక్తర్యుషద్విధానాం చ న లయే ప్రాకృతేఽపి చ

ఆవిర్భావ సృష్ఠివిధౌ తీరోభావో లయేఽపి చ

యథా జాగరణం సుస్తీ భవత్యేవ క్రమేణ చ

యథా భ్రమతి కాలశ్చ తథావిషయణో ధ్రువం

చక్రనేమి క్రమేణైవ నిత్యమేవేశ్వరేచ్చయా

పలమేకం భవేదేవ యధా వీపలషష్టిభిః

షష్టిభిశ్చ పలైర్దండో ముహూర్తో ద్విగుణాత్తతః

త్రింశదీశ్చ ముహూర్తైశ్చ భవేదేవ దీవానీశం

దశపంచ దివారాత్రి: పక్షమేకం విదుర్భుధాః

పక్షాభ్యాం శుక్లకృష్ణాభ్యాం మాసవీవ విధీయతే

ఋతుర్ద్వాభ్యాం చ మాసాభ్యాం సంఖ్యావిద్భిః ప్రకీర్తితః

ఋతుత్రయణాయనం చ తాభ్యాం ద్యాభ్యాం చ వత్సరః

త్రింశత్సహస్రాధికైశ్చ త్రీచత్వారింశలకైః

వత్సరైర్నరమానైశ్చ యుగానాం చ చతుష్టయం

షష్ట్యాఽధికే పంచశత సహసే పంచవింశతా

యుగే నరాణాం శక్రాయుః మనోరాయుః ప్రకీర్తితం

దిగక్షేంద్ర నిపొతేఽష్ట సహస్రాధిక ఏవ చ

నిపాతే బ్రహ్మణస్తత్ర భవేత్ప్రాకృతికో లయః

లయే ప్రాకృతికే వత్స కృష్ణస్య పరమాత్మనః

చక్షుర్నిమేష: సృష్టిశ్చ పునరున్మీలనే తథా

బ్రహ్మ సృష్టి లయానాం చ సంఖ్యా నాస్తి శ్రుతో శ్రుతం

యథా పృథివ్యా రేణూనాం ఇత్యూచే చంద్రశేఖరః

ఏతేషాం మోక్షణం నాస్తి కథతాని చ యాని తు

ఓ మహీంద్రా! సంసారమున ఆసక్తిగలవారికి పరమపదము మిక్కిలి దుర్లభమైనది. మీవంటివారికి ప్రాకృతలయమున కూడ ముక్తిదొరకదు.

పర్యము జరిగినపుడు ఈ చరాచర ప్రపంచము ఆవిర్భవించుచున్నది. అట్లే లయము జరిగినప్పుడు మాయమగుచున్నది. నిద్రపోవుట మేల్కొనుట తిరిగి నిద్రపోవుట మరల మేల్కొనుట అన్నట్లు కాలము చక్రములోనీ ఆరెలవలె నిత్యము తిరుగుచుండును. ఇదంతయు ఈశ్వరేచ్చ ననుసరించి జరుగుచున్నది.

విపలములు ఆరవై ఐనచో ఒక పలము కాలమగును (ఘడియ). ఆరవై పలములు ఒక దండకాలము. రెండు దండములు ఒక ముహూర్తకాలమగును. ముప్పై ముహర్తార్తములకాలము ఒక దినము (రాత్రి, పగలు). పదునైదు దినములను పక్షమందురు. శుక్ల కృష్ణపక్షములు కలసినచో ఒక సెలయగును. రెండు నెలలను ఋతువందురు. మూడు ఋతువులు ఒక ఆయనమగును, రెండు ఆయనముల కాలము ఒక సంవత్సరము. నలభైమూడులక్షల ముప్పైవేల సంవత్సరములు నాలుగుయుగములగును. ఇరవై ఐదు వేల ఐదువందల ఆరపై మానవయుగములు దేవేంద్రునకు మనువునకు జీవితకాలమగుచున్నవి. ఎనిమిది లక్షల ఎనీమిదివేల ఇంద్రులు గతించినచో అది బ్రహ్మదేవుని జీవితకాలమగుచున్నది. బ్రహ్మదేవుడు మరణించినపుడు ఈ సృష్టిలయమగుచున్నది. దానినే ప్రాకృతిక లయమందురు. ఇది పరమాత్మయగు శ్రీకృష్ణునకు రెప్పపాటు కాలము.

భూమియందలి రేణువుల సంఖ్యను లెక్క పెట్టలేనట్లు సృష్టి లయముల సంఖ్యను ఎవ్వరు లెక్కించలేరని శ్రీమహాదేవుడు తెలి పెను.

సృష్టి సూత్రస్వరూపం హి చాన్యతవణువరం సుర

మునీంద్రస్య వచః శ్రుత్వా దేవేంద్రో విస్మితో మునే

ఆత్మనః పూర్వమైశ్వర్యం వరయామాస తత్రవై

తత్ ప్రాప్స్యస్య చీరేశైవ ఇత్యుక్త్యా సప్రయయౌ గృహం

మహేంద్రా! నేనింతవరకు నీకు సృష్టిసూత్రమును గురించి వివరించితిని. ఇంకను నీవేమైనా ఆడుగదలచినచో అడుగుమని దుర్వాసుడనగా దేవేంద్రుడు తనకుండిన ఐశ్వర్యము మాత్రమే (ఇంద్రత్వము) కావలెననీ ఆడుగగా ఆ మహర్షి ఇంద్రునితో నీవనుకొన్న ఇంద్రత్వము త్వరలోనే పొందగలవని చెప్పి తన మార్గమున తాను వెళ్ళెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే దుర్వాసోముని సురేంద్ర సంవాదే ఇంద్రంప్రతి దుర్వాసః శాపాది కథనం నామ షట్ డ్రింశోఽధ్యాయః

శ్రీబ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారదనారాయణ సంవాదమున తెల్పబడిన దుర్వాసదేవేంద్రుల సంవాదములో ఇంద్రునకు దుర్వాసుడు పెట్టిన శాపాది వృత్తాంతములు గల ముప్ఫయ్యారవ అధ్యాయము సమాప్తము.