35 - లక్ష్మీ పూజాది వర్ణనము

నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-

శ్రీకృష్ణస్యాత్మనశ్చైవ విర్గుణస్య వీరాకృతేః ।

సావిత్రి యమ సంవాదే శ్రుతం సువిమలం యశః ॥

 తద్గుణోత్కీర్తనం సత్యం మంగళానాం చ మంగళం ।

ఆధునాశ్రోతు మిచ్చామి లక్ష్య్మపాఖ్యానమీశ్వర ॥

కేనాదౌ పూజితా సాఽపి కిం భూతా కేశవాపురా ।

తద్గుణోత్కీర్తవం సత్యం వద వేదవిదార వర ॥

ఓనారాయణ! విర్గుణుడు, వీరాకృతి, పరమాత్మయగు శ్రీకృష్ణుని విర్మలమైన కీర్తిని సావిత్రియమ సంవాద సమయమున ఏన్నాను. ఆ శ్రీకృష్ణదేవుని గుణకీర్తన మంగళకరమైనది.

ఇప్పుడు నాకు లక్ష్మీదేవి చరిత్రను వినవలెవను కోరిక కలదు. ఆ దేవిని మొదట ఎవరు పూజించిరి? ఆమె ఏవిధముగా ఉండినది. అందువలన ఆ లక్ష్మీదేవియొక్క గుణ కీర్తన జరుగునట్లు ఆమె చరిత్రను నాకు వివరింపుము.

నారాయణ ఉవాచ- సారాయణుడిట్లనెను-

 సృష్టేరాదౌ పురా బ్రహ్మన్ కృష్ణస్య పరమాత్మనః ।

దేవీ వామాంశ సంభూతా చాసీత్స రాసమండలే ॥

ఆతీవ సుందరీ శ్యామా న్యగ్రోధ పరిమండలా ।

యథా ద్వాదశవర్షియా రమ్యా సుస్థిర యావవా ॥

శ్వేత చంపక వర్ణాభా సుఖదృశ్యా మనోహరా ।

శరత్పార్వణ కోటిందు ప్రభా సంశోభితాసనా ॥

శరన్మధ్యాహ్న పద్మానాం శోభా శోభిత లోచనా ।

సా చ దేవీ ద్విధాభూతా సహస్రవేశ్వరేచ్చయా॥

సమా రూపేణ వర్ణేన తేజసా వయసా ల్వీషా ।

యశసా వాససా మూర్త్యా భూషణేన గుణేన చ॥

స్మితేన వీక్షణేనైవ వచసా గమనేన చ ।

మధురేణ స్వరేణెన ప్రేమ్ణా చానునయేన చ ॥

ఓ నారధా! పూర్వము సృష్టి ప్రారంభమున రాసమండలమువ శ్రీకృష్ణ పరమాత్మయొక్క ఎడమ భాగమునుండి ఒక దేవీ ఉదయించినది. ఆమె చాలా సౌందర్యము గలది. యౌవనవతి. పన్నెండు సంవత్సరముల కన్యవలె స్థిరమైన యౌవనము కలది.

తెల్లని చంపక పుష్పము వంటి కాంతి కలది. ఆందమైనది. శరత్కాలమందలి కోటి పున్నమి చంద్రుల వంటి ముఖసౌందర్యము గలది. అట్లే శరన్మధ్యాహ్న కాలమందలి పద్మమువంటి కన్నులు కలది.

ఆ దేవి పరమేశ్వరుని ఇచ్చననుసరించి వెంటనే రెండు రూపములతో కన్పించినదీ. ఇద్దరీ రూపము, రంగు, కాంతి, లేజస్సు, వయస్సు, వస్త్రములు, భూషణములు, గుణములు, చిరునవ్వు, చూపు, మాటలు, నడక, మధురస్వరము, ప్రేమగానుండుట అనునయము ఆన్నీయు సమానముగా నుండెను.

తద్వామాంశా మహాలక్ష్మీ: దక్షిణాం చ రాధికా।

 రాధాఽదౌ వరయామాస ద్విభుజం చ పరాత్పరం ॥

మహాలక్ష్మీశ్చ తత్పశ్చాత్ చకమే కమనీయకం ।

కృష్ణస్తద్గౌరవేణైవ ద్విధారూపో బభూవ హ ॥

దక్షిణాంశో వై ద్విభుజో వామాంశశ్చ చతుర్భుజః ।

చతుర్భుజాయ ద్విభుజో మహాలక్ష్మీం దదౌ పురా ॥

లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయాఽనిశం ।

దేవీషు యా చ మహతీ మహాలక్ష్మీశ్చ సా స్మృతా ॥

ద్విభుజో రాధీకాకాంతో లక్ష్మీకాంతశ్చతుర్భుజః ।

గోలోకే ద్విభుజస్తస్థౌ గోఫైర్గోపీభిరావృతః ॥

చతుర్భుజశ్చ వైకుంఠం ప్రయయౌ పద్మయా సహ ।

సర్వాంశేన సమౌ తౌ ద్వౌ కృష్ణనారాయణౌ పరౌ ॥

ఆ దేవి యొక్క ఎడమ భాగమునుండి ఏర్పడినదీ మహాలక్ష్మి, కుడిభాగమునుండి ఆవిర్భవించినది రాధాదేవి. వారిలో రాధ ద్వీభుజాడగు శ్రీకృష్ణపరమాత్మను భర్తగా వరించగా ఆ తర్వాత సుందరుడగు ఆ పరమాత్మను మహాలక్ష్మి వరించినది.

శ్రీకృష్ణుడు వారిపై గల గౌరవభావమున రెండు రూపములతో ఆవిర్భవించెను. ఆతనిలో కుడివైపున ఆవిర్భవించినవాడు ద్విభుజూడగు శ్రీకృష్ణుడు. ఎడమవైపున చతుర్భుజుడగు నారాయణుడుద్భవించెను. ద్విభుజుడగు శ్రీకృష్ణుడు చతుర్భుజుడగు నారాయణునకు మహాలక్ష్మిని ఇచ్చెను.

చల్లని చూపుతో ప్రపంచమును ఎల్లప్పుడు చూచునది (రక్షించునది) దేవతాస్త్రీలలో శ్రేష్ఠురాలు కాపున ఆమె మహాలక్ష్మియైనది. రాధికా ప్రియుడు ద్విభుజూడగు శ్రీకృష్ణుడు. మహాలక్ష్మి ప్రియుడు చతుర్భుజుడగు నారాయణుడు. ద్వీభుజుడగు శ్రీకృష్ణుడు గోప, గోపికలతో గోలోకముననుండెను. చతుర్భుజుడగు నారాయణుడు మహాలక్ష్మితో వైకుంఠమునకు పోయెను.

శ్రీకృష్ణ నారాయణులిద్దరు అన్ని విధములుగా సమానమైనవారు.

మహాలక్ష్మీశ్చ యోగేన నానారూపా బభూవ సా ।

వైకుంఠే చ మహాలక్ష్మీ: పరిపూర్ణతమా పరా ॥

శుద్ధ సత్వస్వరూపా చ సర్వ సౌభాగ్య సంయుతా ।

ప్రేమ్ణా సావై ప్రధానా చ సర్వాసు రమణీషు చ ॥

స్వర్గేచ స్వర్గలక్ష్మీశ్చ శక్రసంపత్స్వరూపిణీ ।

పాతాళేషు చ మర్త్యేషు రాజలక్ష్మీశ్చ రాజస్తు ॥

గృహాలక్ష్మీర్గృహేష్వేవ గృహిణీ చ కళాంశయా ।

సంపత్స్వరూపా గృహిణాం సర్వమంగళమంగళా ॥

గవాo ప్రసూః సా సురభిః దక్షిణా యజ్ఞకామిని ।

క్షీరోదసింధుకన్యా సా శ్రీరూపా పద్మినీషు సా ॥

శోభారూపా చ చం ద్రే సా సూర్యమండల మండితా ।

 విభూషణేషు రత్నేషు ఫలేషు జలజేషు చ॥

నృపేషు నృపపత్నీషు దివ్యస్త్రేషు గృహేషు చ ।

 సర్వ సస్యేషు వస్త్రేషు స్థానే సా సంస్కృతే తథా ॥

ప్రతీమాసు చ దేవానాం మంగళేషు ఘటేషు చ।

మాణిక్యేషు చ ముక్తాసు మార్యేషు చ మనోహరా ॥

మణీంద్రేషు చ హారేషు క్షీరే వై చందనేషు చ ।

వృక్షశాఖసు రమ్యాసు నవమేమేషు వస్తుషు॥

మహాలక్ష్మి యోగ శక్తివలన అనేక రూపములుగా మారినది. వైకుంఠమున పరిపూర్ణతమయైన మహాలక్ష్మిగా ఉండును. ఆమె శుద్ధ సత్వ స్వభావము కలది. సమస్త సౌభాగ్యములు కలది. స్త్రీలందరిలో ప్రేమ మూర్తియై ప్రధానమైనదిగా ఆమె కన్పించును.

ఆ మహాలక్ష్మి స్వర్గలోకమున ఇంద్రుని సంపదకు మారురూపైన స్వర్గలక్ష్మిగా రూపొందినది. పాతాళమున, భూలోకమున నున్న రాజాలకు ఆమె రాజలక్ష్మి యైనది. అన్ని గృహములలో గృహలక్ష్మిగా ఆమె తన అంశచే గృహిణిగా ఐనది. అట్లే గృహ యజమానులకు సంవత్స్వరూపయగు సర్వమంగళ మంగళమైనది. అట్లే ఆవులలో ఆమె గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞభార్యయగు దక్షిణాదేవిగాను, క్షీరాబ్ధికవ్యగాము, చంద్రునిలోను, సూర్యమండలమున, సమస్త భూషణములయందు జలజములలో శోభారూపిణిగను మారినది. అట్లే సమస్త సస్యములందు దేవ ప్రతిమలయందు మంగళ కుంభముల యందు మాణిక్యములందు రత్నమాలలయందు, పాలలో, చందసమున, ఆందమైన వృక్షములందు నూతన మేఘములందు లక్ష్మి కనిపించును.

వైకుంఠే పూజితా సాఽదౌ దేవీ నారాయణేన చ।

ద్వితియే బ్రహ్మణా భక్త్యా తృతీయే శంకరేణ చ॥

విష్ణునా పూజితా సా చ క్షీరోదే భారతే మునే।

 స్వయంభువన మనునా మానవేంద్రైశ్చ సర్వతః ॥

ఋషీంద్రైశ్చ మునీంద్రైశ్చ సద్భిశ్చ గృహిభిర్భవేత్ ।

గంధర్వాద్యైశ్చ నాగాద్యైః పాతాళేషు చ పూజితా ॥

శుక్లాష్టమ్యాం భాద్రపదే పూజా వై బ్రహ్మణా కృతా ।

భక్త్వా చ పక్షపర్యంతం త్రిషులోకేషు నారధ॥

 చైత్ర పౌషే చ భాదైచ పుణ్యే మంగళవాసరే।

 విష్ణునా నిర్మితా పూజా త్రిషులోకేషు భక్తితః ॥

వర్షాంతే పౌషసంక్రాంచ్యాం మధ్యమావాహ్య చాంగణే।

మనుస్తాం పూజయామాస సా భూతా భువనత్రయే॥

లక్ష్మీదేవిని మొదట నారాయణుడు వైకుంఠమున పూజించెను. తరువాత బ్రహ్మదేవుడు, అటుపిమ్మట శంకరుడామెను పూజించెను. నారాయణుడు క్షీరసముద్రమున ఆమెను పూజించగా భారతదేశమున మనువు, రాపోలు, ఋషులు, మునులు, గృహస్థులు, గంధర్పులు మొదలగువారు ఆమెమ పూజించుచున్నారు. పాతాళలోకమున వాగులు మొదలగువారు ఆమె పూజను చేయుచున్నారు.

బ్రహ్మదేవుడు చేసిన లక్ష్మీపూజ భాద్రపద శుద్ధ అష్టమి మొదలుకొని పది హేను దీనములవరకు జరుగును. శ్రీమహావిష్ణువు చేసిన లక్ష్మీపూజ చైత్రమాసమున, పుష్యమాసమున, భాద్రపదమాసమున ప్రతి మంగళవారము చేయవలెను. మనువు జు శ్రీదేవిని ఫాల్గుణమాసమువ, పుష్యమాసమున పూజించెను.

రాజ్ఞా సంపూజితా సావై మంగళనైవ మంగళా ।

కేదారేణైవ నీలేన నలెన సుబలేన చ ॥

ధ్రువేనోత్తానపాదేన శక్రేణ బలినా తథా ।

కశ్యపేన చ దక్షేణ కర్దమేన వివస్వతా॥

ప్రియవ్రతేణ చంద్రేణ కుభేరేణైవ పాయునా ।

యమేన వహ్నినా చైవ వరుణేనైవ పూజితా॥

లక్ష్మీదేవిని మంగళుడను రాజూ పూజించినందువలన ఆ దేవి మంగళమైనది. అదేవిధములో ఆదేవిని కేదారుడు, వీలుడు, నలుడు. సుబలుడు, ధ్రువుడు, ఉత్తానపాదుడు, ఇంద్రుడు, బలిచక్రవర్తి, కశ్యప ప్రజాపతి, దక్షప్రజాపతి, కర్దముడు, సూర్యుడు, ప్రియవ్రతుడు, చంద్రుడు, కుబేరుడు, వాయువు, యముడు అగ్ని, వరుణుడు పూజించిరి.

ఏవం సర్వత్రం సర్వైశ్చ వందితా పూజితా సదా।

సర్వైశ్వర్యాధిదేవీ సా సర్వసంపత్స్వరూపిణీ॥

ఈవిధముగా మహాలక్ష్మినీ అందరు అన్ని చోట్ల నమస్కరించుచున్నారు. పూజించుచున్నారు. ఆదీవి సమస్తసంపదలకు సమస్యైశ్వర్యములకు అధిదేవత కావున ఆందరిపూజలనందుకొనుచున్నది అని నారాయణుడు నారదునీతోపనను. .

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయ ప్రకృతి ఖండి నారద నారాయణ సంవాదే లక్ష్ముపాఖ్యాదే లక్ష్మీస్వరూప పూజాది వర్ణనం వామ పంచత్రింశోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదే సమయమున చెప్పబడిన లక్ష్మీ ఉపాఖ్యానమున శ్రీమహాలక్ష్మీస్వరూపము, పూజావర్ణనములు కల ముప్పది ఐదవ అధ్యాయము సమాప్తము.