బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

45 - మనసా దేవి ఉపాఖ్యానము

నారాయణ ఉవాచ- నారాయణమునీ ఇట్లనెను-

 ఉక్తం ద్వయోరుపాఖ్యానం బ్రహ్మపుత్ర యథాగమం

 శ్రూయతాం మనసాఖ్యానం యచ్చుతం ధర్మవక్త్రతః

కన్యా భగవతీ సా చ కశ్యపస్య చ మానసీ

తేనేఽయం మనసా దేవీ మనసా యా చ దీవ్యతి

 మనసా ధ్యాయతే యా వా పరమాత్మానమీశ్వరం

తేన సా మనసా దేవీ యోగేనేతైన దీవ్యతి

ఆత్మారామా చ సాదేవీ వైష్ణవీ సిద్ధయోగినీ

 త్రియుగం చ తపస్తప్త్వా కృష్ణస్య పరమాత్మనః

నారదమహర్షీ! నీకు షష్ఠీదేవి మంగళచండికాదేవి ఈ ఇద్దరి కథను తెల్పితిని. ఇక ఇప్పుడు ధర్మునివలన నేను విన్న మనసా దేవియొక్క ఉపాఖ్యానమును వినుము.

కశ్యప ప్రజాపతికి మానసిక అను పుత్రిక కలదు.మానసిక పుత్రీ కావున ఆ కన్యను మనస యని పిలుతురు, లేక పరమాత్మను సదా మనసున ధ్యానించునది కావున 'మనస' యైనది. ఆదేవి తనలో తానే రమించునది. సిద్ధయోగిని, వైష్ణవికూడ. అందువలన ఆమె పరమాత్మయగు శ్రీకృష్ణునిగురించి మూడు యుగములు తపస్సు చేసినది.

జరత్కారు శరీరం దృష్ట్వా యాం క్షణమీశ్వరః

గోపీపతిర్నామ చక్రే జరత్కారురీతి ప్రభుః

వాంఛితం చ దదౌ తస్యై కృపయా చ కృపానిధి

పూజాంచ కారయామాస చకార చ పునః స్వయం

స్వర్గే చ నాగలోకే చ పృథివ్యాం బ్రహ్మలోకతః

భృశం జపత్సు గౌరీ సా సుందరీ చ మనోహరా

జగద్గౌరీతి విఖ్యాతా లేవ సా పూజితా సతీ

శివశిష్యా చ సా దేవీ తేనశైవీతి కీర్తితా

విష్ణుభక్తాఃఽతీవరమ్యా వైష్ణవీ లేన నారద

నాగానాం ప్రాణరక్షిత్రీ జనమేజయ యజ్ఞకే

నాగేశ్వరీతి విఖ్యాతా సా నాగ భగినీ తథా

విషం సంహరుమీశా సా తేనాఽసౌ విషహారిణీ

 సిద్ధం యోగం హరాత్ప్రాప లేనా సిద్ధయోగినీ

 మహాజ్ఞానం చ గోప్యం చ మృతసంజీవినీం పరాం

మహాజ్ఞానయుతాం తాం చ ప్రవదంతి మనీషిణః

ఆస్తీకస్య మునీంద్రస్య మాతా సావై తపస్విన:

ఆస్తీక మాతా విఖ్యాతా జరత్కారురితిస్మసా

ప్రియా మునేర్జరత్కారోర్మునీంద్రస్య మహాత్మనః

యోగినో విశ్వపూజ్యస్య జరత్కారో: ప్రియా తతః

ఆ మనసాదేవి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేయుచుండగా ఆమె వస్త్రము, శరీరము శిథిలమగుచుండెను. అందువలన సమస్తలోకములకు ప్రభువు గోపీపతి అగు శ్రీకృష్ణుడు ఆమెకు జరత్కారు ఆను సార్థక నామమునుంచెను. అట్లే దయానిధియగు ఆ శ్రీకృష్ణుడు ఆమె కోరిన కోరికలను అన్నిటిని తీర్చెను. అందువలన ఆ దేవి ఆ పరమాత్మను మరల పూజించినది. ఆట్లే ఇతరులా పరమాత్మను పూజించునట్లోనర్చినది.

ఆ మనసాదేవిని భూమి పైనున్న వారు, స్వర్గలోకముననున్నవారు, పాతాళ లోకముననున్నవారు పూజించుచుండిరి. తెల్లగా, మనోహరముగా, సుందరముగానుండి అన్నీ జగత్తులనుండు వారిచే పూజలనందుకొనుచున్నందువలన ఆమెను “జగద్గారి’ అనిరి.

ఆ దేవి శివునకు శిష్యురాలు కావున శైవియైనది. విష్ణుమూర్తిపై పరమతీవ్రమయిన భక్తి కలదీ కావున "నైష్ణవియైనది. జనమేజయునీ యజ్ఞమున నాగులనందరిని అగ్ని ఆహుతీకాకుండ రక్షించినందువలన నాగేశ్వరీయని నాగభగివి యని ఆమెను పిలుతురు. సర్పములయొక్క వీషమును సంహరింపచేయగలది కావున ఆమెను “విషహారిణి" యనిరి.

పరమశివుని వలన సిద్దయోగమును, మహాజ్ఞానమును అత్యంత రహస్యమైన మృతసంజీవినీ విద్యను పొందినందువలన సిద్ధయోగినీయైనది. పండితులామెను మహాజ్ఞాని యని కూడ పిలుతురు. ఆస్తీకమునీంద్రుని తల్లి కావున ఆస్తీక మాతయైనది, జరత్కారు అనునదీ ఆమె పేరైనా ఆమె జరత్కారు ఆనుమునీంద్రునకు భార్యయైనది.

ఈ విధముగా మనసాదేవి అన్నిలోకములందు ప్రసిద్ధిని పూజలను పొందినది.

“ఓం నమో మనసాయై" - మనసాదేవికి నమస్కరింతును.

జగత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ

వైష్ణవీ నాగభగినీ శైవి నాగేశ్వరీ తథా

జరత్కారు ప్రియాఽష్తీక మాతా విషహరీతి చ

మహాజ్ఞానయుతాచైవ సా దేవీ విశ్వపూజితా

ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్

తస్య నాగభయం నాస్తి తస్యవంశోద్భవస్య చ

ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయః

నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే

నాగక్షలే నాగదుర్గే నాగవేష్టిత విగ్రహే

జరత్కారు, జగద్గారి, మనసా, సిద్ధయోగిని, వైష్ణవీ, నాగభగిని, శైవీ, నాగేశ్వరీ, జగత్కారుప్రియా. ఆస్తీక మాతా, విషహరి, మహాజ్ఞానయుతా, అను మనసాదేవియొక్క పన్నెండు పేర్లను పూజా సమయమున చదువువానీకి నాగభయమనునది ఉండదు. అతని వంశమున పుట్టబోవు వారికి కూడ. నాగభయముండదు.

నాగభయముకల శయన మందిరమున సర్పములు తరచుగా వచ్చు ఇంటిలో, సర్పము కాటువేయు సమయమున, సర్పములు చుట్టు ముట్టినప్పుడు, ఈ స్తోత్రమును చదివినచో సర్పభయముండదు.

నిత్యం పఠేద్యస్తం దృష్ట్యా నాగవర్గ: పలాయతే

దశలక్ష జపేనైవ స్తోత్రసిద్ధిర్భవేత్ నృణాం

స్తోత్రం సిద్ధం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః

నాగౌఘం భూషణం కృత్వా సభవేన్నాగవాహనః

నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః

ఈ స్తోత్రము ప్రతిదినము పఠించు చున్నచో ఆతనిని చూచి సర్పములన్నియు పరుగెత్తి పోవును. ఈ స్తోత్రమును పదిలక్షల మార్లు జపముచేసినచో సిద్ది కలుగును. స్తోత్రసిద్ది జరిగినవాడు విషమునైనా తినగలడు. అతడు పాపములను ఆభరణములుగా చేసికొని యైనను నాగవాహనుడు నాగాసనుడు, నాగతల్పుడైనను కావచ్చును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వీతీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే మానసోపాఖ్యానే మానసా స్తోత్రాది కథనం నామ పంచచత్వారింశత్తమోఽధ్యాయః  

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాద సమయమున తెల్పబడిన మానసోపాఖ్యానమందు మానసా స్తోత్రాదులను తెలిపే నలభై యైదవ అధ్యాయము సమాప్తము.