నారాయణ ఉవాచ- నారాయణుడు నారదునితో నిట్లనెను-
సల్వా స్కోశ్వపతిసేవ సంపూజ్య విధిపూర్వకం ।
దదర్శ తత్ర తాం దేవీం సహస్రార్కసమ ప్రభాం ॥
ఉవాచ సా తం రాజానం ప్రసన్నా సస్మితా సతీ ।
యథా మాతా స్వపుత్రం చ ద్యోతయంతి దిశస్త్విషా ॥
ఆశ్వపతి మహారాజా సావిత్రీదేవిని స్తుతించి ప్రోక్త విధానమున ఆమెను పూజించి వేయి సూర్యుల కాంతిగల దేవిని దర్శించుకొనెను. వేదమాతయగు ఆ సావిత్రిదేవి ప్రసన్నవదనము కలదై తల్లి తన పుత్రుని ప్రేమతో చూచుకొనునట్లు ప్రేమతో చిరునవ్వు కల ముఖములో చూచి ఇట్లు మాట్లాడెను.
సావిత్ర్యువాచ- సావిత్రిదేవి ఇట్లు ఆనినది-
జానామి తే మహారాజ యత్తే మనసి వర్తతే ।
వాంఛితం తవ పత్న్యాశ్చ సర్వం దాస్యామి నిశ్చితం ॥
పార్వీ కన్యాభిలాషం చ కరోతి తవ కామినీ ।
త్వం ప్రార్థయసి పుత్రంచ భవిష్యతి చ తే క్రమాత్ ॥
ఇత్యుక్త్యా సా మహాదేవీ బ్రహ్మలోకం జగామహ ।
రాజా జగామ స్వగృహం తత్కన్యాఽదౌ బభూవ హ ॥
ఓ మహారాజా నీకోరిక నీ భార్యకోరిక నాకు తెలియును. మహాసాధ్వియగు ఏ భార్య కన్య కావలెనని కోరుచున్నది. నీవు మాత్రము పుత్ర సంతానము కావలెనని కోరుకొనుచున్నావు. అందువలన నీకు తొలుత కుమార్తె పుట్టును. అటుపిమ్మట పుత్ర సంతానము కలుగునవి సావిత్రీదేవి వరమువిచ్చి బ్రహ్మలోకమునకు పోయెను. అశ్వపతి కూడ సంతోషముతో ఇల్లు చేరుకొనెను.
కొంతకాలమునకు ఆ మహరాజునకు కూతురు పుట్టెను.
రాజ్ఞో ధనాచ్చ సావిత్య్రాః బభూవ కమలా కళా ।
సావిత్రీతి చ తన్నామ చకారాశ్వపతి: వృషః ॥
కాలేవ సా వర్థమానా బభూవ చ దినే దినే ।
రూపయౌవన సంపన్హా శుక్లే చంద్రకళా యథా ॥
సా వరం వరయామాస ద్యుమత్సేనాత్మజం తదా।
సావిత్రీ సత్యవంతం చ నానాగుణ సమన్వితం ॥
రాజా తస్మై దదౌ తాం చ రత్న భూషణ భూషితాం।
స చ సార్థం కౌతుకేన తాం గృహీత్వా గృహం యయౌ॥
స చ సంవత్సరేఽతీతే సత్యవాన్ సత్యవిక్రమః ।
జగామ ఫలకాష్ఠార్ధం ప్రహర్షం పితురాజ్ఞయా ॥
జగామ తత్ర సావిత్రీ తత్పశ్చాద్దైవయోగతః ।
విపత్య' వృక్షాద్దైవేన ప్రాణాన్ తత్యాజ సత్యవాన్ ॥
సావిత్రిదేవి అనుగ్రహమువలన లక్ష్మీదేవి' అంశగల కన్యక ఆ మహారాజనకు కలిగెను. ఆ మహారాజు ఆ కన్యకు తన ఇష్టదైవమగు సావిత్రీదేవి పేరునే పెట్టుకొనెను. ఆ సావిత్రీ శుక్లపక్షమునందలి చంద్రకళవలె దీన దీవ ప్రవర్ధమానమగుచు పెరిగాను. రూం మౌవన సంపదగల ఆ సావిత్రి ద్యుమత్సేన మహారాజు పుత్రుడైన సత్యవంతుడు తనకు భర్తగా కావలెనని కోరుకొనెను. అందువలన అమపతి మహారాజు సుగుణ సంపదకల సత్యవంతునకు రత్నాలంకార శోభితయగు తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను. అప్పుడు సత్యవంతుడు సంతోషముగా ఆమెను తీసికొని తన ఇంటికి వెళ్ళాను.
సావిత్రి సత్యవంతుల వివాహము జరిగి సంవత్సరము గడిచినది. ఒకనాడు సత్యవంతుడు తండ్రి యాజ్ఞనమసరించి పండ్లు పమిధలు తెత్తుననీ ఆడవికి పోయెను. సావిత్రి కూడా భర్తవెంట అడవికి వెళ్ళినది. ఆ అడవిలో సత్యవంతుడు చెట్టెక్కి కట్టెలుకొట్టుచుండగా దురదృష్టవశమును చెట్టుపై మండి క్రిందబడి ప్రాణములు వదిలిపెటెను.
యమస్తజ్జీవపురుషం బధ్వంగుష్ఠ సమం మువే ।
గృహీత్వా గమనం చక్రే తత్పశాతయయా సతీ ॥
పశ్చాత్తాం సుందరీం దృష్యా యమః సంయమినీపతిః ।
ఉవాచ మధురం సాధ్వీం సాధూనాం ప్రవరో మహాన్॥
యమధర్మరాజు, బొటనవేలంత యున్న సత్యవంతునీ జీవపురుషుని తీసికొని వెళ్ళుచుండగా సావిత్రి యమధర్మరాజు వెంటనే పోసాగినది. సత్పురుషులలో శ్రేష్ఠుడైన యమధర్మరాజు తనవెంట వచ్చుచున్న సావిత్రిని చూచి మధురముగా ఇట్లు మాట్లాడెను.
యమ ఉవాచ- యమధర్మరాజు ఇట్లనెను-
అహో క్వ యాసి సావిత్రి గృహీత్వామానుషీం తనుం ।
యది యాస్యసి కాంతేన సార్థం దేహం తదా త్యజ ॥
గంతుం మర్త్యో నశక్నోతి గృహీత్వా పాంచ. భౌతీకం ।
దేహం చ యమలోకం చావశ్వరం నశ్వరః సదా ।
పూర్ణశ్చ భర్తుస్తే కాలః హ్యాభవద్భారతే సతీ ॥
స కర్మఫలభోగార్థం సత్యనావ్యాతి మధహం ।
కర్మణా జాయతే జంతుః కర్మణైన ప్రలీయతే।
సుఖం దుఃఖం భయం శోకం కర్మణైవ ప్రపద్యతే ।
కర్మణేంద్రో భవేజ్జీవో బ్రహ్మపుత్రః స్వకర్మణా ॥
స్వకర్మణా హరేర్దాసో జన్మాది రహితో భవేత్ ।
స్వకర్మణా సర్వ సిద్ధిమమరత్వం లభేత్ ధ్రువం॥
లభేత్ స్వకర్మణా విష్ణో: సాలోక్యాది చతుస్టయం ।
కర్మణా బ్రాహ్మణత్వం చ ముక్తత్వం చ స్వకర్మణా॥
సురత్వం చ మమత్వం చ రాజేంద్రత్వం లభెన్నరః ।
కర్మణా చ మునీంద్రత్వం తపస్విత్వం చ కర్మణా ॥
కర్మణా క్షత్రియత్వం చ వైశ్యత్వం చ స్వకర్మణా।
కర్మణా చైవ శూద్రత్వమంత్యజత్వం స్వకర్మణా ॥
స్వకర్మణా చ ంలేచ్చత్వం లభతే నాత్ర సంశయం: ।
స్వకర్మణా జంగమత్వం స్థావరత్వం స్వకర్మణా॥
స్వకర్మణా చ శైలత్వం వృక్షత్వం చ స్వకర్మణా ।
స్వకర్మణా పశుత్వం చ పక్షిత్వం చ స్వకర్మణా ॥
స్వకర్మణా క్షుద్ర జంతుః క్రిమిత్వం చ స్వకర్మణా
స్వకర్మణా చ సర్వత్వం గంధర్వత్వం స్వకర్మణా ॥
స్వకర్మణా రాక్షసత్వం కిన్నరత్వం స్వకర్మణా ।
స్వకర్మణా చ యక్షత్వం కూష్మాండత్వం స్వకర్మణా॥
స్వకర్మణా చ ప్రేతత్వం భేతాళత్వం స్వకర్మణా ।
భూతత్వం చ పిశాచత్వం డాకినీత్వం స్వకర్మణా॥
దైత్యత్వం దానవత్వం చాప్యపురత్వం స్వకర్మణా ।
కర్మణా పుణ్యవాన్ జీవో మహాపాపీ స్వకర్మణా ॥
కర్మణా సుందరోఽరోగీ మహారోగీ చ కర్మణా ।
కర్మణా చాంధః కాణశ్చ కుత్పితశ్చ స్వకర్మణా ॥
కర్మణా నరకం యాంతి జీవాః స్వర్గం స్వకర్మణా।
కర్మణా శక్రలోకం చ సూర్యలోకం స్వకర్మణా ॥
కర్మణా చంద్రలోకం చ వహ్నిలోకం స్వకర్మణా ।
కర్మణా వాయులోకం చ కర్మణా వరుణాలయం॥
తథా కుబేరలోకం చ నరోయాతి స్వకర్మణా ।
కర్మణా ధ్రువలోకం చ శివలోకం స్వకర్మణా ॥
యాతి నక్షత్రలోకం చ సత్యలోకం స్వకర్మణా ।
జనోలోకం తపోలోకం మహర్లోకం స్వకర్మణా ॥
స్వకర్మణా చ పాతాళం బ్రహ్మలోకం స్వకర్మణా ।
కర్మణా భారతం పుణ్యం సర్వేప్సిత వరప్రదం॥
కర్మణా యాతి వైకుంఠం గోలోకం చ నిరామయం ।
కర్మణా చిరంజీవీ చ క్షణాయుశ్చ స్వకర్మణా॥
కర్మణా కోటి కల్పాయుః క్షీణాయుశ్చ స్వకర్మణా ।
జీపసంచార మాత్రాయుః గర్భే మృత్యుః స్వకర్మణా॥
ఇత్యేవం కథితం సర్వం మయా తత్వం చ సుందరి ।
కర్మణా తే మృతో భర్త గచ్ఛ వత్సే యథా సుఖం ॥
ఓ సావిత్రి! మానవదేహమును ధరించి ఎక్కడకు వచ్చుచున్నావు. నీవు నీ భర్త వెంట రాదలచినచో ఈపార్థివ దేహమును వదలి పెట్టుము ఈ పాంచభౌతిక శరీరమును ధరించి అశాశ్వతుడైన మానవుడు శాశ్వతమైన యమలోకమునకు పోలేడు.
నీభర్త ఈ భారతభూమీలో ఉండదగు కాలము సంపూర్ణమైనందువలన ఆతడు చేసికొన్న కర్మఫలముననుభవించుట కొరకు నా లోకమునకు వచ్చుచున్నాడు.
ఈజీవులన్నియు తాము చేసికొన్న కర్మవలననే పుట్టుచున్నవి. గిట్టుచున్నవి. సుఖము, దుఃఖము, భయము, శోకము ఆసుపవి అన్నియు. కూడ జీవులు చేసికొనుచున్న - కర్మలవలవనే ఏర్పడుచున్నవి.
కర్మవలననే జీవుడు ఇంద్రుడగుచున్నాడు బ్రహ్మపుత్రుడగుచున్నాడు. శ్రీహరికి దాసుడగుచున్నాడు. అనేక జన్మరహితుడగుచున్నాడు. ఈకర్మవలననే సర్వసిద్ధులు, అమరత్వము, ముక్తి, బ్రాహ్మణత్వము లభించుచున్నవి. ఈ కర్మవలననే జీపుడు దేవతగా, మనుపుగా, రాజేంద్రుడుగా మునీంద్రుడుగా, తపస్విగా, క్షత్రియుడుగా, వైశ్యుడుగా, శూద్రుడుగా అంత్యజుడుగా, ప్లేచ్ఛుడుగా పుట్టుచున్నాడు.
ఈకర్మవల్లనే జీవుడు స్థావరముగా, జంగమముగా, గుట్టగా, చెట్టుగా పశువుగా పక్షిగా, క్షుద్రజంతువుగా, క్రిమి కీటకముగా, సర్పముగా, గంధర్వుడుగా రాక్షసుడుగా, కిన్నరుడుగా, యక్షుడుగా, ప్రేతగా, భేతాళుడుగా, భూత, పిశాచ ఢాకినీలుగా, దైత్యుడుగా, దానవుడుగా, అసురుడుగా జన్మించుచున్నాడు.
అట్ల పుణ్యవంతుడగుచున్నాడు. మహాపాపాత్ముడగుచున్నాడు. సుందరుడుగా మహారోగిగా గుడ్డివాడుగా, ఒకే కన్ను కలవాడుగా దుష్టుడుగా ఏర్పడుచున్నాడు. అట్లే కర్మవలననే జీవులు స్వర్గమును నరకమును పొందుచున్నారు. ఇంద్రలోకము, శివలోకము, సత్యలోకము మొదలగు లోకములకు పోవుచున్నారు.
ఆ కర్మవలననే చిరంజీవిగా అల్పాయుష్కుడుగా అగుచున్నారు. ఓసుందరి కర్మఫలితములీ విధముగామండును. అందువలన నీ భర్తకూడ తాము చేసికొన్న కర్మ ననుసరించి మృతిచెందినాడు. కావున నీవు విచారించక వెనుదిరిగి పొమ్ము.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి ఖండే వారద నారాయణ సంవాదే కర్మవిపాకే కర్మణః సర్వహేతుత్వ ప్రదర్శనం నామ చతుర్వింశతితమోఽధ్యాయః ॥
శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణుల సంవాదమున తెలుపబడిన కర్మవిపాకములో కర్మయే అన్నిటికి కారణమను విషయమును తెలుపు
ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 24 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Impressed by the extraordinary spiritual purity and fearlessness of Sāvitrī, Yamarāja repeatedly requested her to turn back and perform her husband's funeral rites, offering her multiple boons excluding the life of her husband. Sāvitrī used these boons wisely to restore her father-in-law's lost sight and kingdom, while continuously questioning Yamarāja on the intricate workings of Karma, the nature of human destiny, and the ultimate cause of birth, suffering, and liberation. Touched by her profound philosophical insights and unyielding marital devotion, Yamarāja began answering her deep inquiries regarding the exact consequences of good and evil deeds across human lifetimes.