47 - సురభి ఉపాఖ్యానము

నారద ఉవాచ- నారదుడు నారాయణునితో ఇట్లనెను-

కాపా సా సురభీ దేవీ గోలోకాదాగ చ యా ।

తజ్జన్మ చరితం బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛామి తత్వతః ॥

నారాయణమునీ! గోలోకమునుండి మనపాదేవిని అభిషేకించుటకు వచ్చిన సురభి ఎవరు? ఆ సురభి ఎచ్చట ఏవిధముగా పుట్టినదో దాని చరిత్ర ఏమిటో తెలుసుకొనగోరుతాను. వారాయణ ఉవాచ. వారాయణుడిట్లనెను.

గవా మధిష్ఠాతృదేవీ గవామాద్యా గవాం ప్రసూః ।

గవాం ప్రధావా సురభి గోలోకే చ సముద్భవా ॥

సర్వాది సృష్టేః కథనం కథయామి నిశామయ।

బభూవ తేన తజ్జన్మ పురాబృందావనే వనే ॥

గోవులకు ఆధిష్టాన దేవత, అన్నీ గోవులకు తల్లి, గోపులలో ప్రధానభూతన సురభి గోలోకమున పుట్టినది. వారదా సృష్టి ప్రారంభమును గూర్చి మీకు చెప్పెదను, సురభియొక్క జన్మ ఆ సమయమున బృందావనమున జరిగినది.

ఏకదా రాధికా నాథో రాధయా పహ కౌతుకాత్ ।

గోపాంగవా పరివృతః పుణ్యం బృందావనం యయౌ॥

సహసా తత్ర రహసి విజహార చ కౌతుకాత్ ।

బభూవ క్షీరపానేచ్చా తదా స్వేచ్చా పరస్య చ ॥

ససృజే సురభీం దేవీం లీలయా పామపార్శ్వతః ।

వత్సయుక్తాం దుగ్ధవతీం వత్సానాం చ మనోరమాం ॥

దృష్ట్యా సవత్సాo సురభీం రత్నభాండే దుదోహ సః।

క్షీరం సుధాతిరీక్తం చ జన్మమృత్యుహరం పరం॥

తదుష్ణం చ పయః స్వాదు పపా గోపీపతి: స్వయం।

సరో బభూవ పయసా భాండ విస్రంసనేవ చ ॥

దీర్ఘే చ విస్తృతే చైవ పరితః శతయోజనం ।

గోలోకేషు ప్రసిద్దం తత్ రమ్యం క్షీర సరోవరం ॥

గోపికావాం చ రాధాయాః క్రీడావాపీ బభూవ సా ।

రత్నేన రచీలో తూర్ణం భూతా వాపీశ్వరేచ్ఛయా ॥

బభూవ కామదేవాం సహపా లక్షకోటయః ।

తావత్యో హి సవత్సాశ్చ సురభిలోమ కూపతః ॥

తాసాం పుత్రాశ్చ పౌత్ర్చాశ్చ సంబభూవురసంఖ్యకా ।

కథ చ గవాం సృష్టిస్తయా సంపూరీతం జగత్ ॥

ఒకప్పుడు శ్రీకృష్ణుడు రాధాదేవి గోపికా స్త్రీలతో కలసి బృందావనమునకు వెళ్ళెను. అచ్చట రాధాదేవితో రహస్యముగొనున్న సమయమున స్వపరుడైన ఆ పరమపురుషునకు పాలు తాగవలెనని కోరిక కలిగినది. అందువలన వెంటనే తన ఎడమ భాగముమండి దూడలో, పాలనిచ్చు సురభిని సృష్టించెను.

దూడలోనున్న సురభిని చూచి పరమాత్మ దాని పాలను రత్నభాండమున పిదికిపట్టేను, సురభియొక్క పాలు అమృతమువలె జన్మమృత్యువులను పోగొట్టును. వేడిగామన్న ఆ పాలను శ్రీకృష్ణుడు తాగెను. తరువాత రత్నభాండములోనున్న ఆ పాలు ఒలికి శతయోజన విస్తారమైన క్షీర సరోవరముగా మారెను. ఆ సరోవరము గోపికలకు రాధాదేవికి క్రీడించుటకు ఏర్పాటు చేసికొన్న దిగుడుబావియైనది. దాని మెట్లు గోడలు రత్నములచే కట్టబడినవి.

ఆ సురభియొక్క , రోమకూపములనుండి అనేక లక్షలకోట్ల కామధేమపులు, దూడలతో పుట్టినవి. ఆ కామధేమపుల దూడలకు దూడలు, వాటికి మరల దూడలు ఇట్లు ఆపులు అసంఖ్యాకముగా గోలోకమున ఏర్పడినవి. గోవుల సృష్టి ఈవిధముగా జరిగినది.

పూజాం చకార భగవాన్ సురభ్యాశ్చ పురా మునే ।

తతో బభూవ తత్పూజా త్రిషు లోకేషు దుర్లభా ॥

దీపాన్వీతా పరదినే శ్రీకృష్ణస్యాజ్ఞయా భవే।

బభూష సురబీ పూజా ధర్మవక్త్రా దీత శ్రుతం॥

ధ్యానం స్తోత్రం మూలమంత్రం యద్యత్పూజావిధిక్రమం ।

వేదోక్తం చ మహాభాగ నిబోధ కథయామి ॥

పూర్వము పరమాత్మయగు శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆ పూజ ముల్లోకములందు చాలా గొప్పవిది. ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన దీపావళి పండుగ దాటిన తరువాత తెల్లవారీ సురభిపూజను భూలోకమున జరుపుచుండినట్లు ధర్మునివలన వింటిని.

ఆ సురభియొక్క ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము వేదమున చెప్పబడినవి. వాటిని నీకిప్పుడు వివరింతుమ.

"ఓం సురభ్యై నమ" ఇతి మంత్రోఽయంతు షడక్షరః ।

సిద్ధో లక్ష జపేనైవ భక్తానాం కల్పపాదపః॥

స్థితం ధ్యానం యజుర్వేదే పూజనం సర్వసమ్మతం ।

బుద్ధిదార వృద్దీదాం చైవ ముక్తిదాం సర్వకామదాం॥

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం ।

గవామధిష్ఠాతృదేవీం గవామాద్యం గవాం ప్రసూం ॥

పవిత్ర రూపాం పూజ్యాం చ భక్తానాం సర్వకామదాం ।

యయాపూతం సర్వవిశ్వం తాం దేవీం సురభీం భజే ॥

ఓం సురభ్యై నమః అను ఆరక్షరముల మంత్రమును లక్షమార్లు జపించినచో మంత్రసిద్ది జరుగును, అదీ భక్తులకు కల్పవృక్షము వంటిది. సురభియొక్క పూజావీధీ, ధ్యానము యజుర్వేదమున కన్పించును.

సురభి బుద్ధిని, వృద్ధిని, ముక్తిని కలిగించును. సమస్తమైన కోరికలను తీర్చును, సురభి లక్ష్మీ స్వరూపము, రాధాదేవియొక్క సహచరి. గోవులకన్నిటికి అధిష్టాన దేవత. గోవులకు మూలమైనది. వాటికన్నిటికి తల్లి, మిక్కిలి పవిత్రమైనది. పూజించదగినది. ఆ సురభీదేవి వలన ప్రపంచమంతయు పరమపవిత్రమైనది.

ఆట్టి సురభీదేవిని నేనెల్లప్పుడు ధ్యానింతును.

ఘటే వా ధేనుశిరసి బద్ధస్తంభే గవాం చ వా।

శాలగ్రామే జలేఽగ్నే వా సురభీం పూజయేద్ద్విజ: ॥

దీపాన్వితా పరదినే పూర్వాహ్ణే భక్తిసంయుతః ।

యః పూజయేచ్చ సురభీం స చ పూజ్యో భవేద్భువి ॥

సురభిని కలశమందైనను, ఆవు శిరస్సునందైనను, ఆవులను కట్టివేయు స్తంభమునందైనను, సాలగ్రామమున, జలమున, అగ్నియందు వీటిలో దేనియందైనను దీపావళి పండుగ మరుసటి దీనమున పూర్వాష్ణ కాలమున సురభిని ఆవాహన చేసి పూజ చేయవలెను.

ఏకధాత్రిషు లోకేషు వారాహీ విష్ణుమాయయా ।

క్షీరం జహార సహసా చింతితాశ్చ సురాదయః ॥

తే గత్వా బ్రహ్మణోలోకం బ్రహ్మాణం తుష్టువుస్తదా ।

తదాజ్ఞయా చ సురభీం తుష్టువే పాకశాసనః ॥

ఒకప్పుడు వరాహ కల్పమున శ్రీమన్మహా విష్ణువుయొక్క ఆజ్ఞవలన సురభి పాలిచ్చుట మానివేసెను. అందువలన దేవతలందరు చాలా బాధపడి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని స్తుతించగా అతని ఆజ్ఞననుసరించి దేవేంద్రుడు సురభిని ఈవిధముగా స్తుతించెను.

మహేంద్ర ఉవాచ- దేవేంద్రుడిట్లనెను-

నమోదేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః ।

గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే ॥

నమోరాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః।

నమ: కృష్ణప్రియాయై చ గవాంమాత్రే నమోనమః ॥

శ్రీదాయై ధనదాయై చ బుద్ధిదాయై నమోనమః।

శుభదాయై ప్రసన్నాయై గోప్రదాయై నమోనమః॥

యశోదాయై సౌఖ్యదాయై ధర్మజ్ఞాయై నమోనమః ।

దేవి, మహాదేవి అగు సురభికి నమస్కారము. ఆవులకన్నిటికి మూలరూపము జగన్మాతవగు నీకు నమస్కారము. రాధాదేవికి ప్రియురాలు, లక్ష్మీదేవియొక్క ఆంశవగు నీకు నమస్సులు. శ్రీకృష్ణునకు ప్రియమైనది గోవులకు తల్లివగు నీకు నమస్కారములు. శోభ, ధనము, బుద్ధి, శుభములు, గోవులను ఇచ్చు నీకు నమస్కారములు. ప్రసన్న బుద్ధి, శుభములు, గోవులను ఇచ్చు నీకు నమస్కారములు. ప్రసన్న స్వరూపిణి, యశోదాదేవికి సౌఖ్యమును కలిగించిన నీకు నమస్కారములు.

స్తోత్రశ్రవణమాత్రేణ తుష్టా హృష్టా జగత్ర్పసూః ॥

ఆవీర్బభూవ తత్రైవ బ్రహ్మలోకే సనాతనీ।

మహేంద్రాయ వరందత్వా వాంఛితం సర్వదుర్లభం॥

జగామ సా చ గోలోకం యయుర్దేవాదయో గృహం।

బభూవ విశ్వం సహసా దుగ్ధపూర్ణం చ నారద॥

దుగ్ధత్ ఘృతం తతోయజ్ఞం తతః ప్రీతిః సురస్య చ ।

మహేంద్రుడు చేపివ స్తోత్రమును విని లోకమాత, సనాతనియగు సురభి బ్రహ్మలోకముననే కనిపించి మహేంద్రునకు కోరిన కోరికలనన్నిటినీ ఇచ్చి గోలోకమునకు పోయెను. అందువలన దేవతలందరు సంతోషముతో తమతమ స్థానములకు చేరుకొనిరి.

అప్పటినుండి ప్రపంచమున పాలు మరల కనపడసాగినవి.

పాలవలన నేయి కలిగెను. నేయివలన యజ్ఞములు చేయుటకు వీలయ్యెను. యజ్ఞములవలన దేవతలకు సంతోషము కలిగినది.

ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ ॥

సగోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమానుణ్యవాన్భవేత్ ।

సున్నితః సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దీక్షిత: ॥

ఇహలోకేసుఖం భుక్త్యా యాత్యంతే కృష్ణమందిరం ।

సుచిరం నివసేతత్ర కురుతే కృష్ణసేవనం॥

 న పునర్భవనం తస్య బ్రహ్మపుత్ర భవే భవేత్॥

మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రమును భక్తితో ప్రతిదినము చదివినచో ఆతడు గోసంపద కలవాడగును. ధనవంతుడు, కీర్తివంతుడు, పుణ్యవంతుడగును. ఆతడు సమస్త తీర్థములలో స్నానముచేసిన పుణ్యమును, సమస్త యజ్ఞముల వాచరించిన సుకృతమును పొందును. ఇంకను ఇహలోకమున సుఖముగానుండి చివరకు గోలోకమునకు పోవును. ఈస్తోత్రమును సర్వదా పఠించు పుణ్యాత్మునకు పునర్జన్మ అనునది లేనేలేదు.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతఖండే నారదనారాయణ సంవాదే పురభ్యుపాఖ్యానే తదుత్పత్తి తత్పూజాకథనం నామ సప్త చత్వారింశత్రమోఽధ్యాయః ॥

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన సురభి చరిత్రలో సురభియొక్క పుట్టుక, దాని పూజాదులను తెలుపు నలభై ఏడవ అధ్యాయముపమాప్తము.