20 - శంఖచూడ వధ

నారాయణ ఉవాచ- నారాయణు డిట్లు నారదునితో ననెను-

 శివస్తత్వం సమాకర్ణ్య తత్వజ్ఞాన విశారదః ।

యయౌ స్వయం చ సమరం స్వగణైస్సహనారద ॥

శంఖచూడ: శివం దృష్ట్యా విమానాదవరుహ్య చ ।

ననామ పరయా భక్త్యా దండవత్పతితో భువి ॥

తం ప్రణమ్య చ వేగేన విమానం హ్యారురోహ సః ।

తూర్ణం చకార సన్నాహం ధనుర్జగ్రహ దుర్వహం ॥

శివ దానవయోర్యుద్ధం పూర్ణమబ్దం బభూవ హ ।

నవై బభూవతు: బ్రహ్మన్ తయోర్జయపరాజయా ॥

న్యస్త్రశస్త్రశ్చ భగవాన్ వ్యక్తశస్త్రశ్చ దానవః ।

రథస్థ: శంఖచూడశ్చ వృషస్థో వృషభద్వజః ॥

దానవానాం చ శతకం ఉద్వృత్తం చ బభూవ హ ।

రణే యే మృతాః శంభో: జీవయామాస తాన్ విభుః ॥

 తతో విష్ణుర్మహామాయో వృద్దబ్రాహ్మణ రూపధృక్ ।

ఆగత్య చరణస్థానమవోచద్దానవేశ్వరం ॥

శివుడు యుద్ధవృత్తాంతమును తెలిసికొని స్వయముగా తన గణములతో రణరంగమునకేగెను. శివుడు రణ రంగమునకు రాగానే శంఖచూడుడు ఏమానమునుండి కిందికి దిగి తీపునకు మిక్కిలి భక్తితో దండప్రణామము చేసెను. ఆ తరువాత వెంటనే విమానము నెక్కి యుద్ధ సన్నాహము చేయమొదలిడెను,

శివదానవుల యుద్దము ఒక సంవత్సరము గడిచినను వారిలో ఎవరు కూడ గెలవలేదు, ఓడలేదు. అందువలన పరమశివుడు తన శస్త్రములను వదలి కూర్చుండెను. ఆట్లే శంఖచూడుడు తన ఆయుధములను పక్కకు పెట్టి రథము పై కూర్చుండెను. శంకరుడు తనతోటి జరిగిన యుద్ధములో చనిపోయిన వారినందరిని తిరిగి బ్రతికించెను.

ఈ సమయమున మహామాయావియగు శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషముతో ఆ రణరంగమునకు వచ్చెను.

వృద్ధ బ్రాహ్మణ ఉవాచ-  వృద్ధ బ్రాహ్మణుడిట్లు పలికెను-

దేహి భిక్షాం చ రాజేంద్ర మహ్యం విప్రాయ సాంప్రతం ।

త్వం సర్వసంపదాం దాతా యన్మే మనసీ వాంఛితం ॥

నిరాహారాయ వృద్ధాయ తృషితాయాతురాయచ ।

పశ్చాత్త్వాం కథయిష్యామి పురః సత్యం చ కుర్వీతి ॥

ఓమిత్యువాచ రాజేంద్ర ప్రసన్నవద నేక్షణః ।

కవచార్దీ జనశ్చాహమిత్యువాచ సమాయయా ॥

తచ్చృత్యా దానవశ్రేష్ఠో దధోకవచముత్తమం ।

గృహీత్వా కవచం దివ్యం జగామ హరిరేవచ ॥

శంఖచూడస్య రూపేణ జగామ తులసీం ప్రతి ।

గత్వా తస్యాం మాయయా చ ఏర్యాదానం చకారహ ॥

అథ శంభుర్హరేః శూలం దానవార్థం సమగ్రహీత్ ।

గ్రీష్మ మధ్యాహ్న మార్తండ శతక ప్రభముజ్వలం ॥

నారాయణాధిష్ఠితాగ్రం బ్రహ్మాధిష్ఠిత మధ్యమం ।

శ్రీవాధిష్ఠిత మూలం చ కాలాధిష్ఠిత ధారకం ॥

కిరణావళీ సంయుక్తం ప్రళయాగ్ని శిఖోపమం ।

 దుర్నీ వార్యంచ దుర్ధర్షం అవ్యర్థం వైరి ఘాతకం ॥

తేజసా చక్రతుల్యంచ సర్వశస్త్ర విఘాతకం ।

శివకేశవయోరన్యద్దుర్వహం చ భయంకరం ॥

ధనుస్సహస్రం ధైర్ఘ్యేణ విస్తృత్యా శతహస్తకం ।

సజీవం బ్రహ్మరూపం చ నిత్యరూపమనిర్మితం॥

 సంహర్తుం సర్వవిధ్యండం ఏకదా దైవలీలయా ।

చిక్షేప ఘూర్ణనం కృత్వా శంఖచూడే చ నారద ॥

రాజచాపం పరిత్యజ్య శ్రీకృష్ణుచరణాంబుజం ।

ధ్యానం చకార భక్త్యా చ కృత్వా యోగాసనం ధీయా ॥

శూలం చ భ్రమణం కృత్వా న్యపతద్దానవోపరి ।

చకార భస్మసాత్తంచ సరథంచైవ లీలయా॥

రాజా ధృత్వా దీవ్యరూపం బాలకం గోషవేషకం ।

ద్విభుజం మురళీహస్తం రత్నభూషణ భూషితం ॥

నానా రత్నసుభూషాడ్య గోప కోటిభిరావృతం ।

గోలోకాదాగతం యానం ఆరుహ్య తత్పురం యయౌ ॥

రాజేంద్ర! విప్రుడనైన నాకు భిక్షపెట్టుము. నీవు సమస్త సంపదలను దానము చేయువాడవు. నిరాహారుడైన వానికి, వృద్ధునకు, దప్పిగొన్న వానికి, ఆతురునకు దానము తప్పక చేయదగినది. నామనసులోమన్న కోరికను నీవు ఒప్పుకొనిన తరువాత వివరించి చెప్పెదను అని వృద్ధ బ్రాహ్మణుడు ఆడుగగా శంఖచూడుడు ప్రసన్నభావముతో సరేనని ఒప్పుకొనెను. ఆప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు నేను నీడలో నున్న కవచమును కోరి వచ్చితిననగా ఆ రాక్షసుడు తనమెడలో మన్న కవచమును బ్రాహ్మణునకు తీసియిచ్చెమ.. వృద్ధ బ్రాహ్మణ రూపధారి యగు శ్రీహరి శంఖచూడుని కవచమును తీసికొని తులసి దగ్గరకు శంఖచూడుని వేషములో వెళ్ళి ఆమెను చెరచెను. తులసీదేవి పాతివ్రత్యము భంగము కాగానే శంకరుడు శ్రీహరి యిచ్చిన రూలమును శంఖచూడునిపై ప్రయోగించెను. దాని ఆగ్రభాగమున విష్ణువు, మధ్యభాగమున బ్రహ్మదేవుడు మూలభాగమున పగమ శివుడు శూలమును పట్టుకొను స్థలమున కాలుడు ఆధిష్టించియుండిరి. ఆది నూరుగురు సూర్యుల మధ్యాహ్న ప్రభవలె వెలుగుచుండెను. సమస్త బ్రహ్మాండభాండమునంతయు సంహరింపగల శక్తి గలది. అటువంటి శూలమును శంఖచూడుని పై పరమశివుడు ప్రయోగించెను. ఆ సమయమున శంఖచూడుడు తన విల్లును వదిలి పెట్టి యోగాసనమున కూర్చుండి శ్రీకృష్ణ చరణాంబుజములను స్మరించుకొనుచుండెను. శివుడు ప్రయోగించిన శూలము తగులగవే శంఖచూడునీ శరీరము భస్మమైపోయినది. ఆరని సారధి భస్మమైనాడు. అప్పుడు శంఖచూడుడు దివ్యరూపమును ధరించీ గోపాలకుని వేషముతో రత్న భూషణ భూషితుడై మురళిని చేతబట్టి అనేకాలంకార శోభితులైన గోపాలకులు వెంటరాగా గోలోకమునకు పోయెను.

గత్వా నవామ శిరసా రాధా మాధవయోర్మునే ।

భక్త్యా తచ్చరణాంభోజం రాసే బృందావనే మునే ॥

సుదాసనం చ తౌ దృష్ట్వా ప్రసన్నవదనే క్షణౌ ।

తదా చ చక్రతుః: క్రోడే స్నేహీన పరిసంపులో ॥

ఆథశూలశ్చ వేగన ప్రయయా శూలినః కరం ।

శంకరస్తేన శూలేన దానవస్యాష్ఠి జాలకం ॥

ప్రేమ్ణా చ ప్రేరయామాస లవణోదే చ సాగరే ।

ఆస్భిః శంఖచూడస్య శంఖజాతీ ర్బభూవ హా ॥

నానా ప్రకార రూపాచ శ్రేణి పూరా సురార్చనే ।

ప్రశస్తం శంఖతోయంచ దేవానాం ప్రీతిదం పరం ॥

తీర్థతోయ స్వరూపం చ పవిత్రం శంకరం వివా ।

 శంఖశబ్ధో భవేద్యత్ర తత్రలక్ష్మీశ్చ సుస్థిరా ॥

సప్నాతః సర్వతీర్ధేషు య: పాత శంఖవారిణా ।

శంఖం హరేరధిష్టానం యత్ర శంఖస్తతో హరిః ॥

తత్రైవ సతతం లక్ష్మీః దూరిభూతమమంగళం ।

స్త్రీణాంచ శంఖద్వనీభిః శూద్రాణాం చ విశేషతః ॥

 భీతా రుష్టాయాతి లక్ష్మీ స్థలమన్యం స్థలాత్తతః ॥

శివశ్చ దానవం హల్వా శివలోకం జగామ సః ।

 ప్రహృష్ణో వృషమారుహ్య స్వగభైశ్చ సమావృతః ॥

సరా స్వవిషయం ప్రాపుః పరమానందసంయుతా: ।

నేదురుందుభయః సరే జుగుః గంధర్వకిన్నరాః ॥

 బభూవ పుష్పవృష్టిశ్చ శివస్యోపరి సంతతం ।

 ప్రశంసుః సురాస్తంచ మువీంద్ర ప్రవరాదయః ॥

శంఖచూడుడు దివ్యశరీరమును ధరించి గోలోకమునకు పోయి అచ్చటనున్న రాధామాధవుల పాదపద్మములకు నమస్కరించెను. వారు తిరిగి తమ లోకమునకు వచ్చిన సుదాముని అత్యంత ఎత్యల్యములో చూచిరి.

భూలోకమున శంఖచూడుని సంహరించిన శ్రీహరి రూలము తిరిగి పరమేశ్వరుని చేరినది. శంకరు డా శూలములో దానవుని ఆస్థికలను లవణ సముద్రమున కలిపెను. శంఖచూడుని అస్థికలనుండి అనేకవిధములైన శంఖజాతులు పుట్టినవి. ఆ topములు దేవతార్చనలో ప్రశస్తమైనవి, శంఖతోయము దేవలకు చాలా ఇష్టమైనది. శంఖ శబ్దము వినబడుచోట లక్ష్మీదేవి యుండును. శఖతీర్థమున స్నానము చేసినచో సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలము కల్గును.

శిపుడు శంఖచూడుని చంపి కైలాసము చేరెను. దేవతలకు తమ రాజ్యము తిరిగి లభించుటచే చాలా సంతోపడిరి. వారు శివునిపై పుష్పవర్షమును కురిపించిరి. వారు శివుని అనేకరీతుల కొనియాడిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండి నారదనారాయణ సంవాదే తులస్యుపాఖ్యానే శంఖ చూడవధే శoఖప్రస్తావోనామ వింశోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున వారద నారాయణ సంవాదములోని తులస్యుపాఖ్యానమునందలి శంఖచూడవధలో శంఖ ప్రస్తావనను ఇరువదవ అధ్యాయము సమాప్తము.