64 –  దుర్గాపూజ, ఆ దేవి బలికి ఉపయోగించు పశువులు

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను

రాజా యేన ప్రకారేణ భజే తాం ప్రకృతిం పరాం ।

 తత్ శ్రూయతాం మహాభాగ వేదోక్తం క్రమమేవ చ ॥

స్నాత్వాచమ్య మహారాజ కృతా న్యాసత్రయం తదా ।

స్వకరాంగాంగ మంత్రాణాం భూతశుద్ధిం చకార సః ॥

ప్రాణాయామం తతః కృత్వా కృత్వా చ శంఖ శోధనం ।

ధ్యాత్వా దేవీం చ మృణ్మయ్యాం చకారావాహనం తదా ॥

పునర్థ్యాత్వా చ భక్త్యా చ పూజాయామాస భక్తితః ।

దేవ్యాశ్చాపి దక్షిణే భాగే సంస్ధాప్య కమలాలయాం ॥

సంపూజ్య భక్తిభావేన భక్త్యా పరమధార్మికః ।

 దేవషట్కం సమావాహ్య దేవ్యాశ్చ పురతోఘటే ॥

 భక్యా చ పూజయామాస విధిపూర్వం చ నారద ।

 గణేశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివం ॥

 దేవషట్కం చే సంపూజ్య నమస్కృత్య విచక్షణః ।

తదా ధ్యాయేన్మహాదేవీం ధ్యానేనానేన భక్తితః ॥

ధ్యానం చ సామవేదోక్తం పరంకల్పతరుం మునే ।

ధ్యాయేన్నిత్యం మహాదేవీం మూలప్రకృతిమీశ్వరీం ॥

బ్రహ్మవిష్ణు శీవాదీనాం పూజ్యాం వంద్యాం సనాతనీం ।

 నారాయణీం విష్ణుమాయాం వైష్ణవీం విష్ణుభక్తిదాం॥

సర్వస్వరూపాం సర్వేషాం సర్వాధారాం పరాత్పరాం ।

సర్వవిద్యా సర్వమంత్ర సర్వశక్తి స్వరూపిణీం ॥

 సగుణాం నిర్గుణాం సత్యాం వరాం స్వేచ్ఛామయీం సతీం।

 మహావిష్ణోశ్చ జననీం కృష్ణస్యార్ధాంగ సంభవాం ॥

కృష్ణప్రియాం కృష్ణశక్తిం కృష్ణబుద్ధ్యధిదేవతాం ।

కృష్ణస్తుతాం కృష్ణపూజ్యం కృష్ణవంద్యాం కృపామయీం॥

తప్తకాంచన వర్ణాభాం కోటి సూర్యసమప్రభాం ।

 ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహ కారికం ॥

దుర్గాం శతభుజాం దేవీం మహద్దుర్గతి నాశినీం ।

త్రిలోచనప్రియాం సాద్వీం త్రిగుణాం చ త్రిలోచనాం॥

 త్రిలోచన ప్రాణరూపాం శుద్దార్ధ చంద్రశేఖరాo ।

 బిభ్రతీం కబరీభారం మాలతీమాల్యమండితం ॥

వర్తులం వామవక్రం చ శంభోర్మనస మోహినీం ।

 రత్నకుండలయుగ్మేన గండస్థల వీరాజితాం ॥

నాసా దక్షిణభాగేన బిభ్రతీం గజమౌక్తికం ।

అమూల్యరత్నం బహుళం బిభ్రతీం శ్రవణోపరీ ॥

 ముక్తాపంక్తి వీనింద్యైక దంతపంక్తి సుశోభితాం ।

 పక్వబింబాధరోష్ఠీం చ సుప్రసన్నాం సుమంగళాం॥

చిత్రపత్రావళీ రమ్య కపోల యుగళోజ్వలాం ।

రత్నకేయూరవలయ రత్నమంజీర రంజీతాం ॥

 రత్నకంకణ భూషాఢ్యం రత్న పాశక శోభితాం ।

రత్నాంగుళీయనికరై కరాంగుళి చయోజ్వలాం॥

పాదాంగుళినఖాసక్తాలక్తరేఖా సుశోభనాం ।

వహ్నిశుద్ధాంశుకాధానాం గంధచందన చర్చితాం ॥

 బిభ్రతీం స్తనయుగ్మం చ కస్తూరీ బిందుశోభితం ।

సర్వరూపగుణవతీం గజేంద్రమందగామినీం ॥

 ఆతీవ కారతాం శాంతాం చ నితాంతాం యోగసిద్దిషు ।

 విధాతుశ్చ వీధాత్రీం చ సర్వధాత్రీం చ శంకరిం ॥

 శరత్పార్వణ చంద్రస్వామతీవ సుమనోహరాం ।

కస్తూరీ బిందుభిసార్లమధశ్చందన బిందునా ॥

సిందూరబిందుసా శశ్వత్ ఫాలమధ్యస్థలోజ్వలాం।

శరన్మధ్యాహ్న కమల ప్రభామోచన లోచనాం ॥

చారుకజ్జల రేఖాభ్యాం సర్వతశ్చ సముజ్జ్వలాం ।

కోటి కందర్ప లావణ్యలీలా నిందిత విగ్రహాం ॥

 రత్నసింహాసనస్థాం చ సద్రత్న ముకుటోజ్వలాం ।

సృష్టి స్రష్టు శిల్పరూపాం దయాం పాలుశ్చ పాలనే ॥

 సంహార కాలే సంహర్తు పరార సంహార రూపిణీం ।

నిశుంభ శుంభమథినీం మహిషాసుర మర్ధినీం ॥

 పురాత్రిపురయుద్ధే చ సంస్తుతారి త్రిపురారిణా ।

మధుకైటభయోర్యుద్దే విష్ణుశక్తి స్వరూపిణీం ॥

సర్వదైత్య నిహంత్రిం చ రక్తబీజ వినాశినీం ।

నృసింహ శక్తిరూపాం చ హిరణ్య కశిపోర్వధే ॥

వరాహశక్తిం పారాహి హిరణ్యాక్షపదే తథా ।

పరబ్రహ్మస్వరూపాం చ సర్వశక్తిం సదా భజే ॥

రాజగు సురథుడు ప్రకృతిరూపిణియగు ఆ దుర్గాదేవినీ ఎట్లు పూజించెనో ఆ విషయమును నీకు చెప్పెదను.

మహారాజు స్నానము చేసి ఆచమనము చేసి దుర్గాదేవిని పూజింపనారంభించెను. తొలుత నా మహారాజు ఆంగన్యాసము, కరన్యాసము, మంత్రాంగన్యాసమను మూడు స్యాసములు చేసి తరువాత భూతశుద్దీనీ చేసెను. తరువాత మూడుసార్లు ప్రాణాయామమును చేసి శంఖబిలముచే ఆ దేవిని అభిషేకించెను. ఆ తరువాత మట్టితో చేసిన దేవతా ప్రతిమయందు ఆ దేవిని ఆవాహన చేసెను. తరువాత ఆ దేవీని మరల ధ్యానించీ భక్తితో ఆమెను పూజించెను. దుర్గాదేవి పూజచేయునప్పుడు ఆ దేవి కుడివైపు మహాలక్ష్మీదేవి ప్రతిమనుంచెను, ఆ మహాలక్ష్మినీ భక్తితో పూజించి దుర్గాదేవి ముందున్న ఘటమున గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని, (దేవషట్కమును) ఆవాహన చేసి పూజించెను. దేవషట్కమును పూజించి నమస్కరించి తరువాత వేదమునందు చెప్పబడిన ఈ ధ్యానశ్లోకములతో దుర్గాదేవిని అతడు స్తుతించెను.

ఆ మహాదేవి మూలప్రకృతి, ఈశ్వరి, బ్రహ్మవిష్ణుశివాది దేవతలచే ఎల్లప్పుడు నమస్కరింపతగినది. పూజింపదగినది. ఆ దేవి సనాతని, నారాయణ, విష్ణుమాయ విష్ణుభక్తినొసగు దేవత. సర్వస్వరూప, ఆందరకు ఆధారభూత, పరాత్పర, సమస్త విద్యలు, సమస్తమంత్రములు, సమస్త శక్తులయొక్క స్వరూపిణి. ఆమె సగుణ, నిర్గుణ, సత్వస్వరూపిణి, స్వేచ్ఛామయి, సతి, మహావిష్ణువుయొక్క మాత, శ్రీకృష్ణుని ఆర్ధాంగమునుండి జన్మించినది. ఆ దేవత శ్రీకృష్ణునకు ప్రియ, శ్రీకృష్ణశక్తి స్వరూపిణి. శ్రీకృష్ణబుద్ధికి అధిదేవత, శ్రీకృష్ణునిచేత స్తుతింపబడినది. కృష్ణపూజ్య, కృష్ణవంద్య, కృపగలదీ, ఆ దేవి మేలిమి బంగారువంటి వన్నెగలది. కోటి సూర్యులతో సమానమైన కాంతీ గలది. చిరునవ్వులోనున్న ముఖములో భక్తజనులనెల్లప్పుడు అనుగ్రహించును. ఆ దుర్గకు నూరు భుజములు కలవు. భక్తుల కష్టములనన్నిటినీ తొలగించును, శివునకు ప్రియురాలు. సత్వరజస్తమో గుణములు, త్రిలోచనములు కలది. ముక్కంటికి ప్రాణములవంటిది. శిరస్సున ఆర్ధచంద్రునీ ధరించునది. మాలతీ మాలలు కొప్పునగలది. ఆదేవి ముఖము గుండ్రము అందముగా ఉండును. రత్నకుండలములు ఆ దేవి చెవులకు కలవు. ముక్కుయొక్క కుడివైపు పెద్దనైన ముత్యపు పోగును ధరించును. అదేవి చెవిపైన అమూల్యమైన రత్నములున్నవి, ముత్యములను మించిన పలువరుస కలదు. ఆమె పెదవులు పండిన దొండపండువలె ఉండును. చెంపలపై చిత్రవిచిత్రములైన పత్రములున్నవి. చేతులకు రత్నకేయూరములు కాళ్ళకు రత్నమంజీరములు ధరించినదీ, అనేక విధములైన రత్నాభరణములు ఆ దేవి శరీరమున కలవు. పాదములు, చేతులక్క గోళ్ళకు లత్తుకను అలంకరించుకోనీనది. ఆ దేవీ ధరించిన వస్త్రము మిక్కిలి పరిశుద్ధమైనది. ఆమె శరీరమునకంతా గంధమును నద్దుకొన్నది. స్తనములపై కస్తూరి చుక్కలున్నవి. ఆమె సర్వరూపగుణవతి. గజేంద్రమువలె మందగమనము కలది. మిక్కిలి ఆంధమైనది, శాంతురాలు, విధాతనే సృష్టించునది, శరత్కాలచంద్రునిపంట ముఖముగలది, ముఖమున కస్తూరి బిందువులు దానికింద చందనబిందువులు, దానికి కింది సిందూరబిందువులు కలది. ఆ దేవత నయనములు శరత్కాల మధ్యాహ్న సమయమున కనిపించు పద్మములవలె ఉన్నవి; కాటుకరేఖలు ఆమె కండ్లలో కనిపించును. ఆమె కోటిమన్మథుల లోపణ్యముకలది. రత్నసింహాసనముపై నున్న ఆ దేవి మంచి రత్నములున్న కిరీటమును ధరించినది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శిల్పముగా, జగద్రక్షకుడైన మహావిష్ణువు రక్షించునపుడు కృపామయిగా, సంహరకర్తయగు రుద్రుడు సంహారము చేయుచున్నపుడు సంహారరూపిణిగా కనిపించును. ఆమె శుంభనిశుంభులను, మహిషాసురుని సంహరించినది. త్రిపురాసురయుద్ధమున ట్రిపురారియైన శివుడు ఆ దేవిని స్తుతించి విజయము పొందగా, శ్రీమహావిష్ణువు మధుకైటభులతో యుద్ధము చేయుచున్నపుడామ్ విష్ణశక్తిస్వరూపిణియై అతనికి విజయమును కలిగించినది. హిరణ్యకశిపుతో నృసింహస్వామి పోరాడునపుడు నృసింహశక్తిగా, హిరణ్యాక్ష వధ జరుగుచున్నపుడు వరాహస్వామికి వరాహశక్తిగా అవతరించింది. ఆమె రక్తబీజులను, ఇతరరాక్షసులను సంహరించినది. పరబ్రహ్మస్వరూపిణి. ఆ సర్వశక్తిరూపిణియగు ఆ దేవతను ఎల్లప్పుడు నమస్కరింతును అని సురథమహారాజు ఆ దుర్గాదేవిని భక్తిపూర్వకముగా ధ్యానించెను.

ఇది భగవతీయొక్క ధ్యాస విధానము-

ఇతి ధ్యాత్వా స్వశిరసి పుష్పం దత్వా విచక్షణః ।

పునర్థ్యాత్వా చైవ భక్త్వ కుర్యాదావాహనం తతః ॥

ప్రకృతేః ప్రతిషం ధృత్యో మంత్రమేపం పఠేన్నరః ।

జీవన్యాసం తతః కుర్యాస్మనునానేన యత్నతః ॥

ఈవిధముగా దుర్గాదేవిని ధ్యానించి తన శిరస్సుపై ఒక పుష్పమునుంచుకొని మరల ఆ దేవిని ధ్యానించీ ఆవాహన చేయవలెను. ప్రకృతిరూపిణియగు ఆ దుర్గాదేవియొక్క ప్రతిమను చేతిలో ధరించి ఈ మంత్రముచే జీవన్యాసమును చేయవలెను.

 ఏహ్యెహి భగవత్యంబ శివలోకాత్సనాతని ।

గృహాణ మమ పూజాం చ శారదీయాం సురేశ్వరీ ॥

 ఇహాగచ్చ బిగత్పూజ్యే తీష్ఠ తిష్ఠ మహేశ్వరి ।

హే మాతరస్యామర్చాయార సన్నిరుద్దా భవాంబికే ॥

 ఇహాగచ్ఛంతు త్వత్రాణాశ్చాధిప్రాణైః సహాచ్యుతే ।

 ఇహాగచ్ఛంతు త్వరితం తధైవ సర్వశక్తయః ॥

ఓం హ్రీం శ్రీం క్లీం చ దుర్గాయై వహ్నిజాయాంతమేవ చ ।

సముచ్చార్యోరసి ప్రాణాః సంతిష్ఠంతు సదాశివే ॥

సర్వేంద్రియాధిదేవాస్తే ఇహాఽగచ్చంతు చండికే ।

 తే శక్తయోఽత్రాగచ్ఛంతు ఇహాగచ్ఛంతు ఈశ్వరాః ॥

 స ఇహాగచ్చేల్యావాహ్య పరిహారం కరోతి చ ।

మంత్రేణానేన విప్రేంద్ర తత్ శ్రుణుష్వ సమాహితః ॥

సనాతనియగు ఓ తల్లి శివలోకమునుండి ఇచ్చటకు వచ్చి నేను చేయు శరత్కాలపూజను స్వీకరింపుము, జగత్పూజ్యమైన మహేశ్వరి! ఇచ్చటకు వచ్చి ఈ అర్చామూర్తిలో నీవుండుము. ఓ అచ్యుతే! నీ ప్రాణములు అధిప్రాణములతో కలసి ఈ ఆర్చామూర్తియందు ప్రవేశించుగాక! అట్లే సర్వశక్తులు వెంటనే ఈ మూర్తియందు గానీమ్ము,

ఓం హ్రీం శ్రీం క్లీం దుర్గాయై స్వాహా అను మంత్రముచే ఆ దేవి ప్రాణములను ఈ మూర్తియందు ఆవాహన చేయవలెను. అట్లే సర్వేంద్రియాధిదేవతలను, సర్వశక్తులను, “ఇహాగచ్ఛ” అని ఆవాహనము చేయవలెను. తరువాత ఈ మంత్రముచే సంహారమును చేయవలెను.

స్వాగతం భగవత్యంబ శివలోకాచ్చివప్రియే ।

ప్రసాదం కురు మాం భద్రే భద్రకాళి సమోస్తుతే ॥

 ధన్యోహం కృతకృత్యోహం సఫలం జీవనం మమ ।

 ఆగతాసి యతో దుర్గే మహేశ్వరి మదాలయం ॥

అద్యమే సఫలం జన్మ సార్థకం జీవనం మమ ।

పూజయామి యతో దుర్గాం పుణ్యక్షేత్రే చ భారతే ॥

భారతే భవతీం పూజ్యాం దుర్గాం యః పూజయద్బుధః।

 సోఽoతే యాతి చ గోలోకం పరమైశ్వర్యవానిహ ॥

కృత్వా చ వైష్ణవీ పూజాం విష్ణులోకం వ్రజేత్ సుధీః ।

 మాహేశ్వరీం చ సంపూజ్య శివలోకం చ గచ్ఛతి ॥

సాత్వికీ రాజసీ చైవ ప్రాధాపూజా చ తామసీ ।

 భగవత్యాశ్చ వేదోక్తా చోత్తమా మధ్యమాఽధమా ॥

సాత్వీకీ వైష్ణవానాం చ శాక్తాదీనాం చ రాజసీ ।

ఆదీక్షితానామసతామన్యేషాం తామసీ స్మృతా ॥

 జీవహత్యావిహీవా యా వరాపూజాలు వైష్ణవీ ।

వైష్ణవా యాంతి గోలోకం వైష్ణవీ బలిదావతః ॥

మహేశ్వరీ రాజపీ చ బలిదాన సమన్వితా ।

శాక్తాదయో రాజసాశ్చ కైలాసం యాంతి తే తథా ॥

 కిరాతాస్త్రిదివం యాంతీ చామస్యా పూజయా తయా ।

 త్వమేవ జగతాం మాతః చతుర్వర్గ ఫలప్రదా ॥

సర్వశక్తి స్వరూపా చ కృష్ణస్య పరమాత్మనః ।

జన్మమృత్యు జరావ్యాధిహారా త్వం చ పరాత్పరా ॥

 సుఖదా మోక్షదా భద్రా కృష్ణభక్తిప్రదా సదా ।

నారాయణి మహామాయే దుర్గే దుర్గతివాని ॥

 దుర్గేతి స్మృతిమాత్రేణ యాతి దుర్గం నృణామిహ ।

ఇతికృత్వా పరీహారం దేహ్య నామే చ సాధకః ॥

ఓ తల్లి శివలోకమునుండి వచ్చిన నీకు స్వాగతము. ఓ భద్రకాళి! నన్ను ఎల్లప్పుడు అనుగ్రహింపుము, ఓ దుర్గా! నీవు నా ఇంటికి వచ్చినందువలన నేను ధన్యుడనైతిని. నా జన్మ ధన్యమైనది. నిన్ను ఈ పుణ్యక్షేత్రమగు భారత క్షేత్రమున పూజించుచున్నందువలన నా జీవితము ధన్యమైనది. ఈ భారత భూభాగమున నిమ్న పూజించువాడు పరమైశ్వర్యమును, జీవితాంతమున గోలోకమును పొందును.

వైష్ణవియగు ఈ దేవతను పూజించినచో విష్ణులోకము సులభముగా లభించును. అట్లే మాహేశ్వరియగు ఈ దేవిని పూజించినచో శివలోకమగు కైలాసము లభించును. ఆ దుర్గాదేవియొక్క పూజ సాత్వికీ, రోబిసీ, తామసీ అని మూడు విధములు. వీటిలో సాత్వికీ పూజ చాలా శ్రేష్ఠమైనది. రాజసీపూజ మధ్యమమైనది. తామసీపూజ అధమమైనది.

వైష్ణవులు పాత్వికపూజ చేయగా శాక్తులు, శైవులు మొదలగువారు రాజసీ పూజను చేయుదురు. శ్రీకృషమంత్రమును గురుముఖతః పొందనివారు. ఆసత్పురుషులు చేయుపూజ తామసి, జీవహత్య జరుపక చేయు పూజ ప్రసవపూజ. ఇట్టి పూజచేసిన విష్ణుభక్తులు గోలోకమునకు పోవుదురు. జీవహత్య లేక బలితోనున్న పూజను చేసి కైలాసమును పొందుదురు. తామసీపూజ చేసిన కిరాతులు మొదలగు ఆనాగరికులు స్వర్గలోకమునకు వెళ్ళుదురు. నీవు లోకములు కన్నీటికి మాతృదేవతవు, నీ పూజవలన ధర్మార్థ కామ మోక్షములనే చతుర్వర్గములు లభించును. నీపు శ్రీకృష్ణ పరమాత్మయొక్క పర్వశక్తి స్వరూపిణి. పరాత్పరవగు నీవు జన్మ, మృత్యు. జర, వ్యాధి మొదలగు వానిని పోగొట్టెదవు. నీవు నారాయణివి, మహామాయవు, దుర్గతులను తొలగించు దుర్గాదేవివి. నీవు శ్రీకృష్ణపరమాత్మయొక్క శక్తి స్వరూపిణివి.

దుర్గా అను పదమును విన్నంతనే మానవుల కష్టములన్నియు నశించును.

ఈవిధముగా దేవి పరిహారమును చేయు సాధకుడు దేవియొక్క ఎడమవైపున కూర్చుండవలెను అని నారాయణుడు నారదునితో ననెను.

త్రిపద్య ఉపరిష్టాత్తు శంఖం సంస్థాపయత్తు పః ।

తత్ర దత్వా జలం పూర్ణం దూర్వాం పుష్పంచ చందనం॥

ధృత్వా దక్షిణ హస్తేన మంత్రమేవం పఠేన్నరః ।

శంఖమును ముక్కోలిపీటపైన పెట్టి ఆ శంఖమునీండ వీరును పోయవలెను. ఆందు గజకను, పుష్పమును, చందనమును వేసి ఆ శంఖమును కుడిచేతిలోనుంచుకొని ఈ మంత్రమును పఠించవలెను.

పుణ్యస్త్యం శంఖ పుణ్యానాం మంగళవాం చ మంగళం ।

 ప్రభూతః శంఖచూడాత్యం పురా కల్పే పవిత్రకః ॥

 తతోర్ఘ్యపాత్రం సంస్థాప్య వీధినాన పండితః ।

దత్వా సంపూజయద్దేవీముపచారాంశ్చ షోడశ ॥

త్రికోణమండలం కృత్వా సజలేన కుశేన చ ।

కూర్మం శేషం ధరిత్రిం చే పూజయేత్రత్ర ధార్మికః॥

 త్రిపదం స్థాపయేత్తత్ర శ్రీపద్యాం శంఖమేవ చ ।

శంఖే త్రిభాగతోయం చ దత్వా సంపూజయేత్తతః ॥

 గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ।

 నర్మదే సింధు కావేరి చంద్రభాగే చ  కౌశికి ॥

స్వర్ణరేఖీ కపఖలే పారిభద్రే చ గండకి ।

 శ్వేతగంగే చంద్రరేఖే పంపే చంపే చ గోమతి ॥

పద్మావతి త్రివర్ణాశే విసాశే విరజే ప్రభో ।

శతహ్రదే చేలగంగే జలేస్మిన్ సన్నిధింకురు ॥

ఓ శంఖమా నీవు చాలా పవిత్రమైనదానిని. మంగళములకు మంగళమైనది. పూర్వము నీవు శంఖచూడునివలన పుట్టిన దానవు. అందువలననే పరమ పవిత్రమైన దావవగుచువాపు అని అర్ఘ్యపాత్రమున స్త్రీ పద్ధతిలో అచ్చటనుంచి దుర్గాదేవిని షోడశోపచారములలో పూజింపవలెను.

తడిసిన దర్భతో త్రికోణాకృతి గల మండలమును చేసి అచ్చట కూర్మమును, ఆదిశేషుని, భూమిని ఒకదానినొకటి ఉన్నట్లు భావించి పూజింపవలెను, ఆ స్థలమున ముక్కాలిపీటను వేసి దానిపై శంఖమునులచపలెను. ఆ శoఖమున మూడువంతులవరకు వీరుస పోసి ఆ నీటినిట్లు భావింపవలెను.

ఓ గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, పింధు, కావేరి, చంద్రభాగ, కౌశికి, స్వర్ణరేఖ, కనబలమా, పారిభద్రమా, గండకి, శ్వేతగంగా, చంద్రరేఖ, పంప, చంప, గోమతి, పద్మావతి, త్రిపశ, విపాళ, వీరజ, శతప్రద, ఇంకను భూమిపైనున్న గంగలారా మీరందరు నా పూజలమున ఉండుడని నదులనన్నిటిని ప్రార్థింపవలెను.

 వహ్నం సూర్యం చ చంద్రం చ విష్ణుం చే వరుణం శివం ।

పూజయేత్తత్ర లోయేన తులస్యా చందనేన చ ॥

 ప్రత్యేకం వై తతో దద్యాదుపచారాంశ్చ షోడశ ।

 ఆసనం వసనం పాద్యం స్నానీయమనులేపనం ॥

మధుపర్కం గంధమర్ఘ్యం పుష్పం నైవేద్యమీస్సితం ।

పునరాచమనీయం చ తాంబూలం రత్నభూషణం ॥

 ధూపం ప్రదీపం తల్పం చేత్యుపచారాస్తు షోడశ॥

తొలుత అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, శివుడు ఆమవారివీ నీరు, తులసి, చందనములతో పూజింపవలెను, తరువాత ఒక్కొక్క దేవతను ప్రత్యేకముగా షోడశోపచారములతో పూజింపవలెను. ఆవి ఆసనము, వస్త్రము, పాద్యము, స్నానీయము, అనులేపనము, మధుపర్కము, గంధము. ఆర్ఘ్యము, పుష్పము, నైవేద్యము, ఆచమనీయము, తాంబూలము, రత్నభూషణము, ధూపము, ప్రదీపము, తల్పము అనునవి. వీటిలో

ఆసవమంత్రము-

ఆమూల్యరత్న సంక్లుప్తం నానాచిత్ర వీరాజితం ।

 వరం సింహాసనం శష్ఠం గృహ్యతాం శంకర ప్రియే ॥

ఓ శంకరప్రియా! అనేక రత్నరచితము అనేక చిత్రములు కలదీ ఆగు పింహాసనమున నీవు పరిగ్రహింపుము.

వస్త్రమంత్రము-

అనంతసూత్రప్రభవమీశ్వరేచ్ఛా వినిర్మితం ।

జ్వలదగ్ని విశుద్ధం చ వసనం గృహ్యతాం శివే ॥

 ఓ శివుని ప్రియురాలా! అనేకమైన సూత్రములతో, ఈశ్వరుని కోరిక ప్రకారము నిర్మించబడినది పహ్నివలె పరిశుద్ధమైనది అగు వస్త్రమును స్వీకరింపుము.

పాద్యమంత్రము-

అమూల్యరత్నపాత్రస్థం నిర్మలం జాహ్నవీజలం ।

 పాదప్రక్షాళనార్థాయ దుర్గే దేవి ప్రగృహ్యతాం ॥

ఓ దుర్గా! ఆమూల్యమైన. రత్నపాత్రలోనున్న ఈ గంగా జలమును నీ పాదములు కడుగుట కొరకు స్వీకరింపుము.

 అనులేపన మంత్రము-

 కస్తూరీ కుంకుమార్తం చ సుగంధి ద్రుతచందనం ।

 సువాసితం జగన్మాతః గుహ్యత్యామనులేపనం ॥

ఓ జగన్మాతా కస్తూరీ. కుంకుమలు, చందనములతో సువాసితమైన ఈ అనులేపనమును నీవు స్వీకరింపుము.

 మధుపర్కమంత్రము-

మాద్వీకం రత్నపాత్రస్థం సుపవిత్రం సుమంగళం ।

మధుపర్కం మహాదేవి గృహ్యతాం ప్రీతిపూర్వకం॥

ఓ దేవి రత్నపాత్రలో ఉన్న పవిత్రమైన మధుపర్కమును వీపు స్వీకరింపుము.

గంధమంత్రము-

సుగంధమూలచూర్ణం చ సుగంధ ద్రవ్య సంయుతం ।

 సుపవిత్రం మంగళార్హం దేవి గంధం గృహాణ మే॥

ఓ దేవి! సువాసనగల చూర్ణములు, ద్రవ్యములు. కల ఈ గంధము చాలా పవిత్రమైనది. మంగళకరమైనది. దీనిని వీపు దయతో పరిగ్రహింపుము. .

అర్ఘ్యమంత్రము-

పవిత్రం శంఖపాత్రస్థం దూర్వాపుష్పాక్షతాన్వితం ।

స్వర్గమందాకినీతోయమర్ఘ్యం చండి గృహాణ మే ॥

ఓ చండి ఆకాశగంగయొక్క నీటిని శంఖపాత్రలో ఉంచితిని. అందు దర్భ, పుష్పములు, అక్షతలు కలపు, ఇట్లు పవిత్రమైన ఈ అర్ఘ్యమును నీవు గైకొనవమ్మా!

మాల్యమంత్రము-

సుగంధి పుష్పశ్రేష్ఠం చ పారిజాత తరూద్భవం ।

నానాపుష్పాది మాల్యాని గృహ్యతాం జగదంబికే ॥

ఓ జగన్మాతా! పారిజాతపుష్పములు మొదలగు పుష్పములచే చేయబడిన. ఈ పుష్పమాలలను నీవు స్వీకరింపుము.

నైవేద్యముంత్రము-

దివ్యం సిద్దాన్నమాషాన్న పిష్టకం పాయసాన్వితం ।

మిష్టాన్నం లడ్డుక ఫలం నైవేద్యం గృహ్యతాం శివే ॥

సిద్ధాన్నము, పప్పన్నము, పిండివంటలు, పాయసము, లద్దాలు కల ఈ అన్నమును నైవేద్యముగా స్వీకరింపుము.

ఆచమనీయ మంత్రము-

సువాసితం శీతతోయం కర్పూరాది సుసంస్కృతం ।

మయానివేదితం భక్త్యా గృహ్యతాం శైల కన్యకే॥

ఓ శైలకన్యకా! నీవు కర్పూరము మొదలగు సువాసనా ద్రవ్యములు కలిపిన ఈ చల్లని నీరును స్వీకరింపుము.

తాంబూల మంత్రము-

 గువాకపర్ణచూర్ణం చ కర్పూరాది సువాసితం।

సర్వభోగకరం గమ్యం తాంబూలం దేవి గృహ్యతాం॥

ఓ దేవి తమలపపాకులు, సున్నము. కాచుపంటి చూర్ణములు, కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములలో సువాసితమైనదీ అగు తాంబూలమును నీవు స్వీకరింపుము.

భూషణ మంత్రము-

అమూల్య రత్నసారైశ్చ ఖచితం చేశ్వరేచ్ఛత ।

సర్వాంగ శోభనకరం భూషణం దేవి గృహ్యతాం॥

ఓదేవి! మిక్కిలి విలువైన ఉత్నముఖచే నిర్మించబడినవి, సమస్త అవయవములకు అందమును చేకూర్చు ఈ ఆభరణములన దయలో స్వీకరింపుము.

ధూపమంత్రము-

తరు నిర్యాస చూర్ణం చ గంధవస్తు సమన్వితం।

హుతాశన శిభాశుద్ధం ధూపం దేవీ చ గృహ్యాతాం॥

ఓ దేవికి చెట్లనుండి వెలువడిన జిగురు పదార్ధముల చూర్ణమున సుగంధ ద్రవ్యములన్నీ కలిసి వాసనభరితమై పరమశుద్ధమైన ఈ ధూపమున నీవు స్వీకరింపుము.

దీపమంత్రము-

 దివ్యరత్న విశేషంచ సాం ధ్ర్వంత నివారకం।

సుపవిత్రం ప్రదీపం చ గృహ్యతాం పరమేశ్వరీ ॥

ఓ పరమేశ్వరి! నేను నీకిచ్చు దీపము దీవ్యరత్నములచే నిర్మితమైనది. ఇది దట్టమైయున్న చీకట్లను సహితము పారద్రోలును, ఇది పరమపవిత్రమైనది. ఈ దీపమును నీవు తీసికొనుము.

తల్ప మంత్రము-

 రత్నసారపమాకీర్ణం దివ్యం పర్యంకముత్తమం ।

సూక్ష్మ స్త్రెశ్చ సంస్యూతం దేవి తల్పం ప్రగృహ్యతాం॥

ఓ దేవి! ఈ మంచము అమూల్యరత్నములచే నిర్మితమైనది. దీనిపై నున్న తల్పము పన్నని వస్త్రములచే నిర్మితమైనది. ఇట్టి పాన్పుమ పీవు స్వీకరింపుము.

ఏవం సంపూజ్య తాం దేవీం దద్యాత్పుష్పాంజలిం మునే।

తతోష్టనాయకాః దేవీ యత్నతః పరిపూజయేత్ ॥

ఉగ్రచండాం ప్రచండాం చ చండోగ్రాం చండనాయికాం।

 ఆతీ చండాంచ చండాంచ చండాం చండవతీం తథా ॥

పద్మే చాప్టదళే చైతా ఫ్రాగాదీక్రమతస్తథా ।

పంచోపచారైః సంపూజ్య భైరవాన్ మధ్యదేశతః॥

 అదౌ మహాభైరవం చ తథా పంహార భైరవం।

 అసితాంగ భైరవం చే రురుభైరవమేవ చ ॥

కాలభైరవమప్యేవం క్రోధభైరవమేవ చ ।

తామ్రచూడం చంద్రచూడమంతే వై భైరవద్వయం॥

ఏతాన్సంపూజ్య మధ్య వై నవ శక్తీశ్చ పూజయేత్ ।

ఈ విధముగా షోడశోపచారములతో ఆ దుర్గాదేవిని పూజించి పుష్పాంజలిని ఇవ్వవలెను. తరువాత అష్టనాయకులను ఆస్టదేవతాస్త్రీలను పూజించవలెను. ఆ దేవతాస్త్రీల పేర్లు ఇవి. ఉగ్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, ఆతిచండ, చండ, చండ, చండవతి ఆనువారు. వీరిని అష్టదళ పద్మమున తూర్పునుండి కుడిగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది దళములపైనుంచీ పంచోపచారములచే పూజింపవలెను. తరువాత అష్టదేవతా స్త్రీలమధ్య ఆస్టభైరవులనుంచీ వారిని పూజింపవలెను. వారి పేర్లివి. మహాభైరవుడు, సంహార భైరవుడు, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, కాలభైరవుడు, క్రోధ భైరవుడు, తామచూడుడు, చంద్రచూడుడను ఇద్దరు భైరపులు. వీరందరిని పూజించిన తరువాత అష్టదళ పద్మములో తొమ్మండుగురు శక్తిదేవతలనుంచి పూజింపవలెను.

తత్రపద్మే చాష్టదళే మధ్య వై భక్తి పూర్వకం॥

బ్రహ్మాణీం వైష్ణవీం చైవ రౌద్రీం మహేశ్వరీం తథా ।

నారసింహం చ వారాహీమింద్రాం కార్తికీంతథా ॥

సర్వశక్తి స్వరూపాం చ ప్రధానాం సర్వమంగళాం।

నవ శక్తేశ్చ సంపూజ్య ఘటే దేవాంశ్చ పూజయేత్ ॥

శంకరం కార్తికేయం చ సూర్యం సోమం హుతాశనం ।

వాయుం చ వరుణం చైవ దేవ్యాశ్చటీం బటంతథా ॥

చతుష్టష్టియోగినీనాం సంపూజ్య విధిపూర్వకం ।

యథాశక్తి బలిం దత్వా కరోతి స్త్రవనం బుధః॥

బ్రహ్మాణి, వైష్ణవి, రౌద్రి, మాహేశ్వరి, నారసింహ, వారాహి, ఇంద్రాణి, కార్తికీ వీరు కాక తొమ్మిదవ శక్తి సర్వశక్తిసంపన్నురాలైన సర్వమంగళ.

శక్తి దేవతలను పూజించిన పిదప కలశమున ఆహ్వానింపబడిన దేవతలను పూజింపవలెను. వారి పేర్లు శంకరుడు, కుమారస్వామి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు . వీరితర్వాత దుర్గాదేవియొక్క చేటిని, వటువును ఆటుపిమ్మట ఆరవై నలుగురు యోగినీ స్త్రీలను విధిప్రకారము పూజించి శక్తికొద్ది బలిని ఇచ్చి ఆ దేవీస్తోత్రమును చేయవలెను.

కవచం చ గ బద్ద్వా పఠిత్వా భక్తిపూర్వకం ।

తతః కృత్వా పరిహారం నమస్కుర్యాద్విచక్షణః ॥

బలిదానవిధానం చట్రాయం మునిసత్తమ ।

 మాయాతిం మహిషం ఛాగం దద్యాన్మేషాదీకం శుభం॥

సహస్రవర్షం సుప్రీ దుర్గా మాయాతి దానతః।

మహేషాచ్ఛతవర్షం చ దశవర్షం చ ఛాగలాత్॥

వర్షం మేషేణ కూష్మాండై పక్షిభిర్హరిణైస్తథ ।

దశవర్షం కృష్ణసారైః సహస్రాబ్దం చ గండకైః ॥

కృత్రమైః పిష్టకలితైః షణ్మాసం పశుభిస్తథా ।

మాసం సుపక్వదీఫలై రక్షతైరితి నారద॥

దుర్గాదేవి కవచమును కంఠమున కట్టుకొని దానిని భక్తితో చదివి పరిహారమంత్రములను పఠించీ ఆటుపిమ్మట నమస్కరింపవలెను.

నారదమునీ! బలిదానముచేయతగిన వాటిని గూర్చి నీవు తెలిసికొమ్ము,

మాయాతి, దున్నపోతు, గొఱ్ఱె, మేకలు మొదలగు వాటిని బలిగా ఇవ్వవలెను. మాయాతిని బలిచేసినచో ఆ దేవి వేయి సంవత్సరములవరకు సుప్రీతయైయుండును, దున్నపోతును బలిఇచ్చినచో మారుపంవత్సరములు, గోలెను బలి ఇచ్చిన పది సంవత్సరములు, మేకను, గుమ్మడికాయను, పక్షులను, లేళ్ళను బలి ఇచ్చినచో ఆ దేవి సంవత్సరము వరకు సంతోషముగానుండును. ఆట్లే కృష్ణసారమను లేడిని బలిఇచ్చినచో పది సంవత్సరములు, గండకమును బలిఇచ్చినచో వేయి సంవత్సరము లా దేవి సంతోషపడును. కృత్రిమములైన పిండివంటలలో, ఇతర పశువులతో ఆరుమాసములు, పండిన పండ్లు, అక్షతలతో ఒక నెలవరకు ఆ దేవి సంతోషముతోనుండును.

యువకం వ్యాధిహీనం చ సశృంగం లక్షణాన్వితం ।

విశుద్ధమవికారాంగం సువర్ణం పుష్టమేవ చ ॥

శిశునా బలినా దాతుర్హంతి పుత్రం చ చండికా ।

వృద్దేన వై గురుజసం కృశేనాపిష్ట బాంధవాన్ ॥

ధనం చైవాధీకాంగేన హీనాంగేన ప్రజాస్తథా ।

కామినీ శృంగభంగేన కాణేన భ్రాతరం తథా ॥

ఘటికేన భవేన్ముత్యుర్విస్నుం స్యాచ్చిత్ర మసకైః ।

 హంతీమిత్రం తామ్రపృష్టైః భ్రష్టశ్రీ పుచ్ఛహీనతః ॥

వ్యాధి లేనిది. మంచి వయసులో నున్నది, కొమ్ములు కలది, మంచి లక్షణములు కలదీ, వికారమైన అవయవములు లేనిది మంచి రంగుగలది, బాగుగా పోతరించినది ఆగు పశువును ఆ దేవికి బలీగా ఈయవలెను.

అట్లుకాక పిల్లను (తక్కువ వయస్సులోనున్న పశువును) బలిగా ఇచ్చినచో బలినిచ్చినవానీ పుత్రుడు చనిపోవును. అట్లే వయసుమీరిన పశుపునిచ్చినచో తలిదండ్రులు చనీపోపుదురు. ఆధీకాంగములు గల పశువును బలి ఇచ్చినచో ధనమును, కొన్ని అవయవములు లేని పశునిచ్చినచో సంతానమును, కొమ్ములు లేని పశువును బలి ఇచ్చినచో భార్యను, గుడ్డిదైన పశుపునిచ్చినచో పోదరుని ఆ దేవి చంపుము. దూడను బలిచేసినచో తనకే మృత్యువు కలుగును. విచిత్రమైన శిరస్సుగల పశువును బలి ఇచ్చినచో విఘ్నము, రాగిరంగుగల వెంట్రుకల పశువునిచ్చినచో మిత్రుని, తోకలేని పశువును బలి ఇచ్చినచో పరపదవంతయు ఆదేని హరించును.

మాయాతీవాం స్వరూపం శ్రూయతాం మునిసత్తమ ।

 వక్ష్యామ్యథర్వ వేదోక్తం ఫలహానిర్వతిక్రమే॥

పితృమాతృ విహీనం చే యువకం వ్యాధివర్జితం ।

వివాహితం దీక్షితం చ పరదారవిహీనకం ॥

 అజారజం విశుద్ధం చ సచూద్ర సరిజోషితం।

తద్బంధుభ్యో ధనం దత్వా క్రీతం మూల్యాతిరేకతః ॥

పాపయిత్వా చ తం కర్తా పూజయే ద్వప్ర చందనైః।

 మాల్యైర్దూ పై శ్చ సిందూరైర్డధిగోరోచనాదిభిః ॥

తం చ వర్షం భ్రమయిత్వా భృత్యద్వారేణ యత్నతః।

వర్షాంతే చ సముత్సృజ్య దుర్గాయై తం నివేదయేత్॥

అష్టమి నవమీ సంధౌ దద్యాన్మాయాలి మేవ చ ।

ఇత్యేవం కథితం సర్వం బలిదానం ప్రసంగతః ॥

అథర్వవేదమునందు చెప్పబడిన మాయాతి స్వరూపమును నీకు చెప్పెదను.

నారదమునీ! తల్లిదండ్రులు, వ్యాధులు లేని యువకుడు వివాహితుడై, విష్ణుమంత్ర దీక్షను స్వీకరించి, జారత్వ దోషములు లేనివాడు కావలెను. ఆ యువకుడు జారత్వ దోషమువలన పుట్టకూడదు. ఆతనిని పోషించినవారు కూడ సత్పురుషులు కావలెను. ఇట్టి పురుషుని బంధువులకు ధనమునిచ్చి అతనిని కొనవలెను. ధనమునిచ్చికొన్న ఆ పురుషుని ఇంటికి తెచ్చి స్నానముచేయించి అతనికి వస్త్రము, చందవాదులచే అతనినలంకరించి ఒక సంవత్సరము వరకు అతనిని యథేచ్చగా తిప్పుచు అతనివెంట తన భృత్యునీ ఉంచవలెను. ఇట్టి యువకునీ మాయాతి ఆందరు.

ఈ మాయాతిని ఆశ్వయుజమాసమున అష్టమి నవమీ తిథుల మధ్య దుర్గాదేవికి బలినీయవలెను.

నారదా! బలిదానము చేయవలసిన పశువుల వివరముల నన్నిటిని నీకు తెలిపితిని.

బలింస్తుత్వా చ దత్వా చ ధృత్వా చ కవచం బుధః ।

ప్రణమ్య దండవద్భూమౌ దద్యాద్విపాయ దక్షిణాం॥

బలి వస్తువును స్తుతించి దేవికి బలినిచ్చి ఆ దేవియొక్క కవచమును ధరించి ఆ దేవికి సాష్టాంగదండము సమర్పింప వలెను. ఆ తరువాత బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి పంపించవలెను.

ఇతి శ్రీబ్రహ్మావైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే పూజావిధి బలిపశులక్షణ విశేషో నామ చతుషష్టితమోఽధ్యాయః॥

శ్రీబ్రహ్మ వైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున వారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్లోపాఖ్యానమున దుర్గాదేవిని పూజించుపద్ధతి, ఆ పూజలో సమర్పింపవలసిన బలిపశువుయొక్క లక్షణములుగల అరవై నాలుగవ అధ్యాయము సమాప్తము.