2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
65 – దుర్గాదేవి సురధువకు జ్ఞానోపదేశము చేయుట
నారద ఉవాచ- నారదుడ్లినెను-
ఓ మునిసత్తమా నీవలన అమృతముకంటె ఇంపైన పెక్కువిషయములు తెలిసికొంటిని. ఇప్పుడు ఆ దుర్గాదేవి కవచమును, పూజాకాలమును, పూజా ఫలము మున్నగువాటిని తెలుపుము.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
నారదమునీ! దుర్గాదేవిని ఆర్ధానక్షత్రమున ఉజ్ఞాపకము చేసి మూలానక్షత్రమునాడు ఆ దేవీ అర్చామూర్తిలో ప్రవేశపెట్టవలెను. తరువాత ఉత్తరాషాఢ నక్షత్రము వరకు ఆమెను ఆర్చవసేసి శ్రవణా నక్షత్రమున ఆ దేవివి విపర్తింపవలెను. ఆర్థానక్షత్రమున్న నవమినాడు దుర్గాదేవిని ఉత్థానముచేసి పూజించిన ఆధీక ఫలితము లభించును. మూలా నక్షత్రమున ఆ దేవిని ఆర్చామూర్తీలో ప్రవేశపెట్టినచో నరమేధముచేసిన ఫలము లభించును, శ్రవణానక్షత్రమున ఆ దేవిని విసర్జించినచో ధనమున, పుత్రపౌత్రులను పొందును. అట్లే అతనికి భూమిచుట్టు ఒకసారి ప్రదక్షిణము చేసినచో కలుగు ఫలితము లభించును.
నవమినాడు ఆర్తానక్షత్రము లేనిచో ఆ దేవిని నవమివాడు ఉత్థాపనచేసి పక్షము దినములవరకు ఆమెమ పూజించి దశమినాడు విసర్జన చేసినచో అశ్వమేధఫలితము లభించుమ, సప్తమినాడు పూజ తరువాత బలిని ఇవ్వవలెమ, అష్టమి శిథినాడు ఎట్టి పక్షమునను బలి ఇవ్వకూడదు, ఆట్లు చేసినచో బలి ఇచ్చినవానికి తప్పక విపత్తి జరుగును. అట్లే నవమి తిథినాడు భక్తితో ఆ దేవికి తప్పక బలి నివ్వ వలెను. ఆ దినమున బలిఇచ్చినచో దుర్గాదేవి మిక్కిలి సంతోషించును. ఈ పూజాసయమయమున బలి ఇచ్చినవానీకి పశుహింసవలన కలుగు పాపము సంభవింపదు. ఎందువలన అంటే పదములందు ఏ ప్రాణి ఏ ప్రాణిని చంపునో చంపబడినప్రాణి మరుజన్మలో చంపిన వానిని చంపుచున్నట్లు చెప్పబడినది. అందువలన ఇద్దరు పరప్పరము చంపుకొనుచున్నందువలన హింసాపాపము ఆంటబోదు. అట్లే వేదమువ వీరు వధచేయనట్లు చెప్పబడినది.
సురథుడా దేవిని సంవత్సర పర్యంతము భక్తితో పూజచేసెను. తన మెడలో దుర్గా కవచమును ధరించి ఆమెను స్తుతించెను.
అందువలన ఆ దేవి మహారాజునకు ప్రత్యక్షమయ్యెను. ఆమె గ్రీష్మకాలమందలి సూర్యునివంటి కాంతీకలది. తేజస్వరూప, సగుణ నిర్గుణాత్మిక, తేజో మండలమధ్యముననున్న ఆ దేవిని పురథుడు చూచి భక్తిచే తలను వంచి ఆనేకమార్లు స్తుతించెను.
నారదా! సురథుడు భక్తితో చేసిన సుతికి సంతోషించిన జగన్మాత అతనితో దయతో నిట్లనెను.
ప్రకృతిరువాచ- ప్రకృతి ఈ విధముగా అనినది-
ఓ రాజా నేను నీకు సాక్షాత్కరించినను నీవు రాజ్యవైభవము కావలెనని కోరుచున్నావు. నీవు కోరుకున్నట్లే నీకు రాజ్య వైభవమును ఇత్తును. నీవు నీ శత్రువుల నందర సంహరించి రాజ్యమును ఎదురులేకుండ పరిపాలించి చివరకు సావర్ణిమమపమ ఎనిమిదవ మనువు కాగలవు. నేను నీకు చివరకు జ్ఞానమునిత్తును. దానివలన వీపు శ్రీకృష్ణ భక్తినీ, శ్రీకృష్ణ దాస్యమును పొందెదవు.
నేను సాక్షాత్కరించినపుడు బుద్ధి తక్కువై వైభవమునెవరు కోరునో వాడు మాయా మోహితుడై ఆ పని చేయుచున్నాడు, ఆట్లే ఆతడు ఆమృతమునకు బదులు విషమును పొందుచున్నాడు. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలు స్తంభమువరకు సమస్తము ఆశాశ్వతమైనది. నిత్యుడు, సత్యస్వరూపుడు నిర్గుణుడు పరమాత్మయగు శ్రీకృష్ణుడొక్కడే.
నేను బ్రహ్మ విష్ణు శివాది దేవతలకంటే ముందు పుట్టిన దానను, పరాత్పరు, సగుణను, వీరుణను, ఐనమ ఎల్లప్పుడు స్వేచ్ఛగానుందును. నేను నిత్యురాలను, అనీత్యురాలను, సమస్త రూపములు నావే అన్ని జీవులకు నేను మూలకారణమును. నేనే మూలప్రకృతిని. పుణ్యమైన బృందావనములోని సురమ్యమైన రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మకు రాధాదేవికంటెను ఇష్టమైనదానిని. నేను బుద్దీకి అధిష్టానదేవతను, విష్ణుమాయయగు దుర్గాదేవిని, వైకుంఠమున లక్ష్మీదేవిగా, సరస్వతీ దేవిగానున్నాను. బ్రహ్మలోకమున నేను వేదమాతయగు సావిత్రీ దేవిగానున్నాను. అట్లే నేను గంగా, తులసీ, భూమి మొదలగు ఆకారములతోనున్నాను. నా మాయవలన జనించినవారే నా ఆంశస్వరూపలైన స్త్రీలు.
ఇట్టి నన్ను కృష్ణపరమాత్మ తన లీలతో సృష్టించెను.
శ్రీకృష్ణ పరమాత్మయొక్క లిల చేతనే మహావిరాట్ స్వరూపుడు సృష్టింపబడెను. అతని రోమకూపములందు అనేక విశ్వములున్నవి. ఇవి యన్నియు పరమాత్మయొక్క మాయవలన సృస్టింపబడినవి. ఈ మాయవలననే ఆందరు అనిత్యములైన వస్తువులను నిత్యములని తలంచుచున్నారు.
సప్త సముద్రములు, సప్త ద్వీపములతో నున్న ఈ భూమికి క్రింద పాతాళాది లోకము లేడు పైన స్వర్గాది లోకములేడు. కలవు. ఇట్టి లోకములు అనేకములున్నవి. బ్రహ్మాండమును బ్రహ్మదేవుడు సృష్టించుచున్నాడు. ఇట్టి బ్రహ్మాండములన్నిటిలో బ్రహ్మవిష్ణు శివాది దేవతలు ప్రత్యేకముగా నున్నారు.
అందరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరుడను జ్ఞానము చాలా మిన్నయైనది. వేదములకు, తపస్సులకు, వ్రతములకు, తీర్థములకు, దేవతలకందరకు శ్రీకృష్ణుడే సారభూతుడు. శ్రీకృష్ణభక్తిలేనివాడు జీవన్మృతుడగును. ఆ శ్రీకృష్ణ భక్తులకు తగిలిన వాయువు సోకినచో సమస్త తీర్థములు పవిత్రములగును.
శ్రీకృష్ణ మంత్రమును ఉపాసన చేయు భక్తుడు జీవన్ముక్తుడగును. శ్రీకృష్టమంత్రమును గురుముఖతః పొందగనే నరుడు నారాయణునితో సమానుడగుచున్నాడు. అతనికి జపము.తపము, తీర్థసేవన, పూజమున్నగునవి అవసరములేదు శ్రీకృషమంత్రమును గురుముఖతః పొందిన భక్తుడు అతని తల్లి వంశము వారిని నూరు తరములవారిని, తండ్రి వంశమువారిని వేయి తరముల వారినీ సముద్ధరించును. చివరకాభక్తుడు గోలోకమును చేరుకొనును.
ఓ మహారాజా! నీకు సారభూతమైన జ్ఞానమును చెప్పితిని.
ఓ రాజా! మన్వంతరము చివర లేక నీ కర్మ భోగము పూర్తియైన తరువాత శ్రీకృష్ణభక్తిని కల్పింతును. జీవుడు చేసిన కర్మమ సంపూర్ణముగా అనుభవించనిదే ఎన్ని సంవత్సరములు గడచినను తీరదు. అట్లే నేను ఎవరిని అనుగ్రహింతునో అతనికి నిర్మలము, నిశ్చలమైన శ్రీకృష్ణభక్తిని ఇత్తును. నేను ఎవరిని మోసగింతునో అతనికి ప్రాతః కాలమున పడిన స్వప్నమువంటిది. మీథ్య అను భ్రమను కలిగించు సంపదను ఇత్తును.
వత్స! నీకు ఇట్టి జ్ఞానమును కలిగించితిని. నీవు సుఖముగా నీ ఇంటికి వెళ్ళుమని దుర్గాదేవి అక్కడే ఆంతర్థానము చెందెనని వారాయణుడు నారదునితో చెప్పెను.
సురథుడు ఆ దుర్గాదేవికి నమస్కరించి గృహమునకు పోయి రాజ్యమును తిరిగి సంపాదించేను. నారాయణా! నీకు ఇట్లు దుర్లోపాఖ్యానమును సంపూర్ణముగా వివరించితిని అని నారాయణుడు పలికెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములోని రెండవదైన ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గోపాఖ్యానములోని ప్రకృతి సురథుల సంవాదమున జ్ఞాన కథనమన అరవైయైదవ అధ్యాయము సమాప్తము.
