2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
24 - కర్మప్రాధాన్య నిరూపణ
నారాయణ ఉవాచ- నారాయణుడు నారదునితో నిట్లనెను-
ఆశ్వపతి మహారాజా సావిత్రీదేవిని స్తుతించి ప్రోక్త విధానమున ఆమెను పూజించి వేయి సూర్యుల కాంతిగల దేవిని దర్శించుకొనెను. వేదమాతయగు ఆ సావిత్రిదేవి ప్రసన్నవదనము కలదై తల్లి తన పుత్రుని ప్రేమతో చూచుకొనునట్లు ప్రేమతో చిరునవ్వు కల ముఖములో చూచి ఇట్లు మాట్లాడెను.
సావిత్ర్యువాచ- సావిత్రిదేవి ఇట్లు ఆనినది-
ఓ మహారాజా నీకోరిక నీ భార్యకోరిక నాకు తెలియును. మహాసాధ్వియగు ఏ భార్య కన్య కావలెనని కోరుచున్నది. నీవు మాత్రము పుత్ర సంతానము కావలెనని కోరుకొనుచున్నావు. అందువలన నీకు తొలుత కుమార్తె పుట్టును. అటుపిమ్మట పుత్ర సంతానము కలుగునవి సావిత్రీదేవి వరమువిచ్చి బ్రహ్మలోకమునకు పోయెను. అశ్వపతి కూడ సంతోషముతో ఇల్లు చేరుకొనెను.
కొంతకాలమునకు ఆ మహరాజునకు కూతురు పుట్టెను.
సావిత్రిదేవి అనుగ్రహమువలన లక్ష్మీదేవి' అంశగల కన్యక ఆ మహారాజనకు కలిగెను. ఆ మహారాజు ఆ కన్యకు తన ఇష్టదైవమగు సావిత్రీదేవి పేరునే పెట్టుకొనెను. ఆ సావిత్రీ శుక్లపక్షమునందలి చంద్రకళవలె దీన దీవ ప్రవర్ధమానమగుచు పెరిగాను. రూం మౌవన సంపదగల ఆ సావిత్రి ద్యుమత్సేన మహారాజు పుత్రుడైన సత్యవంతుడు తనకు భర్తగా కావలెనని కోరుకొనెను. అందువలన అమపతి మహారాజు సుగుణ సంపదకల సత్యవంతునకు రత్నాలంకార శోభితయగు తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను. అప్పుడు సత్యవంతుడు సంతోషముగా ఆమెను తీసికొని తన ఇంటికి వెళ్ళాను.
సావిత్రి సత్యవంతుల వివాహము జరిగి సంవత్సరము గడిచినది. ఒకనాడు సత్యవంతుడు తండ్రి యాజ్ఞనమసరించి పండ్లు పమిధలు తెత్తుననీ ఆడవికి పోయెను. సావిత్రి కూడా భర్తవెంట అడవికి వెళ్ళినది. ఆ అడవిలో సత్యవంతుడు చెట్టెక్కి కట్టెలుకొట్టుచుండగా దురదృష్టవశమును చెట్టుపై మండి క్రిందబడి ప్రాణములు వదిలిపెటెను.
యమధర్మరాజు, బొటనవేలంత యున్న సత్యవంతునీ జీవపురుషుని తీసికొని వెళ్ళుచుండగా సావిత్రి యమధర్మరాజు వెంటనే పోసాగినది. సత్పురుషులలో శ్రేష్ఠుడైన యమధర్మరాజు తనవెంట వచ్చుచున్న సావిత్రిని చూచి మధురముగా ఇట్లు మాట్లాడెను.
యమ ఉవాచ- యమధర్మరాజు ఇట్లనెను-
ఓ సావిత్రి! మానవదేహమును ధరించి ఎక్కడకు వచ్చుచున్నావు. నీవు నీ భర్త వెంట రాదలచినచో ఈపార్థివ దేహమును వదలి పెట్టుము ఈ పాంచభౌతిక శరీరమును ధరించి అశాశ్వతుడైన మానవుడు శాశ్వతమైన యమలోకమునకు పోలేడు.
నీభర్త ఈ భారతభూమీలో ఉండదగు కాలము సంపూర్ణమైనందువలన ఆతడు చేసికొన్న కర్మఫలముననుభవించుట కొరకు నా లోకమునకు వచ్చుచున్నాడు.
ఈజీవులన్నియు తాము చేసికొన్న కర్మవలననే పుట్టుచున్నవి. గిట్టుచున్నవి. సుఖము, దుఃఖము, భయము, శోకము ఆసుపవి అన్నియు. కూడ జీవులు చేసికొనుచున్న - కర్మలవలవనే ఏర్పడుచున్నవి.
కర్మవలననే జీవుడు ఇంద్రుడగుచున్నాడు బ్రహ్మపుత్రుడగుచున్నాడు. శ్రీహరికి దాసుడగుచున్నాడు. అనేక జన్మరహితుడగుచున్నాడు. ఈకర్మవలననే సర్వసిద్ధులు, అమరత్వము, ముక్తి, బ్రాహ్మణత్వము లభించుచున్నవి. ఈ కర్మవలననే జీపుడు దేవతగా, మనుపుగా, రాజేంద్రుడుగా మునీంద్రుడుగా, తపస్విగా, క్షత్రియుడుగా, వైశ్యుడుగా, శూద్రుడుగా అంత్యజుడుగా, ప్లేచ్ఛుడుగా పుట్టుచున్నాడు.
ఈకర్మవల్లనే జీవుడు స్థావరముగా, జంగమముగా, గుట్టగా, చెట్టుగా పశువుగా పక్షిగా, క్షుద్రజంతువుగా, క్రిమి కీటకముగా, సర్పముగా, గంధర్వుడుగా రాక్షసుడుగా, కిన్నరుడుగా, యక్షుడుగా, ప్రేతగా, భేతాళుడుగా, భూత, పిశాచ ఢాకినీలుగా, దైత్యుడుగా, దానవుడుగా, అసురుడుగా జన్మించుచున్నాడు.
అట్ల పుణ్యవంతుడగుచున్నాడు. మహాపాపాత్ముడగుచున్నాడు. సుందరుడుగా మహారోగిగా గుడ్డివాడుగా, ఒకే కన్ను కలవాడుగా దుష్టుడుగా ఏర్పడుచున్నాడు. అట్లే కర్మవలననే జీవులు స్వర్గమును నరకమును పొందుచున్నారు. ఇంద్రలోకము, శివలోకము, సత్యలోకము మొదలగు లోకములకు పోవుచున్నారు.
ఆ కర్మవలననే చిరంజీవిగా అల్పాయుష్కుడుగా అగుచున్నారు. ఓసుందరి కర్మఫలితములీ విధముగామండును. అందువలన నీ భర్తకూడ తాము చేసికొన్న కర్మ ననుసరించి మృతిచెందినాడు. కావున నీవు విచారించక వెనుదిరిగి పొమ్ము.
శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణుల సంవాదమున తెలుపబడిన కర్మవిపాకములో కర్మయే అన్నిటికి కారణమను విషయమును తెలుపు
ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.
