2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

63 - దుర్గాదేవి వైశ్యునితో సంభాషించుట

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

వేదములన్నియు తెలిసిన నారాయణ మునీ! రాజు ఏవిధముగా ప్రకృతిరూపిణియైన దుర్గాదేవిని సేవించెనో, సమాధియను వైశ్యుడు కోరికలు లేక ప్రకృతియొక్క ఉపదేశమువలన ఏ విధముగా నిర్గుణుడైన పరమాత్మమ పేవించేవో? ఆ దేవి పూజా విధానమెట్లున్నదో, ధ్యానము, మంత్రము, సోత్రము కవచము ఎట్లున్నవో? తెలుపుము.

అట్లే ప్రకృతి రూపిణియైన దుర్గాదేవి వైశ్యునకు జ్ఞానమునెట్లు ప్రసాదించెనో? ప్రకృతి వారికెట్లు ప్రత్యక్షమయ్యెనో? ఆ దేవి దయవలన జ్ఞానము పొందిన వైశ్యుడు ఎటువంటి స్థానమును పొందెనో? రాజు ఏమయ్యెనో? ఈ విషయములనన్నిటిని వివరింపుడు.

శ్రీ నారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-

మేధోమహర్షివలన సురథుడు, వైశ్యుడు దుర్గాదేవియొక్క కవచమును, స్తోత్రమును. ధ్యాపమును మంత్రమును పొంది, పుష్కరక్షేత్రమున ఆ దేవిమంత్రమును జపించిరి. వారు ప్రతిసంధ్యలలో స్నానము చేయుచు ఆ దేవి మంత్రమును సంవత్సరకాలము, జపించగా మూలప్రకృతియగు దుర్గాదేవి. వారికి సాక్షాత్కరించి, రాబుకు రాజ్యమును, ఆతవికి గల ఇతర కోరికలను, మనుత్వమునిచ్చాను. కోరికలులేని వైశ్యునకు అతిదుర్లభమైన జ్ఞానమునిచ్చినది. ఆ జ్ఞానముమ పూర్వము శ్రీకృష్ణపరమాత్మ శంకరునకొసగియుండెను.

ఆ జ్ఞానమువలన నిరాహారియై భగవతిని ధ్యానించుచు కృశించిపోవుచున్న వైశ్యుడు శ్వాసలేక నిశ్చేష్టుడైయున్నప్పుడా తల్లి ఆతనిని దయతో తన ఒడిలోనికి తీసికొని కొంతసేపు బాధపడి వల్సా చైతన్యమును పొందుమని అనెను.

అప్పుడా వైశ్యుడు తెలివికి వచ్చి ఎదుటనున్న ఆ తల్లిని చూచి సంతోషమును పట్టలేక ఏడ్చెను. అప్పుడు కృపామయి యగు ఆ భగవతీ అతనిలో నిట్లనెను.

శ్రీప్రకృతిరువాచ- వైశ్యుడిట్లు పలికెను-

తల్లీ! నాకు అమరత్వము కాని బ్రహ్మత్వముకాని కావలనేనను కోరికలేదు. అంతకుమించినవి ఏముండునో వాకు తెలియదు. నేను నిన్నే శరణువేడితిని. నీకు ఏది ఇష్టమో దానినే నాకిమ్ము. ఆది శాశ్వతమై అన్నిటికి సారమగువట్లు మాత్రము కావలయును అని వైశ్యుడగు సమాధి ఆమెతో అనెను.

ప్రకృతీరువాచ- ప్రకృతి ఇట్లనినది-

ఓ సమాధీ! నేను ఇవ్వలేనిదని ఏమి లేదు, ఐనను నీవు కోరుకొన్నట్లే నేను ఇష్టపడు వరమునే నీకిచ్చెదను. దానివలన సిప్పు అమరులకు కూడ సుదుర్లభమైన గోలోకమునకు పోయెదవు. నేను నీకు ఇచ్చు జ్ఞానము సర్వసారమైనది. దేవఋషులకు సహితము మిక్కిలి దుర్లభమైనది. ఈజ్ఞానము వలన నీవు శ్రీహరి నివసించు లోకమునకు పోగలవు.

 శ్రీహరిని స్మరించుట, నమస్కరించుట, ధ్యానము చేయుట అతనిని అర్చించుట ఆ దేవదేవుని అనంతకల్యాణ గుణగణములను కీర్తించుట, ఆతని గుణగణములను వినుట, ఆ పరమాత్మను మనస్సులో భావనచేయుట, ఆతని సేవచేయుట, ఆ పరమాత్మపై తన భారమునంతయు వేడుట (శరణువేడుట) అనునవి ఆ పరమాత్మ భక్తియొక్క తొమ్మిది భేదములు. ఈ భక్తివలన జన్మ, మృత్యు, జర, వ్యాధి, నరక బాధలు తప్పును.. ఆసత్పురుషులు, పాపులైన శ్రీహరిభక్తి రహితులకు ఆయస్సు వ్యర్థముగా గడచిపోవును.

శ్రీహరిభక్తులెల్లప్పుడు ఆ శ్రీహరిని మనస్సులో ధ్యానించుచుందురు. వారందరు చిరంజీవులు, జీవన్ముక్తులు పాపరహితులు.

శివుడు, శేషుడు, ధర్ముడు, బ్రహ్మ, విష్ణువు మహావిరాట్ స్వరూపుడు, సనత్కుమారుడు, కపిలుడు, సనకుడు, సనందనుడు, వోడు, పంచశిఖుడు, దక్షుడు, నారదుడు. సనాతనుడు, భృగువు, మరీచి, దుర్వాసుడు కశ్యపుడు పులహుడుంగిరుడు మేధావి, లోమశుడు, శుక్రుడు, వసిష్ఠుడు, క్రతువు, బృహస్పతి, కర్దముడు, శక్తి, అత్రి, పరాశరుడు, మార్కండేయుడు, బలి, ప్రహ్లాదుడు, గణపతి, యముడు, సూర్యుడు, వరుణుడు, వాయువు, చంద్రుడు, అగ్ని, ఆకూపారుడు, ఉలూకుడు, నాడీజంఘుడు, నరనారాయణులు, కూర్ముడు, ఇంద్రద్యుమ్నుడు, విభీషణుడు వీరందరు ధార్మికులు, శ్రీకృష్ణభక్తులలో శ్రేష్టులు, వీరందరూ శ్రీకృష్ణ పరమాత్మను నవవిధభక్తులలో ఏదోవిధభక్తితో సేవించుచున్నవారే.

శ్రీకృష్ణపరమాత్మ అంశకల అతని భక్తులందరు జీవన్ముక్తులు, పృథివీ, తీర్థక్షేత్రములందు పాపులవల్ల ఏర్పడు పాపమునపహరింతురు.

సప్తద్వీపములు గల భూఖండమునకు పై భాగమున ఏడు స్వర్గలోకములు, అధోభాగమున ఏడు పాతాళ లోకములు కలవు. ఈ చతుర్ధశ లోకములను బ్రహ్మాండమని అందురు.

ఈ ప్రపంచమున ఇట్టి బ్రహ్మాండము లెన్నియో కలవు. ప్రతి బ్రహ్మాండమున బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలు దేవఋషులు, మనుషులు, మానవులు వారీలోనున్న ఆశ్రమములన్నీ ఉన్నవి. వీరందరు విష్ణుమాయకు బద్దులైయుందురు.

ఈ బ్రహ్మాండములన్నియు శ్రీమహావిష్ణువు యొక్క రోమకూపములందున్నవి. ఆ మహావిష్ణువు శ్రీకృష్ణపరమాత్మయొక్క పదునారవ ఆంశ.

అందువలన ఓ వైశ్యుడా! నీవు సత్యస్వరూపుడు, పరబ్రహ్మరూపుడు, నిత్యుడు, నిర్గుణుడు, అచ్యుతుడు, ప్రకృతికంటే పరుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణుని సేవింపుము. ఆ పరమాత్మ నిరీహుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిష్కాముడు, నిర్విరోధుడు, నిత్యానందుడు, సనాతనుడు, స్వేచ్చామయుడు, సర్వరూపి, భక్తులననుగ్రహించుటకై శరీరమును స్వీకరించినవాడు. తేజ స్వరూపుడు, సమస్త సంపదలను కలిగించువాడు, ధ్యానముచేత మాత్రము సులభసాధ్యుడు, శివుడు మొదలగు మహాయోగులు సైతము ఆరాధించుటకు అసాధ్యుడు, సర్వేశ్వరుడు, సర్వపూజ్యాడు. అందరకు ఆన్నీ కోరికలు తీర్చువాడు, సర్వాధారుడు, సర్వజ్ఞుడు, అందరకు ఆనందమును కలిగించువాడు, సర్వధర్మములనొసగువాడు, సర్వప్రాణరూపి, సర్వధర్మ స్వరూపుడు, సమస్త కారణములకు కారణభూతుడు, సుఖమును, మోక్షమును ఒసగువాడు, పరరూపుడు, భక్తిదాత, దాస్యభక్తినిచ్చువాడు, సజ్జనులకు సమస్త సిద్ధులను కలిగించువాడు. ఆ పరమాత్మ భిన్నమైన దంతయు ఆశాశ్వతమైనది, ఆసహజమైనది. అట్టి శుద్ధస్వరూపుడైన పరమాత్మను సేవించుటకై సుఖముగా పొమ్ము.

శ్రీకృష్ణ దాస్యమును కలిగించు కృష్ణ అను రెండక్షరముల మంత్రమును తీసికొని పుష్కర క్షేత్రమునకు పోయి ఆ మంత్రమును పదిలక్షలమార్లు జపింపుము. నీవు ఆ మంత్రమును పది లక్షలసార్లు జపింపగానే సిద్ధిపొందుదువు అని చెప్పి భగవతియగు దుర్గామాత ఆంతర్ధానము చెందెను.

వైశ్యు డాదేవిని భక్తితో నమస్కరించి ఆమె చెప్పినట్లు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి దుష్కరమైన తపస్సుచేసి శ్రీకృష్ణపరమాత్మను పొందెను. ఈవిధముగా సమాధియను ఆ వైశ్యుడు దుర్గాదేవియొక్క అనుగ్రహమువలన శ్రీకృష్ణదాసుడయ్యెను. అని నారాయణుడు నారదమహర్షితో అనెను.

 శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమందలి నారదనారాయణ సంవాదమున చెప్పబడిన దురోపాఖ్యానములోని సురథసమాధి, మేధోమునుల మధ్య జరిగిన సంవాదమున ప్రకృతి వైశ్యుల సంవాదమును చెప్పు అరవై మూడవ అధ్యాయము సమాప్తము.