2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
23 - సావిత్రి ఉపాఖ్యాన ప్రారంభము
నారద ఉవాచ- నారదుడిట్లు నారాయణునితో పల్కెను-
ఓ నారాయణుడా! అందమైన తులస్యుపాఖ్యానమును ఇంతవరకు వింటిని. ఇక నీవు సావిత్ర్యుపాఖ్యానమును వివరించీ చెప్పుము. వేదములకు తల్లియగు ఆ సావిత్రి ఎవరివలన జన్మించినది. ఆమెను తొలుత ఎవరు పూజించిరి! ఆ తరువాత ఎవరు పూజించిరో నాకు విశదీకరింపుడు.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు చెప్పెను-
వేదములకు మాతయైన సావిత్రీదేవిని తొలుత బ్రహ్మదేవుడు పూజించెను. తరువాత దేవతలు, ఆ తరువాత విద్వాంసులు పూజించిరి. భారత దేశమున తొలుత అశ్వపతి యనురాజు ఆమెను పూజించగా తర్వాత జనులందరు ఆమెను పూజింపసాగిరి.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
ఓ నారాయణుడా! అశ్వపతి ఎవరు? అతడెందుకు సావిత్రీదేవిని పూజించెను. ఆమె అందరిచే పూజులనెట్లందుకొన్నది ఈవిషయములనన్నిటినీ నాకు వివరించి చెప్పుడు అని పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-
ఓనారద! మద్రదేశమున అశకతీయను రాజుండేవాడు. అతడు మహా బలవంతుడు. శత్రు సైన్యమును నాశనము చేసెడివాడు. మిత్రులకు సంతోషము కలుగజేసెడివాడు. అతని ధర్మచారిణి పేరు మాలతి. ఆమె వసిష్ఠ మహర్షి ఉపదేశముననుసరించి సావిత్రీ దేవి నారాధించెను.
కాని మాలతీదేవికి సావిత్రీదేవత సాక్షాత్కారముగాని, ఆమె అనుగ్రహము కాని లభించలేదు. అందువలన అపట్టపురాణి బాధాపంతప్తహృదయముతో ఇంటికి తిరిగి వెళ్ళెను.
అశ్వపతి తన భార్య పడుచున్న దుఃఖమును చూచి ఆమెను ఓదార్చి తాను సావిత్రీదేవి తపస్సును చేయుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళాను. అచ్చట ఆ మహారాజు యమనియమములతో వంద సంవత్సరములు తపస్సు చేయగా సావిత్రి దేవి . ప్రత్యక్షము కాకపోయినను ఆమె అనుగ్రహమును మాత్రము పొందెను. వదిలక్షల గాయత్రీ మంత్ర జపమును అనుష్ఠించమని ఆకాశవాణి అతనితో పలికినది.
ఆ సమయమున పరాశరముని అచ్చటికి రాగా అశ్వపతి మహారాజు ఆ మునికి నమస్కరించగా అతడు ఆరాజుతో నిట్లనెను.
పరశర ఉవాచ- పరాశరమహర్షి ఇట్లనెను-
గాయత్రీ జపమును ఒక మారు చేసినచో ఆ దీనము (పగలు) చేసిన పాపము నశించును. పదిమార్లు జపించినచో ఆ దీనము (రాత్రింబగళ్లు చేసిన పాపము తొలగిపోవును. వంద మార్లు గాయత్రీ జపము చేసిన ఆ నేలలో చేసికొన్న పాపము నశించిపోవును. వేయిమార్లు జపము చేసినచో ఆ సంవత్సరములో చేసికొన్న పాపమంతయు నశించును. లక్షసార్లు జపము చేసిన ఆ జన్మలో చేసిన పాపము హరించును. పదిలక్షల జపము మూడు లక్మలలో చేసికొన్న పాపములను తొలగించును. నూరు లక్షల గాయత్రి జపము చేసికోన్నవానికి అతడు ఆన్ని జన్మలలో చేసికొన్న పాపములన్ని నశించును.
విప్రుడు గాయత్రీ జపమును చేసినచో ద్విజాతులగు క్షత్రియ వైశ్యులకంటే పదిరెట్లు ఎక్కువ ఫలితమును పొందును. చేతిని పాము పడగవలె చేసి, ఊర్దముద్రను వేసి, తూర్పు దిక్కు ముఖము చేసి, తలవంచుకొని స్థిరముగా నుండి జపము చేయవలెను. జపము చేయునపుడు కుడిచేతి ఉంగరపు వేలు మధ్య కణుపుమండి క్రిందికి వెళ్ళి ఎడమవైపు తిరిగి పైకి వెళ్ళి చుట్టు తిరుగుచు చూపుడువేలు క్రింది కణుపు వరకు రావలెను. ఇది జపము చేయువిధానము. లేనిచో తెల్లకలువబీజముల యొక్క మాలతోనైనా స్పటికమాలతోనైన నదీతీరమున లేక దేవాలయమున జపము చేయవలెను. ఆ జపమాలను రావి ఆకులపై నుంచి గోరోచనముతో ఆర్ధి గాయత్రీ మంత్రముచే ఆమాలను ఆభిషేకింపవలెను. తరువాత విధి విధానముగా శతగాయత్రీ మంత్ర జపమును చేయవలెను. జపమాలను పంచగవ్యముతోనైనా గంగోదకముతోనైనా ఆభిషేకింపవలెను,
ఇట్టి జపమాలతో నీవు దశలక్షగాయత్రి జపమును చేసినచో మూడు జన్మల పాపములన్ని వశీంచగా పావిత్రి దేవి దర్శనము నీకు లభించును. ప్రతిదినము మధ్యాహ్నము, సాయంకాలము, ఉదయము అను మూడు సంధ్యలయందు శుచియై గాయత్రీ జపమును చేయుము.
ప్రతిదినము సంధ్య చేయనివాడు అపవిత్రుడగును. అన్ని పుణ్యకర్మములు చేయుటకు అనర్హుడగును. ఆ దినము చేసిన పుణ్యఫలమును పొందలేడు. ప్రాతస్సంధ్యను సాయం సంధ్యను చేయనిచో అతడు బ్రాహ్మణులు చేయు సమస్త కర్మలనుండి
బహిష్కరించ తగినవాడగును. తన జీవిత కాలము త్రిసంధ్యలలో గాయత్రీ జపము చేయువాడు తేజస్సున, తపస్పున సూర్యునితో సమానుడగును.
మూడు సంధ్యలలో సంధ్యావందనమాచరించిన ద్విజుని పాదధూళిచే ఈభూమి పవిత్రమగుచున్నది. సంధ్యావందనమువలన పవిత్రు డగు నా ద్విజుడు తేజస్వి, జీవన్ముక్తుడు కూడ అగుచున్నాడు. అతని స్పర్శ తగులగనే పాపములన్నియు పటాపంచలగును.
త్రిసంధ్యలలో సంధ్యావందనము చేయని ద్విజాలు చేసిన పూజను దేవతలు పరిగ్రహించరు, అట్లే అతడు చేసిన పిండతర్పణములను పితృదేవతలు స్వీకరింపరు. విష్ణుమంత్రరహితుడు, సంధ్యావందనమాచరింపనివాడు, ఏకాదశీవ్రతము చేయనివాడు, శ్రీహరికి నివేదింపబడని ఆహారమును తీసుకొనువాడు, శూద్రులయొక్క ఇండ్లలో అన్నము తినువాడు, శాస్త్రములపై బ్రతుకు బ్రాహ్మణుడు (యుద్ధములు చేయువాడు), లెక్కలు వ్రాసి బ్రతుకు బ్రాహ్మణుడు, ఋతుపాతయైన స్త్రీ చేసిన వంటను తిన బ్రాహ్మణుడు, తవ కన్యలను అమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరి నామము అమ్ముకొని బ్రతుకువాడు, తన విద్యనమ్ముకొనువాడు, సూర్యోదయముననే భోజనము చేయువాడు, చేపలు తినువాడు, సాల గ్రామపూజారహితుడైన బ్రాహ్మణుడు విషములేని సర్పమువలె తేజోహీనులగుచున్నాడు.
ఈవిధముగా పరాశరముని ఆశపతి మహారాజునకు సావిత్రి దేవియొక్క ధ్యానాదికమునంతయు తెలిపి తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. అశ్వపతి పరాశరమహాముని చెప్పినట్లు సావిత్రి దేవిని పూజింపగా ఆ దేవి ప్రత్యక్షమై మహారాజునకు వరమిచ్చెను.
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు నారాయణునితో ననెను-
సావిత్రి దేవత యొక్క ధ్యానము, పూజావిధానము, స్తోత్రము మంత్రము ఏవిధముగామన్నవి? ఆశ్వపతి మహారాజు వేదమాతయగు సావిత్రిని ఏ పద్ధతిలో పూజించి ఆమెచే పరమును పొందెనో వాటినన్నిటిని నాకు విపులముగా తెలుపుడని ఆనెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను
జ్యేష్ఠ మాసమున బహుళ త్రయోదశినాడు మంచి ముహూర్తమున ప్రతదీక్షను పూని చతుర్దశినాడు ఈవ్రతమును ప్రారంభింపవలెను. ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములాచరింపవలెను. ఈ వ్రతమున పదునాలుగు పండ్లు పదునాలుగు విధములైన నైవేద్యములు, పుష్పము, ధూపము, వస్త్రము, యజ్జోపవీతము భోజ్యము మొదలగువానిని శాస్త్ర పద్ధతిననుసరించి సమర్పింపవలెను.
ప్రారంభమున ఫలములు, శాఖలు గల మంగళకలశమును స్థాపింపపలెను. తరువాత గణపతిని, సూర్యునీ, అగ్నిని, శ్రీమహావిష్ణువును, శివుని, శక్తిని పూజించి మంగళకలమున ఇష్టదేవతను ఆవాహన చేయవలెను.
నారదా! మధ్యందిన సంహితయందు పేర్కొనబడిన స్తోత్రమును పూజావిధాపమును, మంత్రమును నీకు తెలిపెదను.
పరిశుద్ధమైన బంగారు వన్నెగలది, బ్రహ్మతేజస్సుచే ప్రకాశించునది, వేయి గ్రీష్మకాలమధ్యాహ్న సూర్యులవటి వెలిగిపోవుచున్నది, చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము కలది, రత్నాలంకార సుశోభిత, బంగారు కాంతిగల వస్త్రములను ధరించునది, భక్తుల ససుగ్రహింపవలయునని ఉలూతలూగునది, సర్వ సంపదల యొక్క స్వరూపిణి, సర్వసంపదలనొసగునది. వేదములకు అధిష్టాన దేవత, వేద శాస్త్ర స్వరూపిణి, వేదమునందున్న బీజాక్షర స్వరూప, వేదములకు తల్లియైన నిన్ను (పావిత్రీదేవిని) సేవింతును.
పై ధ్యాన శ్లోకములతో సావిత్రీ దేవిని ధ్యానించి పూజాపుష్పమును తన శిరస్సుపై నుంచుకొని మరల దేవిని ధ్యానించి పూజా కలశమందు దేవిని ఆవాహన చేయవలెను. వేదమంత్ర పూర్వకముగా షోడశోపచారములలో దేవిని శాసొక విధానముగా ఆరాధించి స్తుతించి నమస్కరింపవలెను.
ఆసనము, పాద్యము, ఆర్ఘ్యము, సానీయము, అనులేపనము, రూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, చల్లనినీరు, వస్త్రము, భూషణము, పుష్పమాల, గంధము, ఆచమనీయము, శయ్య అనునవి షొడశోపచారములు.
ఆసన మంత్రము -
చక్కని చెక్కతో నిర్మితమైనది లేక బంగారముతో నిర్మితమైనది, దేవతలకు ఆసనయోగ్యమైనది పుణ్యప్రదమైన ఆసనమును నీకు సమర్పించుచున్నాను.
పాద్య మంత్రము -
పుణ్యప్రదమైనది. మిక్కిలి సంతోషమునిచ్చునది. పుణ్యతీర్థములకు చెందిన ఈపాద్యము పూజాంగభూతమైనది. ఇట్టి పాద్యమును నీకు నేను భక్తితో సమర్పించుచున్నాను.
అర్ఘ్య మంత్రము -
గరక, పుష్పములు, అక్షతలతో నున్న ఈ ఆర్ఘ్యజలము పవిత్రమైనది. ఇది పుణ్యప్రదమైన శంఖతీర్థముతో కలిసియున్నది. ఇట్టి ఆర్ఘ్యజలమును నీకు నివేదించుచున్నాను.
స్నానీయ మంత్రము -
దేహ సౌందర్యమును పెంచునది, సువాసన కలదియగు ఉసిరకనూనెను నీకు స్నానీయముగా ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.
అమలేపన మంత్రము -
శరీరకాంతిని పెంచునది. మలయ పర్వతారణ్యమున పుట్టినది, మంచి వాసన కలదియగు అనులేపనమును నీకు ఒనగుచున్నాను.
ధూపమంత్రము -
సుగంధద్రవ్యముల వలన ఉత్పన్నమైనది, చక్కని సువాసనను, సంతోషమును ఒసగు ధూపమును నీకు భక్తితో ఇచ్చుచున్నాను. దీనిని నీవు స్వీకరింపుము.
దీపమంత్రము -
జగములన్నిటికీ దర్శనీయమైనది, ప్రకాశమునకు కారణమైనది చీకటిని పారద్రోలునది అగు దీపమును నీకు సమర్పించుచున్నాను.
నైవేద్య మంత్రము -
తుష్టి పుష్టి ప్రీతిని కలిగించునది. ఆకలిని పొగొట్టునది రుచియైనది అగు నైవేద్యమును సమర్పించుచున్నాను. దానిని నీవు స్వీకరింపుము.
తాంబూలమంత్రము -
ఈ తాంబూలము కడు శ్రేష్టమైనది, రమ్యమైనది. కర్పూరాది సుగంధ ద్రవ్యములచే ఘుమఘుమలాడుచున్నది. ఇది తుష్టిని, పుష్టిని కలిగించును, ఆట్టి తాంబూలమును నీకు నివేదించుచున్నాను.
శీతల జల మంత్రము -
మిక్కిలి చల్లనిదీ, సువాసనగలది, దప్పిని తీర్చునది, లోకములకన్నిటికి ప్రాణరూపమైన నీరును నీవు తీసికొనుము.
వస్త్ర మంత్రం -
శరీరమునకు శోభను కలిగించునది అట్లే సభల యందు గొప్పదనమును కలిగించునది యగు ప్రత్తిలో నేయబడిన వస్త్రము లేక పట్టుపురుగులవల్ల ఉత్పన్నమైన పట్టు వస్త్రమును నీకు సమర్పించుచున్హ్నాను. దీనిని నీవు స్వీకరింపుము.
ఆభరణ మంత్రము -
బంగారు మొదలగు ద్రవ్యములచే నిర్మితమైనది, శోభాయుతము, శోభాకరము, సుఖమును కలిగించు ఆభరణములను ఇచ్చుచున్నాను. వీటిని నీవు పరిగ్రహింపుము.
మాలా మంత్రము-
అనేకమైన పుష్పములు, లతలతో నిండినది, వివిధములైన కాంతులనిచ్చునది, సంతోషమును, పుణ్యమును కలిగించు ఈ మాలను నీవు ప్రతిగ్రహింపుము.
గంధ మంత్రము-
సర్వ మంగళస్వరూపిణి, అన్ని విధములైన మంగళములను కలిగించునది. పుణ్యప్రదము సుగంధయుతమైన గంధమును నీకు సమర్పించుచున్నాను. దీనిని స్వీకరింపుము.
ఆచమన మంత్రము-
పరిశుద్ధమైనదీ, శుద్దిని కలిగించునది, పరిశుద్ధమైన వారికి మిక్కిలి ప్రీతిని కలిగించునది, సంతోషమును కలిగించు ఈ ఆచమనమును నీకు ఇచ్చుచున్నోను. దీనిని నీవు స్వీకరింపుము.
శయ్యామంత్రము-
విలువైన రత్నములచే నిర్మించబడినది, పుష్పములు, చందనద్రవ్యము మొదలగు సుగంధ ద్రవ్యభరీతము, సుఖమును కలిగించు శయ్యను నీవు ప్రతిగ్రహింపుము.
ఫలమంత్రము-
అనేక వృక్షములనుండి పుట్టినవి. అనేక రూపములు కలవి, భగవదనుగ్రహ ఫలితము నిచ్చునవి ఆగు ఫలములను నీవు స్వీకరింపుము.
సిందూర మంత్రము-
ఈ సిందూరము చాలా అందమైనది. నొసలునకు ఒక క్రొత్తనైన శోభను కలిగించును. అలంకరణములలోకెల్లను. అలంకారభూతమైన ఈ తిలకమును నీవు స్వీకరింపుము.
యజ్ఞోపవీత మంత్రము -
పరిశుద్ధమైన దారములు కలదీ, పవిత్రమైన గ్రంథి (ముడి) కలది, వేదమంత్రోచ్చారణ వల్ల పవిత్రమైనది అగు యజ్ఞోపవీతమును నీకు ఇచ్చుచున్నాను. నీవు దీనిని దయతో స్వీకరింపుము.
పైన పేర్కొనబడిన ద్రవ్యములనన్నిటిని మూలమంత్రము చదువుచు సమర్పించిన ఆ పిమ్మట నియమ నిష్ఠలు గల ఒక విప్రునకు కొంత దక్షిణను సమర్పించవలెను.
శ్రీం హ్రీం క్లీం సావిత్ర్యై స్వాహా అనునది –
చతుర్థివిభక్తి గల సావిత్రీ శబ్దము అగ్నిభార్యయగు పదో శబ్దాంతము కాగా, దీనికి ముందు 'లక్ష్మీ బీజమైన శ్రీం మాయాబీజీక్షరమైన హీర, కామ బీజాక్షరమైన క్లీం అనునవి కలిగిన ఆస్టాక్షరీ మంత్రము ఈ సావిత్రీ మంత్రము. దాని స్వరూపము శ్రీం హ్రీం క్లీం , సావిత్ర్యై స్వాహా
సమస్తమైన కోరికలను తీర్చునది బ్రాహ్మణులకు జీవపొధార భూతమైనది, మధ్యందిన సంహితయందు చెప్పబడిన సావిత్రీ స్తోత్రమును నీకు చెప్పుచున్నాను.
పూర్వకాలమున శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు పావిత్రీ నీయగా ఆమె బ్రహ్మలోకమునకు వెళ్ళుట కంగీకరించలేదు. కాని శ్రీకృష్ణుని ఆజ్ఞ నమసరించి బ్రహ్మదేవుడు ఆమెను స్తుతింపగా వెంటనే అతనిని కామించెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను-
ఓ సావిత్రీదేవి! నీవు నారాయణుని స్వరూపము కల దానవు. నారాయణివి. సనాతనీవి. నారాయణుని మండి ఉద్భవించిన దానవు. తేజస్వరూపిణివి, చాలా శ్రేష్ఠురాలివి. పరమానంద రూపిణివి. బ్రాహ్మణజాతికి చిహ్నమవు. నీవు నిల్యురాలవు. ఎల్లప్పుడు అందరికి. ప్రియమైన దానవు. నిత్యానంద స్వరూపము. సమస్త మంగళరూపిణివి. బ్రాహ్మణులకు సర్వస్వమవు. సుఖమును, మోక్షమునిచ్చుదానవు. బ్రాహ్మణులు చేసిన పాపములను సమూలముగా నాశనము చేయగలవు. నీవు బ్రహ్మతేజస్సును కలిగించుదానవు. ద్విజులు మనో వాక్కాయముల ద్వారా చేసిన పాపములన్నియు నీ నామస్మరణ చేసినంత మాత్రముననే భస్మమగును. అట్టి నీవు నాకు ప్రసన్నురాలపుకమ్ము.
ఈవిధముగా బ్రహ్మదేవుడు సావిత్రిని స్తుతించి ఆ సభలోనుండగా సావిత్రీ సంతోషపడి బ్రహ్మదేవునితో కలసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను.
సావిత్రీ దేవి యొక్క ఈస్తోత్రమును పఠించి అశ్వపతి మహారాజు సావిత్రీ దేవిని ప్రత్యక్షము చేసికొనగలిగామ. ఈమాత అశ్వపతి కోరుకున్న కోరికను. (సంతానమును) వరముగా నిచ్చెను.
ఈ సావిత్రీస్తోత్రమును మూడు పూటలయందు భక్తిలో చదివినచో వాళువేదములు పారాయణము చేసిన ఫలితమును పొందుదురు.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున వారద నారాయణుల సంవాద సమయమును.
పేర్కొనబడిన సావిత్ర్యుపాఖ్యానములో సావిత్రీత్ర కథనమను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
