2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

30 - పాపులు పొందు నరక కుండములు

యమ ఉవాచ- యమధర్మరాజు సావిత్రితో ఇట్లనెను-

శ్రీహరి పాదాబ్జములను సంతతము కొల్చువాడు, యోగి, వ్రతములు చేయువాడు, తపస్సు చేయువాడు. బ్రహ్మచారి వీరందరు పరిశుద్దమైన వారు. కావున వారు నరకమునకు ఎన్నడును వెళ్ళరు.

దుష్టుడై బంధువులను కటువైన మాటలతో బాధపెట్టువాడు వహ్నికుండమను. నరకమునకు పోవును. అచ్చట తనకు వెంట్రుకలెన్ని యున్నవో అన్ని సంవత్సరములు బాధపడి మూడు సార్లు పశుజన్మనెత్తును.

ఎండలో తిరిగినందువలన బాధపడుచు దప్పిగొని ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు చల్లని నీరిచ్చి భోజనము పెట్టనిచో ఆతడు తప్తకుండమను నరకమునకు పోవును. అచ్చట తన శరీరముపై ఎస్నీ వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు బాధలు పడుచు. తరువాత ఏడు జన్మల వరకు పక్షిగా జన్మించును.

ఆదివారమున, సూర్యసంక్రమణ దినమున, అమావాస్యనాడు. శ్రాద్ధము పెట్టు దినమున బట్టలను చపుడు వేసి (లేక సబ్బు పెట్టి?) ఉతికినచో ఆతడు తానుతికిన బట్టలలో ఎన్నిదారములున్నవో. ఆన్ని సంవత్సరములు క్షారకుండమనే నరకమున నుండును. తరువాత ఏడు జన్మలవరకు రజకుడై పుట్టును.

తాను దానమిచ్చినది లేక ఇతరులు దానమిచ్చిన బ్రాహ్మణ వృత్తిని ఎవరు హరింతురో వారు అరవై వేల సంవత్సరములు మలకుండమను నరకముననుండి మలమును భుజించుచుందురు. ఆ తరువాత అరవై వేల సంవత్సరముల వరకు మలమును భుజించు క్రిమిగా పుట్టుదురు.

ఇతరులు తవ్వించిన చెరువును తనదిగా ప్రకటించుకొనిన వాడు, చెరువులో మూత్రమును వదలినవాడు. తాను విడిచిన మూత్రమున ఎన్ని తుంపరలున్నవో అన్ని సంవత్సరములు మూత్రకుండమను నరకమునకు పోవును. అచ్చట మూత్రమునే ఆహారముగా స్వీకరించును. తరువాత ఏడు జన్మలవరకు ఉడుముగా పుట్టును.

ఒంటరిగా మృష్టాన్నమును తినినచో నూరు సంవత్సరములు శ్లేష్మకుండమను నరకముననుండి శ్లేష్మమును తినుచుండును. తరువాత నూరు సంవత్సరములు ప్రేతగానుండి శ్లేష్మమును, మూత్రమును, రసిని తినుచుండును.

తల్లి దండ్రులను, గురువును, భార్యను. తన సంతానమును, అనాథలను పోషింపనివాడు గరళకుండమను నరకమునకు వెళ్ళును. అచ్చట వేయి సంవత్సరములుండి తిరిగి జన్మనెత్తినను భూతమై నూరు సంవత్సరములుండును. ఆ తరువాత ఇతర జన్మల పొందును. 

ఇంటికి అతీథరాగా ఆతనిని నిరాదరణ చేసిన పాపి చేసిన పితృతర్పణమును, పితృదేవతలు స్వీకరింపరు. పైగా ఆతనికి బ్రహ్మహత్యాది పాపములు చుట్టుకొనును. ఆతడు చనిపోయిన తరువాత దూషికాకుండమను నరకమున నూరు సంవత్సరములుండి తిరిగి మానవుడై పుట్టినను దరిద్రుడగును. ఇట్లు ఏడు జన్మలవరకు దరిద్రముననుభవించుచుండును.

బ్రాహ్మణునకు దానము చేసిన ధనమును తిరిగి తీసికొనీ ఇతరులకిచ్చీనచో అతడు వసాకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. తరువాత మూడు జన్మల వరకు చండాలుడై పుట్టి ఆ తర్వాత ఏడు జన్మల వరకు తొండయై పుట్టును.

స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధమున్నచో వారిద్దరు శుక్రకుండమను నరకమునకు పోయి, అచ్చట నూరు సంవత్సరములు బాధపడి, భూమిపై యోని క్రిమిగా నూరుసంవత్సరములవరకుందురు.

బ్రాహ్మడగు గురువును రక్తము కారునట్లు కొట్టినవాడు రక్తకుండమను నరకమున నూరు సంవత్సరములు బాధపడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు వ్యాధుడై పుట్టును.

శ్రీకృష్ణుని గుణ కీర్తనమును గద్దదకంఠముతో, ఆనందబాష్పములతో చేయుచున్న భక్తుని చూచి నవ్వినచో (వెక్కిరించినచో) ఆతడు నూరు సంవత్సరములు అశ్రుకుండమను నరకమునకు పోవును. తరువాత మూడు జన్మలవరకు చండాలుడై పుట్టును.

చెడు భావనతో ఇతరులపట్ల దురుసుగా ప్రవర్తించువాడు పదిసంవత్సరములు గాత్ర మలకుండమున నివసించును. ఆ తరువాత మూడు జన్మలు గాడిదగా, మూడుజన్మలు నక్కగా పుట్టును.

చెవిటి వానిని చూచి వెక్కిరించినచో, అతడు నూరు సంవత్సరములు కర్లమల నరకమున నుండును. తరువాత ఏడు జన్మలవరకు దరిద్రుడై చెవిటివాడుగా పుట్టును. ఆ తరువాత ఏడు జన్మలవరకు ఆంగహీనుడై జన్మించును.

ఆశ వలననో, తన కడుపుకొరకో ఇంకొక ప్రాణిని చంపినచో అతడు "మజ్జాకుండ" మను నరకమున లక్షసంవత్సరములుండును. అటు పిమ్మట ఏడేడు జన్మల వరకు కుందేలుగా. చేపగా, లేడిగా జన్మించుచుండును.

కూతురును కని, పెంచి కన్యాశుల్కమును తీసికొని వివాహము చేయువాడు మాంసకుండమను నరకమునకు పోవును. అచ్చట తాను శుల్కము తీసికొన్న కన్య శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో, ఆన్నీ సంవత్సరములు యమకింకరులచే బాధలనందుచుండును.

తలపై మాంసమును పెట్టుకొని మోసికొని పోవుచున్నప్పుడు ఆకలివల్లనైనా ఆ మాంసమునందలి రక్తమును వాకినచో పాపి ఆరవై వేల సంవత్సరములు అశుద్ధములో క్రిమిగా నుండును. ఆ తరువాత ఏడు జన్మలు వ్యాధుడు కాగా మూడు జన్మలు పందీగను, ఏడుజన్మలు కుక్కగను, ఏడుజన్మలు కప్పగను. ఏడు జన్మలు జలగగను, ఏడుజన్మలు కాకిగను పుట్టి ఆ తరువాత పరిశుద్దుడగును.

వ్రతదినములలో, ఉపవాస దినములలో, శ్రాద్ధాది దినములలో నియముగా ఉండవలసిన దినములలో క్షారము చేసికొననిచో ఆతడు అన్ని సంవత్సరములు నఖకుండమను నరకమున యమభటులు దండించుచుండగానుండును.

పార్థివ లింగముపై కేశము పడినను గమనించక పూజ చేయుపోడు కేశకుండమను నరకమున ఆ పార్థివ లింగమున నెన్నిరేణువులున్నవో అన్ని సంవత్సరములు ఉండును. ఆ తరువాత పరమ శివుని కోపమువలన నూరు సంవత్సరములు యవనుడుగా పుట్టును.

విష్ణుస్థానమైన గయా క్షేత్రమున పితృదేవతలకు పిండము పెట్టనివాడు తన శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు అస్థికుండమున యమ, బాధలు పడును. ఆ తరువాత ఏడు జన్మలవరకు కాటుక పిట్టగా జన్మించును. తరువాత మానవ జన్మనెత్తినను దరిద్రుడగున.

గర్భవతియగు తన భార్యతో సంభోగము చేయువాడు సలసలమరుగుచున్న తామ్ర కుండమను నరకమున నూరు సంవత్సరములుండును.

సంతానము లేక విధవలైన స్త్రీ (అవీర) లేక ఋతుస్నాతమైన స్త్రీ చేతి అన్నమును తిన్నచో సలసలమరుగుచున్న లోహకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. ఆ తరువాత ఏడు జన్మలు రజకుడుగా, ఏడు జన్మలు కమ్మరీగా పుట్టును. ఆ జన్మలలో అతడు అనేక ప్రణములతో బాధపడుచు దరిద్రుడగును.

చెమటపట్టిన చేతులతో దేవ పూజా ద్రవ్యములను ముట్టుకొనినచో నూరు సంవత్సరముల వరకు ఖర్మకుండమను నరకమున ఉండును.

బ్రాహ్మణుడు శూద్రుని ఇంటిలో భోజనము చేసినచో అతడు తప్తసురాకుండమను నరకమున నూరు సంవత్సరములుండును. తరువాత ఏడు జన్మలవరకు అతడు శూద్రుల ఇండ్లలో పూజా పునస్కారములు చేయుచు శూద్రుల ఇండ్లలో శ్రాద్ధాన్నమును ఏడు జన్మలవరకు తినును.

కటువుగా మాటాడుచు భర్తను ఎల్లప్పుడు పీడించు స్త్రీ తీక్షణకంటకకుండమను నరకమున నాలు యుగములవరకు యమదూతలచే బాధలుపెట్టబడను. ఆ తరువాత ఏడు జన్మలవరకు గుజ్జముగా పుట్టుచుండును.

దయారహితుడై విషము పెట్టి చంపిన వాడు వేయిసంవత్సరములు విషకుండమను నరకమున విషమును తినుచుండును. తరువాత మానవ జన్మనెత్తినను, మానవులను బాధపెట్టుచు, ఏడు జన్మలవరకు మహావ్రణములతోను, ఏడు జన్మలవరకు కుష్టురోగముతోను బాధపడును.

భారతవర్షమునందలి పుణ్యక్షేత్రములలో ఎడ్లనెక్కిపోవువాడు తాను కాని అతని సేవకులు గానీ ఎడ్లను కొట్టరాదు, అట్లు చేసినచో అతడు ప్రతప్త శైలకుండమున నాలుగు యుగములుండును. ఆ తర్వాత అతడు ఎద్దుగా జన్మనెత్తును.

ప్రాణులను లోహముచే చేయబడిన వస్తువులచే హింసించువాడు పదివేల సంవత్సరములు కుంతకుండమను నరకమున నివసించును. తిరిగి మానవ జన్మనెత్తినను జీవితాంతము కడుపు నొప్పిచే బాధపడుచుండును.

మాంసమును, శ్రీమన్నారాయణునకు నివేదింపనీ పదార్థమును తీను బ్రాహ్మణుడు క్రిమి కుండమను. నరకమునకేగును. అతని శరీరమున ఎన్ని వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు ఆచ్చట బాధపడి తిరిగి భూలోకమున మానవుడై జన్మించినపుడు మూడు జన్మలవరకు మ్లేచ్ఛుడై పుట్టును.

శూద్రులచే పూజలు చేయించువాడు, లేక శూద్రుల శ్రాద్దాన్నమును భుజించువాడు లేక శూద్రుల శవములను దహించు బ్రాహ్మణులు పూయకుండమను నరకమునకు వెళ్ళుదురు. ఆ నరకములో ఆ శూద్రుని శరీరమున ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు యమదూతలచే బాధలనందుచు, రసిని భక్షించుచుందురు. తరువాత భారత వర్షమున ఏడు జన్మలవరకు శూద్రులై పుట్టుదురు. అప్పుడు కూడ మహాదరిద్రులై శరీరమునందంతట శూలబాధననుభవించుచుందురు.

చిన్నదైనను, పెద్దదైనను, మిక్కిలి క్రూరమైనదైనను సర్పమును చంపినచో తన శరీరమున ఎన్ని వెండ్రుకలున్నవో ఆన్ని సంవత్సరములు సర్పకుండమను నరకమున సర్పములు కరచుచుండగా, యమదూతలు బాధ పెట్టగా సర్పమలమును భక్షించుచుండును. తరువాత అతడు సర్పజన్మమునే ఎత్తును. తరువాత మానవ జన్మనెత్తీనను దద్దురులతో బాధపడుచు అల్పాయుష్కుడై సర్పముచేతనే మరణమునొందును.

ఒక ఉపాయమును పన్ని క్షుద్రజంతువులను చంపువాడు దంశమశక కుండమను నరకమున ఆహారములేక, జు జంతువులు రాత్రింబగళ్ళు తినుచుండగా యమదూతలు బాధ పెట్టగా నరక యాతనలనుభవించును. తరువాత క్షుద్రజంతువుగా పుట్టి అటు పిమ్మట అంగహీనుడై బాధలు చెందగలడు.

తేనేటీగలను చంపి తేనెను సంగ్రహించువాడు గరళకుండమను నరకమునకు పోవును. అచ్చట అతడు యమదూతలు బాధలు పెట్టుచుండగా విషమును తినుచు జీవించును. నరకయాతనలనుభవించి భూలోకమున తిరిగి జన్మించినప్పుడు తాను కూడా తేనేటీగగా జన్మించి బాధలననుభవించును.

తప్పు చేయని బ్రాహ్మణుని దండించినవాడు వజ్రదం కీటకుండమను నరకమునకు పోవును. అచ్చట ఆ పురుగులు చప్పుడు చేయుచు ఆతనిని తినుచుండును.

పరిపాలకుడు ధనము నాశించి ప్రజలను దండించినచో అతడు వృశ్చిక కుండమునకు పోవును. తరువాత ఏడు జన్మలవరకు వృశ్చికమై పుట్టి తరువాత జన్మలో మానవుడై పుట్టినను అవయవహీనుడై రోగములతో బాధలు పడును.

శస్త్రాస్త్రములను ధరించి, సంధ్యావందనాది నిత్యకృత్యములను, హరిభక్తిని వదులుకున్న బ్రాహ్మణుడు, ఆతని శరీరమున ఎన్ని రోమములున్నవో అన్ని సంవత్సరములు శరకుండమను నరకమున నివసించును. అచ్చట బాణములచే బాధలు పడును.

చిన్న తప్పుకై ప్రజలను అంధకారబంధురమైన కారణారమున వేసి బాధించు నాయకుడు గోళకుండమను నరకమునకు పోవును. ఆ గోళకుండము సలసల కాగుచున్న నీటితో, చిమ్మ చీకటితో మహాభయంకరమై యుండును. అచ్చట వాడియైన కోరలు గల కీటకములనేకముండును.

ఆ గోళకుండమున భయంకరమైన కీటకములచే బాధల ననుభవించి మానవ జన్మనెత్తినను సాధారణ భృత్యుడై పుట్టును.

చెరువులలో, నదులలో నున్న మొసళ్ళు మొదలగు జలజంతువులను చంపువాడు ఆ జలజంతువులకున్న ముళ్ళ సంఖ్య గల సంవత్సరములు సక్రకుండమను నరకమునకు పోయి బాధలననుభవించి తరువాత జన్మలో తాను కూడ నదులు మొదలగు స్థలములందు మొసలి మొదలగు బొతులలో పుట్టి తీరిగీ బాధలననుభవించును.

పుణ్యక్షేత్ర సందర్శనము చేయుచున్నప్పుడు ఆచ్చటకు వచ్చు పరస్త్రీల ఆందచందములను చూచి మోహపరవశుడై పోపువాడు కాకకుండమను నరకమునకు పోవును. అచ్చట కాకులు కండ్లను పొడుచుచుండగా బాధలుపడుచుండును. తరువాత మూడు. జన్మల వరకు గుడ్డివాడుగా పుట్టును. తరువాత ఏడు జన్మలవరకు దరిద్రుడుగను, మిక్కిలి క్రూరుడుగను పాపాత్ముడుగను పుట్టును. ఆ తరువాత స్వర్ణకారుడుగను. ఆటుపిమ్మట బంగారువర్తకము చేయువాడుగాను పుట్టును.

ఈ భారత దేశమున తామ్ర (రాగి) మొదలగు లోహములను దొంగిలించువాడు వజ్రకుండమను నరకమునకు పోవును. అచ్చట యమదూతల బాధలననుభవించి తిరిగి భూలోకమున జన్మించును.

భారతదేశమున దేవతా విగ్రహములను దేవతా ద్రవ్యములను అపహరించువాడు వజ్రకుండనరకమున వజ్రముల రాపిడిచే శరీరమంతయు కాలగా, ఆహారములేక, యమదూతలు బాధలు పెట్టుచుండగా హాహాకారములు చేయుచుండును.

దేవతలయొక్క బ్రాహ్మణుల యొక్క ధనమును, ఆవులను వాటికి చెందినవానిని, బట్టలను దొంగిలించినవాడు తప్త పాషాణకుండమను నరకమున అనేక వేల సంవత్సరములు నివసించును. తరువాత మూడు జన్మలవరకు కొంగగాను, మూడు జన్మలవరకు హంసగాను, ఒక జన్మ తెల్లగడ్డగాను, ఇంకొక జన్మలో తెల్లని ఇతర పక్షిగా జన్మనెత్తును.. ఆటుపిమ్మట మానవ జన్మనెత్తినప్పుడు ఏడు జన్మలవరకు కడుపునొప్పితో అల్పాయుష్కుడై పుట్టును.

దేవ బ్రాహ్మణుల యొక్క పాత్రాదీ ద్రవ్యమును అపహరించువాడు తీక్షణ పాషాణకుండమున అనేక వేల సంవత్సరములు నివసించును. తరువాత ఏడుజన్మలవరకు గుజముగా పుట్టును. అటుపిమ్మట మానవుడై పుట్టినను పొడవైన ఆవయవములతో, పాదములకు వచ్చిన రోగముతో బాధలు చెందును.

వ్యభిచరించు స్త్రీ పెట్టిన ఆన్నమును భుజించువాడు, ఆ స్త్రీవలన జీవించువారిని ఆశ్రయించుకొన్నవాడు లాలకుండమనునరకమున అనేక వేల సంవత్సరములు యమదూతలచే బాధలు పడుచుండును. తరువాత మానవుడై జన్మించినను కంట్రోగము, శూలరోగమువంటి రోగములచే బాధలు పడును.

మేచ్చులను (ఆభారతీయులను) సేవించువాడు, లేఖనముద్వారా బ్రతుకు బ్రాహ్మణుడు తప్తమపీకుండమను నరకమున అనేక వేల సంవత్సరములు యమదూతలచే బాధలనొందుచుండును. ఆ తర్వాత మూడు జన్మలవరకు సల్లని రంగుగల పశువుగా మారును. తరువాత మూడు జన్మల వరకు గొఱ్ఱగా పుట్టును. ఆ పైన మూడు జన్మల వరకు నల్లని బ్రా పుట్టును. అటు పిమ్మట తాటిచెట్టుగా పుట్టును. ఆ తరువాత మానవజన్మనెత్తును.

దేవతలయొక్క బ్రాహ్మణుల యొక్క ధాన్యము మొదలగు వానిని, ఆసనమును, శయ్యను అపహరించినవాడు చూర్ణకుండమను నరకమునకు పోవును. అచ్చట వందలకొలది సంవత్సరములు యమదూతలచే బాధలు పడుచుండును. అటుపిమ్మట మూడు జన్మలవరకు మేకగాను, తరువాత మూడు జన్మలవరకు కోడిగాను జన్మించును. ఆటుపిమ్మట మానవుడై పుట్టినను శ్వాసకోశవ్యాధితో బాధపడుచు దరిద్రుడై అల్పాయుష్కుడై వంశహీనుడగును.

బ్రాహ్మణుల ధనమునపహరించి చక్రము చేయించుకొనువాడు నూరు సంవత్సరముల వరకు చక్ర కుండమను నరకమున యమభటులచే దండింపబడును. తరువాత మూడు జన్మలవరకు తైలకారు (గానుగవారు) డుగా జన్మించును. అప్పుడు రోగములచే బాధలు పడుచు సంతానము లేని వాడగును.

బంధువులు లేక బ్రాహ్మణులు ఇంటికి రాగా వారిని చిన్న చూపుతో చూచువాడు వజ్రకుండమనే నరకములో ఒక యుగకాలముండును. తరువాత అతడు మానవుడై పుట్టినను ఏడు జన్మల వరకు కురూపిగను, అవయవ హీనుడుగను, దరిద్రుడుగను, సంతానరహితుడుగను, భార్యాహీనుడుగను ఉండును.

బ్రాహ్మణుడు తాబేటి మాంసమును తినినచో నూరు సంవత్సరముల వరకు కూర్మకుండమను నరకమునకు పోవును. అచ్చట ప్రతీదినము తాబేళ్ళు అతని శరీరమును భక్షించుచుండును. తరువాత భూలోకమున మూడు జన్మలవరకు తాబేలుగను, మూడు జన్మలవరకు పందిగను, మూడు జన్మలవరకు పిల్లిగను, ఆటుపిమ్మట మూడు జన్మల వరకు నెమలిగను జన్మించును.

దేవ బ్రాహ్మణులకు చెందిన నేతిని, నూనెను అపహరించినవాడు జ్వాలాకుండము, భస్మకుండమను నరకములకు పోవును. అచ్చట నూరు సంవత్సరములవరకు యమభటులచే బాధలననుభవించును. ఆతరువాత బొద్దింకగా, చేపగా, ఎలుకగా . ఏడేడు జన్మలనందును.

పవిత్రమైన ఈ భారతవర్షమున దేవ బ్రాహ్మణులకు సంబంధించిన సుగంధి వేరునుండి తీసిన నూనెను, భూమీని, సుగంధ ద్రవ్యమును అపహరించువాడు, దుర్గంధ కుండములో చాలా సంవత్సరములు దుర్గంధమును అనుభవించుచుండును. అటుతరువాత ఏడు జన్మల వరకు దుర్గంధమునిచ్చు వస్తువుగను, మూడు జన్మలు కస్తూరిగను, ఏడు జన్మలవరకు సుగంధిపాల వేరుగను జన్మనెత్తి తరువాత మానవుడగను.

బలవంతుడైనపాడు ఇతరులకు చెందిన భూమిని బలవంతముగనో, హింసించియో, ఇంకను ఇతర దుష్టపద్దతులననుసరించియో, అపహరించినచో అతడు తప్త శూలమను నరకమున రాత్రింబగళ్ళు మరుగుచున్న నూనెలో పడిన జీవీవలే బాధలు పడును. ఆ పాపి ఏడు మన్వంతరములవరకు తప్తశూల నరకమున బాధలు పడుచున్నను అతని భోగదేహము మాత్రము నశింపదు. ఆ నరకమున యమదూతలు పెట్టు బాధలకు తాళలేక, ఆహారము లేక ఏడ్చుచుండును.

అటుపిమ్మట ఆరవై వేల సంవత్సరములు ఆశుద్ధమున తిరుగు ప్రీమియై పుట్టును. ఆ తరువాత మానవజన్మనెత్తినను భూమిలేని వాడై దరిద్రుడగను.

దయలేక అతిభయంకరముగా మరొక జీవిని డబ్బుకు ఆశపడి కత్తులచేత చంపినవాడు అసిపత్రమను నరకమున పదునల్గురు ఇంద్రులు గడచువరకుండును. అదే బ్రాహ్మణుని ఆ విధముగా నిర్దయతో చంపినచో నూరు మన్వంతరములవరకు ఆసీపత్రనరకమున నుండును. అచ్చట యమభటులు అవయవములను చేదించుచుండగా ఆహారములేక హాహాకారము చేయుచుండును. తరువాత నూరు జన్మలు చండాలునిగను, మరొక నూరు జన్మలు పందిగను, తరువాత నూరు జన్మలు కుక్కగను, ఏడుజన్మలు నక్కగను, ఏడు జన్మలు పులిగను, మూడుజన్మలు తోడేలుగను, ఏడు జన్మలు గండిగను ఆ తరువాత మూడు జన్మలు మహిషముగను జన్మించును.

ఊరునో, పట్టణమునో తగలబెట్టువాడు అసిపత్రమను నరకమున మూడు యుగముల వరకు యమభటులు కత్తులచే శరీరమును కోయుచుండగా బాధపడుచుండును. తరువాత అతని ముఖము నుండి అగ్నిజ్వాలలు చెలరేగుచుండగా ప్రేమగా మారి భూమిపై తిరుగుచుండును. అటుపిమ్మట ఏడు జన్మలవరకు అమేధ్యమును తిను క్రిమీగా జన్మించును. తరువాత ఏడు జన్మలు మిణుగురు పురుగుగా జన్మించును. అటుతరువాత ఏడు జన్మలవరకు మితిమీరిన శూలరోగముతో బాధపడును. తరువాత ఏడు జన్మలవరకు కుష్టురోగముతో బాధపడుచుండును.

ఇతరుల చెవిలో గుసగుసలు పెట్టుచు ఇతరుల నిందించువాడు, ఇతరులను నిందించుటతోనే తాను సంతోషపడువాడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు సూచీముఖమను నరకమున సూదులచే పొడవబడుచు మూడు యుగముల వరకు బాధపడుచుండును. తరువాత ఏడు జన్మలు తేలుగాను, ఏడుజన్మలు సర్పముగాను, ఏడుజన్మలు వజ్రకీటకముగాను, (సాలగ్రామశిలలోనుండి ఆశీలను తొలుచు పురుగు) తరువాత ఏడు జన్మలు భస్మకీటకముగాను తరువాత మహారోగి యైన మానవుడుగా జన్మించును.

ఇతరుల ఇండ్లను తవ్వి వస్తువులను, గోవులను, గొఱ్ఱలను, మేకలను అపహరించువాడు తరువాత ఏడు జన్మల వరకు రోగముగల గోవుగా, తరువాత మూడు జన్మల వరకు మేకగా, గొజ్జగా జన్మించి బాధలు పడును. ఆ తరువాత మానవుడై పుట్టినను ఎల్లప్పుడు రోగముతో, దరిద్రుడై, భార్యను కోల్పోయి, బంధువులందరిని కోల్పోయి బాధలు పడును.

చిన్న చిన్న దొంగతనములు చేయువాడు నక్రముఖమను నరకమున ఒక యుగము వరకు మొసళ్ళచే బాధలు పడుచుండును. తరువాత మానవుడుగా జన్మించినను నిరంతరము రోగములచే బాధపడుచుండును.

గోవులను, ఏనుగులను, గుఱ్ఱములను, మానవులను చంపువాడు గజదంశమను నరకమున కేగి ఆచ్చట అతనిని యమదూతలు ఏనుగు దంతములచే పొడుచుచుండగా మూడు యుగములవరకు ఉండును. తరువాత మూడు జన్మలవరకు గజముగాను, మరొక మూడు జన్మలు గుజ్జముగాను, ఆ తరువాత మూడు జన్మలు గోవుగాను, అటు పిమ్మట మూడు జన్మలు మ్లేచ్ఛుడుగను పుట్టును.

దప్పికతో నీరు తాగుచున్న గోవును ఎవడు వారించునో అతడు వెంటనే ప్రాణములను కోల్పోయి గోముఖమను నరకమునకు వెళ్ళును. ఆ నరకము గోముఖాకారమున నుండును. క్రిములు, సలసలమజుగు నీరు ఉండును. అచ్చట మన్వంతరమువరకు బాధలు పడుచు మానవ జన్మనెత్తినప్పుడు ఆవులు లేక, అనేక రోగములచే, దరిద్రముచే బాధలు పడును. ఆ ఏడుజన్మలు అంత్యజాతీవాడుగా జన్మించుటచే అవమానముల పాలై బాధలు పడును.

ఆగమ్యాగమనము చేయువాడు, సంధ్యావందనమాచరింపని వాడు, యాగదీక్ష తీసికొననివాడు, పుణ్యతీర్థములలో దానములను స్వీకరించువాడు, పూజలు చేయించువాడు (డబ్బు తీసికొని), దేవతార్చన చేసి పొట్టబోసుకొనువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేయువాడు, అతిగా మదించినవాడు, శూద్రస్త్రీని పెండ్లిచేసుకొన్న బ్రాహ్మణుడు, గోహత్య, బ్రహ్మహత్య, స్త్రీహత్య, మీత్రహత్య, శిశుహత్య చేయువాడు కుంభీపాకమను నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకుండును. ఆచ్చట యమ దూతలు కొట్టుచుండగా ఆతని దేహమంతయు చూర్ణమగుచుండును. యమదూతలతనిని కొంతసేపు నిప్పులో వేతురు. మరికొంతసేపు ముండ్లలో వేతురు, ఇంక కొంత సేపు మరిగే నూనెలోకి తోయుదురు. మరికొంత సేపు సలసలమరిగే నీటిలో ఉంచెదరు. కొంతసేపు మండుచున్న రాతిపై నిలబెట్టుదురు. ఇంకను కొంతసేపు మండుతున్న లోపాముపై నిలబెట్టుదురు. ఈవిధముగా నరకయాతనలనన్నిటినీ అనుభవించి భూమిపై జన్మించినపుడు అనేక కోట్ల జన్మలు గద్దగను, ఇనూరుజన్మలు పందిగాను, ఏడుజన్మలు కాకిగను, ఏడు జన్మలు. సర్పముగను, ఆరవై వేల సంవత్సరములు అశుద్ధమునందు ఉండు క్రిమిగాను, ఆ తరువాత శూద్రుడుగా జన్మించును. ఆ జన్మలో అతడు కుష్టురోగముచే బాధలు పడుచు, దరిద్రుడై, క్షయవ్యాధిచే బాధలు పడుచు సంతానములేక, భార్యలేక అనేక దుఃఖములను అనుభవించును.

సావిత్ర్యువాచ- సావిత్రి యమధర్మరాజుతో నిట్లనెను-

ఓ యమధర్మరాజా! బ్రహ్మహత్య, గోహత్య, అతిదేశికి ఏ విధముగా నుండును. అగమ్య అనగా నెవరు? సంధ్యావందనము లేనివాడెవరు? ఆదీక్షితుడు, పుణ్యతీర్థములందు దానము స్వీకరించువాడెట్లుండును. అట్లే గ్రామయాజి, దేవలుడు, శూద్రసూపకారుడు, వృషలీపతి యనగా ఎట్లుండును. వేదములు వేదార్థములు తెలిసిన వారిలో శ్రేష్టుడవైన యమధర్మరాజా! వీరి లక్షణములనన్నిటిని వివరముగా నాకు తెలుపుము.

యమ ఉవాచ- యమ ధర్మరాజిట్లనెను-

శ్రీకృష్ణునకు, ఆతని అర్చావిగ్రహమునకు, శివునకు శివలింగమునకు సూర్యునకు, సూర్యమణికి, గణపతికి ఆతని విగ్రహమునకు మధ్య ఈ విధముగా ఇతరత్ర భేద భావన చేయువాడు బ్రహ్మహత్యా పాపమును పొందును.

ఆట్లే తన గురువును, తన ఇష్టదేవతను, తన తల్లిని నిరాదరించువాడు బ్రహ్మహత్యా పాపముననుభవించును.

వైష్ణవులను, ఇతర దేవతా భక్తులను, బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులను సమానముగా చూచువాడు బ్రహ్మ హత్యాపాపముననుభవించును.

విష్ణుమూర్తికి సమర్పించిన నైవేద్యమును, ఇతర దేవతలకు ఇవ్వబడిన నైవేద్యమును, శ్రీహరి పాదోదకమును, ఇతర దేవతల పాదోదకమును సమానముగా చూచువాడు బ్రహ్మ హత్యా పాపమును అనుభవించును.

సమస్త సృష్టికి మూలపురుషుడు, ఆదిపురుషుడు, సర్వదేవతలచే సేవితుడు, తనమాయవలన అనేక రూపములతో కనపడుచున్నమ అద్వితీయుడును, సర్వేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుని ఇతర దేవతలతో సమానముగా భావించువాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును.

వేదమంత్రములు కలది, పూర్వకర్మ అపరకర్మ అనే పేర్లతో ప్రసిద్ధమైన దేవతార్చనను పితృదేవతార్చనను చేయనివాడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

పరమ పవిత్రుడగు శ్రీమన్నారాయణుని, శ్రీమన్నారాయణ మంత్రోపాసకుని నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుచున్నారు.

మంగళ స్వరూపుడు, శ్రీకృష్ణునకు తన ప్రాణములకంటే మిన్నయైనవాడు, పరమ పవిత్రుడు, జ్ఞానానందస్వరూపుడు, సనాతనుడు, విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతలకు పరమేశ్వరుడగు శివుని పూజించని వారు, నిందించువారు బ్రహ్మహత్యాపాపమును పొందుదురు.

శ్రీమన్నారాయణునిపై భక్తి భావనను కలిగించునది, సమస్త శక్తి స్వరూపిణి, అందరికి మాతృస్వరూపిణి, సర్వదేవీ స్వరూప, అందరిచే నమస్కారములనందుకొనుచున్నది, సమస్త సృష్టికి కారణమైనదీ ఐన విష్ణుమాయను నిందించువారు బ్రహ్మహత్యా ఫలమును పొందుదురు.

పవిత్రమైన పంచపర్వములను (అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సూర్యసంక్రమణమను ఐదు పర్వములు) శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, ఆదివారమను ఐదుపర్వములను ఆచరించనివారు బ్రహ్మ హత్యా దోషమును పొందుదురు.

అట్లే నదులలో, దిగుడుబావులలో మూత్ర పురీషములను విసర్జించినవారు బ్రహ్మహత్యాపాపమునొందుదురు.

గురువును తల్లి దండ్రులను, పతివ్రతయగు భార్యను, సంతానమును అట్లే అనాథలైనవారిని పోషింపనివాడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

పుత్ర సంతానము లేనివాడు, వివాహము చేసికొననివాడు, శ్రీ హరీ భక్తి లేనివాడు బ్రహ్మ హత్యా ఫలమును పొందును.

శ్రీమన్నారాయణునకు సమర్పించిన నైవేద్యమును తీననివాడు, ప్రతి దినము శ్రీహరి పూజ చేయనివాడు, పవిత్రమైన శివలింగమును పూజించని వాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును.

పైవన్నియు ఆతిదేశికములైన బ్రహ్మహత్యలు.

మేత మేయుచున్న ఆవును, నీరు త్రాగుచున్న ఆవును అదలించి నీరు తాగకుండ, మేతమేయకుండా చేయువాడు గోవును చంపిన ఫలమును పొందును.

ఆవులను కఱ్ఱతో కొట్టువాడు, ఎద్దులపై బరువులు మోపువాడు లేక గోవుపై కూర్చొనియుండువాడు ప్రతిదినము గోహత్య చేసిన వానితో సమానుడు. ఆవులకు తిని పారేసిన ఎంగిళ్ళను పెట్టువాడు, ఎద్దులను బండికి కట్టువాడు, అతని ఇంట భుజించువాడు గోహత్యాపాపమును పొందును. అట్లే తన పాదములను నిప్పుకెదురుగా ఉంచి కాచుకొనువాడు, గోవులను కాలితో తన్నువాడు, నదిలోనో బావిలోనో స్నానము చేసి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుగుకొనక ఇంటిలోపలికి వెళ్ళువాడు, తడిగల కాళ్ళతో భోజనము చేయువాడు, తడి కాళ్ళతోనే నిద్రపోవువాడు, సూర్యోదయకాలమున రెండుమార్లు తినువాడు గోహత్యాఫలితమును పొందును. సంతానములేని విధవ పెట్టిన అన్నము తినువాడు, తన భార్యను ఇతరులకు తార్చీ బ్రతుకువాడు, మూడు సంధ్యలలో సంధ్యావందన మాచరింపని బ్రాహ్మణుడు, సర్వకాలములందు పితృదేవతార్చనమును, తిథికాలమున దేవతార్చనను చేయనివాడు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయనివాడు గోహత్యా ఫలితమును పొందును.

అట్లే శ్రీకృష్ణుని తన భర్తను భేదభావముతో చూచుస్తీ, భర్తను తిట్టుచు, కొట్టుచుండు స్వభావముగల స్త్రీ గోహత్యా ఫలితమును పొందును.

గోవులు నడచు త్రోవను చెడగొట్టి వ్యవసాయమునకు ఉపయోగించుకొనువాడు, చెరువులోను, చేరువుపైభాగమున వ్యవసాయము చేయువాడు (తన స్వార్థమునకై చెరువులోను, దాని పై భాగమున నీరు రాకుండ చేసి వ్యవసాయము చేసి కొనువాడు) ,గోహత్యా ఫలితమును పొందును. పిసినారితనమువలననో, అజ్ఞానమువలననో గోవధ ప్రాయశ్చిత్తమును విధి విహితముగా చేయని వానికి గోహత్యాపాపమంటును.

రాజుకు సంబంధించినవి లేక దైవమునకు సంబంధించిన అనావృష్ట్యాది ఉపద్రవములందు తనకు చెందిన గోవులను రక్షింపనివాడు, ఆసమయములలో ఆవులకు కష్టమును కలిగించువాడు గోహత్యా ఫలితమును పొందును, ఏ ప్రాణినైనా, దేవతార్చన సమయమున ఉపయోగించిన జలమును, దైవమునకు సమర్పించిన నైవేద్యమును, పుష్పము మొదలగువాటిని దాటినచో అతనికి గోహత్యా ఫలితము దొరకును.

ఎప్పుడును లేదు లేదు అని అబద్ధములాడువాడు, ఆట్లే ప్రతారణ చేయువాడు, దేవతలను, గురువును ద్వేషించువాడు గోహత్యాసలితమును పొందును. అట్లే దేవతయొక్క ఆర్చామూర్తిని, గురువును బ్రాహ్మణుని చూచి వెంటనే నమస్కారము చేయనివాడు, తనకు వినయముతో నమస్కరించినను కోపముతో ఆశీర్వదించనీ బ్రాహ్మణుడు, వినయముతో తనను విద్య చెప్పమని అడిగినప్పుడు మదముతో విద్యాబోధ చేయని బ్రాహ్మణుడు గోహత్యా ఫలితమును పొందును.

సావిత్రి! నీవడిగినట్లు ఆతిదేశికములైన గోహత్య, బ్రాహ్మణహత్యలెట్లుండునో తెలిపితిని, ఈ విషయములనన్నిటిని మాతండ్రి యగు సూర్యుని వలన తెలిసికొంటిని. ఇంకను నీకేమైన తెలుసుకొనవలసిన విషయములున్నచో అడుగుము.

సావిత్ర వాచ- సావిత్రి యమునితో ఇట్లు పలికెను-

యమధర్మరాజా! వాస్తవమైన పుణ్యమునకు ఆతిదేశమైన పుణ్యమునకు, వాస్తవమైన పాపమునకు ఆతిదేశమైన పాపమునకు మధ్య గల భేదమును నాకు వివరింపుము.

యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-

పాప పుణ్యములందెచ్చటనైనను వాస్తవ పుణ్యపాపములు చాలా గొప్పవి. అట్లే ఆ దేశీక పుణ్యపాపములు ఎచ్చటనైనను వాస్తవమైనవాటికంటే తక్కువైనవి.

ఎట్టి ఆతిదేశిక పుణ్యపాపములు శ్రేష్ఠమైనవి, ఎటువంటి వాస్తవ పుణ్యపాపములు తక్కువైనవి, ఎటువంటివి సమానమైనవి అను విషయమును వేద ప్రమాణముననుసరించి నీశ్చయింపవలెను. ఈ విషయమును పట్టించుకోననివాడు గురువును చంపిన పాపమును పొందును.

పూర్వ పరిచయముగల బ్రాహ్మణుడు, విద్యను, మంత్రమును ఉపదేశించిన గురువునందు పిల్పత్వమారోపించబడును. అందువలన ఆతడు శ్రేష్ఠుడగును.

తండ్రకంటి తల్లి నూరురెట్లు గొప్పది. తల్లికంటె విద్యను, మంత్రమునుపదేశించిన గురువు నూరురెట్లు గొప్పవాడు గురువు కన్న గురు భార్యను ఎక్కువ గౌరవింపవలెను. దేవపత్ని ఇష్టదేవత కూడ గౌరవించదగినవారు.

విష్ణుమూర్తితో సమానమైన లక్షణములు గల బ్రాహ్మణుడు శివునితో సమానమైనవాడు. రాజువంటివానికంటె రాజు లక్షరెట్లు గొప్పవాడు.

సూర్యచంద్రుల గ్రహణకాలమున అన్ని నదులలోని నీరు గంగానదీతో సమానమైది. అప్పుడు బ్రాహ్మణులందరు వ్యాసమహర్షితో సమానమైనవారు. ఈసమయమున మాత్రమే ఈరెంటియందు సమానత్వము కనిపించును.

హత్య వంటి దాని కన్న వాస్తవమైన హత్య నాల్గురెట్లు గొప్పనిది. ఇది సమస్త వేదములకు సమ్మతమైనదనీ బ్రహ్మదేవుడు చెప్పెను.

ఓ సావిత్రి! ఆతిదేశిక హత్యకు హస్తహత్యకు గల భేదమును నీకు తెలిపితిని. ఇక మానవులకు ఆగమ్యలైన స్త్రీల గురించి వివరింతును.

అందరకు తన భార్య గమ్యయగును. తన భార్య కంటే భిన్నమైన స్త్రీ ఆగమ్య యని వేదశాస్త్రాస్త్రకోవిదులుచెప్పుదురు. కానీ ఇది సామాన్యమైన విషయము. విశేషాంశమునిప్పుడు వినుము. ఆత్యగమ్యలగు స్త్రీల గురించి చెప్పుదును వినుము.

శూద్రులు బ్రాహ్మణ స్త్రీలోనో, బ్రాహ్మణుడు శూద్రుని భార్యతోను సంగమించకూడదు. వీరు పూర్తిగా ఆగమ్యలు. ఈసంబంధము మిక్కిలి నిందించ తగినది.

శూద్రుడు బ్రాహ్మణస్త్రీతో సంగమము చేసినచో ఆతడు నూరుగురు బ్రాహ్మణులను హత్య చేసిన పాపమును పొందును. అట్లే శూద్రునితో పోవు బ్రాహ్మణస్త్రీ కూడా బ్రహ్మహత్యాపాపమును పొందును. ఇంకను కుంభీపాకమమ నరకమునకు తప్పకపోవును.

బ్రాహ్మణుడు శూద్రుస్తీ వేంట పోయినచో అతడు వృషలీపతియని పిలువబడును. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ జాతి భ్రష్టుడై చండాలునికన్నను అధముడగును. ఆతడు పితృదేవతలకు సమర్పించిన పిండము మలమువంటిదగును. అతడు విడిచిన పితృతర్పణబిలము మూత్రముతో సమానమగును. అతడు చేయు దేవ పిత్సపూజలు వ్యర్థములగును.

బ్రాహ్మణుడు శూద్రస్త్రీ సంగమము చేసినచో అతడు కోటి జన్మలనుండి చేయుచున్న పుణ్యము ఆతని సంధ్యా, తపస్సు, దేవతార్చనల వలన సంపాదించుకొన్న పుణ్యమంతయు నశించిపోవును. ఆతడు కల్లును లాగిన పాపమును, ఏకాదశినాడు భోజనము చేసిన పాపమును పొందును. పైగా కుంభీపాక నరకమునకు తప్పక పోవును.

గురువు భార్య, రాజు భార్య. సవతి తల్లి, ఆమె కూతురు, తనకూతురు. కోడలు, అత్తగారు, గర్భవతి మైన స్త్రీ చెల్లెలు, వదిన మరదళ్ళు (తమ్ముని భార్య) మేనమామ భార్య, మేనత్త, తమ్ముని కూతురు, శిష్యురాలు, శిష్యుని భార్య, మేనల్లుని భార్య, అన్న, తమ్ముల కోడళ్లు వీరందరు ఆగమ్యలని బ్రహ్మదేవుడు తెలిపెను.

పైన చెప్పబడిన వారిలో ఒక స్త్రీతోనో అనేక స్త్రీలతోనో వ్యభిచరించువాడు తన తల్లితో సంగమించువానితో సమానమైన పాపమును పొందును. అట్లే నూరు బ్రహ్మహత్యల ఫలితమును పొందును. అతడు పుణ్యకర్మలు చేయుటకు తగడు, అతడు అస్పృశ్యుడగును. అట్లే మహాపాపియగు ఆతడు కుంభీపాకనరకమునకు తప్పక పోవును.

సంధ్యావందనమును సరిగా చేయనివాడు, అసలు సంధ్యనే చేయనివాడు లేక ఒకటి లేక రెండు సంధ్యలు చేసి తక్కిన వావిని చేయని ద్విజుడు సంధ్యాహీనుడని చెప్పబడును.

విష్ణువునకు, సూర్యునకు, శక్తికి, శివునకు, గణపతికి సంబంధించిన మంత్రములలో దేనినైనను ఆహంకారముతో స్వీకరింపనివానిని ఆదీక్షితుడని యందురు.

నదీ తీరమునకు నాలుగు హస్తముల దూరమున నీటిలో శ్రీమన్నారాయణుడు నివసించును. దానిని నారాయణ క్షేత్రమందురు. అచ్చట, కురుక్షేత్రమున, కాళీయందు, బదరీక్షేత్రమున గంగా సాగర సంగమ స్థలమున, పుష్కర క్షేత్రమున, ప్రభాసక్షేత్రమున, హరి ద్వారమున, కేదారేశ్వరమున, సోమక్షేత్రమున, సరస్వతీ నదీ తీరమున, పవిత్రమైన బృందావనమున, గోదావరి నదీతీరమున, కౌశికీ నదీ తీరమున, త్రివేణీ సంగమమున, హిమాలయ పర్వతములందు ఇతరత్ర ధనముపై ఆశవలన దానము స్వీకరించువానిని తీర్థ ప్రతి గ్రాహి యందురు. అతడు కుంభీపాక నరకమునకు తప్పక పోవును.

శూద్రులు తప్ప తక్కిన ద్విజులచే యాగములు చేయించువానిని గ్రామయాజి యని పిలుతురు, ఆట్లే దేవాలయమున, ఇతరుల ఇండ్లలో దేవతార్చనము చేసి బ్రతుకు వానిని దేవలుడని ఆందురు. శూద్రుల ఇండ్లలో వంటచేసి జీవనము సాగించువానిని నూపకారుడని పిల్చెదరు. సంధ్యావందనము, పూజాదికము లేక జీవించువానిని ప్రమత్తుడని, పతీతుడని పిల్చెదరు.

వృషలీపతి యొక్క లక్షణమును ఇంతకు ముందే వివరించితిని. మహాపాతకులైన వీరందరు కుంభీపాకమను నరకమునకు ఇతర నరకకుండములకు సహితము. పోదురు. వాటి నన్నిటినీ నీకు ముందు చెప్పుదును.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన సావిత్ర్యుపాఖ్యానములో పాపుల నరకనిరూపణము, శివుని గొప్పదనము, బ్రహ్మహత్యాది విషయముల నిరూపణమనే ముప్పదియవ అధ్యాయము సమాప్తము.