2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
61 – తార తిరిగి బృహప్పతిని చేరుట, బుధోత్పత్తి
నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను-
బ్రహ్మదేవుడు శుక్రాచార్యుని దగ్గరకు పోవుదునని బయలుదేరిన తరువాత దేవదానవులమధ్య ఏమి జరిగినదో తెలుపుడు. దీనిని తెలుసుకొనవలెనను కౌతూహలము నాకు చాలా కలదు అని నారదుడనెను,
నారాయణ ఉవాచ - నారాయణు డిట్లనెను-
బ్రహ్మదేవుడు శుక్రుని ఇంటికి వెళ్ళాను. అతని భవనము చుట్టు అనేక దైత్యులుండిరి. ఆ భవనమున ఆనేక రత్నమండపములు కలవు. ఆ మహర్షికి బ్రహ్మవాదులగు యాభైవేల శిష్యులుండిరి. అతడుండు భవనము ఏడు ఆగడలతో సప్తప్రాకార పరివేష్టితమైయుండును. ఆది మహారాజులుండు దుర్గమువలెనున్నది. ఆ మహర్షి యుండు భవనమును శతకోటి రైత్యులెల్లప్పుడు రక్షించుచుందురు.
బ్రహ్మదేవుడు శుక్రుని సభాభవనమునకు వెళ్ళినసమయమున ఆతడు దైత్యులు మునులు సేవించుచుండగా రత్నసింహాసనమున కూర్చుండి శ్రీకృష్ణపరమాత్మమంత్రమును జపించుచుండెను. అతడు బ్రహ్మతేజస్సుచే కోటిసూర్యులవలె వెలిగిపోవుచుండెను.
తన మనుమడు గొప్ప తేజస్సుచే గొప్పవైభవముచే వెలుగొందుచుండగా చూచి బ్రహ్మదేవుడు చాలా పొంగిపోయెను. తాను, తన పుత్రుడగు భృగుమహర్షి తన పౌత్రుడైన శుక్రుడు ధన్యులైరని, తలపోసెను.
అట్లే శుక్రుడు బ్రహ్మదేవుని చూడగానే భయములో లేచి నిలబడి అతనికి చేతులు జోడించుకొని నమస్కరించెను.
బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని ఆతనిని షోడశోపచారములతో శాస్త్రవిహితముగా పూజించి స్తోత్రము చేసెను. బ్రహ్మదేవుడు విద్యను. మంత్రమును ఉపదేశించు గురువు, సర్వసంపదలనిచ్చువాడు, జీవునికి తాను చేసిన కర్మఫలితము నొసగువాడు, ప్రపంచమున అందరికన్నను శ్రేష్ఠుడైనవాడు. ఐన బ్రహ్మదేవుని శుక్రుడు స్తోత్రము చేయగా అతడు మిక్కిలి సంతోషము పొందెను. శుక్రుడు బ్రహ్మదేవునకు విశ్వకర్మ నిర్మించిన ఉజ్వలమైన రత్నసింహాసనమును స్వయముగా తెచ్చివేసెను.
శుక్రుడు తనదగ్గరకు వచ్చిన బ్రహ్మదేవుని, శకుని, క్రతువు. వసిష్ఠుడు, మరీచి, సునందుడు, సనాతనుడు, కపిలుడు, పంచశిఖుడు, వోడువు, అంగిరసుడు, ధర్ముడు, నేను (నారాయణుడు), నరుడు అను మునులనందరను భక్తితో నమస్కరించి ఆందరిని యథోచితముగా పూజించెను. వారినందరిని రత్నసింహాసనములపై కూర్చుండబెట్టెను.
దైత్యులు, అచ్చటనున్న మునులందరు, సంతోషముతో బ్రహ్మదేవుని స్తుతించిరి. తుక్రుడు అందరిని స్తుతించి చేతులు జోడించుకొని వినయముతో నమస్కరించి బ్రహ్మదేవునితో, అతని వెంటవచ్చిన మునులతో నిట్లనెను.
శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను-
నేడు నాజన్మ చరితార్థమైనది. నా జీవితము సఫలమైనదీ. ఎందువలన అనగా సాక్షాత్ భగవంతుడు ఆగు బ్రహ్మదేవుడు స్వయముగా నా ఇంటికి ఏతెంచెను. అట్లే సనాతనులు, భగవత్స్వరూపులగు ఆతని పుత్రులు స్వయముగా నా ఇంటికి ఏతెంచిరి. పరాత్పరుడైన కృష్ణుడు నాపైన సంతోషము కలిగియున్నట్లు కనిపించును. మీముందు శిశుతుల్యడనైన నన్ను చరితార్థుని చేయుటకు మీరు వచ్చితిరి. మీకందరకు స్వాగతము పలుకుచున్నాను. ఆత్మారాములైన మిమ్ములను కుశల ప్రశవేయుట తగినదీకాదు. మీరందరు ఇచ్చటకు వచ్చి నన్ను పవిత్రము చేసితిరి. నేను మీకు చేయదగినదైనా ఉన్నచో నన్ను శాసించి చెప్పుడని బృహస్పతి వారితోననెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను-
శుక్రుడా! నీయొక్క చిరకాలవియోగమునకు దుఃఖితుడనై నిన్ను చూడవలెననీ ఇచ్చటకు వచ్చితిని. పుత్రులు, పౌత్రులయొక్క వియోగము మరణముకంటె ఎక్కువ.
ఓ మునిశ్రేష్ఠ నీవు క్షేమముగా ఉన్నావా? నీ పుత్రులు భార్య అందరు క్షేమమేనా? నీ స్వధర్మములను కొమ్యములైన కర్మలను, తపస్సును చక్కగా చేయుచున్నావా? నీవు ప్రతిదినము చేయు శ్రీకృష్ణార్చనము ఆవిచ్చన్నముగా జరుగుచున్నదా? అట్లే నీవు నీయొక్క గురువును అవిచ్ఛిన్నముగా సేవించుచున్నావా? గురువును, ఇష్టదేవతను పూజించుట సమస్త మంగళములకు కారణమగుచున్నది. అది పాపములను, రోగములను, శోకములను పోగొట్టును, గురువు సంతోషపడినచో అభీష్టదేవత సంతోషించును. ఇష్టదేవత సంతోషపడినచో సమస్తదేవతలు సంతోషపడుదురు. ఏ పాపాత్ముని యొక్క గురువు, ఇష్టదేవత కోపింతురో వారికి క్షేమము కలుగదు. వారి పనులకు . విఘ్నము ఎల్లప్పుడు జరుగుచుండును. నీ ఇష్టదేవత, ప్రకృతికంటే విశిష్టుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడు సంతోషపడుచున్నాడు. అట్లే నీ గురువగు వేమ కూడ సంతోషపడుచున్నాము. వీ గురువువగు నేను సంతోషపడివచో నీ ఇష్టదేవతయగు శ్రీహరి సంతోషపడును. శ్రీహరి సంతోషించవచో సమస్త దేవతలు పంతోషపడుదురు. అని బ్రహ్మదేవుడనెను.
బుద్ధిమంతుడా! ప్రస్తుతము వారాకకు గల కారణమును విమము. వేమ దేవతలు, విశ్వసంహారకుడైన శంకరుడు పంపగా ఇచ్చటకు వచ్చింది నకు గురువుత్రుడగు బృహస్పతియొక్క భార్యయగు తారమ చంద్రుడుపొరించి విన్న శరణుపొందేమ..
ఇప్పుడు శంకరుడు, ధర్ముడు, సూర్యుడు, ఇంద్రుడు, అనంతుడు, ఆదిత్యులు, పపుగణము, ఏకాదశరుద్రులు, అష్టదిక్పాలకులు, మూడు కోట్ల దేవతలు, నాగులు, కింపురుషులు, యక్ష రాసి, గుహ్యకులు, భూతప్రేత పిశాచులు, కూష్మాండులు, బ్రహ్మరాక్షసులు, కిరాతులు, గంధర్వులు వీరందరు యుద్ధసన్నద్ధులై సముద్ర తీరముపమన్నారు. తారాదేవిని ఆమె భర్తయగు బృహస్పటికి తిరిగి ఇచ్చివేయుము. కొముకువచంద్రువకు శరణమివ్వక అతనిని వదలిపెట్టుము. ఈవిషయమున దేవదానవులు యుద్ధము చేయుట తగనిదని పల్కెను.
శుక్ర ఉవాచ- చక్రుడిట్లు పలికెను-
యుద్ధము చేయవలెను దుర్మదములోమన్న దేవతలందరు యుద్ధ సన్నద్ధులై వచ్చినచో రావిమ్ము, అందరకు గురువగు మహేశ్వరుడు తప్ప మిగిలినవారితో నేనే యుద్దమున చేయుదును.
దైత్యా ఊచు- దైత్యులిట్లనిరి-
బ్రహ్మదేవుడా! శంకరుడు దేవదానవులిద్దరకు గురువు అతడు ఎల్లప్పుడు గౌరవింపదగినవాడు, నమస్కరింపదగినవాడు. ధర్మదేవత అన్నిటికి సాక్షీభూతుడు, నీవు పర్వలోక పితామహుడు. మీరు తప్ప మిగిలిన దేవతలనందరమ గడ్డిపోచతో సమానముగా మేము భావింతుము. అందువలన దేవతలందరితో కలసి గురుపుత్రుడనే భావనలో మహ్విరుడు యుద్ధమునకు వచ్చినమ అతనితో కూడ యుద్ధము చేయుటకు సిద్ధముగామన్నాము. తొలుత ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి ఆతరువాత యుద్ధము చేయుదుమని దేవతలకు చెప్పుడని దైత్యులవీరి.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
బిడ్డలారా! మిక్కిలి బలవంతుడు సమస్త విశ్వమును పంహరించు కాలాన్ని రుద్రునితో ఎవరు యుద్ధము చేయగలుగుదురు. ఖడ్గము తలపుట్టెను ధరించు భద్రకాళీ ఆమె జగత్తుల కన్నీటికి తల్లి, ఆమెకు వేయు భుజములున్నవి. తలలమ మాలగా చేసికొనీ ధరించునది. మిక్కిలి విశాలమైన ముఖముకలది. ఆమె దంతములు ఏడు తాటిచెట్ల పొడవున భయంకరమైయుండుము. ఆమె వాలుక క్రొప్రమాణమునమండుమ. భయంకరియగు ఆ దేవితో యుద్దమును ఎవరు చేయగలదు? కరువి సేవకులు మహాభయంకరులు అతిరౌద్రులు. భైరవులు చాలా భయంకరులు. నందీశ్వరుడు మిక్కిలి కర్కశమైనవాడు. ఆట్టే శివుని అనుచరులైన వీరభద్రుడు మొదలుగ దేవతలు మహాబల పరాక్రములు. కోటి సూర్యులతో సమానమైన కార్తీకలవారు. వారితో ఎసరు యుద్ధము చేయుదురు.
వేయి శిరస్సులుగల ఆదిశేషునకు ఈ విశ్వము ఆవగింజవంటిది. అట్టి బలవంతునిచే ఎవరు యుద్ధము చేయగలుగుదురు?
త్రిపురాసురులను సంహరించిన శంకరునకు కాలాగ్ని రుద్రుడు కింకరుడు. అతడు చేసిన పాశుపతాస్త్రమువలన ప్రపంచమంతయు భస్మమగును. అతనికి రైత్యులు ఏ లెక్కలోనికి వత్తురు? శ్రీకృష్ణ పరమాత్మయొక్క అనుచరులలో ఒకడుగు సుదాముని అవతారమైన ఆశoఖచూడుడు కాలాగ్ని రుద్రుని శూలము వలన పడిపోయిన, ఆతడు మూడుకోట్ల సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు. రాధాకవచమునెల్లప్పుడు కంతమున ధరించుచుండును.
మధుకౌటభులను, హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రత్యేకముగా యుద్ధమునకై శ్వే తద్వీపమునుండి వచ్చునని బ్రహ్మదేవుడు పలికెను.
ఈవిధము బ్రహ్మదేవుడు పలికి యూరకుండగా. దాసవరాజుగు ప్రహ్లాదుడిట్లు పలికను.
ప్రహ్లాద ఉవాచ- ప్రహ్లాదుడిట్లు బ్రహ్మదేవునితో పలికిను-
అందరికంటెను పెద్దవాడవగు నీకు నమస్కారము. వీపు అందరిలో పూజ్యుడవు. అందరకు నాథుడవు. అట్టి వీముందు వేమి చెప్పగలను.
హిరణ్యకశిపుని, మధుకైటభులను సంహరించినవాడు పరిపూర్ణతముడైన శ్రీకృష్ణుని పదునారవ ఆంశము. సర్వాంతరాత్మయగు శ్రీకృష్ణునీ సుదర్శన చక్రము మాలోకములను మమ్ములను కూడ క్షణములో కాల్చివేయును.
ఆ శ్రీకృష్ణపరమాత్మకంటె నీవు చెప్పిన శంకరుడు, అతని పాశుపతాస్త్రము, కాళికాదేవి, శేషుడు, రుద్రులు ఇతర దేవతలెవ్వరు బలవంతురుకారు. ఆ పరమాత్మయొక్క రోమములందు సమస్త విశ్వములున్నవి. స్థూలమునకంటే మిక్కిలి స్థూలమైనవాడు, సమస్తమునకు ఆధారభూతుడగు భగవంతునకు మహావిరాడ్రూపుడు పదునారవ ఆంశము. ఆ మహావిరాట్ స్వరూపునికంటె అనంతుడు, కాళీ గొప్పవారలు కారు.
దేవతలందరు వచ్చీ యుద్ధము చేసివచో చేయనిమ్ము. నేను వారి శరములకుగాని, హరుని పాశుపతాస్త్రమునకు గాని భయపడను.
మంగళ స్వరూపుడగు శంకరునకు నమస్కారము. అట్లే అనంతునకు, సాధువులకు వైషసులకు అందరకు నమస్కారము. శ్రీకృష్ణుని అనుగ్రహమువలన నేను నిర్భయుడను. రోగ రహితుడను. వాకు ప్రత్యేకముగా నా బలమమన దేదియులేదు. నా బలమంతయు ఆ కృష్ణపరమాత్మునియొక్క బలమే.
నాతండ్రి విష్ణువును నిందించి, నిందించి చనిపోయెను. అట్లే శంఖచూడుడు నిర్బంధమువలన చనిపోయెను. మధుకైటభులు అతి గర్వము వలన నాశనమైరి. త్రిపురాసురుడు మాకు కింకరుడు. అందువలన-ఆతనిని బలవంతుడుగా మేము పరిగణించము. ఇవము అతడు రథముననున్న పరమేశ్వరుని యుద్ధమునకు ప్రేరేపించెను.
ఈవిధముగా దానవశ్రేష్ఠుడైన ప్రహ్లాదు డా సభలో పలికి యూరకుండగా బ్రహ్మదేవుడు తిరిగి ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
దైత్యులు, దేవతలు ఇద్దరు కలిసి యుద్ధముచేసివచో వినాశనము తప్పక జరుగును. ప్రేమ కలిగియుండుటే సమస్త మంగళములను కలిగించును.
ఓ రాజా! భిక్షకుడవైన సాకు తారను భిక్షగానిమ్ము. భిక్షుకుడు విరాశతో వెళ్ళిపోయినచో ఆ గృహప్టు సమస్త పాపములను పొందుము.
సనత్కుమార ఉవాచ- సనత్కుమారుడిట్లనెను-
ఓ రాజేంద్ర నీ కీర్తిని నీవు రక్షించుకొనుము. వీపు దేవదానవులలో పింహమువంటివాడపు. జగద్ధాతయగు బ్రహ్మ గొప్పతనమును ఆలోచించుకొనుము.
సనాతన ఉవాచ- సనాతనుడిట్లనెను-
శుక్రుడా నిన్ను దేవేంద్రుడు బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలెవ్వరు జయింపలేదు. కృష్ణ భక్తుడవగు నిన్ను అతని చక్రము ఎల్లప్పుడు రక్షించుచున్నందువలన వీపు గొప్ప పుణ్యము సంపాదించుకొంటివి, మరియు పవిత్రుడవైతివనీ సనాతనముని యనెను.
సనందన ఉవాచ- సనందునుడిట్లనెను-
శుక్రుడా! ప్రకృతికంటే ఉన్నతుడైన శ్రీకృష్ణపరమాత్మ నీకు ఆభీష్టదేవత. నీవు వైష్ణవుడవు నీగురువు వైష్ణవుడు. అట్టి నిన్ను ఎవరు జయింతురని అనెను.
సనక ఉవాచ- సనకముని ఇట్లనెను-
పుణ్యవంతుని ఎవ్వరును జయింపరు. పాపాత్ముడు తన పాపములచేతనే జయింపబడుచున్నాడు. అందువలననే పుణ్యదీపమును ఎట్టి దుష్టపాయువు ఆర్పలేదు అని అనెను.
ఋషయ ఊచు- ఋషులందరు ఇట్లనిరి-
శ్రేష్ఠుడా! గురువగు బృహస్పతికి చంద్రుడు తన ప్రాణములకంటే మిన్నగా చూచుకొనుచున్న తారాదేవిని ఇచ్చి వేయుము. దానివలన నీ కీర్తి స్థిరముగా ఉండగలదు. కావున నిన్ను మాటిమాటికి తారనిమ్మని ప్రార్థింతుమని అనిరి.
ప్రహ్లాద ఉవాచ- ప్రహ్లాదుడిట్లనెను-
నాకు ఆధీశ్వరులైన మీరు సాక్షాత్తుగా ఎదురున ఉండగా భృత్యుడు అతనిముందు వినయవిధేయతలతో ఉండవలసినదే. మాకు నాథుడు గురువైన శుక్రుడు మీ పనిని చేయును. శిష్యులు ఎంత పెద్ద పదవిలో ఉన్నను వారు సాధుపురుషులైనచో వారికి గురువే ఈశ్వరుడగుచున్నాడు. మేము మా గురువగు శుక్రునకు మా సమసైశ్వర్యమును పూర్వమే సమర్పించుకొంటిమి. మా గురువునకు మేము భృత్యులము, పరిచారకులము. గురువుయొక్క ఆజ్ఞను పరిపాలించినవారే శిష్యులుకదా అని అనెను.
ప్రహ్లాదునియొక్క మాటలు విని బ్రహ్మదేవుడు తిరిగి శుక్రుని తారనిమ్మని ప్రార్థించెను. అందువలన శుక్రుడు తొరను బ్రహ్మదేవునకిచ్చి అతని పాదములకు నమస్కరించెను. అట్లే అచ్చటకు వచ్చిన మునులకందరకు ప్రత్యేక ప్రత్యేకముగా నమస్కరించి తన గృహమునకు తిరిగిపోయెను. అట్లే ప్రహ్లాదుడు తన అనుచరులందరతో కలిసి బ్రహ్మదేవుని పాదములకు, మరియు మునులకందరకు నమస్కరించి తమ గృహములకు తీరీగిపోయిరి.
బ్రహ్మదేవుని పాదములపై సిగ్గుతో తలవంచుకొని పొరపడెను. ఆమె ఆప్పుడు గర్భవతి. ఆట్లే చంద్రుడు కూడ బ్రహ్మదేవునకు నమస్కరింపగా అతనిని తన మాయచే దగ్గరకు తీసికొనెను, తరువాత కృపామయుడైన ఆ బ్రహ్మదేవుడు ఆపవిత్రమైనందువలన భయపడుచున్న తారతో ఇట్లనెను.
తారా! నేనుండగా నీవు భయపడవలసిన పనిలేదు. అందువలన భయమును వదలిపెట్టుము. సావరము వలన నీవు నీ భర్తయొక్క అనురాగ సౌభాగ్యములను తిరిగి పొందుదువు. దుర్భలయైన స్త్రీని బలవంతుడైన పురుషుడు బలాత్కరించినచో ఆమెకు కామము లేని పక్షమున పతీత కానేరదు. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారమువలన తిరిగి పవిత్రురాలగును. ఆమెకు జార దోషమంటదు.
కానీ కామముతో తన సుఖమునభిలషించి వ్యభిచారము చేసినచో ఆమెను భర్త వదిలి పెట్టవలెను. ఆమె ప్రాయశ్చిత్త సంస్కారమువలన పవిత్రురాలు కాజాలదు. పైగా ఆమె కుంభీపాక నరకమున సూర్యచంద్రులున్నంతవరకు బాధలు పడుచుండును. ఆచ్చట ఆ పాపాత్మురాలు మలమునే ఆన్నముగా మూత్రమునే జలముగా తీసికొనీ బ్రతుకును.
తల్లీ! నీ గర్భమేనరివలన కలిగినదో చెప్పుము. నీవు సిగ్గును వదలి పెట్టి ఈ విషయము చెప్పుము. సమస్తము ప్రాక్తన కర్మవలన జరుగుచున్నది. దీనికి మనము కర్తలము కాజాలమను బ్రహ్మదేవుని మాటలు విని తార ఇట్లు పలికెను.
ఓ తండ్రీ! ఈ గర్భము నాకు చంద్రునివలన కలిగినది. నేను పూర్వము చేసికొనిన పాపకర్మవలన దీనిని మోయుచున్నాను. చెడు భావనతో దయలేకుండ చంద్రుడు నన్ను బలాత్కరించిన విషయమునకు సాక్షులు కూడ కలరు అనెను.
తరువాత తార బంగారువంటకాంతిగల కుమారుని కనెను.
బ్రహ్మ తేజో విరాజితుడు సుందరుడగు కుమారుని తీసికొని బ్రహ్మదేవునకు నమస్కరించి చంద్రుడు తన ఇంటికి పోయెను. బ్రహ్మదేవుడు సాధ్వీయగు ఊరను బృహస్పతికిచ్చి తాను సింధూనదీ తీరముననున్న స్వభవనమునకు పోయెను. ఆతడు అచ్చటనున్న శంకరునకు ధర్మదేవతకు ఆశీస్సుల నొసగెను, దేవతలకు అభయమునొసగెను.
ఆటుపిమ్మట దేవతలు, తమ తమ భవనములకు పోయిరి.
దేవగురువగు బృహస్పతి తన మనసెరిగి ప్రవర్తించు భార్యయగు తార లభించినందువలన సంతోషపడి తన భవనమునకు పోయెను.
తారయొక్క గర్భమున పుట్టిన వాడే బుధుడు. అతడు మహాతేజస్సంపన్నుడు. గ్రహములలో శ్రేష్ఠుడు. ఆ చంద్రపుత్రుడు నిర్జనమైన నందనవనములో తిరుగుచుండెను. అప్పుడచటికి కుబేరునకు ఘృతాచియను అప్పరకు పుట్టిన చిత్రయను నవయౌవనాంగి వచ్చెను. పదునారు సంవత్సరముల ప్రాయముగల ఆ చిత్రను బుధుడు గాంధర్వ వివాహమున స్వీకరించెను.
బుధునకు చిత్రకు చైత్రుడను వాడు పుట్టెను. అతడు చక్రవర్తి ధార్మికుడై సప్త ద్వీపములు కల భూమినంతయు పరిపాలించెను.
అతడు ప్రతిదినము నదులుగాపారు నెయ్యితో, నదులుగా ప్రవహించు పెరుగుతో, పాలతో, తేనెతో, నూనెతో, చక్కెరరాశులతో, మిష్యానము, స్వస్తికముల రాశులతో, అపూపములతో మంచి అన్నముతో బ్రాహ్మణులకు సంతర్పణలు చేయుచుండెను. వారికి భోజనానంతరము గోవులు, రత్నములు, మణులు. బంగారు నాణెములు, సన్నని వస్త్రములు.
రత్న భూషణములు, రత్నపాత్రలు తాను జీవించియున్నంతవరకు దానము చేసెను.
ఆ చైత్రమహారాజునకు ఆధీరథుడనువాడు పుట్టెను. అతని పుత్రుడు సురడుడు. అతడు మేధోమునివలన అధికమైన జ్ఞానమును పొంది శరత్కాలమున దుర్గాదేవి పూజను చేసెను. కళింగదేశమున విరాధుడను వైశ్య, శ్రేష్ఠుడుండెను. అతని పుత్రుడు మహాజ్ఞాని, మహాయోగి, పరమ వైష్ణవుడైన ద్రుమిణుడు. అతడు పుష్కరక్షేత్రమున తపస్సు చేసి మహాజ్ఞాని, వైష్ణవాగ్రణియగు సమాధియను పుత్రునిబడసెను. అతడు ప్రతిదినము బ్రాహ్మణులకు కోటి సువర్ణములు దానము చేయుచుండెను. అందువలన దుష్టులైన ఆతని పుత్రులు ఇంటినుండి వెడలగొట్టిరి. సురధుడను రాజు, సమాధీయను వైశ్యుడు కలిసి విష్ణుమాయయగు దుర్గాదేవిని ఆరాధించగా సమాధి ముక్తిని పొందెను. సురథుడు సనాతనియగు దుర్గాదేవిని ఆరాధించి రాజ్యమును ముక్తిని పొందెను, చివరకతడు మనువయ్యెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వీతీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే గురోస్తారా ప్రాప్తి బుధోత్పత్యాది వర్ణనం నామ ఏకషష్టితమోధ్యాయః॥
శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్లోపాఖ్యానమున గురువునకు తారాప్రాప్తి, బుధుని జననము మొదలగు విషయములున్న అరవై ఒకటవ అధ్యాయము సమాప్తము.
