2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
3 - విశ్వ బ్రహాండముల వర్ణన
శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-
స్త్రీ రూపిణియైన శ్రీకృష్ణశక్తిచే నీటిలో వదలి పెట్టబడిన అండము ఆ జలములో బ్రహ్మయొక్క నూరు సంవత్సరాల వరకుండెమ. ఆ తరువాత అది రెండు రూపముల పొందినది. అందొకటి అండాకారముననే ఉండగా రెండవది శిశురూపము చెందినది. శతకోటి సూర్యకాంతులలో ప్రకాశించు ఆ శిశువు ఆకలితో బాధ చెంది ఏడ్చుచుండెను. తల్లి తండ్రులచే వదలిపెట్టబడిన ఆ శిశువు నీటిలోపల ఆశయము లేక అనాథపలే పైకి చూచాను. అనేక బ్రహ్మాండనాయకుడు. స్థూలమైన వాటికంటే మిక్కిలి స్టూలమైనవాడు ఆగు ఆ శిశువును మహావీరాట్ అనీ పిలుతురు. ఆతడు శ్రీ కృష్ణ పరమాత్మ తేజస్సులో పదుపార భాగము. ఆసంఖ్యాకమైన విశ్వములకతడు ఆధారభూతుడు. అతనినీ మహావిష్ణువని కూడ అందురు. ఆతని రోమ కూపములయందు సమస్త విశ్వములున్నవి. అసంఖ్యాకమైన ఆ విశ్వముల సంఖ్యను శ్రీ కృష్ణుడు కూడ చెప్పలేడు. రేణువుల సంఖ్యనైనా చెప్పవచ్చును గాని విశ్వముల సంఖ్యను మాత్రము చెప్పలేము. ఆట్టే ఆయా విశ్వములందున్న బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల సంఖ్యను కూడా చెప్పలేము. ప్రతి విశ్వమునందు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలున్నారు.
పాతాళలోకమునుండి బ్రహ్మలోకము వరకున్న దానిని బ్రహ్మాండముగా పేర్కొనుచున్నారు.
బ్రహ్మాండము కన్న భిన్నముగా దానికి పై భాగముననున్నది. వైకుంఠము. ఆ వైకుంఠము నారాయణుని వలె నిత్యమైనది, సత్యమైనది. వైకుంఠమున కంటె ఏబదికోట్ల యోజనముల పైన గోలోకము కలదు. ఆది శ్రీకృష్ణదేవునీవలె నిత్యమైనది, సత్యమైనది.
భూమి ఏడు ద్వీపములతో, సప్తసాగరములతో, నలుబది తొమ్మిది ఉపద్వీపములతో అసంఖ్యాకమైన అడవులతో ఉన్నది. దానికి పైన బ్రహ్మలోకముతో నున్న ఏడు సువర్లోకములున్నవి. ఈ భూమికింద ఏడు పాతాళ లోకములున్నవి. ఈ విధముగా సువరాది సప్తలోకములు పాల్గోళాది సప్తలోకములతోనున్న భూమి బ్రహ్మాండమనమడును.
భూమికి పై భాగమున భూకము, భువర్లోకము, స్వర్లోకము, మహార్లోకము, ఆతరువాత జనోలోకము, అటుపిమ్మట తపోలోకము, దాని పైన సత్యలోకము, సత్యలోకము పైన మేలిమి బంగారముచే నిర్మింపబడిన బ్రహ్మలోకము కలవు. ఈలోకములన్నియు కృత్రిమమైనవి. అశాశ్వతమైనవి. ఈ విశ్వములన్నియు నీటి బుడగలవలె అశాశ్వతమైనవి.
కాని గోలోక వైకుంఠలోకములు మాత్రము సత్యమైనవి. శాశ్వతమైనవి, ఆకృత్రిమమైనవి.
విరాట్పురుషుని యొక్క ప్రతి రోమ కూపమందు బ్రహ్మాండమున్నది. ఈ బ్రహ్మాండములయొక్క సంఖ్య శ్రీ కృష్ణపరమాత్మకే తెలియదన్నచో ఇతరుల కేవరికి తెలియును?
ప్రతి బ్రహ్మాండమున ప్రత్యేకముగా బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ముప్పది కోట్ల సురలు, దిక్పాలకులు, నక్షత్రములు, గ్రహాదులు కలవు. భూమిపై నాల్గు వర్ణముల జనులున్నారు. భూమిక్రింద నాగులు చరాచర జగత్తు కలదు.
కొంతకాలమునకా విరాట్పురుషుడు పైకి మాటి మాటికి చూచుచు ఇంకొక శిశువును కాని, ఇతరమైన వస్తువును గానీ చూడక చింతగలవాడై ఆకలితో చాలాసేపు ఏడ్చెను.
కొంతకాలమునకు జ్ఞానము బడసి పరమపురుషుడైన శ్రీకృష్ణుని తన మనసులో ధ్యానించుకొనెను. అందువలన పరబ్రహ్మ స్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, రెండు భుజములు కలవాడు, పీతాంబరసుశోభితుడు, చేతిలో మురళీ కలవాడు, భక్తులననుగ్రహించువాడగు శ్రీకృష్ణుడు దర్శనమొసగెను.
విరాట్పురుషుడు పరమేశ్వరుడు, ఆత్మజనకుడైన ఆ శ్రీకృష్ణుని చూచి నవ్వి అవేక విధములుగా స్తుతించెను. అందువలన ఆ పరమేశ్వరుడు సంతోషించి ఆకలి దప్పులు లేక నావలేనే జ్ఞాన యుక్తుడవు కమ్మని, నిష్కాముడవై, నిర్భయుడవై ఆందరకు వరములను ఇచ్చుచు, లయకాలమువరకు అసంఖ్యాకమైన బ్రహ్మాండములకు నిలయము కమ్మని ఆ బాలకునకు వరమిచ్చెను.
విరాడ్రూపుడైన బాలకునకు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వరమిచ్చి, అతని కుడిచెవిలో వేదాంగము, మిక్కిలి శ్రేష్టమైన షడక్షరీ మంత్రమును మూడు మార్లు ఉచ్చరించెను. ఓంకారముతో ప్రారంభమై చతుర్థ్యంతమైన కృష్ణ శబ్దము కలిగి స్వాహాకారాంతమైన ఓం కృష్ణాయ స్వాహా అను మంత్రము అన్ని విఘ్నముల తొలగించును.
ఆమంత్రమునుపదేశించి పరమాత్మ ఆ బాలున కాహారమును కల్పించెను.
ప్రతి విశ్వమున వైష్ణవులైనవారు పరమాత్మకు నైవేద్యమిడుదురు. దానిలో పదునారవ భాగము విష్ణువునకు చెందగా మిగిలిన పదునైదులుభాగము శ్రీకృష్ణునకు చెందును.
నిర్గుణుడు, సర్వపరిపూర్ణుడైన శ్రీకృష్ణునకు నైవేద్యముయొక్క అవసరము లేకున్నను, భక్తుడు ఇచ్చిన నైవేద్యమును స్వీకరించి తన చల్లని దృష్టితో ఆ భక్తునకు మరల అన్ని సంపదలు కలుగునట్లు చేయును.
శ్రీ కృష్ణుడా బాలకునకు మంత్రమును, వరమును ఇచ్చి ఇంకను మీకు కావలసిన దేదియైన ఉన్నచో అడుగుమని, దానిని సంతోషముతో ఇత్తునని పేర్కొనెను.
శ్రీకృష్ణుని పలుకులు విని దంతములు సహితము రాని బాలకుడైన మహావీరాట్పురుషుడు సమయోచితముగా ఇట్లు పలికెను.
మహావీరాడువాచ- మహావిరాట్పురుషుడిట్లనెను-
భగవన్! నేను బ్రతికి యుండునంతవరకు ఎల్లప్పుడు నీ పాదపద్మములపై భక్తియుండునట్లు నన్ననుగ్రహింపుము. నీభక్తి కలవాడు ఈ లోకమున బ్రతికియున్నను మోక్షమందినవాడు, నీభక్తిలేని మూర్ఖుడు బ్రతికియున్నను చనిపోయినవానితో సమామడు. వీభక్తిలేనిచో జపించినను తపస్సు చేసినను, యాగములు చేసినమ, ప్రతములాచరించినను, ఉపవాసములు చేసినను, పుణ్య తీర్ధములు సేవించినను ఫలితముండదు.
శరీరమున ఆత్మ ఉండునంతవరకే మానవుడు శక్తి కలిగి యుండును. ఆ ఆత్మ శరీరమునుండి దూరమైనచో ఆ శక్తులేవి పనికిరావు.
ఆట్టి పరమాత్మవైన నీవు ప్రకృతి కంటె శ్రేష్ఠుడవు. స్వేచ్ఛామయుడవు. పరబ్రహ్మవు. జ్యోతి స్వరూపుడవు. సనాతనుడవు.
ఈ విధముగా మహావిరాడ్రూపుడైన బాలకుడు పలుకగా శ్రీకృష్ణుడు చెవులకింపు కలిగించునట్లు మధురముగా ఇట్లు పలికెమ.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-
బాలకా! నావలె నీవుమ చాలాకాలము స్థిరముగా మండుము. ఆసంఖ్యాకులైన బ్రహ్మదేవులు గతించినను వీకు మాత్రము మరణమురాదు. ప్రతి బ్రహ్మాండమున ఏ అంశచేత విరాట్ స్వరూపుడవుగా కమ్ము, వీయొక్క నాభిపద్మమున వ్వీములను సృష్టించు బ్రహ్మదేవుడు ఉద్భవించును. బ్రహ్మదేవుని లలాటమున శివాంశవలన సృష్టిస్థితికై పదకొండుగురు రుద్రులు ఉద్భవింతురు. ఆ రుద్రులలో సంహారకుడైన కాలాగ్ని రుద్రుడొకడు. నీయొక్క అతి తక్కువనైవ ఆంశవలన లోకరక్షకుడైన విష్ణువు ఉద్భవించును.
నాయొక్క వరమువలన ఎల్లప్పుడు నా భక్తి కలిగి యుందువు. ధ్యానమున నన్ను ఎల్లప్పుడు చూడగలప్పు, అట్లే నా వక్షస్థలముపై నున్న నీ తల్లిని కూడా ధ్యానమున చూడగలవు. ఇక నేను పోయివత్తునని చెప్పి ఆ శ్రీకృష్ణపరమాత్మ అంతర్ధావము చెందెను.
శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకమునకు వెళ్ళి విశ్వసష్ట యగు బ్రహ్మతో, విశ్వ సంహారకుడైన శంకరునితో ఇట్లు పలికను.
శ్రీకృష్ణ ఉవాచ- శ్రీ కృష్ణుడిట్లనెను-
బ్రహ్మదేవా! నీవు మహావీరాట్ స్వరూపుని యొక్క రోమకూపమునందున్న, చిన్నవి విరాడ్రూపముయొక్క వాలి పద్మమున పుట్టి సృష్టిని చేయుటకై వెళ్ళుము. అట్లే మహాదేవుడా వీపు స్వయముగా అంతులేని తపమాచరించి విరాడ్రూపుని అంశవలన బ్రహ్మదేవుని పాలభాగమునండి జన్మనెత్తుము.
ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ శిపులతో మాట్లాడి వారి నమస్కారములను స్వీకరించి గోలోకమునకు వెళ్ళను.
మహావిరాట్ స్వరూపుని యొక్క రోమకూపమునందలి బ్రహ్మాండమున గోళక జలమున విరాడంశతో చిన్న విరాట్ స్వరూపుడు ఉద్భవించెను. ఆ. చిన్ననైన విరాడ్రూపుడే శ్యామవర్ణముగలవాడు, యువకుడు, పీతాంబరుడు, జలతల్పముపై పరుండువాడు, విశ్వరూపియగు జనార్దనుడు. ఆతని నాభికమలమున కమలోద్భవుడైన బ్రహ్మదేవుడు జన్మించెను. బ్రహ్మదేవుడు పుట్టిన తరువాత తాను పుట్టిన కమల వాళమున లక్షయుగములు తిరిగెను. ఐనను పద్మనాభుని నాభికమల నాళముయొక్క ఆంతుమ మాత్రమతడు చూడలేకపోయెను. అందువలన నతడు మిక్కిలి చింతించి, తిరిగి స్వస్థానమును చేరి, శ్రీకృష్ణుని పాదపంకజములనతడు ధ్యానించెను.
ఆ ధ్యానప్రభావమువలన దీవ్యచక్షువులను పొంది వాటిలో క్షుద్ర. (చిన్న) విరాడ్రూపునీ జలతల్పమున పడుకొనియున్న జనార్దనువి, ఆతవి రోము కూపములందున్న బ్రహ్మాండమును, తరువాత గోలోకముమ, గోపగోపికలలోనున్న పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని చూచి అతనిని స్తుతించి ఆతవి అనుగ్రహము పొందీ, పృష్టిని ప్రారంభించెను. ఆ బ్రహ్మకు మానసపుత్రులగు పనకాది మహర్షులుదయించిరి.
తరువాత అతని నోటినుండి శ్రీవాంశకలిగిన ఏకాదశరుద్రులు ఉదయించిరి.
క్షుద్ర విరాడ్రూపుని యొక్క ఎడమ భాగమున లోకరక్షకుడైన విష్ణువు చతుర్భుజములతో శ్వేత ద్వీపనివాసుడుగా ఆవిర్భవించెను. ఆ క్షుద్రవిరాడ్రూపుని నాభిపద్మమున ఉద్భవించిన బ్రహ్మదేవుడు చరాచరసృష్టి సహితమైన త్రిలోకములను సృష్టించెను.
ఈవిధముగా మహావిరాట్ స్వరూపుని రోమకూపములయందు అనంత విశ్వములు ప్రతివిశ్వమున క్షుద్రవీరాట్ స్వరూపుడు బ్రహ్మ విష్ణు శివాది దేవతలుద్భవించిరి.
నారదా! ఈవిధముగా సుఖమును, మోక్షమును ఇచ్చు అనవరతమును తెలిపితిని. ఇంకను వీపు పైన దల్చుకొన్న దేదియైన ఉన్నచో తెలుపుము.
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవ దగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున చెప్పబడిన విశ్వబ్రహ్మాండముల వర్ణనమను మూడవ అధ్యాయము సమప్తము.
