2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
46 - మనసా దేవి పూజ, స్తోత్రాదులు
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
నారద! సామవేదమున చెప్పబడిన మనసాదేవియొక్క పూజావిధానమును ధ్యానమును, స్తోత్రమును నీవు వినుము.
మనసాదేవి తెల్లని చంపక పుష్పమువంటి రంగుకలది. రత్నాలంకారములు కలది, సర్పమునే యజ్ఞోపవీతముగా ధరించునది, బంగారువన్నె కల వస్త్రములు ధరించునది, గొప్పనైన జ్ఞానము కలదీ, సిద్ధస్వరూప, సిద్ధాదిష్టాన దేవత, ఇతరులకు సిద్దులను కలిగించునది.
అట్టి మనసాదేవిని నేనెల్లప్పుడు సేవింతును.
పై విధముగా మనసా దేవిని ధ్యానించి మూలమంత్రముతో పుష్పధూపదీప, అనులేపన, నైవేద్యాది షోడశోపచారములను చేయుచు ఆ దేవిని పూజింపవలెను.
మనసాదేవి మూలమంత్రము వేదములందు చెప్పబడినది. ఆది కల్పవృక్షము , వలె భక్తుల కోరికలనన్నిటిని తీర్చును. ఆ మంత్రము పన్నెండు అక్షరములు కలది.
“ఓం హ్రీం శ్రీం క్రీం ఐం మనసా దేవ్యై స్వాహా” అను ద్వాదశాక్షరమంత్రము మనసాదేవి మూలమంత్రము. దీనిని ఐదు లక్షల పర్యాయములు జపము చేసినచో మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్రసిద్ది కలిగినవాడే సిద్దుడు, అతనికి విషము అమృతముతో సమానమగును. అతడు ధన్వంతరివలె సర్పములవలన ఇతరులకు కలిగిన విషమును పోగొట్టును.
నారదమహర్షీ! ఆషాఢ సంక్రాంతినాడు పత్తిచెట్టునందు మనసాదేవిని ఆవాహనచేసి ఆ నెల చివరివరకు ఆమెను పూజించుచుండవలెను. మానస(నాగ) పంచమినాడు మనసాదేవికి బలినిచ్చినచో ధనవంతుడగును. పుత్రులు కలిగియుండును. కీర్తివంతుడగును.
నారదమహర్షీ! ఇంతవరకు నీకు మనసాదేవియొక్క పూజాపద్ధతిని చెప్పితిని. ఇక ఆ దేవి, చరిత్రను వినుము.
పూర్వము మానవులు సర్పములవలన బాధపడసాగిరి. అవి కరచినవారెల్ల చనిపోవసాగిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వేడుకొనగా కశ్యపమహర్షి సర్పభయమును తొలగించు మంత్రములను సృష్టించెను. అట్లే బ్రహ్మదేవుని ఆజ్ఞపై వేదమునందలి బీజాక్షరములననుసరించి నాగమంత్రములకు అధిష్టాన దేవతయగు మానసాదేవిని సృష్టించెను.
కశ్యప ప్రజాపతీయొక్క తపోబలమువలన మనస్సంకల్పముతో పుట్టినందువలన ఆమెను మనసాదేవినిరి. ఆ కన్య పుట్టగనే కైలాసపర్వతమునకేగి శంకరుని భక్తితో పూజించి స్తుతించెను, దీవ్యములైన నూరు సంవత్సరములు ఆ మహాదేవుని పూజించగా ఆతడు సంతోషించి ఆమెకు మిక్కిలి జ్ఞానమును ప్రసాదించి సామవేదమును నేర్పెను. అట్లే ఆ దేవికి కల్పతరువువంటి అష్టాక్షరాత్మకమైన కృష్ణమంత్రమునుపదేశించెను.
లక్ష్మీ బీజమగు "శ్రీం", మాయాబిజమగు "హీం", కామబీజమగు "క్లీం" అనువాటితో చతుర్థి విభక్ష్యంతమైన కృష్ణశబ్దముతో ఉన్నది (నమస్కార పదము ఆంతమున గలది) శ్రీకృష్ణమంత్రము.
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ (నమః) అనువది కృష్ణాష్టాక్షరీ మంత్రము. ఆ మంత్రముతోపాటు ముల్లోకములకు మేలును కలిగించు శ్రీకృష్ణ కవచమును పూజాక్రమమును, స్తోత్రమును, ధ్యానమును వేదములందు చెప్పబడిన శ్రీకృష్ణమంత్ర పురశ్చరణను శంకరునివల్ల మనసాదేవి పొందినది. అట్లే ఆమెకు పరమశివుడు మృత్యువును జయించు జ్ఞానమును కూడ ప్రసాదించెను.
ఆటుపిమ్మట మానసాదేవి శంకరుని ఆజ్ఞననుసరించి పుష్కర క్షేత్రమువకు. పోయి, అచ్చట శ్రీకృష్ణుని గురించి మూడు యుగములవరకు తపప్పుచేపి మంత్రసిద్ధిని పొంది కృష్ణ పరమాత్మ దర్శనము చేసికొన్నది.
శ్రీకృష్ణుడు తనముందు తపస్సు చేయుచు కృశించిపోయిన అవయవములు కల బాలికయగు మానసాదేవిని చూచీ దయాసముద్రుడైన నారాయణుడు తానే స్వయముగా ఆ మానసాదేవిని పూజించమ, తరువాత నీవు భూలోకమున పూజింపబడుదువని ఆమెకు వరమునిచ్చి ఆంతర్జానము చెందెను.
ఆ మానసాదేవినీ తొలుత పరమాత్మయగు శ్రీకృష్ణుడు పూజించగా, తరువాత శంకరుడు, ఆ తరువాత కశ్యపుడు, దేవతలు, మనువు, మునులు, సర్పములు, మానవులు మొదలగువారందరు పూజించిరి. ఈ విధముగా ఆ దేవి మూడు లోకములందు పూజలు పొందినది.
కశ్యప మహర్షి తన కన్యయగు మావతీదేవిని జరత్కారు మునీంద్రువకు యాచింపక పూర్వమే భార్యగా నివ్వగా ఆ మువి జరత్కారు దేవిని కశ్యప మహర్షి అజ్ఞవమసరించి స్వీకరించెను.
జరత్కారుమహర్షి జరత్కారువుమ వివాహము చేసికొని చాలా కాలము తపస్పును వదలివేసి పుష్కర క్షేత్రమున ఒకనాడు తన భార్య ఒడిలో పండుకొనెను. అప్పుడు నిద్రవచ్చుటచే నిద్రకు ఈశ్వరుడైన పరమాత్మను తలచుకొని నిద్రపోయేను. అప్పుడు సాయంకాలమయ్యెమ, ఆ సమయమువ పతివ్రతయైన మనసాదేవి ఇట్లు ఆలోచించాడు. బ్రాహ్మణుడు వీత్యకృత్యమైన పాయం సంధ్యము మరువరాదు. ఆ విధముగా చేసిన బ్రహ్మహత్యాపాతకమతనికంటును. ఉదయసంధ్యను సాయంసంధ్యమ చేయని ద్విజుడు ఎల్లప్పుడు ఆశుచీకాగలడు. అట్లే అతడు- బ్రహ్మహత్యాది పాపములను పొందును. ఇదీ వేదములలో చెప్పబడినది కావున ధర్మలోపము కలుగునని భయపడి జరత్కారుమునీవి విద్రలే పెను.
జరత్కారుముని లేచి నిద్రాభంగమునకు చాలా కోపగించెను.
జరత్కారురువాచ- జరత్కారుముని ఇట్లు పలికెను-
భర్తను కష్టపెట్టు క్రీ చేయు వ్రతములు, తపము, దానము మొదలగునవన్నియు వ్యర్థమగును. భర్తను పూజించినచో శ్రీకృష్ణుని పూజించినట్లగును. పతివ్రతలయొక్క ప్రతములు చక్కగా పూర్తియగుటకు భగవంతుడగు శ్రీహరి ప్రతిరూపమున ఉండును. సమస్తదానములు, సమస్త యజ్ఞములు, సమస్తతీర్థ సేవనము, సమస్త వ్రతములు, సమస్త ఉపవాసములు, సమస్త ధర్మములు, సమస్త దేవతలను పూజించుటలు. ఇవన్నియు భర్త పూషా ఫలితముప పదహారవ వంతు కాజాలవు.
పవిత్రమైన ఈ భారతవర్షమువ భర్త సేవను చక్కగా చేయు స్త్రీ భర్తతో కలపి శ్రీకృష్ణ పరబ్రహ్మను చేరుకోగలదు.
భర్తను కష్టపెట్టు దుష్టస్త్రీ కుంభీపాకనరకమున సూర్యచంద్రులున్నంతవరకుండును. ఆ తరువాత పుత్రులు లేక భర్త చనిపోయి బాధపడును.
జరత్కారుమహర్షి ఇట్లు కోపముతో పలుకుచుండగా సాధ్వియగు జరత్కారు (మనసాదేవి) భయపడి ఇట్లు పలికెను.
మనసోవాచ- మనసాదేవి ఇట్లు పలికెను-
చక్కగా వ్రతములను పరిపాలించు ఓనాథా! నీయొక్క సంధ్యావందనమువకు లోపము కలుగునవి వీకు విద్రాభంగము కలిగించితిని. దుష్టురాలైన నాద్వితీయ ఖండము - 46వ అధ్యాయము శాంతింపుము. శృంగారమునకు, ఆహారమునకు, నిద్రకు భంగము చేయువాడు, ఇంకను భర్తకు సంబంధించిన ఈ విషయములలో భంగము కలిగించు వ్యక్తి కాలసూత్రమనే నరకమునకు పోవును.
మనసాదేవి ఇట్లని తన భర్తయొక్క కాళ్ళపై భక్తితో ఏడ్చుచు పడెను.
జరత్కారుముని మనసాదేవి మాటలు విని ఆమెపై కోపమును వదిలి సూర్యుని శపింపబోను. అప్పుడు సూర్యుడు సంధ్యాదేవితో కలిపి అచ్చటకు స్వయముగా వచ్చి వినయముతో ఇట్లనెను.
శ్రీసూర్య ఉవాచ- శ్రీసూర్య భగవానుడిట్లనెను-
ఓ మహర్షీ! నేను అస్తమించితినని భావించి బ్రాహ్మణధర్మము లోపించునము భయముచే నీ భార్య నిన్ను లేపినది. కాని వీజముగా నేనస్తమీంపలేదు. అందువలన ఓ మహర్షీ నీవు నన్ను క్షమింపుము. నన్ను శపించుట నీకు తగదు, బ్రాహ్మణుల హృదయము వెన్నువలెనుండును. వారికి కోపము వచ్చినను ఆరక్షణము మాత్రమే ఉండును. లేనిచో ఈ ప్రపంచమే భస్మమగును. ద్విజాడు ఈ లోకమును భస్మము చేసి తిరిగి సృష్టింపగలడు. అట్టి తేజస్వీ ఎవ్వరు కారు. బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని వంశమున పుట్టి బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచు ప్రతిదినము సనాతనుడు వరంజ్యోతియగు శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించును.
సూర్యదేవుని మాటలకు జరత్కారు మహర్షి సంతృప్తి చెందినందువలన సూర్యుడు సంధ్యాదేవితో కలిసి స్వస్థానమునకు వెళ్ళిపోయెను.
జరత్కారు మహర్షి తన మనస్సు బాధపడుచున్నను తన మాట నిలబెట్టు కొమటకై దుఃఖముతో ఏడ్చుచున్న తన భార్యయగు మనసాదేవిని వదలి పెట్టెను.
మనసాదేవి ఈ ఆపత్సమయమున భయపడి తన గురువగు శంకరుని, ఇష్టదేవతయగు శ్రీహరిని, బ్రహ్మదేవుని, తండ్రియగు కశ్యపుని స్మరించుకోనగానే వారందరు మనసాదేవిని గూర్చీ చింతించుచు అచ్చటకు వచ్చిరి.
వారిని చూచి జరత్కారుమహర్షి ఆందరకు భక్తితో నమస్కరించి ఆగమన కారణమడిగెను. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరికి నమస్కరించి సమయోచితముగా ఇట్లు పలికెను.
జరత్కారు మహర్షి నీవు ధర్మముగా నడచుచున్న నీ ధర్మపత్నియగు మనసాదేవిని వదలి పెట్బ దలచినచో ధర్మమును రక్షించుటకై ఆమెయందు పుత్రుని కనుము. యతియైనను, బ్రహ్మచారియైనను, భిక్షుకుడైనను, చివరకు వానప్రస్థాశ్రమముననున్నను తన భార్యయందు కొడుకును కన్నతరువాతనే సన్యాసమును స్వీకరింపవలెను. .
తన భార్యయందు సంతానమును పొందక వైరాగ్యముతో భార్యను వదలి పెట్టినచో కాలువలో పడిపోవు నీటివలె అతని తపస్సు, పుణ్యము తొలగిపోవును.
బ్రహ్మదేవుని మాటలు విని జరత్కారుమహర్షి యోగబలముతో మంత్రములు జపించుచు జరత్కారుదేవియొక్క నాభిని ముట్టుకొనెను, అప్పుడు దేవతలందరు ఆ జరత్కారుదేవికి (మనసాదేవికి) శుభాశీస్సుల నొసగి సంతోషముతో వెళ్ళిపోయిరి. ఆందువలన మనసాదేవి సంతోషపడెను. జరత్కారు మహర్షికూడ సంతోషించెను.
నారదమునీ జరత్కారు మహర్షియొక్క చేయి తగులగనే మనసాదేవికి సద్యోగర్భమాయెమ. ఆప్పుడు ఆ ముని ఆమెతో : ఇట్లు పలికెను.
జరత్కారురువాచ- జరత్కారు మహర్షి ఇట్లు పలికెను-
ఓ మనసాదేవి! నీకు కలుగబోవు పుత్రుడు జితేంద్రియులలో శ్రేష్ఠుడు. ధర్మిష్ఠుడు, వైష్ణవులలో గొప్పవాడు, తేజస్వి, యశస్వి, తపస్వి. సుగుణములఖని, వేదజ్ఞానముకలవారిలో శ్రేష్ఠుడు కాగలడు. అతడు విష్ణుభక్తుడై పరమధార్మికుడై నీ వంశమును ఉద్దరించును. ఆ శిశువు పుట్టగనే పితృదేవతలు సంతోషముతో నృత్యము చేయుదురు.
ఆ శిశువు యొక్క తల్లివగు నీవు పతీవ్రతవు. మంచి శీలముకలదానవు, ప్రియురాలవు, ప్రియముగా మాట్లాడు దానవు, ఆట్లే నీవు ధర్మమార్గమున నడుచుచున్నదానివి, కులమును రక్షించుదానవు.
హరిభక్తిని కలిగించు వాడే బంధువు. ఆ హరిభక్తి సుఖమును కలిగించునది. ఆందరకు ఇష్టమైనది. సంసార బంధమును ఛేదించువాడు. హరిభక్తిని కలిగించువాడే తండ్రియగును. గర్భవాసమను దుఃఖమును తొలగించునదే తల్లియగును. విష్ణుభక్తిని కలిగించువాడు శ్రీహరి మంత్రమును ఉపదేశించువాడే గురువు కాగలడు. జ్ఞానమును కళించువాడే గురువు. జ్ఞానమనగా శ్రీకృష్ణునీ ధ్యానముచేయుటయే. బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంబమువరకున్న ఈ చరాచర జగత్తు ఆ శ్రీకృష్ణుని వలననే పుట్టుచున్నది. నశించుచున్నది. అందువలన ఆ శ్రీకృష్ణునకు సంబంధించినదే జ్ఞానము. ఇతరమైనదీ జ్ఞానము కాజాలదు. శ్రీహరి సేవనమే పరమార్థమైన జ్ఞానము. ఆది వేదసారమై, యోగసారమైయున్నది. అన్ని తత్వములకు ఆది సారముగా కన్పించును.
ఇట్టి శ్రీహరి సేవనమనే జ్ఞానమును నీకు ఇచ్చితిని. భర్తయైనవాడు పరమాత్మ జ్ఞానమును కలిగించవలెను. సంసార బంధమును కలిగించువాడు శత్రువు. విష్ణుభక్తిని కలిగించు జ్ఞానమిచ్చువాడే గురువు అట్లే సంసారబంధమునుండి విముక్తి కలిగించని గురువు శిష్యులకు అపకారముచేసిన వాడగును. అట్లే అతడు శత్రుతుల్యుడగుచున్నాడు. తల్లియొక్క గర్భవాస క్లేశమునుండి, నరకవాసమునుండి తప్పింపనివాడు, పరమానందరూపమైనది, శాశ్వతమైనది అగు శ్రీకృష్ణ మార్గమును చూపించనివాడు గురువు 'కాజాలడు, తండ్రి కాబోలడు, అట్లే బంధువు కాజాలడు.
అందువలన నీవు, బ్రహ్మ శ్రీహరులకంటె మిన్నయైనపాడు విర్గుణరూపుడు అగు శ్రీకృష్ణపరమాత్మను సేవింపుము. ఆతనిని సేవించినచో వీ పూర్వకర్మలన్నియు నిర్మూలనమగును.
ఓ ప్రియురాలా! నేను నిన్ను ఈ వ్యాజములో వదిలి పెట్టితినే తప్ప వీపై ప్రేమలేకకాదు. అందువలన వీపు నా తప్పును క్షమింపవలెను.
ఓర్సుకల స్త్రీలకు సత్వగుణమున్నందువలన వారికి కోపము సంభవింపదు. నేను పుష్కర క్షేత్రమున తపస్సుచేయుటకై పోపుచున్నాము. ఇచ్చట నున్నచో శ్రీకృష్ణ చరణాంభోజముననవ నాధ్యానము సడలిపోవచ్చుమ,
సాధారణముగా ప్రవృత్తి మార్గమున పోపు స్త్రీలకు ధనాదులపై ప్రేమ ఎక్కువగానుండును. కాని నిప్పుహులైనవారికి శ్రీకృష్ణుని పైననే భక్తియుండగలదు.
జరత్కారుమహర్షి మాటలు విని మనసాదేవి దుఃఖముతో కన్నీళ్ళు రాలగా వినయముగా అతనితో ఇట్లనెను.
మనసోవాచ-మనసాదేవి ఇట్లు పలికెను-
హే నాథ! నేను నీకు నిద్రాభంగము చేసితినన్న దోషముతో నన్ను వదిలి పెట్టితివి. ఆయినను నేను నిన్నెప్పుడు తలచుకొనిన ఆప్పుడు నీవు తప్పక రావలెను.
బంధువియోగముకన్న పుత్రవియోగము, దానికంటే పతివియోగము ప్రాణములు పోవు దానికంటెను బాధకలిగించును. పతివ్రతలగు స్త్రీలకు భర్త నూరుగురు కొడుకులకంటె ప్రియమైన వాడగుటచే అతనిని ప్రియుడందురు.
ఒకే పుత్రుడు కలవారికి ఆ పుత్రునివలె, విష్ణుభక్తులకు శంకరునివలె, దప్పిగొన్నవారికి నీటివల, ఆకలిగొన్నవారికి అన్నమువలె, కాముకులకు స్త్రీవలె, దొంగలకు ఇతరుల ధనమువలె, విద్వాంసులకు శాస్త్రమువలె, పరమ సాధ్వీమణులకు భర్త పైన ప్రేమయుండును,
ఈ విధముగా అని మనసాదేవీ భర్త పాదముల పై పడగా దయానిధియగు జరత్కారు మహర్షి ఆమెను క్షణకాలము తన ఒడిలోనికి తీసుకొనెను.
జరత్కారుమహర్షి తనభార్యయగు మనసాదేవిని ఒడిలోకి తీసికొని కన్నీరు కార్చెను. మనసాదేవి సైతము భర్తవియోగమునకు భయపడుచు ఏడ్చుచు భర్త ఒడిలోనికి చేరినది.
కొంతకాలమునకు వారిద్దరు శ్రీకృష్ణపరమాత్మను మాటిమాటికీ జ్ఞాపకము చేసికొనుచు శోకమును వదలి పెట్టిరి. జరత్కారుముని భార్యను చక్కగా ఓదార్చి తపస్సుచేసికొనుటకు వెళ్ళాను. మనసాదేవి తన గురువైన శంకరుడుండు కైలాసమునకు వెళ్ళినది. అచ్చట పార్వతీపరమేశ్వరులిద్దరు భర్భవియోగదు:ఖముతో కృశించి పోవుచున్న మనసాదేవిని ఊరడించిరి.
మనసాదేవి మంచిదినమున, మంచిముహూర్తమున నారాయణాంశ సంభూతుడు, జ్ఞానులకు యోగులకు గురువైన కుమారుని ప్రసవించెను. ఆ శిశువు తల్లి గర్భములో ఉండగానే పరమయోగియైన శంకరుని వలన మహాజ్ఞానమును పొంది తరువాత అతడు మహాయోగిగా, యోగులలో జ్ఞానవంతులలో శ్రేష్టుడుగా మారిను.
శంకరుడా శిశువునకు జాతక కర్మాది విధులను చేసి పుణ్యాహ మంగళమును చేసెను. అట్లే శిశువునకు శుభము కలుగవలెనని వేదములు చదివించెను. బ్రాహ్మణులకు అనేక రత్నములను దానముచేసెను. పార్వతీదేవి సహితము అనేక గోవులను, రత్నములను బ్రాహ్మణులకు దానము చేసెను. దినదిన ప్రవర్ధమానుడగుచున్న ఆ కుమారునకు శివుడు వేదములను, వేదాంగములను, ఇతరవిషయములను, మృత్యువును జయించు తత్వజ్ఞానమును ఉపదేశించెను.
మనసాదేవి భర్త ఆమెను వదలి పెట్టినను ఆతని పైన, ఆమెకభీష్ట దేవతయగు శ్రీహరి పైన, ఆమె గురువగు శంకరుని పైన అపారమైన భక్తియున్నందువలన ఆమె పుత్రునకు ఆస్తీకుడను పేరు వచ్చినది.
ఆ బాలుడు శంకరుని ఆజ్ఞపై విష్ణువునుగూర్చి తపస్సు చేయుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మూడులక్షల దివ్య సంవత్సరములు శ్రీమన్మహావిష్ణువును గూర్చి తపమాచరించి మహాయోగియై కైలాసమునకు వచ్చి శివుని నమస్కరించెను.
మనసాదేవి శంకరుని వద్ద అనుజ్ఞతీసికొని తన పుత్రునివెంట పెట్టుకొని తండ్రియగు కశ్యప ప్రజాపతి ఆశ్రమమునకు వచ్చినది. కశ్యప ప్రజాపతి తనకూతురును, మనుమని చూచి అమితానందమునొంది బ్రాహ్మణులకు అంతులేని దానములు చేసెను. ఆటే ఆ బాలునికి శుభము కలుగుటకై బ్రాహ్మణుల కందరికి అన్నదానము చేసెను. మనసాదేవిని, ఆమె పుత్రుడైన ఆస్తీకమునిని చూచీ దితి, అదితి మొదలగు కశ్యపుని భార్యలందరు సంతోషపడిరి. ఈ విధముగా మనసాదేవి తండ్రి దగ్గర తనపుత్రునితో కాలము గడపుచుండెను.
నారదమహర్షికి మనసాదేవి కథను నీకు తరువాత వినిపించెదను. ప్రస్తుతము నేను చెప్పుదానిని వినుము.
ఒకప్పుడు కౌరవ వంశమున పుట్టిన అభిమన్యునీ పుత్రుడైన పరీక్షిత్తునకు దురదృష్టము వలన శమీకముని పుత్రుడైన శృంగిముని ఏడు దినములలో నిన్ను తక్షకుడు చంపుననీ శాపమునిచ్చెను. పరీక్షిన్మహారాజావిషయమును తెలుసుకొని గంగానదీ తీరమునకు పోయి, ఆ ఏడు దినములలో ధర్మసంహితయగు భాగవతమును వినుచుండెను.
ఏడు దినములు గడిచిన పిమ్మట ఆ పరీక్షిత్తును కాటువేయదలచి తక్షకుడు పోవుచుండగా వైద్యులలో మిక్కిలి షుడైన ధన్వంతరి మహారాజును తక్షక వీషమునుండి కాపాడుటకు పోవుచుండెను. మార్గమధ్యమున తక్షకునకు ధన్వంతరికి మధ్య మాటలు స్నేహపూర్వకముగా జరిగినవి. అప్పుడు తక్షకుడు ధన్వంతరికీ అమూల్యమైన మణిని ఇచ్చి పంపించెను. ఆ తరువాత తక్షకుడు మంచెపైనున్న మహారాజును కాటువేసెను. అందువలన పరీక్షిన్మహారాజు శ్రీహరినీ మాటిమాటికి స్మరించుచు చనిపోయెను, అతని పుత్రుడగు జనమేజయుడు తండ్రికి పితృ సంస్కారములనన్నిటిని కావించెను.
జనమేజయ మహారాజు సర్పముల పైగల కోపముచే సర్పయజ్ఞమును తలపెట్టెను. ఆ యజ్ఞమున సర్పములన్నియు తండోపతండములుగా వచ్చి చనిపోవుచుండెను.
ఆందువలన తక్షకుడు భయముతో మహేంద్రుని శరణువేడగా దానిని గమనించిన బ్రాహ్మణవర్గము మహేంద్రునితో కలిపి తక్షకుని యాగమున సంహరించుటకు ప్రయత్నించినది. అందువలన దేవతలు మునులు భయపడి మనసాదేవి దగ్గరకు వచ్చి ఆమెను స్తుతించిరి. అప్పుడు మనసాదేవి పుత్రుడైన ఆస్తీకుడు తల్లి ఆజ్ఞననుసరించి యజ్ఞవాటికకు వచ్చి మహారాజగు జనమేజయుని తక్షకుడు, మహేంద్రుల ప్రాణములను కాపాడుమనీ అడిగెను.
జనమేజయుడు తన యజ్ఞ నిర్వాహకులైన ఋత్విక్కుల అనుజ్ఞపై ఆస్తీకుడు కోరిన వరమునిచ్చెను. ఆ తరువాత యజ్ఞమును పూర్తిచేసి బ్రాహ్మణులందరకు దక్షిణలొసగెను.
మనసాదేవి చేసిన సహాయమునకు సంతుష్టులైన దేవతలు, మునులు, మానవులందరు మనసాదేవి దగ్గరకు వెళ్ళి ఆమెను మిక్కిలి గౌరవముతో పూజించిరి. దేవేంద్రుడు ఆదరములో షోడశోపచారములలో మనసాదేవిని స్తోత్రము చేసి పూజించెను అటు పిమ్మట వారందరు తమతమ ఇండ్లకు పోయిరి.
నారదమునీ! ఇంతవరకు మనసాదేవి చరిత్రను నీకు చెప్పితిని. ఇంకను నీవు వినదలచినదేదైన ఉన్నచో ఆడుగుమని నారాయణుడనెను.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
నారాయణమునీ! దేవేంద్రుడు మనసాదేవిని ఏ స్తోత్రముచే స్తుతించెనో ఏవిధముగా పూజించెనో నాకు వివరముగా తెలుపుడు.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
దేవేంద్రుడు చక్కగా స్నానముచేసి శుచియై ఉదీకిన వస్త్రములు ధరించీ భక్తితో మనసాదేవిని పూజించెను. ఆమెను రత్నసింహాసనమున ఉంచీ రత్నకుంభమున నున్న ఆకాశగంగ యొక్క జలముచే ఆ దేవినీ మంత్రపూర్వకముగా అభిషేకించేను. తరువాత పరిశుద్ధమైన వస్త్రముల వా దేవికి ఆతడు సమర్పించుకొనెను. ఆ దేవి శరీరంమంతట చందనమునద్దీ భక్తితో అర్ఘ్య పాద్యాదికములనిచ్చెను. .
తొలుత గణపతిని, సూర్యునీ, అగ్నినీ, విష్ణువును, శివుని, దుర్గను, ఈ ఆరుగురు దేవతలను పూజించి ఓం హీం శ్రీం మనసా దేవ్యై స్వాహా యను దశాక్షరమంత్రముతో 'షోడశోపచారములను సమర్పించెను. తరువాత అనేక విధములైన వాద్యములను మ్రోగించెను. అప్పుడు మనసాదేవి పై పుష్పవర్షము కురిసినది. ఆ తరువాత బ్రాహ్మణులు త్రిమూర్తుల ఆజ్ఞ గైకొని కన్నీళ్ళు ప్రవీంచగా మనసాదేవిని ఇట్లు స్తుతించెను.
మహేంద్ర ఉవాచ- మహేంద్రుడిట్లనెను-
ఓ మనసాదేవి! పతివ్రతలలో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపవలెనని అనుకొనుచున్నాను. పరాత్పరవు పరమస్వరూపనగు నిన్ను ఇప్పుడు స్తుతింపలేను.
వేదములలో స్తోత్రలక్షణము స్వభావమును తెలుపుట అని వివరించబడినది. కానీ ఓ దేవి ,నీ గుణములను నేను చెప్పలేను. నీవు శుద్ధ సత్వ గుణస్వరూపవు, హింస, కోపాది దుర్గుణములు లేని దానవు, అందువలననే జరత్కారుముని నిన్ను ఆకారణముగ వదలి పెట్టినపుడు అతనిని శపింపక వదలిపెట్టితివి.
నేమ నా తల్లిగు అదితిదేవి వలె నిన్ను పూజింతుము. దయారూపిణివేన సోదరివలె క్షమారూపయగు తల్లివలె వీపు నా ప్రాణములను, నా భార్యా పిల్లలను రక్షించితివి, నీవు ఈ లోకమున అందరిచే పూజలనందుకొనుచున్నమ నిన్ను పూజించవలెవను కోరిక నాలో పెరుగుచున్నది. నిన్ను అందరు పూజించునట్లు ప్రచారము చేయుదును.
నిన్ను ఆషాఢ సంక్రాంతినాడు, మనసా పంచమినాడు (నాగపంచమి) లేక అమావాస్యనాడు కాక ప్రతిదినము భక్తితో నిన్ను పూజించువారికి పుత్ర పౌత్రాభివృద్ధి, ధనాభివృద్ధి జరుగుమ. నిన్ను పూజించువారు యశసు, విద్య, గుణములు కలియుందురు.
విన్ను పూజింపక పోయినను, అజ్ఞానమున నిందించినను వారు లక్ష్మీహీనులగుదురు. వారికెల్లప్పుడు సర్పభయము కలుగును.
నీవు స్వర్గమున స్వర్గలక్ష్మిగా, వైకుంఠమున లక్ష్మీదేవిగా పేరు పొందినావు. జరత్కారు మునీశ్వరుడు నారాయణాంశుడు కాపున లక్ష్మీదేవి అంశమగునీవు అతని భార్యవైతివి.
సీతండ్రి మమ్ము రక్షించుటకై తన తపస్పును తేజస్సును వెచ్చించి తన మనసుంకల్పముచేతనే విన్ను సృష్టించెను. అందువలన నీవు మనసాదేవి ప్రతీతి. సిద్ధయోగినివగు నీవు నీ మనోబలముచే అంతట తిరుగు శక్తి కలదావవగుటవలన నిన్ను మనసాదేవియనీర్. లేక దేవతలెల్లప్పుడు విన్ను మనస్సులో ధ్యానింతురు కావున మనసాదేవినైతివి. నీఎల్లప్పుడు సత్వగుణమును సేవించుటవలన సత్వ స్వరూపమైతివి.
ఇంద్రుడు మనసాదేవిని స్తుతించి సోదరియగు ఆమెను స్వర్గలోకమువమన్న తవ గృహమునకు తీసికొని వెళ్ళాను. ఆదేవి తండ్రిదగ్గర తన కుమారునితో కలిసి చాలాకాలముండెను. అచ్చట ఆమె సోదరులచే మన్ననలను పొందుచుండెను. అప్పుడు గోలోకమునుండి సురభి అచ్చటికి వచ్చి తన క్షీరములచే ఆ దేవికి స్నానముచేసి పూజించేమ. ఆమె అచ్చట అందరకు సహజముగా లభించని జ్ఞానమును ఉపదేశించెను.
ఆందువలన దేవతలా మనసాదేవిని పూజించుచు మరల స్వర్గలోకమునకు తీసికొనిపోయిరి.
పుణ్యమువకు కారణమైన ఈ స్తోత్రమును పూజించి చదువువారికి, వారి వంశపువారికి నాగభయమమనది ఉండదు. ఈ స్తోత్రమును ఐదులక్షల పర్యాయములు జపించినచో పొత్రము సిద్ధిపొందును. అప్పుడతనికి వీషము అమృతము పలెనగును. అతడు సర్పములపై పడుకొన్నమ, సర్పవాహమడైవమ విశ్చింతగా ఉండవచ్చును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునందలి రెండవదైన ప్రకృతిఖండమున పారద. వారాయణుల సంవాదసమయమున శిల్పబడిన మనసోపాఖ్యానమున మమపాదేవి పుట్టుక, ఆమె పూజూవత్రాదులు గల నలభై యారవ అధ్యాయము సమాప్తము.
