2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

17 - తులసీ శంఖచూడుల వృత్తాంతము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను-

బ్రహ్మదేవుడు శంఖచూడుని సంహారమునకై శిపుని వియోగించి తనలోకమునకు వెళ్ళాను. శంకరుడు దేవతలనుద్దరించుటకు చంద్రభాగానదీ తీరముననున్న మజచెట్టు నీడలో కూర్చుండి పుష్పదంతుడను గంధర్వుని శంఖచూడుని యొద్దకు దూతగా పంపించచెను.

ఆ శంఖచూడుని నగరము అమరావతికంటే గొప్పగా ఉండినది. అచ్చటి భవనములు కుబేరుని భవనముల కంటే మైనవి. ఆ నగరము ఐదు యోజనముల విస్తీర్ణముతో పదీయోజనములు పొడవుగా నున్నది. చుట్టు. ఏడు అగర్తలున్నవి, వందలకొలది వీథులున్నవి. వాటిలో వర్తక సమూహములు అనేక వస్తువులను తెచ్చి' విక్రయింతురు. అచ్చట దివ్యాశ్రమములు మారుకోట్లకు పైగా నున్నవి. అట్టి నగర మధ్య భాగమున పుష్పదంతుడు శంఖచూడుని చూచెను.

చంద్రునివలె వలయాకారమున నున్న అతని అంతఃపురమునకు మరొక నాలుగు ఆగడలున్నవి. వాటివల్ల శత్రువులెవరు - దానిని ప్రవేశింపలేరు. భవనములన్నియు మణి నిర్మితములు. అవి ఆకాశము నంటుచున్నవి. ద్వారపాలురు ఎల్లప్పటికి రక్షించు పది రెండు ద్వారములున్నవి. రత్నములతో, చిత్రములలో, రత్నకలశములతో నున్న కవాటము లా ద్వారములకున్నవి. వాటిని ఎల్లప్పుడు మహాబలపరాక్రమసంపన్నులై దివ్యాస్త్రములను ధరించియున్న భటులు రక్షింతురు. అటువంటి ద్వారములనన్నిటిని చూచుచు పుష్పదంతుడు ప్రధాన ద్వారమును చేరెను.

పుష్పధంతుడు ప్రధానద్వారమును చేరి అచ్చట పూలహస్తం మహాభయంకరముగా నున్న ద్వారపాలకుపకు తాను వచ్చిన వృత్తాంతమును వివరించి అతనిఅనుజ్ఞతో లోనికి అంతఃపురమును ప్రవేశించెను.

అతడు దూత కావున ఎవ్వరతనిని అడ్డగించలేదు. ఆ విధముగా ఆంతఃపురమును ప్రవేశించి అచ్చటమన్న ద్వారపాలకుని ఆమజ్జలో అంతఃపురమున నున్న శంఖచూడుని దర్శించెను.

అప్పుడు శంఖచూడుడు రత్న సింహాసనముపైన కూర్చుని రత్నదండమును చేతపట్టుకొని, ఒక భృత్యుడు బంగారు ఛత్రమును పట్టకొనగా, మరికొందరు తెల్లని చామరములు. వీయుచుండగా, రత్నాలంకార శోభితుడై, సూక్ష్మ వస్త్రములను మాల్యములను, అను లేపనమును ధరించి యుండెను. అతని చుట్టు అనేకులైన రాక్షసులు కూర్చొని యుండిరి. శాస్త్రములను ధరించిన భటులు అతని చుట్టు తిరుగుచుండిరి. ఆ విధముగా సన్న ఖచూడుని చూచి పుష్పదంతుడు చాలా ఆశ్చర్యపడి కరుడు చెప్పిన యుద్ధ వృత్తాంతమును యథాతథముగా తెల్పెను.

పుష్పదంత ఉవాచ- పుష్పదంతుడిట్లు పలికెను-

ఓ మహారాజా! నేను శివుని దూతను. నాపేరు పుష్పదంతుడు, శంకరుడు చెప్పిప మాటలను యథాతథముగా చెప్పుచున్నాము. విషము. దేవతలకు రాజ్యమును అధికారమును ఇచ్చి వేయుము. దేవతలండరు ఈ విషయమున శ్రీహరిని శరణువేడిరి. అతడు శివునకు త్రిశూలమునిచ్చి నీగురించి పంపెను. ఆ పరమశిపుడు చంద్రభాగానదీతీరమున మత చెట్టు వీడలో కూర్చోని యున్నాడు. నీవు దేవతలకు వారి రాజ్యమువిత్తువో యుద్ధము చేయుదువో స్పష్టముగా చెప్పినచో శంకరునకు నేమ ఎప్పుదును ఆనెను. వేమ చెప్పుదును అనెను.

దూతగా వచ్చిన పుష్పదంతుని మాటలు విని శంఖచూడుడు నప్పి నేను రేపుదయము వత్తును నీవు వెళ్ళిపొమ్మనెను.

పుష్పదంతుడట్లే బయలుదేరి వటవృక్షము యొక్క నీడలో మన్న శివునితో శంఖచూడుని మాటలను అతని బలమును వివరించి చెప్పను.

ఆ సమయమున వీరభద్రుడు, నంది, మహాకాళుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, ఏకంపనుడు. వీరూపుడు, వికృతి, మణిభద్రుడు, బాష్కలుడు, కపిలాక్షుడు, దీర్ఘదండు, వికటుడు, రామలోచనుడు, కాలంకటుడు, బలి భద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు రణ, దుర్జయుడు, దుర్గముడు, ఎనమండుగురు ఔరపులు, ఏకాదశరుద్రులు, ఇంద్రుడు మొదలగు దేవతలు, అష్టదిక్పాలురు, కోట్టర్, కైటభీ, మొదలగువారు వచ్చిరి. భద్రకాళి త్రిశూలము, శంఖ చక్ర, గదాద్యాయుధములు, వైష్ణవాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి ఆస్త్రములు ధరించి డాకినులు, వికటలు, వెంటరాగా అచ్చటికి వచ్చెను. భూత ప్రేత పిశాచగణము కూష్మాండ బ్రహ్మరాక్షసులు, భేతాళులు, యక్షులు మొదలగువారందరితో కలిసి కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి అతని ప్రక్క కూర్చుండెను.

దూతయైన పుష్పదంతుడు వెళ్ళిపోయిన తరువాత శంఖచూడుడు ఆంతః పురమునకు వెళ్ళి తులసితో ఈవిషయమునంతయు చెప్పెను. యుద్దవార్త వినబడగానే తులసి బాధపడుచు. పెదవులెండి పోగా ఈ విధముగా తన భర్తతో అనెను.

తులస్యువాచ - తులసి ఇట్లు పలికినది-

ఓ ప్రాణనాథుడా! ఒక్క క్షణము నా ఎదపై ఉండుము. నాప్రాణములను రక్షించుము. నీ మనసులోని కోరికను తీర్చుకొనుము. నేను నిన్ను తనివి తీర చూడనిమ్ము నీమాటవినగానే నా మనస్సు ఆందోళన చెందుచున్నది. అట్లే ఈ తెల్లవారుజామున నా కొక పీడకల, వచ్చినది. అందువలన యుద్దమును విరమించుకొమ్మని తులసి ప్రార్థించగా రాజైన శంఖచూడుడు తులసి దగ్గరనే తిని, రాగి, సత్యము హితవైన మాటనిట్లు పలికెను.

శంఖచూడ ఉవాచ – శంఖచూడుడిట్లనెను-

ఓ తులసి! కాలము అన్నిటినీ కలిగించును. సుఖం, హర్షము, దు:ఖం, భయం మొదలగునవన్నియు కాలము వల్లనే జరుగుచున్నవి. చెట్లు పెరిగి పెద్దవై పుష్పఫలములనిచ్చి పండి పడిపోవుట కొలమూలముననే జరుగుచున్నది. ప్రాణులన్నియు ఈకాలము వలననే పుట్టుచున్నవి నశించుచున్నవి. బ్రహ్మదేవుడు కాలముననుసరించి ఈ విశ్వసృష్టి చేయగా విష్ణువు కాలముననుసరించి రక్షించుచున్నాడు. అట్లే శంకరుడు కాలప్రభావమువలననే ఈవిశ్వమును లయింప చేయుచున్నాడు. పరబ్రహ్మయగు కృష్ణుడు సైతము కాలముననుసరించియే బ్రహ్మాది దేవతలను, ప్రకృతిని సృష్టించుచున్నాడు.

బ్రహ్మదేవుడు మొదలుకొని చీమల వరకున్న సమస్త ప్రపంచము అశాశ్వతమైనది, వాటి కాలము తీరగనే నశించుచున్నది. అందువలన సత్యస్వరూపుడు పరాత్పరుడు అగు శ్రీకృష్ణుని సేవింపుము. అతని ఆజ్ఞవలననే గాలి వీచుచున్నది. అగ్నిమండుచున్నది. ఇంద్రుడు వర్షించుచున్నాడు. మృత్యువు తన కార్యక్రమమును పూర్తి చేయుచున్నాడు. మృత్యువునకు, కాలమునకు యమునకు, సమస్త చరాచరసృష్టికి మూలపురుషుడగు శ్రీకృష్ణుని శరణు పొందుము. నీవెవరు నేనెవరు? ఎవరు ఎవరికి బంధువు. ఆ భగవంతుడే నిన్ను నన్ను ఈ విధముగా కలిపినాడు. మరల వియోగము కలిగింపనున్నాడు.

అజ్ఞాని యగువాడు ఆపదలందు, శోకసమయమున బాధపడును. కాని జ్ఞానవంతుడట్లు కాదు. అతడు సుఖదుఃఖములు చక్రములో ఆకులు పైకి కిందికి తిరుగుచున్నట్లే వచ్చునని భావించును.

 నీవు ఎవరిగురించి పూర్వము తపస్సు చేసినానో ఆవారాయణునీ వచ్చు జన్మలో భర్తగా పొందగలవు, నేను కూడ తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన నీన్ను భార్యగా పొందినాను. గోలోకమందలి బృందావనములో నీవు నీ తపస్పున కనుకూలముగా గోవిందుని భర్తగా పొందుదువు. నేను కూడ ఈ రాక్షస శరీరమును వదలి గోలోకమువకు వచ్చి నిన్ను చూతును. నీవుకూడ అక్కడ సస్ను చూచెదవు. నేను రాధాదేవి శాపమువలన ఈ భారత భూమికి వచ్చితిని. మరల తిరిగి పోవుచున్నాను. అందువలన దు:ఖింపవలసిన పనిలేదు. వీపుకూడ నీ శరీరమును వదిలి దివ్యరూపము ధరించి శ్రీహరిని పొందుదువు. అందువలన శోకింపనవసరములేదు ఆనీ శంఖచూడుడు తులసితో అనెను.

శంఖచూడుడు ఆ తర్వాత పుష్పచందనములు కల శృంగార తల్పముపై పడుకి సెమ. తులసిని తన దగ్గరకు తీసికొని ఏడ్చుచు అతి దు:ఖితయై నిరాహారగాయున్న తులసిని మరల ఓదార్పసాగెను. అట్లే శ్రీకృష్ణుడు తెలిపిన తత్వమునామెకు ఉపదేశించమ. అజ్ఞానమును పొంది తులసి సమస్తము క్షణికమని భావించి శోకవిదూరమైనది.

రతి క్రీడయందు ఆర్తులైన ఆ తులసి శంఖచూడులు నిర్జనవనమున తమ కోర్కె తీర్చుకొనిరి. శృంగారమునకు చెందిన కథలను చెప్పుకొనుచు వారిరువురు అర్ధనారీశ్వరులవలె ఏకాంగులన్నట్లుగా భాసించిరి. ఒకరి కొకరు తాంబూలము నిచ్చుకొని తీనుచు, భుక్తశేషమును పరస్పరము మార్చుకొనుచు, ఒకరి కొకరు చామరములు ఏయుచు శృంగార రసమున ఓలలాడిరి. వారిరువురకు శృంగార విషయమున అపజయము లేదు. ఒకరిని మించి మరొకరన్నట్లుగా ఇద్దరు జయము పొందిరి.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండపదగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున తెలుపబడిన తులసీ శంఖచూడుల సంభోగమను పదునేడవ అధ్యాయము సమాప్తము.