27 - శుభకర్మల ఫలితము

సావిత్ర్యువాచ- సావిత్రి యమునితో నిట్లనెను-

ప్రయాంతి స్వర్గమన్యంచ యేన యేనైవ కర్మణా ।

 మానవాః పుణ్యవంతశ్చ తన్మే వ్యాఖ్యాతు మర్హసి ॥

పుణ్యము చేసికొనిన మానవులు ఏయే కర్మలవలన స్వర్గలోకమును లేక ఇతరలోకములను చేరుచున్నారో ఆయా కర్మల గురించి విపులముగా తెలుపుడు

 యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-

 అన్నదానం చ విప్రాయ యః కరోతి చ భారతే ।

 అన్న ప్రమాణ వర్షం చ శక్తలోకే మహీయతే ॥

అన్నదానాత్పరం దానం న భూతం న భవిష్యతి ।

నాత్ర పాత్ర పరీక్షాస్యాత్ న కాలనియమః క్వచిత్ ॥

 దేవేభ్యో బ్రాహ్మణేభ్యో పో దదాతి చాసనం యది ।

 మహీయతే వహ్నిలోకే వర్షాణామయుతం ధ్రువం ॥

 యో దదాతి చ విప్రాయ దివ్యాం ధేనుం పయస్వినీం।

 తల్లోమమాన వర్షంచ వైకుంఠే చ మహీయతే ॥

 చతుర్గుణం పుణ్యదినే తీర్ధేశతగుణం ఫలం ।

 దానం నారాయణక్షేత్రే ఫలం కోటిగుణం భవేత్ ॥

ఈ భారతదేశమున బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో ఆ అన్నమున మెతుకులెన్ని యున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖపడును. అన్నదానమును మించిన దానము లేనే లేదు. అన్నదానము చేయు సందర్భమున మంచివాడు చెడ్డవాడు అను పాత్ర పరీక్షగానీ, కాల నియమముగాని తగదు.

దేవతలకు, బ్రాహ్మణులకు ఆసనమిచ్చి గౌరవించినచో ఆగ్నిలోకమున పదివేల సంవత్సరములుండును.

బ్రాహ్మణులకు పాలిచ్చు ఆవును దానము చేసినచో ఆధేనువు శరీరమున ఎన్నివెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున నుండవచ్చును. ఆధేనువునుపుణ్యదినమున దానము చేసినచో నాలురెట్లెక్కువ ఫలితము పొందును. శ్రీమన్నారాయణుడుండు పుణ్యక్షేత్రమున దానము చేసినచో కోటి రెట్లెక్కువ ఫలితమును పొందును.

గాం యో దదాతి విప్రాయ భారతే భక్తి పూర్వకం ।

వర్షాణామయుతం చైవ చంద్రలోకే మహీయతే ॥ 

యశ్చోభయముఖీదానం కరోతి బ్రాహ్మణాయచ ।

తల్లోమ మానవర్షం చ వైకుంఠే చ మహీయతే ॥

యో దదాతి బ్రాహ్మణాయ శాలిగ్రామం సవస్త్రకం ।

మహీయతే స వైకుంఠే యావచ్చంద్ర దివాకరౌ ॥

యో దదాతి  బ్రాహ్మణాయ ఛత్రం చ సుమనోహరం ।

వర్షాణామయుతం సోఽపి మోదతే వరుణాలయే ॥

విప్రాయ పాదుకాయుగ్మం యో దదాతి చ భారతే ।

 మహీయతే చంద్రలోకి యావచ్చంద్ర దివాకరౌ । ।

యో దదాతి బ్రాహ్మణాయ శయ్యాం దివ్యాం మనోహరాం ।

 మహీయతే చంద్రలోకే యావచ్చంద్ర దివాకరౌ ॥

యో దదాతి ప్రదీపం చ దేవాయ బ్రాహ్మణాయ చ ।

 యావన్మన్వంతరం సోఽపి బ్రహ్మలోకి మహీయతే ॥

సంప్రాప్య మానవీం యోనిం చక్షుష్మాంచ భవేద్దువం ।

నయాతి యమలోకంచ తేన పుణ్యేన సుందరి ॥

కరోతి గజదానం చ యోహి విప్రాయ భారతే ।

 యావదింద్రాది దేవస్య లోకే చార్ధాసనే వసేత్ ॥

భారతే యోఽశ్వదానం చ కరోతి బ్రాహ్మణాయ చ ।

 మోదతే వారుణే లోకి యావదింద్రాశ్చతుర్దశ ॥

బ్రాహ్మణునకావును భక్తితో దానము చేసినచో పదివేల సంవత్సరములు చంద్రలోకమున నుండి గౌరవము పొందుచుండును. అట్లే అప్పుడే ప్రసవించుచున్న ఆవును (ఉభయముఖి) దానము చేసినచో ఆ యావు శరీరమున వెండ్రుకలెన్ని యున్నవో 

అన్ని సంవత్సరములు వైకుంఠమున గౌరవమును పొందును. 

బ్రాహ్మణునకు వస్త్రముతో పాటు సాలగ్రామమును దానము చేసినచో సూర్య చంద్రులున్నంతవరకు వైకుంఠమున నుండును. అందమైన ఛత్రిని దానము చేసినచో పదివేల సంవత్సరములు వరుణలోకమున నుండును. పాదుకలను దానము చేసిన వాయులోకమున నుండును. చక్కని శయ్యను దానము చేసినచో సూర్యచంద్రులున్నంతవరకు చంద్రలోకమున నుండును. దీపమును దేవునకు లేక బ్రాహ్మణునకు దానము చేసినచో బ్రహ్మలోకమున మన్వంతర కాలముండి తిరిగి భారత దేశమున జన్మించినను ఆ పుణ్యప్రభావము వలన తరువాత నరకలోకమునకు వెళ్ళడు. గజదానమును చేసినచో ఇంద్రుని అర్ధాసనమున స్థానమును సంపాదించుకొనును. అట్లేఅశ్వమును దానమును చేసినచో పదునలుగురు ఇంద్రులు గడచువరకు వరుణ లోకముననుండును. 

ప్రకృష్టాం శిబికాం యో హి దదాతి బ్రాహ్మణాయ చ ।

 మహీయతే విష్ణులోకే యావన్మన్వంతరం సతి ॥

యో దదాతి విప్రాయ వ్యజనం శ్వేత చామరం ।

 మహీయతే వాయులోకే వర్షాణామయుతం ధ్రువం ॥

 ధాన్యాచలం యో దదాతి బ్రాహ్మణాయ చ భారతే ।

 స చ ధాన్య ప్రమాణాబ్దం విష్ణులోకి మహీయతే ॥

తతః స్వయోనిం సంప్రాప్య చిరజీవీ భవేత్సుఖీ ।

 దాతా గ్రహీతా ద్వార ధ్రువం వైకుంఠగామినౌ ॥ 

మంచి పల్లకిని దానము చేసినచో వైకుంఠమున మన్వంతరకాలము ఉండును. విసన కఱ్ఱసుగాని, తెల్లని చామరమును గాని దానము చేసినచో పదివేల సంవత్సరములు వాయులోకమున నుండును. అధికమైన ధాన్యమును దానము చేసినచో ఆ ధాన్యపుగింజలెన్ని యున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున నుండును. ఆతరువాత తిరిగి మానవుడై పుట్టినను సుఖముగా ఉండగలడు. 

దాత తాను చేసిన దాన పుణ్యమున, ప్రతి గ్రహీత తాను ప్రతి దినమాచరించు స్వకర్మానుష్ఠానమువలన, వైకుంఠమునకు పోవుదురు.

 సతతం శ్రీహరేర్నామ భారతే యోజపేన్నరః ।

 స ఏవ చిరజీవ చ తతో మృత్యుః పలాయతే ॥ 

యోనరో భారతే వర్షే దోలనం కారయద్ధరే: ।

 పూర్ణిమా రజనీ శేషే జీవన్ముక్తో భవేన్నరః ॥

 ఇహ లోకే సుఖం భుంక్త్యా యాత్యంతే విష్ణుమందిరం ।

నిశ్చితం నివసేత్తత్ర శతమన్వంతరావధి ॥

 ఫలముత్తర ఫల్గుణ్యాంతతోపి ద్విగుణం భవేత్ ।

కల్పాంతజీవ సభవేదిత్యాహ కమలోద్భవః ॥

తిలదానం బ్రాహ్మణాయ యః కరోతి చ భారతే ।

 తిలప్రమాణ వర్షం చ మోదతే విష్ణుమందిరే ॥

తతః స్వయోనిం సంప్రాప్య చిరజీవీ భవేతు)ఖీ ।

 'తామ్ర పాత్రస్థ దానేన ద్విగుణం చ ఫలం లభేత్ ॥ 

ఎల్లప్పుడు శ్రీహరినామ జపము చేయువాడు చిరంజీవిగా ఉండును. మృత్యువాతనిని చూచి పరుగెత్తును. శ్రీహరికి ఊయలను చేయించినచో పూర్లిమనాడు బ్రాహ్మీముహూర్తమున మృతుడై ముక్తినొందును. ఈలోకమున సుఖముగా నుండి చనిపోయి వైకుంఠమున కేగి అచ్చట శతమన్వంతర కాలము సుఖముగా నుండును. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున చేసిన దానము చాలా విశేషమైనది. దాని వలన రెండింతలు ఫలము లభించును. అతడు కల్పాంతము వరకు బ్రతుకునని బ్రహ్మదేవుడు తెలిపెను.

నూపులను దానము చేసినచో నూపుగింజల సంఖ్యగల సంవత్సరములు వైకుంఠమున నుండును. తరువాత మానవుడై పుట్టినను సుఖముగా ఉండును. ఈనూవులను రాగి పాత్రలో పోసి దానము చేసినచో సాధారణదానము కంటే రెట్టింపు ఫలితమును పొందును.

సాలంకృతాం చ భోగ్యాం చ సవస్త్రాం సుందరీం ప్రియాం ।

యో దదాతి బ్రాహ్మణాయ భారతే చ పతివ్రతాం ॥

 మహీయతే చంద్రలోకే యావదింద్రాశ్చతుర్ధశ ।

తత్ర సర్వేశ్యయా సార్ధం మోదతే చ దివానిశం ॥

తతో గంధర్వలోకే చవర్షాణామయుతం సతి ।

 దివానిశం కౌతుకేన చోర్వశ్యా సహ మోదతే ॥

 తతో జన్మసహస్రం చ ప్రాప్నోతి సుందరీం ప్రియాం ।

సతీం సౌభాగ్యముక్తాం చ కోమలాం ప్రియవాదినీం ॥

 అందమైనది, సద్గుణముల రాశి యైన కన్యను సాలంకృతముగా సవస్త్రముగా దానము చేసినచో పదునలుగురు ఇంద్రులు గతించువరకు చంద్రలోకమున సుఖముగా నుండును. ఆ తర్వాత గంధర్వలోకమున సుఖముగా నుండును. తరువాత వేలకొద్ది జన్మలలో సౌందర్యవతి సౌభాగ్యవతీ, మృదుభాషిణీ యగు కాంతను భార్యగా పొందును.

 దదాతి సఫలం వృక్షం బ్రాహ్మణాయ చ యోనరః ।

 ఫల ప్రమాణ వర్షం చ శక్రలోకే మహీయతే ॥

 పునః స్వయోనిం సంప్రాప్య లభతే సుతముత్తమం ।

 సఫలానాం చ వృక్షాణాం సహస్రం చ ప్రశంసితం ॥

కేవలం ఫలదానం చ బ్రాహ్మణాయ దదాతి యః ।

సుచిరం స్వర్గవాసం చ కృత్వా యాతి చ భారతం ॥

 నానా ద్రవ్యసమాయుక్తం నానా సస్య సమన్వితం ।

 దధతే యశ్చ విప్రాయ భారతే విపులం గృహం ॥

కుబేర లోకే వసతి స చ మన్వంతరావధి ।

తతః స్వయోనిం సంప్రాప్య మహాంశ్చ ధనవాన్ భవేత్ ॥

పండ్లతో నున్న వృక్షమును బ్రాహ్మణునకు దానము చేసినచో దానము చేసినవాడు ఆ చెట్టున ఎన్ని ఫలములున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగానుండును. తరువాత మానవ జన్మనెత్తి మంచీ పుత్రుని కనును, అందువలన పండ్లతో నున్న చెట్లను అనేకము దానము చేయవలెనని. ఆనుచున్నారు. పండ్లను మాత్రము దానము చేసినచో చాలా కాలము స్వర్గమున నుండును.

అనేక ద్రవ్యములు, అవధాన్యములు కల ఇంటిని దానము చేసినచో ఆ దాత కుబేరలోకమున మన్వంతర కాలముండును. తిరిగి మానవ జన్మనెత్తి నప్పుడు గొప్ప ధనవంతుడగును.

యో జనః సస్యసంయుక్తాం భూమిం చ రుచిరాం సతి ।

 దదాతి భక్త్యా విప్రాయ పుణ్యక్షేత్రే చ వా సతి॥

 మహీయతే స వైకుంఠే మన్వంతరశతం ధ్రువం ।

 పునః స్వయోనిం సంప్రాప్య మహాంశ్చ భూమివాన్ భవేత్ ॥

 తం న త్యజతి భూమిశ్చ జన్మనాం శతకం పరం।

శ్రీమాంశ్చ ధనవాంశ్చైవ పుత్రవాంశ్చ ప్రజేశ్వరః ॥

ఎవరు సస్యశ్యామలమైన భూమిని భక్తితో బ్రాహ్మణునకు పుణ్యక్షేత్రమునకు వెళ్ళినప్పుడు దానము చేయుదురో వారు వైకుంఠమున మన్వంతర కాలముందురు. తిరిగి భూమిపై మానవుడై పుట్టినప్పుడు ఆధిక భూమి కలవాడగును. అతడు నూరు జన్మలవరకు చక్కని భూమినీ, ధనమును, పుత్రులను, అధికారము కలిగియుండును.

 సప్రజం చ ప్రకృష్టం చ గ్రామం దద్యాత్ ద్విజాతయే ।

లక్ష మన్వంతరం కొలం వైకుంఠే సమహీయతే ॥

 పునః స్వయోనిం సంప్రాప్య గ్రామలక్షం లభేత్ ధ్రువం ।

 న జహాతి చ తం పృథ్వీ జన్మనాం లక్షమేవచ॥

ప్రజలున్న గొప్ప గ్రామమును బ్రాహ్మణునకు దానము చేసినచో ఆతడు లక్ష మన్వంతరముల వరకు వైకుంఠమున నుండును. తిరిగి మానవ జన్మనెత్తినచో లక్షగ్రామములకు అధిపతి కాగలడు. ఆవిధముగా లక్షజన్మల వరకు అనేక గ్రామముల కధిపతియగును.

సప్రజం సుప్రకృష్టం చ పంచ సస్య సమన్వితం ।

 నానా పుష్కరిణీ వృక్షఫలభోగ సమన్వితం ॥

 నగరం యశ్చ విప్రాయ దదాతి భారతే భువి ।

 మహీయతే సవైకుంఠే  దశలక్షేంద్ర కాలకం ॥

పునః స్వయోనిం సంప్రాప్య రాజేంద్రో భారతే భవేత్ ।

 నగరాణాం చ నియుతం లభతే నాత్ర సంశయః ॥

ధరా తం న జహాత్యేవ జన్మనాo  నియుతం ధ్రువం ।

 పరమైశ్వర్య సంయుక్తో భవేదేవ మహీతలే ॥

ప్రజలు, చక్కని సస్యములు, అనేక పుష్కరిణులు, ఫలవృక్షములు గల గొప్పని నగరమును బ్రాహ్మణునకు దానము చేసినచో అతడు పదిలక్షల ఇంద్రుల వరకు వైకుంఠముననుండును, తరువాత తిరిగి భూమిపై మానవుడుగా జన్మించినప్పుడు నియుత (నూరుకోట్ల) నగరములకు రాజేంద్రుడగును. ఆ విధముగా నూరుకోట్ల జన్మల వరకు గొప్పని ఐశ్వర్యమును, అధికారమును పొందును.

నగరాణాం చ శతకం దేశం యో హి ద్విజాతయే ।

సుప్రకృష్ట ప్రజాయుక్తం దదాతి భక్తి పూర్వకం ॥

వాసీ తడాగ్ సంయుక్తం నానావృక్ష సమన్వితం ।

 మహీయతే ఏ వైకుంఠే కోటి మన్వంతరావధి ॥

పునః ప్వయోనిం సంప్రాప్య జంబూద్వీప పతిర్భవేత్ ।

 పరమైశ్వర్య సంయుక్తో యథా శక్రస్తథా భువి ॥

మహీ తం న జహాత్యేవ జన్మనాం కోటిమేవచ ।

 కల్పాంతజీవీ స భవేత్ రాజరాజేశ్వరో మహాన్॥

 బావులు, చెరువులు, అనేక వృక్షములు, మంచి స్వభావముగల ప్రజలు గల నూరు నగరములున్న దేశమును బ్రాహ్మణునకు దానము చేసినచో ఆతడు కోటి మన్వంతరముల వరకు వైకుంఠమున గౌరవమునందుకొనును. తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు ఈ జంబూద్వీపమున కధిపతియై, దేవేంద్రుని వలె పరమైశ్వర్య సంపన్నుడగును. ఆతడు కోటి జన్మలవరకు గొప్ప చక్రవర్తియై యుండును.

 స్వాధికారం సమగ్రం చ యో దదాతి ద్వీజాతయే ।

చతుర్గుణ ఫలం చాతో భవేత్తస్య న సంశయః ॥

జంబూద్వీపం యో దదాతి బ్రాహ్మణాయ పతివ్రతే ।

 ఫలం శతగుణం చాతో భవేత్తస్య న సంశయః ॥

 సప్తదీ: మహీదాతుః పర్వ తీర్థాన సేవినః ।

సర్వేషాం తపసాం కర్తు; సర్వోపవాస కారిణః ॥

 సర్వ దాన ప్రదాతుశ్చ సర్వ సిద్దేశ్వరస్య చ ।

అస్త్వేవ పునరావృత్తి: న భక్తస్య హరే రహో ॥

 అసంఖ్య బ్రహ్మణాం పాతం పశ్యంతి వైష్ణవాః సతి ।

 నివసంతి హి గోలోకే వైకుంఠేవా హరేః పదే ॥

విష్ణమంత్రోపాసకాశ్చ విహాయ మానవీం తనుం ।

భిభర్త దివ్యరూపం చ జన్మమృత్యు జరాపహం ॥

 లబ్ధ్వా విష్ణొశ్చ సారూప్యం విష్ణు సేవాం కరోతి చ ।

 స చ పశ్యతి గోలోకే హ్యసంఖ్యం ప్రాకృతం లయం ॥

 నశ్యంతి దేవాః సిద్ధాశ్చ విశ్వసి నీఖిలాని చ ।

కృష్ణభక్త న నశ్యంతి జన్మమృత్యు బిరాహరా:॥

తన యధికారమునంతయు బ్రాహ్మణునకు దానము చేసినచో, నూరునగరములున్న దేశమును దానము చేసిన వ్యక్తి తనయధికారమునంతయు దానము చేసిన వ్యక్తి కంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితమును పొందును.

సప్తద్వీపములనన్నిటిని దానము చేసిన పొనీకైనా సమస్త పుణ్యతీర్థములను సేవించిన వానికైనా, అన్నివిధములైన తపస్సు చేసిన వానికైనా, అన్ని విధములైన దానములను చేసిన వానికైనా, సమస్త సిద్ధులు పొందిన వానికైనా పునర్జన్మ ఉన్నది కాని శ్రీహరి భక్తునకు పునర్జన్మలేదు. ఆ వైష్ణవులు అసంఖ్యాకమైన బ్రహ్మదేవుల మరణమును చూచెదరు. వారు శ్రీహరి లోకమగు వైకుంఠమున గానీ, గోలోకమున గాని నీవపింతురు, విష్ణుమంత్రోపాసకులగు వైష్ణవులు చనిపోయిన తరువాత జన్మ, మృత్యు, జరలు లేని దివ్యరూపును ధరించి శ్రీహరి సారూప్యమును పొంది విష్ణుసేవను చేయుచుందురు. వారు గోలోకమున చాల కాలముండి అనేక ప్రాకృతలయములను చూచెదరు,

దేవతలు, సిద్ధులు, సమస్త ప్రపంచములు నశించునుగాని శ్రీకృష్ణభక్తులకు మాత్రము చావులేదు. వారికి ముసలితనము, చావు పుట్టుకలుండవు.

 కార్తికే తులసీ దానం కరోతి హరయే చ యః ।

యుగం పత్రప్రమాణం చ మోదతే హరిమందిరే॥

 పునః స్వయోనిం సంప్రాప్య హరిభక్తిం లభేత్ ధ్రువం ।

సుఖీ చ చీరజీవీ చ సభవేద్భారతే భువి ॥

కార్తిక మాసమున శ్రీహరిని తులసితో పూజచేసిన వారు వారు పూజించిన తులసీ పత్ర సంఖ్యగల యుగములు శ్రీహరి సన్నిధిలో ముందురు. తిరిగి మానవులై పుట్టినను శ్రీహరి భక్తి కలిగి చిరంజీవులై సుఖముగా నుందురు.

ఘృత ప్రదీపం హరయే కార్తికే యో దదాతి చ ।

 పల ప్రమాణం వర్షంచ మోదతే హరిమందిరే ॥

పునః స్వయోనిం సంప్రాప్య విష్ణుభక్తిం లభేత్ ధ్రువం ।

మహాధనాఢ్య సభవేత్ చక్షుష్మాంశ్చైవ దీప్తిమాన్ ॥

కార్తిక మాసమున శ్రీహరికి నేతి దీపమును పెట్టినచో ఆ నేయి ఎన్ని పలములు గలదో (పలము ద్రవ వస్తువులను కొలుచు ఒక చిన్న కొలత) అన్ని సంవత్సరములు శ్రీహరి సమీపమున నుండి, పునర్జన్మ నెత్తినప్పుడు విష్ణుభక్తి కలిగిన ధనవంతుడగును.

మాఘే యః స్వాతి గంగాయామరుణోదయ కాలతః ।

 యుగ షష్టి సహస్రాణి మోదతే హరిమందిరే ॥

పునః స్వయోనిం సంప్రాప్య విష్ణుభక్తిం లభేత్ ధ్రువం ।

 జితేంద్రియాణాం ప్రవరః సభవేద్భారతే భువి ॥

మాఘే యః స్నాతి గంగాయాం ప్రయాగే చారుణోదయే ।

 వైకుంఠే మోదతే సోఽపి లక్షమన్వంత రావధి ॥

పునః స్వయోనిం సంప్రాప్య విష్ణుమంత్రం లభేత్ ధ్రువం ।

 త్యక్త్యా చ మానుషం దేహం పున ర్యాతి హరేః పదం॥

 నాస్తి తత్పున రావృతిః వైకుంఠాచ్చ మహీతలే ।

కరోతి హరి దాస్యం చ లబ్ధ్వా సారూప్యమేవ చ ॥

నిత్యసాయీ చ గంగాయాం స పూతః సూర్యపద్బువి।

పదే పదేఽశ్వమేధస్య లభతే నిశ్చితం ఫలం ॥

తస్యైవ పాదరజసా సద్యః పూతా వసుంధరా ।

మోదతే స చ వైకుంఠే యావచ్చంద్ర దివాకరా ॥

పునః స్వయోనిం సంప్రాప్య తపస్వి ప్రవరోభవేత్ ।

స్వధర్మ నిరతః శుద్ధో విద్వాంశ్చ సుజితేంద్రియః ॥

మాఘమాసమున గంగానదిలో ఆరుణోదయకాలమందు స్నానము చేసినవాడు అరువది వేల యుగములు వైకుంఠమున నుండును. అతడు తిరిగి మానవ జన్మనెత్తీనను జితేంద్రియుడై శ్రీహరి భక్తిని పొందును.

మాఘమాసమున ప్రయాగయందు అరుణోదయ కాలమున గంగాస్నానము చేసినవాడు లక్షమన్వంతరముల వరకు వైకుంఠముననుండును. తిరిగి మానవజన్మనెత్తినప్పుడు విష్ణుమంత్రమును పొంది చనిపోయిన తరువాత హరి దాస్యమును పొంది సారూప్య ముక్తిని పొందును.

గంగానదిలో ప్రతి దినము స్నానము చేసినచో సూర్యుని వలె పవిత్రుడై మాటిమాటికి అశ్వమేధయాగ ఫలితమును పొందును. ఆతడు వైకుంఠమున సూర్యచంద్రులున్నంతవరకుండి తిరిగి మానవజన్మనెత్తినచో స్వధర్మనిరతుడై, విద్వాంసుడై, జితేంద్రియుడై మహాతపస్వి కాగలడు.

మీనకర్కట యోర్మధ్యే గాడం తపతి భాస్కరే ।

భారతే యో దదాత్యేవ జలమేవ సువాసితం ॥

మోదతే స చ వైకుంఠే యావదింద్రాశ్చతుర్దశ ।

పునః స్వయోనిం సంప్రాప్య రూపవాంశ్చ సుఖీ భవేత్ ॥

మీన కర్కటక సంక్రమణములమధ్య (ఫాల్గుణ మాసము, ఆషాఢమాసములమధ్య) ఎండలు బాగా ఉన్నప్పుడు చల్లని సువాసనాభరితమైన నీటిని పోయువాడు ఇంద్రులు పదునలుగురు గలించు వరకు వైకుంఠములో నుండును. తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు చక్కని రూపు కలవాడై సుఖముగా నుండును.

 వైశాఖే హరయే భక్త్యా యో దదాతి చ చందనం ।

యుగషష్టి సహస్రాణి మోదతే విష్ణుమందిరే ॥

 వైశాఖే సక్తుదానం చ యః కరోతి ద్విజాత ।

సక్తురేణు ప్రమాణాబ్దం మోదతే విష్ణుమందీరే ॥

కరోతి భారతే యోహి కృష్ణ జన్మాష్టమీ వ్రతం ।

 శత జన్మ కృతాత్పాపాత్ ముచ్యతే నాత్ర సంశయః ॥

 వైకుంఠే మోదతే సోఽపి యావదీంద్రీశ్చతుర్దశ ।

పునః స్వయోనిం సంప్రాప్య కృష్ణభక్తిం లభేత్ ధ్రువం ॥

 ఇహైవ భారత వర్ష శివరాత్రిం కరోతి యః ।

 మోదతే శివలోకి చ సప్తమన్వంతరావధి ॥

శివాయ శివరాత్రౌ చ బిల్వపత్రం దదాతి యః ।

 పత్ర ప్రమాణం చ యుగం మోదతే శివమందిరే ॥

పునః స్వయోనిం సంప్రాప్య శివభక్తిం లభేత్ ధ్రువం ।

విద్యావాన్ పుత్రవాన్ శ్రీమాన్ ప్రజావాన్ భూమివాన్ భవేత్ ॥

చైత్రమాసేఽ థవామాఘే శంకరం యోఽర్చయే ద్ర్వతీ ।

 కరోతి నర్తనం భక్త్యా వేత్రపాణిర్దివానిశం ॥

మాసం వాఽప్యర్ధమాసం ఏ దశ సప్తదీనాని వా ।

 దినమానం యుగం సోఽపి శివలోకే మహీయతే ॥

వైశాఖమాసమున శ్రీహరికి చందన సేవ చేసినచో ఆరువై వేల యుగములు వైకుంఠమున విష్ణుమందిరమున నుండును. తరువాత మానవ జన్మ నెత్తినప్పుడతడు సుఖముగా నుండును. అట్లే వైశాఖమాసమున బ్రాహ్మణులకు సత్తుపిండిని దానము చేసినచో ఆ సత్తుపిండిలో ఎన్నీ రేణువులున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున శ్రీహరి మందిరమున నుండును. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతముచేసినచో నూరు జన్మలలో చేసిన పాపములు నశించును. అతడు పదునాలుగురు ఇంద్రుల కాలము వరకు వైకుంఠమున నుండి తిరిగి మానవుడై పుట్టినప్పుడు తప్పక శ్రీకృష్ణభక్తిని పొందును.

ఈభారత వర్షమున శివరాత్రి వ్రతము చేయువాడు ఏడు మన్వంతరముల వరకు శివలోకమైన కైలాసమున నుండును. శివరాత్రి దినమున శివుని బిల్వపత్రములతో పూజించినచో ఎన్ని పత్రములతో ఆతడు శివపూజ చేసెనో అన్నీ యుగములు కైలాసమున శివుని మందిరమున నుండును. తరువాత తిరిగి మానవుడుగా జన్మనెత్తినప్పుడు శివభక్తినీ, విద్యను, పుత్రపౌత్రసంపదను, ధన ధాన్య సంపదను, భూసంపదను పొందును. ఆదే విధముగ చైత్రమాసమున లేక మాఘమాసమున వ్రతదీక్షపూనీ శివుని పూజించినచో అతడు శివలోకమున శ్రీవమందిరము ముందు చేత్రపాణియై శివభటుడగుచున్నాడు. లేక పై రెండునెలలలో నెలయంతయు లేక పక్షము దీనములైనా, పదీ దీనములైనా చివరకు వారము దీనములైనా శివార్చన చేసినచో ఎన్నిదినములు శివపూజ చేసెనో అన్ని యుగములు కైలాసమున గౌరవింపబడును.

శ్రీరామనవమీం యోహి కరోతి భారతే నరః ।

సప్తమన్వంతరం యావత్మోదతే విష్ణుమందిరే ॥

పునః స్వయోనిం సంప్రాప్య రామభక్తిం లభేత్ ధ్రువం ।

 జితేంద్రియాణాం ప్రవరో మహాంశ్చ ధార్మికో భవేత్ ॥

శ్రీరామనవమీ వ్రతమును దీక్షపూని ఎవరు చేయుదురో వారు ఏడు మన్వంతరముల కాలము వైకుంఠమున విష్ణుమందిరమున నుందురు. ఆ తరువాత మానవ జన్మనెత్తినప్పుడు రామభక్తుడై జితేంద్రియుడై, మహాధార్మికుడగును.

శారదీయాం మహాపూజాం ప్రకృతేర్యః కరోతి చ ।

 మహీషైః ఛాగలైర్మేషైః ఇక్షుకూష్మాండకైస్తథా ॥

 నైవేద్యైరుపహారైశ్చ ధూప దీపాదీభిస్తథా ।

నృత్యగీతాదిభిర్వాద్యైః నానా కౌతుకమంగళైః॥

 శివలోకే వసేత్సోఽపి సప్తమన్వంతరావధి ।

 పునః స్వయోనిం సంప్రాప్య బుద్ధించ నిర్మలాం లభేత్ ॥

 అచలాం శ్రియమాప్నోతి పుత్ర పౌత్రాదివర్ధనీం ।

 మహాప్రభావయుక్తశ్చ గజవాజి సమన్వితః ॥

రాజరాజేశ్వర: సోఽపి భవేదేవ న సంశయః ।

శరత్కాలమున అశ్వయుజమాసమున ప్రకృతియగు దుర్గాపూజను దున్నపోతులు, గొట్టెలు, మేకలు, చెరకుగడలు, గుమ్మడికాయలు, నైవేద్యములు, ఉపహారములు, ధూపదీపాదులు, వాద్యములు, నృత్య గీతాదులతో చేసినచో అతడు కూడ ఏడు మన్వంతరముల వరకు శివలోకమైన కైలాసమున ఉండును. ఆ తరుపోత తీరిగి, మానవ జన్మనెత్తినప్పుడు నిర్మలమైన బుద్దిని, పుత్రపౌత్రులను, అంతులేని సంపదను, చతురంగబలమును కలిగి మహాప్రభావ సంపన్నుడైన చక్రవర్తి కాగలడు.

భాద్రశుక్లాష్టమీం ప్రాప్య మహాలక్ష్మీంచ యోఽ ర్చయేత్ ॥

 నిత్యం భక్త్యా పక్షమేకం పుణ్యక్షేత్రే చ భారతే ।

 దత్వా తస్యై ప్రకృష్టాని చోపచారాణి షోడశ॥

వైకుంఠే మోదతే సోఽపి యావచ్చంద్ర దీపాకరౌ ।

 పునః స్వయోనిం సంప్రాప్య రాజరాజేశ్వర్ భవేత్ ॥

 కార్తికీ పూర్ణిమాయాం చ కృత్వా తు రాసమండలం ॥

 గోపానాం శతకం కృత్వా గోపీనాం శతకం తథా ।

 శిలాయాం ప్రతిమాయాం వా శ్రీకృష్ణం రాధయా సహ ॥

 భారతే పూజయేద్దత్వా చోపచారాణి షోడశ ॥

గోలోకే చ వసేత్సోఽపి యావద్వై బ్రాహ్మణో వయః ।

 భారతం పునరాగత్య హరిభక్తిం లభేత్ ధ్రువం ॥

క్రమేణ సుదృఢం భక్తిం లబ్ద్వా మంత్రం హరేరపి ।

దేహం త్యక్త్యా చ గోలోకం పునరేవ ప్రయాతి సః ॥

తత్ర కృష్ణస్య సారూప్యం సంప్రాప్య పార్షదో భవేత్ ।

పునస్తత్పతనం నాస్తి జరామృత్యుహరో మహాన్ ॥

శుక్లాం వాప్యథవా కృష్ణాం కరోత్యేకాదశీం చ యః।

 వైకుంఠే మోదతే సోఽపి యావద్వై బ్రాహ్మణో వయః ॥

భారతం పునరాగత్య హరిభక్తిం లభేత్ ధ్రువం ।

పునర్యాతి చ వైకుంఠం న తస్య పతనం భవేత్॥

భాద్రమాసమున శుద్దాష్టమి నాడు మహాలక్ష్మిని ఒక పుణ్యక్షేత్రమున పక్షము వరకు షోడశోపచారములతో అర్చన చేసినచో అతడు సూర్యచంద్రులున్నంత వరకు వైకుంఠమున నీవసించును తరువాత తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు చక్రవర్తి కాగలడు.

కార్తీక మాసమున పూర్ణిమనాడు కొందరు పురుషులకు గోపకుల వేషమును, కొందరు స్త్రీలకు గోపికల వేషమును వేసి రాసమండలము నిర్మించి రాధా సహితుడైన శ్రీకృష్ణుని ప్రతిమను అర్ఘ్య పాద్య ధూపదీపాదీ షోడశోపచారములతో అర్చించినచో

బ్రహ్మదేవుడు బ్రతికియుండువరకు గోలోకమున నివసించును. తరువాత తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరి భక్తి కలవాడై శ్రీహరీ మంత్రోపదేశమును పొంది శరీర త్యాగమును చేసినప్పుడు గోలోకమునకు వెళ్ళి అచ్చట శ్రీకృష్ణసారూప్యమును పొంది శ్రీకృష్ణునకు అనుచరుడు కాగలడు. ఆతనికి పునర్జన్మకానీ, ముసలితనముగానీ, చావుగాని యుండవు,

ఏకాదశీ వ్రతమును. ఎవరు చేయుదురో ఆతడు బ్రహ్మ దేవుని జీవిత కాలపర్యంతము వైకుంఠమున సుఖముగానుండును. అటుపిమ్మట తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరిభక్తిని పొంది చనిపోయిన తరువాత శాశ్వతముగా వైకుంఠముననుండును. ఆతవికి పునర్జన్మ అనునదసలే యుండదు.

భాద్రేశుక్ల చ ద్వాదశ్యాం యః శక్రం పూజయేన్నరః ।

షష్టి వర్ష సహస్రాణి శకలోకే మహీయతే ॥

రవివారేఽర్క సంక్రాంత్యాం సప్తమ్యాం శుక్లపక్షతః ।

సంపూజ్యారం హవిష్యాన్నం యః కరోతి చ భారతే ॥

మహీయతే సోఽర్కలోకే యావచ్చంద్ర దివాకరౌ ।

భారతం పునరాగత్య చారోగీ శ్రీయుతో భవేత్ ॥

భాద్రపద శుద్ధ ద్వాదశినాడు ఇంద్రుని పూజించినచో అరవై వేల సంవత్సరములు స్వర్గలోకమున పుజ్యాడై వెలుగును.

ఆదివారమున, సూర్య సంక్రమణమునాడు. శుద్ధసప్తమి నాడు సూర్యుని పూజించి ఆతనికి నైవేద్యమునిచ్చినచో సూర్యలోకమున సూర్యచంద్రులున్నంతవరకుండును. తిరిగి మానవజన్మనెత్తినను ఆరోగ్యవంతుడై ధనధాన్యములతో తులదూగును.

జ్యేష్ఠ శుక్ల చతుర్ధశ్యాం సావిత్రీం యోఽహి పూజయేత్ ।

 మహీయతే బ్రహ్మలోకే సప్తమన్వంతరావధి॥

పునర్మహీం సమాగత్య శ్రీమానతుల విక్రమః ।

చిరజీవీ భవేత్సోఽపి జ్ఞానవాన్ సంపదయుతః ॥

 మాఘస్య శుక్ల పంచమ్యాం పూజయేద్య: సరస్వతీం ।

సంయతో భక్తితో దత్వా చోపచారాణి షోడశ ॥

మహీయతే స వైకుంఠే యావద్బహ్మా . దివానీశం ।

 సంప్రాప్య చ పునర్జన్మ స భవేత్కవి పండితః ॥

 గాం సువర్ణాదికం యోఽహి బ్రాహ్మణాయ దదాతిచ ।

 నిత్యం జీవన పర్యంతం భక్తి యుక్తశ్చ భారతే ॥

 గవాం లోమ ప్రమాణాబ్దం ద్విగుణం విష్ణుమందిరే ।

 మోదతే హరిణా సార్థం క్రీడా కౌతుక మంగళైః॥

తతః పునరిహాగత్య విష్ణుభక్తిం లభేత్ ధ్రువం ।

 తతః పునరిహాగత్య రాజ రాజేశ్వరో భవేత్ ॥

గోమాంశ్చ పుత్రవాన్ విద్వాన్ జ్ఞానవాన్ సర్వతః సుఖీ ॥

జ్యేష్ఠమాసమునందలి శుద్ధ చతుర్దశినాడు సావిత్రీదేవిని పూజించినచో బ్రహ్మలోకమున ఏడు మన్వంతరముల వరకు గౌరవము నందుకొనును. అతడు మరల జన్మనెత్తినను ధనవంతుడు, అమితవిక్రమ సంపన్నుడు, చిరంజీవి, మిక్కిలి జ్ఞానవంతుడు అగును.

మాఘమాసమునందలి శుద్ధ పంచమినాడు (శ్రీపంచమి) సరస్వతీ దేవిని భక్తితో షోడశోపచారములతో పూజించినచో బ్రహ్మ యుండునంతవరకు వైకుంఠమున నుండును. ఆ తరువాత మానవజన్మ నెత్తినను కవిగానో పండితుడుగానో అగును.

ఆవును, బంగారు మొదలగు వస్తువులను బ్రాహ్మణునకు దానము చేసినచో నిత్యము భక్తిగల ఆ వ్యక్తి ఆవు శరీరమున -నున్న వెంట్రుకల సంఖ్యకు రెట్టింపు సంవత్సరములు వైకుంఠమున విష్ణుదేవుని మందిరమున శ్రీహరితో కలిసి యుండును, తరువాత తిరిగి భూమిపై జన్మించినను విష్ణుభక్తుడై గోప్ప చక్రవర్తి కాగలడు. గొప్పజ్ఞానము కలిగి విద్వాంసుడుగా కూడ ప్రసిద్ది చెందును.

 భోజయేద్యోహి ఘృష్టాన్నం బ్రాహ్మణేభ్యశ్చ భారతే ।

 విప్రలోమ ప్రమాణాబ్దం మోదతే విష్ణుమందిరే ॥

తతః పునరిహాగత్య ససుఖీ ధనవాన్భవేత్ ।

విద్వాన్ సుచిరజీవీ చ శ్రీమానతుల విక్రమః ॥

యో వక్తి వా : దదాత్యేవ హరేరామాని భారతే ।

 యుగనామ ప్రమాణం చ విష్ణులోకే మహీయతే ॥

తతః పునరిహాగత్య విష్ణుభక్తిం లభేత్ ధ్రువం ।

 యది నారాయణ క్షేతే ఫలం కోటి గుణం లభేత్ ॥

నామ్నాం కోటిం హరే ర్యోహి క్షేత్రే నారాయణే జపేత్ ।

సర్వపాప వినిర్ముక్తో జీవన్ముక్తో భవేత్ ధ్రువం ॥

 లభతే న పునర్జన్మ వైకుంఠే స మహీయతే ।

లభేద్విష్ణోశ్చ సారూప్యం న తస్య పతనం భవేత్ ॥

బ్రాహ్మణులకు మృష్టాన్నమును పెట్టినచో ఆ బ్రాహ్మణుల శరీరములందెన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున సుఖపడును. ఆ తరువాత తిరిగి భూమిపై మానవ జన్మనెత్తినప్పుడు ధనవంతుడై మిక్కిలి సుఖపడును. ఇంకను విద్వాంసుడు, మంచి పరాక్రమవంతుడు చిరంజీవి కూడ ఆగును.

ఎవరు శ్రీహరి నామములను సదా ఉచ్చరింతురో, వారు ఉచ్చరించిన నామముల సంఖ్య ఎంతుండునో అన్ని యుగములు వైకుంఠమున సుఖముగానుందురు. తరువాత తిరిగి మానవ జన్మనెత్తి నప్పుడు తప్పక విష్ణుభక్తిని పొందుదురు. ఇదే శ్రీహరి నివసించు పుణ్యక్షేత్రమున చేసినచో ఫలితము కోటి రెట్లెక్కువ ఉండును. అట్లే శ్రీహరి ఉండు పుణ్యక్షేత్రమున శ్రీహరి నామములను కోటి మార్లు జపించినచో అతడు సమస్త పాపరహితుడై జీవన్ముక్తుడగును. అతనికి పునర్జన్మ ఉండదు. వైకుంఠమున శ్రీహరి సారూప్యమును పొందును.

 య: శివం పూజయేన్నిత్యం కృత్వా లింగం చ పార్థివం ।

 యావజ్జీవన పర్యంతం స యాతి శివమందిరం॥

మృదాం రేణు ప్రమాణాబ్దం శివలోకే మహీయతే ।

 తతః పునరిహాఽగత్య రాజేంద్రో భారతే భవేత్ ॥

మట్టితో శివలింగమును చేసి ప్రతిదినము శివుని ఆర్చించినచో శివలింగములందలి మట్టి రేణువులెన్ని కలవో అన్ని సంవత్సరములు శివలోకమున గౌరవమునందును. అతడు తిరిగి భూలోకమున మానవజన్మనెత్తినప్పుడు మహారాజపదవిని పొందును.

శిలాం చ యోఽర్చయేన్నీత్యం శిలాతోయం చ భక్షతి ।

 మహీయతే స వైకుంఠే యావద్వై బ్రహ్మణః శతం ॥

తతో లబ్ధ్వా పునర్జన్మ హరిభక్తిం సుదుర్లభాం ।

 మహీయతే విష్ణులోకే న తస్య వతనం భవేత్ ॥

తపాంసి చైవ సర్వాణి వ్రతాని నిఖిలాని చ ।

కృత్వా తిష్ఠతి వైకుంఠే యావదింద్రాశ్చతుర్దశ ॥

తతో లబ్ధ్వా పునర్జన్మ రాజేంద్రో భారతే భవేత్ ।

 తతో ముక్తో భవేత్పశ్చాత్ పునర్జన్మ న విద్యతే ॥

ప్రతిదినము సాలగ్రామ పూజ చేసి సాలగ్రామాభిషేక తీర్థమును తీసికొన్నచో నూరుగురు బ్రహ్మల కాలము వైకుంఠమున సుఖముగా నుండును. తరువాత పునర్జన్మ పొందినప్పుడు మిక్కిలి దుర్లభమైన హరి భక్తి, తరువాత వైకుంఠమున శాశ్వత - సుఖములభించును.

అన్ని విధములైన తపస్సులు అన్ని విధములైన వ్రతములాచారించినచో వైకుంఠమున పదునలుగురు ఇంద్రుల కాలము వరకు ఉండును. తరువాత భారతదేశమున తిరిగి జన్మించి మహారాజగును. ఆ తర్వాత అతడు ముక్తిని చెందును. అప్పుడతనికి పునర్జన్మ కలుగదు.

యః స్నాతి సర్వతీర్ధేషు భువికృత్వా ప్రదక్షిణం ।

స చ నీర్వాణతాం యాతి న తజ్జన్మ భవేద్భుఃవి ॥

పుణ్యక్షేత్రే భారతే చ యోఽశ్వమేధం కరోతి చ ।

 అశ్వలోమ ప్రమాణాబ్దం శక్రస్యార్ధాసనే వసేత్ ॥

 చతుర్గుణం రాజసూయే ఫలమాప్నోతి మానవః ।

నరమేధేఽశ్వమేధార్థం గోమేధే చ తదేవ చ  ॥

పుత్రేష్టౌ చ తదర్థంచ సుపుత్రం చ లభేత్ ధ్రువం ।

 లభతే లాంగలేష్టౌ చ గోమేధ సదృశం ఫలం ॥

 తత్సమానం చ విప్రేష్టౌ వృద్దియాగే చ తత్ఫలం ।

పద్మయజ్ఞే తదర్ధంచ ఫలమాప్నోతి మానవః ॥

 వీశోకే చ విశోకం చ పద్మార్థం స్వర్గమశ్నుతే ।

 విజయ విజయీ రాజా స్వర్గం పద్మసమం భవేత్ ॥

ప్రాజాపత్యే ప్రజాలాభో భూవృద్ధి: భూభృతాం భవేత్ ।

ఇహ రాజశ్రీయం లబ్ద్వా పద్మార్థం స్వర్గమశ్నుతే॥

బుద్ధియాగే మహైశ్వర్యం స్వర్గం పద్మసమం భవేత్ ॥

ఎవరు సమస్త తీర్థములలో స్నానము చేయుదురో వారు ముక్తిని పొందుదురు. వారికి పునర్జన్మ అనునది లేనేలేదు. పుణ్యక్షేత్రమైన భారతదేశమున అశ్వమేధయాగము చేసినవారు ఆ అశ్వమునకు ఎన్ని రోమములున్నవో అన్నీ సంవత్సరములు దేవేంద్రుని అర్ధాసనమున కూర్చొని ఇంద్రునితో సమానులగుదురు. రాజసూయయాగము చేసినచో అశ్వమేధయాగము కంటే నాల్గురెట్లు ఎక్కువ ఫలములభించును.

నరమేధము చేసినన, గోమేధము చేసినను అశ్వమేధయాగ ఫలములో సగము ఫలితమును మాత్రము పొందుదురు, పుత్రకామేష్టి యాగము చేసినచో సుపుత్రుడు కలుగును కాని నరమేధమునకు లభించు ఫలములో సగము మాత్రము లభించును. లొంగలేష్టియందు గోమేధముతో సమానఫలము లభించును. అట్లే విప్రేష్టియందు, వృద్ధయాగమున కూడ గోమేధ ఫలితములభించును.

పద్మయజ్ఞమున వృద్దియాగఫలములో అర్థ ఫలితమే లభించును. విశోక యజ్ఞమువలన దుఃఖనాశనము జరుగును. కాని స్వర్గఫలము మాత్రము పద్మయాగ ఫలములో సగభాగమే లభించును. విజయ యాగములో రాజువిజయమును పొందును. పద్మయాగఫలముతో సమానమైన స్వర్గఫలము లభించును. ప్రాజాపత్యయాగము వలన సంతానము, రాజులకు ఆధిక రాజ్యము లభించును. స్వర్గఫలము మాత్రము పద్మయాగఫలములో ఆర్థ భాగము మాత్రము లభించును. సమృద్ధియాగమువలన అంతులేని ఐశ్వర్యము, పద్మయాగ ఫలితముతో సమానమైన స్వర్గఫలము లభించును.

 విష్ణుయజ్ఞః ప్రధానం చ సర్వయజ్ఞేషు సుందరి।

 బ్రాహ్మణా చ కృతః పూర్వం మహాసంభార సంయుతః ॥

 యతో హేతోర్దక్షయజ్ఞం బభంజ చంద్రశేఖరః ! ।

చకార విష్ణుయజ్ఞం చ పురా దక్షప్రజాపతిః ॥

 ధర్మశ్చ కశ్యపశ్చైవ శేషశ్చాపి చ కర్ధమః ।

స్వాయంభువో మనుశ్చైవ తత్పుత్రశ్చ ప్రియవ్రతః ॥

 శివః సనత్కుమారశ్చ కపిలశ్చ ధ్రువస్తథా ।

 రాజసూయ సహస్రాణాం సమృద్ద్యా చ క్రతుర్భవేత్ ॥

రాజసూయ సహస్రాణాం ఫలమాప్నోతి నిశ్చితం ।

 విష్ణుయజ్ఞాత్పరో యజ్ఞో నాస్తి వేదే ఫల ప్రదః ॥

బహు కల్పాంత జీవీ చ జీవన్ముక్తో భవేత్ ధ్రువం ।

 జ్ఞానేన తేజసా చైవ విష్ణుతుల్యో భవేదిహ॥

అన్ని యజ్ఞములలో నారాయణ యజ్ఞము చాలా గొప్పనిది. దీనిని పూర్వము. బ్రహ్మదేవుడు అనేక. సంభారములతో చేసెను. ఆక్కడనే దక్షువకు శంకరునకు కలహమేర్పడినది. అప్పుడు అల్లరి చేసిన నందీశ్వరుని బ్రాహ్మణులు శపించిరి. నందీశ్వరుడు కూడ. కోపముతో బ్రాహ్మణులనందరిని శపించెను. అందువలననే శంకరుడా యజ్ఞమును నాశనము చేసెను.

పూర్వము దక్షప్రజోపతి కూడ ఈవిష్ణుయజ్ఞమునాచరించెను. ఆ యజ్ఞమునకు ధర్మదేవత, కశ్యపుడు, ఆదిశేషుడు, కర్దమ మహర్షి స్వాయంభువ మనువు, అతని పుత్రుడగు ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు మొదలగువారు వచ్చిరి. నారాయణక్రతువు చేయవలెననిన వేయి అశ్వమేధయాగములు చేయుటకు వలసిన వస్తువులు కావలెను, అట్లే ఆ యజ్ఞమువలన వేయి ఆశ్వమేధయాగములు చేసినంత ఫలము లభించగలదు. ఇట్టి విష్ణుయజ్ఞమును మించిన యజ్ఞము వేదములలోనే కప్పించదు. ఆ యజ్ఞము చేసిన వాడు. ఆనేక కల్పాంతరముల వరకు జీవించి యుండును. జీవన్ముక్తుడు కూడ అగుచువాడు. అతడు జ్ఞానమున, తేజస్పులో విష్ణుమూర్తితో సమానుడగుచున్నాడు.

దేవానాం చ యథా విష్ణు: వైష్ణవానాం యథా శివః ।

శాస్త్రాణాం చ యథా వేదాః ఆశ్రమానాం చ బ్రాహ్మణాః ॥

తీర్ణానాం చ యథా గంగా పవిత్రాణాం చ వైష్ణవాః ।

ఏకాదశి వ్రతానాం చ పుషాణాం తులసీ యథా ॥

నక్షత్రాణాం యథా చంద్రః పక్షిణాం గరుడో యథా ।

 యథా స్త్రీణాం చ ప్రకృతిరాధారాణాం వసుంధరా ॥

 శీఘ్రగానాం చేంద్రియాణాం చంచలానాం యథా మనః ।

 ప్రజాపతీనాం బ్రహ్మాన ప్రజేశానాం ప్రజాపతిః ॥

బృందావనం వనానాం చ వర్షాణాం భారతం యథా ।

శ్రీమతాం చ యథా శ్రీశ్చ విదుషాం చ సరస్వతీ ॥

పతివ్రతానాం దుర్గా చ సౌభాగ్యానాం చ రాధికా ।

 విష్ణుయజ్ఞస్తథా వత్సే యజ్ఞేషు చ మహా నితి ॥

దేవతలందరీలో శ్రీ మహావిష్ణువు, వైష్ణవులలో శంకరుడు, శాస్త్రములన్నిటిలో పేదములు, చతుర్వర్ణములలో బ్రాహ్మణులు, నదులలో గంగానది, పవిత్రమైన వారిలో వైష్ణవులు. వ్రతములన్నిటిలో ఏకాదశీ వ్రతము, పుష్పములలో తులసి, నక్షత్రములలో చంద్రుడు, పక్షులలో గరుత్మంతుడు, స్త్రీలలో ప్రకృతి (దుర్గ), ఆధారమగు వస్తువులలో భూమి, శీఘ్రముగా వెళ్ళునవి, చంచలములు అగు ఇంద్రియములలో మనస్సు, ప్రజాపతులలో బ్రహ్మదేవుడు, తోటలలో బృందావనము, వర్షములలో భరతవర్షము, శోభకలవారిలో లక్ష్మీదేవి, విద్వాంసులలో సరస్వతి, పతివ్రతలలో దుర్గాదేవి, సౌభాగ్యవతులగు స్త్రీలలో రాధాదేవి, అట్లే యజ్ఞములన్నిటిలో విష్ణుయజ్ఞము చాలా శ్రేష్ఠమైనది.

 అశ్వమేధ శతేనైవ శక్రత్వం లభతే ధ్రువం ।

 సహస్రేణ విష్ణుపదం సంప్రాప పృథురేవచ ॥

స్నానం చ సర్వతీర్ధేషు సర్వ యజ్ఞేషు దీక్షణం ।

 సర్వేషాం ప్రతానాం చ తపసాం ఫలమేవ చ ॥

 పాఠశ్చతుర్ణాం వేదానాం ప్రాదక్షిణ్యం భువస్తథా ।

ఫలం బీజమిదం సర్వం ముక్తిదం కృష్ణసేవనం ॥

పురాణేషు చ వేదేషు చేతిహాసేషు సర్వతః ।

 నిరూపితం సారభూతం కృష్ణపాదాంబుజార్చనం ॥

 తద్వర్ణనం చ తద్ద్యానం తన్నామ గుణ కీర్తనం ।

తత్స్తోత్రం స్మరణం చైవ వందనం జప ఏవచ ॥

తత్పాదోదక నైవేద్య భక్షణం నీత్యమేవ చ ।

సర్వ సమ్మతమిత్యేవం సర్వేప్పిత మిదం సతీ ॥

భజ కృష్ణం పరం బ్రహ్మ నిర్గుణం ప్రకృతేః పరం ।

గృహాణ స్వామినం వత్సే సుఖం గచ్ఛ స్వమందిరం॥

అశ్వమేధయాగములు వంద చేసినచో తప్పక ఇంద్రపదవి లభించును. వేయి ఆశ్వమేధయాగములు చేసి పృథుమహారాజు వైకుంఠమునకు పోయేను.

ఆన్నీ పుణ్యతీర్థముల యందు చేసిన స్నానమునకు, సమస్తయజ్ఞదీక్ష స్వీకరించుటకు, సమస్తవ్రతములకు, సమస్త తపస్పులకు, నాలుగు వేదములను పఠించుటకు, భూప్రదక్షిణమునకు. ఆన్నీటికిని ముక్తిని కలిగించు శ్రీకృష్ణపాదసేవనమే ఫలము. ఈ విషయము పురాణములన్నిటిలోను, అన్ని వేదములందును, అన్ని ఇతిహాసములందును కనిపించును.

శ్రీకృష్ణుని వర్ణనము, అతనిని ధ్యానించుట, అతనీ నామములను గుణములను కీర్తించుట, ఆ శ్రీకృష్ణుని స్తుతించుట, స్మరించుట, నమస్కరించుట, జపము చేయుట, శ్రీకృష్ణపాదోదకమును, అతని నైవేద్యముమ అనుభవించుట అందరకు ఇష్టమైనవి. ఆందరకు సమ్మతమైనవి.

ఆందువలన సావిత్రి! నిర్గుణుడు, ప్రకృతి కంటే ఆతీతుడు, పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని సేవింపుము. నీవు నీ భర్త ప్రాణములను తీసికొని సుఖముగా నీ ఇంటికి వెళ్ళుము అని యముడు సావిత్రితో అనెను.

ఏతత్తే కథితం సర్వం విపాకం కర్మణాం నృణాం ।

సర్వేప్సీతం సర్వమతం పరం తత్వప్రదం నృణాం ॥

ఓ సావిత్రి! నీవు కోరుకొన్న మానవులయొక్క కర్మవిపాకమునంతయు నీకు తెల్పితివి. ఇది అందరకు ఇష్టమైనది. అందరు ఒప్పుకొన్నది. మానవులకందరకు పరతత్వమును ఇచ్చునది అని చెప్పెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతి. ఖండే నారద నారాయణ సంవాదే సావిత్రీయమ సంవాదే సావిత్ర్యుపాఖ్యానే శుభకర్మ విపాక ప్రకథనం సోమ పస్తవింశోఽధ్యాయః ॥

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతిఖండములో నారద, నారాయణుల సంవాదమున తెలుపబడిన సావిత్ర్యుపాఖ్యానమున శుభ కర్మ వీపాకములను తెలుపు ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.