మార్కండేయ మహా పురాణము
124 - అవిక్షిచ్చరితమున అవిక్షితునకి మరుత్త పుత్రోత్పత్తి
ఆ కన్య యొక్క వచనములు విన్న అవిక్షితుడు కిమిచ్చక వ్రత సమయ మందు తండ్రి గారి సమీపమున తాను చేసిన ప్రతిజ్ఞను, కరంధముడు పలికిన వచనములను స్మరించు కొనెను. కేవలము తన కొరకే ఈ కన్య భోగమును త్యాగము చేయుట చూచి అప్పుడు సానురాగ చిత్తముతో రాజ నందనుడగు అవీక్షితుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను. ఓ కృశాంగీ! నేను శత్రువులచే పరాజయము నొందియే నిన్ను పరిత్యజించితిని. మఱియు ఇప్పుడు శత్రువును గెలిచియే తిరిగి నిన్ను పొందితిని. ఇప్పుడు నేనేమి చేయ వలెను?
ఈ రమణీయ వనము నందే మీరు నన్ను పాణి గ్రహణము చేసు కొనుడు. కామించిన కామినీ యొక్క సంగమము కామించిన పురుషునితో జరిగిన యెడల గుణ యుక్త మగును.
అట్లే నీవు చెప్పినట్లు శుభమగు గాక. ఈ విషయము నందు దైవమే కారణము. కాక పోయినచో నీవును నేనును వేరు వేరు స్థానము లందుండియు నేడు ఒక చోట కలిసి కొనుట ఎంత చిత్రము?
ఓ మునీ అదే సమయమున “తనయుడు” అను పేరు గల గంధర్వుడు అనేక మంది ఇతర గంధర్వులతో అప్సరసతో అచటకు వచ్చి ఇట్లు అనెను.
రాజ పుత్రా! ఈ మానిని నా కుమార్తె, ఈమె పేరు ధామిని. అగస్థ్యుని శాపము వలన ఈ కన్య విశాల రాజ పుత్రిక అయినది. ఒకనాడు భామిని ఆట లాడుచు బాల్య స్వభావముచే మహర్షికి క్రోధమును కలిగించెను. ఆ కారణమున అగస్త్యుడు “నీవు మనుష్య స్త్రీ విగా పుట్టుదువు గాక” అని శాపమిడెను. ఓ విప్రర్షీ! ఈ కన్య ఏమీ తెలియని బాలిక అందుచే తమకు అపరాధము చేసినది అందు వలన ఈమె అపరాధమును గ్రహింపక, అనుగ్రహింపుడు. అని నేను ఆ సమయమున పలికి ఆయనను శాంత పరచితిని. అప్పుడు మహాముని యగు అగస్త్యుడు. నా ప్రార్ధనకు ప్రసన్నుడై బాలికగా ఎరిగియే ఈమెకు సామాన్య శాపము నిచ్చితిని.” అని యనెను.
ఈ కారణమునే చక్కని కను బొమలు గల నా పుత్రిక యగు “భామిని” విశాల మహారాజు భవనమున “మానిని” యను పేరుతో జన్మించినది. నేను ఈమె కొఱకు ఇచ్చటకు వచ్చితిని. ఇప్పుడు రాజ కన్యక యగు ఈ నా కన్యను స్వీకరింపుడు. ఈమె గర్భమున నీకు చక్రవర్తి యగు పుత్రుడు జన్మించును.
గంధర్వుని వచనములు విని రాజపుత్రుడు ‘తథాస్తు’ అని అంగీకరించి ఆ కన్యను పాణి గ్రహణము చేసుకొనెను. గంధర్వ పురోహితుడగు తుంబురుడు యథా విధిగా హోమ కార్యమును సంపన్నము చేసెను. ఆ సమయమున దేవతలు, గంధర్వుడు గానము చేసిరి. మఱియు అప్సరసలు నాట్యము చేయ సాగిరి. మేఘములు పుష్పములను వర్షించినవి. దేవ దుందుపులు మ్రోగినవి. ఓ మునీ! పిమ్మట సమస్త భూమండల పాలన కర్తకు కారణ భూతురాలు అగు ఈ కుమారితో రాజ పుత్రుని వివాహ కాల మందు వచ్చి యున్న గంధర్వులు, మహాత్ముడగు తనయునితో సహితముగా గంధర్వ లోకమునకు వెళ్ళిరి. మఱియు రాజ కన్యను రాజ పుత్రుని కూడ వారి వెంట తీసుకొని బోయిరి.
అచట నృప నందనుడు అగు అవీక్షితుడు భామినీ సహవాసముతో ఏ విధముగా ఆనందించెనో, భోగ సంపత్ శాలిని యగు భామిని కూడా అవీక్షితుని సహవాసముతో అట్లే సంతోషముగా నుండెను. అచట అతడు ఆమెతో కొంత కాలము అత్యంత మనోహరములగు నగరము లందలి వనములలోను, మరి కొంత కాలము ఉప పర్వతము లందును క్రీడింప సాగెను. మరి యోకప్పుడు హంసలతో సార సశోభిత మగు నదీ మందును, ఎత్తైన మనోహరము లగు భవనము లందును, మఱియు ఒక్కప్పుడు అనన్య రమణీయ విహార ప్రదేశము లందును ఆ తన్వంగితో రాజ పుత్రుడు, మఱియు మహాను భావుడగు రాజ పుత్రునితో భామినియు ఈ విధముగా పరస్పరము పగలు రాత్రియును విహరించు చుండిరి.
ముని, గంధర్వ, కిన్నెర గణాలు వారికి ఉత్తమోత్తమ భక్ష్య పానీయమును అనులేపనాది ఉపహారములను ఇచ్చు చుండిరి. దుర్లభ మగు ఆ గంధర్వ లోక మందు భామినితో మహా వీరుడగు రాజ కుమారుడు ఈ విధముగా విహరించు చుండగా కాల క్రమమున ఆ కళ్యాణీ ఒక పుత్రుని కనెను. ఓ మనుజ వ్యాఘ్రా! మహా వీరుడగు ఈ పుత్రుడుదయించ గానే భవిష్యత్ ప్రయోజనము సిద్ధించు నను ఆశతో గంధర్వులు గొప్ప ఉత్సవమును జరుపు కొనిరి. వారిలో కొందఱు గానము చేసిరి. కొందఱు మృదంగమును మ్రోగించు సాగిరి. మరి కొందఱు వేణువు, వీణాది వాద్యములను వాయించు చుండిరి. అప్పుడు అప్సరసలు నాట్యము చేసిరి. మేఘము లన్నియు పుష్ప వృష్టిని కురిపించుచూ మృదు, మంద స్వరముతో గర్జింప సాగినవి.
ఓ మునీ! ఈ విధముగా సంపూర్ణ కోలాహలము యొక్క సమయ మందు తనయుడు స్మరించినంతనే తుంబురుడు అటకేతెంచి జాతకర్మాదులను చేసెను. ఓ ద్విజోత్తమా! క్రమానుసారముగా సర్వ దేవతలు. నిష్పాపులగు దేవర్షి గణాలు, పాతాళము నుండి శేషుడు వాసుకి, తక్షకుడు ఇత్యాది పన్నగ, రాజులు, రాజ గణాలు. దేవ, అసుర, యక్ష, గుహ్యకు లందలి ప్రధాన వ్యక్తి గణాలు మఱియు ఏకోని పంచాసత్ మరుద్దేవతలు వచ్చిరి. ఆ సమయమున వచ్చి యున్న ఋషులు, దేవ, దానవ, పన్నగ మునులతో గంధర్వ నగరము నిండి పోయెను. జాతకర్మాదులను చేసిన పిమ్మట తుంబురుడు స్తుతి పూర్వకముగా ఆ బాలకుని ఇట్లు స్వస్త్యయనము (ఆశీర్వచనము) చేసెను.
ఓ వీరా! నీవు మహా బలుడవు, గొప్ప వీరుడవు, మహా బాహుడవు మఱియు సార్వ భౌముడిపై చాలా కాలము వరకు భూమి యొక్క ఆధిపత్యమును చేయుము. ఈ సమస్త ఇంద్రాది లోకపాలకులు ఋషి గణాలు నీకు శత్రు వినాశనమునకు తగిన వీర్యమును ప్రసాదించి సమస్త శుభములు గలుగ జేయుదురు గాక. తూర్పు దిక్కున వీచు చున్న మాలిన రహిత మరుత్తుడు నీకు మంగళము కలిగించు గాక. అక్షీణుడు, విమలుడు అగు దక్షిణ దిక్కున వీచు పవనుడు నీకు అనుకూలుడుగా నుండు గాక. మఱియు పశ్చిమ దిక్కు నున్న మరుత్తుడు నీకు గొప్ప వీర్యమును, ఉత్తర దిక్కు పవనుడు నీకు ఉత్కృష్ట మగు బలమును ప్రసాదించు గాక. ఈ విధముగా స్వస్త్యయన కార్యక్రమము పూర్తి అయిన పిమ్మట ఆకాశవాణి ఇట్లు పలికెను. “గురువు మాటి మాటికి ‘మరుత్తు’ అను శబ్దమును ఉచ్చరించెను.
ఈ కారణముచే ఈ బాలకుడు “మరుత్త” నామముతో భూ మండలమున విఖ్యాతిని గాంచు దాక. మఱియు మహీపాలు లందరూ ఇతనికి ఆజ్ఞా బద్ధులై యందురు గాక. అందు వలన ఈ బాలకుడు రాజు లందరికి శీర్ష స్థానీయుడగును. మఱియు మహావీర్యుడై, చక్రవర్తియై సదా రాజ గణాలను అతిక్రమించి ఈ సప్త ద్వీపవతి యగు భూ మండలము నను భవించును. ఈ బాలుడు పృథ్వీశ్వరులలో యద్దకర్తలలో శ్రేష్టు డగును. మఱియు భూమి యందలి రాజు లందరి కన్న అధికమగు శౌర్య వీర్యములు కలవాడగును.
దేవవాణి పలికిన వచనములు వినిన విప్రులు, గంధర్వులు మఱియు ఆ బాలకుని తల్లి దండ్రులు పరమానందమును బొందిరి.
Summary of chapter 124 of the Mārkandeya Mahā Purana is as follows:
Overwhelmed by the united attack of dozens of defeated kings, Avīkshita is captured and imprisoned. Upon learning of his son's capture, King Karandhama marches with his army, defeats the allied kings, and frees Avīkshita.