మార్కండేయ మహా పురాణము
92 - రుచికి పితృ కృత గృహస్థ ధర్మోపదేశము
పూర్వము ప్రజాపతి యగు రుచి మమతా రహితుడై, అహంకార రహితుడై పర్యటించుచు ఎక్కడ సూర్యాస్తయ మగునో, అక్కడ శయనించు చుండెను. అగ్నిహీనుడు, ఏకాహారుడు, ఆశ్రమ హీనుడు, సంగత్యాగి, మునివ్రతచారి యగు రుచిని జూచి వాని పితృ దేవతలు యిట్లు చెప్పిరి.
ఓ కుమారా! నీవు వివాహ రూపమగు పవిత్ర కార్యము నెందుకు చేయ లేదు? అది స్వర్గము మరియు ముక్తికి కారణము, వివాహము లేనిచో అన్నీ బంధములే. సమస్త దేవతలకు, పితరులకు, పూజ్యులగు ఋషులకు మరియు అతిథి గణాలకు సత్కారము చేసిన గృహస్థుడగు పురుషుడు స్వర్గాది లోకముల ననుభవించును. “స్వాహా” అని ఉచ్చరించి దేవతలను, “స్వధా” అని ఉచ్చారించి పితరులను మరియు అన్న దానము ద్వారా అతిథులను సేవించిన మూడు ఋణాలను తీర్చు కొనిన పురుషుడు గృహస్థుడగును. నీవు దిన దినము దేవ ఋణ, ఋషి ఋణ, పితృ ఋణ, మనుష్య ఋణ, భూత ఋణముల యొక్క బంధమును పొందు చున్నావు.
పుత్రులను పొందక, పితృ దేవతలకు తర్పణము చేయక, భూతాదులకు కర్మలు చేయక, మూర్ఖత్వముతో ఏ విధముగా ఉత్తమ గతిని పొంద వలెనని కోరు చున్నావు? ఓ కుమారా! ఇహ లోకమున కూడా నీకు దుఃఖము కలుగునని మేము తలచు చున్నాము. మృత పురుషుడు నరకము ననుభవించు రీతిగా నీకు అన్య జన్మ మందు గూడ అనేక విధాల క్లేశములే కలుగును.
వివాహము దుఃఖ ప్రదము. మరియు పాపమునకు కారణము. దాని వలననే అధోగతి కలుగును. అందువలననే నేను వివాహము చేసుకొనలేదు. ఇంద్రియ దమన హేతువగు ఆత్మా సంయమము ముక్తికి కారణమగును. వివాహము ముక్తికి కారణము కాదు.
పరిగ్రహీనుడగు పురుషుడు మమతా రూపమగు బురద యందు లిప్తమై యున్న ఆత్మను ప్రతి దినము ఏ చిత్త రూపమున జలముతో శుభ్రము చేయునో, అతడే ఉత్తముడు. అనేక జన్మలెత్తి కర్మ రూపమగు బురద యందు మునిగి యున్న ఆత్మను, సద్వాసన యను జలముచే కడుగుటయే సంయతేంద్రియులగు బుద్ధి మంతుల కర్తవ్యము.
సంయతేంద్రియ పురుషులకు ఆత్మ యొక్క ప్రక్షాళన చేయుట కర్తవ్యమే కాని ఓ కుమారా! నీవు ఏ మార్గము నవలంబించితివో, అది మోక్ష ప్రాప్తి కలుగుటకు మార్గమా? ఏ విధముగా కోరిక లేక చేసిన పంచ యజ్ఞ దానములచే అశుభము నష్టమై పోవునో, అట్లే శుభా శుభ ఫలములను కూడా దాని ననుభవించుట తోడనే పూర్వ జన్మ యందు ఆర్జించిన కర్మలు క్షయ మగును. ఈ విధముగా కారణాత్మకులకు కల్మకారులకు సంసార బంధనము ఉండదు. ఎందుకనగా అనభిసంధి అయినచో ఆ కర్మ బంధమునకు దేతువు కాదు.
ఓ వత్సా! సుఖ దుఃఖాత్మకముల ననుభవించుట ద్వారా మనుష్యుల యోక్క పూర్వ జన్మ యందు చేసిన పుణ్యా పుణ్యాత్మక కర్మలు రాత్రి పగలు క్షయము పొందును. బుద్ధి మంతులగు మనుష్యులు ఆత్మను ఈ విధముగా ప్రక్షాళనము చేసుకొందురు. మరియు బంధనముల నుండి రక్షించు కొందురు. కాని అవివేకులై పాప పంకిలముతో ఆత్మను నాశనము చేసుకొనరు.
పితృ దేవతలారా! వేద మందు కర్మ మార్గమును అవిద్యగా చెప్పబడి నట్లుగా చదివితిని. అయితే ఎందుకు మీరు నన్ను కర్మ మార్గ మందు ప్రవృత్తిని చేయు చున్నారు?
ఈ కర్మ మార్గము ఎట్టి అవిద్యగా చెప్పబడెనో, అది సత్యమే. కాని మోక్ష ప్రాప్తికి కర్మయే హేతువు. సందేహము లేదు. సమస్త కర్మలు చేయకుండా అసత్ పురుషుడు ముక్తి కొరకు ఎట్టి ఇంద్రియ నిగ్రహములు చేయునో, అవి అంత కాలమున ముక్తిని ఇవ్వక పోగా అధోగతిని ప్రసాదించును.
ఓ వత్సా! నీవు మనస్సు నందు “నేను ఆత్మను ప్రక్షాళన చేయు చున్నాను” అని తలంచు చున్నావు. కాని విహిత కర్మలను సంపాదించనిచో, ఆ పాపము నందు దగ్ధమై పోవుదువు. అపకారియగు విషము ఏ విధముగా మనుష్యులకు ఉపకారిగా పని చేయునో, అట్లే అవిద్య కూడా మనుష్యులకు ఉపకారము చేయును. ఇది అన్యరూప మైనప్పటికీ అనుష్టిత కార్యము కళ్యాణకారియై ఉపాయముతో మన పక్షమున మంగళదాయకమై యుండును. ఓ వత్సా! ఈ కారణముచే నీవు విధి విధానమున వివాహము చేసుకొనుము. దీని వలన లౌకిక ధర్మములను బాగుగా పొందని కారణమున నీ జన్మ విఫలము కాకుండును.
ఓ పితృ గణములారా! ఇప్పుడు నేను వృద్దుడ నైతిని. అందువలన నాకు ఎవరు కన్య నిచ్చెదరు? విశేషించి దరిద్రులకు భార్యను గ్రహించుట అత్యంత కఠినము.
ఓ వత్సా! నీవు మా వచనములను స్వీకరింపక పోయినచో, మాకు పతనమును నీకు అదో గతియు కలుగును.
ఓ మునిసత్తమా! ఇట్లు చెప్పి ఆతని పితరులు చూచు చుండగానే వాయువుచే ఆరిపోవు నట్టి దీపము వాలే అంతర్ధాన మయిరి.
Summary of chapter 92 of the Mārkandeya Mahā Purana is as follows:
The Divine Mother declares the supreme spiritual merits gained by reading or hearing Her sacred Mahātmya during Navarātrī and autumn festivals. She promises that She will personally reside in places where Her Saptashatī is devoutly recited, driving away epidemics, nightmares, evil spirits, and poverty, while bestowing long life, progeny, and unshakeable peace.