మార్కండేయ మహా పురాణము
61 - స్వారోచిష మన్వంతరము
మనవి: ఇక్కడ కొన్ని శ్లోకములు, భావము మూల గ్రంధము నందు లేవు.
ఒక సమయ మందు మనోహర మగు వసంత కాలమందు కామకుల మనస్సు హరించు నట్టి పుంస్కోకిలల యొక్క మధురాలాపనములతో తపోవన మంతయు ప్రతి ధ్వనించు చుండెను. ఆ సమయ మందు ప్రసిద్ధ మైన పుంజిక స్థల యను పేరు గల ఒక అప్సరస ఆయన వద్దకు వచ్చెను. ఆ ముని పుంగవుడు కామ శత్రువునికి వశీభూతు డయ్యెను. ఆ తరువాత ఆతని సహవాసముచే ఆ అప్సరస గర్భవతి అగుటచే ఈ మహా చలము నందే నేను జన్మించితిని. అనంతరము సర్ప శ్వాపదాది క్రూర జంతువులతో నిండి యున్న ఈ నిర్జన వనము నందున్న నన్ను ఒంటరిగా విడిచి నా తల్లి వెళ్ళిపోయెను. ఆ తరువాత ఒక మహాత్ముడగు గంధర్వుడు నన్ను తీసికొని పోయి పెంచ నారంభించెను. అక్కడ శుక్ల పక్షము నందు ఎప్పుడు చంద్రుని యొక్క కళలు క్షయమగునో, అప్పుడు నేను వృద్ధిని పొంద నారంభించితిని. కాని కృష్ణ పక్షము నందు ఎప్పుడు చంద్రుని యొక్క కళలు క్షయ మగునో, అప్పుడు నేను క్షయ మగుట లేదు. అది చూసి ఆ గంధర్వుడు నాకు కళావతి అని పేరు పెట్టెను.
కొంత కాలము గడచిన పిమ్మట ఒక దినమున అలి అను పేరుగల రాక్షసుడు వచ్చి మహాత్ముడగు తండ్రిని నన్ను ఇమ్మని అడిగెను. ఆయన నన్ను ఎప్పుడు ఇవ్వలేదో, అప్పుడు అతడు రాత్రి యందు నిద్రించు చున్న నా తండ్రిని చంపి వేచెను. నేను ఆ దుఃఖముచే ధృఢ ప్రతిజ్ఞురాలనై ఆత్మ త్యాగమును చేయుటకు ఉద్యుక్యురాల నైతిని. అప్పుడు శంభుపతి యగు సతీ దేవి నన్ను నివారించి ఇట్లు చెప్పెను. ఓ సుభ్రు! దుఃఖింపకుము. స్వరోచి అను పేరు గల ఒక మహాభాగుడు నీకు భర్త అగును. మరియు ఆతని పుత్రుడు ‘మను’ రగును. ఓ శుభా! సంపూర్ణ నిధులు గౌరవముతో నీ ఆజ్ఞను పాలించును మరియు నీవు అభిలషించిన ద్రవ్యము లన్నియు ప్రసాదించును. ఓ కుమారీ! ఏ విద్యా ప్రభావముతో నిధి గణాలు ఆజ్ఞానువర్తులు అగునో, అట్టి మహా పద్మాభి పూజితయగు పద్మిని అను పేరు గల విద్యనూ నా నుండి గ్రహించుము.
సత్య పరాయణురాలగు దక్ష సుత యగు సతీ దేవి నాకు ఈ విషయమును చెప్పినది. ఆమె ఎన్నటికి అసత్యము చెప్పదు. అందువలన తమరు నిః సందేహముగా ఆ స్వరోచియే. నేను ప్రాణదాత నగు తమకు నా దేహము, ప్రాణము, మరియు ఆ విద్యను ఇచ్చు చున్నాను. మేరు నా యందు ప్రసన్నత జెంది నన్ను గ్రహింపుడు.
అనంతరము స్వరోచి కళావతితో “అట్లే అగు గాక” అని అంగీకరించెను. పిమ్మట స్నిగ్ధ దృష్టులు గల విభావరీ, కళావతుల ఆమోదముతో స్వరోచి వారిని పెండ్లియాడెను. వివాహ సమయము నందు దేవతలు, మంగళ వాద్యములు మ్రోగించిరి. అప్సరో గణములు నృత్యము చేసిరి.
Summary of chapter 60 of the Mārkandeya Mahā Purana is as follows:
Mārkaṇḍeya completes the account of the First Manvantara, summarizing the sages, devas, and royal lineages that flourished during the reign of Svāyambhuva Manu, affirming the eternal merit earned by those who contemplate these ancient cosmic origins.