మార్కండేయ మహా పురాణము
30 - శ్రాద్ధకల్పము
వత్సా! పాడ్యమి నాడు శ్రాద్ధము చేయుటచే ధన లాభము కలుగును. ఈ ప్రకారముగా విదియ యందు సంపత్తి లాభము, తదియ యందు వరప్రాప్తి, చతుర్థి యందు శ్రాద్ధము పెట్టినచో శత్రు నాశనమగును. పంచమి నాడు శ్రాద్ధము పెట్టుటచే శ్రీ లాభము, షష్టి యందు జన పూజ్వత్వము, సప్తమి నాడు రాజ్యాధిపత్యము, అష్టమి నాడు శ్రాద్ధము పెట్టుటచే వృద్ధి లాభము కలుగును. నవమి నాడు శ్రాద్ధ కర్మచే స్త్రీ లాభము, దశమి నాడు సమస్త కోర్కెలు సిద్ధించును. ఏకాదశి నాడు శ్రాద్ధకర్మచే సమస్త వేదముల యొక్క సమస్త వేరార్థ లాభము కలుగును. ఏ పురుషుడు ద్వాదశి తిథి నాడు పితృ శ్రాద్ధము చేయునో, వానికి జయ లాభము, సంతాన వృద్ధి, పశు వృద్ధి, మేధా లాభము, స్వాదీనతా లాభము, పుష్టి లాభము కలుగును. ఏ పురుషుడు త్రయోదశీ తిథి యందు యథా సంభవములైన అన్నాది పదార్థముల ద్వారా శ్రాద్ధ కర్మ చేయునో వానికి దీర్ఘాయుర్ధాయము, ఐశ్వర్యము కలుగును. సందేహము లేదు.
ఎవరి తల్లి దండ్రులు యౌవనావస్థ యందే మరణింతురో లేక శస్త్రాఘాతములచే ప్రాణ త్యాగము చేయుదురో, అట్టి పితరుల తృప్తి కొరకు చతుర్ధశీ తిథి యందు శ్రాద్ధ కర్మ చేయ వలెను. పవిత్రుడై ప్రయత్న పూర్వకముగా అమావాస్య యందు శ్రాద్ధము చేయుటచే సర్వ కామములు సిద్ధించును. అక్షయమగు స్వర్గ సుఖము కలుగును. పితరులను అర్చించినచో మానవుడు స్వర్గ సుఖములను బొందును. సంతాన మందు కోర్కె గల వాడు రోహిణీ నక్షత్ర మందు శ్రాద్ధము పెట్ట వలెను. మృగశిరా నక్షత్ర మందు శ్రాద్ధము చేయుటచే తేజస్సు గల వాడగును. ఆర్ద్రా నక్షత్ర మందు శౌర్యము మరియు పునర్వసు నక్షత్ర మందు క్షేత్రాది లాభము కలుగును. పుష్యమి నక్షత్ర మందు పుష్టి, ఆశ్లేష యందు శ్రేష్టమగు పుత్రుడు, మఘా నక్షత్ర మందు స్వజనములో ప్రాదాన్యుడు మరియు పూర్వ ఫల్గుణీ నక్షత్ర మందు సౌభాగ్య లాభము కలుగును.
ఉత్తర ఫల్గుణీ నక్షత్ర మందు శ్రాద్ధము చేయుటచే దానశీలుడు, పుత్రవంతుడు అగును. హస్తా నక్షత్రము నందు శ్రాద్ధపరుడు అగు నరుడు సత్పురుషులలో శ్రేష్ఠుడగును. చిత్తా నక్షత్ర మందు రూపవంతుడు, పుత్రవంతుడు అగును. స్వాతి యందు వాణిజ్య లాభము, కామ్యార్థ సిద్ధి కలుగును. అనురాధ యందు ఉత్తమ మగు ఆరోగ్యము కలుగును. పూర్వాషాడ యందు యశః ప్రాప్తి, ఉత్తరాషాడ యందు శోకరాహిత్యము, శ్రావణమున శుభాలోక ప్రాప్తి, ధనిష్టా నక్షత్ర మందు శ్రాద్ధ కర్మ చేసిన మహా ధన లాభము కలుగును. అభిజి న్నక్షత్ర మందు శ్ర్రాద్దానుష్టానముచే సమస్త వేదం విద్యను పొందును. శతభిషా నక్షత్ర మందు వైద్య శాస్త్రము సిద్ధించును. పూర్వా భాద్ర యందు అజావిక (గొర్రెలు, మేకలు) లాభము, ఉత్తారాభాద్ర యందు విద్యాప్రాప్తి, గోలాభము కలుగును. రేవతీ నక్షత్ర మందు సువర్ణ రజతాది లాభము, అశ్విని యందు అశ్వ లాభము, భరణి యందు శ్రాద్ధము చేయుటచే దీర్ఘాయుర్ధాయము కలుగును. ఈ కారణముచే తత్వము తెలిసిన పురుషుడు అన్ని నక్షత్రముల యందు కామ్య శ్రాద్ధము లన్నియు చేయ వలయును.
Summary of chapter 29 of the Mārkandeya Mahā Purana is as follows:
Madālasā instructs Prince Alarka in the sacred duties of the householder ashrama, which forms the pillar of all societal order. She details daily rituals, hospitality to guests, reverence toward parents, performance of the five mahāyajnas, and regular ancestral shrāddha. She emphasizes that a householder who earns wealth through righteous means and offers its fruits to Bhagavān attains heavenly realms equal to great ascetics.