మార్కండేయ మహా పురాణము
48 - దౌస్సహోత్వత్తి సమాపనము
దుస్సహునికి నిర్మాష్టి యను భార్య కలదు. ఆమె యముని కుమార్తె. యముని పత్ని ఋతుమతి అయి యుండగా చండాలుని చూచుటచే ఆమె గర్భము నుండి నిర్మాష్టి జన్మించినది. ఆ తరువాత దుస్సహుని వలన నిర్మాష్టికి జగత్ వ్యాప్తులు అత్యంత భీషణాకారులైన పదునారు మంది సంతానము కలిగిరి. వారిలో ఎనిమిది మంది పుత్రులు, ఎనిమిది మంది కన్యలు. దంతాకృష్టి, తథోక్తి, పరివర్త, అంగధ్రుక్, శకుని, గండప్రాంతరతి, గర్భహా, సస్యహులను ఎనిమిది మంది పుత్రులు కలిగిరి. ఇప్పుడు ఎనిమిది మంది కన్యల పేర్లు చెప్పెదను వినుము. నియోజికా, విరోధినీ, స్వయంహారకరీ, భ్రామణీ, ఋతుహారికా, స్మ్రుతిహరా, బీజహరా, ఈ ఇద్దరు మహా భయంకరులు. ఎనిమిదవది విద్వేషిణి ఈమె అన్ని లోకములకు మహా భయము కలిగించును.
ఓ ద్విజోత్తమా! ఇప్పుడు ఈ ఎనిమిది కుమారులు చేయు పనులు, వారి దోషములు, శామించుటకు చేయు ఉపాయములు చెప్పెదను వినుము. దంతాకృష్టి ప్రసూత బాలకుల దంతముల యందు ఉండి దంతములను ఒక దానితో మరొక దానిని రాచు కొనునట్లు చేయును. ఇతని ఆశ్రయము వలన అక్కడికి దుస్సహుడు కూడా వచ్చును. ఇది శమించుటకు ఉపాయా మేమనగా నిద్రించు చున్న బాలకుని దంతముల యందు, శయ్య పైన తెల్లని ఆవాలు చల్ల వలెను. మరియు ఔషధుల జలముతో స్నానము చేయించ వలెను. సత్ శాస్త్రముల కీర్తించ వలెను. ఒంటె ముళ్ళతో, గంగ యందలి అస్తికలతో యంత్రమును తయారు చేసి బాలకుని మెడలో వేయ వలెను. మరియు పట్టు వస్త్రము ధరింప చేసినచో బాలురకు శాంతి కలుగును.
రెండవ కుమారుడు తథోక్తి యనువాడు ‘అట్లే యగు గాక’ అని చెప్పుచు, మానవులందరి శుభా శుభ విషయములందు నియుక్తుడై యుండును. ఇది సత్యము. అందు వలన పండిత గణాలు శ్రేష్ఠ తరమగు మంగళములగు మాటలనే ఎల్లప్పుడు ప్రకాశింప చేయ వలెను. దుష్ట విషయములను వినిన గాని, చెప్పిన గాని, జనార్ధనుడగు భగవానుని కీర్తించ వలెను. లేక చరాచర జగత్తునకు గురువగు బ్రహ్మను కీర్తించ వలెను. లేక ఎవరు ఎవరికి కులదేవత యగునో, అతడు ఆ దేవతను కీర్తింప వలెను. పరివర్తకుడను మూడవ వాడు ఎల్లప్పుడు ఇతరుల గర్భ మందు వేరోకరో గర్భమును స్థాపించును. మరియు ఒక విధముగా చెప్ప వలసిన వచనములు వేరొక విధముగా చెప్పించి ప్రసన్ను డగును. దానిని తొలగించుటకు వీనికి గూడ తెల్లని ఆవాలను చల్ల వలెను. లేక రక్షోఘ్న మంత్రమును జపించుచు రక్షించు కొన వచ్చును. అంగద్రుకుడను నాల్గవ కుమారుడు వాయువు వలె మనుష్యుల అంగములను అదరునట్లు చేయును.
మరియు లోభము హర్షనము కారణముగా శుభాశుభ విషయములను ప్రకాశింప చేయును. అతనిని శాంతింప చేయ వలెననిన శరీరము నందు కుశాఘాతము చేయ వలెను. శకుని అను ఐదవ వాడు కాకి మొదలగు పక్షుల యందు, కుక్క లేక నక్కల శరీర మందు ఉండి, మానవుల శుభా శుభములను ప్రకాశింప చేయును. ఈ సమయ మందు అశుభ సూచకలగు చిహ్నములు ప్రకాశించి నప్పుడు సమస్త మగు పనులు త్యజింప వలెను. ఓ ద్విజోత్తమా! శుభ సూచక చిహ్నములు కనిపించిన యెడల వెంటనే కర్తవ్యమగు పనులు చేయ వలెను. అది ప్రజాపతి స్వయముగా చెప్పినాడు. గండాంతరతి యను ఆరవ కుమారుడు అర్థ ముహూర్త గండాంతర మందు ఉండి, సమస్త కార్యారంభములను, శుభ కర్మలను, అనసూయతను నష్ట పరచును. ఓ ద్విజోత్తమా! అతని శాంతి కొఱకు బ్రాహ్మణుల ఆశీర్వాదము, దేవతలను స్తుతించుట, మూల నక్షత్ర శాంతి చేయ వలెను. గో మూత్రము, తెల్లని ఆవాలతో స్నానము, ఆ నక్షత్రములను గ్రహములను పూజించుట ధర్మోపనిషత్తుల శ్రవణము. శాస్త్ర దర్శనములను పఠించ వలెను.
మరియు జన్మావజ్ఞము, జన్మ యొక్క తిరస్కారము, చేయుటచే గండ దోషమునకు శాంతి కలుగును. గర్భహా అను భయంకరుడగు ఏడవ కుమారుడు స్త్రీల గర్భము నందలి గర్భాశయమును నాశనము చేయును. దానిని శాంతింప చేయుటకు ఎల్లప్పుడూ శుద్ధ భావము చేత ప్రసిద్ధ మంత్రములు వ్రాయుట మూల్యాదులను ధరించుట, విశుద్ధమగు గృహము నందు వసించుట పరిశ్రమ చేయుట పరిత్యజింప వలెను. ఓ బ్రాహ్మణుడా! ఈ విధముగా సస్యహా అను ఎనిమిదవ కుమారుడు, సంపూర్ణ ధాన్యములను నష్ట పరచును. జీర్ణములగు పాద రక్షలను ధాన్య మందుంచుట, అప్రదక్షిణముగా పోవుట, చండాల ప్రవేశము చేతను ధాన్య రక్షణ చేయ వలెను. వెలుపల బలి ప్రదానము మరియు మంత్ర విశేష పాఠములను చేయుటచే దానికి శాంతి కలుగును. మొదటి కన్యయగు నియోజిత పర స్త్రీ గమనము మరియు పర ద్రవ్య హరనాది కార్యములను చేయును.
మనవి: ఇక్కడ 31 – 55 శ్లోకములు, భావము మూల గ్రంధము నందు లేవు.
Summary of chapter 47 of the Mārkandeya Mahā Purana is as follows:
The text describes the ninefold creation unfolded by Svayambhū Brahmā, categorized into Prākṛta and Vaikṛta creations. Mārkaṇḍeya details the elemental evolution of space, air, fire, water, and earth, along with the development of subtle tanmātras and sensory organs.