44వ అధ్యాయము

కూర్మ ఉవాచః-

అతః పరం ప్రవక్ష్యామి ప్రతిసర్గ మనుత్తమమ్

ప్రకృతిం హి సమాసేన శృణధ్వం గదతో మమ

గతే పరార్థద్వితయే కాలో లోకప్రకాలనః

కాలాగ్ని ర్భస్మసా త్కర్తుం కరోతి నిఖిలం మతిమ్

స్వాత్మ న్యాత్మ సమావేశ్య భూత్వా దేవా మహేశ్వరః

దహే దశేషం బ్రహ్మాండం సదేవాసురమానుషమ్

త మావిశ్య మహాదేవూ భగవా నీలలోహితః

కరోతి లోకసంహారం భీషణం రూప మాశ్రితః

ప్రవిశ్య మండలం సౌరం కృత్వా సౌ బహుధా పునః

నిర్ధహ త్యభిలం లోకం సప్తసప్తిస్వరూపధృక్

స దగ్ధ్వ సకలం సత్వ మస్త్రం బ్రహ్మశిరో మహత్

దేవతానాం శరీరేషు క్షిప త్యభిదాహకమ్

దగ్ధే ష్వశేషదేవేషు దేవీ గిరివరాత్మజా 

ఏకా సా సాక్షిణీ శంభో స్తిష్ఠతే వైదికీ శ్రుతిః

శిరః కపాలై ర్దేవానం కృతస్రగ్వరభూషణః

ఆదిత్యచంద్రాదిగణైః పూరయన్ వ్యోమమండలమ్

సహస్రనయనో దేవః సహస్రాకృతి రీశ్వరః

సహస్రహస్తచరణః సహస్రార్చి ర్మహాభుజః

దంష్ట్రాకరాళవదనః ప్రదీప్తానలలోచనః

త్రిశూలీ కృత్తివసనో యోగ మైశ్వర మాస్థితః

పీత్వా తత్పరమానందం ప్రభూత మమృతం స్వయమ్

కరోతి తాండవం దేవీ మాలోక్య పరమేశ్వరః

కూర్మము పలికెను.

ఇక ఇపుడు ప్రాకృత ప్రలయమును సంగ్రహముగా చెప్పెదను వినుడు. ద్వీతీయ పరార్థము గడువగా లోకములను నశింప చేయుకాలము కాలాగ్ని రూపముగా సకల జగత్తును భస్మము చేయుటకు సంకల్పించును. మహేశ్వరుడు తనలో జీవాత్మను చేర్చుకొని సదేవాసురమానుషమగు సకల బ్రహ్మాండమును దహింప చేయును. ఆ మహాదేవుడు భయంకరరూపమును దాల్చి లోకసంహారమును చేయును. సూర్యమండలమున ప్రవేశించి తనను తాను పలురూపములను దాల్చీ ఏడుకీరణములుకల సూర్యరూపమును దాల్చి అఖిల లోకమును దహింప చేయును. ఇట్లు పదార్థములనన్నింటిని దహించి బ్రహ్మశిరోసోమకాస్త్రమును దేవతాశరీరములందు విడుచును. ఇట్లు సకలదేవతలు దహించి పోగా పర్వత పుత్రి యగు పార్వతీదేవి ఒక్కతే లోకసాక్షిగా నిలుచును అని శ్రుతి. దేవతల కపాలములతో అలంకరించుకొని మాలలు ధరించి, ఆదిత్య చంద్రాది గణములతో ఆకాశమండలమును సింపుచు సహాస్రనయనుడై సహస్రాకృతులు దాల్చీ, సహస్ర చరణములను దోల్చి, సహస్ర జ్వాలలు కలవాడై దంష్ట్రాకరాల వదనుడై ఊగుగా ప్రజ్వలించు నేత్రాగ్నికలవాడై, త్రిశూలమును ధరించి, చర్మాంబరధారియై ఈశ్వర యోగమున నీలిచినవాడై, పరమానంద రూపమగు ప్రభూతామృతమును ద్రావి దేవిని చూచుచు తాండవమును చేయును.

పీత్వా నృత్తామృతం దేవీ భర్తుః పరమమంగళా

యోగ మాస్థాయ దేవస్య దేహ మాయాతి శూలినః

సంత్యక్త్వా తాండవరసం స్వేచ్ఛయైవ పీనాకధృక్

జ్యోతిఃస్వభావం భగవాన్ దగ్ద్వా బ్రహ్మాండమండలమ్

సంస్థితేష్వథ దేవేషు బ్రహ్మవిష్ణు పినాకీషు

గుణై ధశేషైః పృధివీ విలయం యాతి వారీషు

స వారిత స్తం సగుణం గ్రసతే హవ్యవాహనః

తేజస్తు గుణసంయుక్తం వాయౌ సంయాతి సంక్షయమ్

ఆకాశే సగుణె వాయుః ప్రలయం యాతి విశ్వభృక్

భూతాదౌ చ తధా కాశం లీయతే గుణసంయుతమ్

ఇంద్రియాణి చ సర్వాణి తైజసే యాంతి సంక్షయమ్

వైకారికే దేవగణాః ప్రలయం యాంతి సత్తమాః

వైకారిక సైజస శ్చ భూతాది శ్చేతి సత్తమాః

త్రివిధోయ మహంకారో మహతి ప్రలయం వ్రజేత్

మహాంత మేభిః సహితం బ్రహ్మాణ మతితేజసం

అవ్యక్తం జగతో యోనిః సంహరే దేక మవ్యయమ్

ఏవం సంహృత్య భూతాని తత్వానీ చ మహేశ్వరః

వియోజయంతీ చాన్యోస్యం ప్రధానం పురుషం పరమ్

ప్రధాసపుంసో రజయో రేష సంహార ఈ రితః

మహేశ్వరేచ్ఛాజనితో న స్వ   యం విద్యతే లయః

గుణసామ్యం తదవ్యక్తం ప్రకృతిః పరిగీయతే

ప్రధానం జగతో యోని ర్మాయ సత్వ మచేతనమ్

పరమమంగలయగు పార్వతి భర్త నాట్యామృతమును పానము చేసి యోగమునాశ్రయించి మహాదేవుని దేహమున ప్రవేశించును. అంతట పినాకపాణి తాండవరసమును చాలించి జ్యోతిస్వరూపుడై నిలిచి బ్రహ్మాండమండలమును దగ్గము గావించును. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు శివునిలో చేరిన తరువాత సంపూర్ణగుణములతో భూమి జలములో లీనమగును. సంపూర్ణగుణములతో కూడిన జలతత్త్వము అగ్నిలో బీసమగును. తేజస్సు సకల గుణములతో పోయువులో లీనమగును. సగుణమగు వాయువు ఆకాశములో లీనమగును. గుణసంయుతమగు ఆకోశము తామసాహంకారములో లీనమగును. అన్ని ఇంద్రియములు రాజసాహంకారములో లీనమగును. దేవగణములు వైకారికములో అనగా సాత్త్వికాహం కొరములో లీనమగును. ఇట్లు సాత్త్విక రాజస తామసాహంకారములు మూడు మహత్తత్వములో లీనమగును. పృథివి నుండి అహంకారము వరకు ఉన్న సకల తత్త్వములకు మూలమగు మహత్తత్వము అమిత తేజస్వియగు బ్రహ్మయే యగును. ఇట్టి అహంకార తత్త్వమును ప్రకృతి తత్త్వము ఉపసంహరించును. ఇట్లు భూతములను తత్త్వములను మహేశ్వరుడుపసంహరించి ప్రధాన పురుషులను వేరు చేయును. ఇదియే ప్రకృతి పురుషుల సంహారము. ఈ సంహారము కూడో మహేశ్వరునీ ఇచ్చోపూర్వకముగానే జరుగును. కాని తనంతతానుగా రాజాలదు. గుణసామ్యవస్థయే ప్రకృతి అవ్యక్తము అనబడును. జగత్తుకు మూలకారణము ప్రధానమే. ఇది అచేతనము మాయారూపముగా నుండును.

కూటస్థచిన్మయో హ్యాత్మా కేవలః పంచవింశకః

గీయతే మునిభిః సాక్షీ మహా నేక్షః పితామహః

ఏవం సంహారకరణీ శక్తి ధ్మాహేశ్వరీ ధ్రువా 

ప్రధానాధ్యం విశేషాంతం దహేత్ రుద్ర ఇతి శ్రుతిః

యోగిన మధ సర్వేషాం జ్ఞానవిన్యస్త్రచేతసాం

ఆత్యంతికం చైవ లయం విదధాతీహ శంకరః

ఇత్యేష భగవాన్ రుద్రః సంహారం కురుతే వశీ

స్థాపికా మోహినీ శక్తి ధ్నారాయణ ఇతి శ్రుతిః

హిరణ్యగర్భో భగవాన్ జగత్ సదసదాత్మకమ్

సృజే దశేషం ప్రకృతే స్తన్మయః పంచవింశకః

సర్వజ్ఞాః సర్వః శాన్తిః స్వాత్మన్యేవ వ్యవస్థితాః

శక్తయో బ్రహ్మవిషీశా భుక్తిముక్తిఫలప్రదాః

సర్వేశ్వరాః సర్వవంద్యాః శాశ్వతానన్తభోగినః

ఏక మేవాక్షరం తత్త్వం పుంప్రధానేశ్వదాత్మకమ్

అన్యాశ్చ శక్తయో దీవ్యాః సంతి తత్ర సహస్రశః

ఇజ్యంతే వివిధై ర్యజ్ఞైః శక్రాదిత్యా దయో మరాః

ఏకైకస్య సహస్రాణీ దేహానాం వై శతాని చ

 కధ్యంతే చైవ మాహ్యా చ్ఛక్తి రేకైవ నిర్గుణా

తాం తాం శక్తిం సమాధాయ స్వయం దేవా మహేశ్వరః

కరోతి దేహాన్ వివిధాన్ గ్రసతే చైవ లీలయా

ఇజ్యతే సర్వయజ్ఞేషు బ్రాహ్మణే ర్వేదవాదిభిః

సర్వకామప్రదో రుద్రః ఇత్యేషా వైదికీ శ్రుతిః

సర్వాసా మేవ శక్తీనాం బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

ప్రాధాన్యేన స్మృతి దేవాః శక్తయః పరమాత్మనః

కూటస్థుడు చిన్మయుడు అగు ఆత్మ 25వ తత్త్వరూపము. ఈ ఆత్మనే మునిగణము సాక్షి అని మహాన్ అని పితామహుడని యందురు. ఇట్లు మహేశ్వరుని శాశ్వతమగు శక్తి సంహారమును గావించును. ప్రధానమునుండి విశేషము వరకు దహింపబడునని శ్రుతి చెప్పుచున్నది. జ్ఞానులగు యోగులకు అత్యంతిక ప్రలయమును కూడా శంకరుడే చేయును.

సకల జగమును తన వశములో నుంచుకున్న రుద్రుడు ఇట్లు జగత్సంహారమును గావించును. శ్రుతిని అనుసరించి సకల జగత్తును స్థాపించు శివుని మోహినీ అనబడు శక్తినే సొరాయణుడందురు. 25వ తత్త్వమగు పురుషుని స్వరూపమగు హిరణ్యగర్భుడు సద సదాత్మకమగు సకల జగత్తును సృజించును. మహేశ్వరునిలో నుండు మూడు శక్తులు సర్వజ్ఞులు, సర్వవ్యాపులు, శాంతులు, బ్రహ్మ, విష్ణు ఈశ్వరుని రూపమున నామముతో నుండునవి భుక్తిని ముక్తిని ప్రసాదించును. ఈ శక్తులే సర్వేశ్వరరూపములు అందరిచే నమస్కరింపబడును. శాశ్వతములు అనన్త భోగములతో కూడుకొనియుండునవి. అద్వితీయమగు అక్షరతత్త్వమే పురుష ప్రధాన ఈశ్వర రూపముగా నుండును.

ఈ పరమాత్మలో అనగా అవ్యక్తమగు అక్షరతత్వములో ఇతరములగు శక్తులు వేలకొలదీ కలవు. ఈ శక్తులను కూడా పలు విధములగు యజ్ఞములద్వారా ఆరాధింతురు. వీటిలో ఇంద్ర ఆదిత్యాదులుగానుండు ఒకొక్క శక్తికి నూరులు వేలు దేహములుండును అని చెప్పబడుచున్ననూ ఈ అన్నిటికీ మూలమగు శక్తి ఒకటే నిర్గుణము. మహాదేవుడు స్వయముగా ఆయాశక్తులను స్వీకరించి పలు దేహములను సృజించును. అట్లే విలాసముగా సంహరించును కూడా. వేదవాదులగు బ్రాహ్మణులు అన్నియజ్ఞములతో ఈశక్తులను పూజింతురు. రుద్రుడే సర్వకామప్రదుడు అనునది వైదిక శ్రుతి. మహేశ్వర శక్తులన్నిటిలో ప్రధానమగు శక్తులు బ్రహ్మ విష్ణు శివాత్మకములు.

 ఆద్యః పరస్తాత్ భగవాన్ పరమాత్మా సనాతనః

 గీయతే సర్వశక్త్యాత్మా శూలపాణి ర్మహేశ్వరః

ఏన మేకే వదన్యగ్నిం నారాయణ మధాపరే

ఇంద్ర మేకే పరే విశ్వాన్ బ్రహ్మాణ మపరే జగుః

బ్రహ్మవిష్ణగ్నివరుణాః సర్వే దేహ స్త ధర్షయః

ఏకస్యై వాథ రుద్రస్య భేదా స్తే పరికీర్తితః

యం యం భేదం సమాశ్రిత్య యజంతి పరమేశ్వరం

తత్ తత్ రూపం సమాస్థాయ ప్రదదాతి ఫలం శివః

తస్మా దేకతరం భేదం సమాశ్రీత్యాపీ శాశ్వతమ్

ఆరాధయ న్మహాదేవం యాతి తత్పరమం పదమ్

కింతు దేవం మహాదేవం సర్వశక్తిం సనాతనమ్

ఆరాధయేత్ వై గిరిశం సగుణం వాథ నిర్గుణమ్

మయా ప్రోక్తో హి భవతాం యోగః ప్రాగేవ నిర్గుణః

ఆరురక్షు స్తు సగుణం పూజయేత్ పరమేశ్వరమ్

పినాకినం త్రినయనం జటిలం కృత్తివాససమ్

పద్మాసనస్థం రుక్మాభం చింతయేత్ వైదికీ శ్రుతిః

ఏష యోగః సముద్ధష్టక సబీజో ముని సత్తమాః

తస్మాత్ సర్వాన్ పరిత్యజ్య దేవాన్ బ్రహ్మపురోగమాన్

ఆరాధయేత్ విరూపాక్ష మాదిమధ్యాంతసంస్థితమ్

భక్తియోగసమాయుక్తః స్వధర్మనిరతః శుచిః

తాదృశం రూప మాస్థాయ సమయాత్యకం శివమ్

 ఏష యోగః సముద్దిష్టః సతేజోత్యంతభావనే

యధావిది ప్రకుర్వాణః ప్రాప్నుయా దైశ్వరం పదం

శూలపాణీయగు మహేశ్వరుడే ఆద్యము, జ్ఞాన శక్త్యాది గుణవిశిష్టము, అందరికంటే పరుడు, పరమాత్మ, సనాతనుడు సర్వశక్త్యాత్ముడుగా కీర్తించబడుచున్నాడు. ఇతనికే కొందరు అగ్ని అని మరికొందరు నారాయణుడని ఇతరులు ఇంద్రుడని మరికొందరు విశ్వేదేవులని ఇతరులు బ్రహ్మయని అందురు. బ్రహ్మ విష్ణు అగ్ని వరుణులు ఇతర దేవతలు ఋషులు ఇందరూ ఒకే రుద్రుని భేదములుగా (అంశములుగా) కీర్తించబడుదురు. పరమేశ్వరుని ఏరూపమునాశ్రయించి పూజింతురో, శివుడు పోరి వారికి ఆయారూపములో ఫలములనిచ్చును. కావున ఇన్ని భేదములలో ఏ ఒక్క అంశను ఆశ్రయించి పూజించిననూ ఆ పరమపదమును పొందును. అయిననూ మహాదేవుడు సర్వశక్తీ ధరుడు సనాతనుడు అగు శివుని సగుణిగా లేదా నిర్గుణునిగా ఆరాధించవలయును. నిర్గుణయోగమును మొదటనే చేప్పియుంటిని. సగుణోపాసన చేయదలచినవాడు కూడా

పరమేశ్వరుని ఆరాధించవలయును. దీనికి త్రినయనుడు, జటిలుడు చర్మాంబరుడు, స్వర్ణకాంతి కలవాడు పద్మాసనాసీనునిగా యున్న శివుని ధ్యానించవలయునని వైదిక శ్రుతి. ఇది సబీజ (సగుణ) యోగముగా చెప్పబడినది. కావున బ్రహ్మాది దేవతలను విడిచి ఆది మధ్యాంతములలో నిలిచియుండు విరూపాక్షుని ఆరాధించవలయును. స్వధర్మ నిరతుడై భక్తి యోగముగా నాశ్రయించినవాడు శివుని రూపమును ధరించి శివుని వద్దకు చేరును. ఇదీ సగుణోపాసనాయోగముగా చెప్పబడినది. ఈ యోగమును యధావిధిగా ఆచరించినవాడు ఈశ్వరుని పదమును చేరును.

అత్రా ప్యశక్తోథ హరం విష్ణుం బ్రహ్మాణ మర్చయేత్

అధ చే దసమర్ధః స్యాత్ తత్రాపీ మునిపుంగవాః

తతో వాయ్వగ్నిశక్రాదీన్ పూజయేత్ భక్తిసంయుతః

యే చాన్యే భావనే శుద్ధే ప్రాగుక్తే భవతా మిహ

అధాపీ కధితో యోగో నిర్బీజ శ్చ సబీజకః

జ్ఞానం తదుర్తం నిర్భీజం పూర్వం హి భవతాం మయా

  విష్ణుం రుద్రం విరించిం చ సబీజం భావయేత్ బుధః

అథవాగ్న్యాదికాం దేవాం స్తత్పరః సంయతేంద్రియః

పూజయేత్ పురుషం విష్ణుం చతుర్మూర్తిధరం హరిమ్

అనాదినిధనం దేవం వాసుదేవం సనాతనమ్

నారాయణం జగద్యోని మాకాశం పరమం పదం

తల్లింగధారీ నియతం తద్భక్త స్తదపాశ్రయః

ఏష ఏవ విధీ ర్బ్రా హ్మా భావనే చాంతికే మనః

ఇత్యేత త్కధీతం జ్ఞానం భావనాసంశ్రయం పరమ్

ఇంద్రద్యుమ్నాయ మునయే కధితం యన్మయా పురా

 అవ్యక్తాత్మక మేవేదం చేతనాచేతనం జగత్

తదీశ్వరః పరం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మమయం జగత్

 ఈ ఈశ్వర తత్త్వమును ఆరాధించుశక్తిలేని వారు హరుని విష్ణువును బ్రహ్మను అర్చించవలయును. వీరిని కూడా ఆర్చించలేని పోరు వాయువు అగ్ని ఇంద్రాదులను భక్తితో ఆరాధించవలయును. పూర్వము మీకు సగుణ నిర్గుణోపొసనలు చెప్పబడినవి. అవి పరిశుద్దములు.. వాటిని నిర్బీజసబీజ ఉపాసనలుగా చెప్పబడినవి. నిర్బీజ యోగమును ఇది వరకు మీకు చెప్పియుంటిని. విష్ణురుద్ర బ్రహ్మలను సబీజో పాసనయే చేయవలయును. లేదా అగ్న్యాది దేవతలను తత్పరుడై ఇంద్రియ నిగ్రహము కలవాడై చతుర్మూర్తిధరుడగు విష్ణువును పూజించవలయును. ఇతను ఆద్యంతములులేనివాడు అంతటా వ్యాపించియుండువాడు. సనాతనుడు నారాయణుడు జగత్కారణుడు పరమాకాశము పరమపదము. విష్ణు చిహ్నములను ధరించి విష్ణుభక్తుడై విష్ణువుకంటే ఇతరులసొశ్రయించని వాడై పూజించవలయును. ఇదే విధినీ బ్రహ్మ నారాధించుటలోకూడా అనుసరించవలయును.

ఇట్లు మీతో భావనాశ్రయమగు జ్ఞానమును వివరించితిని. నేను పూర్వము దీనినే ఇంద్రద్యుమ్న మునికి తెలిపితిని. చేతనాచేతనాత్మకమగు ఈసకల జగత్తు అవ్యక్తము అక్షరము అగు పరమాత్మ స్వరూపమే. ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ, కావున ఈ జగత్తంతయూ బ్రహ్మమాయ అనీ చెప్పబడినది.

సూతఉవాచ -

సూత మహర్షి పలికెను.

ఏతావ దుక్త్వా భగవాన్ విరరామ జనార్దనః

 తుష్టువు ర్మునయో విష్ణుం శశ్రేణ సహ మాధవమ్

ఇంత మాత్రము చెప్పి జనార్దన భగవానుడు విరమించెను. అంతట ఇంద్రునితో పాటు ఋషులందరూ శ్రీమన్నారాయణుని స్తుతించిరి.

మునయఊచుః –

నమస్తే కూర్మధూఫాయ విష్ణవే పరమాత్మనే

నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః

నమో నమస్తే కృష్ణాయ గోవిందాయ నమో నమః  

మాధవాయ నసు స్తుభ్యం నమో యజ్ఞేశ్వరాయ చ

 సహస్రశిరసే తుభ్యం సహస్రాక్షాయ తే నమః

నమః సహస్రహస్తాయ సహస్రచరణాయ చ

ఓం నమో జ్ఞానరూపాయు పరమాత్మస్వరూపిణే

ఆనందాయ నమ స్తుభ్యం మాయాతీతాయ తే నమః

నమో గూఢశరీరాయ నిర్గుణాయ నమోస్తు తే

పురుషాయ పురాణాయ సత్తామాత్రస్వరూపిణే

నమః సాంఖ్యాయు యోగాయ కేసలాయ నమోస్తు తే

ధర్మజ్ఞానాధిగమ్యాయ నిష్కలాయ నమో నమః

నమోస్తు ఫ్యానతత్వోదు మహాయోగేశ్వరాయ చ

పరావరాణాం ప్రభవే వేదవేద్యోయ తే నమః

నమో బుద్ధాయ శుద్ధాయ నమో యుక్తాయ హేతవే

  నమో నమో నమ స్తుభ్యం మానే వేధసే నమః

నమోస్తు తే వరాహాయ నారసింహాయ తే నమః

వామనాయ నమ స్తుభ్యం హృషీకేశాయ తే నమః

నమోస్తు కాలరుద్రాయ కాలరూపాయ తే నమః

స్వర్గాపవర్గదాత్రే చ నమోల్ల ప్రతిహతాత్మనే

నమో యోగాధిగమ్యాయ యోగినే యోగదాయినే

దేవానాం పతయే తుభ్యం దేవార్తిశమనాయ తే

భగవం స్వతసాదేన సర్వసంసార నాశనమ్  

అస్మాభి ర్వదితం జ్ఞానం యజ్ఞాత్వాల మృత మశ్నుతే

శ్రుతా స్తు వివిధా ధర్మా వంశా మన్వంతరాణి చ

సర్గశ్చ ప్రతిసర్గశ్చ బ్రహ్మాండ స్యాస్య విస్తరః

త్వం హి సర్వజగత్సాక్షి విశ్వో నారాయణః పరః

త్రాతు మ ర్హ స్యనన్హాత్మం స్త్వ మేవ శరణం గతి

కూర్మరూపుడవగునీకు నమస్కారము. పరమాత్మవగు విష్ణువునకు నమస్కారము, నారాయణునకు విశ్వునకు వాసుదేవునకు నమస్కారము. కృష్ణునకు గోవిందునకు నమస్కారము. మాధవునకు యజ్ఞేశ్వరునకు నమస్కారము, సహస్రశీర్పునకు సహస్రాక్షునకు, సహస్రహస్తునకు సహస్ర పొదునకు నమస్కారము. జ్ఞానరూపునకు పరమాత్మ స్వరూపునకు, గూఢ శరీరునకు నీర్గుణునకు నమస్కారము. పురాణపురుషునకు సత్తామాత్ర స్వరూపికీ సాంఖ్యమునకు యోగమునకు కేవలరూపుడవగు నీకు నమస్కారము. ధర్మజ్ఞానములచే పొందదగినవానికి నిషులునకు నమస్కారము. వ్యోమతత్వునకు మహాయోగేశ్వరునకు నమస్కారము. పరులకు అపరులకు ప్రభువైనవానికి వేదవేద్యునకు నమస్కారము. బుద్ధునకు శుద్దునకు యుక్తునకు హేతువునకు నమస్కారము. మాయికి బ్రహ్మస్వరూపుడవగు నీకు నమస్కారము. వరాహునకు నారసింహునకు నమస్కారము. వామనునకు హృషీకేశునకు నమస్కారము. కాలరుద్రునకు కాలరూపీకి నమస్కారము. స్వర్గమును అపవర్గమును ఇచ్చువానికీ దేవాధిపతికి దేవతాపనివారణునకు నమస్కారము. జ్ఞానశక్త్యాది షాఢుణ్యరూపా మీరా అనుగ్రహముతో సర్వసంసార నాశకమగుదాని, మోక్షమును పొందించు జ్ఞానమును పొండీనాము అనేక ధర్మములను, వంశములను, మన్వంతరములను, సర్గమును, ప్రతిసర్గమును, ఈ బ్రహ్మాండ విస్తారమును ఏంటిమి. నీవే సర్వ జగత్సాక్షివి, నీవే ప్రపంచము నీవే నారాయణుడవు నీవే పరుడవు అనంతస్వరూపీవీ మాకు నీవే శరణము. కావున మమ్ములను కాపాడుము.

సూత ఉవాచ -

ఏతత్ వః కథితం విప్రా యోగమోక్ష ప్రదాయకం

కౌర్మం పురాణ మఖిలం యజ్ఞగాద గదాధరః

అస్మిన్ పురాణే లక్ష్య్మాస్తు సంభవః కధితః పురా

మోహాయాశేషభూతాహాం వాసుదేవేన యోజనమ్

ప్రజాపతీనాం సర్గస్తు వర్ణధర్మాశ్చ వృత్తయః

ధర్మార్థకామమోక్షాణాం యథావ ల్లక్షణం శుభమ్

పితామహస్య విష్ణో శ్చ మహేశస్య చ ధీమతః

ఏకత్వం చ పృధక్వం చ విశేష శ్చోపవర్జితః

భక్తానాం లక్షణం ప్రోక్తం సమాచార శ్చ శోభనః

వర్ణాశ్రమాణాం కథితం యధావ దీహ లక్షణమ్

ఆదిసర్గ స్తతః పశ్చా దండావరణసప్తకం

హిరణ్యగర్భసర్గశ్చ కీర్తితో మునిపుంగపొః

కాలసంఖ్యాప్రకథనం మాహాత్యం చేశ్వరస్య చ 

బ్రహ్మణః శయనం చాప్సు నామ నిర్వచనం తథా

వరాహవపుషా భూయో భూమే రుద్ధరణం పునః

ముఖ్యాదిసర్గకథనం మునిసర్గ స్తధా పరః

వ్యాఖ్యాతో రుద్రసర్గా శ్చ ఋషి సర్గాశ్చ తాపసాః

ధర్మస్య చ ప్రజాసర్గా స్తామసాత్ ఫూర్వమేవ తు

బ్రహ్మవిష్ణువివాదః స్యాదంతర్దేహప్రవేశనం

పద్మోద్భవశ్చ దేవస్య మోహ స్తస్య చ ధీమతః

దర్శనం చైవ మాహేశ్య మాహాత్యం విష్ణు నేరితం

దివ్యదృష్టిప్రదానం చ బ్రహ్మణః పరమేష్ఠినః

సంస్తమో దేవదేవస్య బ్రహ్మణా పరమేష్ఠినా

ప్రసాదో గిరీశ స్యాథ వరదానం తథైవ చ

సంపాదో విష్ణునా సార్థం శంకరస్య మహాత్మనః

వరదానం తథా పూర్వ మంతర్థానం పినాకీనః

సూత మహర్షి పలికెను

ఓ బ్రాహ్మణోత్తములారా సాక్షాత్తుగా గదాధరుడు చెప్పినది. యోగక్షేమములను ప్రసాదించునది అగు కూర్మపురాణమును నేను మీకు చెప్పితిని. ఈ పురాణమున పూర్వము లక్ష్మీ సంభవము చెప్పబడినది. సకల జగములను మోహింప చేయుటకు లక్ష్మినీ వాసుదేవునితో కూర్చుట చెప్పబడినది. ప్రజాపతులసృష్టి వర్ణధర్మములు, వృత్తులు, శుభప్రదమగు ధర్మార్థకామ మోక్షముల లక్షణములు శుభప్రదమగు సదాచారలక్షణమును కూడా చెప్పితినీ, శాస్త్రానుసారముగా వర్ణాశ్రమ లక్షణము చెప్పబడినది. అట్లే ఆదిసర్గము సప్తవరణములతో కూడిన బ్రహ్మాండము కూడా వివరించబడినది. ముని పుంగవులారా హిరణ్యగర్భసృష్టిని కూడా తెలిపితిమి. కాలగణనావిధి ఈశ్వర మాహాత్మ్యము, బ్రహ్మ జలమున శయనము భగవానునీ నామములకు నిరుక్తము కూడా చెప్పబడినది. మరల వరాహరూపముతో భూమిని ఉద్ధరించుట ముఖ్యాదిసర్గము మునిసర్గము రుద్ర సర్గము ఋషి సర్గము, తాపససర్గము ధర్ముని ప్రజాసర్గము చక్కగా వివరించబడినవి. బ్రహ్మ విష్ణు వివాదము ఒకరు ఇంకొకరిదేహమున ప్రవేశించుట, బ్రహ్మపద్మమున పుట్టుట, జ్ఞానియగు బ్రహ్మకు మోహము మహేశ్వర దర్శనము విష్ణువుచే చెప్పబడిన మహేశ్వర మాహాత్మ్యము మహేశ్వరుడు బ్రహ్మకు దివ్యదృష్టి నొసగుట, పరమేష్టి యగు బ్రహ్మ మహేశ్వరుని నుతించుట, శివుడు ప్రసన్నుడై బ్రహ్మకు వరమునిచ్చుట మహాత్ముడగు శంకరునికి విష్ణువుతో సంవాదము, తరువాత వరప్రదానము శివుని అంతర్థానము వర్ణించబడినవి.

వధ శ్చ కధితో విప్రా మధుకైటభయేః పురా

అవతారోధ దేవస్య బ్రహ్మణిూ నాభిపంకజాత్

ఏకీభావశ్చ దేవస్య విష్ణునా కథిత స్తతః

విమోహో బ్రహ్మణ శ్చాథ సంజ్ఞాలాభో హరే స్తతః

తపశ్చరణ మాఖ్యాతం దేవదేవస్య ధీమతః

ప్రాదుర్భావా మహేశస్య లలాటాత్ కథితస్తతః

రుద్రాణాం కధీతో సృష్టి క్రహ్మణః ప్రతిబోధనమ్

భూతిశ్చ దేవదేవస్య వరదానోపదేశకౌ

అంతర్ధానం చ రుద్రస్య తపశ్చర్యాండజస్య చ

దర్శనం దేవదేవస్య నరనారీశరీరతా

దేవ్యా విభాగకథనం దేవదేవాత్ పినాకినః

దేవ్యా స్తు పశ్చాత్కథితం దక్షపుత్రీత్వ మేవ చ

హిమవత్దుహితృత్వం చ దేవ్య మాహాత్మ్య మేవ చ

దర్శనం దివ్యరూపస్య వైశ్వరూపస్య దర్శనమ్

నామ్నాం సహస్రం కథితం పిత్రా హిమవతా స్వయమ్

ఉపదేశో మహాదేవ్యా వరదానం తథైవ చ

భృగ్వాదీనాం ప్రజాసర్గో రాజ్ఞాం వంశస్య విస్తరః

ప్రాచేతసత్వం దక్షస్య దక్షయజ్ఞవీమర్ధనమ్

దధీచస్య చ దక్షస్య వివాదః కధిత స్తధా 

తతశ్చ శాపః కధితో మునీనాం మునిపుంగవాః

శ్రీ మహావిష్ణువు వలన మధుకైటభవధ, విష్ణునాభికమలమునుండి బ్రహ్మ అవతరించుట, విష్ణువులో బ్రహ్మాఐక్యమును చెందుట, బ్రహ్మ మోహము మరల విష్ణువు వలన తెలివి తెచ్చుకొనుట వర్ణించబడినది. బ్రహ్మతపమునోచరించుట, బ్రహ్మలలాటమునుండీ మహేశ్వరుని ఆవిర్భావము, రుద్రులసృష్టి, బ్రహ్మద్వారా ఆసృష్టిని నిషేధించుట, దేవాధిదేవుడగు శంకరుని ఐశ్వర్యవర్ణనము, బ్రహ్మకు వరమునిచ్చుట, ఉపదేశమునిచ్చుట, రుద్రుని అంతర్థానము, బ్రహ్మతపమాచరించుట,దేవాధిదేవుడగు శంకరునిదర్శనము, నరనారీరూపము (అర్థనారీశ్వరు) దాల్చుట. శంకరుని నుండి పార్వతివేరగుట, పార్వతీ పూర్వము దక్షపుత్రిగా ఉన్న ఇతి వృత్తము తరువాత హిమవంతుని పుత్రిక యగుట, దేవీ మాహాత్మ్యము, దివ్యరూపదర్శనము, విశ్వరూప దర్శనము, తండ్రియగు హిమవంతుడు స్వయముగా సహస్ర నామములను తెలుపుట. మహాదేవి చేసిన ఉపదేశము, వరప్రసాదము కూడా వివరించబడినవి. భృగ్వాది ఋషుల ప్రజాసృష్టి రాజుల వంశవర్ణనము వంశ విస్తారము, దక్షప్రజాపతి ప్రచేతపుత్రుడగుట, దక్షయజ్ఞ ధ్వంసము, దక్ష దధీచి వివాదము, మునుల శాపము వర్ణించబడినవి.

 రుద్రాగతిః ప్రసాదశ్చ అంతర్జానం పినాకినః

పితామహస్యోపదేశః కీర్త్యతే రక్షణాయ తు

దక్షస్య చ ప్రజాసర్గః కశ్యపస్య మహాత్మనః

హిరణ్యకశిపో ర్నాశః హిరణ్యాక్ష వథ స్తధా

తతశ్చ శాపః కథతో దేవదారువనౌకసాం

నిగ్రహ శ్చాఛకస్యాపీ గాణాపత్య మనుత్తమమ

ప్రహ్లాదనిగ్రహ శ్చాథ బలేః సంయమనం తతః

బాణస్య నిగ్రహ శ్చాథ ప్రసాద స్తస్య శూలినః

ఋషీణాం వంశవిస్తారో రాజ్ఞాం వంశాః ప్రకీర్తితాః

వసుదేవాత్ తతో విష్ణో రుత్పత్తిః స్వేచ్ఛయా హరేః

దర్శనం చోపమన్యో ర్వై తపశ్చరణ మేవ చ

వరలాభో మహాదేవం దృష్ట్వా సాంబత్రిలోచనమ్

కైలాసగమనం చాథ నీవాస స్తత్ర శారిఙ్గణః

తతశ్చ కథ్యతే భీతి ర్ద్వారవత్యో నీవాసీనామ్

రక్షణం గరుడేనాథ జిత్వా శత్రూన్ మహాబలాన్

నారదా గమనం చైవ యాత్రా చైవ గరుత్మతః

తతశ్చ కృష్ణాగమనం మునీనా మాగతి స్తతః

నైత్యకం వాసుదేవస్య శివలింగార్చనం యధా

మార్కండేయస్య చ మునేః ప్రశ్నః ప్రోక్తః తతః పరమ్

లింగార్చననిమిత్తం చ లింగస్యాపి సలింగినః

తరువాత రుద్రునిరాక, అనుగ్రహము, శంకరుని అంతర్థానము, దక్షుని రక్షించుటకు పితామహోపదేశము, కశ్యపుని ప్రజాసృష్టి వర్ణించబడినవి, హిరణ్యకశ్యపుని వధ, హిరణ్యాక్షవధ, దేవదారువనవాసుల శాపము అంధక నిగ్రహము, అంధక గాణాపత్యము ప్రహ్లాదనిగ్రహము, బలి బంధనము, బాణుని నిగ్రహము మరల శంకరుని అనుగ్రహము, ఋషి వంశ విస్తారము, రాజుల వంశ విస్తారము, శ్రీహరి వసుదేవుని పుత్రునిగా పుట్టుట ఉపమన్యుదర్శనము, తపస్సునాచరించుట, తరువాత దేవీ సహితుడగు శంకరుని దర్శనము, వరలాభము, శ్రీహరి కైలాసమునకు వచ్చుట, కైలాసమున నివసించుట, ద్వారకలో నుండు వారీ భయము గరుడుడు మహాబలులగు శత్రువులను జయించి ద్వారకావాసులను రక్షించుట. నారదుని ఆగమనము గరుత్మంతుని యాత్ర, తరువాత కృష్ణునిరాక, మునులరాక, వాసుదేవుడు నిత్యమాచరించు శివలింగార్చన వర్ణనము, మార్కండేయుడు లింగార్చన విషయమున శ్రీకృష్ణుని అడుగుట, శ్రీకృష్ణుడు వివరించుట, శివుని లింగస్వరూప నిరూపణము వివరించబడినవి.

యాథాత్యకథనం చాధ లింగావిర్భావ ఏవ చ

బ్రహ్మవిష్ణో స్తధా మధ్యే కీర్తితో మునిపుంగవాః

మోహ స్తయోస్తు కధితో గమనం చోర్థ్వతోప్యథ

సంస్తమో దేవదేవస్య ప్రసాదః పరమేష్టినః

అంతర్ధానం చ లింగస్య సాంబోత్పత్తి స్తతః పరమ్

కీర్తితా చానిరుద్ధస్య సముత్పత్తి ర్ద్విజోత్తమాః

కృష్ణస్య గమనే బుద్ధిః ఋషీణా మాగతి స్తథా

అనుశాసితం చ కృష్ణన వరదానం మహాత్మనః

గమనం చైవ కృష్ణస్య పార్ధస్యాపి చ దర్శనం

కృష్ణద్వైపాయన స్యోక్తి యుగధర్మాః సనాతన

అనుగ్రహోథ పార్థస్య వారణాసీగతీ స్తతః

పారాశర్యస్య చ మునే ర్వ్యాసస్యాద్భుతకర్మణః

వారాణస్యా శ్చ మాహాత్మ్యం తీర్థానాం చైవ వర్ణనమ్

తీర్థయాత్రా చ వ్యాసస్య దేవ్యా శ్చైవచ దర్శనమ్

ఉద్వాసనం చ కథితం వరదానం తదైవ చ

ప్రయాగస్య చ మాహాత్మ్యం క్షేత్రాణా మథ కీర్తనమ్

ఫలం చ విపులం విప్రా మార్కండేయస్య నిర్గమః

భువనానాం స్వరూపం చ జ్యోతిషాం చ నివేశనమ్

కీర్త్యంతే చైవ వర్షాణీ నదీనాం చైవ నిర్ణయ

పర్వతానాం చ కథనం స్థానానీ చ దివౌకసామ్

ద్వీపానాం ప్రవిభాగా శ్చ శ్వేతద్వీపోషవర్ణనమ్

బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిర్లింగావిర్భావము, జ్యోతిర్లింగ యధార్ధస్వరూపము, బ్రహ్మ విష్ణువుల మోహము, లింగ పరిమాణమును తెలియుటకు బ్రహ్మ విష్ణువులు ఊర్ధ్వాధో భాగములకు వెళ్ళుట, శివుని స్తుతించుట శివుడు వారిని అనుగ్రహించుట వివరించబడినవి.

 శివలింగాంతర్థానము, సాంబుని ఉత్పత్తి అనిరుద్ధుని ఉత్పత్తి, కృష్ణుడు స్వలోకమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనుట, ఋషులరాక, కృష్ణభగవానుడు ఋషులకు ఉపదేశమును, వరములను అనుగ్రహించుట, కృష్ణభగవానుడు స్వధామమునకు వెళ్ళుట, అర్జునుడు కృష్ణద్వైపాయనుని దర్శించుట, కృష్ణద్వైపాయనుడు సనాతనమగు యుగధర్మములను ఉపదేశించుట, అర్జునుని అనుగ్రహించుట, అధ్భుత కర్ముడగు వ్యాసుడు వారాణసీ నగరమునకు వెళ్ళుట వర్ణించబడినవి.

వారాణసీ మాహాత్మ్యము తీర్థముల ప్రభావము, వ్యాసమహర్షి తీర్థయాత్రల వర్ణన, దేవీదర్శనము, దేవి వ్యాసుని కాశీనగరము నుండి పంపించుట, మరల అనుగ్రహించుట, ప్రయాగ మాహాత్మ్యము, ఇతర క్షేత్రముల ప్రభావము, తీర్థయాత్ర ఫలము, మార్కండేయుని నిర్గమనము సకల లోకముల స్వరూపము, గ్రహముల నక్షత్రముల స్థితి, వరముల నదుల నిర్ణయము, పర్వతములను దేవతల స్థానములను వర్ణించుట ద్వీపముల విభాగము శ్వేతద్వీప వర్ణనము చేయబడినది.

శయనం కేశవస్యాథ మాహాత్మ్యం చ మహాత్మనః

మన్వంతరాణాం కథనం విష్ణో ర్మాహాత్య మేవ చ

వేదశాఖాప్రణయసం వ్యాసానాం కథనం తతః

అవేదస్య చ వేదానాం కథనం మునిపుంగవాః

యోగేశ్వరాణాం చ కథా శిష్యాణాం చాథ కీర్తనమ్

గీతా శ్చ వివిధా గుహ్యా ఈశ్వర స్యాథ కీర్తితాః

వర్ణాశ్రమాణా మాచార ప్రాయశ్చిత్తవిధి స్తతః

కపాలిత్వం చ రుద్రస్య భిక్షాచరణ మేవ చ

పతివ్రతాయా శ్చాఖ్యానం తీర్థానాం చ వీనిర్ణయః

తధా మఙ్ఖణకస్యాథ నిగ్రహః కీర్త్యతే ద్విజాః

వధశ్చ కధితో విప్రాః కాలస్య చ సమాసతః

దేవదారువనే శంభోః ప్రవేశో మాధవస్య చ

దర్శనం షట్కులీయానాం దేవదేవస్య ధీమతః

వరదానం చ దేవస్య నందినే తు ప్రకీర్తితమ్

నైమిత్తిక స్తు కఠితః ప్రతిసర్గ స్తతః పరమ్

ప్రాకృతః ప్రలయ శ్చాథ సబీజో యోగ ఏవ చ

ఏవం జ్ఞాత్వా పురాణస్య సంక్షేపం కీర్తయేత యః

సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే

ఏవ ముక్త్వా శ్రియం దేవీ మాదయ పురుషోత్తమః

సంత్యజ్య కూర్మసంస్థానం స్వస్థానం చ జగామ హ

శ్రీమన్నారాయణునియోగనిద్ర, శ్రీహరీ మాహత్మ్యము, మన్వంతర కథనము, శ్రీవిష్ణుమహిమ, వేదశాభారచన, వ్యాసుల నామపరిగణసము, వేదబాహ్య సిద్దాంతములను చెప్పుట, వేదమును వివరించుట, యోగేశ్వరుల కథనము, శిష్యుల కథనము, ఈశ్వరునికి సంబంధించిన రహస్య గీతాలు, వర్ణాశ్రమాచారవీధి, ప్రాయశ్చిత్త విధి, రుద్రుడు కపాలీయగుట, భిక్షను చరించుట, పతివ్రతల ప్రభావము, తీర్థముల నిర్ణయము, మంజనుని నిగ్రహము, కొలుని వధ, దేవదారువనమున శివమాధవుల ప్రవేశము, షట్కులీయులకు శంభుదర్శనము, నందికి చేసిన వరదానము, నైమిత్తికప్రలయము, ప్రాకృత ప్రలయము, సబీజ నిర్బీజయోగములు చెప్పబడినవి. ఇట్లు కూర్మ పురాణ సంక్షేపమును తెలిసి వివరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమును చేరును. ఇట్లు పురాణమును మునులకు వివరించిన శ్రీహరి తనకూర్మరూపమును పరిత్యజించి లక్ష్మితో కలిసి స్వస్థానమునకు వెళ్ళెను.

దేవా శ్చ సర్వే మునయః స్వాని స్థానాని భేజిరే

  ప్రణమ్య పురుషం విష్ణుం గృహీత్వా హ్యమృతం ద్విజా

ఏతత్ పురాణం పరమం భాషితం కూర్మరూపిణా

సాక్షాత్ దేవాదిదేవేన విష్ణునా విశ్వయోగినా

యః పఠేత్ సతతం మర్త్యా నియమేన సమాహితః

సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే

లిఖిత్వా చైవ యో దద్యాత్ వైశాఖే మాసి సువ్రతః

విప్రాయ వేదవిదుషే తస్య పుణ్యం నిబోధత

సర్వపాపవినిర్ముక్తః సర్వైశ్యర్యసమన్వితః

భుక్త్వా చ వీపుభాన్ స్వర్ణే భోగాన్ దివ్యాస్ సుశోభనాన్

తతః స్వర్గాత్ పరీభ్రష్టా విప్రాణాం జాయతే కులే

పూర్వసంస్కారమాహాత్మ్యాత్ బ్రహ్మవిద్యా మవాప్నుయాత్

పఠిత్వా ధ్యాయ మేవైకం సర్వపాపైః ప్రముచ్యతే

యో ర్ధం విచారయేత్ సమ్యక్ స ప్రాప్నోతి పరం పదమ్

అధ్యేతవ్య మిదం నిత్యం విప్రైః పర్వణి పర్వణీ 

శ్రోతవ్యం చ ద్విజశ్రేష్టా మహాపాతకనాశనమ్

ఏకతస్తు పురాణాని సేతిహాసాని కృత్స్నశః

ఏకత్ర చేదం పరమ మేత దేవాతి రిచ్యతే

ధర్మనైపుణ్యకామానాం జ్ఞాననైపుణ్యకామినాం

ఇదం పురాణం ముక్త్వైకం నాస్త్యనాత్ సాధనం పరం

సకల దేవతలు సకల మునులు తమతమ స్థానములను చేరిరి. జ్ఞానామృతమును పొంది శ్రీ మహావిష్ణువును నమస్కరించి వెడలిరి.

సకల జగత్కారణుడు దేవాదిదేవుడగు శ్రీమహావిష్ణువు కూర్మరూపమును ధరించి ఈపురాణమును వినిపించెను. నియమముతో సావధానముతో ఈపురాణమును పఠించినవాడు, సర్వపాపవినిర్ముక్తుడై బ్రహ్మలోకమున నివసించును. వైశాఖ మాసమున వ్రతమును స్వీకరించిన విప్రుడు ఈ పురాణమును ప్రాసీ వేదవిదుడగు బ్రాహ్మణునకు దానము చేసిన కలుగు ఫలమును తెలియుము. సర్వపాపములు తొలగి సర్వైశ్వర్యములు కలిగి, స్వర్గమున దివ్యములు శోభనములు విపులములగు భోగములను అనుభవించును.

స్వర్గమునుండి పరిభ్రష్టుడై విప్రకులమున పుట్టును. పూర్వసంస్కార ప్రభావమువలన బ్రహ్మవిద్యను పొందును. ఈ పురాణమున ఒక అధ్యాయమును చదివిననూ సర్వపాపములు తొలగును. చక్కగా అర్థమును పరిశీలించినవాడు పరమపదమును పొందును. ఎల్లపుడు ఈ పురాణమును, బ్రాహ్మణులు ప్రతి పర్వమున పఠించవలయును. మహాపాతకమును నశింపచేయు ఈ పురాణమును తప్పక వినవలయును. సకల పురాణేతిహాసములొక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. అన్నిటికంటే ఈ పురాణమే అతిశయించును. ధర్మములలో ఉత్తమత్వము నిష్ణాత త్వమును కోరువారికి ఈ పురాణమునకు సాటి మరొకటి లేదు.

యధావ దత్ర భగవాన్ దేవో నారాయణో హరిః

 కథ్యతే హి యథా విష్ణు ర్న తధాన్యేషు సువ్రతాః

బ్రాహ్మీ పౌరాణికీ చేయం సంహితా పాపనాశనీ

అత్ర తత్ పరమం బ్రహ్మ కీర్యతే హి యధార్థతః   

తీర్థానాం పరమం తీర్థం తపసాం చ పరం తపః

జ్ఞానానాం పరమం జ్ఞానం వ్రతానాం పరమం ప్రతమ్

నా ధ్యేతవ్య మిదం శాస్త్రం వృషలస్యచ సన్నిధౌ

యో ధీతే సహీ మాహాత్మా స యాతి నరకాన్ బహూన్

శ్రాద్దేవా దైవికే కార్యే శ్రవణీయం ద్విజాతిభిః

యజ్ఞంతే తు విశేషేణ సర్వదోషవిశోధనమ్

ముముక్షూణాం ఇదం శాస్త్ర మధ్యేతవ్యం విశేషతః

శ్రోతవ్యం చాడ మంతవ్యం వేదార్థపగిబృంహణమ్

జ్ఞాత్వా యథావత్ విపేంద్రా శ్రావయేత్ భక్తిసంయుతాన్

సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మసాయుజ్య మాప్నుయాత్

యోశ్రద్ధధానే పురుషే దద్యా చ్చా ధార్మికే తధా

స ప్రేత్య గత్వా నిరయాన్ శునాం యోనిం వ్రజ త్యథః

నమస్కృత్య హరిం విష్ణుం జగద్యోనిం సనాతనమ్

అధ్యేతవ్య మిదం శాస్త్రం కృష్ణద్వైపాయనం తథ

ఇత్యాజ్ఞా దేవదేవస్య విష్ణో రమితతేజసః

పారాశర్యస్య విప్రర్షేః వ్యాసస్య చ మహాత్మనః

ఈ పురాణమున శ్రీ మన్నారాయణ భగవానుడు శ్రీహరి విష్ణుదేవుడు చెప్పబడినట్లు ఇతర పురాణములలో చెప్పబడలేదు. ఇది పౌరాణికీ బ్రాహ్మీసంహిత. సకల పాపనాశిని. ఈ పురాణమున యథార్థముగా పరమబ్రహ్మ కీర్తించబడెను. ఈ పురాణము అన్ని తీర్దములలో ఉత్తమ తీర్థము. తపములలో ఉత్తమతపము. జ్ఞానములలో పరమ జ్ఞానము. వ్రతములలో ఉత్తమ వ్రతము. ఈ పురాణమును శూద్రుని సమీపమున చదువరాదు. అట్లు చదివిన మోహితుడు బహునరకములను పొందును. శ్రాద్దమున కాని దైవకార్యమున కానీ ద్విజులు వినవలయును. యజ్ఞ సమాప్తిలో ఈ పురాణమును చదివినచో సర్వదోషములు తొలగును. మోక్షముకోరు వారు తప్పక ఈ పురాణమును విశేషించి చదువ వలయును. వేదార్థమును విస్తరింప చేయు ఈ పురాణమును వినవలయును. మననము చేయవలయును. చక్కగా తెలుసుకొని భక్తిగల బ్రాహ్మణోత్తములకు వినిపించినచో సర్వపాపములు తొలగి బ్రహ్మ సాయుజ్యమును పొందును. శ్రద్ధారపొతునికి అధార్మికునకు ఈపురాణమును వినిపించినచో మరణించిన తరువాత బహునరకములపాలై మరల కుక్కగా పుట్టును.

 జగత్కారణభూతుడు సనాతనుడు అగు శ్రీమహావిష్ణువునకు నమస్కరించీ, అట్లే కృష్ణ ద్వైపాయనునకు కూడా నమస్కరించి ఈ పురాణ శాస్త్రమును అధ్యయనము చేయవలయును. ఇది అమీతతేజస్వి దేవదేవుడగు శ్రీ మహావిష్ణువాజ్ఞ మరియు బ్రహ్మర్షి, మహాత్ముడు, పారాశర్యుడగు వేదవ్యాస భగవానుని ఆజ్ఞకూడా.

శ్రుత్వా నారాయణాత్ దివ్యాం నారదో భగవాన్ ఋషిః

గౌతమాయ దదౌ పూర్వం తస్మా చ్ఛైవ పరాశరః

పరాశరోపి భగవాన్ గంగాద్వారే మునీశ్వరాః

మునీభ్యః కథయామాస ధర్మకామార్ధమోక్షదమ్

బ్రహ్మణా కథితం పూర్వం సనకాయ చ ధీమతే

సనత్కుమారాయ తథా సర్వపాపప్రణాశనమ్

సనకాత్ సాక్షాత్ భగవాన్ దేవలో యోగవిత్తమః

అవాప్తవాన్ పంచశిఖో దేవలో దీద ముత్తమమ్

సనత్కుమారాత్ భగవాన్ మునిః సత్యవతీసుతః

లేభే పురాణం పరమం వ్యాసః సర్వార్థసంచయమ్

తస్మాత్ వ్యాసా దహం శ్రుత్వా భవతాం పాపనాశనమ్

ఊచివాన్ వై భవద్భిశ్చ దాతవ్యం ధార్మికైః జనైః

తస్మై వ్యాసాయ గురవే సర్వజ్ఞాయ మహర్షయే

పారాశర్యాయ శాంతాయ నమో నారాయణాత్మనే

యస్మాత్ సంజోయతే కృత్స్నం యత్ర చైవ ప్రలీయతే

నమ స్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్థే చతుశ్చత్వారింశోధ్యాయః కూర్మపురాణం సమాప్తం.

శ్రీ కూర్మమహాపురాణమును శ్రీమన్నారాయణుని వలన నారదభగవానుడు విని గౌతమమహర్షికి చేప్పేను. గౌతమమహర్షి పరాశర మహర్షికి బోధించెను. పరాశరభగవానుడు కూడా గంగాద్వారమున ధర్మార్థ కామ మోక్ష ప్రదమగు ఈ పురాణమును మునులకు బోధించెను.

అట్లే పూర్వము బ్రహ్మ సనక మహర్షికి సనత్కుమారునకు సర్వపాప ప్రణాశనమగు ఈ పురాణమును బోధించెను. సనక మహర్షి యోగ విత్తముడగు దేవలునకు దేవలుడు పంచశిఖునకు బోధించెను. సనత్కుమారుని వలన సత్యవతీసుతుడగు వ్యాసభగవానుడు, సర్వార్థ సంచయము పరమమగు ఈ పురాణమును పొందెను. ఆ వ్యాస భగవానుని వలన వినిన నేను పాపనాశకమగు ఈ పురాణమును మీకు చెప్పితిని. మీరు కూడో ఛార్మీకునకు ఈయవలయును.

సర్వజ్ఞుడు, మహర్షి, గురువు, పరాశరపుత్రుడు, శాంతుడు నారాయణ స్వరూపుడగు వ్యాసభగవానునకు నమస్కారము. ఈ సకల జగత్తును సృజించి మరలతనలోనే లీనము చేసుకొను దేవాధినాధుడు కూర్మ రూపియగు శ్రీ మహావిష్ణువునకు నమోవాకములు.

ఇది శ్రీకూర్మపురాణమున షట్ సాహస్ర సం హితలో ఉపరి విభాగమున 44వ అధ్యాయము సమాప్తము.

శ్రీ కూర్మపురాణము సమాప్తము