39వ అధ్యాయము

మార్కండేయ ఉవాచః-

 నర్మదా సరితం శ్రేష్టా సర్వపాపవినాశినీ

మునిభిః కధీతా పూర్వ మిశ్వరేణ స్వయంభువా

మునిభిః సంస్తుతా హ్యేషా నర్మదా ప్రవరా నదీ

రుద్రగాత్రాత్ వినిష్క్రాంతా లోకానాం హితకామ్యయా

సర్వపాపహరా నిత్యం సర్వదేవనమస్కృతా

సంస్తుతా దేవగంధర్వై రప్సరోభిః తథైవ చ

ఉత్తరే చైవ తత్కూలే తీర్థం త్రైలోక్యవీశ్రుతమ్

నామ్నా భద్రేశ్వరం పుణ్యం సర్వపాపహరం శుభమ్

తత్ర స్నాత్వా నదో రాజన్ దైవతైః సహ మోదతే

తతో గచ్ఛేత రాజేంద్ర తీర్థ మామ్రాతకేశ్వరం

తత్ర స్నాత్వా నరో రాజన్ గోసహస్రఫలం లభేత్

తతో జ్గారేశ్వరం గచ్ఛే న్నియతో నీయతాశనః

సర్వపాపవిశుద్దాత్మా కేదారం నామ పుణ్యదమ్

తత్ర స్నాత్వోదకం కృత్వా సర్వాన్ కామా నవాప్నుయాత్

పిప్పలేశం తతో గచ్ఛేత్ సర్వపాపవినాశనమ్

తత్ర స్నాత్వా మహారాజ రుద్రలోకే మహీయతే

తతో గచ్ఛేత రాజేంద్ర విమలేశ్వర ముత్తమమ్

తతః పుష్కరిణీం గచ్చేత్ స్నానం తత్ర సమాచరేత్

 స్నాతమాత్రే నర స్తత్ర ఇంద్రస్యాత్థాసనం లభేత్

మార్కండేయుడు పలికెను.

నర్మదానది అన్ని నదులలోకి శ్రేష్టమైనది. సర్వపాప ప్రణాశనము. శంకరుడు, బ్రహ్మ, మునులు కూడా పూర్వకాలమున నర్మదా ప్రభావమును తెలిపిరి. సర్వోత్తమమైన నర్మదానదిని, ఋషులు స్తుతించిరి. లోకములకు హితమును చేకూర్చుసంకల్పముతో రుద్ర దేహము నుండి వెలువడినది. ఈనది సర్వపాపహరము. ఎల్లప్పుడు దేవతలందరిచేత నమస్కరించబడునది. దేవగంధర్వ అప్సరసలతో స్తుతించ బడినది. ఈ నర్మదానదికి ఉత్తరతీరమున భద్రేశ్వరమను తీర్థము మూడులోకములలో సుప్రసిద్ధము. పరమ పావనము. సర్వపాపహరము. శుభకరము. ఈ తీర్థమున స్నానము చేసినవారు స్వర్గమున దేవతలతో కలిసి విహరింతురు. ఈ తీర్థమునుండి ఆమ్రతకేశ్వరమను తీర్థమునకు వేడవలవలెను. ఇచట స్నానము చేసినవాడు, గోసహస్ర దాన ఫలమును పొందును. ఇటనుండి అంగేశ్వర తీర్దమునకు వెళ్లవలెను. ఈ తీర్థమున మనోనిగ్రహము కలిగి, నియతాహారుడైన వానికి అన్ని పాపములు తొలగి, రుద్రలోకము లభించును. ఇటనుండి కేదార తీర్థమునకు వెళ్లవలెను, ఇచట స్నానముచేసి, తర్పణము చేసిన వానికి సకల అభీష్టములు సిద్ధించును. ఇటసుండీ సర్వపాపవినాశకమగు పిప్పలేశమును చేరవలెను. ఇచట స్నానము చేసినపోడు రుద్రలోకమున ఆనందించును. ఇచటనుండి విమలేశ్వరమునకు వెళ్లవలెను. విమలేశ్వరమున దేహమును విడచినవాడు రుద్రలోకమును పొందును. ఇటనుండి పుష్కరిణికి వెళ్లి స్నానమాచరించవలెను. పుష్కరిణీ తీరములో స్నానముచేసినంత మాత్రమున, ఇంద్రుని అర్ధాసనమును పొందును.

తతో గచ్ఛేత రాజేంద్ర శూలభేద మితి శ్రుతమ్

 తత్ర స్నాత్వార్చయేత్ దేవం గోసహస్రఫలం లభేత్

తతో గచ్ఛేత రాజేంద్ర బలితీర్ధ మనుత్తమమ్

తత్ర స్నాత్వానరో రాజన్ సింహాసనపతి ర్భవేత్

శక్రతీర్థం తతో గచ్ఛేత్ కూలే చైవ తు దక్షిణే

ఉపోష్య రజనీ మకాం స్నానం కృత్వా యధావిధి

ఆరాధయేత్ మహాయోగం దేవం నారాయణం హరిమ్

గోసహస్రఫలం ప్రాప్య విష్ణులోకం స గచ్ఛతి

ఋషితీర్థం తతో గత్వా సర్వపాపహరం నృణాం

స్నాతమాతో నరస్తత్ర శివలోకే మహీయతే

నారదస్య తు తత్రైవ తీర్థం పరమశోభనం

స్నాతమతో నర స్తస్య గోసహస్రఫలం లభేత్

యత్ర తప్తం తపః పూర్వం నారదేన సురర్షిణా 

ప్రీతః తస్య దదౌ యోగం దేవదేవ మహేశ్వరః

బ్రహ్మణా నిర్మితం లింగం బ్రహ్మేశ్వర మితి శ్రుతం

యత్ర స్నాత్వానరో రాజన్ బ్రహ్మలోకే మహీయతే

ఋణతీర్థం తతో గచ్ఛేత్ స ఋణా స్ముచ్యతే ధ్రువమ్

మహేశ్వరం తతో గచ్ఛేత్ పర్యాప్తం జన్మనః ఫలమ్

భీమేశ్వరం తతో గచ్ఛేత్ సర్వవ్యాధివినాశనమ్

స్నాతమాత్రే నర సత్ర సర్వదుఃఖైః ప్రముచ్యతే

అటనుండి సుప్రసిద్ధమైన శూలభేద తీర్థమునకు వెళ్లవలయును. ఇచట స్నానమాడి, శివుని ఆరాధించినవానికి, సహాస్రగోదాన ఫలము లభించును. అటనుండి సర్వోత్తమమైన బలి తీర్థమునకు వెళ్లవలెను. ఇచట స్నానము చేసినపోడు, రాజ్యాధిపతి యగును. నర్మదకు దక్షిణ తీరముననున్న శక్ర తీర్థమునకు వెళ్లవలెను. ఇచట స్నానమాడి ఒకరాత్రి ఉపసించి, మహాయోగీశ్వరుడగు శ్రీమన్నారాయణుని అర్చించినవాడు సహస్రగోదాన ఫలమును పొంది విష్ణులోకము చేరును. ఇచటనుండి, సర్వపాపహరమైన ఋషీ తీర్థమునకు వెడలి, స్నానమాచరించిన శివలోకము లభించును. ఇచటనే పరమ శోభనమైన నారద తీర్థము గలదు. ఈ తీర్థమున స్నానమాడీనపొడు సహసగోదాన ఫలమును పొందును. పూర్వము దేవరియగు నారదుడు ఇచ్చటనే తపమాచరించెను. అంతట ప్రసన్నుడైన హరుడు నారదునకు యోగమును ప్రసాదించెను. ఇటనుండి బ్రహ్మ శివలింగమును స్థాపించిన, బ్రహ్మేశ్వర తీర్థమునకు వెడలి స్నానము చేసినవాడు, బ్రహ్మలోకము పొందును. ఇటనుండి ఋణ తీర్థమునకు వెడలవలెను. ఈ తీర్థమును దర్శించినవానికీ ఋణవిమోచనము కలుగును. ఇటనుండి, మాహేశ్వర తీర్థము వెళ్లినవారీ జన్మధన్యము. అటనుండి సర్వవ్యాధి వినాశకరమగు భీమేశ్వర తీర్థమునకు వెళ్లవలెను. ఇందు స్నానమాడిన సర్వదుఃఖములు తొలగును.

తతో గచ్ఛేత రాజేంద్ర పింగళేశ్వర ముత్తమమ్

అహెరాత్రోపవాసేన త్రిరాత్రఫల మాప్నుయాత్

తస్మిన్ తీర్దే తు రాజేంద్ర కపీలాం చ ప్రయచ్ఛతి

యావంతి తస్యా రోమణి తత్ప్రసూతికులేషు చ

తావత్ వర్షసహస్రాణి రుద్రలోకే మహీయతే

యస్తు ప్రాణపరిత్యాగం కుర్యాత్ తత్ర నరాధిప

అక్షయ్యం మోదతే కాలం యావ చ్చంద్రదివాకరౌ

నర్మదాతట మాశ్రిత్య తిష్ఠంతే యేతు మానవాః

తే మృతః స్వర్గ మాయాంతి సంతః సుకృతినో యధా

తతో దీప్తేశ్వరం గచ్ఛేత్ వ్యాసతీర్థం తపోవనమ్

నివర్తితా పురా తత్ర వ్యాసభీతా మహానదీ

హుంకారితా తు ప్యాసేన దక్షిణేన తతో గతి

ప్రదక్షిణంతు యః కుర్యాత్ త స్మిం తీర్థే యుధిష్ఠిర 

ప్రీతః తస్య భవేత్ వ్యాసో వాంఛితం లభతే ఫలమ్

తతో గచ్ఛేత రాజేంద్ర ఇక్షునద్యా స్తు సంగమం

త్రైలోక్యవిశ్రుతం పుణ్యం తత్ర సన్నిహితః శివః

తత్ర స్నాత్వో న రాజన్ గాణాపత్య మవాప్నుయాత్

 స్కందతీర్థం తతో గచ్ఛేత్ సర్వపాపప్రణాశనం

ఆజన్మనః కృతం పాపం స్నాత స్తత్ర వ్యహోహతి

తత్ర దేవాః సగంధర్వా భవాత్మజ మనుత్తమమ్

ఉపాసతే మహాత్మానం స్కందం శక్తిధరం ప్రభుమ్

తతో గచ్చే దాంగిరసం స్నానం తత్ర సమాచరేత్

గోసహస్ర ఫలం ప్రాప్య రుద్రలోకం స గచ్ఛతి

ఇటనుండి పింగళేశ్వరమునకు పోవలెను. ఇచట ఒకదినము ఉపపోసముండుట వలన మూడుదినములుపవాసముండిన ఫలమును లభించును. ఈ తీర్థమున కపిల గోదానము చేసినచో, ఆగోవునకు, గోవు సంతానమునకు ఉన్న రోమముల సంఖ్యలో అన్ని వేల సంవత్సరములు రుద్రలోకమున నివసించును. ఈ తీర్థమున దేహాము విడచినవారు, సూర్యచంద్రులున్నంతవరకు తరగని ఆనందమును పొందుదురు. నర్మదా తీరమున నివసించువారు సుజనులు, పుణ్యాత్ములవలె, దేహమును వీడిచిన వెంటనే స్వర్గమును చేరుదురు. తరువాత వ్యాస తీర్థమని పేరుగాంచిన దీపేశ్వరమను తపోవనమునకు వెళ్లవలెను. ఇచటనే వ్యాసభగవానునికి భయపడి, నర్మద వెనుదిరిగినది. వ్యాసుని కోపమును చూచి, అచటనుండి దక్షిణ దిశకు ప్రవహించినది. ఈ తీర్థమున ప్రదక్షిణము చేయువానికి వ్యాసుడు ప్రసన్నుడై అభీష్టములు ప్రసాదించును. ఇట నుండి ఇక్షునదీ సంగమమును చేరవలయును. ఇది త్రిలోక విశ్రుతము పరమ పావనము. ఇచట ఎల్లకాలము శివుడు సన్నిహితుడై యుండును. ఈ తీర్థమున స్నానమాడినవాడు, శివుని గాణా పత్యమును పొందును. అటనుండి సర్వపాపనాశకమగు స్కంద తీర్థమునకు వేడల వలయును. ఇచట స్నానమాడిన వాడు జన్మనుండి చేసిన సకల పాపములు నశింపచేసుకొనును. ఈ తీర్థమున గంధర్వులతో కూడిన దేవతలు, దేవోత్తముడు. శంకరుని పుత్రుడు, శక్తి ధరుడు మహానుభావుడునగు. కుమార స్వామిని, సేవించుచుందురు. ఇట నుండి ఆంగిరసతీర్థము వెళ్లవలెను. ఈ తీర్ధమున స్నానమాడిన వారు సహస్ర గోదాన ఫలము పొందెదరు.

అంగీరా యత్ర దేవేశం బ్రహ్మపుత్రో వృషధ్వజమ్ 1

తపసారాధ్య విశ్వేశం లబ్ధహన్ యోగ ముత్తమమ్

కుశతీర్థం తతో గచ్ఛేత్ సర్వపాపప్రణాశనం

స్నానం యత్ర ప్రకుర్వంతి అశ్వమేథఫలం లభేత్

కోటితీర్థం తతో గచ్ఛేత్ సర్వపాపప్రణాశనం

తత్ర స్నాత్వానరో రాజ్యం లభతే నాత్ర సంశయః

చంద్రభాగాం తతో గచ్ఛేత్ స్నానం తత్ర సమాచరేత్

స్నాతమాత్రే నర స్తత్ర సోమలోకే మహీయతే

నర్మదాదక్షిణే కూలే సంగమేశ్వర ముత్తమమ్

తత్ర స్నాత్వా నరో రాజన్ సర్వయజ్ఞఫలం లభేత్

నర్మదీయోత్త రేకూలే తీర్థం పరమశోభనమ్

  ఆదిత్యాయతనం రమ్య మిశ్వరేణ తు భూషితమ్

తత్ర స్నాత్వాతు రాజేంద్ర దత్వా దానం తు శక్తితః

తస్య తీర్ధప్రభానే లభతే చాక్షయం ఫలమ్

దరిద్రా వ్యాధితా యే చ యే చ దుష్క్రృతకారిణః

ముచ్యంతే సర్వపాపేభ్యః సూర్యలోకం ప్రయాంతి చ

మారేశ్వరం తతో గచ్ఛేత్ స్నానం తత్ర సమాచరేత్

స్నాతమాత్రో నర స్తత్ర స్వర్గలోక మవాప్నుయాత్

తతః పశ్చిమతో గచ్ఛేత్ మురుదాలయ ముత్తమం

తత్ర సౌత్వా ఈ రాజేంద్ర శుచిర్భూత్వా ప్రయత్నతః

కాంచనం తు ద్విజే దద్యాత్ యథావీభవవీస్తరమ్

పుష్కరేణ విమానేన వాయులోకం స గచ్ఛతి

ఈ తీర్థమున, బ్రహ్మపుత్రుడగు అంగీరసుడు, వృషభధ్వజుడగు శంకరుని తపస్సుతో ఆరాధించి, ఉత్తమ యోగమును పొందెను. ఇట నుండి సర్వపాపనాశకరమగు 'కుశ' తీర్థమును చేరవలయును. ఇట స్నానమాడిన అశ్వమేథ ఫలము లభించును. ఇటనుండి అఖిలపాప నిపోరకమగు కోటి తీర్థమునకు వెడలి, స్నానమాచరించినచో రాజ్యమును పొందును. కోటి తీర్థమునుండీ, చంద్రభాగా తీర్థమునకు వెడలి స్నానము చేయవలెను. అట్లు స్నానమాడినవాడు చంద్రలోకమును పొందును. నర్మదానదికి దక్షిణ తటమున సర్వోత్తమమగు సంగమేశ్వర తీర్థము కలదు ఇచట స్నానమాడినవారు సర్వయజ్ఞ ఫలమును పొందెదరు. నర్మదా ఉత్తర తీరమున పరమ శోభనమగు 'ఆదిత్యాయతనము' అను తీర్థము గలదు. స్వయముగా శివునిచే చెప్పబడినది యీ తీర్థము. ఇచట స్నానముచేసి, యధాశక్తి దానము చేసినవాడు యీ తీర్థ ప్రభావము వలన అక్షయ ఫలము పొందును, దరిద్రులు, వ్యాధి గ్రస్తులు, పాపము నాచరించినవారు ఎవరైనను, స్నానమాత్రమున అన్నిపాపముల నుండి విడివడి సూర్యలోకమును పొందెదరు. ఇట నుండి మాధేశ్వర తీర్థమునకు వెడలి స్నానమాచరించిన స్వర్గలోకమును పొందెదరు. ఈ తీర్ణమునకు పశ్చిమమున సర్వోత్తమమైన 'మరుదలయ' తీర్థము కలదు. ఇచట స్నానము చేసి, పవిత్రుడై తనకున్న సంపదకు అనుగుణముగా సువర్ణము దానము చేసినచో, పుష్పక విమానములో వాయులోకమునకు వెళ్లును.

తతో గచ్ఛేత రాజేంద్ర అహల్యాతీర్థ ముత్తమమ్

స్నానమాత్రా దపురోభి య్మోదతే కాల మక్షయమ్

చైత్రమాసేతు సంప్రాప్తే శుక్లపక్షే త్రయోదశీ

కామదేవదినే తస్మి న్నహాల్యాం యస్తు పూజయేత్

యత్ర యత్ర నరోత్పన్నే వసంస్త ప్రియో భవేత్

స్త్రీవల్లభో భవే శ్రీమాన్ కామదేవ ఇవాపర

అయోధ్యాం తు సమాసాద్య తీర్థం శక్రస్య విశ్రుతమ్

స్నాతమాత్రే నర సత్ర గోసహస్రఫలం లభేత్

సోమతీర్థం తతో గచ్ఛేత్ స్నానం తత్ర సమాచరేత్

  స్నాతమాత్రో నర సత్ర సర్వపాపైః ప్రముచ్యతే

సోమగ్రహే తు రాజేంద్ర పాపక్షయకరం భవేత్

త్రైలోక్యవిశ్రుతం రాజస్ సోమతీర్థం మహాఫలమ్

యస్తు చాంద్రాయణం కుర్యాత్ తత్ర తీర్థే సమాహితః

సర్వపాపవిశుద్ధాత్మా సోమలోకం స గచ్ఛతి

అగ్నిప్రవేశం యః కుర్యాత్ సోమతీర్దే నరాధిప

 జలే చా నశనం వాపి నాసౌ మర్త్యో భిజాయతే

స్తంభతీర్ణం తతో గచ్చేత్ స్నానం తత్ర సమాచరేత్

స్నాతమాత్రో నర సత్ర సోమలోకే మహీయతే

తతో గచ్ఛేత రాజేంద్ర విష్ణుతీర్థ మనుత్తమమ్

యోధనీపుర మాఖ్యాతం విష్ణోః స్థాన మనుత్తమం

అసురా యోధితో స్తత్ర వాసుదేవేన కోటిశః

తత్ర తీర్థం సముత్పన్నం విష్ణుశ్రీకో భవేదిహ

అహెరాత్రోపవాసేన బ్రహ్మహత్యాం వ్యపోహతి

నర్మదాదక్షిణే కూలే తీర్థం పరమశోభనమ్

కామతీర్థ మీతి ఖ్యాతం యత్ర కామేర్చయద్ భవమ్

తస్మిం స్తీర్థే సరః స్నాత్వా ఉపవాసపరాయణః

కుసుమాయుథరూపేణ రుద్రలోకే మహీయతే

ఆట నుండి అహల్యా తీర్థమునకు వెడలి, స్నానము చేసినంతనే అక్షయ కాలము అప్సరసలతో ఆనందించును. చైత్ర శుక్ల త్రయోదశి నాడు కామదేవ దినమున ఈ తీర్ధమున స్నానమాడి, అహల్యను పూజించినవాడు ఎక్కడ పుట్టియున్నను ఆదేశమున అందరిలో ఉత్తముడగును. సుందరుడగును. అపరమన్మధునీవలే యువతులకు వల్లభుడగును. అటనుండి ఇంద్రుని ప్రసిద్ధతీర్థమైన అయోధ్యను చేరి, స్నానమాడి నంతనే, సహస్ర గోదాన ఫలమును పొందును. తరువాత సోమ తీర్థమును వెళ్లి స్నానము చేయవలెను. ఇందు స్నానము సర్వపాపహరము. చంద్ర గ్రహణము సమయమున సర్వపాప నాశకమగు, త్రిలోక విశ్రుతమగు, మహాఫలప్రదమగు సోమతీర్థమున, సావధానముతో, చాంద్రాయణ ప్రత మాచరించిన సర్వపాప వినిర్ముక్తుడై చంద్రలోకమును చేరును. ఈ తీర్థమున అగ్ని ప్రవేశము జల ప్రవేశము, ఉపవాసములలో దేనిని ఆచరించినను పునర్జన్మ కలుగదు. ఇట నుండి స్తంభతీర్థమునకు వెడలి స్నానమాడినంతనే చంద్రలోకమును చేరును. అటనుండి ధనీ పురమును పేరుగల సర్వోత్తమమైన విష్ణుస్థానమగు విష్ణుతీర్థమునకు వెడలపలయును. ఈ ప్రదేశమున పూర్వము వాసుదేవుడు కోట్లకొలది రాక్షసులతో యుద్ధము చేసెను. అధికకాలము విష్ణువాసమైనందున ఇది పవిత్ర తీర్థమాయెను. ఇచట ఒకదినము ఉపవాసమున్నను, బ్రహ్మ హత్యా పాతకము తొలగించుకొని, విష్ణు సంపదను పొందును. నర్మదా దక్షిణ తీరమున పరమశోభనమైన 'కామతీర్థము' గలదు. ఇచట స్నానము చేసి, ఉపవసించి, పూర్వము మన్మధుడు శివుని ఆరాధించెను. ఇట్లే ఈ తీర్థములో స్నాన ఉపవాసములు గావించినవాడు మన్మథరూపముతో రుద్రలోకమున ఆనందించవచ్చును.

తతో గచ్ఛేత రాజేంద్ర బ్రహ్మతీర్థ మనుత్తమం

ఉమాహక మితి ఖ్యాతం తత్ర సంతర్పయేత్ పీతౄన్

పౌర్ణమస్యా మమావాస్యాం శ్రాద్ధం కుర్యాత్ యధావిధి

గజరూపా శిలా తత్ర తోయమధ్యే వ్యవస్థితా

తస్మిం స్తు దాపయేత్ పిండాన్ పైశాభ్యాం తు విశేషతః

స్నాత్వా సమాహితమనా దంభమాత్సర్యవర్జితః

తుష్యంతి పితర స్తస్య యావత్ తిష్ఠతి మేదినీ

సిద్ధేశ్వరం తతో గచ్ఛేత్ యత్ర స్నానం సమాచరేత్

 స్నాతమాత్రో నర స్తత్ర గాణాపత్యపదం లభేత్

తతో గచ్ఛేత రాజేంద్ర లింగో యత్ర జనార్దనః

తత్ర స్నాత్వోతు రాజేంద్ర విష్ణులోకే మహీయతే

యత్ర నారాయణో దేవౌ మునీనాం భావితాత్మనాం

స్వాత్మానం దర్శయామాస లింగం తత్ పరమం పదమ్

అజ్కోలం తు తతో గచ్ఛేత్ సర్వపాపవినాశనమ్

స్నానం దానం చ తతైవ బ్రాహ్మణానాం చ భోజనమ్

అజ్కోలమూలే దద్యాచ్చ పిండాం శ్చైవ యధావిధి

తారితాః ఏతర స్తేన తుష్యం త్యాచంద్రతారకమ్

తతో గచ్ఛేత రాజేంద్ర తాపసేశ్వర ముత్తమమ్

తత్ర స్నాత్వాతు రాజేంద్ర ప్రాప్నుయాత్ తపసః ఫలమ్

శుక్లతీర్థం తతో గచ్ఛేత్ సర్వపాపవినాశనమ్

నాస్తి తేన సమం తీర్థం నర్మదాయాం యుధిష్ఠిర

దర్శనాత్ స్పర్శనాత్ తస్య స్నానదానతపోజపాత్

హెూమా చ్చైవోప వాసొచ్చ శుక్లతీర్థే మహాత్ ఫలమ్

యోజనం తత్ స్మృతం క్షేత్రం దేవగంధర్వసేవితం

శుక్లతీర్థ మితి ఖ్యాతం సర్వపాపవినాశనమ్

పొదపాగ్రేణ దృష్టేన బ్రహ్మహత్యాం వ్యపోహతి

దేవ్యా సహ సదా భర్గః తత్ర తిష్ఠతి శంకరః

కృష్ణపక్షే చతుర్ధశ్యాం వైశాఖే మాసి సువ్రత

కైలాసా చ్చాభినిష్క్రమ్య తత్ర సంన్నిహితో హరః

దేవదానవగంధర్వాః సీద్ధవిద్యాధరా స్తథా

గణా శ్చాప్సరసాం నాదో స్తత్ర తిష్ఠంతి పుంగవ

ఇక్కడి నుండి సర్వోత్తమమైన బ్రహ్మతీర్థమునకు వెడలవలెను. ఇది 'ఉమాహకము' అను పేరుతో ప్రసిద్ధి గాంచిన తీర్థము. ఇచట స్నానము చేసి, పితరులకు తర్పణమీయవలెను. పూర్ణిమనాడుగాని, అమావాస్యనాడుగాని యధావిధిగా శ్రాద్దమును ఆచరించవలయును. ఇచట జలమధ్యమున గజరూపముతో ఒక శిలగలడు. వైశాఖపూర్ణిమనాడు, విశ్లేషించి ఈ శిలపై పిండప్రదానము చేయవలయును. ఇచట స్నానము చేసి, సావధాన మనస్కుడై, దంభ మాత్సర్యములు విడచి, శ్రాద్ధము నాచరించినవానికి భూమి ఉన్నంతవరకు అతని పితరులు తృప్తి చెందుదురు. ఇటనుండి సిద్దేశ్వర తీర్థమునకు వెడలి స్నానము చేసినంతనే శివగాణా పత్యము లభించును తరువాత జనార్దనుడు లింగరూపమునున్న క్షేత్రమునకు వెళ్లి, స్నానము చేసినచో, విష్ణులోకమున నీత్య నివాసముండును. ఇచటనే నారాయణ దేవుడు పరమపావనులైన మునులకు తన స్వరూపమును లింగరూపముగా దర్శనమిచ్చెను. ఇచట ఈ క్షేత్రమును దర్శించినవానికి పరమపదము లభించును. అటనుండి సర్వ పాప వినాశకమగు 'అంకోల' తీర్థమునకు వెడలి, అట చేయబడు స్నానము, దానము, బ్రాహ్మణ భోజనము, పిండప్రదానము ఇహపరములలో అనంత ఫలప్రదమగును. ఇచట రుద్రతీర్థములో చేరు' (పొంగలి) ఉడికించి, అంకోల మూలమున యధావిధిగా పిండ ప్రదానము గావించిన, పితరులు సంతోషించి, సూర్య చంద్రులున్నంతకాలము తృప్తి చెందుదురు. ఇటనుండి తాపసేశ్వర తీర్థమునకు వెళ్లవలేను. ఇట స్నానము చేసినవారు తపఃఫలమును పొందెదరు. అక్కడీనుండీ సర్వపాపవినాశకమగు శుక్ల తీర్థమునకు వెళ్లవలెను. దీనితో సమానమగు తీర్థము నర్మదా తటమున మరియొకటి లేదు. ఈ తీర్థమును దర్శించినను, స్పృశించినను, స్నానము చేసినను, దానము, తపస్సు, హెూమము ఉపవాసములలో దేనిని ఆచరించినను మహాఫలమును పొందెదరు. ఈ తీర్జవిస్తీర్ణము ఒక యోజనము. ఇది దేవగంధర్వసేవీతము. ఈ తీర్థమున గల ఏ వృక్షము చివర భాగమును దర్శించినను బ్రహ్మహత్యా పాతకము తొలగును. ఈ తీరమున ఎపుడు, పార్వతితోకూడి పరమేశ్వరుడు నివసించును.

వైశాఖ కృష్ణ చతుర్దశినాడు శంకరుడు, కైలాసమునుండి బయలుదేరి ఇచట నివసించసాగెను. ఈ తీర్థమున, దేవ, దానవ, గంధర్వ, సిద్ద, విద్యాధర, అప్సర గణము, నాగులు అందరు అన్ని వేళల నివసించి యుందురు.

రజకేన యథా వస్త్రం శుక్లం భవతి వారిణా

ఆజన్మనీ కృతం పాపం శుక్లతీర్థే వ్యపోహతీ

స్నానం దానం తపః శ్రాద్ధ మనంతం తత్ర దృశ్యతే

  శుక్లతీర్థాత్ ఫరం తీర్థం న భూతం న భవిష్యతి

పూర్వే వయసి కర్మాణి కృత్వా పాపాని మానవః

అహోరాత్రోపవాసేన శుక్లతీర్థే వ్యపోహతి 

కార్తీకస్య తు మాసస్య కృష్ణపక్షే చతుర్దశీ 

ఘృతేన స్నాపయేత్ దేవ ముపోష్య పరమేశ్వరమ్

ఏకవింశత్కులోపేతో న చ్యనే దైశ్వరాత్ పదాత్

తపసా బ్రహ్మచర్యేణ యజ్ఞదానేన పో పునః

 న తాం గతి మవాప్నోతి శుక్లతీర్థేతు యాం లభేత్

శుక్లతీర్థం మహాతీర్థ మృషిసిద్ధనిషేవితమ్

తత్ర స్నాత్వా నరో రాజన్ పునర్జన్మ న విందతి

అయనే వా చతుర్దశ్యాం సంక్రాంతౌ వీషువే తథా

స్నాత్వా తు సోపవాసః సన్ విజితాత్మా సమాహితః

దానం దద్యాత్ యధాశక్తి ప్రీయేతాం హరిశంకరౌ

ఏతత్ తీర్ధప్రభవేణ సర్వం భవతి చాక్షయమ్

అనాధం దుర్గతం విప్రం నాథవంత మథాపి వా

ఉద్వాహయతి యః తీర్థ తస్య పుణ్యఫలం శ్రుతమ్

యావత్ తద్రోమసంఖ్యా తు తత్ర్పసూతికులేషు చ

తావత్ వర్షసహస్రాణి రుద్రలోకే మహీయతే

తతో గచ్ఛేత రాజేంద్ర యమతీర్థే మనుత్తమమ్

కృష్ణపక్షే చతుర్దశ్యాం మాఘమాసే యుధిష్ఠిర

స్నానం కృత్వా నక్తభోజీ న పశ్యేత్ యోనిసంకటమ్

తతో గచ్ఛేత రాజేంద్ర ఏరండీతీర్థముత్తమమ్

 సంగమే ఈ నరః స్నాయా దుపవాసపరాయణః

బ్రాహ్మణం భోజయే దేకం కోటిర్భవతి భోజితాః

 ఏరండీసంగమే స్నాత్వా భక్తిభావాత్ తు రంజీతః

మృత్తికాం శిరసి స్థాప్య అవగాహ్య చ తజ్జలమ్

నర్మదోదకసమ్మిశ్రం ముచ్యతే సర్వకిల్బిషైః

రజకుడు ఉదికి వస్త్రమును శుభ్రపరచునటుల, పుట్టుకనుండి చేసిన పాపములు శుక్ల తీర్థమున పరిశుద్ధములగును. ఈ తీర్థమున చేసిన స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధము అనంతఫలములిచ్చును. శుక్ల తీర్థమును మించిన తీర్థము ఇదివరకు లేదు. ఇకముందురాదు. మానవుడు అంతవరకు చేసిన అన్ని పాపములు, ఈ తీర్థమున ఒక్క దినమున ఉపవాసములో తొలగించుకొన వచ్చును. కార్తీక కృష్ణ చతుర్దశినాడు స్నానముచేసి, ఉపవసించి, శివుని ఘృతముతో స్నానము చేయించిన, ఇరువది యొక్క తరముల వరకు, శివలోకమునకు భ్రష్టులుకారు. శుక్ల తీర్థమున పొందు ఫలమును తపస్సుతోగాని, బ్రహ్మచర్యముతోగాని, యజ్ఞదానములతోగాని పొందజాలరు. శుక్ల తీర్థము మహాతీర్థము. ఇది ఋషి, గంధర్వ సేవితము. ఇచట స్నానమాడిన వానికి పునర్జన్మలేదు, దక్షిణహాయన, ఉత్తరాయణ పుణ్య కాలములలో, చతుర్దశినాడు, సంక్రమణ, విషువ కాలమున (మేషతులా సంక్రమణములో) ఈ తీర్థమున స్నానముచేసి, మనో నిగ్రహముతో, సావధానముతో, ఉపవసించి, యధాశక్తిగా దానము గావించిన హరి హరులు ప్రీతి చెందేదరు. ఈ తీర్థ ప్రభావముతో అంతయు, అక్షయమగును. అనాధుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునిగాని, దిక్కు ఉన్న బ్రాహ్మణునికి గాని, ఈ తీర్థమున వివాహము జరిపించిన, అతనికి అతని సంతానమునకు గల రోమసంఖ్యను అనుసరించి అన్ని వేల సంఖ్యలో) సంవత్సరములు, రుద్రలోకమున ఆనందించును. ఇట నుండి, యమ తీర్థమునకు వెళ్లవలేను. మాఘకృష్ణచతుర్దశినాడు, ఇచట "స్నానముచేసి పగలు ఉపవాసమునుండి, రాత్రిభుజించిన వానికి పునర్జన్మలేదు. ఇటనుండి, 'ఇరండీ' తీర్థమునకు వెళ్లవలెను. ఇచట సంగమమున స్నానమాడి, ఉపవాసముండి, ఒక బ్రాహ్మణుని భుజింపచేసిన, కోటి బ్రాహ్మణ భోజన ఫలము లభించును. భక్తిభావము గలవాడు మృత్తికనుశిరమున ఉంచుకొని, ఈ నీటిలో మునిగి, ఐరండీ సంగమమున స్నానమాడిన, నర్మదా తీర్థ స్నానముతో సమఫలము లభించును.

తతో గచ్ఛేత రాజేంద్ర తీర్ధం కార్ణాటికేశ్వరమ్

గంగావతరతే తత్ర దినే పుణ్యే న సంశయః

 తత్ర స్నాత్వా చ పీత్వా చ దత్తా చైవ యధావిధి

సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే

నందితీర్థం తతో గచ్ఛేత్ స్నానం తత్ర సమాచరేత్

ప్రియతే తస్య నందీశః సోమలోకే మహీయతే

తతో గచ్ఛేత రాజేంద్ర తీర్థం త్వనరకం శుభమ్

తత్ర స్నాత్వా నరో రాజన్ నరకం నైవ పశ్యతి

  తస్మిం తీర్థతు రాజేంద్ర స్వాన్యస్థీని వినిక్షిపేత్

రూపవాన్ జాయతే లోకే ధనభోగసమన్వితః

తతో గచ్ఛేత్తు రాజేంద్ర కపిలో తీర్థ ముత్తమమ్

 తత్ర స్నాత్వానరో రాజన్ గో సహస్ర ఫలం లభేత్

జ్యేష్ఠ మాసేతు సంప్రాప్తే చతుర్ధశ్యాం విశేషతః

తత్ర పోష్య నరోభక్త్యా దద్యాద్దీపం ఘృతేనతు

ఘృతేన స్నాపయేత్ రుద్రం సంద్రుతం శ్రీఫలం వహేత్

ఘంటా భరణ సంయుక్తాం కపిలాం వై ప్రదాపయేత్

సర్వాభరణ సంయుక్తః సర్వదేవ సమస్కృతః

శివతుల్య బలోభూత్వా శివవత్ క్రీడ తేచిరమ  

ఇక్కడినుండి కార్నాటికేశ్వర తీర్థమునకు వెళ్లవలెను, పర్వదినములలో ఈ తీర్థమున గంగ అవతరించును. ఇట స్నానమాడి, జలముద్రావి, యధావిధిగా దానముచేసినవాడు, సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమున నివసించును. అటనుండి, నంది తీర్థమునకు వెళ్లి స్నానమాచరించిన వానికి సందీశ్వరుడు ప్రసన్నుడై సోమలోకమును ప్రసాదించును. ఇట నుండి ‘అనరకమ’ ను తీర్థమునకు వెళ్లి స్నానము చేసినవాడు, నరకమును చూడడు. అస్థినిమజ్జనము చేసినవాడు రూపవంతుడు, ధనవంతుడు భోగవంతుడుఅగును. ఇటనుండీ కపిల తీర్థమునకు వెడలి స్నానము చేసినచో, సహస్రగోదానఫలమును పొందును. ఈ తీర్థమున జ్యేష్ఠమాసమున చతుర్దశీ దీనమున స్నానముచేసి ఉపవసించి, భక్తితో ఘృత దీపమును దానముచేసి, ఘృతముతో రుద్రాభిషేకము చేయించి, ఘృతముతో కలిపి త్రిఫలము (మారేడు)తో హెూమముగావించి, కంఠాభరణములతో కూడిన కపిలధేనువును దానము చేసినచో, సర్వాభరణ సంయుతుడై, సర్వదేవన మస్కృతుడై, శివతుల్యబలుడై శివలోకమున, శివునితో సమానముగా క్రీడించును.

అంగారక దినే ప్రాప్తే చతుర్థ్యాం తు విశేషతః

 స్నాపయిత్వ శివం దద్యాత్ బ్రహ్మణేభ్యస్తు భోజనమ్

సర్వభోగ సమాయుక్తో విమానైః సర్వకాలికైః

గత్వా శక్రస్య భవనం శక్రేణ సహ మోదతే  

తతః స్వర్గాత్ పరీభ్రష్టో ధనవాన్ భోగవాన్ భవేత్

 అంగారక నవమ్యాంతు అమావాస్యాం తథైవ చ

స్నాపయేత్ తత్ర యత్నేన రూపవాస్ సుభగోథేవత్

తతో గచ్ఛేత్తు రాజేంద్ర గణేశ్వరమనుత్తమమ్

శ్రావణేమాసి సంప్రాప్తే కృష్ణపక్షే చతుర్దశీ

స్నాత మాత్రో నర స్తత్ర రుద్రలోకే మహీయతే

పితౄణాం తర్పణం కృత్వా ముచ్యతే సావృణ త్రయమ్

గంగేశ్వర సమాపేతు గంగావదన ముత్తమం

అకామా వా సర్వకామః తత్ర స్నాత్వాతు మానవః

ఆజన్మ జనితైః పాపై ర్మచ్యతే నాత్ర సంశయః

తస్యపై పశ్చిమే దేశే సమీపే నాతి దూరతః

దశాశ్వమేధికం తీర్ధం త్రిషులోకేషు విశ్రుతమ్

ఉపోష్య రజనీమేకాం మాసి భాద్రపదే శుభే 

అమావాస్యాం నరః స్నాత్వా పూజయేత్ వృషభ ధ్వజమ్

కాంచనేన విమానేన కింకిణీ జలమాలినా

గత్వా రుద్ర పురం రమ్యం రుద్రేణ సహమోదతే

సర్వత్ర సర్వ దివసే స్నానం తత్ర సమాచరేత్

పితౄణాం తర్పణం కుర్యాదశ్వమేధ ఫలం లభేత్

ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధే ఏకోనచత్వారింశోధ్యాయః

   మరియు మంగళవారము, చతుర్దివచ్చిన రోజున విశేషముగా శివునికి అభిషేకము చేసి, బ్రాహ్మణులను, భుజింపచేసినను, సర్వభోగములను పొంది, సర్వకామనలను యిచ్చు విమానముతో, ఇంద్రభవనమునకు వెళ్లి, ఇంద్రునితో కలిసి విహరించును. తరువాత స్వర్గము నుండి మరలివచ్చి భూలోకమున ధనంవంతునిగా, భోగవంతునిగా పుట్టును. అట్లే మంగళవారముతో కూడిన నవమినాడుగాని, అమావాస్యనాడుగాని, రుద్రాభిషేకము గావించిన, రూపవంతుడు, సౌభాగ్యవంతుడు అగును. అటనుండి గణేశ్వర తీర్థమునకు వెళ్లవలెను. ఈ తీర్థమున శ్రావణ కృష్ణ చతుర్దశిన స్నానము చేసిన రుద్రలోకమున వసించును. పితృదేవతలకు తర్పణము గావించిన ఋణత్రయవిముక్తు డగును. గణేశ్వర తీర్థ సమీపమున గంగావదనమను మరొక తీరముగలదు. కోరికలు కలహారైనను, లేనివారైనను, ఈ తీర్థమున స్నానమాడిన, పుట్టినప్పటినుండి సంక్రమించిన అన్ని పాపములనుండి విముక్తుడగును. ఈ తీర్థమునకు పశ్చిమ భాగమున సమీపముననే లోకవిశ్రుతమైన దశాశ్వమేధిక తీర్థముగలదు. ఇచట ఒకదినము ఉపవాసముండి, భాద్రపద అమావాస్యస్నానముచేసి, శంకరుని పూజించిన, గంటలతో అలంకరించబడిన బంగారు విమానముతో. రుద్రపురమునకు వెళ్లి, రుద్రునితో కలిసి ఆనందించును. దశాశ్వమేధ తీర్థములో అన్నిచోట్ల అన్నీ దినములలో, స్నానము పితృ తర్పణలు గావించిన పోడు అశ్వమేధఫలమును పొందును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రి సంహితలో ఉపరివిభాగమున ముప్పది తొమ్మిదవ అధ్యాయము.