కూర్మ మహా పురాణము
43 - భువనకోశ వర్ణనం
సూతఉవాచః-
ఏవ మేష మహాదేవో దేవదేవః పీతామహః।
కరోతి నీయతం కాలం కాలాత్మా హ్యైశ్వరీ తనుః ॥
తస్య యే రశ్మయే విప్రాః సర్వలోకప్రదీపకాః।
తేషాం శ్రేష్టాః పునః సప్త రశ్మయో గృహమేధినః ॥
సుషుమ్నో హరికేశ శ్చ విశ్వకర్మా తథైవ చ ।
విశ్వశ్రవాః పున శ్చాత్యః సంయద్వసు రతః పరః॥
అర్వావసు రీతి ఖ్యాతః స్వరక సప్త కీర్తితాః ।
సుషుమ్నః సూర్యరశ్మి స్తు పుష్ణాతి శిశిరద్యుతిమ్ ॥
తిర్యగూర్థ్వప్రచారోఽసౌ సుషుమ్నః పరిపఠ్యతే ।
హరికేశ స్తు యః ప్రోక్తో రశ్మి ర్నక్షత్రపోషకః ॥
విశ్వకర్మా తథా రశ్మి ర్బుధం పుష్ణాతీ సర్వదా ।
విశ్వశ్రవా స్తు యో రష్మీః శుక్రం పుష్ణాతి నిత్యదా॥
ఈ విధముగా దేవదేవుడు, మహాదేవుడు అగు పితామహుడు కొలనియతిని చేయుచున్నాడు. ఈశ్వరశరీరము కాలాత్మకమైనది కదా.
బ్రాహ్మణులారా అతని కిరణములేవి కలవో అవి అన్ని లోకములను ప్రకాశింపజేయును, ఆ కిరణములలో శ్రేష్ఠములైనవి యేడు కలవు.
సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవస్సు, సంయద్వసువు అనియు, అర్వావసువు స్వరకము అనుపేర్లతో ఆసప్తరశ్ములు ప్రఖ్యాతములైయున్నవి. సుషుమ్నము అను సూర్యరశ్మి తనకాంతితో చంద్రుని పోషించును.
ఈ సుషుమ్నరశ్ని అడ్డముగా, నిలువుగా కూడ ప్రసరించు స్వభావము కలది. హరికేశము అనబడు రశ్నీ సక్షత్రములకు బలము కలిగించును.
విశ్వకర్మ అనబడు సూర్యరశ్మి బుధగ్రహమును ఎల్లవేళల పోషించుచుండును. విశ్వశ్రవస్సు అను పేరుగల సూర్యరశ్మి సర్వకాలము శుక్రగ్రహమునకు ప్రకాశము కలిగించును.
సంయద్వసు రీతి ఖ్యాతో యః పుష్ణాతి స లోహితమ్ ।
బృహస్పతిం సుపుష్ణాతి రశ్మి గర్వావసుః ప్రభుః ॥
శనైశ్చరం ప్రపుష్ణాతి సప్తమస్తు స్వర స్తథా ।
ఏవం సూర్యప్రభావేణ సర్వా నక్షత్రతారకాః ॥
వర్థoతే వర్ధితా నిత్యం నీత్యమాప్యాయయని చ ।
దివ్యానాం పార్థివానాఞ్చ వైశానాం చైవ నిత్యశః॥
ఆదానా న్నిత్యమాదిత్య స్తేజసాం తమసా మపీ ।
ఆదత్తే స తు నాడీనాం సహస్రేణ సమస్తతః॥
నాదేయం చైవ సాముద్రం కౌప్యం చైవ సహస్ర దృక్ ।
స్థావరం జజ్గమ ఞ్చైవ యచ్చ కుల్యాదికం పయః॥
సంయద్వసు వను పేరుతో ప్రఖ్యాతమైన రశ్మి అంగారక గ్రహమును పోషించుచున్నది. సమర్థమైన అర్వావసువను రశ్మి బృహస్పతి - గ్రహమును బాగుగాపోషించును.
ఏడవదైన స్వరమను రశ్మి శనైశ్చర గ్రహమును పోషించును, ఈ ప్రకారము సూర్యుని యొక్క ప్రభావముచేత అన్నీ నక్షత్రములు వృద్ధి పొందుచున్నవి. పెంపొందినవై ఎల్లప్పుడు లోకమును సంతోషపరచుచున్నవి. దేవతలయొక్క భూమికి సంబంధించినవారి యొక్క రాత్రిచరుల యొక్క తేజస్సులను, చీకట్లను స్వీకరించుట వలన ఆదిత్యుడనబడుచున్నాడు. ఆ సూర్యుడు తన వేయినాడులతో అన్నివైపులనుండి నదులకు చెందినది, సముద్రసంబంధి, బావుల లోనిది, నిలకడగా ఉండునది, ప్రవహించునది అగు కాలువలు మొదలగు వాని జలము ఏది కలదో, దానిని గ్రహించుచున్నాడు.
తస్య రశ్మిసహస్రస్తు శీతవర్షోష్ణ నిస్స్రవమ్ ।
తాసాం చతుశ్శతా నాడ్యో వర్షoతే చిత్రమూర్తయః॥
చన్ద్రగా శ్చైవ గాహా శ్చ కాఞ్చనాః శాతనా స్తథా ।
అమృతా నామతః సర్వా రశ్మయో వృష్టిసర్జనాః॥
హిమోద్ధతా శ్చ తా నాడ్యో రశ్మయో నిఃసృతాః పునః ।
రేష్యో మేష్యశ్చ వాస్యశ్చ హ్రాదిన్యః సర్జనా స్తథా ॥
చన్ద్రా స్త్రీ నామతః సర్వాః పీతా స్తా స్యు ర్గభస్తయః ।
శుక్లాశ్చ కుజ్కుమా శ్చైవ గావో విశ్వభృత స్తథా ॥
శుక్లా స్తా నామతః సర్వా స్త్రీవిధా ఘర్మసర్జనాః ।
సమం బిభర్తి తాభిః స మనుష్య పితృదేవతాః ॥
ఆ సూర్యుని వేయి రశ్ములు చలిని, వర్షమును, వేడిని ప్రసరింపజేయుచు, వానిలో నాలుగు వందల సౌడులు చిత్రమైన రూపముకలవై వర్షము కురియించును.
వర్షమునకు కారణభూతములైన రశ్ములుగా అన్నియు చంద్రగములు, గాహములు, కంచనములు, శాతనములు, అమృతములు అనుపేర్లతో పేర్కొనబడినవి.
మంచునుండి బయలుదేరిన ఆనాడులు, దశ్ములుగా బయలువెడలీనమై, రేష్యము, మేష్యము, పోస్యము, మెరుపులు, వర్షకారకములు, చంద్రములు అని పేర్లతో అవి యన్నియు పసుపుపచ్చని కాంతులుగా ఉండును. విశ్వభృత్తుయొక్క కిరణాలు తెల్లనివి, కుంకుమరంగు కలవిగాను ఉండును.
శుక్లములను పేరుగల ఆరశ్ములు మూడువిధముల వేడిమిని ప్రసరించును. సూర్యుడు ఆ రశ్ములతో మనుష్యులను, పితరులను, దేవతలను సమానముగా భరించును.
మనుష్యా నౌషధేనేహ స్వధయా చ పితౄ నపి ।
అమృతేన సురా స్సర్వాం స్త్రీం స్త్రీభి సర్పయ త్యసౌ॥
పసoతే గ్రీష్మకే చైవ షడ్భిః స తపతి ప్రభుః।
శరద్యపి చ వర్షాసు చతుర్భిః సంప్రవర్షతి ॥
హేమoతే శిశిరే చైవ హిమ ముత్సృజతీ త్రిభిః ।
వరుణో మాఘమాసే తు సూర్యః పూషాతు ఫాల్గుణే ॥
చైత్ర మాసే స దేవేశో ధాతా వైశాఖతాపనః ।
జ్యేష్ఠ మాసే భవేదిన్ద్ర: ఆషాడే తపతే రవిః ॥
వివస్వాన్ శ్రావణే మాసి ప్రౌష్ఠపద్యాం భగః స్మృతః।
పర్జన్య శాశ్వినే మాసి కార్తికే మాసి భాస్కరః ॥
మార్గశీర్షే భవే న్మిత్రః పౌషే విష్ణుః సనాతనః ।
పఞ్చరశ్మిసహస్రాణి వరుణ స్యార్క కర్మణి ॥
ఈ సూర్యభగవానుడు మనుష్యులను ఔషధముతో, పితరులను స్వధతోను, దేవతలందరినీ అమృతముతోను మూడు విధములసాధనములతో ముగ్గురిని తృప్తిపరచుచున్నాడు.
వసంతగ్రీష్మఋతువులలో సూర్యుడు ఆరురశ్ములతో వేడిని ప్రసరించును. శరత్కాలములో, వర్షఋతువులో నాలుగు రశ్ములతో వర్షమును కురియును.
హేమంతశిశిరఋతువులలో ప్రభువైన సూర్యుడు మంచును వ్యాపింపజేయును. సూర్యుడు మాఘమాసములో వరుణుడుగాను, ఫాల్గుణములో పూషగాను, చైత్రమాసములో దేవేశుడని, వైశాఖములో ధాత అనుపేరుతోను, జ్యేష్ఠములో ఇంద్రుడని, ఆషాఢమాసములో రవి అనియును శ్రావణమాసములో వివస్వంతుడని, భాద్రపదములో భగుడనియును, ఆశ్వయుజములో పర్జన్యుడని, కార్తీకమాసములో భాస్కరుడని వ్యవహరింపబడును. మార్గశీర్షములో మిత్రుడని, పౌషమాసములో సనాతనుడైన విష్ణురూపుడుగాను వ్యవహరింపబడును. వరుణరూపుడైన సూర్యుడు తన వ్యాపారములో 5వేల రశ్ములనుపయోగించును.
షడ్భిః సహస్రైః పూషా తు దేవేశః సప్తభి స్తథా ।
ధాతా ష్టభి స్సహస్రై స్తు నవభీ శ్చ శతక్రతుః ॥
వివస్వా న్దశభిః పాతి పాత్యేకాదశభి ర్భగః ।
సప్తభి స్తపతే మిత్ర స్త్వష్టా చైవాష్టభి స్తపేత్ ॥
అర్యమా దశభిః పాతి పర్జన్యో నవభి స్తథా ।
షడ్భి రశ్మిసహస్రైస్తు విష్ణు స్తపతి విశ్వధృక్ ॥
వసoతే కపిలః సూర్యో గ్రీష్మే కాఞ్చనసప్రభః ।
శ్వేతో వర్షాసు విజ్ఞేయః పాణ్డురః శరది ప్రభుః ॥
హేమoతే తామ్రవర్ణః స్యా చ్ఛిశిరే లోహితో రవిః ।
ఔషధీషు కలాం ధత్తే స్వధా మపి పితృ ష్వథ॥
పూషరూపములో సూర్యుడు 6వేల రశ్ములతో, దేవేశుడు ఏడువేల రశ్ములతోను, ధాతరూపుడైన భాస్కరుడు 8వేలతోను, ఇంద్రరూపుడుగా తొమ్మిది వేల రశ్ములతో, వివస్వంతుడు 10వేల రశ్ములతో, భగుడు 11వేల రశ్ములతో, మిత్రుడు ఏడువేలతోను, త్వష్ట 8వేల రశ్ములతో
ప్రకాశించును. అర్యముడు 10వేలతోను, పర్జన్యుడు 9వేల రశ్ములతోను, విష్ణునామకుడైన సూర్యుడు 6వేల రశ్ములతో తపింపజేయును.
సూర్యుడు వసంతకాలములో కపిలవర్ణుడుగాను, గ్రీష్మకాలములో బంగారు కాంతి కలపొడుగాను, వర్షఋతువులో తేలుపుగాను, శరత్కాలములో పొండువర్ణముగాను ప్రకాశించును. సూర్యుడు హేమంతఋతువులో రాగీరంగుకలవాడుగా నుండును. శిశిరకాలములో ఎరుపురంగు కలిగియుండును. ఔషధుల యందు అతడు తన కళను ధరించును. పితృదేవతలయందు స్వధను ధరించును.
సూర్యోఽమరే ష్వమృతస్తు త్రయం త్రిషు నియచ్ఛతి ।
అన్యే చాష్టౌ గ్రహా జ్ఞే యాః సూర్యేణాధిష్ఠితా ద్విజాః ॥
చన్ద్రమాః సోమపుత్రశ్చ శుక్ర శైవ బృహస్పతిః ।
భౌమో మన్ద స్తథా రాహు కేతుమానపి చాష్ఠమః ॥
సర్వే ధ్రువే నిబద్ధవై గ్రహా స్తే వాత రశ్మిభిః ।
భ్రామ్యమాణా యథా యోగం భ్రమన్య్తను దివాకరమ్ ॥
అలాతచక్రవ ద్యాన్తి వాతచక్రేరితో స్తథా ।
యస్మా ద్వహతి తా న్వాయుః ప్రవహస్తేన స స్మృతః ॥
రథ స్త్రీచక్రః సోమస్య కున్దాభా స్తస్య వాజినః ।
వామదక్షిణతో యుక్తా దశతేన క్షపాకరః ॥
సూర్యుడు దేవతలయందు మూడు విధముల అమృతమును మూడు భాగముల యందు వినియోగించును. విప్రులారా సూర్యునిచేత అధిష్టింపబడిన గ్రహములు ఎనిమిదింటినీ విధముగా తెలియవలెను.
చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు బృహస్పతి, అంగారకుడు శని, రాహువు, కేతుమంతుడు అని ఆ ఎనిమిది గ్రహముల పేర్లు.
ఆగ్రహములన్నీయు వాయురశ్ములచే నియమింపబడినపై, త్రిప్పటడుచు వారి వారి నియమానుసారము సూర్యుని అనుసరించి తిరుగుచున్నవి.
పాతచక్రముచేత ప్రేరేపింబడినవై ఆగ్రహములు కొలవి చక్రము వలె సంచరించును. ఆ గ్రహములను వహించుచున్న కారణముచేత " వాయువునకు ప్రవహము అను పేరు ప్రసిద్ధమైనది. చంద్రునియొక్క రథము మూడు చక్రములు కలది. అతని గుఱ్ఱములు మొల్లపూవువంటి కాంతి కలవి. అవి కుడి యెడమ భాగములలో కట్టబడిన పది గుఱ్ఱములు దానిని మోయును. చంద్రుడు,
వీథ్యాశ్రయాణీ చరతి నక్షత్రాణి రవి ర్యథా।
హ్రసవృద్ధే తు విప్రేన్ద్రా ధ్రువాధారాణి సర్వదా ॥
స సోమః శుక్లపక్షే తు భాస్కరే పరతః స్థితే ।
ఆపూర్యతే పరస్యాoతే సతతం చైవ తాః ప్రభః ॥
క్షీణం పీతం సురైః సోమ మాప్యాయయతి నిత్యదా ।
ఏకేన రశ్మినా విప్రాః సుషుమ్నాథ్యేన భాస్కరః ॥
ఏషా సూర్యస్య వీర్యేణ సోమస్యా ప్యాయితా తనుః ।
పౌర్ణమాస్యోం స దృశ్యత సమ్పూర్ణో దివసక్రమత్ ॥
సమ్పూర్ణ మర్ధమాసేన తం సోమ మమృతాత్మకమ్ ।
పిబన్తి దేవతా విప్రా యతస్తేఽమృతభోజనాః ॥
దానితో వీథుల నాశ్రయించి యున్న నక్షత్రములను గూర్చి, సూర్యుని వలె సంచరించును. బ్రాహ్మణాశ్రేష్ఠులారా చంద్రుని వృద్ధి క్షయములు ఎల్లప్పుడు ధ్రువస్థానముపై ఆధారపడియుండును.
ఆ చంద్రుడు శుక్లపక్షములో సూర్యుడు ఆవలిభాగములో నుండగా కళలచేనింపబడును. శుక్లపక్షము సమాప్తిచెందగా ఆకళలు ఎల్లప్పుడు దేవతలచే గబడి క్షీణించును. సూర్యుడు సుషుమ్నమను రశ్మితో చంద్రుని ఎల్లప్పుడు కాంతివంతముగా చేయును.
సూర్యుని తేజస్సుచేత ప్రకాశవంతము చేయబడిన ఈ చంద్రుని శరీరము దినక్రమములో వృద్ధిపొంది పూర్ణిమనాడు సంపూర్ణ రూపముతో కన్పించును.
నిండుబింబముకల చంద్రుని అమృతాత్మకమైన
రూపమును, దేవతలు అమృతభోజనులు కనుక పక్షము రోజులలో క్రమముగా ఒక్కొక్క కళచొప్పున పానము చేయుదురు.
తతః పఞ్చదశే భాగే ఞ్చచ్ఛిష్ట కలాత్మకే ।
అపరాహ్ణే పితృగణా జఘన్యం పర్యుపాసతే॥
పీబన్తి ద్వీలవం కాలం శిష్టా తస్య కలాతు యా।
సుధామృతమం పుణ్యాం త మింధో రమృతాత్మికామ్॥
నిఃసృతం తద మావాస్యాం గభస్తిభ్య: స్వధామృతమ్ ।
మాసతృప్తి మనాశ్నన్తి పితరః సన్తి నిర్వృతాః॥
న సోమస్య వినాశః స్యా త్సుధా చైవం సుపీయతే ।
ఏవం సూర్యమితోఽస్య క్షయో వృద్ధిశ్చ సత్తమాః॥
సోమపుత్రస్య చాష్ట్రాభి ర్వాజిభి ర్వాయువేగిభిః ।
వారిజైః స్యన్దనో యుక్త స్తేనా సౌ యాతి సర్వతః ॥
తరువాత పదునైదవ కళారూపమైన భాగము కొంచెము మిగిలియుండగా అపరాహ్లాకాలములో పితృగణములు వెనుకభాగము నాశ్రయిం తురు.
ఆ చంద్రుని మీగిలిన కళను రెండు లవలకాలము అమృతమయము, అమృతరూపము, పుణ్యకరము అయినదానిని పానము చేయుదురు.
అమావాస్యనాడు కిరణములనుండి ప్రసరించుచున్న ఆ అమృతమును పితృదేవతలు ఆస్వాదించి సుఖముకలవారై మాసతృప్తిని పొందుదురు.
చంద్రునకు పూర్తిగా వినాశనము జరుగదు. అమృతము ఈవిధముగా చక్కగా ఆస్వాదింపబడును. ఓ సజ్జనులారా ఇట్లు చంద్రుని యొక్క వృద్ధి క్షయములు సూర్యుని కారణముగా జరుగుచుండును.
చంద్రుని కుమారుడైన బుధునియొక్కరథము, వాయువేగముకల, నీటి నుండి పుట్టిన గుఱ్ఱములతో కూర్చబడియుండును, ఆ బుధుడుదానితో అంతట సంచరించును.
శుక్రస్య భూమీజై రశ్వైః స్యన్దనో దశభి ర్మృతః ।
అష్టాభి శ్చాపి భౌమస్య రథో హైమః సుశోభనః.॥
బృహస్పతే రథోఽశ్వాష్టః స్యన్దనో హేమనిర్మితః।
రథో రూప్యమయోఽష్టాశ్వో మన్దస్యా యసనిర్మితః ॥
స్వర్భానో ర్భాస్కరారే శ్చ తథాష్ట్రాభి ర్హయే ర్వతః ।
ఏతే మహాగ్రహాణాం వై సమాభ్యతా రథా శ్చ॥
సర్వే ధ్రువే మహాభాగే నిబద్ధా వాయురశ్మిభిః ।
గ్రహరీక్షతారాధిష్ణ్యాని ధ్రువే బద్ధా న్యశేషతః॥
భ్రమన్తి భామయన్య్తేనం సర్వాణ్యనిల రశ్మిభిః ।
ఇతి శ్రీకూర్మపురాణే భువనకోశే త్రిచత్వారింశోఽధ్యాయః - ॥
శుక్రునియొక్క రథము భూమియందు పుట్టిన పది అశ్వములు కలిగి యుండును. అంగారకుని రథము బంగారముతో చేయబడినది, మిక్కిలి అందమైనదై ఎనిమిది గుఱ్ఱములతో కూడియుండును. బృ: హస్పతి రథము ఎనిమిది గుఱ్ఱములు కలది, బంగారముతో నిర్మించబడినది. శనియొక్క రథము వెండితో చేయబడినది, ఎనిమిది అశ్వములు కలదిగా ఉండును.
రాహుకేతువుల యొక్క రథములు కూడ ఇనుముతో చేయబడినవై ఎనిమిది అశ్వములు కలవై యుండును. ఇవి మహాగ్రహముల యొక్క రథములు మీకు వివరింపబడినవి.
ఇవి యన్నియు పోయురశ్ములతో ధ్రువసానముతో నియమింపబడియున్నవి. గ్రహముల, నక్షత్రముల స్థానములన్నియు సంపూర్ణముగా ధ్రువస్థానముతో నిబంధింపబడినవి. అవి తీరుగుచు, వాయురశ్ములతో భ్రమింపజేయుచుండును.
Summary of chapter 43 of the Kūrma Mahā Purana is as follows:
Sūta details the astro-cosmic movements of the sun, moon, planets, lunar mansions, and constellations attached to the cosmic wheel of Time. The Sun God Vivasvān rides his single-wheeled chariot drawn by seven divine horses, distributing light, heat, rain, and life-force across all worlds, guided by the unseen power of Nārāyaṇa.