కూర్మ మహా పురాణము
41వ అధ్యాయము
సూత ఉవాచ-
ఇదం త్రైలోక్యవిఖ్యాతం తీర్థం నైమిశ ముత్తమం ।
మహాదేవప్రియకరం మహాపాతకనాశనమ్ ॥
మహాదేవం దిదృక్షూణా నుషీణాం పరమేష్ఠినామ్ ।
బ్రహ్మణా నిర్మితం స్థానం తష సప్తుం ద్విజోత్తమాః॥
మరీచయో త్రయో విప్రాః వసిష్టాః క్రతవ స్తథా ।
భృగవాంగిరసః పూర్వా బ్రహ్మాణం కమలోద్భవమ్॥
సమేత్య సర్వవరదం చరుర్మూర్తిం చతుర్ముఖమ్ ।
పృచ్ఛంతి ప్రణీపత్యైనం విశ్వకర్మాణ మచ్యుతమ్ ॥
సూతుల వారు పలికిరి.
నైమిశారణ్య తీర్థము త్రైలోక్య విఖ్యాతము. మహాపాతక నాశము, మహాదేవునికి ప్రీతిపాత్రము. పరమ నిష్టాగరిష్ఠులగు మహరులు, మహాదేవుని చూడగోరి, తపముచేయుటకు, బ్రహ్మఏర్పరచినస్థానము. మరీచి, అత్రి, వసిష్ణ, క్రతు, అంగీర, వంశమున పుట్టిన మహర్సులు బ్రహ్మదగ్గరకు వచ్చి, చతుర్ముఖుడు, చతుర్మూర్తి సర్వవరప్రదుడగు బ్రహ్మకు నమస్కరించి యిట్లడిగిరి.
షట్కులీయా ఊచుః –
భగనన్ దేవ మీశానం భర్గ మేకం కపర్దినం ।
కేనోపాయేన పశ్యామో బ్రూహి దేవ నమస్కృతమ॥
షట్ములీయులు అడిగిరి.
భగవన్! కపర్ది, అద్వితీయుడైన భర్గుడు మహాదేవుని చూచుటకు తగిన ఉపాయమేది? తెలుపుము అని బ్రహ్మను అడిగిరి.
బ్రహ్మా ఉవాచ:-
సత్రం సహస్ర మాసధ్వం వాజ్మన్దోషవర్జితాః ।
దేశం చ వః ప్రవక్ష్యామి యస్మిన్ దేశ చరిష్యథ ॥
ఉక్త్వా మనోమయం చక్రం స సృష్ట్వా తో నువాచ హ ।
క్షిప్త మేత న్మయా చక్ర మనువ్రజత మాచిరమ్ ॥
యత్రాస్య నేమిః శీర్యేత స దేశః పురుషర్షభాః ॥
తతో ముమోచ తచ్చక్రం తే చ త త్సమనుసృజన్ ।
తస్య వై వ్రజత క్షిప్రం యత్ర నేమిర్వి శీర్యతే ॥
నైమిశం తత్ స్మృతం నామ్నా పుణ్యం సర్వత్ర పూజితం ॥
సిద్దచారణసంకీర్ణం యక్షగంధర్వసేవితం ।
స్థానం భగవతః శంభో రేతస్మి న్నేమిశం స్మృతమ్ ॥
అత్ర దేవాః సగంధర్వాః సయక్షోరగరాక్షసాః ।
తప సప్త్వా పురా దేవం లేఖరే ప్రవరాన్ వరాన్ ॥
ఇమం దేశం సమాశ్రిత్య షట్కులీయాః సమాహితాః ।
సత్రేణారాధ్య దేవేశం దృష్టవవో మహేశ్వరమ్॥
అత్ర దానం తప స్తప్తం స్థానం జప్త్యాదికం చ యత్ ।
ఏకైకం పావయేత్ పాపం సప్తజన్మకృతం ద్విజాః ॥
అత్ర పూర్వం స భగవానృషీణాం సత్ర మాసతామ్ ।
ప్రోవాచ పోయు ర్బ్రహ్మాండం పురాణం బ్రహ్మభాషితమ్ ॥
అత్ర దేవో మహేశామో రుద్రాణ్యా కిల విశ్వకృత్ ।
రమతే ద్యాపీ భగవాన్ ప్రమథైః పరివారితః ॥
అత్ర ప్రాణాన్ పరిత్యజ్య నియమేన ద్విజాతయః ।
బ్రహ్మలోకం గమిష్యంతి యత్ర గత్వా న జాయతే ॥
అన్యచ్చ తీర్థప్రవరం జాప్యేశ్వర మితి శ్రుతం ।
జజాప రుద్ర మనిశం యత్ర నందీ మహాగణః ॥
ప్రీత స్తస్య మహాదేవ దేవ్య సహ పినాకధృక్ ।
దదా వాత్మసమానత్వం మృత్యువంచన మేవ చ ॥
అభూ దృషిః స ధర్మాత్మా శిలాదో నామ ధర్మవిత్ ।
ఆరాధయ న్మహాదేవం పుత్రార్థం వృషభధ్వజమ్ ॥
తస్య వర్షసహస్రాంతే తప్యమానస్య విశ్వకృత్ ।
శర్వః సోమో గణవృతో వరదోస్మీత్యభాషత ॥
స దేపూ వర మీశానం వరేణ్యం గిరిజాపతిమ్ ।
అయోనిజం మృత్యుహీనం పుత్రకం చ త్వయాసమమ్ ॥
తథా స్తిత్యాహ భగవాన్ దేవ్యాసహ మహేశ్వరః ।
పశ్యత స్తస్య విప్రర్షే రంతర్థానం గతో హరః ॥
పోజ్మమేదోషములు లేనివారై, వేయి సంవత్సరముల అవధిగల సత్రమును ఆచరింపుడు. మీరు సత్రము చేయవలసిన ప్రదేశమును చెప్పుదును”. అని పలికి మనసుతో ఓక చక్రమును సృష్టించి, వారితో యిట్లు పలికెను. “ఈ చక్రమును నేను విడుచుచున్నాను. మీరు దీనిని అనుసరింపుడు. ఎచట ఈ చక్రనేమి శీర్ణమగునో అది సత్తమాచరించ దగిన ప్రదేశము. అని పలికి బ్రహ్మ చక్రమును విడిచెను. ఆ ఋషులు చక్రమును అనుసరించిరి. ఆ చక్రనేమి శీర్ణమైన ప్రదేశమును నైమిశమని వ్యవహరించిరి. ఇది పరమపావనము. అందరిచేత పూజించబడినది. సిద్ద చారణ యక్ష గంధర్వులు ఇచటఎపుడు సేవించుచుందురు. ఈ స్థానము శంభు భగవానునిది. ఇచట దేవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు తపమాచరించి, శంకరుని నుండి గొప్ప వరములు పొందిరీ, షట్కులీయ ఋషులీదేశమును చేరి సావధానముతో సహస్రవత్సర పరిమితముగు సత్రమాచరించి, మహాదేవుని ఆరాధించి సాక్షాత్కరించుకొనిరి. కావున ఈ క్షేత్రమున చేసిన తపస్సు దానము యజ్ఞము జపాదీకములన్నియూ ఒక్కొక్కటి ఏడు జన్మల పొపములను నశింప జేయును, ఈ నైమీశమున సత్రమునాచరించుచున్న మునులతో వాయుభగవానుడు బ్రహ్మాండపురాణమును చెప్పెను. ఇచట మహాదేవుడును పార్వతితో కలిసి ప్రమధగణములతో పాటు ఇప్పటికి రమించుచున్నాడు. ఈ క్షేత్రమున నియమపూర్వకముగా ప్రాణములు త్యాగము చేసినవారు మరల తీరిగీధుని బ్రహ్మలోకమునకు చేరెదరు.
ఇచటనే జాష్యేశ్వరమను మరియొక తీర్ధము కలదు. ఇచట మహాగణుడగు నంది మహాదేవుని గూర్చి తపమాచరించేను. అతనికి ప్రసన్నుడగు శివుడు తనతో సమానత్వము మృత్యుంజయత్వమును వరములుగా నొసంగెను. ఇచటనే శిలాదుడను మహా ఋషి ధర్మవిత్తు పుత్రుని కొరకు శంకరుని గూర్చి తపమాచరించెను. అతడు వేయి సంవత్సరములు తపమాచరించిన తరువాత శంకరుడు సాక్షాత్కరించి వరమిచ్చెదనని పలికెను. అయోనిజుడు మృత్యుహీనుడగు పుత్రునిమ్మని అడిగేను, దేవితో గూడ శంకరుడు అట్లే అగుగాక అని పలికెను. అతను చూచు చుండగా అంతర్థానము నొందెను.
తతో యియక్షుః స్వాం భూమిం శీలాదో ధర్మవిత్తమః ।
చకర్ష లాంగలే నోర్వీం భిత్వ దృశ్యత శోభనః ॥
సంవర్తకానుప్రఖ్యః కుమారః ప్రహస న్నిన ।
రూపలావణ్యసంపన్న స్తేజసా భాసయన్ దిశ॥
కుమారతుల్యో ప్రతిమో మేఘగంభీరయా గిరా ।
శిలాదం తాత తాతేతి ప్రాహ నందీ పునః పునః ॥
తం దృష్ట్వా నందనం ఊతం శిలాదః పరిషస్వజే ।
మునిభ్యో దర్శయామాస చైత దాశ్రమవాసినః ॥
జాతకర్మాదికాః సర్వాః క్రియా స్తస్య చకార హి ।
ఉపనీయ యధాశాస్త్రం వేద మధ్యాపయత్ సుతమ్॥
అధీతవేదో భగవాన్ నందీ మత మనుత్తమమ్ ।
చక్రే మహేశ్వరం ద్రష్టుం జేష్యే మృత్యుమితి ప్రభుమ॥
స గత్వా సరితం పుణ్యాం ఏకాగ్రః శ్రద్ధయాన్వితః ।
జజాప రుద్ర మనీశం మహేశాసక్తమానసః ॥
తస్య కోట్యాం తు పూర్ణాయాం శంకరో భక్తవత్సలః।
ఆగత్య సాంబః సగణో వరదోస్మీత్యువాచ హ ॥
స వవే పున రేవాహం జపేయం కోటి మిశ్వరం ।
తావ దాయు ర్మహాదేవ దేహీతి వర విశ్వరమ్ ॥
ఏవ మస్త్వితి సంప్రోచ్య దేవో ప్యంతరధీయత ।
జజాప కోటిం భగవాన్ భూయ స్తద్గతమానసః ॥
ద్వితీయాయాం చ కోట్యాంవై సంపూర్ణాయాం వృషధ్వజః ।
ఆగత్య వరదోస్మీతి ప్రాహ భూతగణై ర్వ్యతః॥
తృతీయం జప్తు మిచ్ఛామీకోటిం భూయో పి శంకర ।
తథా స్త్వి త్యాహ విశ్వాత్మా దేవో ప్యంతరధీయత॥
కోటిత్రయేథ సంపూర్ణే దేవః ప్రీతమనా భృశమ్ ।
ఆగత్య వరదో స్మీతి ప్రాహ భూతగణై ర్వ్యతః॥
జపేయం కోటి మన్యాం వై భూయోపీ తవ తేజసా ।
ఇత్యు క్తేః భగవానాహ న జస్తవ్యం త్వయా పునః ॥
అంతట ధర్మవిత్తముడగు శిలాదుడు యాగము చేయగోరి తనభూమిలో దున్నుచుండగా భూమిని చీల్చుకొని అతి సుందరుడగు వాడు ప్రలయ కాలాగ్నివలె మహాతేజస్వి యగు కుమారుడు నవ్వుచూ కనిపించేను. రూపలావణ్య సంపన్నుడు తేజస్సుతో అన్ని దిక్కులను ప్రకాశింప చేయుచు కునూరస్వామి వంటి వాడు సాటి లేనివాడు మేఘ గంభీరధ్వనితో ఇట్లు పలికెను. ‘తాత’! ‘తాత’ అని పలికెను. ఆకుమారుని పేరు నందిగా ప్రసిద్ధి చెందెను. ఆ కుమారుని చూచిన శిలాదుడు సంతోషించి కుమారుని ఆలింగనము చేసుకొని సంతోషముతో ఆశ్రమమున నున్న ఋషులకు చూపెను. అతనికీ జాత కర్మాదికములను యధా శాస్త్రమంగా ఆచరించేను. ఉపనయనము గావించి వేదాధ్యయనము చేయించేను. వేదాధ్యయనము పూర్తిచేసిన నంది ఉత్తమ సంకల్పమును చేసుకొనెను. పరమేశ్వరుని సాక్షాత్కరించుకొని మృత్యువును జయించెదను అని. ఒక పుణ్యనదికి వెళ్ళి ఏకాగ్ర మానసుడై శ్రద్ధతో మహేశుని యందు మనసుంచుకొని రుద్రుని గూర్చి తపమాచరించెను. ఒక కోటి సార్లు మంత్రము జపించగానే భక్త వత్సలుడగు శంకరుడు పొర్వతితో గణములతో కలిసివచ్చి వరమిచ్చెదనని పలికెను. నేనింకొకమారు కోటిమార్లు జపించవలయునని కోరుచున్నాను. నాకు దానికి సరిపడ వర మాయమని అడిగెను. శంకరుడట్లే అని పలికి అంతర్థానము చెందెను. మరల శంకరుని యందు మనసీడి కోటి జప మాచరించేను. కోటి పూర్తి కాగానే శంకరుడు భూత గణములతో కలిసి వచ్చి వరమిచ్చెదనని పలికెను. మూడవమారు కోటి జపము చేయదలచితినని పలికెను. అట్లే కానీమ్ము అని పలికి శంకరుడంతర్థానము చెందెను. మూడవ కోటి ముగియగానే ప్రీతి చెందిన శంకరుడు భూతగణములతో వచ్చి వరము నిచ్చెదననేను. నీ తేజస్సుతో ఇంకొక కోటి జపీంచ కోరుచున్నాను అని పలుకగా శంకరుడు ఇక జపించవలదు అని పలికెను.
అమరో జరయా త్యక్తో మమ పార్శ్వగతః సదా ।
మహాగణపతి ర్దేవ్యాః పుత్రో భవ మహేశ్వర॥
యోగీశ్వరో యోగనేతా గణానా మిశ్వరేశ్వరః ।
సర్వలోకాధిపః శ్రీమాన్ సర్వజ్ఞో మద్బలాన్విత॥
జ్ఞానం తన్మామకం దివ్యం హస్తామలకవత్ తవ ।
ఆభూతసంప్లవస్థాయీ శతో యాస్యసి మత్పదమ్ ॥
ఏత దుక్త్వా మహాదేమో గణా నాహూయ శంకరః ।
అభిషేకేణ యుక్తేన నందీశ్వర మయోజయత॥
ఉదాహయామాస చ తం స్వయమేవ పినాకధృక్ ।
మరుతాం చ శుభాం కన్యాం సుయశేతి చ విశ్రుతామ్॥
ఏత జ్ఞాప్యేశ్వరం స్థానం దేవదేవస్య శూలినః ।
యత్ర తత్ర మృతో మయ్యో రుద్రలోకే మహీయతే॥
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధే ఏకచత్వారింశోధ్యాయః
నీవు నేటినుండీ జరా మరణ వర్జితుడవగుదువు. ఎప్పుడూ నా ప్రక్కనే యుందువు. నీవు మహాగణపతివి. దేవికి పుత్రునిగా మహేశ్వరునిగా నుందును, యోగీశ్వరుడవు. యోగినేతను, గణాధీపతులకు అధిపతివీ సర్వలోకాధిపత్యము సర్వజ్ఞత్వము నా వంటి బలము, నా జ్ఞానము దివ్యము నీకు కలుగును. ఇట్లు ప్రలయము వరకుండి నాలోకమునకు చేరెదను. ఇట్లు పలికి శంకరుడు తన గణములను పిలిచి నందీశ్వరుని గణాధిపతిగా అభిషేకించెను. తాను స్వయముగా దగ్గరుండి మరుత్పుత్రికయగు కన్యతో వివాహము జరిపించెను. ఈ ప్రదేశము జప్యేశ్వరము అనుష్ఠానము దేవదేవుడగు శంకరునిది ఈ తీర్థమున మృతిచెందినవాడు రుద్రలోకమున చేరును.
ఇది కూర్మపురాణమున షట్సాహస్రిసంహితలో ఉపరి విభాగమున 41వ అధ్యాయము.
Summary of chapter 94 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa presents the structure, authority, and thematic scope of the eighteen Mahāpurāṇas revealed by Bhagavān Nārāyaṇa across cosmic Yugas. He highlights the divine position of the Kūrma Purāṇa among these holy texts, asserting that listening to its holy recitations with faith cleanses all sins and bestows divine knowledge.