47 - భువనకోశవర్ణనమ్

సూత ఉవాచ:-

కేతుమాలే నరాః కాకాః సర్వే పనసభోజనాః

స్త్రియ శ్చోత్పలపత్రాభ స్తే జీవన్తి వర్షాయుతమ్

భద్రాశ్వే పురుషాః శుక్లాః స్త్రీయ శ్చ న్ద్రాoశుసన్నిభాః

దశవర్షసహస్రాణి జీవన్తి చాన్నభోజనాః

రమ్యకే పురుషా నార్యో రమన్తి రజతప్రభః

దశవర్షసహస్రాణి శతాని దశ పఞ్చచ

జీవన్తి చైవ సత్త్వస్థా న్యగ్రోధఫలభోజనాః

హిరణ్మయే హిరణ్యాభాః సర్వే శ్రీఫలభోజనాః

ఏకాదశ సహస్రాణి శతాని దశ పఞ్చచ

జీవన్తి పురుషా నార్యో దేవలోకస్థితా ఇవ

సూతుడిట్లు పలికెను.

కేతుమాలవర్షములో అందరుమనుష్యులు, ధృష్టులు, పనసభోజనము చేయుదురు. అక్కడి స్త్రీలు కలువపూల వంటి కాంతి కలవారు. వారు పదివేల సంవత్సరకాలము జీవింతురు.

భద్రాశ్వవరములో పురుషులు తెల్లని వారుగాను, స్త్రీలు చంద్రునివెన్నెల వలె ప్రకాశించువారుగాను ఉందురు. పోరు అన్నమును భుజించు వారై పదివేల సంవత్సరాలు జీవింతురు.

రమ్యకవర్షములో వెండివలె మెరయుచున్న స్త్రీలు, పురుషులు పదివేల సంవత్సరాలు మరియు పదునైదు వందల సంవత్సరముల కాలము విహరించుచుందురు.

హిరణ్మయ వర్షములో బంగారము వంటి శరీరముకల నరులు సత్త్వగుణముకలవారై, మజ్జిఫలములను, శ్రీఫలములను ఆహారముగా స్వీకరించుచు జీవించెదరు.

అక్కడివారు పదునొకండు వేల, పదునైదు వందల సంవత్సరాల కాలము దేవలోకమునందున్న వారివలె పురుషులు, స్త్రీలు కూడ జీవనము గడుపుదురు.  

త్రయోదశ సహస్రాణి శతాని దశ పఞ్చచ

జీవన్తి కురువర్షేతు శ్యామాజ్గాః క్షీరభోజనాః

సర్వే మిథునజాతా శ్చ నిత్యం సుఖనిషేవితాః

చన్ద్రద్వీపే మహాదేవం యజన్తి సతతం శివమ్

తథా కింపురుషే విప్రా మానవా హేమ సన్నిభాః

దశవర్ష సహస్రాణి జీవనీ పక్షభోజనాః

యజన్తి సతతం దేవం చతుఃశీర్షం చతుర్భుజమ్

ధ్యానే మనః సమాధాయ సాదరం భక్తిసంయుతః

తథా చ హరివర్ణే తు మహారజతసన్నిభాః

దశవర్ష సహస్రాణి జీవన్తి క్షురసాశీనః

తత్ర నారాయణం దేవం విశ్వయోనిం సనాతనమ్

ఉపాసతే సదా విష్ణుం మానవా విష్ణుభావితా:

కురు వర్షములో జనులు నల్లని శరీరము కలవారై, పొలు ఆహారముగా గ్రహించుచు పదమూడువేలు మరియు పదునైదు వందల సంవత్సరములపాటు జీవింతురు.

దంపతుల జంటలన్నియు ఎల్లప్పుడు సుఖముగా జీవించుచుందురు. చంద్రద్వీపమునందు ఎల్లప్పుడు మహాదేవుడైన శివుని పూజింతురు.  అట్లే కింపురుషవర్షములో మానవులు బంగారురంగు కలవారైయుందురు. వారు జువ్వి ఫలములనాహారముగా గ్రహించి పదివేల సంవత్సరాలు జీవింతురు.  వారు సోలుగు శిరములు, నాలుగు చేతులు కలిగిన దేవునిగూర్చీ, ధ్యానమునందు మనస్సు నిలిపి భక్తితో కూడి ఎల్లప్పుడు గౌరవముతో పూజింతురు.

హరివర్షములో మేలయిన వెండితో సమానవర్ణము కలవారై, చెరకురసము నాహారముగా తీసికొనుచు పదివేల సంవత్సరములు జీవించేదరు.

ఆ హరి వర్షములో విశ్వమునకు కారణభూతుడు, సనాతనుడు అగు నారాయణుని దేవుని విష్ణుప్రభావితులై మానవులు సేవింతురు.

తత్ర చన్ద్రమసం శుభ్రం శుద్ధస్ఫటికసన్నిభమ్

విమానం వాసుదేవస్య పారిజాతవనాశ్రీతమ్

చతుర్ద్వార మనౌపమ్యం చతుస్తోరణసంయుతమ్

ప్రాకారై ర్దశభి ర్యుక్తం దురాధర్షం సుదుర్గమమ్

స్ఫాటికైర్మణ్డపై ర్యుక్తం దేవరాజగృహోపమమ్

సువర్ణ స్తమ్భసాహస్రైః సర్వతః సమలంకృతమ్

హేమసోపానసంయుక్తం నానారత్నోపశోభితమ్

దివ్యసింహాసనోపేతం సర్వశోభాసమన్వితమ్

సరోభిః స్వాదుపానీయై ర్నధిబి శ్చోపశోభితమ్

నారాయణపరైః శుద్దై ర్వేదాధ్యయనతత్పరైః

యోగీభీ శ్చ సమాకీర్ణం ధ్యాయద్భిః పురుషం హరిమ్

స్తువద్భిః సతతం మంత్రై ర్నమస్యద్భిశ్చ మాధవమ్

అక్కడ స్వచ్చమైన చంద్రుని, నిర్మలమైన స్పటికముతో సమానమైన వానిని, పారిజాతవనము నాశ్రయించియున్న వాసుదేవుని యొక్క విమానమును, నాలుగు ద్వారములు కలదానినీ, సాటిలేనిదానినీ, నాలుగు తోరణములతో కూడియున్నదానిని, పది ప్రాకారములతో కూడిన దేనిని, తిరస్కరించుటకు తగని దానిని, పొందుటకు మిక్కిలి కష్టసాధ్యమైన దానినీ, స్పటిక మణులతో చేయబడిన మంటపములతో కూడిన దానిని, దేవేంద్రుని స్తంభములతో అంతట అలంకరింపబడినదానిని, బంగారు మెట్లతోకూడి, బహువిధములైన మణులతో అలంకరింపబడిన దానిని, శ్రేష్టమైన సింహాసనముతో కూడినదానిని, అన్ని శోభలతో కూడినదానినీ;

రుచికరమైన జలముతోకూడిన కొలనులతో, నదులతో కూడినదానిని, సోరోయణుని యందాసక్తులై, వేదాధ్యయనపరులై, శుదులైన, విష్ణువును ధ్యానించుచున్న యోగులతో నిండియున్న దానిని, మంత్రములతో ఎల్లప్పుడు హరిని స్తోత్రము చేయుచున్న, నమస్కరించుచున్న వారితో కూడిన దానిని;

తత్ర దేవాధిదేవస్య విష్ణో రమితతేజసః

రాజానః సర్వకాలం తు మహిమానం ప్రకుర్వతే

గాయన్తి చైవ నృత్యన్తి విలాసిన్యో మనోహరాః

స్త్రీయో యౌవనశాలిన్యః సదా మణ్డనతత్పరాః

ఇలావృతే పద్మవర్ణా జమ్బూరసఫలాశినః

త్రయోదశ సహస్రాణీ వర్షాణాం చ స్థిరాయుషః

భారతేషు స్త్రియః పుంసో నానావర్ణాః ప్రకీర్తితాః

నానాదేవార్చనే యుక్తా నానా కర్మణీ కుర్వతే

పరమాయుః స్మృతం తేషాం శతం వర్షాణి సువ్రతాః

నవయోజనసాహస్రం వర్ష మేత త్ప్రకీర్తితమ్

కర్మభూమీ రియం విప్రా నరాణా మధికారిణామ్

మహేoధ్రో మలయః సహ్యః శక్తిమా నృక్షపర్వతః

అక్కడ రాజులు,దేవాధిదేవుడు, అమితమైన తేజస్సు కలవాడు అగు విష్ణువుయొక్క మహిమను అన్ని కాలముల యందు ప్రశంసించుచుందురు.

మనోహరులగు విలాసవతులు, యౌవనముతో ప్రకాశించువారు, ఎల్లప్పుడు అలంకారములందాసక్తులైన వారగు స్త్రీలు అక్కడ పాటలు పాడుచుందురు, నృత్యము చేయుచుందురు.

ఇలావృతవర్షములో నివసించువారు పద్మము వంటి రంగు కలపోరు, జంబూఫలములను, వానీ రసమును భుజించువారు, పదమూడు వేల సంవత్సరాలు చిరాయువు కలవారుగా ఉందురు.

భారతవర్షములో స్త్రీలు, పురుషులు కూడ అనేక వర్ణములు కలిగి ఉందురు. అనేక దేవతలను పూజింతురు, అనేక కర్మలను చేయు చుందురు.

వారి పరమాయుర్దాయము నూరు సంవత్సరములు. ఈభారత వర్షము తొమ్మిదివేల యోజనముల వైశాల్యము కలిగి ఉంటుంది.

బ్రాహ్మణులారా ఇది అధికారముకల మనుష్యులకు కర్మభూమి. మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, ఋక్షపర్వతము

 వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తా త్ర కులపర్వతాః

ఇన్ద్రద్వీపః కసేరుక్మాన్ తామ్రపర్ణో గభస్తిమాన్

నాగద్వీప స్తథా సౌమ్యా గన్దర్వస్వథ వారుణః

అయన్తు సవము స్తేషాం ద్వీపః సాగర సంస్థితః

జనానాం సహస్రం తు ద్వీపోఽయం దక్షిణోత్తరః

పూర్వే కిరాతా స్తస్యాన్తి పశ్చిమే యవనా స్తథా

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్ర స్తథైవ చ

ఇజ్యాయుద్ధవణిజ్యాభి ర్వర్తయ న్య్తత్ర మానవాః

స్రవoతే పావనా సద్యః పర్వతేభ్యో వినీఃసృతాః

శతద్రు శ్చన్ద్రభాగా చ సరయూ ర్యమునా తథా

ఇరావతీ వితస్తా చ వీపాశా దేవికా కుహూః

గోమతీ ధూతపాపా చ బాహుదా చ దృషద్వతీ

వింధ్యపర్వతము, పొరియాత్రము అనుఏడు ఈ వరములోకల పర్వతములు. ఇంద్రద్వీపము, కసేరుక్మము, తామ్రపర్ణము, గభస్తిమంతము,  సాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము అనుద్వీపములతో పాటు ఈద్వీపము సముద్రమందున్న తొమ్మిదవ సంఖ్య కలది.

ఈ ద్వీపము దక్షిణోత్తర దిశలకు వేయి యోజనముల దూరము వ్యాపించి ఉన్నది. దీని తూర్పుదిక్కు చివరి భాగములో కిరాతులు, పడమటి కొనయందు యవనజాతీవారు నివసింతురు.

ద్వీపమధ్యభాగములో బ్రాహ్మణ క్షత్రియవైశ్యులు మరియు శూద్రజాతి జనులు నివసింతురు. ఇక్కడి వర్ణముల మానవులు క్రమముగా యజ్ఞములు, యుద్దములు, వాణిజ్యము అను వృత్తులతో జీవనము సాగింతురు.  ఇక్కడ పర్వతముల నుండి బయలుదేరి ప్రవహించు పవిత్రమైన నదులు కలవు. శతద్రుపు, చంద్రభాగ, సరయు, యమున, ఇరావతి, వితస్త, విపాశ, దేవిక, కుహూ, గోమతి, ధూమపాప, బాహుద మరియు దృషద్వతీ,

కౌశికీ లోహినీ చేతి హిమవత్పాదనిఃనృతాః

 వేదస్కృతి ర్వేదవతీ వ్రతఘ్నీ త్రిదీవా తథా

వర్ణాశా చన్దన చైవ సచర్మణ్యవతీ సురా

విదిశా వేత్రవత్యపి పారియాత్రాశ్రయాః స్మృతాః

నర్మదా సురసా శోణో దశార్ణా చ మహానదీ

మన్దాకినీ చిత్రకూటో తామసీ చ పిశాచికా

చిత్రోత్పలా విశాలా చ మఞ్జలా వాలువాహినీ

ఋక్షవత్పాదజా నద్యః సర్వపాపహరా నృణామ్

తాపీ పయోష్ణీ నిర్విన్ద్యా శీఘ్రోదా చ మహానదీ

విన్నా వైతరణీ చైవ బలాకా చ కుముద్వతీ

తథా చైవ మహాగౌరీ దుర్గా చాన్త: శిలా తథా

విన్ద్యపాదప్రసూతాస్తు సద్యః పాపహరా నృణామ్

కౌశికి, లోహిని అని హిమవత్పర్వత పాదప్రదేశము నుండి బయలుదేరినవి. వేదస్కృతి, వేదవతి, ప్రతఘ్నిమరియుత్రిదివ అనునది, వర్ణాశ, చందన, చర్మణ్వతి, సుర, విదిశ, నేత్రవతీ, అనునదులు పారియాత్రపర్వతము నాశ్రయించినవి. నర్మద, సురస, శోణము, దశార్ణ, మహానది, మందాకిని, చిత్రకూట, తామసి, పిశాచిక, చిత్రోత్పల, విశాల, మంజుల, పొలుపొహిని అనునవి ఋక్షవత్పర్వతము నుండి బయలుదేరునవి, మనుష్యుల అన్నీ పాపములను నశింప జేయునదులు

తాపీ, పయోష్టి, నిర్వింధ్య, శీఘ్రద అను మహానది, విన్న మరియు వైతరణీ, బలాక, కుముద్వతి, మహాగౌరి, దుర్గ, అంతశ్మిల అను నదులు వింధ్యపర్వత పాదముల నుండి బయలుదేరునవి, మనుష్యుల పాపములను వెంటనే నశింపజేయునవి.

గోదావరీ భీమరథీ కృష్ణావేణా చ వశ్యతా

తుంగభద్రా సుప్రయోగా కావేరీ చ ద్విజోత్తమాః

దక్షిణాపథ నద్య స్తు సహ్యపాదా ద్వేనిఃసృతాః

ఋతుమాలా తామ్రపర్ణీ పుణ్యవ త్యుత్పలావతీ

మలయా న్నిః సృతా నద్యః సర్వాః శీతజలాః స్మృతాః

ఋషికుల్యా త్రిసామా చ గన్దమాదనగామీనీ

క్షిప్రా పలాశినీ చైవ ఋషీకా వంశధారిణీ

శుక్తిమత్పాదసఞ్జతాః సర్వపాపహరా నృణామ్

ఆసాం నద్యుపనద్య శ్చ శతతో ద్విజపుజ్గవాః

సర్వపాపహరాః పుణ్యాః స్నానదానాదికర్మసు

బ్రాహ్మణోత్తములారా గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వశ్యత తుంగభద్ర, సుప్రయోగ మరియు కావేరియను  సహ్యాపర్వత పాద ప్రదేశమునుండి బయలుదేరిన దక్షిణాపథపునదులు. ఋతుమాల, తామ్రపర్ణి, పుణ్యవతి, ఉత్పలావతి అను నదులు  మలయపర్వతను నుండి బయలు వెడలినవీ. ఇవన్నియు చల్లని నీరు కలవిగా ప్రసిద్ధములు. ఋషికుల్య, త్రిసామ అనునవి గంధమాదన పర్వతమును ఆశ్రయించి నవి.

క్షిప్ర, పలాశిని, ఋషీక మరియు వంశధారిణి అను నదులు శుక్తి మత్పర్వత పాద ప్రదేశమునుండి పుట్టినవి. అవి మనుష్యుల పాపము లన్నిటిని నశింపజేయును.

విప్రులారా ఈ నదుల యొక్క ఉపనదులు వందల కొలదిగా కలవు. అవి పుణ్యకరములైనవి. స్నానదానాది కర్మల వలన అన్ని పాపములను తొలగించును.  

తాస్విమే కురుపాఞ్చలా మధ్యదేశాదయో జనాః

పూర్వదేశాదీకా శ్చైవ కామరూపనివాసినః

పుణ్డ్రాః కలిజ్గా మగధా దాక్షిణాత్యా శ్చ కృత్స్నశః

తధా పరాన్తః సౌరాష్ట్ర శూద్రా హీనా స్తధా ర్బుదోః

మాలకా మలపా శ్చైవ పారియాత్రనివాసినః

సౌవీరాః సైన్దవా హూణా మాల్యాబాల్యా నివాసినః

మాద్రా రామా స్తథైవాన్ద్రా: పారసీక స్తథైవ చ

ఆసాం పిబన్తి సలిలం వసన్తి సరితాం సదా

చత్వారి భారతే వర్షే యుగాని కవయోఽ బ్రువన్

కృతం త్రేతా ద్వాపర ఞ్చ కలిశ్చాన్యత్ర న క్వచిత్

యాని కింపురుషాద్యానీ వర్షా ణ్యష్టౌ మహర్షయః

న తేషు శోకో నాయాసో నోద్వేగః క్షుద్భయం న చ

వానియందు, ఈకురుపాంచాలదేశముల, మధ్యదేశము మొదలగు వాని, తూర్పుదేశము మున్నగు ప్రాంతాల జనులు, కామరూప దేశమందున్న ప్రజలు  పుండ్రులు, కలింగులు, మగధులు, సంపూర్ణ దక్షిణ ప్రాంతజనులు, అపరాంత దేశవాసులు, సౌరాష్ట్ర శూద్రులు, అగ్బుదులు, తక్కువ జాతి ప్రజలును

మాలకులు, మలపులు, పారియాత్ర మందు నివసించువారు, సౌవీరులు, సింధుప్రాంతీయులు, హుణులు, మాల్యులు, బాల్యులు, అక్కడ నివసించువారు.

మాద్రులు, రాములు, ఆంధ్రులు, అట్లే పారశీకులు పూర్వము పేర్కొనబడిన నదుల నీటిని త్రాగుదురు. నదీ తీరాలలో నివసింతురు. భారత పర్షములో నాలుగు యుగములను పండితులు చెప్పిరి. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములని వాని పేర్లు. ఇవి వేరేచోట ఎక్కడను లేవు.

మహరులారా కింపురుష వర్షము మొదలగు ఏ యెనిమిది చెప్పబడినవో, వానిలో శోకము, ఆయాసము, ఆకలి, ఉద్వేగము ఉండవు.  

స్వస్థాః ప్రజా నిరాశజ్గా: సర్వదుఃఖవివర్జితః

రమoతే వివిధై ర్భావైః సర్వాశ్చ స్థిరమౌవనాః

ఇతి శ్రీ కూర్మపురాణే భువనకోశ వర్ణనం నామ సప్త చత్వారింశోఽధ్యాయః

అక్కడి ప్రజలు రోగరహితులై, అన్ని దుఃఖములనుండి విడువబడినవారై, మంచి స్థితి కలవారుగా, అందరును స్థిరమైన యౌవనము కలవారై వివిధభావములతో విహరింతురు.

శ్రీ కూర్మపురాణములో భువనకోశవర్ణనమను సలుబది యేడవ అధ్యాయము సమాప్తము.