14వ అధ్యాయము

వ్యాస ఉవాచః-

ఏవం దండాదిభి ర్యుక్తః శౌచాచార సమన్వితః

ఆహూతో ధ్యయనం కుర్యాత్ వీక్షమాణో గురో ర్ముఖమ్

నిత్య ముద్యతపాణి స్స్యాత్ సాధ్వాచార స్సుసంయతః

ఆస్యతా మీతి చోక్తః స న్నా సీతాభి ముఖం గురోః

ప్రతిశ్రవణ సంభాషే శయానో న సమాచరేత్ 

నా సీనో న చ భుంజానో న తీస్థ న్న పరాఙ్ముఖః

వ్యాసుడు పలికెను.

ఇట్లు దండాదులను ధరించి శౌచాచారము కలిగి, గురువు పిలుపు మేరకు గురుముఖము చూచుచు అధ్యయనము చేయవలయును. సదాచార సంపన్నుడై ఉత్తరీయము నుండి దక్షిణ హస్తమును బయట ఉంచుకొని, ఇంద్రియ నిగ్రహము కలవాడై గురుపు కూర్చుండమని చెప్పినపుడు, గురువుకు అభిముఖముగా కూర్చొనవలెను. పడుకొని, కూర్చోని, భోజనము చేయుచు, నీలబడి, గురువు వంక వీపునుంచి, గురువునుండి విద్యనుగాని ఇతర సంభాషణలు గాని చేయరాదు.  

నీచం శయ్యా సనం చాస్య సర్వదా గురు సన్నిధౌ

గురోస్తు చక్షుర్విషయే న యథేష్టాసనో భవేత్

నోదాహరే దస్య నామ పరోక్ష మపి కేవలమ్

న చైహాస్యానుకుర్వీత గతిభాషణచేష్టితమ్

గురుపు సమీపమున ఆసనముగాని, శయ్యగాని, క్రిందుగా ఉండవలెను. గురువు కనుల ముందు యిష్టము వచ్చినట్లు కూర్చొనరాదు. గురువు పరోక్షమున కూడా గురువు నామమును, గౌరవ ఉపాధి శూన్యముగా ఉచ్చరించరాదు. గురువు. గమనమును, భాషలను, చేష్టలను అనుకరించరాదు.

గురో ర్యత్ర పరీవాదో నిందా చాపి ప్రవర్తతే

కర్ణౌ తత్ర పిధాతవ్యో గంతవ్యం వా తతోన్యతః

దూరస్థో నార్చయే దేశం న క్రుద్ధో నాస్తికే స్త్రీయాః  

న చైవా స్యోత్తరం బ్రూయాత్ స్థితో నాసీత సన్నిధౌ

గురువు దోషములను చెప్పుచోట, నిందించుచోట, చెవులు మూసికొనవలెను. అవకాశమున్నచో ఆట నుండి బయటకు వెళ్ళవలెను. తాను దూరముగా ఉండి, ఇతరుల ద్వారా గురువును అర్చింపచేయరాదు. తానే స్వయముగా చేయవలెను. తాను కోపముగా నున్నపుడు పూజించరాదు. గురువు స్త్రీ సమీపమున నున్నపుడు పూజించరాదు. గురువు మాటకు ప్రతివాదము పలుకరాదు. గురు సమీపమున గుర్వాజ లేక కూర్చొనరాదు.

ఉదకుంభం కుశాస్ పుష్పం సమిధోఽ ప్యా హరే త్సదా

మార్జనం లేపనం నిత్యం అంగానాం వై సమాచరేత్  

 నాస్య నిర్మాల్యశయనం పాదుకోపానహా వపి 

ఆక్రమే దాసనం ఛాస్య ఛాయాదీ న్వా కదాచన

సాధయే ద్దంతకాష్ఠాదీన్ లబ్దం ఛాస్మై నివేదయేత్

అనాపృచ్ఛ్య న గంతవ్యం భవేత్ ప్రియహితే రతః  

శిష్యుడు ఎపుడు గురువు కొరకు జలపూర్ణ పాత్రను, దర్భలను పుష్పము సమిధలను కొనిపోవలెను. ఎపుడు గురువునకు మార్జనము, లేపనము మొదలగునవి ఆచరించవలెను. గురువు ధరించిన పుష్పమాలను, గురువు పరుండిన శయ్యను, పాదుకలను, పాదరక్షలను, గురువు ఆసనమును, నీడను దాటరాదు. గురువు కొరకు దంత కాషాదులను సంపాదించీ సమర్పించవలయును. గురువునకు ప్రియమును, హితమును కూర్చుటలో తత్పరుడై యుండవలయును. గురువునకు చెప్పకుండా వెళ్ళరాదు.

 న పాదౌ సారయే దస్య సన్నిధానే కదాచన 

జృంభితం హసితం చైవ కంఠప్రావరణం తథా

వర్జయే త్సన్నిధౌ నిత్యం అవస్ఫోటన మేవ చ

యధారాల మధీయీత యావ న్న విమనా గురుః

 ఆసీతాధో గురోః కూర్చే ఫలకే వా సమాహితః

ఆసనే శయనే యానే నైవ తిష్ఠ త్కదాచన 

ధావంత మనుధావేత గచ్ఛంత మనుగచ్ఛతి

గో శ్వోష్ట్రయానప్రాసాద ప్రస్తరేషు వటేషు చ

 ఆసీత గురుణా సార్ధం శిలాఫలకనౌషు చ

జితేంద్రియ స్స్యా త్సతతం వశ్యాత్మా క్రోధన శ్శుచిః

 ప్రయుంజీత సదా పోచం మధురాం హితభాషిణీమ్

గురువు ముందర కాళ్లుచాపి కూర్చొనరాదు. అట్లే ఆవులింత, పేద్ధనవ్వు, మెడలో సుందరమైన మాలలు మొదలగు అలంకారములు చేసికొనరాదు. పెద్దగా చప్పట్లు కొట్టరాదు. గురువు విమనస్కుడు కానంతవరకు (కానపుడు) మాత్రమే, కాల నియమము ననుసరించి, అధ్యయనము కొనసాగించవలెను. గురువు సమీపమున అధ్యయన కాలమున, నీచాసనమున కూర్చయందుగాని, ఫలకము నందుగానీ, సావధానుడై కూర్చొన వలెను. గురువు ఆసనముపై, శయ్యపై, వాహనముపై కూర్చొనరాదు. గురువు పరుగెత్తుచున్నచో, తాను వెంట పరుగెత్తవలెను. నడుచుచున్నచో నడువవలెను. ఎడ్లబండి, అశ్వము, ఒంటె, భవనము, ప్రస్తరము, చాప, శిలా ఫలకము, నావ మొదలగు పోటీ యందు గురువుతో కూర్చొన వచ్చును. ఇంద్రియ జయము కలిగి, కోపమును వశములో నుంచుకోని, శుచియై గురువు వద్ద, హితముగా మధురముగా మాట్లాడ వలయును.

 గంధమాల్యం రసం కల్యాం శుక్తం ప్రాణివిహింసనమ్

అభ్యంగం చాంజనో పాన చ్ఛత్రధారణ మేవ చ

కామం లోభం భయం నిద్రాం గీతవారిత్రనర్తనమ్

ఆతర్జనం పరీవాదం స్త్రీ ప్రేక్షాలంభనం తధా

పరోపఘాతం పైశున్యం ప్రయత్నేన వివర్జయేత్

గురువు సన్నిధిలో గంధమును, మాల్యములను, రసములను, మద్యములను ఆడంబరములను ప్రాణిహింసను, అభ్యంగమును, కాటుక ధరించుట, పాదరక్షలు ధరించుట చేయరాదు. కామ, లోభ, భయ, నిద్రలను, గీతమును, వాద్యమున, నర్తనమును, బెదిరించుట, నీంద, స్త్రీ దర్శనము, స్త్రీని స్పృశించుట, పర అపకారము,లోభిత్వము, మొదలగునవి విడువవలయును.

 ఉదకుంభం సుమనసో గోశకృ న్మృత్తికాం కుశాస్

ఆహరే ద్యావదర్భాని భైక్ష్యం చాహరహ శ్చరేత్

కృతం చ లవణం సర్వం వర్జ్యం పర్యుషితం చ యత్

అనృత్యద ర్శీ  సతతం భవే  ద్గీతాదినిస్పృహః

నా దిత్యం వై సమీక్షేత న చరే దంతధావనమ్

ఏకాంత మశుచి స్త్రీభిః శూద్రాంత్యై భిభాషణమ్

ప్రతిదినమును జలకుంభమును, పూవులను, ఆవుపేడను, మృత్తికను, దర్భలను గురువు అవసరమునకు తగినంత గొనిపోవలెను. ప్రతి దినము భిక్షాటన చేయవలయును. కృత్రిమ లవణమును, పోసన పట్టిన పదార్ధములను విడువవలయును. నృత్యమును చూడరాదు. గీతాదులయందు , ఆసక్తి కనబరచరాదు. సూర్యుని ఎదురుగా నిలవగాదు. ఏకాంత స్థితిలో అపవిత్రులైన స్త్రీలతో, శూద్రులతో, అంత్యజులతో, సంభాషించరాదు.  

గురూచ్చిష్టం భేషజార్థం ప్రయుంజీత న కామతః

మలాపకర్షణస్నానం నాచరేద్ది కదాచన

న కుర్యా న్మానసం విప్రో గురో స్త్యా గే కదాచన

మోహా ద్వా యది వా లోభాత్ త్యక్తేన పతితో భవేత్

లౌకికం వైదికం చాపి తధాధ్యాత్మిక మేవ చ

ఆదదీత యతో జ్ఞానం న తం ద్రుహ్యే తద్రాచన

గురో రష్యవలిప్తస్య కార్యాకార్య మజానతః

  ఉత్పథం ప్రతిపన్నస్య మను స్త్యాగం సమబ్రవీత్

గురో ర్గురౌ సన్నిహితే గురువ ద్భక్తి మాచరేత్

న చాతిసృష్టో గురుణా స్వా న్గురూ నభి వాదయేత్

గురూచ్చిష్ట భోజనమును లోభముతో స్వీకరించరాదు. శరీరమున మురికిని తొలగించుటకు రాగపూర్వకముగా స్నానము సొచరింపరాదు. గురువును మానసికముగా కూడా త్యజించరాదు. మోహముతోగాని, లోభముతోగాని, గురువును పరిత్యజించి పతితుడగును. గర్విష్టి మహాపాతక యుక్తుడు, కార్యాకార్యములను తెలియనివాడు, చెడుదారిలో నడుచు వాడగు గురువును త్యజించవచ్చునని మనువు చెప్పెను. గురువు యొక్క గురువు సమీపమున గురువిషయమునవలే భక్తిని వినయమును చూపవలెను. గురువు యింటిలో, గురువు సమీపమున, గురువు నాజ్ఞలేక, తన గురుజనులను (తల్లిదండ్రులను మొదలగువారిని) నమస్కరించరాదు.  

విద్యాగురు ష్వేత దేవ నిత్యావృత్తి స్వయోనిషు 

ప్రతిషేధత్సు చాధర్మాఛితం చో పదిశత్స్వపి

శ్రేయస్సు గురువ దృత్తిం నిత్యమేవ సమాచరేత్

 గురుపుత్రేషు దారేషు గురో శ్చైవ స్వబంధుషు

విద్యా గురువులయందు, తల్లిదండ్రులయందు, అధర్మమును నిషేధించువారి యందు, హితము నుపదేశించువారి యందు, శ్రేయస్సును బోధించువారియందు గురువు యందువలే వ్యవహరించవలెను. గురుపుత్రులయందు, గురుపత్నియందు గురు బంధువులయందు, గురువు యందువలె వ్యవహరించవలెను.

 బాల స్సమానజన్మా హా శిష్యో వా యజ్ఞకర్మణి

 అధ్యాపయన్ గురుసుతో గురువ న్మాన మర్హతి

  ఉత్సాదనం వై గోత్రాణాం స్నాపనోచ్ఛిష్టభోజనే 

న కుర్యా ద్గురు పుత్రస్య పాదయో శ్శేచమేవ చ

గురువ త్పరిపూజ్యా స్తు సవర్ణా గురుయోషితః

అసవర్ణా స్తు సంపూజ్యా ప్రత్యుతాబ్ధనాభివాదనైః

  తనకంటే చిన్నవాడు, సమానవయస్కుడు, యజ్ఞకర్మలో శిష్యుడుగా నున్నపోడు కూడా, అధ్యాపనము చేయుచో, గురువు వలెనే గౌరవము పొందదగును. కాని గురుపుత్రుని పాదప్రక్షాళన చేయరాదు. గురుపుత్రుని ఉచ్చిష్టమును భుజించరాదు. సవర్ణురాలగు గురుపత్ని గురువువలెనే గౌరవనీయురాలు. అసవర్ణులైనచో ప్రత్యుత్థాన అభివాదనొదులతో మాత్రమే పూజించవలయును.

 అభ్యంజనం స్నాపనం చ గోత్రోత్సాదన మేవ చ

గురుపత్యా న కార్యాణి కేశానాం చ ప్రసాధనమ్

గురుపత్నీ తు యువతీ నాభివాద్యే హ పాదయోః

కుర్వీత వందనం భూమ్యా మసా వహ మీతి బ్రువన్

విప్రోష్య పాదగ్రహణం అన్వహం చాభివాదనమ్

  గురుదారేషు కుర్వీత సతాం ధర్మ మనుస్మరన్

మాతృష్వసా మాతులానీ శ్వశ్రూ శ్చాథ పితృష్వసా

 సంపూజ్యా గురుపత్నీవ సమా స్తా గురుభార్యయా

భ్రాతు ర్భార్యోపసంగ్రాహ్యా సావర్ణా హన్యపాన్య పి

 విప్రోష్య తూపసంగ్రాహ్యా జ్ఞాతసంబంధియోషితః

గురుపత్నికి అభ్యంజనము, స్నానము చేయుటను, శరీర సంవాహనము, కేశాలంకరణము, చేయరాదు. గురుపత్నీ యువతి యగుచో, పాదములు స్పృశించి నమస్కరింపరాదు. అసావహం' అనీ భూమిపై నమస్కరించవలెను. శిష్యుడు గ్రామాంతరము, దేశాంతరము వెళ్లివచ్చినపుడు శిష్టాచారమును స్మరించుచు, గురుపత్ని యువతీ అయినను పాదగ్రహణ పూర్వకముగా అభివాదము చేయవచ్చును, పినతల్లి, మేనమామ భార్య, అత్తగారు, మేనత్త వీరందరు గురుపత్నులతో సమానము కావున, గురుపత్నీ విషయమున వలెనే పూజించవలెను. సవర్ణురాలైన భాతృభార్య కూడా గౌరవించ తగినది. ప్రతిదినమును తప్పక అభివాదము చేయవలయును. ప్రవాసము నుండి తిరిగివచ్చినపుడు జ్ఞాతి స్త్రీలు, సంబంధిత స్త్రీలకు కూడా అభిపోదము చేయవలెను.

పితు ర్భగిన్యాం మాతుశ్చ జ్యాయస్యాం చ స్వస ర్యపి

 మాతృవ ద్వృత్తి మాతిక్షేత్ మాతా తాభ్యో గరీయసీ

ఏవ మాచారసంపన్న మాత్మవంత మదాంఖీకమ్ 

వేద మధ్యాపయే ధర్మం పురాణాంగానీ నిత్యశః

మేనత్త విషయమున, పినతల్లి, పెదతల్లి విషయమున, తన సోదరి విషయమున, తల్లియందువలే ప్రవర్తించవలెను. తల్లి వీరికంటే శ్రేష్టు రాలగును. ఇట్టి ఆచారముతో కూడి మనోనిగ్రహము గలిగి, దంభమును విడచిన శిష్యునికి వేదమును, ధర్మములను, వేదాంగములను, పురాణములను, అధ్యాపనము చేయవలెను.  

సoవత్సర్దోషితే శిష్యే గురు జ్ఞాన మనిర్దిశన్

  హరతే దుష్కృతం తస్య శిష్యస్య వసతో గురుః

ఆచార్యపుత్ర శుశ్రూషుర జ్ఞానదో ధార్మిక శ్శుచిః

శక్తోఽన్న దోఽర్థీ స్వః సాధు రధాప్యా దశ ధర్మతః

కృతజ్ఞశ్చ తధా ద్రోహీ మేధావీ శుభకృంతనః

ఆప్తః ప్రియోధ విధివత్ షడ ధ్యాష్యా ద్విజాతయః

ఏతేషు బ్రాహ్మణో దాన మన్యత్ర తు యధోదితాన్

ఒక సంవత్సరకాలము గురువు వద్దనుండి, సేవచేసిన శిష్యునికి, గురువు జ్ఞానమును బోధించనిచో, ఆ శిష్యుని దుష్కృతము గురువునకు చేరును. ఆచార్యపుత్రుడు, సేవించువాడు, ఒక విద్యనిచ్చి మరొక విద్య తీసికొనువాడు, ధార్మికుడు, పవిత్రుడు, సమర్థుడు, గురువుకు కావలసినంత అన్నము నిచ్చువాడు, ధనము నిచ్చువాడు, సచ్చీలము గలవాడు, తనవాడు, ఈ పదిమంది అధ్యాపనమునకు యోగ్యులు (చదివించ తగినపోరు), కృతజ్ఞుడు, ద్రోహము చేయనివాడు, మేధావి, శుభకరుడు, ఆప్తుడు, ప్రీయమును ఆచరించువాడు, ఈ ఆరురు ద్విజులు, యధావిధిగా అధ్యాపనకు యోగ్యులు. వీరిలో బ్రాహ్మణునికీ బ్రహ్మజ్ఞానము, వేదజ్ఞానమును ఈయవలెను. ఇతరులకు మాత్రము, వీధి సనుసరించి విద్యా ప్రదానము చేయవలేను.

  ఆచమ్య సంయతో నిత్యం అధీత ఉదజ్ముఖః 

ఉపసంగృహ్య తత్పాదౌ వీక్షమాణో గురో ర్ముఖమ్

అధీష్వ భో ఇతి బ్రూయాత్ విరామో స్త్వితి చారమేత్

ఆచమనము చేసి నియతమనస్కుడై, ఉత్తరాభిముఖుడై, అధ్యయనము గావించవలెను. గురుపాదములకు ప్రణామముచేసి, గురు ముఖమును చూచుచు, అధ్యయనము చేయవలెను. చదువుము అని గురువు చెప్పినపుడు అధ్యయనము ప్రారంభించవలెను, ఇక చాలునుఅని చెప్పినపుడు అధ్యయనము నిలిపి వేయవలెను.

 ప్రాఙ్ములాన్ పర్యుపాసీనః పవిత్రై శ్చైవ సావితః

 ప్రాణాయామై స్తిభిః పూతః తత ఓంకార మర్హతి

బ్రాహ్మణః ప్రణవం కుర్యాత్ అంతే చ విధివ ద్ద్విజః

కుర్యా దధ్యయనం నిత్యం సబ్రహ్మాంజలీ పూర్వతః

సర్వేషా మేవ భూతానాం వేద శ్చక్షు సనాతనమ్ 

అధీయిజాప్యయం నీత్యం బ్రాహ్మణ్యా చ్యవతేఽ న్యధా

ప్రాగగ్రములగు దర్భలయందు కూర్చొని, రెండు చేతులలో దర్భలను పట్టుకోని పవిత్రుడై మూడు ప్రాణాయామములు చేసి శుచియైన తరువాత ప్రణమోచ్చారణకు యోగ్యుడు. బ్రాహ్మణుడు, ద్వీజుడు, ఆధ్యయన ప్రారంభమునందు, అంతమునందు ప్రణమోచ్చారణ చేయవలయును. బ్రహ్మాంజలి పూర్వకముగా (చేతులు జోడించి) వేదమును అధ్యయనము చేయవలయును. అన్ని ప్రాణులకు వేదమే సనాతన చక్షువు. ఈ వేదమును ప్రతినిత్యము అధ్యయనము గావించవలయును. అట్లు చేయనివాడు బ్రాహ్మణ్యము నుండి భ్రష్టుడగును.

 యోధ్యీత ఋచో నిత్యం క్షీరాహుశ్యా స దేవతాః

ప్రీణాతి తర్పయం త్యేనం కామై స్తృప్తా స్సదైవ హి

యజంష్య ధీతే నియతం దధ్నా ప్రీణాతి దేవతాః

  సామాన్యధీతే ప్రీణాతి ఘృతాహుతిభి రన్వహమ్

అధర్వాంగిరసో నిత్యం మధ్వా ప్రీణాతి దేవతాః

 ధర్మాంగాని పురాణానీ మాంసై స్పత్తర్పయేత్ సురాన్

నీత్యము ఋగ్వేదము అధ్యయనము చేయువానికి క్షీరములతో దేవతలను తృప్తిపరచువానికి, ఆ దేవతలు అభీష్ట ప్రదానముతో తృప్తి కలిగింతురు. యజుర్వేదము అధ్యయనము చేయుచు, దేవతలను పెరుగుతో తృప్తి పరచవలయును. సామ వేదాధ్యయనమున, నేతితో తృప్తి పరచవలెను. అధర్వణాధ్యయనమున తేనెతో తృప్తి పరచవలేను. ధర్మశాస్త్రములను, వేదాంగములను, పురాణములను, అధ్యయనము చేయునపుడు, మాంసాదులతో తర్పణము చేయవలయును.  

అపాం సమీపే నియతో నైత్యకం విధి మాశ్రితః

గాయత్రీ మప్యధేయిత గత్వారణ్యం సమాహితః

సహస్రపరమాం దేవీం శతమధ్యాం దశావరామ్ 

గాయత్రీం వై జపేన్నిత్యం జపయజ్ఞః ప్రకీర్తితః

గాయత్రీం చైవ వేదాంశ్చ తులయా తోలయ త్ర్పభుః 

ఏకతశ్చతురోవేజూస్ గాయత్రీం చ తథైకతః

అరణ్యమునకు వెళ్లి, జలసమీపమును చేరి, నిత్య కర్మ విధిని అనుసరించి, గాయత్రీ జపము చేయవలయును. ఈ గాయత్రీ జపమును వేయిమారులు చేయుట ఉత్తమము. నూరు మధ్యమము, పదీ అధమము. ఆది గాయత్రీ జపముగా పేర్కొనబడినది. గాయత్రీ మంత్రమును, నాలుగు వేదములను త్రోసులో తూచినచో, ఒకవైపు నాల్గువేదములు, మరొకవంక గాయత్రి నిలుచును.

ఓంకార మాదితః కృత్వా వ్యాహృతీ స్తదనన్దరమ్ 

తతో ధీయీత సావిత్రీం ఏకాగ్ర శ్రద్ధయాన్వితః

పురాకల్పే సముత్పన్న భూ ర్భువః స్వ సనాతనాః

మహావ్యాహృతయ స్త్రీసః సర్వాశుభనిబర్హణాః

మొదట ఓంకారమును, తరువాత వ్యాహృతులను, తరువాత సావిత్రీ మంత్రమును ఏకాగ్ర మనస్కుడై శ్రద్దతో జపించవలెను, పూర్వ కల్పమున సర్వ అమంగళములు నశింపచేయు మహా వ్యాహృతులు 'భూః', 'భువః', 'సువః' అనునవి ఆవిర్భవించినవి.

ప్రధానం పురుషః కాలో విష్ణు బ్రహ్మా మహేశ్వరః

 సత్త్వం గజ సమ స్రః క్రమా ద్వ్యాహృతయః స్మృతాః

ఓంకార సత్సరం బ్రహ్మ సావిత్రీ స్యా త్తదన్తరమ్

ఏష మంత్రో మహాయోగః సారా త్సార ఉదాహృతః

యోధీతే హస్య న్యేతాం గాయత్రీం వేదమాతరమ్

విజ్ఞాయార్థం బ్రహ్మచారీ స యాతీ పరమాం గతిమ్

ప్రకృతి, పురుషుడు, కాలము', 'విష్ణువు, బ్రహ్మ మహేశ్వరుడు', 'సత్త్వము, రజస్సు, తమస్సు' ఇవి మూడు వ్యాహృతులు. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. సావిత్రీ నశించని పరతత్వము, ఈ మంత్రము మహాయోగము, సకల సారములకు సారము. ప్రతిదినము వేదమాతయగు గాయత్రీని జపించువాడు, అర్థమును తెలియుపోడు, ఉత్తమగతిని పొందును.

 గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ

  న గాయత్ర్యాః పరం జప్యం ఏత ద్విఙ్ఞాయ ముచ్యతే

గాయత్రి వేదమాత. గాయత్రి లోకపావని. గాయత్రీకంటే జపించతగినది వేరు ఒకటి లేదు. ఇది తెలిసి ముక్తుడగును.

శ్రావణస్య తు మాసస్య పొర్ణమాస్యాం ద్విజోత్తమాః

  ఆషాఢ్యాం ప్రోష్ఠపద్యాం వా వేదోపాకరణం స్మృతమ్

ఉత్సృజ్య గ్రామనగరం మాసా న్విప్రో ర్థపంచమాన్

అధీయీత శుచౌ దేశే బ్రహ్మచారీ సమాహితః

పుష్యేతు ఛందసాం కుర్యాత్ బహి రుత్సర్జనం ద్విజః 

మాఘశుక్లస్య వా ప్రాప్తి పూర్వాహ్ణే ప్రధమే హని

ఛందాం స్యూర్ధ్వ మధో భ్యస్యే చ్ఛుక్లపక్షేషు వైఽ ద్విజః

వేదాంగానీ పురాణాని కృష్ణపక్షే చ మానవమ్

శ్రావణ పూర్ణిమనాడుగాని, ఆషాఢ పూర్ణిమనాడుగాని, భాద్రపద పూర్ణిమనాడుగాని ఉపాకర్మ ఆచరించవలెను. అనగా సంస్కార పూర్వకముగల వేదగ్రహణము చేయవలెను. గ్రామమును, నగరమును విడచి బ్రహ్మచారి అయిదున్నర నెలలు పవిత్ర ప్రదేశమున సావధానచిత్తుడై వేదాధ్యయనము చేయవలయును. పుష్యమాసమున విడువవలెను. అట్లే మాఘ శుక్ల ప్రతిపత్తునాడుగానీ, గ్రామము వెలుపల వేదోత్సర్జన గావించవలెను. అప్పటి నుండి శుక్ల పక్షమున వేదములను, కృష్ణపక్షమున వేదాంగములను, పురాణములను సృతులను అధ్యయనము చేయవలెను.  

ఇమా న్నిత్య మనధ్యాయా నధీయానో వివర్జయేత్

 అధ్యాపనం చ కుర్వాణో హ్యాభ్యస్య న్నపి యత్నతః

కర్ణశ్రవ్యే నిలే రాత్రా దీవా పాంశుసమూహానే

విద్యుత్స్తనితవరేషు మహోల్కానాం చ సంప్లవే

ఆకలిక మనధ్యాయ మేతేష్వాహ ప్రజాపతిః

ఏతా నభ్యుదితాన్ విద్యుత్ యదా ప్రాదుష్కృతాగ్నీషు

  తదా విద్యా దనధ్యాయ మనృతా చాభ్ర దర్శనే

  నిర్ఘాతే భూమిచలనే జ్యోతిషాం చోపసర్జనే

ఏతా నాకాలికాన్ విద్యాత్ అనధ్యాయా నృతా వపి

 ప్రాదుష్కృతే ష్వగ్నిషు తు విద్యుత్స్వనితనిస్వనే

సజ్యోతి స్స్యా ధనధ్యాయః శేషరాత్రౌ యధా దివా

వేదాధ్యయనము చేయువారు, వేదమును అభ్యసించుచూ అధ్యాపనము చేయువారు ఈ అనధ్యయనములను తప్పక పాటించవలెను, రాత్రులందు చెవులకు వినిపించు ధ్వని కలిగిన వాయువు వీచునపుడు, పగలు దుమ్ములేచి వేడివేడిగా గాలి వీచునపుడు, మెరుపులతో, ఉరుములతో వర్షించినపుడు, పిడుగులు పడుచున్నపుడు, ఇవి ఆకాళిక అనధ్యయనములుగా తెలియవలయును. అనగా నిమిత్తములు ప్రారంభమైనప్పటి నుండి మరునాడు సూర్యోదయము వరకు అనీ తెలియవలెను. పైన చెప్పబడిన ఈ నిమిత్తములు సంభవించినపుడు, వర్ష ఋతువుకంటే భిన్న ఋతువులలో మేఘములను చూచినప్పుడు, అనధ్యయనముగా తెలియవలెను. పిడుగుపాటు, భూకంపము, సూర్యచంద్రగ్రహణములు ఇవి కూడా ఆకాలిక అనధ్యయనములు. అగ్ని జ్వాలలు కనబడినపుడు, ఉరుములతో కూడిన మెరుపులు కలిగినపుడు, వెలుతురున్నను, రాత్రి కూడా అనధ్యయనముగానే పాటించవలయును.  

నిత్యానధ్యాయ ఏవ స్యాత్ గ్రామేషు నగరేషు చ

ధర్మనైపుణ్యకామానాం పూతీగంధే చ నిత్యశః

అంతశ్శవగతే గ్రామే వృషబస్య చ సంనిధౌ 

అనధ్యాయో రుద్యమానే సమవాయే జనస్య చ

ఉదకే మధ్యరాత్రే చ విఘ్మాత్రే చ విసర్జనే

  ఉచ్ఛిష్ట శ్రాద్దభుక్చైవ మనసా పి న చింతయేత్

ప్రతిగృహ్య ద్విజో విద్వా నేకోద్దిష్టస్య కేతనమ్

త్ర్యహం న కీర్తయేత్ బ్రహ్మ రాజ్జో రాహోశ్చ సూతకే 

యావదేకోను దిష్టస్య స్నేహో గంధశ్చ విద్యతే

ధర్మము నైపుణ్యమును కోరువారికి, గ్రామములోను, నగరములోను, దుర్గంధ సహిత స్థానమున నిత్య అనధ్యయనమే యగును. గ్రామమున శవమున్నపుడు, శూద్రుల సన్నిధిలో, అధర్మ జనుల సమీపమున, జన సమూహము ఏడ్చుచున్నపుడు అనధ్యాయమగును. జల మధ్యమున, అర్థరాత్రి, మలమూత్రవిసర్జనవేళ, ఉచ్చిష్ణావస్థలో, శ్రాద్ధ భోజనమున, మనసులో గూడా అధ్యయనము చేయరాదు. ఏకోద్దిష్ట నియంత్రణ స్వీకరించినపాడు, రాజునకు పుత్రుడు కలిగిన , రాహుగ్రస్త ఉప రాగమున, మూడు దినములు అధ్యయనము చేయరాదు. బ్రాహ్మణుని శరీరమున ఏకోదిష్ట శ్రాద్ధమునకు సంబంధించిన నేతీవాసన ఉన్నంతవరకు, బ్రాహ్మణుడు వేదములను చదువరాదు.  

శయానః ప్రౌడపాద శ్చ కృత్వా చైవావసక్థికామ్

నాధీయో తామిషం జగ్ధ్వా సూతకన్నాద్య మేవ చ

నీహారే బాణశబ్దే చ సంధ్యయో రుభయోరపి

అమావాస్యాం చతుర్దశ్యం పౌర్ణమస్య ష్టమీషు చ

ఉపాకర్మణి చోత్సర్గో త్రిరాత్రం క్షపణం స్మృతమ్

అష్టకాసు త్వహోరాత్రం ఋత్వన్యాసు చ త్రిషు

 మార్గశీర్షే తధా పౌషే మాఘమాసే తథైవ చ 

తిస్రోష్ట కాస్సమాఖ్యాతాః కృష్ణపక్షేతు సూరిభిః

శ్లేష్మాతకస్య ఛాయాయాం శాల్మికే ర్మధుకస్య చ

 కదాచిదపి సాధ్యాయ కోవిదారకపి త్థయోః

పడుకొని కానీ, ఆసనముపై పాదములుంచిగాని, అవసక్లిక ఏర్పరచుకొనినను (రెండు మోకాళ్ళను వస్త్రముతో బంధించికొన్నను)గాని, మాంసము భుజించిగానీ, సూతకాన్నము భుజించీకాని వేదాధ్యయనము చేయరాదు.మంచు పడుచున్నపుడు, బాణ శబ్దము వినిపించినపుడు, ఉభయ సంధ్యలలో, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్యలలో, ఉపాకర్మలో ఉత్సర్గములో, మూడు దినములు వేదాధ్యయనము చేయరాదు. అష్టకములలో, అహెరాత్రములు, ఋతు అంతరాత్రములలో, అనధ్యయనమగును. మార్గశీర్ష పుష్య మాఘ మాసములలో కృష్ణ పక్షమున ఈ మూడు అష్టకములుగా పండితులు చెప్పిరి. (మార్గశీర్ష కృష్ణ సప్తమి అష్టమి నవములు, పుష్య కృష్ణ సప్తమి అష్టమి నవములు, మాఘకృష్ణ సప్తమి అష్టమీ నవములు అష్టకములందురు) బూరుగ, అవిసె, దానిమ్మ, వెలగ, కోవిదార వృక్షముల నీడలలో వేదాధ్యయనము చేయరాదు.

సమానవిద్యే చ మృతే తథా సబ్రహ్మచారిణి

ఆచార్యే సంస్థితే వాపి త్రిరాత్రం క్షషణం స్మృతమ్

ఛిద్రా ణ్యేతాని విప్రాణాం యేఽనధ్యాయాః ప్రకీర్తితాః

హింసంతి రాక్షసా స్తేషు తస్మా దేతా న్వీవర్జయేత్

తనతో సమానముగా చదువువాడు, సహాధ్యాయి మరణించినపుడు, ఆచార్యుడు తమ యింటికి వచ్చినపుడు, మూడు దినములు అనధ్యయనము. ఇవి బ్రాహ్మణ ఛిద్రములుగా పేర్కొనబడినవి. ఈ దినములలో రాక్షసులు హింసించు చుందురు. కావున వీటిని పరిత్యజించ వలయును.

నైత్యికే నాస్త్యనధ్యాయః సంధ్యోపాసన ఏవ చ

ఉపాకర్మణి కర్మాంతే హోమమంత్రేషు చైవహి

ఏకా మృచ మ ధైకం వా యజుస్సామాధవా పునః

అష్టకాద్యా స్వధీయీత మారుతే చాతివాయతి

అనధ్యాయస్తు నాంగేషు నేతిహాసపురాణయోః

న ధర్మశాస్త్రే ష్వన్యేషు పర్వణ్యేతాని వర్జయేత్

ఏష ధర్మ స్సమాసేన కీర్తితో బ్రహ్మచారిణామ్

బ్రహ్మణాభిహితః పూర్వం ఋషీణాం భావితాత్మనామ్

నిత్యకర్మ విషయమున, సంధ్యోపాసనలో, ఉపాకర్మలో, కర్మ అంత్యమున, హెూమ మంత్రములలో అనధ్యాయముండదు. అష్టకములలో, ఝంఝా మారుతములో, ఒక్క ఋక్కును, ఒక్క యజుర్మంత్రమును, ఓక్క సామమంత్రమును మాత్రమే అధ్యయనము చేయనలెను. వేదాంగములకు, ఇతిహాస పురాణములకు, ధర్మ శాస్త్రములకు అనధ్యాయము లేదు. కాని పర్వదినములలో దీనిని అధ్యయనము చేయరాదు. ఇట్లు పవిత్రులైన ఋషులకు బ్రహ్మచేత చెప్పబడిన బ్రహ్మచారి ధర్మములను సంగ్రహముగా వివరించితిమీ.

యోఽన్యత్ర కురుతే యత్నం అనధీత్య శ్రుతిం ద్విజాః

స సమ్మూఢో న సంభాష్యో వేదబాహ్యో ద్విజాతిభిః

న వేదపాఠమాత్రేణ సంతుష్టో వై భవే ద్ద్విజః

పాఠమాత్రావసన్నస్తు పంకే గౌ రవ సీదతి

యోఽధీత్య విధివ ద్వేదం వేదార్ధం న విచారయేత్

స సాన్వయ శ్శూద్రకల్పః పాత్రతాం న ప్రపద్యతే

వేదాధ్యయనము చేయకయే, ఇతర శాస్త్రాధ్యయనమునకు ప్రయత్నించినవాడు మూర్ఖుడు. అతడే వేదబాహ్యుడు. ద్వీజుడతనితో మాట్లాడ రాదు. అట్లే వేద పాఠముతో మాత్రమే సంతుష్టి చందరాదు. పాఠమాత్రముతో విరమించినవాడు బురదలో చిక్కిన గోవువలె కష్టపడును. యథా విధిగ వేదాధ్యయనము చేసి, వేదార్థ పర్యాలోచన చేయనిచో, అతని వంశమంతయు శూద్ర సమమగును. అతడపాత్రుడగును.

యది త్వాత్యంతికం వాసం కర్తు మిచ్ఛతి పై గురౌ

యుక్తః పరిచరే దేన మాశరీరవిమోక్షణాత్

గత్వా వనం వా విధివ జ్జుహుయా జ్జాతవేదసమ్

అధీయీత సదా నిత్యం బ్రహ్మనిష్ఠ స్సమాహితః

సావిత్రీం శతరుద్రీయం వేదాంతం శ్చ విశేషతః

అభ్యసేత్ సతతం యుక్తో భస్మస్నానపరాయణః

జీవన పర్యంతము గురువు వద్దనే నివసించదలచినచో, శరీరావసానము వరకు సొవధానముగా గురు శుశ్రూష చేయుచుండవలెను, గురువు, గురుపత్ని, గురుజ్ఞాతి బంధువులు లేనిచో, అరణ్యమునకు వెళ్లి విధిపూర్వకముగా, అగ్నిని ఉపాసించవలయును. స్నానము చేసి, భస్మాడులను ధరించి, గాయత్రీ మంత్రమును, శతరుద్రీయమును, వేదాంత శాస్త్రములను ఎపుడు అభ్యసించు చుండవలయును.

ఏత ద్విధానం పరమం పురాణం వేదాగమే సమ్య గిహేరితం వః

పురా మహర్షి ప్రవరాభిపృష్టః స్వాయంభువో యన్మనురాహదేవః

ఏవ మీశ్వరసమర్పితా న్తరో యోఽనుతిష్ఠతి విధిం విధానవిత్

మోహజాల మపహాయ సోఽమృతో యాతి త త్పద మనామయం శివమ్

ఇతి శ్రీ కూర్మపురాణే షట్సహస్రసంహితాయాం ఉత్తరార్థే చతుర్దశోధ్యాయః

పూర్వకాలమున మహర్షివర్యులు అడుగగా స్వాయంభువ మనువు చెప్పిన వేద జ్ఞాన ప్రాప్తి విధానమును మీకు నేను చెప్పితిని. విధానమును తెలిసి, ఈశ్వరుని యందు మనసును లగ్నముచేసి విధిని ఆచరించినవాడు, సంసార మోహజాలమును తొలగించుకొని అమృతుడై పరమ పదమును పొందును.

ఇది శ్రీ కూర్మ పురాణమును షట్ సాహస్ర సంహితలో ఉపరీ విభాగమున పదునాల్గవ అధ్యాయము