కూర్మ మహా పురాణము
29వ అధ్యాయము
వ్యాస ఉవాచ:
ఏవం స్వాశ్రమనిష్ఠానాం యతీనాం నియతాత్మనామ్ ।
భైక్ష్యేణ వర్తనం ప్రోక్తం ఫలమూలై రథాపి వా ॥
ఏకకాలం చరే ద్భైక్ష్యం న ప్రసజ్యేత విస్తరే ।
భైక్ష్యప్రసక్తో హి యతీ ర్విషయే ష్వపి సజ్జతే ॥
సప్తాగారాం శ్చరే ద్భైక్ష్య మలాభే తు పునశ్చరేత్ ।
ప్రక్షాళ్య పాత్రే భుంజీత అద్భిః ప్రక్షాళయే త్పునః ॥
అథవాఽన్య దుపాదాయ పాత్రే భుంజీత నిత్యశః ।
భుక్త్వా తత్సంమృజే త్పాత్రం యాత్రామాత్ర మలోలుపః ॥
విధూమే సన్నముసలే వ్యంగారే భుక్తవజ్జనే ।
వృత్తే శరావసంపాతే భిక్షాం నిత్యం యతి శ్చరేత్ ॥
గోదోహమాత్రం తిష్ఠేత కాలం భిక్షు రథోముఖః ।
భిక్షే త్యుక్త్వా స కృత్తూష్టి మశ్నీయా ద్వాగతః శుచిః ॥
ప్రక్షాళ్య పాణీ పాదౌ చ సమాచమ్య యథావిధి ।
ఆదిత్య దర్శయిత్వాన్నం భుంజీత ప్రొజ్ముఖః శుచిః ॥
హుత్వ ప్రాణాహుతీః పంచ గ్రాసా నష్టౌ సమాహితః ।
ఆచమ్య దేవం బ్రహ్మాణం ధ్యాయీత పరమేశ్వరమ్ ॥
అలాబుం దారుపాత్రం చ మృణ్మయం వైష్ణవం తతః ।
చత్వార్యేతాని పాత్రాణి మను రాహ ప్రజాపతిః ॥
ప్రాగ్రాత్రేఽపరరాత్రే చ మధ్యరాత్రే తథైవ చ ।
సంధ్యాస్వగ్నివిశేషేణ చింతయే న్నిత్య మీశ్వరమ్ ॥
వ్యాస మహర్షి చెప్పెను.
ఇట్లు సన్యాసాశ్రమములో నుండు పోరికీ భిక్షాటనముతోకాని ఫలమూలాదులతో కాని జీవనము విధించబడినది. ఒకేసారి భిక్షాటన గావించ వలయును. భిక్ష యందే ఆసక్తిని చూపరాదు. విస్తారము కూడా చేయరాదు. భిక్షయందు ఆసక్తి కలిగినచో విషయాసక్తి కూడా కలుగును. ఏడు ఇండ్లకే భిక్షకు వెళ్ళవలయును. ఆ ఇండ్లలో లభించనపుడు మరల వెళ్ళవలయును. పాత్రను నీటిలో కడిగి భుజించవలయును. లేదా ప్రతిదినము వేరొక పాత్రతో భిక్షాటన గావించి భుజించవలయును. బ్రతుకుటకు కావలసినంత మాత్రము తినుచు లోభమును విడిచి ఆ పాత్రను విసర్జించవలయును.
గృహస్థుల ఇండ్లలో పొగ రాకుండా ఉన్నపుడు, రోకలిచప్పుడు ఆగిన తరువాత, వంట నిప్పును చల్లార్చిన తరువాత, ఇంటివారు భుజించిన తరువాత, విస్తళ్ళు బయట పడిన తరువాత యతి భిక్షకు వెళ్ళ వలయును. ఇంటి ముందు ఆవుపాలు పితుకునంతసేపు మాత్రమే భిక్ష అని మాత్రము పలికి నిలువవలయును. పవిత్రుడై మౌనముగా భుజించవలయును. కాళ్ళు చేతులను కడుగుకోనీ ఆచమనము గావించి అన్నమును సూర్యునికి చూపి భుజించవలయును. తూర్పుముఖముగా భుజించవలయును. పంచప్రాణా హుతులను గావించు కొని ఎనిమిది ముద్దలను తినవలయును. ఆచమనము చేసి పరమేశ్వరుని ధ్యానించవలయును. అలాబుపాత్ర దాగుపాత్ర మృణ్మయము వేణుపాత్ర. ఈ సోలుగే యతికి పనికి వచ్చు పాత్రలు, సాయంకాలమున తెల్లవారు ఝామున మధ్యరాత్రి రెండు సంధ్యలలో విశేషించి పరమాత్మను ధ్యానించ వలయును.
కృత్వా హృత్పద్మనిలయే విశ్వాఖ్యం విశ్వసంభవమ్ ।
ఆత్మానం సర్వభూతానాం పరస్తా త్తమసః స్థితమ్ ॥
సర్వస్యాధారభూతన్త మానందం జ్యోతి రవ్యయమ్ ।
ప్రధాన పురుషాతీత మాకాశకుహరం శివమ్ ॥
తదంతః సర్వభావానా మీశ్వరం బ్రహ్మరూపిణమ్ ।
ధ్యాయే దనాదిమధ్యాంత మానందాదిగుణాలయమ్ ॥
మహాంతం పురుషం బ్రహ్మ బ్రహ్మాణం సత్య మవ్యయమ్ ।
తరుణాదిత్యసంకాశం మహేశం విశ్వరూపిణమ్ ॥
ఓంకారేణాథ చాత్మానం సంస్థాప్య పరమాత్మని ।
ఆకాశ దేవ మీశానం ధ్యాయీతోకుశమధ్యగమ్ ॥
కారణం సర్వభావానా మానందైక సమాశ్రయమ్ ।
పురాణం పురుషం శుభ్రం ధ్యాయ న్ముచేత బంధనాత్ ॥
యద్వా గుహాయాం ప్రకృతం జగత్సంమోహనాలయే ।
విచింత్య పరమం వ్యోమ సర్వభూతైకకారణమ్ ॥
జీవనం సర్వభూతానాం యత్ర లోకః ప్రతీయతే ।
ఆనందం బ్రహ్మణః సూక్ష్మం యత్పశ్యన్తి ముముక్షవః ॥
తన్మధ్యే నిహితం బ్రహ్మ కేవలం జ్ఞానలక్షణమ్ ।
అనంతం సత్య మీశానం వీచింత్యాసీత సంయతః ॥
గుహ్యా ద్గుహ్యతమం జ్ఞానం యతీనా మేత దీరితమ్ ।
యోఽనుతిష్ఠే న్మహేశేన సోఽశ్నుతే యోగ మైశ్వరమ్ ॥
తమస్సునకు ఆవలనున్న వానిని, సర్వ భూతాంతర్యామిని, సకలజగత్కారణ భూతుని, సకల ప్రపంచ స్వరూపుని, పరమాత్మను సర్వ జగత్తునకాధార భూతుని, సకలాధారములకు ఆనందము నిచ్చువానిని, అవ్యయ జ్యోతీ స్వరూపుని, ప్రకృతి జీవులకు అతీతుని, అగ్నిరూపుని మంగళకరుని, అన్ని భావములలో నుండు వానీని, అందరినీ శాసించు వానిని, బ్రహ్మ స్వరూపునీ, ఆద్యంత రహితుని, రెండవది లేనివానిని, ఆనందాది గుణ నిలయుని హృత్పద్మమున నిలిపీ ధ్యానించవలయును. అన్నిటికంటే గొప్పపోడు, సర్వోత్కృష్ణుడు, బ్రహ్మరూపుడు పరమ పురుషుడు సోశరహితుడు కృష్ణ అరుణ వర్ణాకారుడు మహేశుడు విశ్వరూపీ ఓంకారోపాసన తరువాత ఆత్మను పరమాత్మలో నిలిపి ఆకాశ మధ్యలో నుండు వానిని, ఆకాశమున ఈశ్వరుని క్రీడాలోలుని ధ్యానించవలయును. సకల భావములకు కారణభూతుడు ఆనందమునకు మాత్రమే ఆధారభూతుడు పురాణ పురుషుడగు శంభుని ధ్యానించి సంసార బంధము నుండి విడివడును.
లేదా జగత్సంమోహనాలయమగు ప్రకృతిలో సర్వభూతములకు ఏక కారణ భూతుడగు పరమాకాశరూపుని చింతించవలయును. సకల లోకములకు ప్రాణ భూతుని, సకల లోకములను తనలో లయము చేసుకొనువానీ, ఆనందరూపుని బ్రహ్మయొక్క సూక్ష్మరూపుని ముముక్షువులు మాత్రమే దర్శించగల వానిని, హృదయ మధ్యమున ఉన్నవానిని కేవల జ్ఞాన స్వరూపుని అంతరహితుని సత్యరూపునీ సకల జగదీశుని చింతించుచు నియమముతో కూర్చొనవలయును. సర్వ రహస్యములకు రహస్యముగా ఈ జ్ఞానము చెప్పబడినది. మహేశుడు చెప్పిన దీనిని అనుష్ఠించువాడు ఈశ్వరయోగమును అనుభవించగలడు.
తస్మా ద్ధ్యానరతో నిత్య మాతృవిద్యాపరాయణః ।
జ్ఞానం సమాశ్రయే ద్బ్రహ్మ యేన ముచ్యేత బంధనాత్ ॥
గత్వా పృథక్ స్వమాత్మానం సర్వస్మా దేవ కేవలమ్ ।
ఆనంద మజరం జ్ఞానం ధ్యాయీత చ పునః పరమ్ ॥
యస్మా ద్భవన్తి భూతాని యద్భూత్వా నేహ జోయతే ।
స తస్మా దీశ్వరో దేవః పరస్మా ద్యోఽధి తిష్ఠతి ॥
యదంతరే తద్గమనం శాశ్వతం శివ ముచ్యతే ।
యదాహు స్తత్పరో యః స్యాత్స దేవస్తు మహేశ్వరః ॥
వ్రతాని యాని భిక్షూణాం తథైవోపవ్రతాని చ ।
ఏకైకాతిక్రమే తేషాం ప్రాయశ్చిత్తం విధీయతే ॥
ఉపేత్య తు స్త్రియం కామత్ కృచ్ఛ్రసంయతమానసః ।
ప్రాణాయామసమాయుక్తః కుర్యా త్సాంతపనం శుచిః ॥
తత శ్చరేత నియమాత్ కృచ్ఛ్రం సంయతమానసః ।
పునరాశ్రమ మాగమ్య చరే ద్భిక్షు రతంద్రితః ॥
న సర్మయుక్త మనృతం హిన స్తీతి మనీషిణః ।
తథాపి చ న కర్తవ్యం ప్రసంగో హ్యేష దారుణః ॥
ఏకరాత్రోపవాప శ్చ ప్రాణాయామశతం తథా ।
కర్తవ్యం యతినా ధర్మలిప్సునా పర మవ్యయమ్ ॥
గతేనాపి న కార్యం తేన కార్యం స్తేయ మన్యతః ।
స్తేయా దభ్యధికః కశ్చి న్నా స్త్యధర్మ ఇతి స్మృతి ॥
కావున నిత్యము ఆత్మ విద్యాపరాయణుడై ధ్యాననిరతుడై జ్ఞాన స్వరూపుడగు బ్రహ్మోపాసన గావించవలయును. దానితో సంసార బంధము తొలగును. అన్నిటికంటే ఆత్మరూపుడగు తనను భిన్నునిగా తలచి ఆనందరూపుడు అజరుడు పరుడగు జ్ఞావరూపుని ధ్యానించవలయును. సకల ప్రపంచము సృజించు వానిని తన వద్దకు చేరిన వానీనీ మరల సంసారమునకు పంపని వానిని, ధ్యానించవలెను. అందువలన అందరికీ ఈశ్వరుడు దేవుడు పరము కంటే పరుడు, ఉన్నత స్థానమును అధిష్టించినవాడు శాశ్వతమగు శివము అవ్యయమగు గగనమును తనలో నిలుపుకోనీనవాడు ఈ సకల జగత్తును నియమించువారు ఎవరి అంశలుగా నున్నారో అతనే మహేశ్వరుడు. యతులకు విధించబడిన వ్రతములు ఉపవ్రతములలోను అతిక్రమించిన ప్రతిదానికి ప్రాయశ్చిత్తము వీధించబడినది. యతిగా ఉన్నవాడు స్త్రీ సంభోగము గావించినచో సావధానియై ప్రాణాయామము నాచరించి సొంతపన వ్రతము సాచరించవలయును. తరువాత ఏకాగ్ర మనస్కుడై కృచ్చ వ్రతము నాచరించవలయును. తరువాత ఆశ్రమమునకు వచ్చి తన సన్యాస వ్రతమును ఏమరుపాటు లేక ఆచరించవలయును.
ధర్మయుక్తమగు అనృతముతో పాపము రాదని విద్వాంసులు చెప్పేదరు అయిననూ అసత్యమునందు ఆసక్తిని కనబరచరాదు. అసత్య భాషణము పరమదారుణము. యతి అసత్యము పలికినచో ఒకరాత్రి ఉపవాసముండి నూరు ప్రాణాయామముల నాచరించవలయును. ఎంతటి ఆపదలో నున్ననూ ఇతర ప్రయోజనము నాశించి దొంగతనము చేయరాదు. దొంగతనమును మించిన అధర్మము లేదనీ స్మృతి చెప్పుచున్నది. ఇదియే అన్నిటికంటే గొప్ప హింసగా చెప్పబడినది. ఈ దొంగతనము ఆత్మజ్ఞానము నశింప చేయును.
హింసా చైషా పరా దీష్టా యా చాత్మజ్ఞాననాశికా ।
యదేశ ద్ద్రవిణం నామ ప్రాణా హ్యేతే బహిశ్చరాః ॥
స తస్య హరతి ప్రాణా న్యో యస్య హరతే ధనమ్ ।
ఏవం కృష్ణ్వా సుదుష్టాత్మా భిన్నవృత్తో ప్రతాహతః ॥
భూయో నిర్వేద మాపన్న శ్చరే చ్చాంద్రాయణవ్రతమ్ ।
విధినా శాస్త్రదృష్టేన సంవత్సర మీతి శ్రుతిః ॥
భూయో నిర్వేదమాపన్న శ్చరే ద్భిక్షు రతంద్రితః ।
అకస్మాదేవ హింసాం తు యది భిక్షుః సమాచరేత్ ॥
కుర్యాత్ కృచ్ఛ్రాతికృచ్ఛంతు చాంద్రాయణ మథాపి వా ।
స్కన్న మింద్రియ దౌర్బల్యాత్ స్త్రీయం దృష్ట్వా యతి ర్యది ॥
తేన ధారయితవ్యా వై ప్రాణాయామాస్తు షోడశ ।
దీవాస్కన్నే త్రిరాత్రం స్యాత్ ప్రాణాయామశతం తథా ॥
ఏకాంతే మధుమాసే చ నవశ్రాద్ధే తథైవ చ ।
ప్రత్యక్షలవణం ప్రోక్తం ప్రాజాపత్యవిశోధనమ్ ॥
ధ్యాననిష్ఠస్య సతతం నశ్యతే సర్వపాతకమ్ ।
తస్మా న్మహేశ్వరం జ్ఞాత్వా తద్ధ్యానపరమో భవేత్ ॥
యద్ర్బహ్మ పరమం జ్యోతిః ప్రతిష్టాక్షర మవ్యయమ్ ।
యోఽన్తరా పరమం బ్రహ్మ స విజ్ఞేయో మహేశ్వరః ॥
ఏష దేవో మహాదేవః కేవలః పరమః శివః ।
తదేవాక్షర మద్వైతం తదాదిత్యాంతరం పరమ్ ॥
ధనమనగా బహిశ్చరములగు ప్రాణములు. కావున ఎవని ధనమును హరించేనన్న అతని ప్రాణములు హరించుటే యగును. ఇట్లు దుస్స్వ భావుడగు యతి దొంగతనము గావించి ఆచారముల నుండి వ్రతము నుండి భ్రష్టుడగుచో ప్రతభంగమునకు పశ్చాత్తాపమును చెందినచో శాస్త్ర విధానోనుసారముగా ఒక సంవత్సరము చాంద్రాయణ వ్రతము నోచరించవలయును. తరువాత మరల తన వ్రతమును సావధానుడై కొనసాగిం చవలయును. ఒకవేళ ప్రతి అనగా సంన్యాసీ హింస జరిపినచో కృచ్చవ్రతము లేదా అతికృచ్చవ్రతమును లేనిచో చాంద్రాయణ వ్రతమును కాని ఆచరించవలయును. దుర్బల మనస్కుడగు యతికీ రూపవతియగు స్త్రీని చూచీ రేతస్లవము జరిగినచో మూడు రాత్రులు ఉపవాసముండ వలయును. నూరు ప్రాణాయామముల నాచరించవలయును. ఒకరి అన్నమునే తినిననూ మధు మాంసములను గోలిననూ, నవశ్రాద్ధ భోజనము చేసిననూ, ప్రత్యక్ష లవణమును భుజించిననూ ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. ఎప్పుడూ ధ్యానములో నుండు వానికి అన్ని పోపములు నశించును. కావున పరమాత్మను తెలిసి అతని ధ్యానములో నుండవలయును. పరబ్రహ్మ, పరంజ్యోతి, ప్రతిష్ట, అక్షరము, అద్వయము, అంతరాత్మ అతనే మహేశ్వరుడనీ తెలియవలయును. ఇతడే దేవుడు. మహాదేవుడు కేవలుడు పరమశివుడు. అక్షరరూపుడై అద్వైతము సూర్యునిలో నుండు పరమాత్మ జ్ఞానమును పేరు గల స్వప్రకాశముతో విరాజిల్లు చుండును. తన మహా ప్రకాశములో విరాజిల్లు చుండును కావున మహాదేవు డనబడును.
నాన్యం దేవం మహాదేవా ద్వ్యతిరిక్తం ప్రపశ్యతి ।
త మేవాత్మాన మాత్మేతి యః స యాతి పరం పదమ్ ॥
మన్యoతే యే స్వ మాత్మానం విభిన్నం పరమేశ్వరాత్ ।
న తే పశ్యంతి తం దేవం వృథా తేషాం పరిశ్రమః ॥
ఏకం బ్రహ్మ పరం బ్రహ్మ జ్ఞేయం త త్తత్త్వ మవ్యయమ్ ।
స దేవస్తు మహాదేవో నైత ద్విజ్ఞాయ బాధ్యతే ॥
తస్మా ద్యత్నేన నియతం యతః సంయతమానసః ।
జ్ఞానయోగరతః శాన్తో మహాదేవపరాయణః ॥
ఏష వః కథతో విప్రా యతీనా మాశ్రమ శ్శుభః ।
పితామహేన విభునా మునీనాం పూర్వ మీరితమ్ ॥
నాష్య శిష్యస్య యోగీభ్యో దద్యా దీద మనుత్తమమ్ ।
జ్ఞానం స్వాయంభువం ప్రోక్తం యతిధర్మాశ్రయం శివమ్ ॥
ఇతి యతినియమానా మేత దుక్తం విధానం ।
పశుపతిపరీతోషే యద్భవే దేకహేతుః ।
న భవతి పునరేషా ముద్భవో వా వినాశః ।
ప్రణిహితమనసా యే నిత్య మేవా చరన్తి ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే ఏకోసత్రింశోఽధ్యాయః ॥
మహాదేవుని కంటే భిన్నుడగు మహాదేవుని తెలియనివాడు, మహాదేవునే తన ఆత్మగా తెలియువాడు పరమ పదమును పొందును. తన ఆత్మ పరమేశ్వరునికంటే భిన్నముగా తలచినవాడు మహాదేవుని చూడజాలడు. వారి పరిశ్రమ అంతయూ వ్యర్థమగును. పరబ్రహ్మ ఒక్కటే. అతనే అవ్యయ తత్త్వము ఆ తత్వమే మహాదేవుడు. ఇది తెలిసిన వానికి సంసార బంధముండదు. కావున యతి నిత్యము ఈ విషయమును తెలియుటకు ప్రయత్నించవలయును. జ్ఞానయోగాత్ముడు కావలయును. మహాదేవ పరాయణుడు కావలయును. ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు మీకు యత్యా శ్రమ ధర్మములను వివరించితిని పూర్వము ఈ ధర్మములను బ్రహ్మ మునులకు తెలిపెను. శుభకరము యతిధర్మాశ్రయమగు ఈ జ్ఞానమును శిష్యుడు కాని వానికి, పుత్రుడు కాని వానికి, యోగి కానీ వానికీ చెప్పరాదు. ఇట్లు చెప్పబడిన ఈ యతిధర్మ విధానము మహా దేవుని సంతోషమునకు ముఖ్య హేతువు. సావధానమున నియమమున వ్రతముల నాచరించువారు మరల పుట్టరు.
ఇది శ్రీ కూర్మ పురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 29వ అధ్యాయము.
Summary of chapter 82 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa initiates the section on expiation (Prāyashchitta), defining the gravity of various unrighteous actions and their karmic consequences. He categorizes major sins (Mahāpātakas), such as killing a Brāhmaṇa (Brahma-hatyā), drinking intoxicants (Surāpāna), theft of gold (Steya), and violating the Guru's bed (Gurutalpa-gamana), alongside association with such sinners, warning of their dire worldly and otherworldly results.