కూర్మ మహా పురాణము
43వ అధ్యాయము
సూత ఉవాచ -
ఏత దాకర్ణ్య విజ్ఞానం నారాయణముఖేరితం ।
కూర్మరూపధరం దేవం ప ప్రచ్చు ర్ముసయః ప్రభుమ్ ॥
కధితా భవతా ధర్మా మోక్షజ్ఞానం సవిస్తరమ్ ।
లోకానాం సర్గనిస్తారం వంశమన్వంతరాణి చ ॥
ప్రతిసర్గ మీదానీం నో వక్తు మర్హసి మాధవ ।
భూతానాం భూతభవ్యేశ యధాపూర్వం త్వయో దితమ్॥
సూతమహర్షి పలికెను.
ఇట్లు నారాయణునినుండీ చెప్పబడిన ఈ విజ్ఞానమును విని కూర్మరూపధరుడగు నారాయణుని మునులు ఇట్లడిగిరి.
తాము చాలా ధర్మములను చెప్పితిం. మోక్ష జ్ఞానమును తెలిపితిరి. లోకముల సృష్టివిస్తారమును, వంశములను మన్వంతరమునుకూడా చేప్పితిరి. ఇక ఇప్పుడు తాము చెప్పిన విధిని అనుసరించి ప్రతిసర్గమును ప్రళయమును చెప్పవలయును.
సూత ఉవాచ -
శ్రుత్వా తేషాం తదా వాక్యం భగవాన్ కూర్మరూపధృక్ ।
వ్యాజహార మహాయోగీ భూతానాం ప్రతిసంచరమ్ ॥
సూతమహర్షి పలికెను
కూర్మరూపధారియగు శ్రీమహావిష్ణువు వారిమాటలను విని ప్రాణుల ప్రళయమును ఇట్లు వివరించెను.
కూర్మ ఉవాచ -
నిత్యో నైమిత్తిక శ్చైవ ప్రాకృతాత్యంతిక స్తధా ।
చతుర్ధాయం పురాణేతి స్మిన్ ప్రోచ్యతే ప్రతిసంచరః ॥
యేయం సందృశ్యతే నిత్యం లోకే భూతక్షయ స్త్విహ ।
నిత్యః సంకీర్త్యతే నామ్నా మునిభిః ప్రతిసంచరః॥
బ్రాహ్మో నైమిత్తికో నామ కల్పాంతే యో భవిష్యతి ।
త్రైలోక్యస్యాస్య కథితః ప్రతిసర్గో మనీషిభిః ॥
మహదాద్యం విశేషాన్తం యదా సంయాతి సంక్షయమ్ ।
ప్రాకృతః ప్రతీసధోలియం ప్రోచ్యతే కాలచీంతకై॥
జ్ఞానా దాత్యస్తాకః ప్రోక్తో యోగినః పరమాత్మని ।
ప్రలయః ప్రతిసర్గ్యం కాలచింతాపరైః ద్విజైః ॥
ఆత్యంతీక శ్చ కధితః ప్రలయోభిత్ర ససోధనః ।
నైమిత్తిక మిదానీం వః కథయిష్యే సమాసతః ॥
చతుర్యుగసహస్రాంతే సంప్రాప్తే ప్రతిసంచరే ।
స్వాత్మసంస్థాః ప్రజాః కర్తుం ప్రతిపేదే ప్రజాపతిః ॥
తతో భవ త్యనావృష్టి స్త్రీవా సా శతవార్షికీ ।
భూతక్షయకరీ ఘోరా సర్వభూతక్షయంకరీ ॥
తతో యా న్యల్పసారాణి సత్వానీ పృథివీతలే ।
తానీ చాగ్రే ప్రలీయంతే భూమిత్వ ముపయాంతి చ ॥
సప్తరశ్మి రధో భూత్వా సముత్తిష్ఠన్ దివాకరః ।
అసహ్యరశ్మి ర్భవతి పీబ న్నంభో గభస్తిభిః॥
తస్య తే రశ్మయః సప్త సిబం త్యంబ మహార్ణవే ।
తేనాహారేణ తం దీప్తాః సూర్యాః సప్త భవ శ్యుత॥
తత స్తే రశ్మయః సప్త సూర్యా భూత్వా చతుర్దిశమ్ ।
చతుర్లోక మిదం సర్వం దహంతి శిఖిన స్తధా॥
ఈ పురాణమున ప్రలయము నిత్యము నైమిత్తకము ప్రాకృతము అత్యంతికమని నాలుగు విధములుగా చెప్పబడినది. ప్రతినిత్యము జరుగుచున్న ప్రాణులక్షయము నిత్యప్రలయమనబడును. బ్రహ్మ కల్పాంతమున జరుగు ప్రలయము (త్రిలోక ప్రలయము) నైమిత్తికమనబడును. మహత్తత్త్వమునుండి విశేషము వరకు జరుగు ప్రలయమును ప్రాకృత ప్రలయుందురు. పరమాత్మ జ్ఞానము కలుగుట వలన పరమాత్మలో లీనమగుట ఆత్యంతిక ప్రలయమనబడును.
నాలుగువేల యుగములు గడిచిన తరువాత ప్రలయకాలము రాగా బ్రహ్మ ప్రజలను తనలో నిలుపుకొనుటకు సంకల్పించుకొనును. అప్పుడు నూరు వత్సరములు తీవ్రమగు అనావృష్టికలుగును. ఇది సకల ప్రాణులను నశింప చేయునది. ఘోరమగునది. అపుడు అల్పసారములగు ప్రాణలు మొదట లయమును పొందును. అవి భూమిలో లీనమగును. అంతట సూర్యభగవానుడు రధారూఢుడై ఉదయించి తనకిరణములతో నీటిని త్రాగి సహించ జాలని తేజము కలవాడగును. అతనిపడు కిరణములు సముద్రజలమునుపానము చేయును. ఆ ఆహారముతో విజృంభించిన ఆ ఏడురశ్ములు ఏడు సూర్యులగుదురు. ఆ ఏడుగురు సూర్యులు నాలుగు దిక్కులలో నాలుగు లోకములను అగ్ని వలె దహించును.
వ్యాప్నువంత శ్చతే విప్రా స్తూర్థ్వం చాధశ్చ రశ్మిభిః ।
దీప్యంతే భాస్కరాః సప్త యుగాంతాగ్నిప్రతాపినః॥
తే సూర్యా వారణా దీప్తా బహుసాహస్రరశ్మయః ।
ఖం సమావృశ్య తిష్ఠంతి నిర్దహంతే వసుంధరామ్॥
తత స్తేషాం ప్రతాపేన దహ్యమానా వసుంధరా ।
సాద్రీనద్యర్ణవద్వీపా నిస్నేహా సమపద్యత॥
దీప్తాభిః సంతతాభిశ్చ రశ్మిభి ర్వై సమంతతః ।
అధ శ్చోర్ధ్వం చ లగ్నాభి స్తిర్యక్ చైవ సమావృతమ్ ॥
సూర్యాగ్నినా ప్రమృష్టానాం సంసృష్టానాం పరస్పరమ్।
ఏకత్వ ముపయాతానా మేకజ్వాలం భవత్యుత ॥
సర్వలోకప్రణాశ శ్చ సోలగ్ని ర్భూత్వా సుకుండలీ ।
చతుర్లోక మిదం సర్వం నిరహత్యాత్మతేజసా॥
తతః ప్రలీనే సర్వస్మిన్ జంగమే స్థావరే తథా ।
నిర్వృక్షా నిస్తృణా భూమిః కూర్మపృష్ణా ప్రకాశతే ॥
అంబరీష మివాభాతి సర్వమాపూరీతం జగత్ ।
సర్వ మేవ తదార్చిర్భిః పూర్ణం జాజ్వల్యతే పునః॥
పాతాళే యాని సత్వాని మహెూదధిగతాని చ ।
తతస్తాని ప్రలీయంతే భూమిత్వ ముపయాంతి చ ॥
ద్వీపాం శ్చ పర్వతాం శ్చైవ వర్షాణ్యథ మహోదధీన్ ।
తాన్ సర్వాస్ భస్మసాత్ కృత్వా సప్తాత్మా పావకః ప్రభుః ॥
సముద్రేభ్యో నదీభ్య శ్చ పాతాలేభ్య శ్చ సర్వశః ।
పిబ న్నపః సమిదో గ్నీః పృధివీ మాశ్రితో జ్వలన్ ॥
ఆ ఏడుగురు సూర్యులు తమ కీరణముల ద్వారా పైకీ క్రిందికి వ్యాపించి యుగాంతాన్నీ ప్రతాపము కలిగి ప్రజ్వరిల్లును. నీటితో ఉద్దేపించబడిన ఆ సూర్యులు వేలకిరణములు కలవారై ఆకాశమునావరించి భూమిని దహింప చేయుచుందురు. ఆ సూర్యుని తేజముతో పరీతపించబడిన భూమీ ద్రవరహితమగును. బాగుగా ప్రజ్వరిల్లుచు అంతటా వ్యాపించుచు ఊర్థ్వము అధోభాగములు అడ్డముగా కూడ ఆవరించియుండును.
ఇట్లు సూర్యాగ్నిచే కాల్చబడి ఒకదానితో ఒకటికలిసి ఒకేభావమును పొంది ఒకే జ్వాల రూపమును పొందును. అన్ని లోకములను నశింప చేయు ఆ సూర్యరూపొగ్ని మండలాకారముగా మారి తన తేజస్సుతో నాలుగు లోకములను దహింపచేయును. అంతట సకల స్థావర జంగమాత్మకమగు సకల భూత జాలము లయము చెందగా చెట్లుగడ్డి ఏమిలేనిదై, కూర్మపృష్ఠము వలె భాసించును. సకల జగత్తు బాణలిపై భాగమువలె భాసించును. అతితీవ్రముగా సూర్య కిరణములతో మండుచుండును. పొతొలములో సముద్రములో నున్న సకల ప్రాణులు లయమై భూమి రూపమును చెందును. సప్తరూపుడగు సూర్యుడు ద్వీపములను పర్వతములను వరములను సముద్రములను అన్నిటిని భస్మము గావించి నదీ సముద్ర పాతాలములను అంతట జలమును త్రాగి భూమిని ఆశ్రయించి భూమిని మండింప చేయును.
తతః సంవర్తకః శైలా నతిక్రమ్య మహాం స్తథా।
లోకాన్ దహతి దీప్తాత్మా రుద్రతేజోవిజృంభితః॥
స దగ్ద్వా పృధివీం దేపూ రసాతల మశోషయత్ ।
అధస్యాం పృధివీం దగ్ద్వా దివ మూర్ధ్వం దహిష్యతి॥
యోజనాసోం శతానీహ సహస్రా ణ్యయుతాని చ ।
ఉత్తిష్ఠస్తి శిఖా స్తస్య వహ్నేః సంవర్తకస్యతు॥
గంధర్వాం శ్చ పిశాచార శ్చ సయక్షోరగరాక్షసాన్ ।
తదా దహ త్యసౌ దీప్తః కాలరుద్రప్రచోదితః॥
భూలోకం చ భువర్లోకం స్వర్లోకం చ తధా మహః ।
దహే దశేషం కాలాగ్నిః కాలో విశ్వయుతః స్వయమ్॥
వ్యాప్తే ష్వేతేషు లోకేషు తీర్యగూర్ధ్వ మధగ్నినా ।
తత్ తేజః సమనుప్రాప్య కృత్స్నం జగదిదం శనైః॥
అయోగుడనిభం సర్వం తదాబైకం ప్రకాశతే ॥
తతో గజకులోన్నాదా స్తడిద్భిః సమలంకృతాః ।
ఉత్తిష్ఠంతీ తధా వ్యోమ్ని ఘోరాః సంవర్తకా ఘనాః ॥
కేచిత్ న్నీలోత్పలశ్యామాః కేచిత్ కుముదసన్నిభః ।
ధూమ్రవర్ణాస్తథా కేచిత్ కేచిత్ పీతాః పయోధరాః ॥
కేచిత్ రాసభవర్ణా స్తు లాక్షాగసనిభా స్తధా ।
శంఖకుందనిభా శ్చాన్యే జాత్యంజననిభోః పరే ॥
ఇంద్రగోపనిభాః కేచి ద్ధరితాలనిభా స్తధా ।
ఇంద్రచాపనీభాః కేచి దుత్తిష్ఠంతి ఘనా దీవిః ॥
కేచిత్ పర్వతసంకాశాః కేచిత్ గజకులోపమాః ।
కూటాంగాదనిభ శ్చాన్యే కేచి న్మీనకులోద్వహాః॥
బహురూపొ ఘోరరూపా ఘోరస్వరనినాదీసః ।
తదా జలధరః సర్వే పూరయంతి నభః స్థలమ్ ॥
తత స్తే జలదా ఘోరరావీణో భాస్కరాత్మజాః।
సప్తధా సంవృతాత్మాన సమగ్నిం శమయ న్యుత ॥
తత స్త్రీ జలదాః వర్షం ముంచం తీహ మహొఘవత్ ।
సుఘోర మశివం సర్వం నాశయంతి చ పావకమ్॥
ప్రవృష్టే చ తదాత్యర్థ మంభసా సూర్యతే జగత్ ।
అద్భిః తేజోభిభూతత్వాత్ తదాన్నీః ప్రవిశ త్యపః॥
అంతట సాంవర్తకమగు అగ్ని పర్వతములనాక్రమించి రుద్రతేజో విజృంభితమై అన్ని లోకములను దహింప చేయును. ఇట్లు ఆ అగ్ని భూమిని దహించి రసాతలమును ఎండింపచేయును. భూమిక్రింది భాగమును దహించివేసి ద్యులోకమును జ్వలింప చేయును. ఆ సంవర్తకాగ్ని శిఖలు నూరువేల పదివేల యోజనములు వ్యాపించి జ్వలించుచుండును. కాలరుద్రునిచే ప్రేరితుడగు ఆయగ్ని గంధర్వులను, పిశాచములను యక్షరాక్షస ఉరగులను దహింప చేయును. భూలోకమును భువర్లోకమును, సువర్లోకమును మహర్లోకమసు సమగ్రముగా దహింప చేయును. ఈ అగ్ని లోకములలో పైన క్రింద అడ్డముగా వ్యాపించి తరువాత ఆ తేజస్సు సకల జగత్తును ప్యాపించి మండుచున్న ఉక్కు ముద్దలా భాసించును. తరువాత ఏనుగుల సమూహపు ఘీంకారము వలె గర్జించుచు మెరపు తీగలతో అలంకరించబడినదై ఘోరమగు సంవర్తక మేఘములు బయలు నేడలును. కొన్ని నల్లకలువల వంటివి, కొన్ని కుముదముల వంటివి కొన్నీ ధూమ్రవర్ణముకలవి, కొన్ని పసుపు పచ్చనివి, కొన్ని రాసభవర్ణములు కలవి, కొన్ని లాక్షారస సపర్ణములు, కొన్ని శంఖకుందముల వలె తెల్లనివి, జాతీపుష్పసన్నిభములు, కాటుకరంగు కలవీ మరికొన్ని కొన్ని మనశ్శిలాసన్నిభములు కొన్ని పావురమురంగు కలవి, ఇంద్రనీలమణుల వంటివి మరికొన్ని హరితాల సన్నీభములు కొన్ని కొన్ని ఇంద్ర ధనుస్సు వన్నె కలవీ కొన్ని బయలు వెడలును. కొన్ని పర్వతా కారములు, కొన్నీ గజాకారములు, కూటాంగార సన్నిభములు కొన్ని, కొన్ని మత్స్యాకార సన్నిభములు పలురూపములు కలవి, భయంకరరూపములు కలవి భయంకరగర్జనలు కలవి మేఘములు అన్ని ఆకాశము నిండా వ్యాపించును. సూర్యునివలన పుట్టిన ఆమేఘములు గొప్ప ప్రవాహమువలె వర్షించును. మహాభయంకరమగు అమంగలమగు ఆయగ్నిని సంపూర్ణముగా చల్లార్చును. అతిగా వర్షించిన జలముతో జగమంతయూ నీండును. జలమాక్రమిoచుటవలన అగ్ని జలములో ప్రవేశించును.
నష్ట చాగ్నౌ వర్షశతైః పయోదాః క్షయసంభవాః।
ప్లావయన్తోథ భువనం మహాజు స్రవైః ॥
ధారాభిః పూరయం తీదం చోద్యమానాః స్వయంభువా ।
అత్యంతసలితౌఘై శ్చ వే లా ఇవ మహెూదధేః ॥
సాదీద్వీపా తధా పృధ్వీ జలైః సంఛాప్యణే శనైః ।
ఆదిత్యరశ్మిభిః పీతం జల మబ్రేషు తిష్ఠతి॥
పునః పతతి తత్ భూమౌ పూర్యంతే తేన చార్ణవాః ।
తతః సముద్రః స్వాం వేలా మతిక్రాంతా స్తు కృత్స్నశః ।
పర్వతా శ్చ విలీయంతే మహీ చాప్సు నిమజ్జతీ ॥
తస్మి న్నేకార్ణవే ఘోరే నష్ట స్థావరజంగమే ।
యోగని ద్రాం సమాస్థాయ శేతే దేవః ప్రజాపతిః॥
చతుర్యుగసహస్రాంతం కల్ప మాహు ర్మహర్షయః ।
వారాహూ వర్తతే కల్పో యస్య విస్తార ఈరీతః॥
అసంఖ్యాతా స్తథా కల్పా బ్రహ్మవిష్ణుశివాత్మకాః ।
కథితా హి పురాణేషు మునిభిః కాలచింతకైః ॥
సాత్వికే ష్వడ కల్పేషు మాహా త్య్మ మధికం హరేః ।
తామసేషు హరస్యోక్తం రాజసేషు ప్రజాపతేః॥
యోయం ప్రవర్తతే కల్పో వారాహః సాత్త్వికో మతః ।
అన్యేచ సాత్వికాః కల్పా మమ తేషు పరిగ్రహః ॥
బ్రహ్మచే ప్రేరేపించబడిన యామేఘములు ప్రలయకాలమున పుట్టినవై సంవర్షాగ్నిని చల్లార్చి నూరు సంవత్సరములు మహాజలధారలను వర్పించి ఆప్రవాహముతో సకల ప్రపంచమును ముంచెత్తుతూ సకలలోకములను నీటితో సముద్రము చెలియకట్టలను. ముంచునట్లు నింపివేయును. ఇట్లు పర్వతములతో ద్వీపములతో కూడియున్న భూమియంతయూ నీటితో కప్పి వేయబడును. సూర్యకిరణములతో త్రాగబడిన జలము మేఘములలో నిలుచును. మరల ఆజలము భూమీపై కురియును. దానితో సముద్రములు నిండును. అంతట సముద్రములు తమ చెలియలికట్టలను పూర్తిగా దాటిపేసి పర్వతములను ముంచెత్తును. భూమికూడా జలములో మునుగును. ఇట్లు సకల జగత్తు నశించగా బ్రహ్మ యోగ నీద్రను చేంది పరుండును. నాలుగు యుగములు ఒకవే మార్లు తిరిగితే ఒక కల్పమనీ ఋషులు చెప్పెదరు. ఇప్పుడు నేను చెప్పిన దంతయూ వారాహకల్పమునకు సంబంధించినది. బ్రహ్మవిష్ణుశివాత్మకమగు కల్పములు అసంఖ్యాకములు అని కాలచింతకులగు మునులు చెప్పియుండిరి. సాత్త్విక కల్పములలో విష్ణువుమహత్త్వము, తామసకల్పములలో రుద్రునివైభవము రాజసకల్పములలో బ్రహ్మవైభవము అధికముగా నుండును. ఇపుడు నడుచు వారాహకల్పము. సాత్త్విక కల్పము. ఇతర సాత్త్విక కల్పములలో నా ప్రభావము అధికముగా నుండును.
ధ్యానం తప స్తథా జ్ఞానం లబ్ధ్వ తేష్వేవ యోగినః ।
ఆరాధ్య గిరిశం మాం చ యాంతి తత్ పరమం పదమ్॥
సోహం సత్త్వం సమాస్థాయ మాయీ మాయామం స్వయమ్ ।
ఏకార్ణవే జగ తస్మిన్ యోగనిద్రాం ప్రజామి తు ॥
మాం పశ్యంతి మహాత్మానః సుప్తం కాలం మహర్షయః ।
జనలోకే వర్తమానా స్తపసా యోగచక్షుషా॥
అహం పురాణపురుషో భూర్భువఃప్రభవే విభుః ।
సహస్రచరణః శ్రీమాన్ సహస్రాంశుః సహస్రదక్ ॥
మంత్ర్నో గ్ని ర్బ్రాహ్మణోః గావః కుశా శ్చ సమిధో హ్యహమ్ ।
ప్రోక్షణీ చ స్రువ శ్చైవ సోమో ఘృత మథాస్మ్యహమ్ ॥
సంవర్తకో మహా నాత్మా పవిత్రం పరమం యశః ।
వేదో వేద్యం ప్రభు ర్గోప్తా గోపతి గ్ని ర్బ్రహ్మణో ముఖమ్ ॥
అనంత స్తారకో యోగీ గతి ర్గతిమతాం వరః ।
హంసః ప్రొణోథ కపిలో విశ్వమూర్తిః సనాతనః ॥
క్షేత్రజ్ఞః ప్రకృతిః కాలో జగద్బీజ మధామృతమ్ ।
మాతా పితా మహాదేవా మత్తో హ్యన్య న్న విద్యతే॥
ఆదిత్యవర్ణి భువనస్య గోప్తా నారాయణః పురుషో యోగమూర్తిః ।
మాం పశ్యంతి యతయో యోగనిష్ఠా జ్ఞాత్వాత్మాన మమృతత్వం ప్రజంతీ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్ధే త్రిచత్వారింశోధ్యాయః
ఆయా కల్పములందు యోగులు ధ్యానము తపస్సు జ్ఞానములను పొంది నన్ను శంకరుని ఆరాధించి పరమపదమును చేరుదురు. ఆ నేను సత్త్వమును ఆశ్రయించి మాయనై మాయామయమగు యోగనిద్రను ఆశ్రయించి ఏకార్ణవ రూపముగా నున్న ఈ జగత్తులో యోగనిద్రలో నుండును. జనలోకమున నున్న మహానుభావులు యోగదృష్టితో పడుకొనియున్న నన్ను చూచేదరు. నేను పురాణ పురుషుడను, భూర్భువః ప్రభృతిలోకములకు కారణమును. సహస్ర చరణుడను. శ్రీమంతుడను సహస్ర కిరణములుకలవాడను. సహస్ర నేత్రములు కలవాడను. మంత్రము అగ్నీ బ్రాహ్మణులు, గోవులు, కుశములు, సమిధలు, ప్రోక్షణి స్రువము, చంద్రుడు నేయి ఇవన్నీ నా రూపములే. నేనే సంవర్తకాగ్నిని, మహత్తత్త్వమును, ఆత్మను, పవిత్రము, పరమ కీర్తిని నేనే. వేదమును, వేద్యమును, ప్రభవమును, రక్షకుడను గోపతిని, (ఇంద్రియాధిపతిని) అనంతుడను, తారకమును, యోగీని, జ్ఞానము కలవారి జ్ఞానమునునేనే. హంసను, ప్రాణమును, కపిలుడను, విశ్వమూర్తిని, సనాతనుడను, క్షేత్రజ్ఞుడను, ప్రకృతిని, కాలమును, జగద్బీజమును, అమృతమునునేనే తల్లితండ్రి, మహాదేవుడునేనే. నాకంటే భిన్నము ప్రపంచమునలేదు. నేను ఆదిత్యవర్ణుడను ప్రపంచరక్షకుడను. నారాయణుడను, పరమపురుషుడను యోగమూర్తిని యతులు యోగనిష్టులు నన్ను చూడగలరు. నన్ను తెలిసినవారు మోక్షమును పొందెదరు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రంహితలో ఉపరి విభాగమున 43వ అధ్యాయము.
Summary of chapter 96 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa expounds the sacred Phalaśruti of the Kūrma Purāṇa, declaring that whoever reads, listens to, or copies this divine Purāṇa with devotion attains health, prosperity, virtuous offspring, and freedom from all fears. He assures that devotees who honor this text achieve the divine grace of Śiva-Shakti and Purushottama Vishṇu, ultimately attaining eternal Śiva-sāyujya.