కూర్మ మహా పురాణము
37వ అధ్యాయము
ఋషయఃఊచుః
కథం దారువనం ప్రాప్తో భగవాన్ గోవృషధ్వజః ।
మోహయామాస విప్రేంద్రాన్ సూత త్వం వస్తు మర్హసి॥
సూత ఉవాచః-
పురా దొరువనే రమ్యే దేవసిద్ధనిషేవితే ।
సపుత్రదారా మునయ స్తప శ్చేరుః సహస్రశః ॥
ప్రవృత్తం వివిధ౦ కర్మ ప్రకురాణా యధావిధీ ।
యజన్తి వివిధై ర్యజ్ఞైః తపన్తి చ మహర్షయః॥
ఋషులు ఇట్లనిరి.
సూతుడా వృషభధ్వజుడగు దేవదేవుడు శంకరుడు దారుకావనమును ఎటుల చేరవచ్చెను? విప్రశ్రేష్ఠులగు వారిని. ఎటుల మోహింప చేసెను అంతయు తెలుపనగును.
సూతుడిట్లు పలికెను.
పూర్వము దేవసిద్ధుల సంఘములు సంచరించేడీ యీ రమ్యమగు దేషదారు వనమునందు వేలకొలదిగా మహర్షులు దారాపుత్రులతో నివాసము చేయుచు, తపము చేయుచుండిరి. ఏవిధములగు వైదికకర్మలయందు నిరతులై, వానిని యధావిధి నిర్వర్తించెడివారు. ఆ మహరులు ఎన్నో యజ్ఞములు చేసిరి. తమ తపస్సు కొనసాగించిరి.
తేషాం ప్రవృత్తివిన్యస్తచేతసా మథ శూలధృక్ ।
ఖ్యాపయన్ స మహాదోషం యయౌ దారువనం హరః ॥
కృత్వా విశ్వగురుం విష్ణుం పార్శ్వే దేపా మహేశ్వరః ।
యయౌ నివృత్తివిజ్ఞానస్థాపనార్థం చ శంకరః॥
ఆస్థాయ విపులం వేశ మూనవింశతివత్సరః ।
లీలాలసో మహాబాహుః పీనాంగ శ్చారులోచనః ॥
శూలపాణియగు శంకరుడు, అచటిమునులు అందరు ప్రవృత్తిమార్గనిరతులై (తాముచేయు కర్మలవలన సాధించుకొను లౌకిక ఫలములందు ఆసక్తికలవారై యుండుట తెలిసి, వారియందలి ఆ గోప్ప దోషమును వివరించుటకన్నట్లు ఊరువనమును చేరెను. జగద్గురువగు శ్రీమన్నారాయణుని పురస్కరించుకొని, దేవదేవుడు మహేశ్వరుడగు శంకరుడు నివృత్తివిజ్ఞాన స్థాపనకై అచటికి వెళ్లాను. మహాబాహుడు, మీన ఉరస్కుడు, రమణీయనేత్రుడు " అగు త్రినేత్రుడు, ఇరువది సంవత్సరములలోపు వయస్సుగల యువకుని లావణ్యస్వరూపమును ధరించి అచటికి వెళ్ళెను.
చామికరవపుః శ్రీమాన్ పూర్ణచంద్రనిభాననః ।
మత్తమాతంగగమనో దిగ్వాసా జగదీశ్వరః ॥
కుశేశయమయీం మాలాం సర్వరత్నై రలంకృతామ్ ।
దధనో భగవా నీశః సమాగచ్ఛతి సస్మితః ॥
విజ్ఞానశ్రీయుతుడు, జగదీశ్వరుడు, భగవంతుడగు శంకరుడు బంగారువన్నె మేనితో, పూర్ణచంద్రునివంటి పదనముతో, మదగజగమనముతో, దిక్కులే వస్త్రములుకాగా (దిగంబరుడై) సర్వరత్నములచే అలంకృతమైన పద్మమాలికతో, చిరునవ్వుతో చక్కని రూపుధరించి, దారువనమును చేరెను.
యోనంతః పురుషో యోని ర్లోకానా మవ్యయో హరిః ।
స్త్రీవేషం విష్ణు రాస్థాయ సోఽనుగచ్ఛతి శూలినమ్ ॥
సంపూర్ణచంద్రవదనం పీనోన్నతపయోధరం శుచిస్మితం।
సుప్రసన్నం రణస్నూపురకద్వయమ్ ॥
సుపీతవసనం దివ్యం శ్యామలం చారులోచనం ।
ఉదారహాంసచలనం విలాసిసుమనోహరమ్ ॥
శూలపాణియగు శంకరుని, అసంతుడు, ఆదిపురుషుడు, సకల జగదుదయ కారణుడు, శాశ్వతుడు, హరియునగు శ్రీ మహావిష్ణువు స్త్రీ వేషమును ధరించి, అనుసరించెను. ముఖము పూర్ణచంద్రబింబమువలెనున్నది. పయోధరములు ఉన్నతములు, పీనములు. చిరునవ్వుతో ముఖము ప్రసన్నముగా వెలయుచున్నది. పాదముల అందియలు మ్రోగుచున్నవి. దివ్యమగు పచ్చని వస్త్రము అందగించుచున్నది. శ్యామవర్ణము, విశాల నేత్రములు, మదమరాళగమనము విలాసములతో, హరీ ధరించిన ఆరూపము మనసులను హరించుచున్నది.)
ఏవం స భగవా నీశో దేవదారువనే హరః ।
చచార హరిణా భిక్షాం మాయయా మోహయన్ జగత్॥
దృష్ట్వా చరంతం విశ్వేశం తత్ర తత్ర పినాకినమ్ ।
మాయయా మోహితా నార్యో దేవదేవం సమన్వయుః॥
విస్రస్తవస్త్రాభరణా స్త్యక్త్యాలజ్జాం పతివ్రతాః ।
సహైవ తేన కామార్తా విలాసిన్య శ్చరంతి హి ॥
ఋషీణాం పుత్రకా యే స్యు ర్యునో జితమానసాః ।
అగచ్ఛన్ తే హృషీకేశం సర్వే కామప్రపీడితాః ॥
అట్లు తన మాయతో జగత్తును మోహింపచేయుచు, హరితోకూడినహరుడు, భగవంతుడగు ఈశ్వరుడు భిక్షకై దారువనమంతయు సంచరించెను. అందందు ఇట్లు సంచరించేది దేవదేవుని, విశ్వేశ్వరుని, పినాకపాణిని దర్శించి, ఆతని మాయచే మోహపరవశలైన స్త్రీలు, అతనిని అనుసరింపసాగిరి. వస్త్రాభరణములు అస్తవ్యస్తములగు చుండగా, స్త్రీసహజమగు సిగ్గునుకూడవదలి పతివ్రతలై యుండియు ఇపుడు కామోపవిష్టులై, కామినీవిలాసములు ప్రదర్శించుచు శంకరుని వెంబడించసాగీరీ. అంతవరకును తపోనుష్టానమున మనోనిగ్రహము సాధించుకొనిన మునుల పుత్రులు యువకులగువారు అందరు, కామప్రపీడితులై స్త్రీ వేషముననున్న హృషీకేశుని (ఇంద్రియముల నియామకుని) అనుసరించసాగిరి ఎంత చిత్రము
గాయంతీ నృత్యంతీ విలాసవాహ్యా ।
నారీగణా మాయిన మేకమీశం ॥
దృష్ట్వా సపత్నీక మతీవకాస్తం ఇచ్ఛం త్యధా లింగన మాచరంతి।
పదే నిపేతుః స్మిత మాచరంతి గాయంతి గీతానీ మునీశపుత్రాః ।
ఆలోక్య పద్మాపతి మాదిదేవం భూభంగ మన్యే విచరంతి తేన ॥
ఆసా మథైషా మపి వాసుదేవో మాయీ మురారి ర్మనసి ప్రవిష్టః ।
కరోతి భోగాన్ మనసీ ప్రవృత్తం మాయానుభూయంత ఇతీవ సమ్యక్ ॥
మాయా ప్రపంచనిర్మాతయగు అద్వితీయుడగు ఈశుని, పత్నీసమేతుని, అత్యంత సుందరతర తనుని, దర్శించి, ముని భార్యలు అందరు విలాసములతో, గానము చేసిరి. నర్తించిరి. ఆతని పొందు కోరిరి, ఆలింగనము చేసికొనిరి. ఇంక ఆపంక, ఆదిదేవుడగు పద్మాపతిని స్త్రీ, రూపమున నున్నవానిని గాంచి, మహామునుల కుమారులు పొదములపై పడిరి. చిరునవ్వులు ఒలికించిరి. గీతములు గానము చేయసాగిరి. భ్రూభంగవిలాసములతో (క్రీకురీంపు చూపులతో) వెనుకబడసాగిరి. అంతట మాయా నియామకుడు, మురారియగు 'పాసుదేవుడు స్త్రీలయందు, పురుషులయందు మనసున తిష్టవేసి, కామభోగ ప్రవృత్తిని పుట్టించెను. అందరును ఈవిధముగా పూర్తిగా 'మాయానుభవమున ప్రసరించిరి.
విభాతి విశ్వామరభూతభర్తా సమాధవః స్త్రీగణమధ్యవిష్టః ।
అశేషశక్త్యాసనసన్నివిష్టో యథేకశక్త్యా సహ దేవదేవః ॥
కరోతి నృత్యం పరమప్రభావం తథా విరూఢః పునరేవ భూయః।
యయౌ సమారుహ్య హరిః స్వభావం తదీశవృత్తామృత మాదిదేవః ॥
సకల ప్రాణికోటులకు, అమరులకు సృష్టికర్త పోషకుడునగు ఆమాధవుడు, మునికాంతలనడుమ, అనంత శక్తులు పరివేష్టించియున్న ఆసనమందు, దేవదేవుడగు శంకరునితో కూడియున్న పార్వతీదేవినలె ప్రకాశించెను. అంతట చూచువారలనందర మాయా ప్రభావమున ముంచెత్తునటుల, శంకరుడు మాటిమాటికి నృత్యము చేయసాగెను. ఈశ్వరుని మనోభావము గుర్తెరింగి, ఆది దేవుడగు హరియు శంకరుని అనుగుణముగా అనుసరింపసాగెను.
దృష్ట్వా నారీకులం రుద్రం పుత్రాణా మపి కేశవం ।
మోహయంతం మునీశ్రేష్ఠాః కోపం సందధిదే భృశమ్ ॥
అతీవ పరుషం వాక్యం ప్రోచు ర్దేవం కపర్దినమ్ ।
శేషుశ్చ శాపై ర్వివిధై ర్మాయయా తస్య మోహితాః ॥
తపాంసి తేషాం సర్వేషాం ప్రత్యాహాన్యన్త శంకరే ।
యధాఽతి త్యప్రకాశేన తారకా నభసి స్థితాః ॥
తమస్త్రీలు అందరు రుద్రుని, పుత్రులందరు కేశవుని అనుసరించునట్లు మోహింపబడుచుండగా ముని శ్రేష్ఠులందరు అత్యంత క్రోధమును పూనిరి. కపర్దియగు ఆ దేవదేవుని అతిపరుషములగు మాటలాడిరి. ఆతనిమాయచేత ప్రభావితులై వివిధ శాప వాక్యములతో శపించిరి. సూర్య ప్రకాశమువలన ఆకాశమందు తారకలు వన్నెలేక నీలిచినట్లు, శంకరునిచే వారి తపశ్శక్తి అంతయు హరించుకొని పోయినది.
తే భగ్నతపసో విప్రాః సమేత్య వృషభధ్వజం ।
కో భవా నీతీ దేవేశం పృచ్ఛంతి స్మ విమోహితాః ॥
సోఽబ్రవీత్ భగవా నీశః తపశ్చర్తు మిహాగతః ।
ఇదానీం భార్యయా దేశే భవద్భి రిహ సువ్రతాః॥
ఆ విధముగా తపః ఫలము భగ్నమైన విప్రులందరు ఒక్కచోటచేరి, దేవేశుడగు వృషభధ్వజుని శంకరునీ “ఎవరు నీవు” అని, మోహపరవశులై అడుగసాగిరి. అంతనాతడు “సువ్రతులారా ఈ దేశమున (మిపలెనే) భార్యాసహితముగా నుండి తపమాచరింపవచ్చితిని” అని ఈశ్వరుడు సమాధానమిచ్చెను.
తస్య తే వాక్య మాకర్ణ్య భృగ్వాద్యో మునిపుంగవాః ।
ఊచుః ర్గృహీత్వా వసనం త్యక్త్వా భార్యాం తప శ్చర ॥
అపుడాతని మాటవినీ, భృగువు మొదలగు మునిపుంగవులు ఇట్లనిరి” వస్త్రము ధరింపుము భార్యను విడువుము. అప్పుడు తపమాచరింపుము".
అథోవాచ విహస్యేశః పినాకీ నీలలోహితః ।
సంప్రేక్ష్య జగతో యోనిం పార్శ్వస్థం చ జనార్దనమ్ ॥
కథం భవద్భి రుదితం స్వభార్యాపోష ణోత్సుకైః ।
త్యక్త్వాను మము భార్యేతి ధర్మజ్ఞైః శాంతమానసైః ॥
అంతట పినాకపాణి, నీలలోహితుడునగు విశ్వేశ్వరుడు, సకలజగత్తునకు ఆదిబీజమగు జనార్ధనుని, తనపార్శ్వమందు (భార్యా రూపమున) నిలిచినవానిని చూచుచు వారిని ఇట్లు అడిగెను. “మీ వంటి ధర్మజ్ఞులు, శాంతమనస్కులు, నిజదారసుతాదుల పోషణయందాసక్తులగు మోచేత, భార్యను వదలి పెట్టమని ఎట్లు పలుకబడుట.
ఋషయఊచుః-
వ్యభిచారగతా నార్యః సంత్యాజ్యాః పతినేరితాః ।
అస్మాభి రేషా సుభగా తాదృశీ త్యాగ మర్హతి ॥
ఋషులిట్లనిరి.
మావంటి మహానుభావుల నిర్దేశము ప్రకారము, వ్యభిచారరతులగు స్త్రీలు భర్తచే వీడువబడతగినవారు. అట్లే ఈమె (నీభార్య) కూడా అట్టిదే ఆమెను విడిచివేయమగును.
మహాదేవ ఉవాచః-
న కదాచి దియం విప్రా మనసా ప్యన్య మిచ్ఛతీ ।
నాహ మేనా మపి తథా విముంచామి కదాచన ॥
శివుడిట్లు పలికెను.
విప్రులారా ఈమె ఏనాడునూ అన్యులను ఎవ్వరిని మనసులో కోరలేదు. అదే విధముగా నేనును ఏనాడును, ఎట్టి స్థితియందు ఆమెను వీడువను.
ఋషయ ఊచుః-
దృష్ట్యా వ్యభిచరం తీహ హ్యస్మాభిః పురుషాధమ ।
ఉక్తం హ్యసత్యం భవతా గమ్యతాం క్షిప్ర మేవ హి ॥
“పురుషాధమా ఈమె వ్యభిచరించుట ఇక్కడ, మాకంటబడినది. నీవు అబద్ధము చెప్పితివి. వేగమే యిటనుండి వెడలిపొమ్ము”.
ఏవ ముక్తో మహాదేవః సత్య మేవ మయేరితం ।
భవతాం ప్రతిభా త్యేషే త్యుక్త్వా సౌ విచచార హ ॥
సోఽగచ్ఛ ద్ధరిణా సార్థం మునీంద్రస్య మహాత్మనః ।
వసిష్టాశ్రమపదం పుణ్యం భిక్షార్థీ పరమేశ్వరః॥
దృష్ట్వా సమాగతం దేవం భిక్షమాణ మరుంధతీ ।
వసిష్ఠస్య ప్రియ భార్యా ప్రత్యుద్గమ్య ననామ తమ్ ॥
ఋషులిట్లనిరి.
మునులు ఇట్లనగానే మహాదేవుడు “నేను సత్యమునే చెప్పితిని. కాని మీకు ఈమె అట్లు కనిపించవచ్చును,” అని చెప్పి, ఆండందు సంచరింపసాగెను. అంతట పరమేశ్వరుడు రమేశ్వరుని, వెంట నీడుకొని, భిక్షార్థియై, వసిష్ట మహాముని పుణ్యాశ్రమమునకు కదలిపోయెను. భిక్షాటనకై అట్లు తన ముంగిటికి అరుదెంచిన శంకరుని చూచి, వసిష్ఠమహర్షి ప్రియభార్య అరుంధతి ఎదురేగి నమస్కరించెను.
ప్రక్షాళ్య పాదౌ విమలం దత్వా చాసన ముత్తమమ్ ।
సంప్రేక్ష్య శిధిలం గాత్ర మభిఘాతహతం ద్విజైః ॥
సంధయామాస భేషజ్యై ర్విషణ్ణవదనా సతీ ।
చకార మహతీం పూజాం ప్రార్థయామాస భార్యయా ॥
కో భవాన్ కుత ఆయాతః కిమాచారో భవా నితి ।
ఉవాచ తాం మహాదేవః సిద్ధానాం ప్రవరోహ్యహమ్ ॥
యదేశ స్మండలం శుద్ధ భాషా బ్రహ్మమయం సదా ।
ఏషైవ దేవతా మహ్యం ధారయామి సదైవ తత్ ॥
పాదములు కడిగి, ఉత్తమము, నిర్మలమగు ఆసనమును ఇచ్చి, ఇతర మునుల దేబ్బలచే, గాయపడి శిధిలమైన ఆతని శరీరమును చూచీ, విషణ్ణవధనురాలై, సతీ అరుంధతి ఔషధములతో చికిత్సచేసెను. వారిని శ్రద్దతో పూజించెను. అంతట ఆతని భార్యను స్త్రీరూపమున ఉన్న హరీని) ఇట్లడిగెను. “అమ్మా మీరెవరు? ఎందులకీటు వచ్చితిరి? మీ ఆచారవ్యవహారములేమి?”
ఆమెకు మహాదేవుడు ఇట్లు తిరిగిపలికెను. “సిద్దు లందరిలోను శ్రేష్ఠుడను నేను. నిర్మలముగా ప్రకాశించేడి యీ బ్రహ్మమయమగు మండలమే నా ఆస్పదము. దానిని నాయందే ధరించియుందును.
ఇత్యుక్త్వా ప్రయయౌ శ్రీమా ననుగృహ్య పతివ్రతామ్ ।
తాడయాంచక్రిరే దండై ర్లోష్టభి రుషిభి ర్ద్విజాః ॥
దృష్ట్వా చరంతం గిరిశం నగ్నం వికృతలక్షణం 1
ప్రోచు రేతత్ భవాంల్లింగ ముత్పాటయతు దుర్మతే॥
తా నభ్రవీ స్మహాయోగీ కరిష్యామితి శంకరః ।
యుష్మాకం మామకే లింగే యది ద్వేషోఽభిజాయతే॥
ఇత్యుక్త్వో త్పాటయామాస భగవాన్ భగనేత్రహా ।
నాపశ్యంత క్షణేనేశం కేశవం లింగ మేవ చ ॥
తదోత్పాతో బభూవుర్హి లోకానాం భయశంసినః క ।
న రాజతే సహస్రాంశుః చచాల పృథివీ పునః ॥
నీష్ప్రభా శ్చ గ్రహా స్సర్వే చుక్షుభే చ మహోదధిః ।
అపశ్య చ్చానసూయాత్రేః స్వప్నం భార్యా పతివ్రతా ॥
కథయామాస విప్రాణాం భయా దాకులితేక్షణా ।
తేజసా ఖాసయన్ కృత్స్నం నారాయణసహాయవాన్ ॥
భిక్షమాణః శివూ నూనం దృష్టోఽస్మాకం గృహే ష్వితి ।
తస్యా వచన మాకర్ణ్య శంకమానా మహర్షయః॥
సర్వే జగ్ము ర్మహాయోగం బ్రహ్మణా విశ్వసంభవమ్ ।
ఉపాస్యమాన మలైః యోగిభి ర్భ్రహ్మవిత్తమైః ।।
చతుర్వేదై ర్మూర్తి మద్భిః సావిత్ర్యా సహితం ప్రభుం ।
ఆసీన మాసనే రమ్యే నాసాశ్చర్యసమన్వితే ॥
ప్రభాసహస్రకలితే జ్ఞానైశ్వర్యాదిసంయుతే ।
విభ్రాజమానం వపుషా సస్మితం శుభ్రలోచనమ్ ॥
చతుర్ముఖం మహాబాహుం ఛందోమయ మజం ప్రభుమ్ ।
విలోక్య వేదపురుషం ప్రసన్నవదనం శుభమ్ ॥
శిరోభి ర్థరణిం గత్వా తోషయామాసు రీశ్వరమ్ ॥
నీ ప్రసన్నమనా దేవ శ్చతుర్మూర్తి: చతుర్ముఖః ।
వ్యాజహార మునిశ్రేష్ఠః కీ మాగమనకారణమ్ ॥
తస్య తే వృత్త మఖిలం బ్రహ్మణః పరమాత్మనః ।
జ్ఞాపయాంశ్చక్రీయే సర్వే కృత్వా శిరసి చాంజలిమ్ ॥
ఇట్లు పలికి, మహాదేవుడు పతివ్రతయగు అరుంధతిని అనుగ్రహించి, బయలు పేడలెను. అంతట వికృత లక్షణములు కలిగి, నగ్నముగా తిరుగుచున్న శంకరునిచూచి, ద్విజులందరు, దండములతో, లోష్టములతో, ముష్టిఘాతములతో కోట్టిరి. మరల ఇట్లు పలికిరి. “దుర్మతీ నీవు నీ లింగమును, పెరికి వేయుము”, అనీ, అంతట మహాయోగిడుగు శంకరుడు 'నా లింగమంధు మికు ద్వేషము కలిగెనేని అట్టులే చేసెదను' అని పలికీ, భగుని నేత్రములు హరించిన భగవంతుడగు శంకరుడు తన లింగమును తానే పెరికివేసెను. ఆ క్షణములోనే, ఆ ఋషులు, బ్రాహ్మణోత్తములు
శంకరుని చూడలేదు. కేశవుని చూడలేదు. లింగమును చూడలేదు. లోకమునకు భయమును సూచించు మూత్రాతములు కూడా కలిగినది. సూర్యుడు ప్రకాశించజాలకపోయెను. భూమికంపించేను. గ్రహములన్నియు కాంతిని కోల్పోయినవి, సముద్రము అల్లకల్లోలమైనదీ. అత్రిపత్నియగు అనసూయ స్వప్నమును కొంచెను. అంతట ఆమె మేల్కాంచి, భయముతో కలవరము చెందిన చూపుగలదై, బ్రాహ్మణులతో యిట్లు చెప్పెను, “సకల జగత్తును తన తేజస్సుతో వెలిగింపచేయుచు, నారాయణుని సాయముతో, శివుడు భిక్షాటన చేయుచుండగా, మా యిండ్లలో కనబడెను. అనసూయ మాటలు వినిన మహరులందరు శంకించినవారై, జగత్ సృష్టికర్తయగు బ్రహ్మదగ్గరకు వెళ్లిరి. అచట బ్రహ్మజ్ఞానులు కలిగి పరిశుద్ధులైన యోగులచే ఉపాసించబడు వానిని, రూపుధరించిన నాల్గు వేదములతో, సావిత్రితో కూడుకొన్నవానినీ, పలు అద్భుతములకు నెలవైన సుందరమైన వేల కాంతుల వలయముతో, జ్ఞాన ఐశ్వర్యాదులతో కూడియున్న ఆసనమున ఆసీనుడగువానిని, తన దివ్య దేహకాంతితో భాసిల్లుపోనిని, దీప్తి వంతమైన కనులు గలవానీని మోమున చిరునవ్వు తళుకొత్తువానీని, మహాబాహుని, వేదమయుడు, అజుడు అయిన చతుర్ముఖునీ ప్రసన్న వదనునీ శుభంకరుని, వేదపురుషుడగు బ్రహ్మను చూచి, భూమిపై పడి శిరస్సులు వంచి ప్రణామము లాచరించి, స్తుతించిరి. అట్టి ఋషులను చూచి, చతుర్మూర్తి చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రసన్నుడై, “ముని శ్రేష్ఠులారా మిరాకకు కారణమేమి” అని అడిగెను. ఋషులందరు చేతులు జోడించి, బ్రహ్మకు జరిగిన వృత్తాంతమంతయు తెలిపిరి.
ఋషయః ఊచుః-
కశ్చి ద్దారువనం పుణ్యం పురుషోఽతీవ శోభనః ।
భార్యయా చారుసర్వోజ్గ్యా ప్రవిష్ణో నగ్న ఏవ హి॥
మోహయామాస వపుషా నారీణాం కుల మీశ్వరః ।
కన్యకానాం ప్రియా చాస్య దూషయామాస పుత్రకాన్॥
అస్మాభి ర్వివిధః శాపాః ప్రదత్తాశ్చ పరాహతాః ।
తాడితోఽస్మాభి రత్యర్థం లింగం తు వినిపాతితమ్ ॥
అంతర్హితశ్చ భగవాన్ సభార్యో లింగ మేవ చ ।
ఉత్పాతా శ్చా భవన్ ఘోరాః సర్వభూతభయంకరాః॥
క ఏష పురుషో దేవ భీతాః స్మ పురుషోత్తమ ।
భవన్త మేవ శరణం ప్రపన్నా వయ మచ్యుత ॥
త్వం హి వేత్సి జగత్యస్మిన్ యత్కించి దపి చేష్టితమ్ ।
అనుగ్రహేణ విశ్వేశ తదస్మా ననుపాలయ ॥
విజ్ఞాపితో మునిగణై ర్విశ్వాత్మా కమలోద్భవః 1
ధ్యాత్వా దేవం త్రిశూలంకం కృతాంజలి రభాషత ॥
ఋషులు ఇట్లనిరి.
“పవిత్రమైన దారువనమున అతి సుందరుడగు ఒక పురుషుడు నగ్నము? లోకోత్తర సౌందర్యవతియగు భార్యతోకలిసి ప్రవేశించెను. తన సుందర దేహముతో స్త్రీలను, మోహింపజేసెను. వారిపుత్రులను అతని ప్రియులు మోహింపచేసెను. అంతట మేము పలురకములుగా శపించితిమి. మా శాపములన్నియు విఫలమాయెను. మేము బాగు కోట్టితీమీ, ఆతని లింగమును పడగొట్టితిమి, అంతట భార్యాసహితుడైన యతడు అంతర్ధానము చెందెను. ఆ వెంటనే, సర్వప్రాణి భయంకరములగు ఘోరములగు మహెత్పాతములు సంభవించెను. ఓ పురుషోత్తమా ఈ పురుషుడెవరు? మేము భీతిచెంది యున్నాము. అచ్యుతా నీన్ను శరణువేడుచుస్నోము ఈ ప్రపంచమున జరుగు ప్రతీ చిరు కదలిక నీకు : తేలియును. కావున మమ్ములననుగ్రహించి కాపాడుము”.
ఇట్లు మునిగణము పలుకగా జగత్స్వరూపుడగు పద్మోద్భవుడు, త్రిశూలధారియగు శంకరుని ధ్యానించి, చేతులు జోడించి యిట్లు పలికెను”.
బ్రహ్మూవాచ:
హా కష్టం భవతా మద్య జాతం సర్వార్థనాశనమ్ ।
ధిగ్బలం ధీక్ తపశ్చర్యాం మిథ్యైవ భవతా మిహ ॥
సంప్రాప్య పుణ్యసంస్కారా న్నిధీనాం పరమం నిధిం।
ఉపేక్షితం వృధాచారైః భవద్భి రిహ మోహితైః॥
కాంక్షంతే యోగినో నిత్యం యతంతో యతయో నిధిం ।
యమేవ తం సమాసాద్య హా భవద్భిరుపేక్షితమ్ ॥
యజంతి వివిధై ర్యజ్ఞై ర్యత్ర్పాపై వేదవాదినః ।
మహానిధిం సమాసాద్య హా భవద్భి రుపేక్షితమ్॥
యం సమాసాద్య దేవానా మైశ్వర్య మఖిలం జగత్ ।
త మాసాద్యక్షయనిధిం హా భవద్బి రుపేక్షితమ్॥
యత్సమాపత్తిజనితం విశ్వేశత్వ మిదం మమ ।
తదేవోపేక్షితం దృష్ట్వా నిధానం భాగ్యవర్జితైః ॥
యస్మిన్ సమాహితం దివ్య మైశ్వర్యం యత్ తదవ్యయమ్ 1
త మాసాద్య నిధిం బ్రహ్మా హా భవద్భి ర్యృధాకృతమ్ ॥
ఏష దేవో మహాదేవో విజేయ స్తు మహేశ్వరః ।
స తస్య పరమం కించిత్ పదం సమధీగమ్యతే ॥
దేవతానా మృషీణాం చ పితృణాం చాపి శాశ్వతః ।
సహస్రయుగపర్యంతం ప్రళయే సర్వదేవీనామ్ ।
సంహర త్యేష భగవాన్ కాలో భూత్వా మహేశ్వరః ॥
ఏష ఏవ ప్రజాః సర్వాః సృజ త్యేకః స్వతేజసా ।
ఏష చక్రీ చ వజ్రీ చ శ్రీవత్సకృతలక్షణః ॥
యోగీ కృతయుగే దేవ స్త్రేతాయాం యజ్ఞ ఉచ్యతే ।
ద్వాపరే భగవాస్ కాలో ధర్మకేతుః కలౌ యుగే ॥
రుద్రస్య మూర్తయస్తి స్రో యాభి ర్విశ్వ మిదం తతమ్ ।
తమో హ్యగ్నీ రజో బ్రహ్మ సత్త్వం విష్ణు రీతి ప్రభుః ॥
బ్రహ్మ పలికెను.
“ఈ రోజు మీసర్వస్వము నశించినది. పెద్ద కష్టము సంభవించినది. మీ బలము వ్యర్థమైనది, మితపశ్చర్య వ్యర్థమైనది. మోహము చెందిన మీరు పుణ్యసంస్కారములను, నిధులకన్నింటికి ఉత్తమనిధిని పొంది గూడా వృధాచారములతో ఉపేక్షించితిరి. యోగులు, యతులు, తము ప్రయత్నముతో ప్రతినిత్యము కాంక్షించు నిధిని పొందికూడా మీరు ఉపేక్షించిరి, వేతనాదులు పలు యజ్ఞములతో పూజించు మహానిధిని పొందీ మీరు ఉపేక్షించితిరి. నాకు విశ్వేశ్వరత్వము ప్రసాదించిన మహానిధీని చూచి కూడా భాగ్యహీనులైన మీరు ఉపేక్షించితిరి. సకల దివ్య ఐశ్వర్యమును, తనయందు నిక్షిప్తము చేసుకొన్న, పరబ్రహ్మకు సంబంధించిన ఉత్తమనిధిని పొంది వ్యర్థపరచితిరి. మీకు కనబడిన ఆపురుషుడు మహేశ్వరుడగు మహాదేవునిగా తేలీయుడు. ఇతని పరమ పదమును ఎవరూ పొందజాలరు. దేవతలను, ఋషులను, పితృదేవతలను, కాలస్వరూపుడైన మహాదేవుడు, సహసయుగ పర్యంతము ఉండుపోరినికూడ, - ప్రళయకాలమున సంహరింప చేయును. ఇతడొక్కడే తన అద్వితీయమగు తేజస్సుతో సకల ప్రాణులను సృజించును. ఇతడే చక్రమును, వజ్రమును ధరించినవాడు. విష్ణువుతో అభేదముకలవాడు కావున శ్రీవత్సలాంఛితుడు. ఇతడే కృతయుగమున యోగిగా, త్రేతాయుగమున యజ్ఞపురుషునిగా, ద్వాపరమున కాలపురుషునిగా, కలియుగమన ధర్మకేతువుగా వ్యవహరించబడును. రుద్రుని మూడు రూపములే యీ సకల జగమును వ్యాపించియున్నవి. తమోగుణముతో అగ్ని, రజోగుణముతో బ్రహ్మ, సత్త్వగుణముతో విష్ణువుగా వ్యవహరించబడును.
మూర్తి రన్యా స్మృతా చాస్య దిగ్వాసా వై శివా ధ్రువా ।
యత్ర తిష్ఠతి తద్ర్బహ్మ యోగేన తు సమన్వితమ్ ॥
యా చాస్య పార్శ్వగా భార్యా భవద్ఫీ రభివీక్షితా ।
సా హి నారాయణో దేవః పరమాత్మా సనాతనః ॥
తస్మాత్ సర్వ మిదం జాతం తత్రైవ చ లయం ప్రజేత్ ।
స ఏవ మోహయత్ కృత్స్నం స ఏవ పరమాగతిః ॥
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ 1
ఏకశృంగో మహా నాత్మా పురాణోఽష్టాక్షరో హరీ ॥
చతుర్వేద శ్చతుర్మూర్తి స్త్రీమూర్తి స్త్రిగుణః పరః ।
ఏకమూర్తి రమేయాత్మా నారాయణ ఇతి శ్రుతిః ॥
ఋతస్య గర్భో భగ నాపో మాయాతనుః ప్రభుః ।
స్తూయతే వివిధై ర్మంత్రైః బ్రాహ్మణే ర్థర్మకాంక్షిభిః ॥
సంహృత్య సకలం విశ్వం కల్పాంతే పురుషోత్తమః ।
శేతే యోగామృతం పీత్వా యత్ తత్ విష్ణోః పరం పదమ్ ॥
న జీయతే న మ్రియతే వర్ధతే నచ విశ్వసృక్ ।
మూలప్రకృతి వ్యక్తా గీయతే వైదికై రజః ॥
తతో నిశాయాం వృత్తాయాం సిసృక్షు రఖిలం జగత్ ।
అజస్య నాభో తద్బీజం క్షిపత్యేష మహేశ్వరః ॥
తం మాం విత్త మహాత్మానం బ్రహ్మాణం విశ్వతోముఖమ్ ।
మహాంతం పురుషం విశ్వ మపాం గర్భ మనుత్తమమ్ ॥
న తం విత్త స్వజనకం మోహితా స్తస్య మాయయా ।
దేవదేవం మహాదేవం భూతానా మీశ్వరం హరమ్ ॥
ఏష దేవో మహాదేవో ప్యనాది ద్భగవాన్ హరః ।
విష్ణునా సహ సంయుక్తః కరోతి వికరోతి చ ॥
న తస్య విద్యతే కార్యం న తస్మాత్ విద్యతే పరం ।
స వేదాన్ ప్రదదౌ పూర్వం యోగమాయాతను ర్మమ ॥
స మాయీ మాయయా సర్వం కరోతి వీకరోతి చ ।
త మేవ ముక్తయే జ్ఞాత్వా ప్రజేత శరణం భవమ్॥
ఇతీరితా భగవతా మరీచిప్రముఖా విభుం ।
ప్రణన్యు దేవం బ్రహ్మాణం పృచ్ఛంతి స్మ సుదుఃఖితాః॥
ఇతని మరియొక మూర్తి దిగంబరమూర్తి. ఈ మూర్తినే శివుడందురు. ఇదియే ధృవము. శాశ్వతము. ఈ మూర్తి యందే యోగముతో కూడిన పరబ్రహ్మ నివసించియుండును. ఆ పురుషుని ప్రక్కన అతని భార్యగా మీరు చూచిన స్త్రీమూర్తి సనాతనుడు పరమాత్మయగు శ్రీ మన్నారాయణుడు. ఈ జగత్తంతయు అతని నుండే పుట్టుచున్నది. అతనియందే లయము అగుచున్నది, సకల జగత్తును అతడే మోహింప చేయుచున్నోడు, సకల జగత్తుకు అతడే పరమగతి. అతడే వేయి శిరములు, వేయి నేత్రములు, వేయి పాదములు గలవాడు ఇతను ఏకశృంగధారి, (వరాహము) పరమాత్మ, పురాణపురుషుడు. అక్షరములగు అష్టస్వరూపములు గలవాడు (అష్టాక్షరుడు) ఇతడేహం, చతుర్వేదస్వరూపుడు. ఇతడే చతుర్మూర్తి త్రిమూర్తి. త్రిగుణాత్మకుడు ఏకమూర్తి, ఇంత అని కొలువలేని స్వరూపము గలవాడు. నారాయణునిగా ప్రసిద్ధుడు. మాయతో పలు --రూపములు ధరించువాడు. జలమును తనకధారముగా స్వీకరించువాడు (సోర + అయన ధర్మమును మోక్షమును కోరువారు వివిధ బ్రాహ్మణ మంత్రములతో ఇతనినే స్తుతింతురు. ప్రళయకాలమున ఈ పురుషోత్తముడే సకల ప్రపంచమును ఉపసంహరించి, యోగామృతమును పానము చేసి నివసించు ఉత్తమ స్థానమే శ్రీమహావిష్ణువు పరమపదము. ఇతడు పుట్టడు, పెరుగడు. మరణించడు. సకలజగత్ సృష్టికర్తయితడే ఇతడే అవ్యక్తమగు మూలప్రకృతీయని వేదజ్ఞులు గానము చేయుదురు.
ప్రళయకాలము ముగిసిన తరువాత సకలజగత్తును సృష్టించదలచి, విరాట్పురుషునీ నాభిలో బీజమును నిక్షేపించునది ఈ మహేశ్వరుడే ఆ హిరణ్యగర్భుడు మీ ఎదురుగా ఉన్న నేనే నన్నే చతుర్ముఖుడు, బ్రహ్మ, మహాపురుషుడు, సకల స్థూలజల అధిష్టాతగా తెలియుదురు. ఆ మహేశ్వరుని మాయతో మోహింపబడినవారు నా జనకుని తెలియజాలరు.. నా ఉత్పత్తిమూలము, సకలభూతములకు ఈశ్వరుడు దేవదేవుడైన హరుడగు మహాదేవుడే అనాదియగు యీ మహాదేవుడే, విష్ణువుతో కలిసీ, జగత్తును సృష్టించును, లయించును. సృష్టిలయములతో అతనికి ఏమి పనీయులేదు. అతని కంటే పరమము మరియొకటి లేదు. యోగమాయా స్వరూపుడగు అతడే నాకు పూర్వము వేదముల నీచ్చేను, అతడే మాయతో కూడి జగత్ సృష్టిలయములు చేయును. అమహాదేవునీ తెలిసి, ముక్తికొరకు అతనినే శరణువేడవలెను. ఇట్లు చతుర్ముఖబ్రహ్మ
పలుకగా మరీచి మొదలగు మహారులు దేవదేవుడగు బ్రహ్మకు నమస్కరీంచి, బహు దుఃఖితులై యిట్లు అడుగసాగిరి.
మునయ ఊచుః
కథం పశ్యేమ తం దేవం పున రేవ పినాకీనమ్।
బ్రూహి విశ్వామరేశాన త్రాతా త్వం శరణైషిణామ్ ॥
మునులిట్లనిరి.
ఉభయలోకములకు ప్రభువగు బ్రహ్మదేవా శరణార్థులమగు మాకు నీవేరక్షకుడవు. ఆదేవదేవుని, పినాకపాణిని మరల మరొక్కసారి ఎటుల కనుగొన గలము? తెలుపుము.
పితామహ ఉవాచః-
యత్ దృష్టం భవతో తస్య లింగం హి పతితం భువి ।
తల్లీంగానుకృతీ శస్య కృత్వా లింగ మనుత్తమమ్ ॥
పూజయధ్వం సపత్నీకాః సాదరం పుత్రసంయుతాః ।
వైదికై రేవ నీయమై ర్వివిధైః బ్రహ్మచారిణః॥
సంస్థాష్య శాంకరై ర్మంత్రైః ఋగ్యజుస్సామసంభవైః ।
తతః పరం సమాస్థాయ గృణన్తః శతరుద్రీయమ్ ॥
సమాహితః పూజయధ్వం సపుత్రాః సహబంధుభిః 1
సర్వే ప్రాంజలయో భూత్వా శూలపాణిం ప్రపశ్యథ ।
తతో ద్రక్ష్యథ దేవేశం దుర్దర్శ మకృతాత్మభిః ।
యం దృష్ట్వా సర్వ మజ్ఞాన మనర్థశ్చ ప్రణశ్యతి 11
బ్రహ్మ పలికెను.
మునులారా నేలపై పడిన పరమేశ్వరుని ఏ లింగమును మీరు చూచితిరో, అట్టి లింగాకృతిని శ్రేష్ఠమగు రూపమును నిర్మించి, గౌరవ భావముతో, బ్రహ్మచర్యము నవలంబించి, వైదీక నీయమములు పాటించుచు, భార్యాపుత్రులతో కలిసి పూజించుడు. శివలింగమును స్థాపించి, ఋగ్ యజుస్ సామవేదముల యందలి రుద్రమంత్రములతో, తపము చేయుచు, శతరుద్రీయమును సదాపఠించుచు, పుత్రులతో, బంధువులతో, ఏకాగ్రచిత్తముతో, చేతులు జోడించి పినాకపాణియగు శంకరుని శరణువేడుడు. నియతాత్ములు కానివారు భక్తులు కానివారికి దర్శింపరాని స్వామీ శంకరుని మీరు అపుడు చూడగలుగుదురు. ఆతని దర్శించి అజ్ఞానము, అధార్మిక బుద్ధీ అంతయు నశించును.
తతః ప్రణమ్య వరదం బ్రహ్మాణ మమతౌజసమ్ ।
జగ్ముః సంహృష్టమనసో దేవదారువనం పునః ॥
ఆరాధయితు మారబ్దా బ్రహ్మణా కధితం యధా ।
అఙానంతః పరం దేవం వీతరాగాః విమత్సరాః ॥
స్థండిలేషు విచిత్రేషు పర్వతానం గుహాసు చ ।
సదీనాం చ వివిక్తేషు పులినేషు శుభేషు చ॥
అంతట ఋషులందరు అమితతేజశ్శాలియు వరములిచ్చెడివాడగు బ్రహ్మకు నమస్కరించి, సంతుష్టమనస్కులై తిరిగి దేవదారువనమునకు వెళ్లిరి. వారు శంకరుని యథార్థతత్త్వము, రూపము తెలియనివారైనను, రాగమువీడి, మత్సరము వదిలించుకొని, బ్రహ్మ తెలిపిన విధముగా, సాధారణ సమతలముపై, నిర్మించినవేదికలపై, పర్వతముల గుహలలో, నదీ తీరములందు, ఏకాంత సైకతముల, శుభకర ప్రదేశములయందు శివుని ఆరాధింప మొదలిడిరి.
శైవాలభోజనాః కేచిత్ కేచి దంతర్జలేశయాః।
కేచి ద భ్రావకాశాస్తు పాదాంగుష్ఠాగ్రనిష్ఠితః ॥
దాంతోలూఖలినస్త్వన్యే హ్యశ్మకుట్టా స్తధాసరే ।
శౌకపర్ణాశినః కేచిత్ సంప్రక్షాళా మరీచిపాః ॥
వృక్షమూలనీకేతాశ్చ శిలాశయ్యా స్తధాపరే ।
కాలం నయంతి తపసా పూజయంతో మహేశ్వరమ్ ॥
కొందరు నాచు భుజించుచు, కొందరు నీటియందు శయనముద్రతో, కొందరు బాహ్యప్రదేశమున ఆకాశముక్రింద, కొందరు పాదముల బోటన వ్రేలిషైనీలిచి, కొందరు దంతములతో ధాన్యపు గింజలు వలుచుకోనుచు, కొందరు ఫోళ్లపై ధాన్యము కొట్టుకొని తినుచు, దొరికిన శాకముల ఆకులు తినుచు కోందరు, కొందరు స్నానముచేసి సూర్యకిరణములను త్రాగుచు, వృక్షమూలముల నివసించుచు కొందరు, కొందరు శిలాతలముల నిద్రించుచు, మహేశ్వరుని పూజించుచు, కాలము గడుపసాగిరి.
తత స్తేషాం ప్రసాదార్థం ప్రపన్నార్తిహరో హరః।
చకార భగవాన్ బుద్ధిం ప్రబోధాయ వృషధ్వజః ।।
దేవః కృతయుగే హ్యస్మిస్ శృంగే హిమవతః శుభే ।
దేవదారువనం ప్రాప్తః ప్రసన్న: పరమేశ్వరః ॥
భస్మపాం దురదిగ్ధాంగో నగ్నో వీకృతలక్షణః ।
ఉల్ముకవ్యగ్రహస్తశ్చ రక్తపింగళలోచనః ॥
అంతట ప్రపన్నులగువారీ ఆర్తిని తొలగించెడి హరుడు, వృషభధ్వజుడు శంకరభగవానుడు వారిని అనుగ్రహించదలచి, వారిని ప్రబోధించుటకు నిశ్చయించుకొనెను. కృతయుగమున, ఈ హిమాలయ శృంగమున, శుభకరమగు ప్రదేశమున, ప్రసన్నుడైన పరమేశ్వరుడు దేవదారువనమును చేరుకొనెను. అపుడాతడు భస్మము అలదుకొనుటచే తెల్లగా మెరయు శరీరముతో, నగ్నముగా నుండి, వికృత లక్షణములు కలిగి, చేతియందు మండెడు కొరవిని ధరించి, ఎరుపు పసుపు రంగుకన్నులతో నుండెను.
క్వచి చ్చ హసతే రౌద్రం క్వచిత్ గాయతి వీస్మితః ।
క్వచి న్నత్యతి శృంగారీ క్వచిత్ గౌతీ ముహుర్ముహుః॥
ఆశ్రమేఽభ్యాగతో భిక్షాం యాచతే చ పునః పునః ।
మాయాం కృత్వాత్మనో రూపం దేవ సద్వన మాగతః ॥
కృత్వా గిరిసుతాం గౌరీం పార్వే దేవః పినాకధృక్ ॥
సా పూర్వవత్ చ దేవేశ దేవదారువనం గతా ।
ధృష్ట్వా సమాగతం దేవం దేవ్యా సహ కపర్దినమ్ ॥
ప్రణేముః శిరసా భూమౌ తోషయామాసు రీశ్వరమ్ ॥
వైదికై ర్వివిధై ర్మం త్రైః సూ క్తైః మాహేశ్వరైః శుభైః ।
అధర్వశిరసా చాన్యే రుద్రాద్యై ర్ర్బహ్మభి ర్ముహుః ॥
నమో దేవాదిదేవాయ మహాదేవాయ తే నమః ।
త్రియంబకాయ నమ స్తుభ్యం త్రిశూలవరధారిణే॥
నమో దీగ్వాససే తుభ్యం వికృతాయ పినాకినే ।
సర్వప్రణతదేవాయ స్వయ మప్రణతాత్మనే ॥
అంతకాంతకృతే తుభ్యం సర్వసంహరణాయ చ ।
నమోఽస్తు నృత్యజీలోయ నమో భైరవరూపిణే॥
నరనారీశరీరాయ యోగినాం గురవే నమః ।
నమో దాంతాయ శాంతాయ తాపసాయ హరాయ చ ॥
విభీషణాయ రుద్రాయ నమస్తే కృత్తివాససే ।
నమస్తే లేలిహాసాయ శితికంఠాయ తే నమః ॥
అఘోరరూపాయ నమో వామదేవాయ వై నమః ।
నమః కనకమాలాయ దేవ్యాః ప్రియకరాయ చ ॥
గంగాసలిలధారాయ శంభవే పరమేష్ఠినే ।
నమో యోగాధిపతయే బ్రహ్మాధిపతయే నమః ॥
ఒకచోట భయంకరముగా నవ్వును. ఒకచో ఆశ్చర్యము నొందిగానము చేయును. ఒకచో శృంగారరసమును వ్యక్తపరచుచు నృత్యము చేయును. ఒకచో మాటిమాటికి ఏడ్చుచుండును. ఆశ్రమమునకువచ్చి మాటి మాటికి భిక్షాటన గావించుచుండెను. ఇట్లు తనను మాయారూపునిగా కనబరచుచు మహాదేవుడు ఆ వనమునకు వచ్చేను. గిరిసుతయగు పార్వతిని ప్రక్కనీడుకొని పీనాకపాణి వచ్చెను. ఆమెకూడా పూర్వమువలే దేవదారువనమునకు వచ్చేను. ఇట్లు పార్వతీదేవితో వచ్చిన మహాదేవుని చూచిన మునులు శిరసువంచి భూమిమీద ప్రణమిల్లి ఈశ్వరునిస్తుతించు సాగిరి. వివిధ వైదిక మంత్రములతో మహేశ్వరసూక్తముతో కొందరు. అధర్వ మంత్రములతో శతరుద్రీయములతో కొందరు స్తుతించిరి.
దేవాది దేవునకు నమస్కారము. మహాదేవునకు నమస్కారము. త్ర్యంబకునకు ఉత్తమ శూలధారికి నమస్కారము, దిగంబరునకు వికృతు నకు పినాకపాణికి నమస్కారము. నమస్కరించినవారికి ఆశ్రయభూతునకు, ఆశ్రయరహితునకు నమస్కారము. అంతకుని అంతము చేసిన వానికీ సర్వసంహారకునకు నమస్కారము. నృత్యశీలునకు భైరవమాలికి నమస్కారము. అర్ధనారీశ్వరునకు యోగి గురువు నకు నమస్కారము. దాంతునకు శాంతునకు తాపసునకు హరునకు నమస్కారము. సకల భయంకరునకు రుద్రునకు కృత్తివాసునకు నమస్కారము. లేలిపోనునకు శీతీకంఠునకు అఘోరఘోరరూపునకు వామదేవునకు నమస్కారము. కనకనూలునకు దేవీప్రియకరునకు నమస్కారము. గంగా సలిలధారునకు శంభునకు పరమేష్ఠికీ నమస్కారము. యోగాధిపతికి బ్రహ్మాధిపతికి నమస్కారము.
ప్రాణాయ చ నమ స్తుభ్యం నమో భస్మాంగరాగిణే ।
నమస్తే ఘనవాహాయ దంష్ట్రిణే వహ్నిరేతసే॥
బ్రహ్మణశ్చ శిరోహర్త్రే నమస్తే కాలరూపిణే ।
ఆగతిం తే స జానీమో గతిం నైవ చ నైవ చ ॥
విశ్వేశ్వర మహాదేవ యోఽసి సోఽ సీ నమోస్తుఽ తే ॥
నమః ప్రమథనాధాయ దాత్రే చ శుభసంపదామ్ ।
కపాలపాణయే తుభ్యం నమో మిధుష్టమాయ తే ॥
నమః కనకలింగాయ వారిలింగాయ తే నమః ॥
నమో వ హ్న్యకరలింగాయ నలింగాయ తే నమః ।
నమో భుజంగహారాయ కర్ణికారప్రియాయ చ ॥
కిరీటినే కుండలినే కొలకాలాయ తే నమః ॥
వామదేవ మహేశాన దేవదేవ త్రిలోచన ।
క్షమ్యతాం యత్కృతం మోహాత్ త్వమేవ శరణం హి నః॥
చరితాని విచిత్రాణి గుహ్యానీ గహనాని చ ।
బ్రహ్మాదీనాం చ సర్వేషాం దుర్విజ్ఞేయోఽసీ శంకర ॥
అజ్ఞానాద్ యదీవా జ్ఞానాత్ యత్కించిత్ కురుతే నరః ।
తత్సర్వం భగవా నేవ కురుతే యోగమాయయ॥
ఏవం స్తుత్వా మహాదేవం ప్రహృష్టే నాంతరాత్మనా ।
ఊచుః ప్రణమ్య గీరీశం పశ్యామ స్త్వాం యధా పురా ॥
తేషాం సంస్తవ మాకర్ణ్య సోమః సోమవిభీషణః ।
స్వ మేవ పరమం రూపం దర్శయామాస శంకరః॥
తం తే దృష్ట్వా చ గిరీశం దేవ్యా సహ పినాకీనం।
యధాపూర్వం స్థితా విప్రాః ప్రణేము ఝృష్టమానసాః ॥
తత స్తే మునయః సర్వే సంస్తూయ చ మహేశ్వరం ।
భృగ్వంగీరో వసిష్ఠాస్తు విశ్వామిత్ర స్తథైవ చ ॥
మరీచిః కశ్యప శ్చాపి సంవర్త శ్చ మహాతపాః ।
ప్రణమ్య దేవదేవేశ మిదం వచన మబ్రవీత్ ॥
ప్రాణభూతునకు భస్మాంగ రాగునకు నమస్కారము. ఘనవాహునకు దంష్టికి వహ్నిరేతునకు బ్రహ్మశిరోహరునకు కాలరూపికీ నమస్కారము. నీరాకను పోకను మేము తెలియజాలము. విశ్వేశ్వరా మహాదేవా నీ స్వస్వరూపమునకు నమస్కారము. ప్రమధనాధునకు శుభసంపత్ర్పడునకు నమస్కారము. కపాలపాణికి మీఢుష్టమునకు నమస్కారము. కనకలింగునకు పొరీలింగునకు నమస్కారము. వహ్ని అర్కలీంగునకు జ్ఞాన లింగునకు నమస్కారము. భుజగహారునకు కర్ణికారప్రియునకు కీరీటికి కుండలికీ కాలకాలునకు నమస్కారము. వామదేవ మహేశానా. దేవదేవ త్రిలోచనా మోహము వలనమేము చేసిన దానిని క్షమించుడు మీరే మాకు రక్షకులు. నీ చరితము విచిత్రము. రహస్యమును బోధపడనీది. బ్రహ్మాది సకల దేవతలకు తెలియరానీవాడవు. మానవుడు అజ్ఞానముతో కానీ జ్ఞానముతోకాని చేయునదంతయు యోగమాయతో తాము చేయించునది. ఇట్లు సంతుష్టాంతరంగులై మహాదేవునిస్తుతించి నమస్కరించి మేము తమ యథాపూర్వరూపమును చూడగోరుచున్నాము అని పలికిరి.
ఇట్లు వారు చేసిన స్తోత్రమును వీని చంద్రభూషణుడు ఉమాసహితుడగు శంకరుడు తమ పరమరూపమును ప్రదర్శించేను. ఇట్లు పార్వతితో కూడిఉన్న శంకరుని దర్శించి యధాపూర్వకముగా నిలిచి సంతోషించిన మనసుతో నమస్కరించిరి. అంతట మునులందరు మహేశ్వరుని స్తుతించి, భృగు, అంగిర వసిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, అత్రి, సుకేశ, పులస్త్య, పులహ, క్రతు, మరీచి, కశ్యపులు మహాతపస్వీయగు సంవర్తుడు, దేవదేవునికి నమస్కరించి యిట్లు పలికిరి.
కథం త్వాం దేవదేవేశ కర్మయోగేన వా ప్రభో ।
జ్ఞానేన వాథ యోగేన పూజయామః సదైవ హి ॥
కేన వా దేవ మార్గేణ సంపూజ్యో భగవా నీహ ।
కీం చ సేవ్య మసేవ్యం వా సర్వ మేతత్ బ్రవీహి నః ॥
దేవదేవేశా నిన్ను కర్మయోగముచే, జ్ఞానయోగముచేగాని,లేదా, ఇతర ఉపాయము ఏ ఉపాయముతో పూజించవలెను నిన్ను పూజించు ఉత్తమ మార్గమేది ఈ లోకమున సేవించదగినది ఏది? వీడువతగినది ఏది?ఈ విషయమును తెలుపుడు.
దేవదేవ ఉవాచః।
ఏతద్వః సంప్రవక్ష్యామి గూడం గహన ముత్తమమ్ ॥
బ్రహ్మణే కథితం పూర్వ మాదా వేవ మహర్షయః।
సాంఖ్యయోగో ద్విధా జేయః పురుషాణాం హి సాధనం ॥
యోగేన సహితం సాంఖ్యం పురుషాణాం విముక్తిదమ్ ।
న కేవలేన యోగేన దృశ్యతే పురుషః పరః ।
జ్ఞానం తు కేవలం సమ్య గపవర్గఫలప్రదమ్ ॥
భవంతః కేవలం యోగం సమాశ్రిత్య విముక్తయే ।
విహాయ సాంఖ్యం విమల మకుర్వన్త పరిశ్రమమ్ ॥
ఏతస్మాత్ కారణాత్ విప్రో నృణాం కేవలధర్మణాం ।
ఆగతోఽహా మీమం దేశం జ్ఞాపయన్ మోహ సంభవమ్ ॥
తస్మా ద్భవద్భి ర్విమలం జ్ఞానం కైవల్యసాధనం ।
జ్ఞాతవ్యం హి ప్రయత్నేన శ్రోతవ్యం దృశ్య మేవ చ ॥
ఏకః సర్వత్రగో హ్యాత్మా కేవల శ్చిత్తమాత్రకః।
ఆనందో నిర్మలో నిత్యం స్యా దేతత్ సౌంఖ్యదర్శనమ్ ॥
ఏత దేవ పరం జ్ఞానం తేన మోక్షోత్ర గీయతే ఏతత్।
కైవల్య మమలం బ్రహ్మభావ శ్చ వర్ణిత॥
ఆశ్రీత్య చైతత్ పరనుం తన్నిషా స్తత్పరాయణాః ।
పశ్యంతి మాం మహాత్మానో యతయో విశ్వ మిశ్వరమ్॥
ఏతత్ తత్ పరమం జ్ఞానం కేవలం సన్నిధంజనం ।
అహం హీ వేద్యో భగవాన్ మమ మూర్తి రీయం శివా ॥
బహూని సాధనా నీహ సిద్ధయే కథితాని యే ।
తేషా మభ్యధికం జ్ఞానం మామకం ద్విజపుంగవాః ॥
జ్ఞానయోగరతాః శాన్తా మా మేవ శరణం గతాః ।
యేహి మాం భస్మనిరతా ధ్యాయంతి సతతం హృది ॥
మద్భక్తిపరమా నిత్యం యతయః క్షీణకల్మషాః ।
నాశయా మ్యచిరాత్ తేషాం ఘోరం సంసారసాగరమ్ ॥
శివుడు చెప్పెను.
అతి రహస్యము, దుర్బోధము, అయిన ఈ విషయము మీకు చెప్పుచున్నాను. దీనినే మొదలు బ్రహ్మకు చెప్పితిని. పురుషులకు సాధనమగు సాంఖ్యయోగము రెండు విధములుగా నుండును. ఆసక్తిలేని కర్మయోగము, జ్ఞానయోగము, ముక్తిప్రదములు. కేవల యోగముతో పరమపురుషుడు సాక్షాత్కరించడు. జ్ఞాన యోగము మాత్రము అపవర్గము నీయగలదు. మీరు కేవలము కర్మయోగము నాశ్రయించి, జ్ఞానమును విడిచిపెట్టి, ముక్తికొరకు పరిశ్రమించుచున్నారు. కావుననే నేను కేవలము కర్మయోగము నాశ్రయించుపోరికీ మోహమువలన కలుగు అనర్థమును తెలియచేయు టకు, ఇచటీకి వచ్చితిని. కావున మీరు కైవల్యసాధనమైన పరిశుద్ధమైన జ్ఞానమునకు ప్రయత్నించవలెను. తెలియవలయును. వీనవలయును. చూడవలయును. ఆత్మ ఒక్కటే, సర్వవ్యాపీ. విశుద్ధము, జ్ఞాన ఆనందస్వరూపము. నిత్యము ఇది జ్ఞాన నీషుల సిద్ధాంతము. ఇదియే పరమజ్ఞానము. ఇదే పరిశుద్ధమైన మోక్షము. దీనినే కైవల్యమని బ్రహ్మభావమని చెప్పుదురు. ఈ జ్ఞానము నాశ్రయించి, దీనియందు మాత్రమే బుద్దీనిలిపి, ఈ స్వరూపమునే ధ్యానించుచు, సకల జగత్స్వరూపునిగా యతులు నన్నుచూతురు. ఇదియే పరచు జ్ఞానము, నీరంజనము, తెలియదగినవాడను నేనే. శుభప్రదమైన మూర్తీనాదే సిద్దికి చాలా సాధనములు చెప్పబడినను, వాటన్నింటిలో సో జ్ఞానమే ఉత్తమమైనది. జ్ఞానయోగరతులు, శాంతులు, సన్నే శరణము పొందెదరు. వారు ఎపుడు హృదయమున నన్నే ధ్యానము చేయుచుందురు. నాభక్తియందే మనస్సు నిలిపీ, మనోనిగ్రహము కలిగి, సకల పాపములను తొలగించుకొందురు. అటువంటి వారికి సంసార సాగరమును నేనే తొలగింతును.
ప్రశాంతః సంయుతమనా భస్మోద్ధూళితవిగ్రహాః ।
బ్రహ్మచర్యరతో నగ్నో వ్రతం సౌశుపతం చరేత్॥
నిర్మీతం హి మయా పూర్వం వ్రతం పాశుపతం పరం ।
గుహ్యాక్ గుహ్యతమం సూక్ష్మం వేదసారం విముక్తయే ॥
యద్వా కౌపీనవసనః స్యా ద్వైక వసనో మునిః ।
వేదాభ్యాసంతో విద్వాన్ ధ్యాయేత్ పశుపతిం శివమ్ ॥
ఏష పాశుపతో యోగః సేవనీయో ముముక్షుభిః ।
భస్మచ్ఛన్నై ర్హి సతతం నిష్కామై రీతి విశృతిః ॥
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవానేన యోగేన పూతా మద్భావ మాగతాః ॥
అన్యానీ చైవ శాస్త్రాణి లోకేబిస్మిస్ మోహనానితు ।
వేదవాద విరుద్ధాని మయైవ కథితానీ తు ॥
వామం పాశుపతం సోమం లాకులం చైవ భైరవం ।
అసవ్య మేతత్ కథితం వేదబాహ్యం తదేతధత్ ॥
వేదమూర్తి రహం విప్రా నాన్యశాస్త్రార్థవేదిభిః ।
జ్ఞాయతే మత్స్వరూపంతు ముక్త్వా వేదం సనాతనమ్ ॥
స్థాపయథ్వ మిమం మార్గం పూజయంతో మహేశ్వరమ్ ।
అచిరా దైశ్వరం జ్ఞాన ముత్పత్స్యతి న సంశయః ॥
మయి భక్తిశ్చ విపులా భవతో మస్తు సత్తమాః ।
ధ్యాతమాత్రో హి సాన్నిధ్యం దాస్యామి మునిసత్తమాః ॥
ఇత్యుక్త్వా భగవాన్ సోమ స్తత్రైవా తరధీయత ।
తేపి దారువనే తస్మిన్ పూజయంతి స్మ శంకరమ్।
బ్రహ్మచర్యరతాః శాంతిః జ్ఞానయోగపరాయణాః ॥
సమేత్య తే మహాత్మానో మునయో బ్రహ్మవాదినః ।
వితేనిరే బహూన్ వాదా నధ్యాత్మజ్ఞానసంశ్రయాన్ ॥
కి మధ్య జగతో మూల మాత్మా చాస్మాక మేవ హి ।
కోపి స్యాత్ సర్వభావానాం హేతు రీశ్వర ఏవ చ॥
ఇత్యేవం మన్యమానానాం ధ్యానమార్గావలంబినామ్ ।
ఆవిరాసీ స్మహాదేవీ దేవీ గిరివరాత్మజా ॥
ఆజ్ఞానులు భస్మధూసరిత శరీరులై, మనోనిగ్రహము కలిగి, ప్రశాంతులై, బ్రహ్మచర్యవ్రతపరాయణులై, దిగంబరముగానుండి, పాశుపత వ్రతమును ఆచరింతురు. ఈ పాశుపత ప్రతము పరమ రహస్యము, సూక్ష్మము, వేదసారము. దీనిని నేనే ముక్తికొరకు పూర్వము ఏర్పరచితిని. లేదా కౌపీనమును ధరించినవాడుగానీ, ఏకవస్త్రధారికానీ కావలయును. వేదాభ్యాసరతుడై, నా తత్త్వమును బాగా ఎరిగి, పశుపతియగు శివుని ధ్యానించవలయును. మోక్షమును కోరువారు ఈ పాశుపత యోగమును సేవించవలయును. వీరు భస్మపూతశరీరులై కామరహితులై రాగమును, భయమును క్రోధమును వదిలిపెట్టి, నాయందే మనసు నిలిపి, నన్నే ఆశ్రయించి యుండవలయును. ఈ పాశుపత యోగముతో చాలామంది పరిశుద్ధులై, నా సారూప్యమును పొందిరి. ఇతరములైన శాస్త్రములు ఈ లోకములో జీవులను మోహింపచేయునవి, వేదపాదములకు విరుద్ధములైనవి చాలా కలవు. మోహింపచేయుటకు పోటినికూడో నేనే చెప్పితిని. వామ మార్గము, వామ పాశుపతము, సోమము, లాకులము, భైరవము, ఇంకా ఇతరములు చాలా కలవు. ఇవన్నియు వేదబాహ్యములుగా చెప్పబడినవి. వీటిని సేవించరాదు. నేను వేదమూర్తినీ. ఇతర శాస్త్రములు తెలిసినవారు, సనాతన వేదమును విడిచినవారు నన్నుతెలియజాలరు. కావున నేను చెప్పిన యీ మార్గమును చక్కగా ప్రతిష్టింపుడు. చక్కగా మహేశ్వరుని పూజింపుడు. త్వరలోనే పరమేశ్వరజ్ఞానము కలుగును. నాయందు విపులమైన భక్తికూడా కలుగుగాక మీరు ధ్యానించిన వెంటనే నేను సాక్షాత్కరించెదను. ఇట్లు పలికి, ఉమాసహితుడైన శంకరుడు అక్కడే అంతర్థానము చెందెను. ఆ ఋషులు కూడా బ్రహ్మచర్యరతులై, శాంతులై జ్ఞానయోగ పరాయణులై, బ్రహ్మవాదులై, మునులందరు కలిసి, దారువనమున శంకరుని పూజించుచుండిరి. అధ్యాత్మ జ్ఞానమునకు సంబంధించిన పలుసిద్ధాంతములను వ్యాపింపచేసిరి. “ఈ ప్రపంచమునకు మూలమేమి? మన ఆత్మయే అన్ని పదార్ధములకు కారణము ఎవరు? ఈశ్వరుడే” ఇట్లు భావించుచు ధ్యానమార్గమును అనుసరించిన ఆ మహరులకు పర్వత రాజపుత్రిక యగు మహాదేవి సాక్షాత్కరించెను.
కోటిసూర్యప్రతీకాశా జ్వాలామాలాసమావృతా ।
స్వభాభి ర్విమలాభి స్తు పూరయంతీ నభస్థలమ్॥
తా మన్వపశ్యన్ గిరిజా మమేయం జ్వాలాసహస్రాంతరసంనివిష్టామ్।
ప్రణేము రేకా మఖిలేశపత్నీం జానంతి తే తత్ పరమస్య బీజమ్ ॥
అస్మాక మేషా పరమేశపత్నీ గతి స్తధాత్మా గగనాభిధానా ।
పశ్య న్యధాత్మాన మిదం చ కృత్స్నం తస్యా మథైతే మునయశ్చ విప్రాః ॥
నిరీక్షితా స్తే పరమేశపత్యా తదంతరే దేవ మశేష హేతుమ్।
పశ్యంతి శంభుం కవి మిశీతారాం రుద్రం బృహంతం పురుషం పురాణమ్ ॥
ఆలోక్య దేవీ మడ దేవమీశం ప్రణీము రానంద మహాపు రగ్ర్యమ్ ।
జ్ఞానం తదైశంభగవత్రసాదాత్ ఆవిర్బభౌ జన్మవినాశకేతు ॥
ఇయం హి సా జగతో యోని రేకా సర్వాత్మికా సర్వనియామీకా చ ॥
మహేశ్వరీ శక్తి రసోదీసిద్ధా వ్యోమాభిధానా దీవి రాజతీవ ।
అస్యాం మహత్ పరమేష్టి పరస్తాత్ మహేశ్వరః శివ ఏకోథ రుద్రః॥
చకార విశ్వం పరశక్తినిషాం మాయా మథారుహ్య స దేవదేవః।
ఏకో దేవః సర్వభూతేషు గూఢః మాయీ రుద్రః సకలో నిష్కలశ్చ॥
సఏవ దేవీ న చ తద్విభిన్నమ్ ఏతజ్ఞాత్వా హ్యమృతత్వం ప్రజంతి ।।
అంత ర్హితో భూత్ భగవా నధేశో దేవ్యా భర్గ సహ దేవాదిదేవః ॥
ఆరాధయస్తి స్మ తమేవ దేవం వనౌకస స్తే పునరేవ రుద్రమ్॥
ఏతత్ వః కథితం సర్వం దేవదేవ విచేష్టితం।
దేవదారు వనే పూర్వం పురాణే యన్మయా శ్రుతమ్॥
.యః పఠేత్ శ్రుణుయాత్ నిత్యం ముచ్యతే సర్వపాతకైః।
శ్రావయేత్ వా ద్విజాన్ శాంతాన్ స యాతి పరమాం గతిమ్॥
ఇతి శ్రీకూర్మపురాణే ఉత్తరార్ధే సప్తత్రింశోధ్యాయః
ఆ పార్వతీదేవి కోటిసూర్యసమానకాంతిగలది, తేజోరాశితో కూడియున్నదీ, పరిశుద్ధమైన కాంతులతో ఆకాశము నింపుచున్నది, ప్రమాణముల కందనిది, వేలతేజోరాశుల మధ్య నివసించునదగు గిరిజను చూచిన ఆమునులు, అఖిలేశపత్నికి నమస్కరించిరి. ఆమెయే మహేశ్వరుని మూలశక్తీయని వారు తెలియుదురు. ఈ పరమేశపత్ని ఆకాశనామముతో వ్యవహరించబడునది. ఈమెయే మనకు ఆత్మ. ఈమెయే గతి; జ్ఞానులైనవారు ఈమెయందే ఈ సకల ప్రపంచమును ఆత్మను చూచుచుందురు. ఇట్లు దేవిని తెలియునారు ఈ దేవి తేజః పుంజముల మధ్యన సకల జగత్కారణుడగు దేవునికూడా చూడగలరు. అతడే శంభుడు. కవి. ఈశ్వరుడు. రుద్రుడు. బ్రహ్మ, పురాణపురుషుడు; ఇట్లు దేవిని, దేవదేవుని చూచిన ఆమునులు పోరికి నమస్కరించి పరమానందము పొందిరి. అంతట మహాదేవుని అనుగ్రహమువలన జన్మనాశమునకు కారణమైన పరమేశ్వరజ్ఞానము లభించెను. ఈ దేవియే సకల జగత్తుకు ఒకేఒక మూలకారణము. ఈమేయే సర్వ స్వరూపురాలు, సర్వనియామకు రాలు. ఈ మాహేశ్వరిశక్తియే అసోసిద్దము. ఈమెయే పరమాకాశమను పేరుతో అంతరిక్షమున ప్రకాశించుచుండును.ఈమెయందు ఉన్న మహాదేవుడు, పరులకు పరుడు, పరమేష్టి, రుద్రుడు, శివుడు, మహేశ్వర నామముతో ఈ మాయా శక్తిని స్వీకరించి, (ఆశ్రయించి) సకల జగత్తును సృజించును. ఈ మహాదేవుడు అద్వితీయుడు. సర్వప్రాణులలో అంతరాత్మగా దాగి యుండువాడు మాయను నియమించు కొనుపోడు, స్వీకరించువాడు) సవి కల్పకుడు, నిర్వికల్పకుడు. అతడే దేవికూడా దేవికంటే భిన్నముగా అతడు, అతనికంటే భిన్నముగా దేవియు ఉండజాలరు. ఇదితెలిసినపాడు మోక్షమును పొందును. మునులలో ఈజ్ఞానము కలిగిన వెంటనే, దేవాది దేవుడైన మహాదేవుడు, దేవితో కలిసి అంతర్ధానము చెందెను. వనవాసులగు ఆ మునులు ఎప్పుడు ఆ రుద్రదేవునే ఆరాధించుచుండిరి.
ఇట్లు పూర్వము దేవదారువనమున దేవదేవులనుష్టించిన వృత్తాంతమును, నేను విన్నదానిని మీకు తెలిపితిని. శ్రద్దగా దీనిని వినినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. శాంతులైన ద్వీజులకు వినిపించినవారు పరమ పదమును పొందెదరు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రసంహితలో ఉపరి విభాగమున ముప్పది యేడవ అధ్యాయము.
Summary of chapter 90 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa glorifies the sixteen monumental gifts (Mahādānas), including Tulāpurusha, Hiranyagarbha, Brahmāṇḍa, Gosahasra, and Kalpavṛksha. He details the elaborate ritual preparation, Vedic altars, and Mantra invocations required for these grand offerings, declaring that performing a Mahādāna elevates the donor and seven generations of ancestors to the supreme realm of Vishṇu and Śiva.