20వ అధ్యాయము

వ్యాస ఉవాచః-

అథ శ్రాద్ధ మమావాస్యాం ప్రాప్య కార్యం ద్విజోత్తమైః

పిండా న్వాహార్యకం భక్త్యా భుక్తిముక్తిఫలప్రదమ్

పిండాన్వాహార్యకశ్రాద్ధం క్షీణే రాజని శస్యతే

అపరాహ్ణే ద్విజాతీనాం ప్రశస్తేనామిషేణ చ

ప్రతిపత్ ప్రభృతి హ్యన్యా స్తిథయః కృష్ణపక్షకే

  చతుర్ధశీం వర్జయిత్వా ప్రశస్తి హ్యుపరోధతః

వ్యాస మహర్షి పలికెను.

ద్విజోత్తములు అమావాస్యనాడు భుక్తి ముక్తులను ప్రసాదించు పిండాన్వాహార్యకమను శ్రాద్దమును చేయవలయును. శ్రాద్దమును ద్విజులు అమావాస్య అపరాష్ట్రమున ఆచరించవలయును. ఈ శ్రాద్దము నాచరించుట కృష్ణప్రతిపత్ నుండి అమావాస్య వరకు ఒక చతుర్దశీ తప్ప అన్ని తిథులు మొదటి పాటికంటే తరువాతవి ప్రశస్త తరములుగా చెప్పబడినవి.

అమావాస్యాష్టకాస్తిస్రః పౌషమాసాదిషు త్రిషు

 తిస్ర న్తస్త్వష్టకాః పుణ్యా మాఘీ పంచదశీ తథా

  త్రయోదశీ మఘాయుక్త వర్షాసు చ విశేషతః

  శస్యఫాక శ్రాద్ధకాలాః నిత్యాః ప్రోక్తా దినే దినే

అమావాస్య, పుష్య మాఘ ఫార్జున బహుళ అష్టములు, అట్లే బహుళనవములు మఘ పూర్ణిమ శ్రాద్దమునకు పుణ్యతిథులుగా చెప్పబడినవి. వర్షర్తువులో మఘా నక్షత్ర యుక్త త్రయోదశి, పంట చేతికొచ్చు సమయమున విశ్లేషించి శ్రాద్ధ యోగ్య కాలముగా గుర్తించబడినది. ఇవి ప్రతి దీనము చేయవలసిన నిత్య శ్రాద్ధములుగా తెలియవలయును.

నైమిత్తిక ను కర్తవ్యం గ్రహణే చంద్రసూర్యయోః

బాంధవానాం విస్తరేణ నారకీ స్యాదతో న్యథా

కామ్యాని చైవ శ్రాద్ధాని శస్యనే గ్రహణాదిషు

ఆయనే విషువే చైవ వ్యతీపాతే త్వనస్తకమ్

సంక్రాంత్య్రా మక్షయం శ్రాద్ధం తళ జన్మదినే ష్వపి

నక్షత్రేషు చ సర్వేషు కార్యం కాలే విశేషతః

చంద్ర సూర్యగ్రహణ సమయమున, బాంధవుల మరణ సమయమున నైమిత్తిక శ్రాద్ధము నాచరించవలయును. అట్లు చేయనివాడు నరకమును చేరుసు. గ్రహణాది పర్వములలో కాచ్యు శ్రాద్ధములు కూడా చెప్పబడుచున్నవి. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములందు, మేష తులా సంక్రమణములందు, వ్యతీపాతము నందు, (వీషునమునందు) చేయబడు శ్రాద్దము కూడా అనన్త ఫల ప్రదమగును. సంక్రాంతి : సమయములందు, జన్మ దినమందు, అన్ని నక్షత్రములందు చేయబడు శ్రాద్దము అక్షయ ఫలప్రదమగును. ఈ సమయములందు విశేష రూపముగా కామ్య శ్రాద్దము నాచరించవలయును.

స్వర్గం చ లభతే కృత్వా కృత్తికాసు ద్విజోత్తమః

  అపత్య మథ రోహిణ్యాం సౌమ్యేతు బ్రహ్మ వర్చసమ్

రౌద్రాణాం కర్మణాం సిద్ధి మార్ద్రాయాం శౌర్య మేవ చ

  పునర్వసో తథా భూమిం శ్రీయం పుష్యే తథైవ చ

సర్వా స్కామా నథా సార్పే పిత్ర్యే సౌభాగ్య మేవ చ

అర్యమ్ణే తు ధనం విందేశ్ ఫాల్గున్యాం పాపనాశనమ్

జ్ఞానిశ్రేష్ఠ్యం తధా హస్తే చిత్రాయాం చ బహూన్సుతాన్

వాణిజ్యసిద్ధిం స్వాతౌ తు విశాభాసు సువర్ణకమ్

మైత్రీ బహూని మిత్రాణి రాజ్యం శాక్రే తథైవ చ

మూలే కృషిం లభేద్ జ్ఞానం సిద్ధి మాస్యేత్ సముద్రతః

సర్వాన్ కామాన్ వైశ్వదేశే శైష్ణ్యను శ్రవణే పునః

ధనిష్టాయాం తథా కామా నంబుపే చ పరం బలమ్

అజైకపాదే కుష్యం స్యా దాహిర్భుధ్నే గృహం శుభమ్

  రేవత్యాం బహవో గావో హ్యశ్విన్యాం సురగాం స్తథా

కృత్తికా నక్షత్రమున శ్రాద్ద మాచరించినవాడు స్వర్ణమును పొందును. రోహిణీ నక్షత్రమందాచరించిన సత్సంతానము, మృగశిరా నక్షత్రమున ఆచరించిన బ్రహ్మ తేజస్సు, ఆర్తా నక్షత్రమున ఆచరించిన రౌద్ర కర్మ సిద్ధి, శౌర్య ప్రాప్తి కలుగును. పునర్వసులో ఆచరించినచో భూమి లాభము, పుష్యమి నక్షత్రమున సంపదను ఆశ్లేషయండు సర్వకామ ప్రాప్తి, మఘ నక్షత్రమున సౌభాగ్యము లభీంచును, పుబ్బ నక్షత్రమున పాపనాశనము ఉత్తరా నక్షత్రమున ధనలాభము, హస్తా నక్షత్రమున శ్రాద్దము నాచరించిన తన బంధువులలో శ్రేష్ఠత్వమును, చిత్రా నక్షత్రమున బహుపుత్ర లాభమును, స్వాతి నక్షత్రమున వాణిజ్య సిద్ది విశాఖలో సువర్ణము లభించును. అనూరాధా నక్షత్రమున మిత్రులు, జ్యేష్ఠా నక్షత్రమున రాజ్యము లభించును. మూలా నక్షత్రమున ఆచరించినచో కృషిని, పూర్వాషాఢలో సలిపిన సముద్ర యాత్రా లాభము కలుగును. ఉత్తరాషాఢ నక్షత్రమున జరిపిన సర్వకామ్య సిద్ధి జరుగును. శ్రవణా నక్షత్రమున శ్రాద్ధము జరిపిన' శ్రేష్టత లభించును. ధనిష్ఠలో జరిపిన కామసలు లభించును. శతభిషమున జరిపిన పరమ ఫలము లభించును. పూర్వాభాద్రలో జరిపిన స్వర్ణలాభము, ఉత్తరాభాద్రలో గృహలాభము, రేవతిలో శ్రాద్ధము జరిపిన బహు గోవులు లభించును. అశ్వినిలో జరిపిన అశ్వములు, భరణిలో జరిపిన దీర్ఘాయువు లభించును.

ఆదిత్యవారేఽ స్వారోగ్యం చాంద్రే సౌభాగ్య మేవ చ

కుజే సర్వత్ర విజయం సర్వా స్కామాన్ బుధస్య చ

విద్యా మభీష్టం తు గురౌ ధనం వై భార్గవే పునః

 శనైశ్చరే లభే దాయుః ప్రతిపత్సు సుతా న్శుభాన్

కన్యకాం వై ద్వితీయాయాం తృతీయాయాం తు విన్దతి

పశూన్శు క్షుద్రం శ్చతుర్థ్యాం వై పంచమ్యాం శోభనాన్ సుతాన్

  షష్ఠ్యాం ద్యుతిం కృషిం చాపి సప్తమ్యాం చ ధనం సరః

 అష్టమ్యామపీ వాణిజ్యం లభతే శ్రాద్దదః సదా

స్యా న్నవమ్యా మేకఖురం దశమ్యాం ద్విఖురం బహు

ఏకాదశ్యాం తథా రూప్యం బ్రహ్మవర్చస్వినః సుతాన్

ద్వాదశ్యాం జాతరూపం చ రజతం కుష్య మేవ చ

 జ్ఞాతిశ్రైష్ఠ్యం త్రయోదశ్యాం చతుర్దశ్యాస్తు కుప్రజాః

పంచదశ్యాం సర్వకమాన్ ప్రొప్నోతి శ్రాద్ధదః సదా

ఆదివారము జరిపిన ఆరోగ్యము, సోమవారము జరిపిన సౌభాగ్యము, మంగళహారము అంతట విజయము, బుధవారము సర్వాభీష్ట సిద్దీ గురువారము శ్రాద్ధము జరిపిన అభీష్ట విద్యా లాభము, శుక్రవారము ధనమును శనివారము ఆయువు లభించును.

పాడ్యమి శుభపుత్రులను విదియ కన్యకలను, తదియ నందులను, చతుర్థి క్షుద్ర పశులను, పంచమి సత్పుత్రులను, షష్ఠి ద్యూతమును సప్తమి వ్యవసాయమును, అష్టమినాడు శ్రాద్దము నాచరించిన వ్యాపారమును, నవమినాడు ఒక గిట్టగల పశువులు, దశమినాడు రెండు గుట్టలు కల పశువులు ఏకాదశినాడు వెండి, బ్రహ్మతేజో వంతులగు పుత్రులు, ద్వాదశినాడు జరిపిన బంగరము వెండి ఇత్తడి, త్రయోదశినాడాచరించిన తన వారిలో ఉత్తమత్వముసు, చతుర్దశి దుష్ట సంతానము పూర్ణిమనాడు సర్వాభీష్ట సిద్ధిని పొందును.

తస్మాత్ శ్రాద్ధం న కర్తవ్యం చతుర్ధశ్యాం ద్విజాతిభిః

శస్త్రేణ తు హతానాం తు శ్రాద్ధం తత్ర ప్రకల్పయేత్

ద్రవ్యబ్రాహ్మణసంపత్తా న కాలనియమః కృతః

  తస్మాదోగాపవర్గార్థం శ్రాద్ధం కుర్యుః ద్విజాతయః

కావున ద్విజులు చతుర్దశినాడు శ్రాద్ధమును జరుపరాదు. శస్త్రముచే చంపబడినవారి శ్రాద్ధమును చతుర్దశినాడు జరుపవలయును. ద్రవ్యములు బ్రాహ్మణులు సమకూడినచో కాలనియమముతో పనిలేదు. కావున ద్విజులు భోగ మోక్షముల కొరకు శ్రాద్ధమును జరుపవలయును.

కార్యారంభేషు సర్వేషు కుర్యా దభ్యుదయే పునః

పుత్రజన్మాదిషు శ్రాద్ధం పార్వణం పర్వసు స్మృతమ్

అహాన్యహని నిత్యం స్యాత్కామ్యం నైమిత్తికం పునః

 ఏకోద్దిష్టాది విజ్ఞేయం ద్విధా శ్రాద్ధను పార్వణమ్  

ఏతత్పంచవిధం శ్రాద్ధం మనునా పరికీర్తితమ్

యాత్రాయాం షష్ఠ మాభ్యాతం తత్రయత్నేన పాలయేత్

శుద్ధయే సప్తమం శ్రాద్ధం బ్రహ్మణా పరిభాషితమ్

దైవికం చాష్టమం శ్రాద్ధం యత్కృత్వా ముచ్యతే భయాత్

సంధ్యాం రాత్రౌ న కర్తవ్యం గాహో రన్యత్ర దర్శనాత్

దేశానాంతు విశేషేణ భవే త్పుణ్య మనస్తకమ్

పుత్రజన్మాది సకల శుభ కర్మల ప్రారంభమున అభ్యుదయ శ్రాద్ధము నాచరించవలయును. పర్వలలో ఆచరించునది పార్వణ శ్రాద్దమనబడును. ప్రతి నిత్యము జరుపు శ్రాద్ధము నిత్యమని కామ్యమని అనబడును. ఏ కోద్దిష్టాది శ్రాద్ధములను నైమిత్తిక శ్రాద్ధమందురు. వృద్ధి శ్రాద్ధము పార్వణ శ్రాద్దము అను ఐదు విధముల శ్రద్దములను మనువు చెప్పెను. యాత్రలలో ఆచరించు శ్రాద్దము ఆరవది. దానిని ప్రయత్న పూర్వకముగా ఆచరించ వలయును. శుద్ధి కొరకు ఏడవ శ్రాద్ధమును బ్రహ్మ చెప్పి యుండెను. దైవిక శ్రాద్ధమనబడునది ఎనిమిదవ శ్రాద్ధము ఆచరించినచో సకల భయములు తొలగును. సంధ్యా సమయమున శ్రాద్ధము నాచరించరాదు. సూర్య చంద్ర గ్రహణ సమయమున మాత్రము రాత్రి పూట కూడా శ్రాద్ధమును జరుపవచ్చును. ఆయా విశేష దేశములలో జరిపిన శ్రాద్ధములు అనంత ఫలములనిచ్చును.

గంగాయా మక్షయం శ్రాద్ధం ప్రయాగే మరకంటకే

గాయంతి పితరో గాథాం నర్తయన్తి మనీషిణః

ఏష్టవ్యా బహవః పుత్రాః శీలవన్తో గుణాన్పితాః

 తేషాం తు సమవేతాసోం యద్యేకోపి గయాం వ్రజేత్

గయాం ప్రాప్యానుషంగేణ యది శ్రాద్ధం సమాచరేత్

తారీతాః పితర స్తేన స యాతి పరమాం గతిమ్

వారాహపర్వతే చైవ గయాయాం పై విశేషతః

వారాణస్యాం విశేషేణ యత్ర దేవః స్వయం హరః

గంగాద్వారే ప్రభాసే తు బిల్వకే నీల పర్వతే

కురుక్షేత్రే చ కుబ్జాగ్రే భృగుతుంగే మహాలయే

కేదారే ఫల్గుతీర్థే చ నైమిషారణ్య ఏవ చ

సరస్వత్యాం విశేషేణ పుష్కరే తు విశేషతః

నర్మదాయాం కుశావర్త శ్రీశైలే భద్రకర్ణకే

 వేత్రవత్యోం విశాఖాయం గోదావర్యోం విశేషతః

ఏవమాదిషు చాన్యేషు తీర్దేషు పులినేషు చ 

నదీనాం చైవ తీరేషు తుష్వస్తి పితరః సదా

గంగా తీరమున ప్రయాగలో అమర కంటకమున జరుపబడు శ్రాద్దము అక్షయ ఫలమును ప్రసాదించును. పితృదేవతలు ఇట్లు గానము చేతురు. బుద్ధిమంతులు ఇట్లు కీర్తింతురు. శీలము గుణము కల చాలా మంది పుత్రులను పొందవలయును. వీరందరిలో ఒకడైననూ గయకు వేళ్ళును. గయకు వెళ్ళి శ్రాద్ధము జరిపిన పితరులు తరింతురు. ఉత్తమ గతులను పొందెదరు. పోరాహ పర్వతమున గంగాతీరమున శంకరుడు వసించు వారాణసిలో, హరిద్వారమున ప్రభాస తీర్థమున, బిల్వ తీర్థమున, నీల పర్వతమున, కురుక్షేత్రమున, కుబ్జ తీర్థమున, భృగు తుంగమున, మరీ లయమున, కేదారమున, ఫల్గుతీర్థమున, నైమిషారణ్యమున, సరస్వతీలో, విశేషించి పుష్కరమున, నర్మదలో, కుశావర్తమున శ్రీశైలమున, భద్ర కర్ణికలో వేత్రవతిలో విపాశాలో విశేషించి గోదావరి, వీటిలో ఇంకా ఇతర తీర్థములో నీరు తాగిన నదీ ప్రదేశములో నదీ తీరములో శ్రాద్ధమును జరిపినచో పితృదేవతలు ఎపుడూ సంతోషముతో నుందురు.

వ్రీహిభిశ్చ యవైర్మాషై గదిర్మూలఫలేన వా

శ్యామాకైశ్చ యవైః కశైర్నీవారైశ్చ ప్రియంగుభిః

గోధూమైశ్చ తిలై ర్ముద్గై ర్మాసం ప్రీణయతే పితౄన్

 ఆమ్రాన్ పానే రసా నిక్షూన్ మృద్వీకాంశ్చ సదాడీమాన్

 విదాశ్వా అశ్చ కురండాంశ్చ శ్రాద్ధకాలే ప్రతాపయేత్

  లాజా న్మధుయున్ దద్యాత్ సర్జూన్ శర్కరయా సహ

 దద్యాచ్ఛాద్దే ప్రయత్నేన శృంగాటకకశేరుకోన్

ద్వౌ మాసౌ మత్స్యమాంసేన తీన్మాసాన్ హరిణేన తు

ఔరభ్రేణాథ చతురః శాకునే నేహ పంచ తు

షణ్మాసాం  శ్ఛాగమాంసేన పార్షతే నేహ సప్త వై

అష్టావేణస్య మాంసేన గౌరవేణ నవైవ తు

దశమాసాంస్తు తృప్యస్తి వరాహమహిషామీషైః

ప్రీహులతో, యవలతో, మినుములతో, జలములతో, కందమూల ఫలములతో, శ్యామాకములతో యవలతో శాకములతో, నీవారముతో ప్రియంగులతో, గోధుమలతో, నువ్వులతో, పెసలతో, చేయబడు శ్రాద్ధమున పితృదేవతలు ఒక నెల తృప్తులగుదురు. మామిడి, కర్బూజ్, చెరుకు, ద్రాక్ష, దాడీమ, మంచిగుమ్మడులను శ్రాద్ధకాలమున దానమీయవలయును. తేనెకలిసిన పేలాలను శర్కర కలిసిన సత్తు పిండినీ శృంగాటకములను కశేరుకములను శ్రాద్ధమున ఈయవలయును. మత్స్య మాంసముతో రెండు మాసములు, జింక మాంసముతో మూడు నెలలు దుప్పితో నాలుగు మాసములు, పక్షి మాంసముతో అయిదు నెలలు మేష మాంసముతో 6 నెలలు, లేడి మాంసముతో ఏడు నెలలు, ఐణ మాంసముతో 8 నెలలు దుప్పి మాంసముతో 9 నెలలు పీతరులు తృప్తి చెందదరు.

శశకూర్మయో ర్మాంసేన పూసా నేకాద శైవ తు

  సంవత్సరను గవ్యేన పయసా పాయసేన తు

వార్ద్రాణసస్య మాంసేన తృప్తి ర్ద్వాదశవార్షికీ

కాలశాకం మహాశలః ఖడ్గలోహామిషం మధు

అనన్యాయైన కల్పనే నున్యన్నాని చ సర్వశః

క్రీత్వా లబ్ద్వా స్వయం వాథ మృడా నాదృత్య వై ద్విజః

దద్యా చ్ఛాద్దే ప్రయత్నేన తద స్యా క్షయ ముచ్యతే

  పిపృతం రుచకం చైవ తథా చైవ మసూరకమ్

 కూష్మాణ్డాబాబువార్తాకభూతృణం సరసం తథా

కుసుంభపిండమూలం వై తందులీయకమేవ చ

 రాజపూషా స్తథా క్షీరం మాహిషాజం వివర్జయేత్

ఆధక్యః కోవిదారాశ్చ పాలక్యా మరిచాస్తథా

వర్జయే త్సప్త యత్నేన శ్రాద్ధకాలే ద్విజోత్తమాః

ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్ధే శ్రాద్ధకల్పే వింశో ధ్యాయః

 వారాహ మాహీష మాంసములతో 10 నెలలు కుందేలు తాబేలు మాంసములతో 11 నెలలు, ఆవు పాలతో పాయసముతో 12 నెలలు తృప్తి పొందెదరు. నార్థాణస మాంసముతో 12 సంవత్సరములు తృప్తి కలుగును. కోలశాకము, మహా శలము, ఖడ్గమృగ మాంసము తేనె మున్యన్నములు అనంత ఫలమును ప్రసాదించును. కాని కాని స్వయముగా పొందీకాని చనిపోయిన వాటిని తెచ్చి వానిని శ్రాద్ధమున ప్రయత్న పూర్వకముగా ఇచ్చినచో అక్షయ ఫలమును పొందును. పిప్పలి, క్రముకము, ముసురము, బూడిద గుమ్మడి, సొరకాయ, వంకాయ, గరక, కుసుంభ పిండమూలము సురసము (బీరకాయ) ఉల్లి గడ్డ, బొబ్బట్లు గేదెపాలు, ఇవి శ్రాద్దములో ఉపయోగించరాదు. చుక్కకూర, గోంగూర, పాలకూర, మిరియాలు శ్రాద్ధములో సర్వ ప్రయత్నముతో విడువ వలయును.

ఇది కూర్మపురాణమున షట్సాహస్ర సంహితలో ఉపరివిభాగమున 20వ అధ్యాయము.