కూర్మ మహా పురాణము
18వ ఆధ్యాయము
ఋషయ ఊచుః :-
అహ న్యహని కర్తవ్యం బ్రాహ్మణానాం మహామునే ।
త దాచక్ష్వా ఖిలం కర్మ యేన ముచ్యత బంధనాత్ ॥
వ్యాస ఉవాచ:-
వక్ష్యే సమాహితా యూయం శృణుధ్వం గదతో మమ ।
అహ న్యహని కర్తవ్యం బ్రాహ్మణానాం క్రమా ద్విధిమ్ ॥
బ్రాహ్మీ ముహూర్తే తూత్థాయ ధర్మముర్థం చ చింతయేత్ ।
కాయక్లేశం తదుద్భూతం ధ్యాయీత మనసేశ్వరమ్ ॥
ఉషఃకాలేఽథ సంప్రాప్తే కృత్వా చావశ్యకం బుధః ।
స్నాయా న్నదీషు శుద్ధాసు శౌచం కృత్వా యథావిధి ॥
ప్రాతస్స్నానేన పూయంతే యేఽపి పాపకృతో జనాః ।
తస్మా త్సర్వప్రయత్నేన ప్రాతస్స్నానం సమాచరేత్ ॥
ఋషులు పలికిరి.
ఓ మునీ! బ్రాహ్మణులు ప్రతిదినము చేయవలసిన అన్ని కర్మలను వివరించుడు, దీనిని తెలిసి నంత మాత్రమున సంసార బంధము తొలగిపోవును.
వ్యాస మహర్షి చెప్పెను.
బ్రాహ్మణులు విధి విధాన క్రమమును ఆచరించవలసిన దానిని చెప్పెదను. సావధాన మనస్కులై వినుడు. బ్రహ్మ ముహూర్తమున లేచి ధర్మార్థ సాధన ములను సమకూర్చుకోనుటకు చేయవలసిన శరీర పరిశ్రమ ఎంత అని ఆలోచించుచు మనసులో పరమాత్మను ధ్యానించవలయును. ఉషఃకాలము వరకు ఆవశ్యకములను ముగించుకొని శౌచమునాచరించి నదిలో స్నానము చేయవలయును. ప్రాతః కాలస్నానము వలన పాపులు కూడా పరిశుద్ధులగుదురు. కావున సర్వ ప్రయత్నముతో ప్రాతః స్నానమాచరించ వలయును.
ప్రాతస్స్నానం ప్రశంసంతి దృష్టాదృష్టకరం శుభమ్ ।
ఋషీణా మృషితా నిత్యం ప్రాతస్స్నానా న్న సంశయః ॥
ముఖే సుప్తస్య సతతం లాలా యా స్సంస్రవంతి హి ।
తతో నైవోచరే త్కర్మ అకృత్వా స్నాన మాదితః ॥
అలక్ష్మీః కాలకర్ణి చ దుస్స్వప్నం దుర్విచింతితమ్ ।
ప్రాతస్స్నానేన పాపాని పూయంతే నాత్ర సంశయః ॥
న చ స్నానం వినా పుంసాం పావనం కర్మ సుస్మృతమ్ ।
హోమే జష్యే విశేషేణ తస్మా త్స్నానం సమాచరేత్ ॥
అశక్తా వశిరస్కం వా స్నాన మస్య విధీయతే ।
ఆర్ద్రేణ వాససా వాథ మార్జనం కాపీలం స్మృతమ్ ॥
ప్రాతఃకాల స్నానము దృషా దృష్ట ఫల జనకమని చెప్పుచున్నారు. ఇది శుభ ప్రదము కూడా. ప్రాతః కాల స్నానము వలననే ఋషులకు ఋషిత్వము సిద్ధించును. నిద్రించిన వానీ ముఖమున లాలా జలము స్రవించుచుండును. అ లాలాజలముతో నిత్యకర్మ నాచరించరాదు. కావున మొదట స్నాన మాచరించవలయును. ప్రాతః కాల స్నానము వలన దారిద్ర్యము కాంతి హీనత, దుస్వప్నములు, దుర్వీ చింతనము మొదలగు పోపములు నశించి పరిశుద్ది లభించును. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. మానవులకు స్నానము లేకుండా హోమమున కాని జపమున కాని పవిత్ర కార్య యోగ్యత లభించదు. కావున ప్రాతః స్నానము తప్పక నాచరించవలయును, శక్తిలేని పక్షమున శిరస్నానము కాక కంఠస్నాన మాచరించవలయును. ఆ మాత్రము శక్తి కూడా లేనిచో తడి బట్టతో మొత్తము శరీరమును తుడుచుకొన వలయును. ఇది కపిల స్నానము.
అసామర్ధ్యే సముత్పన్నే స్నాన మేవం సమాచరేత్ ।
బ్రాహ్మాదీని యధాశక్తి స్నానా న్యాహు ర్మనీషీణః ॥
బ్రాహ్మం మాగ్నేయ్య ముద్దిష్టం వాయవ్యం దివ్య మేవ వా ।
వారుణం యౌగికం తద్వత్ షోఢా స్నానం ప్రకీర్తితమ్ ॥
బ్రాహ్మం తు మార్జనం మంత్రైః కుశై సోదకబిందుభిః ।
ఆగ్నేయం భస్మనా పాదం మస్తకా ద్దేహధూలనమ్ ॥
గవం హి రజసా ప్రోక్తం వాయవ్య స్నాన ముత్తమమ్ ।
యత్తు సొతపపర్షేణ స్నానం త ద్దివ్య ముచ్యతే ॥
వారుణం చావగాహ స్తు మానసం త్వాత్మవేదనమ్ ।
యౌగికం స్నాన మాఖ్యాతం యోగో విష్ణువిచింతనమ్ ॥
శక్తిహీనులు కపిల స్నానమాచరించవలయును. విద్వాంసులు బ్రహ్మాది స్నానములను చెప్పిరి. బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము దివ్యము వారుణము యౌగికము అని స్నానము ఆరు విధములుగేళ్ల చెప్పబడినది. మంత్రము చదువుచూ దర్భలచే జల బిందువులను ప్రోక్షించుట బ్రాహ్మస్నాన మందురు. పాదము నుండి శీరము వరకు భస్మమును రాసుకొనుట ఆగ్నేయ స్నానము, గోధూళితో అలుము కొనుట వాయవ్య స్నానము. ఎండవానల్లో తడియుట దివ్యస్నానమగును. నీటిలో మునిగి చేయునది వారుణ స్నానము. ఆత్మ తత్త్వమును ధ్యానించుట యౌగిక స్నాన మనబడును.
ఆత్మతీర్థ మితి ఖ్యాతం సేవితం బ్రహ్మ వాదిభిః ।
మనశ్శుచికరం పుంసాం నిత్యం తత్స్నాన మాచరేత్ ॥
శక్త శ్చే ద్వారుణం విద్వాన్ ప్రాజాపత్యం తథైవ చ ।
ప్రక్షాల్య దంతకాష్ఠం వై భక్షయిత్వా విధానతః ॥
బ్రహ్మ జ్ఞానులు ఎక్కువగా ఆచరించు ఈ స్నానమును ఆత్మ తీర్థమందురు. ఇది మానవుల మనసును పవిత్రము గావించును కావున యోగ స్నానమును ప్రతి నిత్యమాచరించవలయును. శక్తి ఉన్నచో పొరుణ బ్రాహ్మ స్నానములను తప్పక ఆచరించ వలయును. దంతకాష్ఠమును చక్కగా కడిగి బాగుగా నమల వలయును.
ఆచమ్య ప్రయతోనిత్యం స్నానం ప్రాత స్సమాచరేత్ ।
మధ్యాంగులిసముస్థౌల్యం ద్వాదశాంగులిసమ్మితమ్ ॥
సత్వచం దంతకాష్ఠం స్యాత్ తదగ్రేణ తు ధావయేత్ ।
క్షీరవృక్షసముద్భూత మాలతీసంభవం శుభమ్ ॥
అపామార్గం చ బిల్వం చ కరవీరం విశేషతః ।
వర్జయిత్వా నిందితాని గృహీత్వైకం యథోదితమ్ ॥
పరిహృత్య దినం పాపం భక్షయేద్వై విధానవిత్ ।
నోత్పాటయే ద్దంతకాష్ఠం వాంగుల్యా ధావయే త్క్వచిత్ ॥
ప్రక్షాల్య భంక్త్వా తజ్జహ్యా చ్ఛుచౌదేశే సమాహితః ॥
చక్కగా దంత శోధనము గావించుకొని ఆచమనము చేసి ప్రాతః కాల స్నానము నాచరించవలయును. దంతకష్టము మధ్య మాంగులీ అంతలోవు 12 అంగులముల పొడవు బెరడుతో కూడి యున్నది కావలయును. దాని మొదటి భాగముతో ముఖ శుద్ధి గావించుకొనవలయును. పాలు గోరు చెట్ల నుండి కాని, మాలతీ వృక్ష సంబంధము కాని శుభము. ఉత్తరేణీ బిల్వము కరవీర కాష్ఠము మంచిది. నిందిత వృక్షములను విడిచి విహితమైన వాటిలో ఏ దేనీ ఒకటి తీసుకొనవలయును. షాప దీనములలో చెట్టునుండి విడువరాదు.మొత్తము చెట్టునే వేళ్ళతో పెకిలించరాదు. వేలుతో పండ్లను తోమరాదు. పండ్లు తోము కొనిన తరువాత పండ్ల పుల్లను కడిగి విరిచి సావధానుడై పవిత్ర ప్రదేశమున విడువ వలయును.
స్నాత్వా సంతర్పయే ద్దేవాన్ ఋషీన్ పితృగణాం స్తథా ।
ఆచమ్య మంత్రవ న్నిత్యం పునరాచమ్య వాగ్యతః ॥
సంమార్జ్య మంత్రై రాత్మానం కుశై స్సోదకబిందుభిః ।
ఆపోహిష్ఠావ్యాహృతీభిః సావిత్ర్యా వారుణై శ్శుభైః ॥
ఓంకారవ్యాహృతీయుతాం గాయత్రీం వేదమాతరమ్ ।
జప్త్వా జలాంజలిం దద్యాత్ భాస్కరం ప్రతి తన్మనాః ॥
ప్రాక్కూలేషు సమాసీనో దర్భేషు సుసమాహితః ।
ప్రాణాయామత్రయం కృశ్వా ధ్యాయేత్ సంధ్యామితి శ్రుతిః ॥
తరువాత స్నానమాడి దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణము గావించ వలయును. తరువాత మరల ఆచమనము చేసి వాట్నియమముతో “ఆపోహిష్ఠా మయో భువ” ఇత్యాది సమ్మార్జన మంత్రములతో దర్భలతో జలమును గాయత్రీ వ్యాహృతులతో శుభప్రదమగు వారుణ మంత్రముతో ప్రోక్షించుకొనవలయును. తరువాత ఓంకారముతో వ్యాహృతులతో వేదమాతయగు గాయత్రి మంత్రమును జపించి సూర్యభగవానుని ఉద్దేశించి తదేకమనస్కుడై జలాంజలిని విడువవలయును. ప్రాగ గ్రదర్భలయందు కూర్చొని సావధానుడై మూడు మార్లు ప్రాణాయామమును గావించి సంధ్యావందనము నాచరించవలయునని శ్రుతివాక్యము.
యా సంధ్యా సా జగత్సూతి ర్మాయాతీతా హి నిష్కలా ।
ఐశ్వరీ తు పరిశక్తి స్తత్త్వత్రయసముద్భవా ॥
ధ్యాత్వా ర్కమండలగతాం సావిత్రీం వై జప న్ఖుధః ।
ప్రాజ్ముఖ స్సతతం విప్రః సంధ్యోపాసన మాచరేత్ ॥
సంధ్యాహీనోఽశుచి ర్నిత్య మనర్హ స్సర్వకర్మసు ।
య దన్య త్కురుతే కించిత్ న తస్య ఫల మాప్నుయాత్ ॥
అనన్యచేతస శ్శాంతా బ్రాహ్మణా వేదపారగః ।
ఉపాస్య విధివ త్సంధ్యాం ప్రాప్తాః పూర్వం పరాం గతిమ్ ॥
యోఽన్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్వీజోత్తమః ।
విహాయ సంధ్యప్రణతిం స యాతి నరకాయుతమ్ ॥
తస్మా త్సర్వప్రయత్నేన సంధ్యోపాసన మాచరేత్ ।
ఉపాసితో భవే త్తన దేవో యోగతనుః పరః ॥
సంధ్యయే జగత్తును సృజించునది. సంధ్యమాయాతీత నిర్వికల్ప, ఈశ్వరుని పరాశక్తియే సంధ్య. మూడు తత్త్వముల నుండి పుట్టినదే సంధ్య. సూర్యమండల మధ్య దేశమున నున్న సావిత్రిని ధ్యానము గావించి జపించి ఎపుడు తూర్పు ముఖముగానే సంధ్యోపాసన చేయవలయును. సంధ్యా హీనుడు అశుచి యగును. ఏ కర్మల నాచరించుటకు తగడు. సంధ్యావందనము చేయకుండా చేసిన ఏ పనీ ఫలించదు. పూర్వము అనన్య మనస్కులై శాంతులు వేద పండితులగు బ్రాహ్మణులు యధావిధిగా సంధ్య నాచరించి ఉత్తమ గతినీ పొందీరి. సంధ్యావందనమును వీడిచి ఇతర ధర్మ కార్యములను ప్రయత్నించువారు వేల నరకములను పొందెదరు. కావున సర్వ విధ ప్రయత్నములతో సంధ్యోపాసన చేయవలయును. సంధ్యోపాసనముతో యోగ స్వరూపుడగు భగవంతుడు పూజింపబడిన వాడగును.
సహస్రపరమం నిత్యం శతమధ్యాం దశావదామ్ ।
సావిత్రీం వై జపే ద్వీద్వాన్ ప్రొజ్ముఖః ప్రయత స్థ్సితః ॥
అధోపతిష్ఠే దాదిత్యం ఉద్యంతం వై సమాహితః ।
మంత్రై స్తు వివిధై స్సౌక్తైః ఋగ్యజుస్సామసంభవైః ॥
ఉపస్థాయ మహాయోగం దేవదేవం దివాకరమ్ ।
కుర్వీత ప్రణతిం భూమౌ మూర్ధ్నా తేనైవ మంత్రతః ॥
తూర్పుముఖముగా ఏకాగ్ర మనస్కుడై నీలిచీ 1000 కాని 1000 కాని 10 కాని గాయత్రీ మంత్రమును జపించవలయును. 1000 ఉత్తమము. 100 మధ్యమము. 10 అధమము. దీని తరువాత సావధానుడై లేచి నిలబడి సూర్యోపస్థానము గావించ వలయును. ఋగ్యజుస్సామ మంత్రములు సూర్యుని స్తుతించునవి చాలా ఉన్నవి. వాటితో సూర్యుని దేవ దేవుని మహాయోగ రూపుని ఆరాధించి ఆ మంత్రములతో శిరస్సును భూమి నితాకునట్లు ప్రణామము గావించవలయును.
ఓం ఖద్యోతాయ చ శాంతీయ కారణత్రయహేతవే ।
నివేదయామి చాత్మానం నమస్తే విశ్వరూపిణే ॥
నమస్తే ఘృణినే తుభ్యం సూర్యాయ బ్రహ్మరూపిణే ।
త్వమేవ బ్రహ్మ పరమం ఆపోజ్యోతీరసోఽమృతమ్ ॥
భూర్భువఃస్వస్త్వ మోంకారః శర్వో రుద్రస్సనాతనః ।
పురుష స్స న్మహోఽన్తస్థం ప్రణమామి కపర్దినమ్ ॥
త్వమేవ విశ్వం బహుధా జాతం య జ్జాయతే చ యత్ ।
సమో రుద్రాయ సూర్యాయ త్వాసుహం శరణం గతః ॥
ప్రచేతసే నమ స్తుభ్యం నమో మిఢుష్టమాయ చ ।
నమో నమస్తే రుద్రాయ త్వా మహం శరణం గతః ॥
హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యపతయే నమః ।
అంబికాపతయే తుభ్యం ఉమాధిపతయే నమః ॥
సూర్యభగవానుడు ఆకాశమున ఇంద్రియములలో ఆత్మ రూపముగా లోపల, బయట వ్యాపించియుండువాడు. శాంతుడు, మనసును బుద్ధిని అహంకారమును క్రియా శీలముగా చేయువాడు సూర్యభగవానుడే అట్టి నీకు నన్ను నేను అర్పించుకొనుచున్నోను. జ్ఞాన స్వరూపుడవగు నీకు నమస్కారము. ప్రకాశ శాలికి బ్రహ్మ రూపుడగు సూర్యునికి నమస్కారము. తమరే పరబ్రహ్మ తమరే జలము తమరే అగ్ని, తామే అమృత రసము. నీవే వ్యాహృతులు. ఓంకారము నీవే. సనాతనరుద్రులు నీవే. నీవే పురుషుడవు. నీవే సత్తువు. నీవే మహితవ్యము, కపర్దివగు నిన్ను ననుస్కరించుచున్నాను. నీవే సద సదాత్మక మగు సకల జగత్తును సృజించుచున్నావు రుద్రునికి నమస్కారము. నేను నిన్ను శరణు పొందితిని. ప్రాచేతసుడవు రుద్రరూపుడవు నీకు నమస్కారము. రుద్ర రూపుడవగు నీన్ను నేను శరణు పొందితిని. నీవు హిరణ్య బాహువువు, హిరణ్య పతివి. అంబికాపతివి ఉమాపతివి అగునీకు నమస్కారము.
నమోస్తు నీల గ్రీవాయ నమస్తుభ్యం పినాకినే ।
విలోహితాయ భర్గాయ సహస్రాక్షాయ తే నమః ॥
తమో పహాయ తే నిత్యం ఆదిత్యాయ నమోఽస్తుతే ।
నమస్తే వజ్ర హస్తాయ త్ర్యంబకాయ నమోనమః ॥
నీలగ్రీవునికి పినాకికి, విలోహితునికి భర్గునికి సహస్రాక్షుడవగునీకు నమస్కారము.
ప్రపద్యే త్వాం విరూపాక్షం మహాంతం పరమేశ్వరమ్ ।
హిరణ్మయే గృహే గుప్తం ఆత్మాసం సర్వ దేహినామ్ ॥
నమస్యామి పరం జ్యోతి ర్రృహ్మాణం త్వాం పరామృతమ్ ॥
విశ్వం పశుపతిం భీమం నరనారీ శరీరిణమ్ ।
నమః సూర్యాయ రుద్రాయ భాస్వతే పరమేష్ఠినే ॥
చీకటిని తొలగించు ఆదిత్యునకు నమస్కారము. వజ్రహస్తుడవు త్ర్యబంకుడవగునీకు వందనము. విరూపాక్షుడవు మహానుభావుడవగు పరమేశ్వరుని శరణు పొందుచున్నాను. సకల దేహధారుల హృదయ గుహలో దాగియున్న నిన్ను నమస్కరించుచున్నాను. పరంజ్యోతి పరాగతి పరబ్రహ్మవగు నిన్ను నమస్కరించుచున్నాను. ప్రపంచరూపివి పశుపతివి నర నారీరూపుడవు పరమేష్ఠివగునీకు నమస్కారము.
ఉగ్రాయ సర్వతక్షయ త్వాం ప్రపద్యే స్తవైరపి ।
ఏతద్వై సూర్యహృదయం జప్త్వా స్తవ మనుత్తమమ్ ॥
ప్రాతః కాలేఽథ మధ్యాహ్నే నమస్కుర్యా ద్దివాకరమ్ ।
ఇదం శిష్యాయ పుత్రాయ ధార్మికాయ ద్విజోతయే ॥
ఉగ్రుడవు అందరిచే సేవించబడువాడవు అగు నిన్ను సర్వకాల మందు శరణు పొందుచున్నాను.
పరమోత్తమమగు ఈసూర్య హృదయ స్తవమును ప్రాతఃకాల మధ్యాహ్నములలో పఠించి సూర్యునికి నమస్కరించవలయును.
ప్రదేయం సూర్యహృదయం బ్రహ్మణాతు ప్రదర్శితమ్ ।
సర్వపాప ప్రశమనం వేదసారసముద్భవమ్ ॥
బ్రాహ్మణానాం హితం పుణ్యం ఋషిసంఘై ర్నిషేవితమ్ ।
అథాగమ్య గృహం విప్రః సమాచమ్య యధావిధి ॥
బ్రహ్మ ప్రదర్శించిన ఈ సూర్య హృదయమును పుత్రునికీ, శిష్యునకు ధార్మికుడగు ద్వీజునకు మాత్రమే ఈయవలయును. ఈ సూర్య హృదయము సర్వపాప ప్రశమనము, వేదసారము నుండి ఉదయించినది. ఋషి సంఘములచే సేవించబడినది. బ్రాహ్మణులకు హితమును కలిగించునది. పవిత్రమైనది. తరువాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి వీధిపూర్వకముగా ఆచమించి;
ప్రజ్వాల్య వహిం విధివత్ జుహుయా జ్జాతవేదసమ్ ।
ఋత్విక్ పుత్రోఽథ పత్నీవా శిష్యో పోపీ సహోదరః ॥
ప్రాప్యానుజ్ఞాం విశేషేణ హ్యధ్వర్యు ర్వాయధావిధి ।
పవిత్రపాణిః పూతాత్మా శుక్లాంబరధర శ్శుచిః ॥
అనన్యమనసా నిత్యం జుహుయాత్సంగతేంద్రియః ।
వినా దర్భేణ యత్కర్మ వినా సూత్రేణ వాపునః ॥
రాక్షసం తద్భవే త్సర్వం నా ముత్రేహ ఫలప్రదమ్ ॥
అగ్నినీ యధావిధిగా జ్వలింపచేసి హోమమును గావించవలయును. ఇట్లు యజమాని అగ్నిహోత్రమును చేయజాలని పక్షమున అతని ప్రతినిధిగా ఋత్విక్సుత్తుడుకాని, పత్నీకాని, శిష్యుడు కాని సహోదరుడు కానీ ఆజ్ఞను పొంది హోమము చేయవచ్చును. పవిత్రమును ధరించి పవిత్రకాయుడై శుక్ల వస్త్రమును ధరించి ఏకాగ్రమనస్కుడై, ఇంద్రియ నిగ్రహము కలవాడై అగ్నిలో హోమమును గావించవలయును. దర్భలు లేకుండా, యజ్ఞోపవీతంలేకుండా చేసిన కర్మ అంతా రాక్షసమవుతుంది. ఇహపరలోకంలో ఫలప్రదం కాదు
దైవతానీ నమస్కుర్యాదు పహారాదు న్నివేదయేత్ ।
దద్యాతుష్పాదికం తేషాం వృద్ధాం శ్చైవాభివాదయేత్ ॥
గురుం చైవా ప్యుపాసీత హితం చాస్య సమాచరేత్ ।
వేదాభ్యాసం తతః కుర్యాత్ ప్రయత్నా చ్ఛక్తితో ద్విజః ॥
జపే దధ్యాపయే చ్ఛిష్యాన్ ధారయే చ్చ విచారయేత్ ।
అపేక్షేత చ శాస్త్రాణీ ధర్మాదీనీ ద్విజోత్తమః ॥
వైదికం శ్చైవ నిగమాన్ వేదాంగానీ విశేషతః ।
ఉపేయా దీశ్వరం చాథ యోగక్షేమప్రసిద్ధయే ॥
దేవతలకు నమస్కరించవలయును. ఉత్తమ వస్తువులనే అర్పించవలయును. దేవతలకు పుష్పాదికముల నర్పించవలయును. వృద్దులకు అభివాదనము చేయవలయును. గురువునుపాసించవలయును. ఎపుడూ గురు హితమును ఆచరించవలయును. ద్విజుడు తన శక్తి మేరకు ప్రయత్నముతో వేదాభ్యాసమును గావించవలయును. జపమును చేయవలయును. శిష్యులను చదివించవలయును, చదివిన వాటిని ధరించవలయును. పర్యాలోచించు చుండవలయును. ధర్మ శాస్త్రములను విశ్లేషించి ద్విజోత్తముడు చింతించవలయును. అట్లే వేదాంగములను కూడా విశేషముగా అధ్యయనము గావించవలయును. తరువాత యోగక్షేమము కోరకు ఈశ్వరుని శరణు వేడవలయును. తరువాత కుటుంబము కొరకు పలువిధములగు సంపదలను సంపాదించ వలయును.
సాధయే ద్వివిధా సర్థాన్ కుటుంబార్థే తతో ద్విజః ।
తతో మధ్యాహ్న సమయే స్నానార్థం మృద మహరేత్ ॥
పుష్పాక్షతా న్కుశ తిలాన్ గోమయం శుద్ద మేవ చ ।
నదీషు దేవఖాతేషు తటాకేషు సరస్సు చ ॥
స్నానం సమాచరే న్నిత్యం గర్తప్రస్రవణేషు చ ।
పరకీయనిపానేషు న స్నాయాద్వై కదాచన ॥
పంచపిండా న్సముద్ధృత్య స్నాయా ద్వాసంభవే పునః ।
మృదైకయా శిరః క్షాల్యం ద్వాభ్యాం నాభే స్తధోపరి ॥
అథశ్చ తిసృభిః కాయం పాదౌ షడ్భి స్తథైవ చ ।
మృత్తికా చ సముద్దిష్టా త్వార్ద్రామలకమాత్రిక ॥
గోమయస్య ప్రమాణం తత్ తేనాంగం లేపయే త్తతః ।
లేపయిత్వా తు తీరస్థః తల్లింగై రేవ మంత్రతః ॥
తరువాత మాధ్యాహ్ని క స్నానము కొరకు మృత్తికను పుష్పములను అక్షతలను దర్భలను నువ్వులను పరిశుద్ధమైన గోమయమును సంపాదించ వలయును. నదులలో దేవతలు నిర్మించిన కుండములో, తటాకములలో, సరస్సులలో, సెలయేళ్ళలో జలాశయములో స్నానమాచరించ వలయును. ఇతరుల జలాశయములలో ఎపుడూ స్నానము చేయరాదు. ఇట్లు కుదరనీ పక్షమున జలాశయము నుండి అయిదు మట్టి ముద్దలను బైటికి తీసి స్నానము చేయవలయును. ఒకసారి శిరశ్శుద్ధి చేయవలయును. రెండు మార్లునాభిపైన పై భాగమున శుద్ధి చేసుకొనవలయును. క్రింది భాగమున మూడు మార్లు చేయవలయును. పాదములను ఆరుమార్లు చేసుకొనవలయును. పచ్చి ఉసిరికాయంత మట్టిని తీసుకొనవలయును, గోమయ ప్రమాణము కూడా ఇంతియే ఉండవలయును. దానితో శరీరమును పూయవలయును.
ప్రక్షాల్యా చమ్య విధివత్ తత స్స్నాయా త్సమాపోతః ।
అభిమంత్ర్య జలం మంత్రై స్తల్లింగై ర్వారుణై శ్శుభైః ॥
భావపూత స్త దవ్యక్తం ధ్యాయన్వై విష్ణు మవ్యయమ్ ।
ఆపో నారాయణోద్భూతాః తా ఏవాస్యాయనం పునః ॥
తస్మా న్నారాయణం దేవం స్నానకాలే స్మరే ద్బుధః ।
ప్రోచ్య సోంకార మాదిత్యం త్రి ర్నిమజ్జే జ్జలాశయే ॥
ఆఛాన్తః పున రాచమే మంత్రేణా నేన మంత్రవిత్ ।
అంతశ్చరసీ భూతేషు గుహాయాం విశ్వతోముఖః ॥
త్వం యజ్ఞ స్త్వం వషట్కార ఆపో జ్యోతీర సోఽమృతమ్ ।
ద్రుపదాం వా త్రి రభ్యస్యేత్ వ్యాహృతిప్రణవాన్వితామ్ ॥
వారుణ మంత్రములతో జలమును అభిమంత్రించి పవిత్రభావముతో అవ్యయుడగు శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు స్నానము చేయవలయును. జలములు నారాయణుని నుండి పుట్టినవి. జలములే నారాయణుసోధారములు. కావున స్నానకాలమున నారాయణుని ధ్యానించవలయును. ఓంకారముతో ఆదిత్య మంత్రమును జపించి మూడుమార్లు నీటిలో మునుగ వలయును. ఆచమనము చేసియున్ననూ మంత్రమును తెలిసినవారు మరల ఈ మంత్రముతో ఆచమనమును చేయవలయును. విశ్వతో ముఖుడవగు నీవు అన్ని ప్రాణుల అంతర్యామిగా హృదయమున సంచరింతువు. నీవే యజ్ఞుడవు. నీవే ఓంకారానీవి. జలము జ్యోతి రసము అమృతము అన్నియు నీవే.
సావిత్రీం వా జపే ద్విద్వాన్ తధా చైవాఘమర్షణమ్ ।
తత స్సమ్మార్జనం కుర్యాత్ ఆపోహిష్ఠామయోభువః ॥
ఇద మాపః ప్రవహత వ్యాహృతిభి స్తధైవ చ ।
తతోఽభి మంత్ర్య తత్తీర్ధం అపోహిష్ఠాదిమంత్రకైః ।
అంతర్జలగతో మగ్నో జపే త్త్రి రఘమర్షణమ్ ।
త్రీపదాం వాథ సావిత్రీం తద్విష్ణోః పరమం పదమ్ ।
ఆవర్తయే ద్వ ప్రణవం దేవం వా సంస్మరే ద్ధరమ్ ॥
ద్రుపదాదివ యో మంత్రో యజుర్వేదే ప్రతిష్ఠితః ।
అంతర్జలే త్రి రావర్త్య సర్వపాపైః ప్రముచ్యతే ॥
విద్వాంసుడగు వాడు రెండు చరణముల మంత్రమును మూడు మారులు, వ్యాహృతులు ప్రణవముతో కూడిన గాయత్రీ మంత్రమును కానీ అఘమర్షణ మంత్రమును కాని జపించవలయును. తరువాత “ఆపోహిష్ఠా మయో భువః” “ఇద మాపః ప్రవహిత” ఇత్యాది మంత్రములతో వ్యాహృతులతో సమ్మర్జనమును చేసుకొనవలయును. తరువాత ఆ జలమును “ఆపోహిష్ఠా”ది మంత్రములతో అభిమంత్రించి నీటమునిగి నీటి లోపల నుండి అఘమర్షణ మంత్రమును మూడు మార్లు జపించవలయును. నిలుచుని ఉంటే సూర్యుణ్ణి చూస్తూ జపం చేయవలెను. లేదాత్రీ పదయగు గాయత్రీనీకాని ‘తద్విష్ణోః పరమం పదం’ అను మంత్రమును కాని, ఓంకారమును కాని జపించవలయును లేదా శ్రీహరిని సంస్మరించవలయును. యజుర్వేదములోని “ద్రుపదోదీవ ముంచతు” అను మంత్రమును నీటిలోపల మునిగి యుండి మూడుమారులు జపించిన పొనికీ అన్ని పాపములు నశించును.
అపః పాణౌ సమాదాయ జప్త్వా వై మార్జనే కృతే ।
విన్యస్య మూర్ధ్ని తత్తోయం ముచ్యతే సర్వపాతకైః ॥
యధాశ్వమేథః క్రతురాట్ సర్వపాపాపనోదనః ।
తథో ఘమర్షణం సూక్తం సర్వపాపాపనోదనమ్ ॥
అధోపతిష్ఠ దాదిత్యం మూర్ధ్ని పుష్పాన్వితాంజలిమ్ ।
ప్రక్షీ ప్యా లోకయేత్ దేవం ఉద్వయంతమస స్పరి ॥
చేతిలో నీటిని తీసుకొని జపించి మార్జనము చేసి ఆ జలమును శిరమున ధరించినచో సకల పాపముల నుండి విముక్తుడగును. అశ్వమేథ యాగము సకల పాప నీవారకమగునట్లు అఘమర్షణ మంత్రము కూడా సర్వపాప వినాశకముగా పేర్కొనబడినది.
ఉదుత్యం చిత్ర మిత్యేతే తచ్చక్షురితి మంత్రతః ।
హంసః శుచిషదేతేన సావిత్య్రా చ విశేషతః ॥
అన్యైశ్చ వైదికై ర్మంత్రైః సౌరైః పాపప్రణాశనైః ।
సావిత్రీం పై జపేత్ పశ్చా జ్జపయజ్ఞః స వై స్మృతః ॥
వివిధానీ పవిత్రాణి గుహ్యవిద్యా స్త ధై వ చ ।
శతరుద్రీయ మధర్వ శిర స్సౌరాంశ్చ శక్తితః ॥
ప్రాక్కూలేషు సహసీనః కుశేషు ప్రొఙ్ముఖ శ్శుచిః ॥
పూలతో నిండిన దోయిలిని శిరముపై నింపి సూర్యోపస్థానమును గావించవలయును. ఆ పుష్పములను సూర్యుని పై చల్లి ‘ఉద్వయం తమనస్పర్’ ‘ఉదుత్యం జాతవేదసం’ ‘చిత్రం దేవానా ముదగాదనీకం’ ‘తచ్చక్షు రేవహితం పురస్తాత్’ “హంస శుచి షద్వసురంతరీక్ష” అను మంత్రములతో కాని, గాయత్రీ మంత్రముతోకానీ ఇతర వైదిక మంత్రములతో కాని, పాప నాశకములగు సౌరమంత్రములతో కానీ జపించి తరువాత మరల గాయత్రీ మంత్రము జపించవలయును. ఇదీ జపయజ్ఞమనబడును.
తిష్ఠంశ్చే దీక్ష మాణోఽర్కం జప్యం కుర్యా త్సమాహితః ।
స్ఫాటికేం ద్రాక్ష రుద్రాక్షే పుత్రజీవసముద్భవైః ॥
కర్తవ్యా త్వక్ష మాలాస్యా దుత్తరా దుత్త మా స్మృతా ।
జపకాలే న భాషేత నాన్యాని ప్రేక్షయే ద్బుధః ॥
న కంప యే చ్ఛిరో గ్రీపొం దంతాన్నైవ ప్రకాశయేత్ ।
గుహ్యకా రాక్షసా స్సిద్ధా హరంతి ప్రసభం యతః ॥
ప్రాగగ్రములగు దర్భలపై ప్రాజ్ముఖుడై శుచియై కూర్చొని సూర్యభగవానుని దర్శించుచు సావధాన చిత్తముతో పలువిధములగు పవిత్రములైన మంత్రములను, రహస్య విద్యలను, శతరుద్రీయమును, అధర్వ శిరో మంత్రములను, సౌర మంత్రములను జపించవలయును. నిలుచుని ఉంటే సూర్యుణ్ణిచూస్తూ జపంచేయవలెను. స్పటికమాల, ఇంద్రాక్షమాల, రుద్రాక్షమాల, పుత్రజీవమాల కాని జపమాలగా నుండవలయును. ఈమాలలో మొదటీ మాలకంటే తరువాత చెప్పబడిన మాల శ్రేష్ఠమని తెలియవలయును.
ఏకాంతే తు శుభే దేశే తస్మా జ్ఞాప్యం సమాచరేత్ ।
చండాలాశౌచ పతితాన్ దృష్ట్వా చమ్య పునర్జపేత్ ॥
తై రేవ భాషణం కృత్వా స్నాత్వా చైవ జపే త్పునః ।
ఆచమ్య ప్రయతో నిత్యం జపే దశుచిదర్శనే ॥
జ్ఞానియైన వాడు జపము చేయునపుడు మాటాడరాదు. ఇతరములను చూడరాదు. శిరస్సును మెడను కదిలించరాదు. దంతములను చూపరాదు. ఇట్లు చేసిన ఆ జప ఫలమును గుహ్యకులు రాక్షసులు సిద్దులు బలవంతముగా హరింతురు. కావున ఏకాంతము శుభకరమైన స్థానమున జపము నాచరించవలయును.
సౌరా న్మంత్రాస్ శక్తితో వై పావనీస్తు కామతః ।
యది స్యా త్ల్కిన్నవాసా వై వారిమధ్యగతో జపేత్ ॥
అన్యధా తు శుచౌ భూమ్యాం దర్భేషు సుసమాహితః ।
ప్రదక్షిణం సమావృత్య నమస్కృత్వా తతః క్షితౌ ॥
ఆచమ్య చ యధాశాస్త్రం శక్త్యా స్వాధ్యాయ మాచరేత్ ।
తత సంతర్పయేత్ దేవాన్ ఋషీ నితృగణాం స్తథా ॥
జపము చేయుచున్నపుడు, చండాలులను, అపవిత్రులను, పతితులను చూచినచో ఆచమనము చేసి మరల జపించవలయును. ఒకవేళ వారితో మాట్లాడినచో స్నానము చేసి జపించవలయును. అపవిత్ర వస్తువులను చూచినచో ఆచమనము గావించి సావధానముతో మరల జపించవలయును. తడి వస్త్రమును ధరించియున్నచో నీటి మధ్యన నుంచి యధాశక్తి సౌరమంత్రములను కాని, ఇచ్ఛానుగుణముగా పవమాన మంత్రములను జపించవలయును. తడిబట్ట కానిచో పవిత్ర భూమియందు దర్భలపై కూర్చొని ఏకాగ్రముతో జపించవలయును.
ఆదావోం కార ముచ్చార్య నమోంతే తర్పయామి వః ।
దేవా న్బ్రహ్మర్షీం శ్చైవ తర్పయే దక్షతోధకైః ॥
తీలోదకైః పితౄన్ భక్త్యా స్వసూత్రోక్తవిధానతః ।
అన్వారబ్థేన సవ్యేన పాణీనా దక్షిణేన తు ॥
జపము ముగిసిన తరువాత ప్రదక్షిణము నాచరించి భూమిపైన నమస్కరించి శాస్త్ర విధితో ఆచమించీ శక్త్యనుసారము స్వాధ్యాయమును ఆచరించవలయును. ఆ తరువాత దేవతలను ఋషులను పితృగణమును మొదట ఓంకారము చివర నమః అనీ తరువాత వః తర్పయామి అను తర్పణములను గావించవలయును.
దేవర్షీం స్తర్పయేత్ ధీమాన్ ఉదకాంజలిభిః పితృన్ ।
యజ్ఞోపవీతీ దేవానాం నివీతీ ఋషితర్పణే ॥
ప్రాచీనావీతి పిత్ర్యే తు స్వేన తీర్థన భావతః ।
నిష్పీడ్య స్నానవస్త్రం తు సమాచమ్య చ వాగ్యతః ॥
స్వైః మంత్రై రర్చయేత్ దేవాన్ పుష్పైః పత్రై రథాంబుఖీః ।
బ్రహ్మాణం శంకరం సూర్యం తథైవ మధుసూదనమ్ ॥
దేవతలను బ్రహ్మఋషులను కూడా అక్షతోదకములతో తర్పణము గావించవలయును. స్వసూత్రోక్త విధానముగా నువ్వులతో పితృదేవతలను తర్పణము గోవించవలయును. ఎడమ చేతి సోయముగల కుడిచేతితో రెండు చేతులు అనగా దోసిలిచే జలముతో దేవతలకు ఋషులకు తర్పణము గావించవలయును. సవ్యముతో దేవతలకు నివీతిగా ఋషులకు ప్రాచీనా వీతిగా పితరులకు తర్పణము గావించవలయును. తమ తమ తీర్థములలో చేయవలయును.
అన్యాం శ్చా భిమతాన్ దేవాన్ భక్త్యా చాక్రోధనోఽత్వరః ।
ప్రదద్యాదథ పుష్పాణి సూక్తేన పౌరుషేణ తు ॥
ఆపో వా దేవతా స్సర్వా స్తేన సమ్యక్సమర్చితాః ।
ధ్యాత్వా ప్రణవపూర్వం వై దేవతానీ సమాహితః ॥
పితృ తర్పణమునకు పూర్వము దేవతాతర్పణ విషయమున వస్త్రమును (స్నాన) చక్కగా పిండుకొని ఆచమును గావించి వాజ్నియమముతో తమ శాఖోక్త మంత్రములతో పుష్ప పత్ర జలములతో దేవతలకు తర్పణము గావించవలయును. బ్రహ్మను శంకరుని సూర్యుని శ్రీ మహావిష్ణువును ఇతరేష్ట దేవతలను భక్తితో కోపమును విడిచి పూజించవలయును.
నమస్కారేణ పుష్పాణి విన్యసే ద్వై పృధక్ పృధక్ ।
న విష్ణ్వారాధనా త్పుణ్యం విద్యతే కర్మ వైదికమ్ ॥
తస్మా దనాదిమధ్యాంతం నిత్య మారాధయేద్ధరిమ్ ।
తద్విష్ణోరితి మంత్రేణ సూక్తన పురుషేణతు ॥
నైతాభ్యాం సదృశో మంత్రో వేదేషూ క్త శ్చ తుర్ష్యపీ ।
నివేదయేత స్వాత్మానం విష్ణా వమలతేజసి ॥
పురుష సూక్తముతో శ్రీహరిని తర్పించవలయును. జలము సర్వదేవతా స్వరూపము కావున జలముతో చక్కగా అర్చించవలయును. సావ ధాన పూర్వకముగా ఓంకారోచ్చారణ పూర్వకముగా దేవతలను ధ్యానించి విడివిడిగా నమస్కారముతో పుష్పమును సమర్పించవలయును. శ్రీ మహా విష్ణు నారాధించుటకంటే పవిత్ర వైదిక కార్యమింకొకటి లేదు. కావున అనాది మధ్య నీధనుడగు శ్రీహరిని ప్రతినిత్యము ఆరాధించ వలయును.
తదాత్మా తన్మనా శ్శాస్త స్తద్విష్ణో దితి మంత్రతః ।
అథవా దేవ మాశానం భగవంతం సనాతనమ్ ॥
ఆరాధయేన్మహాదేవం భావపూతో మహేశ్వరమ్ ।
మంత్రేణ రుద్రగాయత్ర్యా ప్రణనే నాథ వా పునః ॥
ఈశానేనాథవా రుద్రై స్త్య్రంబకేన సమాహితః ।
పుష్పెః పత్రై రథోద్భిర్వా చందనాద్యై ర్మహేశ్వరమ్ ॥
‘తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్త’ ఇత్యాది మంత్రము పురుష సూక్తము” ఈ రెండిటితో సమానమగు మంత్రము నాలుగు వేదములలో ఇంకొకటీ లభించదు. పరిశుద్ధ తేజోవంతుడగు శ్రీహరి యందు తనను తాను నివేదించుకోనవలయును. ‘తద్విష్ణోః ఇత్యోది మంత్రముతో తదాత్ముడై అతనియందే మనసు నుంచి శాంతుడు కావలయును. లేనిచో సనాతనుడు భగవంతుడు మహాదేవుడు మహేశ్వరుడగు ఈశానుని భావపూతుడై ఆరాధించవలయును.
ఉక్త్వా నమశ్ళిపోయేతి మంత్రేణానేన యోజయేత్ ।
నమస్కుర్యా న్మహాదేవం ఋతం సత్య మితీశ్వరమ్ ॥
నివేదయిత స్వాత్మానం యో బ్రహ్మాణ మితీశ్వరమ్ ।
ప్రదక్షిణం ద్విజః కుర్యాత్ పంచ బ్రహ్మాణి వై జపన్ ॥
ధ్యాయీత దేవ మీశానం వ్యోమమధ్యగతం శివమ్ ।
అధా వలోకయే దర్కం హంసః శుచిష దిత్యృచా ॥
రుద్రగాయత్రితో, ప్రణవముతో ఈశాన మంత్రములతో రుద్ర మంత్రములతో త్ర్యంబకముతో సావధానుడై పుష్పములతో పత్రములతో జలముతో చందనాదులతో కాని ‘నమశ్శివాయ’ అని మంత్రముతో యోజన చేయవలయును. ‘ఋతంసత్యం’ అని ఈశ్వరుని నమస్కరించవలయును. ‘యోబ్రహ్మాణర’ అను మంత్రము ద్వారా స్వాత్మ నివేదనము గావించుకొన వలయును.
కుర్యాత్పంచ మహాయజ్ఞాన్ గృహం గత్వా సమాహాతః ।
దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం తదైవ చ ॥
మానుష్యం బ్రహ్మయజ్ఞం చ పంచ యజ్ఞా స్ప్రచక్షతే ।
యది స్యా తర్పణా దర్వాక్ బ్రహ్మయజ్ఞః కృతో నహీ ॥
కృత్వా మనుష్యయజ్ఞం పై తత స్స్వాధ్యాయ మాచరేత్ ।
అగ్నేః పశ్చిమతో దేశే భూత యజ్ఞాంత ఏవ వా ॥
శివుని పంచనామములను జపించుచు ప్రదక్షిణము గావించవలయును. ఆకాశమధ్య గతుడగు శివునీ ఈశాన దేవుని ధ్యానించవలయును. తరువాత “హంస శ్శుచిషద్వసు” ఇత్యాది మంత్రములతో ఆదిత్య భగవానుని దర్శించుకొనవలయును. తరువాత ఇంటికి వెళ్ళి సావధాన మనస్కుడై పంచ మహా యజ్ఞముల నాచరించవలయును. దేవ యజ్ఞము పితృ యజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము (అతిథి యజ్ఞము) బ్రహ్మ యజ్ఞము అనునవి పంచ మహా యజ్ఞములు.
కుశపుంజే సమాసీనః కుశపాణి స్సమాహితః ।
శాలాగ్నౌ లౌకికే వాగ్నౌ జలే భూమ్యా మథాపినా ॥
వైశ్వదేవం తతః కుర్యాత్ దేవయజ్ఞ స్సవై స్మృతః ।
యది స్యా ల్లౌకికే పక్వం తతోఽన్నం తత్ర హూయతే ॥
శాలాగ్నౌ తత్ర దేవాన్నం విధిరేష సనాతనః ।
దేవేభ్యస్తు హుతా దన్నా చ్ఛేషా ద్భూత బలిం హరేత్ ॥
భూతయజ్ఞ స్స వైజ్ఞేయో భూతీద స్సర్వదేహినామ్ ।
శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్చ పతీతాదీభ్య ఏవ చ ॥
దద్యా ద్భూమౌ బలిం త్వన్నం పక్షిభ్యోథ ద్విజోత్తమః ।
సాయం చాన్నస్య సిద్ధస్య పత్న్య మంత్రం బలిం హరేత్ ॥
భూతయజ్ఞ స్త్వయం నిత్యం సాయం ప్రాత ర్విధీయతే ।
ఏకంతు భోజయేత్ విప్రం పితృనుద్దిశ్య సత్తమమ్ ॥
నీత్యశ్రాద్ధం తదుద్దీష్టం పితృయజ్ఞో గతి ప్రదః ।
ఉద్ధృత్య నా యధాశక్తి కించిదన్నం సమాహితః ॥
వేదతత్త్వార్థ విదుషే ద్విజాయై వోషపాదయేత్ ।
పూజయే దతిథిం నిత్యం నమస్యే దర్చయే ద్ద్విజమ్ ॥
తర్పణమునకంటె పరంగా బ్రహ్మ యజ్ఞము చేయనిచో మనుష్య యజ్ఞము చేసిన తరువాత బ్రహ్మ యజ్ఞమును చేయవలయును. అగ్నికి పశ్చిమ దిక్కున భూతయజ్ఞము చివర దర్భలపై దర్భల ధరించి సావధానుడై కూర్చొని యజ్ఞాగ్నిలో కాని లౌకికగ్నిలో కాని జలము నందు కాని, భూమీ యందు కాని వైశ్వ దేవమును చేయవలయును. దీనినే దేవ యజ్ఞమందురు. లౌకికాగ్నిలో అన్నము వండినచో దీనిలోనే హవనము చేయవచ్చును. శాలాగ్నిలో అన్నము వండినచో వైశ్వదేవము చేయవలయును. ఇదియు సనాతన విధి. దేవయజ్ఞము చేయగా మిగిలిన అన్నముతో భూత యజ్ఞము చేయవచ్చును. ఇది యేభూతయజ్ఞము, అన్ని ప్రాణులకు ఐశ్వర్యమును ప్రసాదించును. కుక్కలకు చండాలులకు, పతితులకు, పక్షులకు భూమిపై అన్న మునీయ వలయును. భార్య సాయంకాలము వండిన అన్నమును మంత్ర రహితముగా బలి చేయవలయును. ఇదియే భూతయజ్ఞము. ప్రాతః సాయంకాలములందు విధించబడి యున్నది. ప్రతి నిత్యము ఒక ఉత్తమ బ్రాహ్మణుని భుజింప చేయవలయును. ఈ భోజనము పితృ దేవతలను ఉద్దేశించి చేయవలయును. ఇదియే నిత్య శ్రాద్దము. పితృ యజ్ఞము అనబడును. ఇది ఉత్తమగతిని ప్రసాదించును.
మనోవాక్కర్మభిః శాంత మాగతం స్వగృహాం తతః ।
హంతకార మధాగ్రం వా భిక్షాం వా శక్తితో ద్విజః ॥
దద్యా దతిథయే నిత్యం బుధ్యత పరమేశ్వరమ్ ।
భిక్ష మాహు ర్గ్రాసమాత్రమ గ్రం తస్యా శ్చతుర్గుణమ్ ॥
పుష్కలం హంతకారం తు తచ్చతుర్గుణ ముచ్యతే ।
గోదోహమాత్రం కాలం వై ప్రతీక్ష్యో హ్యతిథ స్స్వయమ్ ॥
లేదాతన శక్యను సారము కొద్దిగా అన్నమును తీసి సౌవధానముతో వేద తత్త్వార్థము తెలిసిన బ్రాహ్మణునకు అర్పించవలయును. ప్రతి దినము అతిథిని పూజించవలయును. నమస్కరించవలయును. అర్చించవలయును. తన ఇంటికి వచ్చిన వానీని త్రికరణ శుద్ధిగా హంతకారమును అగ్రముకానీ భిక్షను కానీ శక్త్యానుసారముగా అతిథికి ఈయ వలయును. అతిథిని పరమేశ్వరునిగా భావించవలయును.
అభ్యాగతాన్ యథాశక్తి పూజయే దతిథిం యథా ।
భీక్షం వై భిక్షనే దద్యాత్ విధివద్బ్రహ్మచారిణే ॥
దద్యా దన్నం యథాశక్తి త్వర్థిభ్యో లోభవర్జితః ।
సర్వేషా మ ప్యలాభేతు అన్నం గోభ్యో నివేదయేత్ ॥
భుంజీత బంధుభి స్సార్థం వాగ్యతోఽన్న మకుత్సయన్ ।
అకృత్వా తు ద్విజః పంచ మహాయజ్ఞాన్ ద్విజోత్తమాః ॥
భుంజీత చేత్స మూఢాత్మా తిర్యగ్యోనిం స గచ్ఛతి ।
వేదాభ్యాసోన్వహం శక్త్యా మహాయజ్ఞక్రీయా క్షమా ॥
అన్నమును భిక్షయనీ అన్నమునకు నాలుగురెట్లను అన్నాగమనీ అందురు. అన్నోగ్రమునకు నాలుగురెట్లు హంతకారమందురు. గోదోహన కాల పర్యంతము స్వయముగా అతిథికొరకు ప్రతీక్షించవలయును. అట్లు వచ్చిన అభ్యాగతులను కూడా అతిథి తుల్యముగా పూజించవలయును. బ్రహ్మచారీ యగు భిక్షునకు యధావిధిగా భీక్ష నిడవలయును. లోభమును విడిచి యాచకులకు యధాశక్తి అన్నము నీయవలయును. యాచకులు భిక్షుకులు అభ్యాగతులు లభించనిచో అన్నమును గోవుల కర్పించవలయును. తరువాత అన్నమును నిందించక మౌసముగా బంధువులతో కలిసి భుజించవలయును.
నాశయ త్యాశు పాపాని దేవానా మర్చనం తధా ।
యో మో హా దథవాలస్యా దకృత్వా దేవతార్చనమ్ ॥
భుంక్తే స యాతి నరకాన్ శూకరే ష్వభిజాయతే ।
తస్మా త్సర్వప్రయత్నేన కృత్వా కర్మాణి వై ద్వీజాః ॥
భుంజీత స్వ జనై సార్థం స యాతి పరమాం గతిమ్ ॥
ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే అష్టాదశోధ్యాయః
ద్విజుడు పంచ మహా యజ్ఞములను చేయకుండగా భుజించినచో పశు జాతిలో పుట్టును. ప్రతి దినము వేదాధ్యయనము యథాశక్తి పంచ మహాయజ్ఞములు, క్షమ దేవత పూజ ఇవి శీఘ్రముగా పాపములను నశింప చేయును. మోహముతోకాని బద్దకముతో కాని దేవతార్చన గావించక భుజించినచో నరకములను పొందును. తరువాత గ్రామ సూకరముగా పుట్టును.
కావున సర్వవిధ ప్రయత్నములతో నిత్యకర్మలను శాస్త్ర విధి ననుసరించి ఆచరించిన తరువాత ద్వీజుడు తన వారితో కలిసి భుజించినచో ఉత్తమగతిని పొందును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 18వ అధ్యాయము
Summary of chapter 71 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa details the mandatory daily routines for a Brāhmaṇa, starting from rising during Brāhmamuhūrta to meditate upon Parameshvara. He describes various forms of holy bathing (Snāna), including Brāhma, Āgneya, Vāyavya, Divya, Vāruṇa, and Yaugika Snāna. Vyāsa emphasizes the morning and mid-day Sandhyāvandana, Gāyatrī-japa, Sūryopasthāna with the sacred Sūryahṛdaya hymn, and the offering of Tarpaṇa to Devas, Ṛshis, and Pitṛs.