కూర్మ మహా పురాణము
40వ అధ్యాయము
మార్కండేయ ఉవాచ -
తతో గచ్ఛేత రాజేంద్ర భృగుతీర్థ మనుత్తమం ।
తత్ర దేవౌ భృగుః పూర్వం రుద్ర మారాధయత్ పురా ॥
దర్శనాత్ తస్య దేవస్య సద్యః పాపాత్ ప్రముచ్యతే ।
ఏతత్ క్షేత్రం సువిపులం సర్వపాపప్రణాశనమ్ ॥
తత్ర స్నాత్వా దివం యాంతి యే మృతా స్తే పునర్భవాః ।
ఉపానహో స్తథా యుగ్మం దేయ మన్నం సకాంచనమ్ ॥
భోజనం చ యధాశక్తి తదస్యాక్షయ ముచ్యతే ।
క్షరంతి సర్వదానాని యజ్ఞదనతపః క్రియాః ।
అక్షయ్యం తత్ తప స్తవం భృగుతీర్థే యుధిష్ఠిర ॥
తస్యైవ తపసోద్రేణ తుష్టేన త్రిపురారీణా ।
సాన్నిధ్యం తత్ర కధీతం భృగుతీర్థే యుధిష్ఠిర॥
తతో గచ్ఛేత్తు రాజేంద్ర గౌతమేశ్వర ముత్తమం ।
యత్రారాధ్య త్రిశూలాజ్కం గౌతమః సిద్ధి మాప్నువత్॥
తత్ర స్నాత్వానరో రాజన్ ఉపవాసపరాయణః ।
కాంచనేన విమానేన బ్రహ్మలోకే మహీయతే॥
వృషోత్సర్గో తతో గచ్ఛే చ్ఛ్వాశ్వతం పద మాప్నుయాత్ ।
న జానంతి నమూఢాః విష్ణో ర్మాయావీమోహితాః॥
ధౌతపాపం తతో గచ్ఛేత్ గౌతం యత్ర వృషేణతు ।
నర్మదాయాం స్థితం రాజన్ సర్వపాతకనాశనమ్।
తత్ర తీర్దే నరః స్నాత్వో బ్రహ్మహత్యాం వ్యపోహతి ॥
తత్ర తీర్థేతు రాజేంద్ర ప్రాణత్యాగం కరోతి యః ॥
చతుర్భుజ గ్రినేత్రశ్చ హరతుల్యబలో భవేత్।
వసేత్ కల్పాయుతం సాగ్రం శివతుల్యపరాక్రమః॥
కాలేన మహతో జాతః పృధివ్యా మేకరా ద్భవేత్।
తతో గచ్ఛేత రాజేంద్ర హంసతీర్థ మనుత్తమం ॥
తత్ర స్నాత్వా నరో రాజన్ బ్రహ్మలోకే మహీయతే ।
తతో గచ్ఛేత రాజేంద్ర సిద్దో యత్ర జనార్దనః ॥
వరాహతీర్థ మాఖ్యాతం విష్ణులోకగతిప్రదమ్।
తతో గచ్ఛేత రాజేంద్ర చంద్రతీర్థ మనుత్తమమ్ ॥
పౌర్ణమాస్యాం విశేషేణ స్నానం తత్ర సమాచరేత్ ।
స్నాతమాత్రో నర స్తత్ర చంద్రలోకే మహీయతే ॥
తతో గచ్ఛేత రాజేంద్ర కన్యాతీర్థ మనుత్తమం ।
శుక్లపక్షే తృతీయాయాం స్నానం తత్ర సమాచరేత్॥
స్నాతమాత్రో సర సత్ర పృధివ్యా మేకగాడ్ భవేత్ ।
దేవతీర్థం తతో గచ్ఛేత్ సర్వదేవనమస్కృతం ॥
తత్ర స్నాత్వా చ రాజేంద్ర దైవతైః సహ మోదతే ॥
తతో గచ్చేత రాజేంద్ర శిఖితీర్థ మనుత్తమం ।
యత్ తత్ర దీయతే దానం సర్వం కోటిగుణం భవేత్ ॥
తతో గచ్ఛేత రాజేంద్ర తీర్థం పైతామహం శుభం ।
యత్ తత్ర క్రియతే శ్రాద్ధం సర్వం తదక్షయం భవేత్ ॥
సావిత్రీతీర్ధ మాసాద్య యస్తు ప్రాణాన్ పరిత్యజేత్ ।
వీధూయ సర్వపాపానీ బ్రహ్మలోకే మహీయతే ॥
మనోహరం తు తత్రైవ తీర్థం పరమశోభనం ।
తత్ర స్నాత్వా నరో రాజన్ దైవతైః సహ మోదతే ॥
మార్కండేయుడు పలికెను.
రాజేంధ్రా! అటనుండి ఉత్తమమగు భృగు తీర్థమునకు వెడలపలెను. అచ్చటనే భగవానుడగు భృగువు పూర్వమొకానొకపుడు రుద్రుని ఆరాధించెను. అచట దేవుని దర్శించుటవలన పాపములన్నియు వెంటనే నశించును. విశాలమగు ఈ క్షేత్రము సర్వపాపప్రశమనము. అచట స్నానము చేసినవారు, స్వర్గమును చేరుదురు. అచట మరణించినవారు మరల పుట్టరు. ఇచట పాదరక్షల యుగ్మమును, బంగారమును, అన్నమును దానము చేయవలెను. శక్త్యను సారముగా భుజింపచేసిన అక్షయ ఫలము లభించును. అన్నీ దానములు క్షీణించును. కాని భృగు తీర్థములో ఆచరించిన యజ్ఞము, దానము, తపస్సు అక్షయ ఫలము నిచ్చును. భృగు మహర్షి ఆచరించిన ఉగ్రమగు తపస్సుకు సంతోషించిన శంకరుడు, ఇచట ఎపుడు ఉండేదనని వరమిచ్చెను.
అక్కడినుండి గౌతమేశ్వర తీర్ధమునకు వెళ్లవలెను. ఇచట గౌతముడు శంకరుని ఆరాధించి సిద్ధిని పొందెను. ఈ తీర్థమున స్నానముచేసి, ఉపవసించినవాడు, బంగారు విమానముతో బ్రహ్మలోకము చేరును. ఇక్కడినుండి వృషోత్సర్గ తీర్థమునకు వెడలిన శాశ్వతఫలము పొందెదరు.
ఈ క్షేత్రమును దర్శించనివారు విష్ణుమాయావిమోహితులై మూఢులై, పరతత్వమును తెలియ జాలరు. ఇక్కడి నుండి గౌతపాపతీర్థమునకు వెడల వలెను. ఈ తీర్థమున ధర్ముడు, తన కల్మషమును శుద్ది చేసికొనెను. ఈ తీర్థము నర్మదానదీ ప్రాంతములో గలదు. ఇచట స్నానము చేసినవాడు, బ్రహ్మహత్యాపాతకము తొలగించుకొనును. ఈ తీర్థమున త్యాగమును చేసినవారు సొల్లుభుజములు, మూడు నేత్రములు కలిగి, శంకరతుల్య బలము కలవాడగును. అతడు భూమండలమునకు చక్రవర్తియగును. పదివేల కల్పముల కాలము శివలోకమున నివసించును, ఇక్కడినుండి హంస తీర్థమునకు వెళ్లవలెను. ఈ తీరమున స్నానము చేసిన వాడు, బ్రహ్మ లోకమున నివసించును. ఇటనుండి జనార్దనుడు సిద్ధి పొందిన వారాహ తీర్థమునకు వెళ్లవలెను. ఈ తీర్దము విష్ణులోకము ప్రసాదించును.
ఇక్కడినుండి చంద్ర తీర్థమునకు వెడలవలయును. విశేషించి ఈ తీర్థమున పూర్ణిమనాడు స్నానము చేయవలయును. స్నానము మాత్రమున చంద్రలోకనివాసము కలుగును. ఇక్కడినుండి కన్యా తీర్థమునకు వెళ్లవలెను. శుద్ధతృతీయనాడు ఈ తీర్థమున స్నానముచేసినవాడు చక్రవర్తియగును. దేవతలందరిచే నమస్కరించబడు దేవ తీర్థమునకు అటనుండి వెళ్లవలేను. ఇచట స్నానము చేసినవాడు దేవతలతో కలిసి ఆనందించును. ఇక్కడి నుండి పరమోత్తమమైన శిశు తీర్ణమునకు వెడలవలెను. ఇచట చేసినదానము కోటి గుణమగును, అక్కడినుండి పీతామహ తీర్థమునకు వెళ్లవలెను. ఇచట చేయు శ్రాద్దము అక్షయమగును. అక్కడి నుండి సావిత్రీ తీర్థము దర్శించవలెను. ఈ తీర్థమున ప్రాణములు విడిచిన వాడు అన్నీ పాపములు తొలగి, బ్రహ్మలోకమును పొందును. ఇచటనే మనోహరమగు మరోక తీర్థము గలదు. ఇందు స్నానమాడినవాడు దేవతలతో కలిసి విహరించును.
తతో గచ్ఛేత రాజేంద్ర మానసం తీర్థ ముత్తమం ।
స్నాత్వా తత్ర నరో రాజన్ రుద్రలోకే మహీయతే ॥
స్వర్గబిందుం తతో గచ్ఛేత్ తీర్థం దేవనమస్కృతం ।
తత్ర స్నాత్వా నరో రాజస్ దుర్గతిం నైవ గచ్ఛతి ॥
అప్సరేశం తతో గచ్ఛేత్ స్నానం తత్ర సమాచరేత్ ।
క్రీడతే నాకలోకస్థో హ్యప్సరోభిః స మోదతే ॥
తతో గచ్ఛేత రాజేంద్ర భారభూతీ మనుత్తమం ।
ఉపోషితో ర్చయే దేవం రుద్రలోకే మహీయతే॥
అస్మీం స్తీర్దే మృతో రాజన్ గాణాపత్య మవాప్నుయాత్॥
కార్తికే మాసీ దేవేశ మర్చయేత్ పార్వతీపతిం ।
అశ్వమేధాత్ దశగుణం ప్రవదన్త మనీషిణః ॥
వృషభం యః ప్రయచ్ఛేత యత్ర కుందేందుసప్రభం ।
వృషయుక్తేన యానేన రుద్రలోకం స గచ్ఛతి ॥
ఏతత్ తీర్థం సమాసాద్య యస్తు ప్రాణాన్ పరిత్యజేత్ ।
సర్వపాపవిశుద్దాత్మా రుద్రలోకం స గచ్ఛతి ॥
జలప్రవేశం యః కుర్యాత్ తస్మిం తీర్దే నరాధిప ।
హంసయుక్తేన యానేన స్వర్గలోకం స గచ్ఛతి ॥
ఏరండ్యా నర్మదాయాస్తు సంగమం లోకవిశ్రుతం ।
తత్ర తీర్థం మహాపుణ్యం సర్వపాపప్రణాశనం ॥
ఉపవాసపరోభూత్వానిత్యంప్రతపరాయణః ।
తత్రస్నాత్వాతురాజేంద్రనర్మదోదధిసంగమే ॥
తతో గచ్ఛేతరాజేంద్ర నర్మదోదధిసంగమమ్ ।
జమదగ్ని రీతిఖ్యాతః సీద్ధోయత్రజనార్దనః॥
ఇక్కడ నుండి మానస తీర్థమున చేరి, స్నానము చేసినవాడు రుద్రలోకమును పొందును. అక్కడినుండీ, దేవతలచే నమస్కరించబడు స్వర్గబిందు తీర్థమునకు వెడలి స్నానము చేసినచో, దుర్గతిని పొందజాలడు. అక్కడినుండి అప్సరేశ తీర్థమునకు వెడలి స్నానమాచరించిన, స్వర్గమున అప్సరసలతో క్రీడించుచు ఆనందించును. ఇక్కడినుండీ భారభూతి తీర్థమును దర్శించి, స్నానమాడి, ఉపవసించి, శివుని అర్చించినచో, రుద్ర లోకమున వసించును. ఈ తీర్థమున మృతి చెందినవాడు గాణాపత్యమును పొందును ఈ తీర్థమున కార్తీకమాసమున పార్వతీపతిని ఆరాధించినవాడు, అశ్వమేథమునకు పదిరెట్లు ఫలితము పొందునని పండితులు చెప్పెదరు. ఈ తీర్థమున తెల్లని ఎద్దును దానము చేసిన వృషభవాహనముతో రుద్రలోకము చేరును. ఈ తీర్ణమున ప్రాణములు విడిచినవాడు సర్వపాప విముక్తుడై, రుద్రలోకమును పొందును. ఈ తీర్థమున జలప్రవేశము చేసినవాడు హంసయుక్త పోహనముతో స్వర్గలోకమును పొందును. ఇక్కడ జగత్ర్పసిద్దమగు 'ఏరండీనర్మదా' సంగమము కలదు. ఇది పరమ పావనము. సర్వపాప ప్రణాశనము. ఇచట స్నానమాడి, ఉపవసించి, ప్రత పరాయణుడైనవాడు, బ్రహ్మ హత్యాపాతకమును గూడా పోసోడును.
ఇక్కడినుండి, నర్మదా సముద్రసంగమమునకు వెళ్లవలెను. ఈ తీర్థమున జనార్దనుడు జమదగ్ని నామముతో సిద్ది పొందెను. ఈ నర్మదా సముద్ర సంగమములో స్నానము చేసినవాడు అశ్వమేధయాగమునకు మూడింతల ఫలమును పొందును.
తత్ర స్నా త్వా నరో రాజన్ నర్మదోదధిసంగమే ।
త్రిగుణం చాశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥
తతో గచ్చేత రాజేంద్ర ఆలికాతీర్థ ముత్తమం ।
ఉపోష్య రజనీ మేకాం నీయతో నియతాశనః ।
అస్య తీర్థస్య మాహాత్మ్యా న్ముచ్యతే బ్రహ్మహత్యయా ॥
ఏతాని తవ సంక్షేపాత్ ప్రాధాన్యాత్ కథితాన తు ।
న శక్యా విస్తరాత్ వక్తుం సంఖ్యా తీర్ధేషు పాండవ ॥
ఏషా పవిత్రో విమలా నదీ త్రైలోక్యవిశ్రుతా ।
నర్మదా సరితాం శ్రేషా మహాదేవస్య వల్లభా ॥
మనసా సంస్మరే ద్యస్తు నర్మదాం వై యుధిష్ఠిర ।
చాంద్రాయణశతం సాగ్రం లభతే నాత్రసంశయః ॥
అశ్రద్ధధానాః పురుషాః నాస్తిక్యం ఘోరమాశ్రితాః ।
పతంతి నరకే ఘోరే ఇత్యోహ పరమేశ్వరః ॥
నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వరః ।
తేన పుణ్యా సదీ జ్ఞేయా బ్రహ్మహత్యాపహారిణీ ॥
ఇది శ్రీకూర్మ పురాణే ఉత్తరార్థే చత్వారింశోధ్యాయః
ఇక్కడి నుండి పింగళేశ్వర తీర్థమునకు వెడలవలెను. ఇందు స్నానమాడిసపోడు రుద్రలోకమును చేరును. ఇందుపవసించి, విమలేశ్వరుని దర్శించినవాడు నూరు జన్మలనుండి చేసిన పాపము తొలగించుకొనీ, శివసాన్నిధ్యము చేరును. ఇచటనుండి 'ఆలికా' తీర్థమునకు వెళ్లి స్నానము ఒకదినము ఉపవాసముతో, మనోనియమమున చరించినవాడు, బ్రహ్మహత్యాపాప వినిర్ముక్తుడగును. ఇట్లు సంక్షేపముగా నీకు ప్రధానముగు తీర్థములను చేప్పితిని. విస్తరముగా చెప్పటకుగాని, తీర్థ సంఖ్యను చెప్పుటకుగానీ శక్తి చాలదు. ఈ నర్మదానది పవిత్రము, పరిశుద్ధము, త్రిలోకప్రసిద్దము అన్ని నదులలో శ్రేష్టము మహాదేవునికి ప్రియము. నర్మదను మనసుతో స్మరించినవాడు, నూరు చంద్రాయణవ్రతముల ఫలము పొందును. శ్రద్దను విడిచి, నాస్తిక్యము పొందిన క్రూరులు ఘోర నరకమున పడుదురని, మహాదేవుడు తెలిపెను.
ఈ నర్మదానది సమీపమున ఎపుడు మహాదేవుడు నివసించి యుండును. కావున సర్మదానది పుణ్యప్రదము. బ్రహ్మహత్యానివారకమని తెలియవలయును.
ఇది కూర్మపురాణమున షట్సాహస్రసంహితలో ఉపరి విభాగమున నలుబదియవ అధ్యాయము.
Summary of chapter 93 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa describes the divine glory of Gayā Tīrtha, established upon the body of the noble Asura Gayāsura. He details how performing Piṇḍadāna and Śrāddha at Gayāśiras and Vishṇupada permanently liberates ancestors from all lower realms, elevating them to eternal heavenly realms.