కూర్మ మహా పురాణము
46 - భువనన్యాసవర్ణనమ్
సూత ఉవాచః-
చతుర్దశ సహస్రాణి యోజనానాం మహాపురీ।
మేరో రుపరి విఖ్యాతా దేవదేవస్య వేధసః॥
తత్రాస్తే భగవాన్ బ్రహ్మా విశ్వాత్మా విశ్వభావనః ।
ఉపాస్యమానో యోగీoధ్రై ర్మునీంద్రోపేన్ద్రశంకరైః॥
సూతుడిట్లుపలికెను.
మేరుపర్వతము పైన దేవదేవుడైన బ్రహ్మయొక్క పదునోలు వేలయోజనముల ప్రసిద్ధమైన మహాపురి కలదు. విశ్వాత్ముడు, విశ్వభావనుడు, భగవంతుడును అగు బ్రహ్మ యోగీంద్రులచే, మునీంద్ర, విష్ణు, శంకరులచే సేవింపబడుచు నివసించు చున్నాడు.
తత్ర దేవేశ్వరేశానం విశ్వాత్మానం ప్రజాపతిమ్ ।
సనత్కుమారో భగవా నుపాస్తే నిత్య మేవ హి ॥
స సిద్ధఋషిగన్దర్వైః పూజ్యమానః సురై రపీ ।
సమాస్తే యోగయుక్తాత్మా పీత్వా త త్పరమామృతమ్ ॥
తత్ర దేవాధిదేవస్య శమ్భో రమితతేజసః ।
దీప్త మాయతనం శుభ్రం పురస్తాద్భ్రహ్మణః స్థితమ్ ॥
దీవ్యహస్తాసమాయుక్తం చతుర్ద్వారం సుశోభనమ్ ।
మహర్షిగణసంకీర్ణం బ్రహ్మవిద్భి నిషేవితమ్ ॥
దేవ్యా సహ మహాదేవః శశాఙ్కార్మాగ్నిలోచనః ।
రమతే తత్ర విశ్వేశః ప్రముథైః ప్రమథేశ్వరః ॥
తత్ర వేదవిదః శాన్తా మునయో బ్రహ్మచారిణః ।
పూజయన్తి మహాదేవం తపసా సత్యవాదినః ॥
అక్కడ దేవతలందరికి ప్రభువైన, విశ్వాత్మకుడైన ప్రజాపతి అను బ్రహ్మను పూజ్యుడైన సనత్కుమారుడు ఎల్లప్పుడు సేవించుచుండును.
ఆ ప్రజాపతి, సిద్దులు, ఋషులు, గంధర్వులు, దేవతలు మొదలగు వారిచేత పూజింపబడుచు, శ్రేష్ఠమైన అమృతమును సేవించి, యోగముతో కూడిన వాడై నివసించియుండును.
ఆ ప్రదేశములో బ్రహ్మయొక్క ముందు భాగములో, దేవాధిదేవుడు, గొప్పతేజస్సు కలవాడును అగు శివునియొక్క ప్రకాశవంతము, నిర్మలము అయిన మందీరము కలదు.
అది దివ్యమైన కాంతితో కూడినది, నాలుగు ద్వారములు కలిగి మిక్కిలి మంగళకరమైనది, గొప్పఋషుల సమూహముతో నిండియున్నది, బ్రహ్మవేత్తలచే సేవింపబడునదై ఉండును.
అక్కడ సూర్యచంద్రాగ్నులు కన్నులుగా గల శంకరుడు ప్రమథగణాధిపతి, ప్రమథులతో, పార్వతీదేవితో గూడ విహరించుచుండును.
ఆచోట వేదవేత్తలు, శాంతచిత్తులు అగుమునులు, బ్రహ్మచారులు, సత్యవాదులు అగువారు తపస్సుతో మహాదేవుని ఆరాధింతురు.
తేషాం సాక్షా న్మహాదేవో మునీనాం భావితాత్మనామ్ ।
గృహ్ణాతి పూజాం శిరసా పార్వతి పరమేశ్వరః ॥
తత్రైవ పర్వతవరే శక్రస్య పరమ పురీ ।
నామ్నాఽమరావతీ పూర్వే సర్వశోభాసమన్వితా॥
తత్ర చాప్సరసః సర్వా గన్దర్వాః సిద్ధచారణాః ।
ఉపాసతే సహస్రాక్షం దేవా సత్ర సహస్రశః॥
యే ధార్మికా వేదవీదో యాగహెూమపరాయణాః ।
తేషాం తత్పరమం స్థానం దేవాన మపి దుర్లభమ్॥
తస్మా ద్ధక్షిణదిగ్భాగే వహ్నే రమితతేజసః।
తేజోవతీ నామ పురీ దివ్యశ్చర్యసమన్వితా ॥
తత్రాస్తే భగవా న్వహ్ని ర్ర్భాజమానః స్వతేజసా ।
జపీనాం హెూమినాం స్థానం దానవానాం దురాసదమ్॥
మహానుభావులైన ఆ మునులు మొద॥ వారి యొక్క పూజను సాక్షాత్తు మహాదేవుడగు పరమేశ్వరుడు తన శిరస్సుతో స్వీకరించును. అక్కడ పర్వతశ్రేష్ఠముపైననే తూర్పుదిక్కున అమరావతి అనుపేరుతో సమస్త శోభలతో కూడిన ఇంద్రునియొక్క గొప్పపట్టణము కలదు. దానిలో అందరు అప్సరసలు, గంధర్వులు, సిద్దచారణులు ఇతర దేవతలు వేలకొలదిగా సహస్రాక్షుడైన ఇంద్రుని సేవించుచుందురు.
ధర్మపరులు, వేదములెలిసినవారు, యాగములు, హెూమము చేయుట యందు శ్రద్ధకలవారు ఎవరుకలరో, వారికి శ్రేష్ఠమైన ఆస్థానము పొందదగినది. అది దేవతలకు గూడ దుర్లభమైనదీ.
దానికి దక్షిణ దిక్కున, అధిక తేజస్సుకల అగ్నిదేవుని యొక్క తేజోవతి అనుపేరుకల పట్టణముండును. అది గొప్ప ఆశ్చర్యకర దృశ్యములతో కూడియుండును.
భగవంతుడైన అగ్ని తన తేజస్సుతో ప్రకాశించుచు అక్కడ వసించును. అది జపము చేయువారికీ, హోమము చేయువారికీ స్థానము రాక్షసులకు పొందరానిది.
దక్షిణే పర్వతవరే యమస్యాపి మహాపురీ ।
నామ్నా సంయమనీ దీవ్యా సర్వశోభాసమన్వితా ॥
తత్ర వైవస్వతం దేవం దేవాద్యాః పర్యుపాసతే ।
స్థానం తత్సత్యసన్తానాం లోకే పుణ్యకృతాం నృణామ్॥
తస్యా స్తు పశ్చిమే భాగే నిర్ఋతేస్తు మహాత్మనః ।
రక్షోవతీ నామ పురీ రాక్షసైః సంవృతా తు యా ॥
తత్ర తే నైఋతం దేవం రాక్షసాః పర్యుపాసతే ।
గచ్ఛన్తి తాం ధర్మరతా యే తు తామసవృత్తయః ॥
పశ్చిమే పర్వతవరే వరుణస్య మహాపురీ ।
నామ్నా శుద్ధవతీ పుణ్యో సర్వకామర్ధిసంయుతా ॥
తత్రా ప్సరోగణైః సిద్దైః సేవ్యమానోఽమరాధిపైః ।
ఆస్తే స వరుణో రాజా తత్ర గచ్ఛన్తి యేఽమ్బుదాః ॥
దక్షిణ దిక్కున పర్వతముపైన యమధర్మరాజు యొక్క పెద్దనగరము, సంయమని అనుపేరుకలది, సమస్త శోభలతో కూడి యున్నదై ప్రకాశించును.
అక్కడ దేవతలు మొదలైనవారు, యమధర్మరాజును సేవించుదురు అదీ సత్యసంధులు, పుణ్యవంతులు అగుమనుష్యులకు ప్రాప్యస్థానము. దానికి పడమటి భాగములో, మహాత్ముడైన నిర్ఋతియొక్క పట్టణము రక్షోవతి అనునది కలదు. అది రాక్షసులచే చుట్టబడియుండును.
అక్కడ రాక్షసులు నైఋతదేవుని సేవించుచుందురు. ఎవరైతే లోకములో తమోగుణప్రవృత్తి కలిగి, ధర్మపరులుగా నుందురో వారు ఆపట్టణమును పొందుదురు.
పడమటి పర్వతరాజముపై వరుణదేవుని శుద్ధవతి అను పేరుగల గొప్ప పట్టణము, పుణ్యకరమైనది, అన్ని కోరికల సమృద్ధీకలదిగా నుండును.
దానిలో అప్సరసల సమూహముచేత, సిద్ధులచేత, దేవతలచేత సేవింపబడుచు వరుణ భగవానుడు నివసించును. లోకములో జలదానము చేసినవారు అక్కడకు వెళ్లుదురు.
తస్యా ఉత్తరదిగ్భాగే వాయో రపి మహాపురీ ।
నామ్నా గన్దవతీ పుణ్యా తత్రాస్తేఽసౌ ప్రభఞ్జనః ॥
అప్సరోగణగన్దర్వైః సేవ్యమానో మహా న్ర్పభుః ।
ప్రాణాయామపరా విప్రాః స్థానం తద్యాన్తి శాశ్వతమ్ ॥
తస్యాః పూర్వే తు దిగ్భాగే సోమస్య పరమా పురీ।
నామ్నా కాన్తిమతీ శుభ్రా తస్యాం సోమో విరాజితే ॥
తత్ర యే ధర్మనిరతాః స్వధర్మం పర్యుపాసతే ।
తేషాం త దుచితం స్థానం నానాభోగసమన్వితమ్ ॥
తస్యా స్తు పూర్వదిగ్భాగే శఙ్కరస్య మహాపురీ ।
నామ్నా యశోవతీ పుణ్యా సర్వేషాం సా దురాసదా ॥
దానికుత్తర దిగ్భాగములో పాయువుయొక్క పేద్దపట్టణము గంధవతి అనుపేరు కలదీ, పుణ్యవంతమైనది కలదు. అక్కడ వాయుదేవుడు నివసించును.
అతడు అప్సరసల సమూహముచేత, గంధర్వులచేత సేవింపబడుచు నుండును. ప్రాణాయామ పరాయణులైన బ్రాహ్మణులు ఆస్థానమును శాశ్వతముగో పొందుదురు.
దానికి తూర్పుదిక్కున చంద్రునియొక్క శ్రేష్ఠమైన పట్టణము కలదు. అది కాంతిమతి అను పేరుగలది, స్వచ్ఛమైనది. దానీయందు చంద్రుడు ప్రకాశించుచుండును.
అక్కడ ఎవరైతే ధర్మమునందు శ్రద్ధకలవారై, తమధర్మమును అనుష్ఠింతురో వారికి, అనేక సుఖములతో కూడిన ఆస్థానము తగియున్నది.
ఆ పట్టణమునకు తూర్పుభాగమున శంకరునియొక్క యశోవతి అను పేరుగల గొప్పపురము కలదు. అదిపుణ్యప్రదమైనది, అందరికిని పొందుటకు శక్యము కానిది.
తత్రే శానస్య భవనం రుద్రేణా ధిష్ఠితం శుభమ్।
గణేశ్వరస్య విప్సూలం తత్రాస్తే స గణావృతః॥
తత్ర భోగాదిలిప్సూనాం భక్తానాం పరమేష్టిసః ।
నివాసః కల్పిత; పూర్వం దేవదేవేన శూలినా ॥
విష్ణుపాదా ద్విని్ష్ర్కాన్తా ప్లావయిత్వేన్దమణ్దలమ్ ।
సమున్తా ద్భ్రహ్మణః పుర్యాం గజ్గా పతతి వై తతః ॥
సా తత్ర పతితా దిక్షు చతుర్ధా హ్యభవ ద్ద్విజాః ।
సీతా చిలకనన్ద చ సుచక్షుర్భద్రనామికా ॥
పూర్వేణ శైలా చ్చైలం తు సీతా యా త్యనధిక్షగా ।
తత శ్చ పూర్వవర్షేణ భద్రాశ్వా ద్యాతి చార్ణవమ్॥
తథైవా లకనన్దా చ దక్షిణా దేత్య భారతమ్ ।
ప్రయాతి సాగరం భిత్త్వా సప్తభేదా ద్వీజోత్తమాః ॥
ఇచ్చట రుద్రుణిచేత అధిష్టించబడిన ఈశానుని భవనము, శుభకరమైనది, గణేశ్వరుని యొక్క విశాలమైన భవనమున్నది. అక్కడ గణములచేత పరివేష్టితుడై గణేశ్వరుడుండును.
అక్కడ సుఖాదులను పొందగోరు పరమేష్టియొక్క భక్తులకు పూర్వము దేవదేవుడైన శంకరునిచేత నివాసము ఏర్పరచబడినది.
విష్ణువు పాదమునుండి బయలుదేరి చంద్రమండలమును పావనముచేసి తరువాత గంగానది అన్నివైపుల నుండి బ్రహ్మయొక్క పట్టణము నందు పడుచున్నది.
ఆ సది అక్కడ దిగి దిక్కులయందు నాలుగు విధముల చీలిపోయెను. బ్రాహ్మణులారా సీత, అలకనంద, సుచక్షువు, భద్రఅని ఆ నాలుగు పాయలకు పేర్లు.
తూర్పువైపుగా పర్వతమునుండి పర్వతమునకు ప్రవహించు సీత అనుపొయ అంతరిక్షమున సాగును. తరువాత తూర్పున భద్రాశ్వవరము నుండి సముద్రమును చేరును.
అట్లే అలకనంద దక్షిణ దిక్కుగా భారతదేశమున నడచి ఏడుపాయలుగా విడిపోయి సముద్రమును చేరుచున్నది.
సుచక్షుః పశ్చిమగిరీ నతీత్య సకలాం స్తథా ।
పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షం గత్వైతి చార్ణవమ్ ॥
భద్రా తథొ త్తరగిరీ నుత్తరాంశ్చ తథా కురూన్ ।
అతీత్య చోత్తరామ్భోధిం సమఖ్యేతి మహర్షయః ॥
ఆ నీలనీషధాయామౌ మాల్యవద్గన్దమాదనౌ ।
తయో ర్మధ్యం గతో మేరుః కర్ణికాకార సంస్థితః॥
భారతాః కేతుమాలాశ్చ భద్రాశ్వాః కురవ స్తథా ।
పత్రాణి లోకపద్మస్య మర్యాదాశైలబాహ్యతః ॥
జఠరో దేవకూటశ్చ మర్యాదా పర్వతా వుభౌ ।
దక్షిణోత్తర మాహతా వానీలనీషధాయతౌ॥
సుచక్షువను పొయ పడమటి వైపు పర్వతములన్నింటినీ దాటి, పశ్చిమమున కేతుమాలమను వర్షమును చేరి సముద్రమును పొందుచున్నది.
భద్ర, ఉత్తరదిక్కునందలి పర్వతములను, ఉత్తరకురు దేశమునుదాటి ఉత్తర సముద్రమును చేరుచున్నది.
మాల్యవంతము, గంధమాదనము అను పర్వతములు నీలనీషధములంత పొడవుగలవి. ఆ రెండింటి మధ్యభాగమును పొందిన మేరు. పర్వతము కర్ణికాకారములో ఉన్నది.
అవధి పర్వతమునకు వెలుపల, భారత, కేతుమాల, భద్రాశ్వ, కురువర్షములు లోకమను కమలమునకు రేకుల వంటివి.
జఠరము, దేవకూటము అను మర్యాదపర్వతములు రెండు నీల నిషధ పర్వతములంత పొడవు కలిగి దక్షిణోత్తర దిక్కులకు వ్యాపించినవి.
గన్దమాదనకైలాసౌ పూర్వపశ్చాయతా వుభౌ।
అశీతీయోజనాయామా వర్ణవాన్తర్వ్యవస్థితా॥
నిషధః పారియాత్రశ్చ మర్యాదా పర్వతా విమౌ ।
మేరోః పశ్చిమ దిగ్భాగే యథాపూర్వం వ్యవస్థి తౌ ॥
త్రిశృజ్గో ఊరుధి సద్వ దుత్తరే వర్షపర్వతౌ ।
తావదాయామవిస్తారా వర్ణవాన్త ర్యవస్థితే॥
మర్యాదపర్వతాః ప్రోక్తా అష్టా విహ మయాద్వీజాః ।
జఠరాద్యాః స్థితి మేరో శ్చతుర్దిక్షు మహర్షయః॥
ఇతి శ్రీ కూర్మపురాణే భువనవిన్యాసే షట్చత్వారిం శోఽధ్యాయః ॥
గంధమాదన కైలాసపర్వతములు తూర్పు పడమరలుగా విస్తరించిన రెండు పర్వతములు. ఎనుబది యోజనముల వైశాల్యము కలిగి సముద్రమధ్యములో నిలిచి యున్నవి.
నిషధము, పారియాత్రము అనునవి మర్యాదపర్వతములు. ఈ రెండు మేరువునకు పడమటి భాగమున పూర్వమువలె నిలిచి యున్నవి.
త్రిశృంగము, జారుధ్ అనునవి ఉత్తరదిక్కున వర్షపర్వతములు కలవు. పూర్వపర్వతములంత వైశాల్యము కలిగి సముద్రములో నెలకొని యున్నవి.
బ్రాహ్మణులారా ఎనిమిది మర్యాదాపర్వతములు నాచేత తెలుపబడినవి. మేరు పర్వతమునకు నాలుగు దిక్కులందు జఠరము మొదలగు పర్వతములు పాదుకోని ఉన్నవి.
శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసములో నలుబది యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 46 of the Kūrma Mahā Purana is as follows:
Sūta details the glorious celestial cities of the eight Ashṭadikpālas located atop the peaks surrounding Mount Meru: Indrapurī, Agnipurī, Yamapurī, Nirrtipurī, Varuṇapurī, Vāyupurī, Kuberapurī, and Īshānapurī. Each guardian deity upholds cosmic order under the supreme command of Mahādeva and Vishṇu.