36వ అధ్యాయము

సూతఉవాచ:-

ఇద మన్యత్ పరం స్థానం గుహ్యాత్ గుహ్యతమం మహత్

  మహాదేవస్య దేవస్య మహాలయ మీతి శ్రుతమ్

తత్ర దేవాధిదేవేన రుద్రేణ త్రిపురారిణా

శిలాతలే పదం న్యస్తం నాస్తికానాం నీదర్శనమ్

తత్ర పాశుపతాక శాన్తా భస్మోద్ధూళితవిగ్రహాః

ఉపాసతే మహాదేవం వేదాధ్యయనతత్పరాః

ధ్యాత్వా తత్ర పదం శార్వం దృష్ట్వా భక్తీ పురస్సరమ్

నమస్కృత్యాథ శిరసా రుద్రసామీప్య మాప్నుయాత్

అన్యచ్చ దేవదేవస్య స్థానం శంభో ర్మహాత్మనః

కేదారమితి విఖ్యాతం సిద్ధానా మాలయం శుభమ్

తత్ర స్నాత్వా మహాదేవ మభ్యర్చ్య వృషకేతనమ్

పీత్వా చైవోదకం శుద్ధం గాణాపత్య మహాప్నుయాత్

శ్రాద్ధదానాదికమ్ కృత్వా హ్యాక్షయ్యం లభతే ఫలమ్

ద్విజాతీప్రవరై ర్జుష్టం యోగిభి ర్యతమానసైః

తీర్థం ప్లక్షావతరణం సర్వపాపవినాశనమ్

తత్రాభ్యర్చ్య శ్రీనివాసం విష్ణులోకే మహీయతే

అన్యం మగధరాజస్య తీర్థం స్వర్గగతిప్రదమ్ 

అక్షయ్యం విందతీ స్వర్గం తత్ర గత్వా ద్విజోత్తమః

తీర్థం కనఖలం పుణ్యం మహాపాతకనాశనమ్

యత్ర దేవేన రుద్రేణ యజ్ఞో దక్షస్య నాశీతః

తత్ర గంగా ముపస్పృశ్య శుచి ర్భావసమన్వితః

ముచ్యతే సర్వపాపైసు బ్రహ్మలోకం లభే నృతః

మహాతీర్థమితి ఖ్యాతం పుణ్యం నారాయణప్రియం

తత్రాభ్యర్చ్య హృషీకేశం శ్వేతద్వీపం నిగచ్ఛతి

సూతమహర్షిపలికెను.

ఇది మరియొక పరమరహస్యములలో కెల్ల ధహస్యమగు స్టానము మహాదేవ దేవుని తీర్థము మహాలయమని పేరుగాంచినది. ఈ క్షేత్రమున దేవాది దేవుడగు రుద్రుడు నాస్తికులకు నిదర్శనమును చూపుటకు ఓకశీలాతలమున పాదమునుంచెను. ఈ క్షేత్రమున శమదమసంపన్నులగు పాశుపతులు భస్మము పులుముకొనిన దేహముకలవారై వేదాధ్యయన తత్పరులై మహాదేవుని ఉపాసించుచుందురు. ఈతీర్థమున స్నానమాడి శివుని పాదమును భక్తిపూర్వకముగా దర్శించి శిరసు వంచి నమస్కరించిన వారు రుద్ర సామీప్యమును పొందెదరు.

మహాత్ముడగు శంకరుని మరియొక స్థానము కలదు. కేదారమను ప్రసిద్ధీకలది, శుభంకరము. సిద్దులనివాసము. ఈ తీర్జమున స్నానమాడి వృషధ్వజుడగు మహాదేవుని పూజించి పరిశుద్దమగు అచటి జలమును త్రాగి గాణపత్యమును పొందెదరు. ఇచట శ్రాద్దము దానము మొదలగు పవిత్ర కర్మముల నాచరించిన అక్షయ ఫలమును పొందెదరు. ఈ క్షేత్రమును ద్విజవర్యులు నియతమనస్కులగు యతివర్యులు ఎపుడు సేవించు చుందురు.

ప్లక్షావతరణమను మరియొక పుణ్యతీర్థము కలదు. ఇది సర్వ పాపవినాశకము. ఇచట శ్రీమన్నారాయణుని పూజించి విష్ణులోకమున విలసిల్లును. మగధరాజతీర్థమను మరియొకటి కలదు. ఇదీ స్వర్గఫలప్రదము. ఇచటికి వెళ్ళినపోడు అక్షయ ఫలమును స్వర్గమును చేరును. మరియొక తీర్థము పరమపావనమగు కనఖల మనునది కలదు. ఇచటనే రుద్రదేవుడు దక్షుని యజ్ఞమును ధ్వంసముగావించెను. ఇచట గంగలో స్నానమాడి పవిత్రుడై భక్తిభావము కలిగి సర్వపాపములు తొలగి బ్రహ్మలోకమును పొందును. శ్రీ మన్నారాయణునకు ప్రియము పరమపావనమగు మహాతీర్థమొకటి కలదు. ఇచట శ్రీహరిని పూజించి శ్వేతద్వీపమును చేరును.

అన్యచ్చ తీర్థప్రవరం నామ్నా శ్రీపర్వతం శుభమ్

తత్ర ప్రాణాన్ పరిత్యజ్య రుద్రస్య దయితో భవేత్

తత్ర సన్నిహితో రుద్రో దేవ్యా సహా మహేశ్వరః

స్నానసిందోదికం తత్ర కృత మక్షయ్య ముత్తమమ్

గోదావరీ నదీ పుణ్యా సర్వపాప వీసాశినీ 1

తత్ర స్నాత్వా పితృన్ దేవాన్ తర్పయిత్వా యధావిధి

సర్వపాపవిశుద్ధాత్మా గోసహస్ర ఫలం లభేత్

పవిత్ర సలిలా పుణ్యా కావేరీ వీపులా నదీ

తస్యాం స్నాత్వోదకం కృత్వా ముచ్యతే సర్వపాతకైః

త్రిరాత్రోపోషితే నాథ ఏకరాత్రోషితేన వా

యస్య వాజ్మనసీ శుద్ధీ హస్తపాదౌచ సంస్థితౌ

అలోలుపో బ్రహ్మచారీ తీర్థానాం ఫల మాప్నుయాత్

స్వామితీర్థం మహాతీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్

తత్ర సన్నిహితో నిత్యం స్కందోఽమరనమస్కృతః

స్నాత్వా కుమారధారాయాం కృత్వా దేవాదితర్పణం

ఆరాధ్య షణ్ముఖం దేవం స్కందోఽన సహ మోదతే

తత్ర స్నాత్వో పిత్యన్ భక్త్యా తర్పయిత్వా యధావిధీ

పాపకర్మనపి పిత్యం స్తారయే నాత్ర సంశయః

చంద్రతీర్థ మితి ఖ్యాతం కావేర్యాః ప్రభవేఽక్షయం

తీర్థం తత్ర భవేత్ వస్తుం మృణాం స్వర్గతి ఝా

వింధ్యపాదే ప్రపశ్యంతి దేవదేవం సదాశివమ్

భక్త్యా యే తే న పశ్యంతి యమస్య సదనం ద్వీజాః

దేవికాయాం వృషో నామ తీర్థం సిద్ధనిషేవితం

తత్ర స్నాత్వోదకం దత్వా యోగసిద్ధిం చ విందతి

దశాశ్వమేధికం తీర్థం సర్వ పాపవినాశనమ్  దశానా

మశ్వమేధోనాం తత్రాఽప్నోతి ఫలం నరః

పుండరీకం మహాతీర్థం బ్రాహ్మణై రుపసేవితమ్

తత్రా భిగమ్య యుక్తాత్మా పౌండరీకఫలం లభేత్

శ్రీపర్వతమను మరియొక తీర్ధప్రవరము కలదు. ఇచట ప్రాణములు విడిచినవాడు రుద్రునికి ప్రీతిపాత్రుడగును. ఈ క్షేత్రమున మహేశ్వరుడు దేవితో కలిసి నివసించును. ఇచట చేయబడిన స్నానము పిండ ప్రదానము మొదలగు పుణ్యకర్మలు అక్షయ ఫలమును ప్రసాదించును.

గోదావరీనది పుణ్యప్రదము సర్వపాపములను నాశము చేయునది. ఆనదియందు స్నానమొనర్చీ, యధావిధి పితృదేవతలను, దేవతలను తృప్తిపరచిన మానవుడు సర్వపాపములు తొలగి, పునీతమైన ఆత్మకలవాడై, సహస్రగోదానఫలమును పొందగలడు. కావేరియనునది పుణ్యావహము, నీండుగానుండెడి పవిత్రజలముగలనది. అచట స్నానము చేసి, మూడు రాత్రులుగాని, ఒకరాత్రిగాని ఉపవాసముండి, తర్పణాదులు ఆచరించిన మానవుడు సర్వపాపములనుండి విడిపింపబడును. తీర్థాది సేవనము ద్విజాతులవారికి శ్రేయోదాయకముగా చెప్పబడినది. మనోవాక్కాయ కర్మలు శుద్ధమై యుండి, లోభమునువీడి, బ్రహ్మచర్యమును విధిపూర్వకముగా ఆచరించెడివారు తీర్థ సేవా ఫలము పొందుదురు.

స్వామీతీర్థమను నొక గొప్పతీరము మూడు లోకములందు ఖ్యాతిగన్నది. దేవతలచే నమస్కరింపబడు కుమారస్వామి ఆ తీర్ధమందు వీడువక నీవసించును. అచటి కుమార ధారలందు స్నానముచేసి, దేవతారాధనము, పితృదేవతలకు తర్పణాదులు ఆచరించి, షణ్ముఖుని ఆరాధించిన యెడల ఆతడు స్కందునితో అతని లోకమందు ఆనందము పొందును. తామ్రపర్ణియను మరొకనదీ మూడులోకములలోను ప్రఖ్యాతివహించినది. అచట స్నానముచేసి, వేదోక్తవిధీని అనుసరించి పితృదేవతలకు తర్పణములు సమర్పించినవాడు ఎంతటి పాపకర్ముడైనను, తన పితృదేవతలను తరింపచేయును. ఇందు సంశయము లేదు.

కావేరీ జన్మస్థానమునుండియే బయలువెడలు చంద్రతీర్థము అక్షయ ఫలములను ఇచ్చునది. ఈ తీర్జమున నివసించి, అచట దేహము చాలించువారు తప్పక స్వర్గమును పొందగలరు. దేవదేవుడగు సదాశివుని, వింధ్యపర్వత పాదమందు వెలసిన స్వామిని దర్శించిన ద్విజులు యమలోకమును దర్శించరు. దేవికాప్రాంతమున 'వృష'మను పేరుగల తీర్ధమున్నది. ఇది సిద్ధపురుషులవాస స్థలము. అచట స్నానముచేసి, దానాదులు ఆచరించినవాడు యోగసిద్దీనీ పొందును. దశాశ్వమేధిక తీర్థమనునది సకలపాపవిదారకము, అచట స్నానము చేసినగాని, దర్శించినగాని, అర్చన, తర్పణ, దానాదులాచరించినగాని, పది అశ్వమేథముల ఫలమును పొందును. పుండరీకమను మహాతీర్థము బ్రాహ్మణోత్తములచే ఆశ్రయించ బడునది, నియతాత్ముడై ఆ తీర్థము చేరినవాడు పౌండరీకయజ్ఞ ఫలమును పొందగలడు.

తీర్దేభ్యః పరమం తీర్ధం బ్రహ్మతీర్థ మితి శ్రుతమ్

 బ్రహ్మాణ మర్చయిత్వా తు బ్రహ్మలోకే మహీయతే

సరస్వత్యా వినశనం ప్లక్షప్రస్రవణం శుభం

వ్యాసతీర్థం పరం తీర్థం మైనాకం చ నగోత్తమమ్

యమునాప్రభవం చైవ సర్వ పాప విశోధనం

తీర్ధములలోకెల్ల ఉత్తమమైనది బ్రహ్మతీర్థమని వినికిడి. అచటకేగి బ్రహ్మను అర్చించిన అతడు బ్రహ్మలోకమున శాశ్వతముగా నివసించగలడు. సరస్వతీ వినశనము (సరస్వతి యమునయందుకలయుస్థానము) శుభకరమగు ప్లక్షప్రస్రవణము, పరమ పావనమగు వ్యాసతీర్థము, అత్యుత్తమమగు మైనాకపర్వతము, యమునా జనన తీర్థము - ఇవన్నియు సకలజనుల పాపములను తొలగించి పునీతము చేయునవి.

పితృణాం దుహితా దేవీ గంధకాళీతి విశ్రుతా

తస్యాం స్నాత్వా దీవం యాతి మృతో జాతిస్మరో భవేత్

కుబేరతుంగం పాపఘ్నం సిద్ధచారణసేవితం

ప్రాణాం స్తత్ర పరిత్యజ్య కుబేరానుచరో భవేత్

ఉమాతుంగ మితి ఖ్యాతం యత్ర సా రుద్రవల్లభా

తత్రా భ్యర్చ్య మహాదేవీం గోసహస్ర ఫలం లభేత్

 భృగుతుంగే తపస్తప్తం శ్రాద్ధం దానం తథా కృతమ్

కులాన్యుభయతః సప్త పునాతీతి శ్రుతి ర్మమ

పితృదేవతల మానసపుత్రిక గంధకాళీదేవి. అదేనామమున ప్రసిద్ధిగన్నతీర్థము. అందుస్నానము చేసినవాడు మరణించినపిదప, పూర్వజన్మ స్మృతి కలిగి యుండి దివ్యలోకమునకు చేరును. సిద్దులచే, చారణులచే సేవింపబడు కుబేరతుంగ తీర్థము సర్వపాపములు నశింపచేయునది, అందు స్నానమాడిన నరుడు, నివసించిన యాతడు శరీరము త్యజించిన తరువత, కుబేరుని అనుచరుడై మనగలడు. రుద్రుని ప్రియవల్లభ రూపమగు, స్థానమగు ఉమాతుంగమను తీర్థమున, మహాదేవీయగు సామెను అర్చించిన, గోసహస్రదానఫలమును'పొందును. భృగుతుంగమనియెడీ పుణ్యతీర్థమున తపస్సుచేసినగాని, శ్రాద్ధదానాదులు ఆచరించినగానీ, ఆతడు తన తల్లితండ్రుల రెండు వంశములయందు ఏడుతరములవారిని పవిత్రము చేయునని పెద్దలు చెప్పగా వింటిని.

కాశ్యపస్య మహాతీర్థం కాలసర్పీ రీతీ శ్రుతమ్

తత్ర శ్రాద్ధాని దేయాని నిత్యం పాపక్షయేచ్ఛయా

దశార్ణాయాం తథా దానం శ్రాద్ధం హెూమ స్తథా జపః

అక్షయం చావ్యయం చైవ కృతం భవతి సర్వదా

తీర్థం ద్విజాతిభి ర్జుష్టం నామ్నా పై కురు జాంగలమ్

దత్వాతు దానం విధివత్ బ్రహ్మలోకే మహీయతే

వైతరణ్యాం మహాతీర్ధే స్వర్ణవేద్యం తదైవ చ

ధర్మపృష్ఠే చ సరసి బ్రహ్మణః పరమే శుభే

భరతస్యాశ్రమే పుణ్యే పుణ్యే శ్రాద్ధవటే శుభే

మహాహ్రదేచ కౌశిక్యాం దత్తం భవతీ చాక్షయమ్

కశ్యపప్రజాపతి తీర్ధమును 'కాలసర్చి' తీర్థమనీయనగా వింటిని, తన పౌపములు నశింపగోరువాడు అచట శ్రాద్దాది క్రియలను నిత్యము చేయనగును. దశార్ణ తీర్థమందు దానముగాని, శ్రాద్ధముగాని, హేమముగాని, జపముగాని, చేసిన హని ఫలము సర్వకాలముల అక్షయమును, శాశ్వతమును నగును. కురుజాంగలమను తీర్థము ద్విజాతి పుంగవుల ఆటపట్టగు తీర్థము. అచట విధిపూర్వకముగా దానము చేసినవాడు బ్రహ్మలోకమునందు శాశ్వతుడుగా నుండును.

వైతరణి, మహాతీర్థము, స్వర్ణవేది, ధర్మపృష్ఠ, ఉత్తమము, శుభంకరమగు బ్రహ్మసరస్సు, పుణ్యమగు భరతాశ్రమము, పుణ్యస్థానము, శుభకరమునగు శ్రాద్ధవటము, మహాహ్రదము, కౌశికి – వీనియందు స్నానమాచరించి, దానాదులను చేయువాడు అక్షయమగు ఫలమును పొందును.

ముంజపృష్ఠే పదం న్యస్తం మహాదేవేన ధీమతా

హితాయ సర్వభూతానాం నాస్తికానాం నిదర్శనమ్

అల్పేనాపీ తు కాలేన నరో ధర్మపరాయణః

పాస్మాన ముత్సృజ న్యాశు జీర్ణాం త్వచ మివోరగః

నామ్నా కనకనందేతి తీర్థం త్రైలోక్య విశ్రుతమ్

ఉదీచ్యాం ముంజపృష్ఠస్య బ్రహ్మర్షిగణసేవితమ్

తత్ర స్నాత్వా దివం యాంతి సశరీరా ద్వీజాతయః

దత్తం చాపి సదా శ్రాద్ధ మక్షయం సముదాహృతమ్

ఋణై స్త్రిభిః ర్నరః స్నాత్వా ముచ్యతే క్షీణకల్మషః

ప్రాణికోటికి హితము సోశించి, నాస్తికులకు నిదర్శనము చూపుటకు, పరమ జ్ఞానస్వరూపమగు మహాదేవుడు శంకరుడు ముంజప్పష్టతీర్థమున తన పాద చిహ్నములుంచినాడు. ఈస్థానమందు ధర్మపరాయణుడగు నరుడు (స్నాన ఆరాధన, దాన, జపతపాది ధర్మములు ఆచరించునాతడు) చాల అల్చకాలములోనే, పాము కుబుసము వీడుచునంత అవలీలగా తన పాపములను తొలగించుకొనును. కనకనందమసు తీర్థము మూడులోకముల ప్రసిద్ధివహించినది. ఇది ముంజపృష్ణతీర్థమునకు ఉత్తర తీరమున నున్నది. ఇది బ్రహ్మర్షిగణముల ఆవాసస్థలము. ఇచట స్నానము చేసిన ద్విజులు సశరీరముగా దివ్యలోకములకు పోవుదురు. ఇచట దానమిచ్చినగాని, శ్రాద్ధమున సమర్పించినగానీ, ఫలము అక్షయమగునని నీత్యము వినవచ్చెడి మాట ఇచట స్నానము చేసి, తన పాపములన్నియు క్షీణింపగా, మానవుడు మూడు (దేవ, పితృ, ఋషి ఋణముల నుండి విడివడును.

మానసే సరసి స్నాత్వా శక్రస్యార్ధాసనం లభేత్

ఉత్తరం మానసం గత్వా సిద్ధిం ప్రాప్నో త్యనుత్తమామ్

తస్మా నివర్తయే చ్చ్రాద్ధం యథాశక్తి యథాబలమ్

కామాన్ స లభతే దివ్యాన్ మోక్షోపాయం చ విందతి 11

పర్వతో హిమవ న్నాము నానాధాతువిభూషితః

యోజనానాం సహస్రాణి సోఽశీతి స్వాయతో గిరి

సిద్దచారణసంకీర్ణో దేవర్షిగణసేవితః

తత్ర పుష్కరిణీ రమ్యా సుషుమ్నా నామ స్తోమతః

తత్ర గత్వా ద్విజో విద్వాన్ బ్రహ్మహత్యాం విముంచతి

శ్రాద్ధం భవతి చాక్షయ్యం తత్ర దత్తం మూదయం

తారయేత్ చ పితృన్ సమ్యక్ దశపూర్వాన్ దశాపరాన్

సర్వత్ర హిమవాన్ పుణ్యో గంగా పుణ్యా సమంతతః

నద్యః సముద్రగాః పుణ్యాః సముద్రశ్చ విశేషతః

మానససరోవరమున స్నానముచేసినవాడు ఇంద్రుని అర్ధాసనమును అలంకరించును. ఉత్తరమానస తీర్థమున యథాశక్తి, యధోచితముగా శ్రాద్ధాదికర్మములు నిర్వర్తించవలేను. అట్లు చేసినవానీకి దీవ్యభోగములతోపాటు, మోక్షాపాయ సాధనమును లభించును. సొసాధాతువులతో అలంకరింపబడిన హిమాలయపర్వతము వేయిపైన ఎనుబది యోజనముల విస్తారము కలిగియున్నది. అచట సిద్దచారణులు దేవర్షిగణములు విస్తారముగా సంచరించెదరు. అచటనే సుషుమ్నమునుపేరుగల పుష్కరిణీ గలదు. అచటి ప్రదేశమును సేవించి, విద్వాంసుడగు ద్వేజుడు బ్రహ్మహత్యా పొతకము వంటి దానిని సైతము తొలగించుకొనగలడు. ఒకసారి చేసిన శ్రాద్దము అక్షయమగును. ఒక్కసారి దానమిచ్చిన అనంతమగు అభ్యుదయము ప్రసాదించును. తద్వారా తనకు పూర్వము పదితరములు పితృదేవతలను, తనతరువాతి పదితరముల వారిని తరింపచేయగలడు. హిమాలయపర్వతము, గంగానది సర్వప్రదేశములు లోకపోవనములు. సముద్రము వంక ప్రవహించునదులు, నదులను స్వీకరించు సముద్రమును రెండును విశేషపుణ్యప్రదములు.

బదర్యాశ్రమ మాసాద్య ముచ్యతే కలికల్మషాత్

తత్ర నారాయణ దేవ నరేణాస్తే సనాతనః

అక్షయ్యం తత్ర దానం స్యాత్ జాప్యం వాపీ తధావిధమ్

మహాదేవప్రియం తీర్థం పావనం తత్ విశేషతః

తారయే చ్చ పితృన్ సర్వాన్ దత్వా శ్రాద్ధం సమాహితః

బదరీక్షేత్రమును శ్రీ మన్నారాయణుడు, నరునితో కలిసియుండి పావనము చేయుచున్నాడు. అచటకేగినవ్యక్తి కలికల్మషము నుండి వెంటనే విడువబడును. ఆ తీర్థమున ఇచ్చిన దానముగాని, అనుష్టించిన జపముగాని, అక్షయ ఫలమును ఇచ్చును. ఆ తీర్థము మహాదేవుడగు శంకరునికి ప్రీతికరము., అందువలన విశేషించి పుణ్యఫలప్రదము. అచట విధిపూర్వకముగా, శ్రాద్ధమొనర్చినవాడు పితృదేవతలనందరను తరింపచేయగలడు.

దేవదారువనం పుణ్యం సిద్దగంధర్వసేవితం

మహాదేవేన దేవేన తత్ర దత్తం మహత్ వరమ్

మోహయిత్వా మునీస్ సర్వాన్ పునస్తైః సoప్ర పూజితః

ప్రసన్నో భగవా నీశ మునీంద్రన్ ప్రాహ భావితాన్ 

ఇహాశ్రమవరే రమ్యే నివసిష్యథ సర్వదా 1

మద్భావనాసమాయుక్తా స్తతః సిద్ధి మవాప్స్యథ

సీద్దగంధర్వులచే సేవింపబడు దేవదారువనము అచటనే యున్నది. భక్తవత్సలుడగు మహాదేవునిచే వరమొసగబడిన క్షేత్రమిది. పూర్వము అందరుమునులను మోహింపచేసి, పిదప వారిచే ఆరాధింపబడి, ప్రసన్నుడై, శంకరుడు, నిర్మలాంతః కరణులగు మునులతో, యిట్లనెను. “మీ రందరు రమ్యమగు యీ ఆశ్రమమునందే నివసింపుడు. ఎల్లకాలము నాయందే భావన నింపిన మనసుకలవారై ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందుడు.

 యే త్ర మా మర్చయన్తీహా లోకే ధర్మపరో జనః

తేషాం దదామీ పరమం గాణాపత్యం హి శాశ్వతమ్

ఆత్ర నిత్యం వసిష్యామీ సహ నారాయణేన చ

ప్రాణా నీహ నర స్త్సక్త్వా న భూయో జన్మ విందతి

సంస్మరంతి చ యే తీర్థం దేశాంతరగణా జనాః

తేషాం చ సర్వపాపాని నాశయామి ద్విజోత్తమాః

శ్రాద్ధం దానం తహె హూమః పిండనీర్వపణం తథా

ధ్యానం జపశ్చ నియమః సర్వమత్రాక్షయం కృతమ్

తస్మాత్ సర్వప్రయత్నేన ద్రష్టవ్యం హి ద్విజాతిభిః

దేవదారువనం పుణ్యం మహాదేవనిషేవితమ్

యత్రేశ్వరో మహాదేవూ విష్ణు ర్వా పురుషోత్తమః

తత్ర సన్నిహిత గంగా తీర్థాస్యాయతనాని చ

ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్ధే షట్ఽత్రింశోధ్యాయః  

ధర్మకర్మానుష్టాన పరులగు లోకులు ఎవరు నన్నిచట అర్చించెదరో, వారికి పరమము, శాశ్వతమగు గాణాపత్యమును ప్రసాదించెదను. శ్రీ మన్నారాయణునితో సహా నేను యిచ్చట నిత్యము వసించెదను. ఇచట ప్రాణములు వీడిన నరుడు పునర్జన్మము పొందడు. బ్రాహ్మణోత్తములారా దేశాంతర గతులైనవారైనను (ఈ తీర్థమును దర్శింప జాలనివారు) ఎవరైన యీ తీర్థమును స్మరించిన, వారికి కూడ సర్వపాపములను నాశము చేయుదును. ఈ తీర్థమున అనుష్టింపబడిన శ్రాద్ధ, దాన, తప, రామ, పిండప్రదాన, ధ్యాన, జప నియమాదులు అన్నియు అక్షయ ఫలదాయకము లగును." అందువలన ఈ దేవదారువనమును, పుణ్యకరమైనదానిని, మహాదేవుని వాసమైనదానిని, పురుషోత్తముడగు భగవన్నారాయణుడు సన్నిహితుడైయున్నదానిని, గంగాదీ వీపుల తీర్థములు సమీపముననున్నదానిని, దేవదారువనమును ద్విజులు సర్వప్రయత్నముల, దర్శించవలెను.

ఇది శ్రీ కూర్మపూరాణము షట్సాహస్రసంహితలో ఉత్తరార్థములో ముప్పదీ ఆరవ అధ్యాయము.