కూర్మ మహా పురాణము
16వ అధ్యాయము
వ్యాస ఉవాచ:-
న హింస్యాత్ సర్వభూతాని నా నృతం వా వదే త్క్వచిత్ ।
నా హితం నా ప్రియం వాక్యం న స్తేన స్స్యాత్ కదాచన ॥
తృణం వా యదివా శాకం మృదం వా జల మేవ వా ।
పరస్యాపహర ఞ్జంతు ర్నరకం ప్రతిపద్యతే ॥
న రాజ్ఞః ప్రతిగృహ్ణీయాత్ న శూద్రపతీతా దపి ।
న చాన్యస్మా దశక్తశ్చ నిందితాన్ వర్జయే ద్బుధః ॥
వ్యాస మహర్షి పలికెను
ఏ ప్రాణిని హింసించరాదు. ఎపుడును, ఎచ్చటను అబద్ధముచెప్పరాదు. అహితము అప్రియము కలిగించు మాటలు మాట్లాడరాదు. దోంగ కారాదు. ఇతరుని వస్తువు తృణముగాని, శాకముగాని, మట్టిగాని, నీరుగాని అపహరించినచో నరకమును పొందును. రాజు నుండి శూద్రుని నుండి, పతితుని నుండి, దానము స్వీకరించరాదు. శక్తి లేకున్నను ఇతరునీ యాచించరాదు. జ్ఞాని అయినవాడు నిందితములను పరిత్యజించవలయును.
నిత్యం యాచనకో న స్యాత్ పున స్తం నైవ యాచయేత్ ।
ప్రాణా నపహర త్యేవం యాచక స్తస్య దుర్మతిః ॥
న దేవద్రవ్య హారీ స్యాత్ విశేషేణ ద్విజోత్తమః ।
బ్రహ్మస్వం వా నాపహరే దాపద్యపి కదా చన ॥
ప్రతి నిత్యము యాచించరాదు. ఒకే వ్యక్తిని రెండవ మారు యాచించరాదు. ఇట్లు యాచించువాడు దాత ప్రాణములనే హరించినవాడగును. దేవ ద్రవ్యములను హరించరాదు. విశేషించి బ్రాహ్మణుడు హరించరాదు. ఎంతటి ఆపద వచ్చినను బ్రాహ్మణ ధనమును హరించరాదు.
న విషం విష మిత్యాహుః బ్రహ్మస్వం వీష ముచ్యతే ।
దేవస్వం చాపీ యత్నేన సదా పరిహరే త్తతః ॥
పుష్పే శాకోదకే కాష్ఠే తధా మూలే ఫలే తృణే ।
అదూత్తాదాన మస్తేయం మనుః ప్రాహ ప్రఙాపతిః ॥
విషము విషము కాదు. బ్రహ్మస్వమే (బ్రాహ్మణుని సొమ్ము) విషము. విశేష ప్రయత్నముతో దేవతా ద్రవ్యమును, అపహరించరాదు. పుష్పము, శాకము, ఉదకము, కాష్ఠము, మూలము, ఫలము, తృణము ఎదుటివాడు ఈయకుండగా తీసికొన్నను స్తేయము. కాదని మనుపు చేప్పేను.
గ్రహీతవ్యాని పుష్పాణి దేవార్చనవిధౌ ద్విజాః ।
నైకస్మా దేవ నియతం అననుజ్ఞాయ కేవలమ్ ॥
తృణం కాష్ఠం ఫలం పుష్పం ప్రకాశం వై హరే ద్బుధః ।
ధర్మార్థం కేవలం విప్రా హ్యన్యధా పతితో భవేత్ ॥
తిలముద్గయవాదీనాం ముష్టి ర్గ్రాహ్యా పథి స్థితైః ।
క్షుధార్తై ర్నాన్యధా విప్రా ధర్మవిద్భి రీతి స్థితిః ॥
బ్రాహ్మణుడు దేవతార్చన విధికీ ఇతరుల పుష్పములను తీసికొనవచ్చును. కాని ప్రతిదినము ఒకే చోటు నుండి అనుమతి లేకుండగ తీసుకొనరాదు. విప్రులు ధర్మకార్యము కొరకు తృణకాష్ట పుష్ప ఫలములను ఇతరులవి స్వీకరించవచ్చును. అదియును ప్రకాశ రూపముగానే (తెలియునట్లు). స్వామికి తెలియకుండ స్వీకరించిన పతితుడగును. దారిలోనున్నపోడు క్షుదారుడైనచో తిలలు, ముద్గలు, యవలు ఒక పిడికెడు తీసుకోనవచ్చు. క్షుదారుడు కానిచో అట్లు స్వీకరించరాదు.
న ధర్మస్యా ప్రదేశేన పాపం కృత్వా ప్రతం చరేత్ ।
వ్రతేన పాపం వ్రచ్ఛాద్య కుర్వన్ స్త్రీశూద్రదంభనమ్ ॥
ప్రేత్యేహ చేద్యశో విప్రో గర్హ్యతే బ్రహ్మవాదిభిః ।
ఛద్మనా చరితం యచ్చ వ్రతం రక్షాంసి గచ్ఛతి ॥
పాపముచేసి, ధర్మ మనుపేరుతో వ్రతము సాచరించరాదు. వ్రతముతో పాపము కప్పి పుచ్చి స్త్రీలను శూద్రులను మోసగించినవాడు ఇహమున, పరమున బ్రహ్మజ్ఞులతో నిందించబడును. కపటముతో చేయు వ్రతము రాక్షసులకు చేరును.
అలింగీ లింగవేషేణ యో వృత్తి ముపజీవతి ।
స లింగినాం హరే దేన స్తిర్య గ్యోనౌ చ జాయతే ॥
జైడాలప్రతినః పాపా లోకే ధర్మవినాశకాః ।
సద్యః పతన్తి పాపేషు కర్మణ స్తస్య తత్ఫలమ్ ॥
పాషండినో వికర్మస్థాన్ వామాచారాం స్తథైవ చ ।
పాంచరాత్రాన్ పాశుపతాన్ వాఙ్మాత్రేణాపి నార్చయేత్ ॥
యజ్ఞోపవీతాచి బ్రాహ్మణ చిహ్నములను అధికారీ కానివాడు జీవిక కొరకు ఆ చిహ్నములను ధరించినచో నిజముగా ఆ చిహ్నములకు యోగ్యులైన వారి పాపమును తానుమోయును. తరువాత పశుజాతిలోపుట్టును. లోకమున పరవంచనకొరకు ధర్మవ్రతునిగా నటించుపోరు బిడాల ప్రతులు అనబడుదురు. వీరు పాపులు; ధర్మ వినాశకులు. వీరు వెంటనే నరకములో పడుదురు. వేద దూషకులను, అధర్మము నాచరించువారిని, వామాచార పరాయణులను, పాంచరాత్రులను, పాశుపతులను, వాఙ్మాత్రముతోనైన పూజించరాదు.
వేదనిందారతా న్మర్త్యాన్ దేవనిందారతాం స్తధా ।
ద్విజనిందారతాం శ్చైవ మనసాపి న చింతయేత్ ॥
యాజనం యోనిసంబంధం సహవాసం చ భాషణమ్ ।
కుర్వాణః పతతే జంతుః తస్మా ద్యత్నేన వర్జయేత్ ॥
దేవద్రోహా ద్గురుద్రోహాః కోటి కోటిగుణాధికః ।
జ్ఞానాపవాదో నాస్తిక్యం తస్మాత్కోటిగుణాధికమ్ ॥
గోభి శ్చ దైవతై ర్విప్త్రెః కృష్యా రాజోపసేవయా ।
కులా న్యకులతాం యాంతి యాని హీనాని ధర్మతః ॥
కువివాహైః క్రియాలో పైః వేదానధ్యయనేన చ ।
కులా న్యకులతాం యాంతి బ్రాహ్మణాతిక్రమేణ చ ॥
వేదముల నిందించువారిని, దైవ నిందాపరులను, ద్విజ నిందోపరులను, మనసులోనైనా తలచరాదు. ఇట్టివారితో యజ్ఞము చేయించుట, వైవాహిక సంబంధము కుదుర్చుకొనుట, కలిసి నివసించుట, మాటలాడుట చేయుపోరు పతితులగుదురు. కావున యత్న పూర్వకముగా వీటిని విడువవలెను. దైవ ద్రోహము కంటే గురుద్రోహము కోటిరెట్లు అధిక పాపము నిచ్చును. గురుద్రోహముకంటే వేదనిండ నాస్తిక్యము కోటిరెట్లు పాపము నిచ్చును. గోవులతో, దేవతలతో, బ్రాహ్మణులతో, కృషీవలులతో, రాజసేవతో, జీవించువారి కులములు దోషపూర్ణములగును. ధర్మ శాస్త్రమున వీరిని హీనులుగా పరిగణించిరి. దుష్ట వివాహముతో, క్రియాలోపముతో, వేదాధ్యయనము చేయకపోవుటతో, బ్రాహ్మణులను అవమానించుటతో, కులములు హీనకులములగును.
అనృతా త్పారదార్యాచ్చ తథాఽభక్ష్యస్య భక్షణాత్ ।
అశ్రౌతధర్మాచరణాత్ క్షిప్రం నశ్యతి వై కులమ్ ॥
ఆశ్రోత్రియేషు వై దానాత్ వృషలేషు తథైవ చ ।
విహీతాచారహీనేషు క్షిప్రం నశ్యతి వై కులమ్ ॥
అసత్యము వలన, పరదారా గమనము వలన, అభక్ష్య భక్షణము వలన, వేద విరుద్ద ధర్మాచరణము వలన, కులము వేంటనే నశించును. శ్రోత్రియులు కాని వారికి, శూద్రులకు వేద విహీత ఆచార హీనులకు, దానము చేసిన కులము నశించును.
నా ధార్మికై ర్హృతే గ్రామే న వ్యాధబహులే భృశమ్ ।
స శూద్రరాజ్యే నివసేత్ న పాషండజనై ర్వృతే ॥
హీమపద్వింధ్యయో ర్మధ్యే పూర్వపశ్చిమయో శ్శుభమ్ ।
ముక్త్వా సముద్రయో ర్దేశం నాన్యత్ర నివసే ద్ద్విజః ॥
కృష్ణో వా యత్ర చరతి మృగో నిత్యం స్వభావతః ।
పుణ్యా శ్చ విసృతా నద్య స్తత్ర వా నివసే ద్ద్విజః ॥
అధార్మికులతో కూడియున్న గ్రామమున, వ్యాధులు ఎక్కువగా ఉన్న గ్రామమున, శూద్ర భోజ్యమున, వేద బాహ్యులు నివసించు గ్రామమున నివసించరాదు. హిమాలయ వింధ్య పర్వతముల మధ్య, పూర్వ పశ్చిమ సముద్రాంతరములో తప్ప, మరియొకచోట నివసింపరాదు. కృష్ణ సార మృగము సహజముగా సంచరించుచోట, పుణ్యనదులు ప్రవహించుచోట ద్వీజుడు నివసించవలెను.
అర్థక్రోశా న్నదీకూలం వర్జయిత్వా ద్విజోత్తమః ।
నాన్యత్ర నివసే త్పుణ్యం నాస్త్యజగ్రామసన్నిధౌ ॥
న సంవసే చ్చ పతితై ర్న చండాలై ర్న పుల్కసైః ।
న మూర్ఖై ర్నావలిప్తైశ్చ నాన్త్యై ర్నాన్త్యావసాయిభిః ॥
ఏకశయ్యసనం పంక్తిః భాండపక్వాన్నమిశ్రణమ్ ।
యాజనాధ్యాపనే యోనిః తథైవ సహభోజనమ్ ॥
సహాధ్యాయ స్తు దశమః సహయాజన మేవ చ ।
ఏకాదశ సముద్దిష్టాః దోషా సాంకర్య సంజ్ఞితాః ॥
సమీపే వా వ్యవస్థానాత్ పాపం సంక్రమతే సృణామ్ ।
తస్మా త్సర్వప్రయత్నేన సాంకర్యం పరివర్జయేత్ ॥
నదీతీరము నుండి ఒక మైలు వదలిపెట్టి, బ్రాహ్మణుడు ఇతర ప్రదేశమున నివసించరాదు. అంత్యజుల గ్రామ సమీపమున నివసించరాదు. పతితులతో, చండాలురతో, పుల్కసులతో, మూర్ఖులతో, దురభిమానులతో, అంత్యులతో, అంత్యుల స్నేహము చేయువారితో కలిసి నివసించరాదు, ఒకే ఆసనమున, ఒకే శయ్యపైన, ఒకే పంక్తి భోజనమును, ఒకే పాత్రలో వండిన అన్నమును, భుజించుట చేయరాదు. అట్టివారితో యజ్ఞము చేయించరాదు. అధ్యాపనము చేయరాదు. వివాహ సంబంధము, సహ భోజనమును కూడనివి. కలిసి చదువుట, కలిసి యజ్ఞము. చేయుట, యీ పదునొకండు సాంకర్య దోషములనబడును. ఈ దోషములు చేయువారి సమీపమున నున్నను పాపము సంక్రమించును. కావున సర్వ ప్రయత్నముతో సాంకర్యమును వర్జించవలయును.
ఏకపఙ్త్క్యుపనిష్టా యేన స్పృశంతి పరస్పరమ్ ।
భస్మనా కృతమర్యాదా న తేషాం సంకరో భవేత్ ॥
అగ్నినా భస్మనా చైవ సలిలేనా వసేకతః ।
ద్వారేణ స్తంభమార్గేణ షడ్భిః పంక్తి ర్విభిద్యతే ॥
న కుర్యా చ్ఛుష్క వైరాణి వివాదం న చ పైశునమ్ ।
పరక్షేత్రే గం ధయంతీం న చాచక్షీత కస్యచిత్ ॥
న సంవదేత్ సూతకే చ న కంచీ న్మర్మణి స్పృశేత్ ॥
“ఒకే పంక్తిలో కూర్చున్నను, ఒకరి నొకరు తాకనిచో, మధ్యలో భస్మరేఖతో హద్దు ఏర్పరచినపుడు వారికి సాంకర్య దోషముండదు. అగ్నితో, భస్మముతో, నీటితో, ద్వారముతో, స్తంభముతో, మార్గములో మధ్యన వ్యవధానమున్న పంక్తి భేదమగును. శుష్క వైరమును ఏర్పరచు కొనరాదు. అకారణముగా వాదము పెంచుకొనరాదు. లోభిత్వము, చూపరాదు. ఇతరుల క్షేత్రములో మేయుచున్న ఆవును గూర్చి, ఇతరులకు చెప్పరాదు. సూతకమున్నవారితో మాట్లాడరాదు. ఎదుటివాని రహస్యమును బయలు పరచి అతని మనసుకు పరితాపము కలిగించరాదు.
న సూర్యపరివేషం వా నేన్ద్రచాపం శవాగ్నికమ్ ।
పరస్మై కథయే ద్విద్వాన్ శశినం వా కదాచన ॥
న కుర్యా ద్బహుభి స్సార్థం విరోధం బంధుభి స్తథా ।
ఆత్మనః ప్రతికూలానీ పరేషాం న సమాచరేత్ ॥
సూర్య పరివేషమును, ఇంద్ర ధనువును, చీతీని, చంద్ర బింబమును గూర్చి ఇతరులకు చెప్పరాదు. చాలా మందితో, బంధువులతో, విరోధము చేయరాదు. తనకు ప్రతికూలమైన వాటిని ఇతరులకు ఆచరించరాదు.
తీథిం పక్షస్య న బ్రూయాత్ న నక్షత్రాణి నిర్ధిశేత్ ।
నోదక్యా మభిభాషేత నా శుచిం వా ద్వీజోత్తమః ॥
న దేవగురువిప్రాణాం దీయమానం తు వారయేత్ ।
న చాత్మానం ప్రశంసే ద్వా పరనిందాం చ వర్జయేత్ ॥
వేదనిందాం దేవనిందాం ప్రయత్నేన వివర్జయేత్ ॥
పక్షతిధిని చేప్పరాదు. నక్షత్రములను చూపరాదు. రజస్వలా స్త్రీతో మాట్లాడరాదు. అపవిత్రునితో కూడా మాట్లాడరాదు. దేవ గురు విప్రులకు చేయుదానమును నివారించరాదు. ఆత్మ ప్రశంసను పరనిందను చేయరాదు. వేద నిందను, దేవ నిందను విశేష ప్రయత్నముతో విడువ వలెను.
యస్తు దేవా నృషీన్ విప్రాన్ వేదాన్వా నిందతి ద్విజః ।
న తస్య నిష్కృతి ర్దృష్టా శాస్త్రే ష్విహ మునీశ్వరః ॥
నిందయే ద్వై గురుం దేవం వేదం వా నోపబృంహణమ్ ।
కల్పకోటి శతం సాగ్రం రౌరవే పచ్యతే నరః ॥
తూష్ణీ మాసీత నిందాయాం న బ్రూయాత్ కించి దుత్తరమ్ ।
కర్ణౌ పిధాయ గంతవ్యం న చైతా నవలోకయేత్ ॥
దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, వేదములను, నిందించువారికి శాస్త్రములలో నిష్కృతి విధించబడలేదు. గురువును, దైవమును, వేదములను, ఇతిహాస పురాణములను నిందించువాడు నూరుకోట్ల కల్పముల కాలము గౌరవ నరకమును అనుభవించును. వేదాది నింద జరుగుచున్నపుడు తగిన సమాధానము చెప్పజాలనిచో, మౌనము వహించవలెను. ఎట్టి ప్రత్యుత్తరము పలుకరాదు. చెవులు మూసికొని వెళ్లవలయును. అట్టివారినీ (నిందించువారినీ) చూడరాదు.
వర్జయే ద్వై రహస్యానీ పరేషాం గూహయే ద్బుధః ।
వివాదం స్వజనై స్సార్థం న కుర్యా ద్వై కదాచన ॥
న పాపం పాపినాం బ్రూయాత్ అపాపం వా ద్వీజోత్తమాః ।
స తేన తుల్యదోష స్స్యా న్మిథ్యా ద్విర్దోషవా న్భవేత్ ॥
యాని మిధ్యాభిశస్తానాం పత న్త్యశ్రూణి రోదనాత్ ।
తానీ పుత్రాన్ పశూన్ ఘ్నంతి తేషాం మిధ్యాభిశంసి నామ్ ॥
బ్రహ్మహత్యాసురాపానే స్తేయగుర్వంగనాగమే ।
దృష్టం విశోధనం వృద్దైః నాస్తి మిధ్యాభిశంసనే ॥
జ్ఞాని అయినవాడు ఇతరుల రహస్యములను, తెలియుటకు ప్రయత్నించరాదు. ఒకవేళ తెలిసినను, దాచవలయును. ఎపుడు తన వారితో వివాదము పెట్టుకొనరాదు. పాపులు చేసిన పాపమును చెప్పరాదు. పాపి కాని పొనికి పాపమును ఆరోపించరాదు, ఎదుటి వారి పాపము చెప్పిన వానికీ, వానితో సమాన దోషము సంక్రమించును. లేని పాపము ఆరోపించిన రెండు రెట్లు దోషమంటును. అసత్య పాపొరోపణ చేయుటవలన ఆరోపించబడిన వ్యక్తి రోదించినచో, కన్నీటిబొట్లు నేల పైబడిన, ఆరోపించినవారికి పుత్రులు, పశువులు, ధనము నశించును. బ్రహ్మహత్య సురాపానము, స్తేయము, గుర్వంగనాగమనము మొదలగు మహాపాతకములకు ప్రాయశ్చిత్తము కలదుగానీ, మిధ్యాదోషారోపణ చేసినవానికి ప్రాయశ్చిత్తములేదు.
నేక్షేతో ద్యంత మాదిత్యం శశినం చా నిమిత్తతః ।
నాస్తం యాంతం న వారిస్థం నోపసృష్టం న మధ్యగమ్ ।
తిరోహితం వాససా వా సాదర్శాంతరగామినమ్ ॥
ఏ ప్రయోజనము లేకుండగా ఉదయించు సూర్యునిగానీ, చంద్రునిగాని, అస్తమించేడి సూర్యునిగాని, చంద్రునిగానీ, జలమున ప్రతీ బింబమునుగాని, గ్రహణ యుక్తునిగాని, ఆకాశ మధ్యమునున్నగాని, వస్త్రముతో కప్పిగాని, అద్దమున ప్రతిబింబించు వానిని గాని, చూడరాదు.
న నగ్నం స్త్రియ మిక్షేత పురుషం వా కదాచన ।
న చ మూత్రం పురీషం వా న చ సంస్పృష్టమైధుసమ్ ॥
నా శుచి స్సూర్యసోమదీన్ గ్రహా నాలోకయే ద్బుధః ।
పతిత వ్యంగ చండాలా నుచ్ఛిష్టా న్నావలోకయేత్ ।
నా భీభాషేత చ పరం ఉచ్ఛిష్టో వావగుంఠితః ॥
న పశ్యే త్ప్రేతసంస్పర్శం న క్రుద్ధస్య గురో ర్ముఖమ్ ।
న తైలోదకయో శ్ఛాయాం న పత్నీం భోజనే సతి ॥
నా ముక్తబంధనాంగాం వా నోన్మత్తం మత్తమేవవా ।
నాశ్నీయా ద్భార్యయా సార్థం నైనా మిక్షేత చాశ్నతీమ్ ॥
క్షువంతీం జృంభమాణాం వా నా సనస్థాం యధాసుఖమ్ ।
నోదకే చాత్మనో రూపం న కూలం శ్వభ్ర మేవవా ।
నలంఘయే చ్చ మూత్రం వా నాభీతిష్ఠే త్కదాచన ॥
నగ్నముగా నున్న స్త్రీనిగాని, పురుషునిగాని చూడరాదు. మలమూత్ర విసర్జనము చేయుచున్న వానిని, మిధున ధర్మాసక్తుని చూడరాదు. బుద్ధిమంతుడగువాడు అపవిత్రుడైనపుడు సూర్య, చంద్ర గ్రహములను చూడరాదు, పతితులను, అంగహీనులను, చండాలురను, ఉచ్ఛిష్టులను చూడరోడు. ఉచ్చిష్టుడైనవాడు ముఖమును వస్తాదులతో కప్పుకొని కూడ ఇతరులతో మాట్లాడరాదు. శవమును స్పృశించినవానిని, కోపించియున్న గురువు ముఖమును, తైలమున, జలమున ప్రతిబింబించు ఛాయను, భోజనము చేయుచున్న భార్యను, బయలు పరచుకొను అవయవములు గల స్త్రీని, ఉన్మత్తుని మత్తుని చూడరాదు. తుమ్ముచున్నప్పుడు, ఆవలించినపుడు, సుఖాసనముపై యున్నపుడు భార్యను చూడరాదు. జలమున తన రూపము చూడరాదు, నదీతీరమును, లోతైన గర్తమును చూడరాదు. మూత్రమును దాటరాదు. మూత్రముపై కూర్చొనరాదు.
న శూద్రాయ మతిం దద్యాత్ కృశరం పాయసం దధి ।
నోచ్ఛిష్టం వా మధు ఘృతం స చ కృష్ణాజినం హవిః ॥
న చైవాస్త్మె వ్రతం దద్యాత్ న చ ధర్మం వదే ద్బుధః ।
న చ క్రోధవశం గచ్ఛేత్ ద్వేషం రాగం చ వర్జయేత్ ॥
లోభం దంభం తథా యత్నా దసూయాం జ్ఞానకుత్సనమ్ ।
ఈర్ష్వాం మదం తథా శోకం మోహం చ పరివర్జయేత్ ॥
న కుర్యా తస్యచి త్పీడాం సుతం శీష్యం చ తాడయేత్ ।
న హీనా నుపసేవేతన చ తీక్షణమతీన్క్వచిత్ ॥
నాత్మానం చావమన్యేత దైన్యం యత్నేన వర్జయేత్ ।
న విశిష్టా నసత్కుర్యాత్ నాత్మానం వా శపే ద్బుధః ॥
శూద్రునికీ, లౌకిక విషయమున కూడా ఉపదేశము నీయరాదు. నువ్వుల అన్నమును, పాయసమును, పెరుగును, ఉచ్చిష్టమును, తేనెను, నేతిని, కృష్ణాజినమును, హవిస్సును వీటిని శూద్రున జీయరాదు. శూద్రునికి ప్రతము నీయరాదు. ధర్మమును చెప్పరాదు. ఆతని విషయమున కోపించరాదు. ద్వేషమును, స్నేహమును పరిత్యజించవలయును. లోభ, దంభ, అసూయ, ఙ్ఞాననింద, ఈర్ష్య, మద, శోక మోహములను విడువ వలయును. ఎవరిని పీడించరాదు. పుత్రుని శిష్యుని కోట్టరాదు. హీనులను, తీక్ష బుద్దులను సేవించరాదు. తనను తాను అవమానించుకొనరాదు. ప్రయత్నముతో దైన్యమును పరిహరించవలెను. విశిష్ట వ్యక్తులను అగౌరవ పరచరాదు. తనను తాను నిందించు కోనరాదు.
న నఖై ర్విలిఖే ద్భూమిం గాంచ సంవేశయే న్నహీ ।
న నదీషు నదీం బ్రూయాత్ పర్వతేషు చ పర్వతాన్ ॥
ఆవాసే భోజనే వాపి న త్యజేత్ సహయాయినమ్ ।
నావగాహే దపో నన్నో వహ్నిం నాతివ్రజేత్సదా ॥
శిరో భ్యంగావశిష్టన తైలేనాంగం న లేపయేత్ ।
న సర్పశస్త్రైః క్రీడేత ఖాని ఖాని న సంస్పృశేత్ ॥
రోమాణి చ రహస్యాని నా శిషేన సహ వ్రజేత్ ।
న పాణిపాదవాఙ్నేత్రచాపల్యం సముపాశ్రయేత్ ॥
న శిశ్నోదరచాపల్యే న చ శ్రవణయోః క్వచిత్ ।
న చాంగనఖవాదం వై కుర్యాన్నాంజలినా పిబేత్ ।
నాభిహన్యా జ్జలం పద్బ్యాం పాణినా వా కదాచన ॥
గోళ్లతో భూమిపై వ్రాయరాదు. గోవును గోళ్లతో నిద్రపుచ్చరాదు. ఒకనది దగ్గర మరోకనదని, ఒక పర్వతము దగ్గర మరొక పర్వతమును గూర్చి మాట్లాడరాదు. నివాసమున, భోజనమున, తనతో కలిసివచ్చు వానీనీ విడువరాదు. నగ్నముగా నీటిలో మునుగరాదు. అగ్నిని దాటరాదు. శిరమున రాచగా మిగిలిన నూనెను ఇతర శరీరముపై రాచరాదు. సర్పములతో, శస్త్రములతో ఆడరాదు. తన అవయవములను నిష్కారణముగా స్పృశించరాదు. గుప్త అవయవములను, రోమములను స్పృశించరాదు. అశిష్టులతో కలిసి వెళ్లరాదు. పొణి, పాద, వాక్, నేత్ర విషయమున చాపల్యమును, ఆశ్రయించరాదు. శిశ్న ఉదర చాపల్యమును కర్ణచాపల్యమును ప్రదర్శించరాదు, అవయవములతో నఖములతో ధ్వనిచేయరాదు. దోసిలితో నీరు త్రాగరాదు. పాదములతో, హస్తములతో నీటిని కొట్టరాదు.
న శాతయే దిష్టకాభిః ఫలాని న ఫలేన చ ।
న మ్లేచ్ఛభాషాం శిక్షేత నా కర్షే చ్చ పదాసనమ్ ॥
న భేదన మవస్ఫోటం ఛేదనం వా విలేఖనమ్ ।
కుర్యా ద్విమర్దనం ధీమాన్ నాకస్మా దేవ నిష్ఫలమ్ ॥
నోత్సంగే భక్షయే ద్భక్ష్యం వృధా చేష్టాం చ నా చరేత్ ।
న నృత్యే దధవా గాయేత్ న వాదిత్రాణీ వాదయేత్ ॥
న సంహతాభ్యాం పాణిభ్యాం కండూయే దాత్మన శ్శిరః ।
న లౌకికై స్స్తవై ర్దేవాన్ స్తోషయే ద్బహ్య జైరపి ॥
నాక్షైః క్రీడే న్న ధావేత నాప్సు వీణూత్ర మాచరేత్ ।
నోచ్ఛిష్ట స్సంవిశే న్నిత్యం న నగ్నః స్నాన మాచరేత్ ॥
ఇటుకలతో పండ్లను రాల్చరాదు. పళ్లతో కూడ పండ్లను రాల్చరాదు. మేచ్ఛభాషను నేర్వరాదు. పాదముతో ఆసనము లాగరాదు. నఖములతో త్రుంచుట, కోయుట, చీల్చుట, వ్రాయుట, మర్దించుట చేయరాదు. నిష్ప్రయోజనముగా స్వ అవయవ మర్దనము చేయరాదు. ఒడిలో పెట్టుకొని భుజించరాదు. వ్యర్థ చేష్టలు చేయరాదు. నాట్యము, గానము పోద్యము ఎప్పుడు కాలనియమము లేక చేయరాదు. తలను రెండు చేతులతో గోకినరాదు, లోక స్తోత్రములతో దేవతలను స్తుతించరాదు. బాహ్యస్తోత్రములతో కూడా స్తుతించరాదు. పాచికలతో ఆడరాదు. నిష్కారణముగా పరుగెత్తరాదు. జలమున మలమూత్రములు విడువరాదు. ఉచ్చిష్ట ముఖముతో ఉండరాదు. నగ్నముగా స్నానమాచరింపరాదు.
న గచ్ఛే న్న పఠే ద్వాపి న చైవ స్వశిరః స్పృశేత్ ।
న దంతై ర్నఖరోమాణి ఛింద్యా త్సుప్తం న బోధయేత్ ॥
న బాలాతప మాసేవేత్ ప్రేతధూమం వివర్జయేత్ ।
నైక స్సుప్యా చ్ఛూన్యగృహే స్వయం నోపానహౌ హరేత్ ॥
నా కారణా ద్వా నిష్ఠీవేత్ న బాహుభ్యాం నదీం తరేత్ ।
న పాదక్షాలనం కుర్యాత్ పాదౌ నైవ కదాచన ॥
నాగ్నౌ ప్రతాపయే త్పాదౌ న కాంస్యే ధావయే ద్బుథః ।
నా భిప్రసారయేత్ దేవం బ్రాహ్మణాన్ గా మధాపి వా ।
వాయ్వగ్నిగురువిప్రా న్వా సూర్యం వా శశినం ప్రతి ॥
అశుద్ధ శృయనం స్నానం స్వాధ్యాయం స్నానవాహనమ్ ।
బహర్నిప్ర్కమణం చై వ న కుర్వీత కథంచన ॥
నగ్నావస్థలో నడువరాదు చదువరాదు. తన శిరమును తాను స్పృశించరాదు. దంతములతో నఖములను, రోమములను ఛేదించరాదు. నిదురించిన వానిని లేపరాదు. లేయండను సేవించరాదు. శవ ధూమమును పరిత్యజించవలయును. శూన్య గృహమున.ఒక్కడే నీదురించరాదు. తన పాదరక్షలను తానే పట్టుకొని పోరాదు. అకారణముగా నిషీవనము (ఉమ్మి) వేయరాదు. బాహువులతో నదినీ దాటరాదు, పాదములతో పాదములను కడుగరాదు. అగ్నితో పాదములను కాచరాదు. కాంస్య పాత్రలో పాదములను కడుగరాదు. దేవతలవంక, బ్రాహ్మణులవంక, గోవుల వంక పాదములు చాపరాదు. వాయు, అగ్ని, గురు, విప్ర, సూర్య, చంద్రులవంక పాదములు చాపరాదు. అపవిత్రావస్థలో పడుకొనరాదు. ప్రయాణము చేయరాదు, స్వాధ్యాయమును చేయరాదు. స్నానము, వాహసము, బయటికి వెళ్లుట చేయరాదు.
స్వప్న మధ్యయనం స్నానం ఉద్వర్తం భోజనం గతిమ్ ।
ఉభయో స్సంధ్యయో ర్నిత్యం మధ్యాహ్నే చైవ వర్జయేత్ ॥
న స్పృశేత్ పాణినో చ్ఛిష్టో విప్రోగోబ్రాహ్మణానలాన్ ।
న చాసనం పదా వాపి న దేవప్రతిమాం స్పృశేత్ ॥
నా శుద్యోఽగ్నిం పరిచరేత్ న దేవాన్ కీర్తయే దృషీన్ ।
నా వగాహే దగాధాంబు ధారయే న్నా నిమిత్తతః ॥
న వామహస్తే నోద్ధృత్య పిబే ద్వ్రక్త్రేణ వా జలమ్ ।
నోత్తరే దనుపస్పృశ్య నాప్సు రేతస్సముత్సృజేత్ ॥
అమేథ్యలిప్త మన్య ద్వా లోహితం వా విషాణి వా ।
వ్యతిక్రమేన్న స్రవంతీం నాప్సు మైథున మాచరేత్ ।
చైత్యం పృక్షం న వై ఛింద్యాత్ నాప్పు ష్ఠీవన మాచరేత్ ॥
ఉభయ సంధ్యలలో, మధ్యాహ్న కాలమున నిదురించుట, అధ్యయనము, స్నానము, ఉద్వర్తనము, భోజనము, గమనములు చేయరాదు. అపవిత్రుడు చేతితో గోబ్రాహ్మణ అగ్నులను స్పృశించరాదు. ఆసనమును పొదముతో తాకరాదు. దేవప్రతీమను ఉచ్ఛిష్టుడై యున్నపుడు తాకరాదు. అపవిత్రునిగా నుండి అగ్నీని ఉపాసించరాదు. దేవతలను, ఋషులను కీర్తించరాదు. లోతు తెలియని నీటిలో మునుగరాదు, అకారణముగా మల మూత్రములను నిరోధించరాదు. ఎడమ చేతిలో నీరు తీసుకొని గాని, పొత్ర ద్వారాకాని, నోటితోనే కోని జలమును త్రాగరాదు. ఆచమనము చేయకుండా సమాధానము చెప్పరాదు. జలమున రేతస్సును విడువరాదు. అపవిత్ర వస్తు సంబంధముగల వస్తువును గాని, రక్తమునుగాని, విషమునుగాని దాటరాదు. వేగముగా ప్రవహించు నదిని దాటరాదు. జలమున సంభోగము చేయరాదు. అశ్వత్థ వృక్షమును ఖండించరాదు. జలమున నిఫ్టీపనము చేయరాదు.
నాస్థిభస్మకపాలాని న కేశా న్న చ కంటకాన్ ।
తుషాంగారకదోషం వా నాధితిష్ఠే త్క దాచన ॥
న చాగ్నిం లంఘయే ద్ధీమాన్ నోపదధ్యా దథః క్వచిత్ ।
న చైనం పాదతః కుర్యాత్ ముఖేన న ధమేద్భుథః ॥
న కూప మవరోహీత నా వేక్షతాశుచిః క్వచిత్ ।
అగ్నౌ న చ క్షిపే దగ్నిం నాద్భిః ప్రశమయే త్త ధా ॥
సుహృన్మరణ మార్తీం వా న స్వయం శ్రావయే త్పరాన్ ।
అపణ్యం కూటపణ్యం వా విక్రయే న్న ప్రయోజయేత్ ॥
అస్టులపైన, కపాలములపైన, భస్మముపైన, కేశములపైన, కంటకములపైన తుష (ఊక)పైన, అంగారము (బొగ్గుల)పైన, పీడుకల పైన కూర్చొనరాదు. అగ్నిని దాటరాదు. తనకన్న క్రిందుగా శయ్య, ఆసనము మొదలగువాని క్రింద అగ్నిని ఉంచరాదు. పాదముల వద్దకూడ ఉంచ రాదు. నోటితో ఊదరాదు. బావిలోనికి దిగరాదు. అపవిత్రునిగా బావిని చూడరాదు. అగ్నిని అగ్నిలో పడవేయరాదు. అగ్నిని నీటితో చల్లార్చ గాదు, మిత్రుని మరణమును, దుఃఖమును, తనకు తానుగా ఇతరులకు వినిపించరాదు . అమ్ముతగని వస్తువును, కపటముతో లభించిన వస్తువును ఆన్మురాదు.
న వహ్నిం ముఖనిఃశ్వాసై ర్జ్వాలయే న్నాశు చిర్బుధః ।
పుణ్యస్థానో దకస్థానే పీమంతం వా కృషే న్నతు ॥
నోటితో ఊది అగ్నిలో జ్వాలను చేయరాదు. అపవిత్ర స్థితిలో ఉండి, పవిత్ర తీర్థములలోనికి వెళ్లరాదు; సీమాంత ప్రదేశమున దున్నరాదు.
న భింద్యాత్ పూర్వసమయం అభ్యుపేతం కదా చన ।
పధస్పరం పశూ న్వ్యాలాన్ పక్షిణో నావబోధయేత్ ॥
పరబాధాం న కుర్వీత జటవాతాతపొదిభిః ।
కారయిత్వా స్వకర్మాణి కరూన్ పశ్చా న్న వంచయేత్ ॥
బహిర్మాల్యం బహిర్గంధం భార్యయా సహ భోజనమ్ ।
విగృహ్య వాదం కుద్వారప్రవేశం చ వినర్జయేత్ ॥
మొదట చేసిన ప్రతిజ్ఞను విడువరాదు. పశువులను, పక్షులను, సర్పములను పరస్పర యుద్దములకు పురిగొల్పరాదు. జలపోత ఆతపము లతో ఇతరులను బాధించరాదు. తమ పనులు చేయించుకొని, పనిచేసిన వారిని వంచించరాదు, సాయంకాలము, ప్రాతఃకాలము, భిక్షకోరకు గృహద్వారములను తట్టరాదు. ఇతరులుపయోగించిన మాల్యము, గంధము, భార్యతో కూడి భోజనమును, పనిగట్టుకొని వైరము కల్పించి కలహము, దుష్టద్వార ప్రవేశమును పరిత్యజించవలయును.
న ఖాద న్బ్రాహ్మణ స్తిష్ఠే న్న జల్పే ద్వా హస స్బుధః ।
స్వ మగ్నిం నైవ హస్తేన స్పృశే న్నాప్సు చిరం వసేత్ ॥
న పక్షకేణోపధమేత్ న శూర్పేణ న పాణినా ।
ముఖేనన ధమేదగ్నిం ముఖా దగ్ని రజాయత ॥
బ్రాహ్మణుడు భుజించుచు లేవరాదు. నవ్వుతూ మాట్లాడరాదు. తమ అగ్నిని తమ చేతితో తాకరాదు. నీటిలో ఎక్కువ సేపు నిలువరాదు. అగ్నిని విసనకర్రతో, చేటతోగాని, విసరరాదు. నోటితో ఊదరాదు. ఎందుకనగా అగ్ని ముఖము నుండియే పుట్టినది.
పరస్త్రీయం న భాషేత నాయాజ్యం యాజమే ద్ద్విజః ।
నైక శ్చరే త్సభాం విప్రః సమవాయం చ వర్జయేత్ ॥
న దేవాయతనం గచ్చేత్ కదా చిద్వాఽ ప్రదక్షిణమ్ ।
న వీజయేద్వా వస్త్రేణ న దేవాయతనే స్వపేత్ ॥
నైకోఽధ్వానం ప్రపద్యేత నాధార్మికజనై స్సహ ।
న వ్యాధిదూషితై ర్వాషి న శూద్రైః పతితేన వా ॥
నోపానద్వర్జితో వాథ జలోదిరహిత స్తధా ।
న రాత్రౌ నారిణా సార్థం న విసోచ కమండలుమ్ ॥
పరస్త్రీతో మాట్లాడరాదు. బ్రాహ్మణుడు యజ్జార్హత లేనివానితో యజ్ఞము చేయించరాదు. ఒంటిగా సభలో ప్రవేశించరాదు. సమూహమును విడువ వలయును. అప్రదక్షిణముగా దేవాలయమున ప్రవేశింపరాదు. వస్త్రముతో వీచరాదు. దేవాలయమున నిదురించరాదు, ఒంటిగా దారిలో నడువరాదు, అధార్మికులతో కలిసి నడువరాదు. వ్యాధిగ్రస్తులతో, శూద్రులతో, పతీతులతో కలిసి నడువరాదు. పాదరక్షలు లేకుండ, జలము లేకుండగా నడువరాదు. రాత్రులందు నడువరాదు. శత్రువుతో కలిసి వెళ్లరాదు. కమండలము లేకుండా వెళ్ళరాదు. అగ్ని, గో, బ్రాహ్మణుల మధ్య నుండీ వెళ్లరాదు.
న వత్సతంత్రీం వితతో మతిక్రామే త్క్వచి ద్ద్విజః ।
న నిందేత్ యోగిన స్సిద్ధాన్ ప్రతినో వా యతీం స్తధా ॥
దేవతాయతనం ప్రాజ్ఞో దేవానాం చైవ సత్రిణామ్ ।
నాక్రమే త్కామత శ్ఛాయాం బ్రాహ్మణానాం చ గో రపి ॥
స్వాంతు నాకామయే చ్ఛాయాం పతితాన్యై ర్న రోగిభిః ।
నాంగారభస్మవేశాదీ ష్వధీతిష్ఠే త్కఙాచన ॥
వర్జయే న్మార్జనీరేణుం స్నానవస్త్రఘటోదకమ్ ।
న భక్షయే దభక్ష్యాణీ నాపేయం చ పిబే ద్వీజః ॥
ఇతి శ్రీ కూర్మపురాణేషట్సహస్రసంహితాయాం ఉత్తరార్థే షోడఽశోధ్యాయః
బ్రాహ్మణుడు దూడకు పాలిచ్చుచున్న ఆవును, గోవును కట్టివేయు త్రాటినీ, గోపుచ్చమును దాటరాదు. యోగులను, సిద్ధులను, ప్రతులను, యతులను నిందించరాదు. దేహాలయపు నీడను, దేవతల నీడను, యజ్ఞ దీక్షితుల నీడను, గో బ్రాహ్మణుల నీడను దాటరాదు. తన నీడను (ప్రతి బింబమును) పతితుల చేత, రోగుల చేత దాటనీయరాదు. అంగార, భస్మ, కేశముల యందు కూర్చొనరాదు. సమ్మార్జనీ రజమును, స్నానము చేసిన వస్త్రమును, స్నానము చేయగా మిగిలిన జలమును విడువవలయును. అభక్ష్యములను భక్షించరాదు. అపేయము పానము చేయరాదు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రి సంహితలో ఉపరి విభాగమున పదునారవ అధ్యాయము
Summary of chapter 69 of the Kūrma Mahā Purana is as follows:
Maharshi Vyāsa outlines strict ethical rules and daily prohibitions to maintain spiritual purity within society. He forbids non-violence, theft, accepting gifts from unrighteous rulers, and association with non-Vedic or degraded sects. Vyāsa emphasizes that a seeker of liberation must avoid gossip, self-praise, slander of Devas and Vedas, and harmful speech, aligning every daily action with the eternal principles of Sanātana Dharma.