కూర్మ మహా పురాణము
52 - అథ వేదశాఖా ప్రణయనం
సూత ఉవాచ-
అస్మి న్మన్వన్తరే పూర్వం వర్తమానే మహాప్రభుః ।
ద్వాపరే ప్రథమే వ్యాసో మనుః స్వాయమ్భువో మతః ॥
బిభేద బహుధా వేదం నియోగా ద్భ్రహ్మణః ప్రభోః ।
ద్వీతీయే ద్వాపరే చైవ వేదవ్యాసః ప్రజాపతిః ॥
తృతీయే చోశనా వ్యాస శ్చతుర్థ స్యాద్భృహస్పతిః ।
సవితా పఞ్చమే వ్యాసః షష్ఠే మృత్యుః ప్రకీర్తితః ॥
సప్తమే చ తథై వేంధ్రో వసిష్ఠ శ్చాష్టమే మతః ।
సారస్వత శ్చ నవమే త్రిధామా దశమే మతః ॥
ఏకాదశే తు ఋషభః సుతేజో ద్వాదశే స్మృతః ।
త్రయోదశే తథా ధర్మః సుచక్షుస్తు చతుర్దశే॥
పూర్వము ఈ మన్వంతరము జరుగుచుండగా, మొదటి ద్వాపరయుగములో, గొప్ప ప్రభువైన వ్యాసుడుగా స్వాయంభువ మనువు పేర్కొనబడినాడు,
ఆయన ప్రభువైన బ్రహ్మయొక్క ఆదేశమువలన వేదమును అనేక విధములుగా విభజించెను. రెండవ ద్వాపర యుగములో వేదవ్యాసుడుగా ప్రజాపతియుండెను.
మూడవ ద్వాపరములో శుక్రాచార్యుడు వ్యాసుడుకాగా, నాలుగవద్వాపరములో బృహస్పతి వ్యాసుడాయెను. ఐదవ ద్వాపరములో సవీతయనువాడు, అరవదానిలో మృత్యువు వ్యాసుడుగొ నుండిరి.
ఏడవ ద్వాపరములో ఇంద్రుడు, ఎనిమిదవ ద్వాపరములో వసిష్ఠుడు, తొమ్మిదవ, పదియవ ద్వాపరములలో క్రమముగా సారస్వతుడు, త్రోధాను అనువారు వ్యాసులుగా నుండిరి.
పదునొకండవ ద్వాపరములో ఋషభుడు, ద్వాదశములో సుతేజుడు, పదుమూడవ ద్వాపరములో ధర్ముడు, పదునాలుగవ దానిలో సుచక్షువు వ్యాసులుగా నుండిరి.
త్రయ్యారుణిః పఞ్చదశే షోడశే తు ధన ఞ్జయః।
కృతజ్ఞయః సప్తదశే హ్యష్టాదశే ఋతఞ్జయః ॥
తతో వ్యాసో భరద్వాజ స్తస్మా దూర్ధ్వం తు గౌతమః ।
వాచశ్రవా శ్చైకవింశే తస్మా న్నారాయణః పరః॥
తృణబిన్ద స్రయోవింశే వాల్మీకి స్తత్పరః స్మృతః ।
పజ్ఞ్చవింశే తథా ప్రాప్తే యస్మి న్వై ద్వాపరే ద్విజాః ॥
పరాశరసుతో ప్యాసః కృష్ణద్వైపాయనోఽ భవత్ ।
స ఏవ సర్వవేదానాం పురాణానాం ప్రదర్శకః॥
పారాశర్యో మహాయోగీ కృష్ణద్వైపాయనో హరిః ।
ఆరాధ్య దేవ మీశానం దృష్ట్వా స్తుత్వా త్రిలోచనమ్ ॥
తత్ప్రసాదా దసౌ వ్యాసం చేదానా మకరో త్ర్పభుః ।
అథ శిష్యా న్సజగ్రాహ చతురో వేదపారగాన్ ॥
పదునైదవ ద్వాపరములో త్రయ్యారుణి, పదునారవ యుగములో ధనంజయుడు, పదునేడవ ద్వాపరములో కృతంజయుడు, పదెనెన్మిదవ దానిలో ఋతంజయుడు వ్యాసులుగా నుండిరి.
తరువాత భరద్వాజుడు వ్యాసుడాయెను. అతని తరువాత గౌతముడు, అనంతరము పొచశ్రవుడు, ఆ పిమ్మట నారాయణుడు వ్యాసుడుగా నుండిరి.
ఇరువది మూడవ ద్వాపరములో తృణబిందువు, అతనియనంతరము వాల్మీకి, ఇరువది యైదవ ద్వాపర యుగమురాగా, విప్రులారా ఏ యుగమునందు పరాశరుని కుమారుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యెనో, ఆతడే అన్నీ వేదములను, పురాణములను లోకమునకు ప్రదర్శించిన పోడు.
పరాశరపుత్రుడు, గొప్పయోగి, కృష్ణద్వైపాయనుడు, నారాయణరూపుడగు వ్యాసుడు, ఈశ్వరుని పూజించి, శంకరునిచూచి, స్తోత్రముచేసి, ఆదేవుని యనుగ్రహమువలన వేదములను విపులముగా విభజించెను. తరువాత వేదములను పూర్ణముగా అధ్యయనము చేసిన నలుగురు శిష్యులను స్వీకరించెను.
జైమినిఞ్చ సుమంతు ఇ్చ వైశoపాయన మేవ చ ।
పైలం తేషాం చతుర్థం చ పఇ్చమం మాం మహామునిః॥
ఋగ్వేదపాఠకం పైలం జగ్రాహ స మహామునిః ।
యజుర్వేదప్రవక్షారం వైశoపాయన మేవ చ॥
జైమినిం సామవేదస్య పాఠకం సోఽన్వపద్యత ।
తథైవా ధర్వవేదస్య సుమన్లు మృషిసత్తమమ్ ॥
ఇతిహాసపురాణాని ప్రవక్తుం మా మయోజయత్ ।
ఏక ఆసీ ద్యజుర్వేద స్తం చతుర్థా ప్రకల్పయత్ ॥
చతుర్హోత్ర మభూ త్త స్మిo స్తేన యజ్ఞ మధా కరోత్ ।
ఆధ్వర్యవం యజుర్భిః స్యా దగ్నిహెూత్రం ద్విజోత్తమాః ॥
జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు అను నలుగురిని, అయిదవవానిగానన్ను వ్యాసుడు తన శిష్యులుగా స్వీకరించెను.
ఋగ్వేదమును పఠించువాడుగా ప్రేలుని స్వీకరించినాడామహాముని. వైశంపాయనుని యజుర్వేదమును ప్రచారము చేయుటకు నియమించి నాడు.
జైమినిని సామవేద పాఠకునిగా వ్యాసుడు స్వీకరించెను ఋషి శ్రేష్ఠుడైన సుమంతుని అధర్వవేద పాఠకుడుగా గ్రహించినాడు.
ఇతిహాసములను, పురాణములను ప్రవచనము చేయుటకు ఆ మునీ నన్ను నియమించేను. ఒకటిగానున్న యజుర్వేదమును నాలుగు విధములుగా ఆయన విభజించెను.
దానియందు నాలుగు అగ్నిహిూత్రముల సమూహమేర్పడెను. దానితో తరువాత యజ్ఞమును చేసెను. యజుర్వేద మంత్రములతో ఆధ్వర్యవమను అగ్నిహెూత్రము సంభవించును.
ఔద్గాత్రం సామభి శ్చక్రే బ్రహ్మత్వం చాప్య ధర్వభిః ।
తతః సత్రే చ ఉద్దృత్య ఋగ్వేదం కృతవాన్ ప్రభుః ॥
యజూంషి తు యజుర్వేదం సామవేదం తు సామభిః ।
ఏకవింశతిభేదేన ఋగ్వేదం కృతవా న్పురా॥
శాఖానాన్తు శతే నైవ యజుర్వేద మథా కరోత్ ।
సామవేదం సహస్రణ శాఖానాం ప్రబిభేద సః ॥
అధర్వాణ మథో వేదం బిభేద కుశకేతనః ।
భేదై రష్టాదశై ర్వ్యాసః పురాణం కృతవాన్ ప్రభుః ॥
సోఽయ మేక శ్చతుష్పాదో వేదః పూర్వం పురాతనః ।
ఓజ్గారో బ్రహ్మణో జాతః సర్వదోషవిశోధనః ॥
వేదవిద్యోఽథ భగవో స్వాసుదేవః సనాతనః ।
స గీయతే పరో వేదై ర్యో వేదైనం స వేద విత్ ॥
సామవేద మంత్రములతో ఔద్దాత్రమును కల్పించెను అధర్వవేద మంత్రములతో బ్రహ్మత్వమును ఏర్పరచెను.
తరువాత సత్రమునందు ఉద్దరించి ఋగ్వేదమును ప్రభువు నిర్మించెను. యజుర్మంత్రములతో యజుర్వేదమును, సామ మంత్రములతో సామవేదమును ఏర్పరచెను. పూర్వము ఋగ్వేదమును ఇరువదియొక్క భేదములతో వ్యవస్థీకరించెను.
నూరు శాఖల భేదముతో పిదప యజుర్వేదమును నిర్మించెను. ఆ వ్యాసుడు వేయిశాఖల భేదముతో సామవేదమును కల్పించేను:
అనంతరము కుశకేతనుడగు అముని అధర్వణ వేదమును విభజించేను. వ్యాసుడు పదునెనిమిది భేదములతో పురాణ వాజ్మయమును సృష్టించెను.
పూర్వము ప్రాచీనమైన వేదము ఒక్కటి నాలుగు పాదములు కలిగియుండెను. అన్ని దోషములను శుద్ధి చేయునట్టి ఓంకారము బ్రహ్మ నుండి పుట్టినది.
భగవంతుడు, సనాతనుడు అగు వాసుదేవుడు వేదములచే తెలియబడువాడు. ఆ పరమపురుషుడు వేదములచేత గానము చేయుబడును. అతనినేవడు తెలియునో వాడు వేదవిదుడనబడును.
ఏతత్పరతరం బ్రహ్మ జ్యోతి రానన్ద ముత్తమమ్ ।
వేదవాక్యోదితం తత్వం వాసుదేవః పరమ్పదమ్ ॥
వేదవి ద్య ఇమం వేత్తి వేదం వేదపరో మునిః ।
అవేదం పరమం వేత్తి వేదనిఃశ్వాసకృత్పరః ॥
స వేదవేద్యో భగవాన్ వేదమూర్తి ర్మహేశ్వరః ।
స ఏవ వేద్యో వేదశ్చ త మేవాశ్రిత్య ముచ్యతే॥
ఇత్యేత దక్షరం వేద మోజ్కారం వేద మవ్యయమ్ ।
అవేదం చ వీజానాతి పారాశర్యో మహామునిః ॥
ఇతి శ్రీ కూర్మపురాణే వేదశాఖా ప్రణయనం నామ ద్వీపఞ్చాశోఽధ్యాయః ॥
ఇది మిక్కిలి పరమైన బ్రహ్మము. ఉత్తమమైన ఆనందరూపమైన జ్యోతి. వేదవాక్యములచేత చెప్పబడిన తత్త్వము పోసుదేవుడు. అతడే పరమగమ్యుడు.
ఎవడు ఇతనిని తెలియునో, పోడు వేదమును తెలిసినవాడు, వేదపరుడైన ముని అనబడును. వేదములను నిశ్వాసముగా చేసికొన్న పరమ పురుషుడు, వేదాతీతుడైన పరమాత్మను వేదజ్ఞుడైన వాడు తెలిసికొనును.
వేదస్వరూపుడైన పరమేశ్వరుడు వేదములచే తెలియదగిన భగవంతుడు అని తెలియవలెను. అతడే వేదరూపుడు, తెలియదగినవాడు. అతని నాశ్రయించి ముక్తుడగును.
పరాశరపుత్రుడైన వేదవ్యాసమహాముని, ఈ పూర్వోక్తవిధముగా నాశరహితము, అక్షరాత్మకము, ఓంకార స్వరూపము అగువేదమును, వేదాతీతుడైన పరమాత్మను గూడ తెలిసియున్నాడు.
శ్రీ కూర్మపురాణములో వేదశాఖా ప్రణయనమనబడు ఏబదిరెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 52 of the Kūrma Mahā Purana is as follows:
Sūta explains how in every Dvāparayuga, Bhagavān Nārāyaṇa incarnates in the form of Maharshi Kṛshṇa-Dvaipāyana Vyāsa to divide the single eternal Veda into four collections—Ṛgveda, Yajurveda, Sāmaveda, and Atharvaveda—to suit the diminishing mental capacities of human beings. Vyāsa imparted the Ṛgveda to Paila, Yajurveda to Vaishampāyana, Sāmaveda to Jaimini, and Atharvaveda to Sumantu, while entrusting the Itihāsa and Purāṇas to Sūta Lomaharshaṇa.