కూర్మ మహా పురాణము
23 - వంశకీర్తనమ్
సూత ఉవాచః-
జయధ్వజస్య పుత్రోఽ భూ త్తాలజఞ్ఘ ఇతి స్మృతాః ।
శతం పుత్రా స్తు తస్యాసoతాలజఙ్ఘా ఇతి స్మృతాః ॥
తేషాం జ్యేష్ఠో మహావీర్యో వీతిహోత్రోఽ భవన్నృపః ।
వృషప్రభృతయ శ్చాన్యే యాదవాః పుణ్యకర్మిణః ॥
వృషో వంశకర స్తేషాం తస్య పుత్రోఽ భవ న్మధుః ।
మధోః పుత్రశతం త్వాసీ ద్వృషణ స్తస్య వంశభాక్ ॥
వీతిహోత్రసుత శ్చాపి విశ్రుతో ఽ నoత ఇత్యతః ।
దుర్జయ స్తస్య పుత్రోఽ భూ త్సర్వశాస్త్రవిశారదః ॥
తస్య భార్యా రూపవతీ గుణైః సర్వై రలంకృతా ।
పతివ్రతా సీ త్పతినా స్వధర్మపరిపాలికా ॥
జయధ్వజునకు తాలజంఘుడను పేరుగల కుమారుడు కలిగెను. అతనికి నూరుగురు పుత్రులు కలిగిరి. వారందరు తాలజంఘులను పేరుతోనే పిలువ బడిరి.
పొరిలో పెద్దవాడు గొప్ప పరాక్రమము కల వీతిహోత్రుడనుడు రాజాయెను. వృషుడు మొదలగు పుణ్య ప్రవర్తనకల ఇతర యాదవులు కూడ అతని సంతతిలోనివారై ఉండిరి.
వంశకర్తగా ఉండెను. అతనికీ మధువను వాడు పుత్రుడుగా జన్మించెను. ఆ మధువుకు వందమంది కుమారులు కలిగిరీ. వారిలో వంశకర్తగా వృషణుడుండెను.
వీతిహోత్రుని కుమారుడు అనంతుడనుపేర ప్రసిద్ధుడై ఉండెను. అతనికి అన్ని శాస్త్రముల యందు పాండిత్యము కలిగిన దుర్జయుడను పుత్రుడుండెను.
ఆ దుర్జయుని భార్య సౌందర్యవతి, అన్ని గుణములచే అలంకరింపబడినది, పతియే దైవముగా భావించు వ్రతముకలదీ, భర్తతో కలి సీ తమ ధర్మముసోచరించునదీగా ఉండెను.
స కదాచి న్మహారాజః కాలిoదీతీరసంస్థితామ్ ।
అపశ్య దుర్వశీం దేవీం గాయన్తం మధురశ్రుతిమ్ ॥
తతః కామాహతమనా స్తత్సమీప ముపేత్య వై।
ప్రోవాచ సుచిరం కాలం దేవి రస్తుం మయార్హసి ॥
సా దేవీ నృపతిం దృష్ట్వా రూపలావణ్యసంయుతమ్ ।
రేమే తేన చిరం కాలం కామదేవ మివాపరమ్ ॥
కాలా ర్ప్రబుద్ధో రాజా తా ముర్వశీం ప్రాహ శోభనామ్ ।
గమిష్యామి పురీం రమ్యాం హసoతి త్య బ్రవీద్వచః ॥
న హ్యేతేనోపభోగేన భవతో రాజసున్దర ।
ప్రీతిః సఞ్జాయతే మహ్యం స్థాతవ్యం వత్సరం పునః ॥
ఆ దుర్జయ మహారాజు ఒకప్పుడు యమునానదీతీరములో ఉండి, మధురమైన కంఠస్వరముతో పాడుచున్న ఉర్వశీ దేవిని చూచెను.
తరువాత మనస్సులో మన్మథ వీకారము కలిగినవాడై, ఆమేదగ్గరకు వెళ్ళీ ఇట్లనెను. ఓ దేవీ నీవు చాలాకాలము నాతో కలిసి రమించుటకు తగియున్నోవు. ఆ ఉర్వశీదేవి, అందము లావణ్యము కలిగిన ఆ రాజును చూచి రెండవ మన్మధునివలే నున్న అతనితో కలిసి చాలకాలము శృంగారక్రీడలతో రమించేను.
చాల కాలము గడచిన తరువాత రోజు వివేకము కలవాడై చక్కనిదైన ఉర్వశితో, “నా అందమైన పట్టణమునకు తిరిగి వెళ్లుదును ” అనీ యనగా ఆమె నవ్వుచు ఇట్లు పలికెను.
ఓ అందమైన రోజకుమారా నీతో అనుభవించిన ఈ సుఖభోగములతో సోకు తృప్తి కలుగలేదు. అందువలన నీవు ఇంకొక సంవత్సరము వరకు ఉండవలెను.
తామబ్రవీ త్స మతీమాన్ గత్వా శీఘ్రతరం పురీమ్ ।
ఆగమిష్యామి భూయాఽత్ర తన్మేఽ ను జ్ఞాతుమర్హసి॥
త మబ్రవీత్సా సుభగా తథా కురు విశామ్పతే ।
నాన్యయా ప్సరసాతావ ద్రన్తవ్యం భవతా పునః ॥
ఓ మిత్యుక్త్వా యయౌ తూర్ణం పురీం పరమశోభమ్ ।
గత్వా పతివ్రతాం పత్నీం దృష్ట్వా భీతోఽ భవ న్నృపః ॥
సంప్రేక్ష్య సా గుణవతీ భార్యా తస్య పతివ్రతా ।
భీతం ప్రసన్నయా ప్రాహ వాచా పీనపయోధరా॥
స్వామిన్ కిమత్ర భవతో భీతి రద్య ప్రవర్తతే ।
త ద్బ్రూహి మే యథాతత్త్వం న రాజ్ఞాం కీర్తయే త్విదమ్॥
బుద్దిమంతుడైన రాజు ఆమెతో ఇట్లు పలికెను. “నేను పట్టణమునకు వెళ్ళి మరల శీఘ్రముగా నీవద్దకు రాగలను. అందువలన నీవు నాకు వెళ్లుటకనుమతించవలేను.”
ఆ ఉర్వశి అతని మాటవిని ఇట్లనెను. “ఓరోజా అట్లే చేయుము. అంతవరకు నీవు మరియొక అప్సరసతో కలిసిరమించవలదు, రాజు అట్లే అని పలికి మిక్కిలి మనోహరమైన తననగరమునకువెళ్లెను. వెళ్లి పతివ్రతయగు భార్యను చూచి ఆరాజు భయపడెను.
అతని భార్య పతివ్రత, గుణవంతురాలు. దృఢమైన స్తనములుకల ఆమె తనభర్తను భయపడినవానిగా చూచీ, ప్రసన్నమైన వాక్కుతో ఇట్లనెను.
స్వామీ ఎందుకు మీకు ఇప్పుడు భయము కలుగుచున్నది? ఆకారణమును నాకు ఉన్నదున్నట్లుగా చెప్పుము. ఈ భయపరిస్థితి రాజులకు కీర్తిదాయకము కాదు.
స తస్యా వాక్య మాకర్ణ్య లజ్జావనతమానసః ।
నోవాచ కించి నృపతిర్జ్ఞానదృష్ట్యా వివేద సా ॥
న భేతవ్యం త్వయా రాజన్ కార్యం పాపవిశోధనమ్ ।
భీతే త్వయి మహారాజు రాష్ట్రం తే నాశ మేష్యతి ॥
తతః స రాజా ద్యుతిమా న్నిర్గత్య తు పురా త్తతః ।
గత్వా కణ్వాశ్రమం పుణ్యం దృష్ట్వా తత్ర మహామునిమ్ ॥
నీశమ్య కణ్వవదనాత్ ప్రాయశ్చిత్త విధిం శుభమ్ ।
జగామ హిమవత్పృష్ఠం సముద్దిష్టం మహాబలః ॥
సోఽపశ్య త్ప్ధరాజేన్రొధా గస్థర్వవర ముత్తమమ్ ।
భ్రాజమానం శ్రియా వ్యోమ్ని భూషితం దివ్యమాలయా ॥
ఆరాజు భార్యయొక్క మాటవినీ, సిగ్గుతో క్రుంగిన మనస్సుకలవాడై ఏమియు బదులు పలుకకుండెను. ఆమె తనయొక్క జ్ఞానదృష్టితో విషయమును తెలిసికొనెను.
మహారాజా నీవు భయపడవలదు. పాపమునకు పరిహారము చేసికొనవలెను. నీవే భయపడినచో నీరాజ్యమంతయు వినాశముపొందగలదు.
తరువాత ఆ రాజు తనపట్టణము నుండి బయలుదేరి కణ్వమహాముని ఆశ్రమమునకు వెళ్లి అక్కడ పుణ్యాత్ముడైన కణ్వమునిని చూచి కణ్వముని నోటినుండి పాపమునకు ప్రాయశ్చిత్త విధానమును విని, గొప్పబలవంతుడైన ఆరాజు ఆమునీచే సూచింపబడిన హిమాలయ పర్వతము పృష్ఠభాగమునకు వెళ్ళెను.
ఆ రాజు వెళ్లునప్పుడు దారిలో ఒక గంధర్వ శ్రేష్టుని చూచెను. అతడు ఆకాశములో దివ్యమైన మాలతో అలంకరించబడి గొప్పగా ప్రకాశించుచుండెను.
వీక్ష్య మాలా మమిత్రఘ్నః సస్మారా ప్సరసం వరామ్ ।
ఉర్వశీం తాం మన శ్చక్రే తస్యా ఏవేయ మర్హతి ॥
సోఽ తీవ కాముకో రాజా గంధన్జర్వేణాధ తేన హి ।
చకార సుమహద్యుద్దం మాలా మాదాతు ముద్యతః ॥
విజిత్య సమరే మాలాం గృహీత్వా దుర్జయో ద్విజా ।
జగామ తా మప్సరసం కాలీందీం ద్రష్టు మాదరాత్ ॥
అదృష్ట్వా ప్సరసం తత్ర కామబాణాభిపీడితః ।
బభ్రామ సకలాం పృధ్వీం సప్తద్వీపసమన్వితామ్ ॥
ఆక్రమ్య హిమవత్వార్శ్వ ముర్వశీదర్శనోత్సుకః ।
జగామ శైలప్రవరం హేమకూట మీతి శ్రుతమ్ ॥
శత్రు సంహారకుడైన ఆ రోజు మాలను చూచి శ్రేష్టురాలైన ఉర్వశి అను అప్పరసను తలచుకొనెను. ఈ మాల ఆమెకే తగియుండునని అభిప్రాయపడెను.
ఎక్కువకామము కలవాడై ఆరాజు ఆమాలను గ్రహించుటకు పూనుకున్నవాడై, ఆగంధర్వునితో చాలగొప్పయుద్దమును చేసెను.
ఓ విప్రులారా ఆదుర్జయరాజు యుద్ధములో గెలిచి గంధర్వుని నుండి మాలను స్వీకరించి, ఆ అప్సరసను చూచుటకు గాను ప్రేమతో యమునానదిని గూర్చివెళ్లెను.
అక్కడ ఆ అప్సరసకన్పించక ఆ రాజు మన్మథుని బాణములచేత పీడింపబడినవాడై, ఆమెను చూచుటకు ఏడుద్వీపములతో కూడిన సమస్త భూమండలమును సంచరించెను.
హిమాలయపర్వతము యొక్క ప్రక్కభాగమున ప్రవేశించి, ఉర్వశిని చూచుటకు కుతూహలము కలవాడై, హేమకూటమను పేరుతో ప్రసిద్ధమైన ఒక పర్వత శ్రేష్ఠమును చేరుకోనెను.
తత్ర తత్రా ప్సరోవర్యా దృష్ట్వా తం సింహవిక్రమమ్ ।
కామం సన్దధిరే ఘోరం భూషితం చిత్రమాలయా ॥
సంస్మర న్నుర్వశీవాక్యం తస్యాం సంసక్తమానసః ।
న పశ్యతి స్మతాః సర్వా గిరేః శృజ్గాణీ జగ్మీవాన్ ॥
తత్రాప్యప్సరసం దివ్యా మదృష్ట్వా కామపీడితః ।
దేవలోకం మహామేరుం యయౌ దేవపరాక్రమః ॥
స తత్ర మానసం నామ సర స్త్రైలోక్యవిశ్రుతమ్ ।
భేజే శృఙ్గ మతిక్రమ్య స్వబాహుబలభావితః ॥
తస్య తీరేషు సుభగాం చరంతి మతిలాలసామ్ ।
దృష్టవా ననవద్యాజ్గీం తస్యై మాలాం దదౌ పునః ॥
ఆయా ప్రదేశాలలోని అప్సరసలు, సింహపరాక్రమముగల, చిత్రమైన మాలచేత అలంకరించబడిన రోజునుచూచి అతనియందు కామమును పొందిరి. ఆరో.జు ఉర్వశి వాక్యమును తలచుచు, ఆమెయందులగ్నమైన మనస్సుకలపొడై ఆ అప్సరసలందరిని చూడకుండెను. తరువాత పర్వతశిఖరములను గూర్చివెళ్లెను.
అక్కడ కూడా దీవ్యాప్సరసయగు ఊర్వశిని చూడక, కామముచేత బాధింపబడినవాడై దేవతలతోసమాన పరాక్రమముగల రోజు దేవతలనీవాస స్థానమైన మహామేరు పర్వతమునకు వెళ్లెను.
అతడక్కడ ముల్లోకములయందు మానసమనుపేరుతో ప్రసిద్దమైన సరస్సును చేరుకొనెను. మేరుశిఖరమును దాటితనభుజబలముతో విశ్వాసముకలవాడై
ఆ మానససరస్సు తట ప్రదేశములందు తిరుగుచున్న, మనోహరమైన, మిక్కిలి కోరికతో కూడియున్న, నిర్దుష్టమైన శరీరముకల ఊర్వశిని చూచెను. ఆమెకు మరల మాలనుఇచ్చెను.
స మాలయా తదా దేవీం భూషితాం ప్రేక్ష్య మోహితః ।
రేమే కృతార్ధ మాత్మానం జానానః సుచిర స్త్రీయా ॥
అథోర్వశీ రాజవర్యం రతాంతె వాక్య మబ్రవీత్ ।
కిం కృతం భవతి వీర పురీం గత్వా తదో నృప ॥
స తస్యై సర్వ మాచష్ట పత్న్యా య త్సముదీరితమ్ ।
కణ్వస్వ దర్శనం చైవ మాతాపహరణం తథా ॥
శ్రుత్వైత ద్వ్యాహృతం తేన గచ్ఛేత్యాహ హితైషిణీ ।
శాపం దాస్యతి తే కణ్వే ముమాపి భవతః ప్రియా ॥
తయా సకృ న్మహారాజః ప్రోక్తోపీ మదమోహితః ।
న చ తత్కృతవా న్వాక్యం తత్ర సంన్యస్తమానసః॥
ఆ దుర్జయుడు మాలచేత అలంకరింపబడిన ఊర్వశిని చూచి, మోహమును పొంది తనను ధన్యునిగా భావించినవాడై ఆమెతో చాలకాలము రమించేను.
తరువాత ఊర్వశీ రాజశ్రేష్టునీతో ఒక వాక్యమును పలికేను. “ఓవీరా అప్పుడు నీవుపట్టణమునకు వెళ్లి ఏమి చేసితివీ ” ? అని
ఆరాజు ఊర్వశికి, తనభార్య పలికిన దంతయు చెప్పెను. కణ్వుని దర్శనమును, మాలనపహరించుటను కూడ ఆమెకుతెలిపెను.
దుర్జయుడు పలికిన మాటవిని ఊర్వశి అతనీ హితమును గోరునదై వేళ్లుమని పలికెను. కణ్వుడు నీకు శాపమునీయగలడు. నీ ప్రియురాలుకూడ నన్నుశపించగలదు. కావున నీవు వెళ్లుము.
ఆ మహారాజు ఆమెచేత చాలమార్లు చెప్పబడీ కూడ, కామమదముచే మోహమును పొందినపోడై ఊర్వశియందే మనస్సు లగ్నము చేసినవాడై, ఆమె మాటను పాటించడాయెను.
తదోర్వశీ కామరూపా రాజ్ఞే స్వం రూప ముత్కటమ్ ।
సురోమశం పిఙ్గలాక్షం దర్శయామాస సర్వదా ॥
తస్యాం విరక్తచేతసః స్మృత్వా కణ్వాభిభాషితమ్ ।
ధి జ్మామితి వినిశ్చిత్య తపః కర్తుం సమారభేత్ ॥
సంవత్సరద్వాదశకం కస్టమూలఫలాశసః ।
భూయఏవ ద్వాదశకం వాయుభక్షోభ వ నృపః॥
గత్వా కణ్వాశ్రమం భీత్యా తస్మై సర్వం న్యవేదయత్ ।
వాస మప్సరసా భూయ స్తపోయోగ మనుత్తమమ్ ॥
వీక్ష్య తం రాజశార్దూలం ప్రసన్నో భగవానృషిః ।
కర్తుకామో హి నిర్భీజం తస్యాఘ మీదమ బ్రవీత్ ॥
అప్పుడు స్వేచ్ఛారూపశక్తిగల ఊర్వశి, రాజునకు రోమములేక్కువగా కలిగి, పింగళవర్ణపుకన్నులు గల భయంకరమైన తనరూపమును చూపించేను.
అదిచూచి దుర్జయుడామె యందు విరక్తికలవాడై, కణ్వుని వచనమును తలచుకొని, ‘ఛీ’ అని తన్నునిందించుకోని తపస్సుచేయుటకు ప్రారంభించెను.
పండ్రెండు సంవత్సరాల కాలము కందమూలములను, పండ్లనుతీనుచు, మరొక పండ్రెండు వర్షములు వాయువును మాత్రము ఆహారముగా కలిగి ఆరాజుండెను.
తరువాత కణ్వుని ఆశ్రమానికి వెళ్లి భయముతో ఆయనకంతయు తెలిపెను. అప్సరసతో కొంతకాలము కలిసి ఉండుట, తరువాత తపస్సు చేయుట అంతయు చెప్పెను.
రాజశ్రేష్ఠుడైన ఆదుర్జయుని చూచి, పూజ్యుడైన కణ్వఋషి ప్రసన్నుడై, అతని పాపమును నిర్మూలన కావించదలచి ఇట్లు పలికెను.
కణ్వఉవాచః-
గచ్చ వారాణసీం దివ్యా మీశ్వరాధ్యుషితాం పురీమ్ ।
ఆస్తే మోచయితుం లోకం తత్ర దేవో మహేశ్వరః ॥
స్నాత్వా సన్తర్య వీథీవ ద్గఙ్గాయాం దేవతాః పితౄన్ ।
దృష్టా విశ్వేశ్వరం లీజ్ఞం కిల్బిషా న్మోక్ష్యసే క్షణాత్॥
ప్రణమ్య శిరసా కణ్వ మనుజ్జప్య చ దుర్జయః ।
వారాణస్యాం హరం దృష్ట్వా పాపా న్ముక్తో భవ త్తతః ।
జగామ స్వపురీం శుభాం పాలయానస మేదినీమ్ ।
యాజయామాస తం కణ్వో యాచితో ఘృణయా మునిః ॥
తస్య పుత్రోథ మతిమా న్సుప్రతీక ఇతి స్మృతః ।
బభూవ జాతమాత్రం తం రాజాన ముపతస్థిరే ॥
ఉర్వశ్యా ఞ్చ మహావీర్యాః సప్త దేవసుతోపమాః ।
కన్యా జగృహిరే సర్వా గస్థర్వ్యో దయితా ద్విజాః ॥
కణ్వుడిట్లనెను :-
“ఈశ్వరునిచే నివాసముగా చేసికొనబడిన దివ్యమైన వారణాశి పట్టణమునకు వెళ్లుము. అక్కడ భగవంతుడైన మహేశ్వరుడు లోకమును సంసారబంధమునుండి విడిపించుటకు నిలిచియున్నాడు.
గంగానదియందు స్నానముచేసి శాస్త్రవిధానము ప్రకారము దేవతలకు, పితరులకు సంతర్పణములిచ్చి, లింగరూపియైన విశ్వేశ్వరుని దర్శించుకొని క్షణకాలములో పాపమునుండి విముక్తుడవు కాగలవు”.
అని చెప్పగావిని దుర్జయుడు కణ్వమునికి శిరస్సువంచి ప్రణామముచేసి ఆయనవద్ద సెలవును పొంది వారాణసీకి వెళ్లి శివుని దర్శించుకొని పాపములనుండి విముక్తుడాయెను.
తరువాత నిర్మలమైన తనపట్టణమునకు వెళ్లి రాజ్యపాలనము చేసెను. పిమ్మట కణ్వుడాతని చేత ప్రార్థింపబడి దయతో యజ్ఞమునతని చేత చేయించెను.
తరువాత అతనికి బుద్ధిమంతుడైన సుప్రతీకుడను కుమారుడు కలిగెను. అతడు పుట్టగానే రాజు వద్దకు ఉర్వశియందు పుట్టిన, దేవకుమారునితో సమానులైన ఏడుగురు గొప్పపరాక్రమవంతులు చేరిరి. వారందరు గంధర్వకన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి.
ఏష వః కఠితః సమ్యక్ సహస్రజిత ఉత్తమః ।
వంశః పాపహరో నృణాం క్రోష్టో రపి నిబోధత ॥
ఇతి శ్రీ కూర్మపురాణే రాజవంశానుకీర్తనే త్రయో వింశో ధ్యాయః ॥
ఇది యంతయు సహస్రజిత్తుయొక్క శ్రేష్ఠమైన వంశముయొక్క మనుష్యుల పాపములను నశింపజేయునది అగువృత్తాంతము మీకు చెప్పబడినది. ఇక క్రోష్ణువు యొక్క వృత్తము చెప్పెదను వినుడు.
శ్రీ కూర్మపురాణములో రాజవంశానుకీర్తనమునందు ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Kūrma Mahā Purana is as follows:
Sūta details the lineages originating from Yayati's elder sons—Yadu, Turvasu, Druhyu, and Anu—who established kingdoms across different quarters of Bhāratavarsha. Focus is placed on the lineage of Yadu and his heroic descendant Haihaya, from whom arose King Kārtavīryārjuna. Kārtavīryārjuna performed intense penance to Sage Dattātreya, acquiring a thousand arms, invincibility, and miraculous golden chariots. He ruled his vast empire with unmatched righteousness until his arrogance led to his eventual encounter with Maharshi Parashurāma, an avatāra of Vishṇu.