30వ అధ్యాయము

వ్యాస ఉవాచ:

అతః పరం ప్రవక్ష్యామి ప్రాయశ్చిత్తవిధిం శుభమ్

హితాయ సర్వప్రాణినాం దోషాణా మపనుత్తయే

అకృత్వా విహితం కర్మ కృత్వా నిందిత మేవ చ

దోష మాప్నోతి పురుషః ప్రాయశ్చిత్తం విశోధనమ్

ప్రాయశ్చిత్త మకృత్వా తు న తిష్ఠే ద్బ్రాహ్మణః క్వచిత్

యద్బ్రూయు ర్బ్రాహ్మణాః శాంతా విద్వాంస స్తత్సమాచరేత్

వేదార్థవిత్తమః శాంతో ధర్మకామోఽగ్నిమాన్ ద్వీజః

స ఏవ స్యాత్ పరో ధర్మో యమేకోఽపీ వ్యవస్యతి

అనాహితాగ్నయో విప్రా స్త్రయో వేదార్థపారగాః

యద్బ్రూయు ద్ధర్మ కామాం స్తే తత్ జ్ఞేయం ధర్మసాధనమ్

అనేకధర్మశాస్త్రజ్ఞా ఊహాపోహవిశారదాః

వేదాధ్యయనసంపన్నాః సప్తైతే పరికీర్తితాః

మీమాంసాజ్ఞానతత్త్వజ్ఞా వేదాంతకుశలా ద్వీజాః

ఏకవింశతివిఖ్యాతాః ప్రాయశ్చిత్తం వదన్తి వై

బ్రహ్మహా మద్యపః స్తేనో గురుతల్పగ ఏవ చ

మహాపాతకిన స్త్వేతే యశ్చైతైః సహ సంవిశేత్

సంవత్సరన్తు పతితైః సంసర్గం కురుతే తు యః

యానశయ్యాసనై ర్నిత్యం జాన న్వై పతితో భవేత్

యాజనం యోనిసంబంధం తథైవాధ్యాపనం ద్విజః

సద్యః కృత్వా పతత్యేవ సహభోజనమేవ చ

వ్యాస మహర్షి పలికెను.

బ్రాహ్మణులకు హితమును కలిగించుటకు సకల దోషములను తొలగించుటకు శుభకరమగు ప్రాయశ్చిత్త విధిని తెలిపెదను. విధించిన కర్మల నాచరించకున్ననూ, నిషేధించిన కర్మల నాచరించిననూ దోషమును పొందును. ప్రాయశ్చిత్తము వలననే ఆ దోషములు తొలగును. బ్రాహ్మణుడైనవాడు దోషముల నాచరించినచో ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఆచరించకుండరాదు. బ్రాహ్మణులు శాంతులు విద్వాంసులు చెప్పిన దాని నాచరించవలయును. వేదార్థ జ్ఞానము గలవాడు, శాంతుడు ధర్మ కాముడు ఆహితాగ్నీ ద్వీజుడు ఒకడు. చెప్పినను అదీ పరమ ధర్మమే యగును. వేదార్థపారగులైన వారు, ఆహితాగ్నులు కానీ మువ్వురు ధర్మకాములై చెప్పినదే ధర్మము. ఇక అనేక ధర్మ శాస్త్రములను తెలిసినవారు, ఊహాపోహ విశారదులు వేదాధ్యయన సంపన్నులు ఏడుగురు చెప్పినది ధర్మమగును. మీమాంసకత్వము తెలిసినవారు, వేదాంత కుశలులగు ద్వీజులు 21మంది ప్రాయశ్చిత్తమును చెప్పగలరు. బ్రహ్మ హత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, దొంగ, గురు భార్య సంగతి చేసినవాడు వీరు మహాపాపు లనబడుదురు. వీరితో కలిసుండుపోగు కూడా మహాపాతకులే అగుదురు. మహా పాతకులనీ తెలిసిననూ ఒక సంవత్సరము వారితో కలిసి యాన శయ్యా ఆసనాదులలో కలిసి నిలిచినచో పతితుడగును. మహాపాతకి అని తెలిసికూడా యజ్ఞములను చేయించుట, యోని సంబంధమును అనగా వివాహము జరుపుకోనుట వేదాధ్యయనము చేయించుట భోజనాదులు చేసినచో వెంటనే ప్రతీతుడగును.

అవిజ్ఞాయాథ యో మోహా త్కుర్యా దధ్యాపనం ద్విజః

సంవత్సరేణ పతతి సహా ధ్యయన మేవ చ

బ్రహ్మహా ద్వాదశాబ్దాని కుటిం కృత్వా వనే వసేత్

భైక్ష్యమాత్మ విశుద్ద్యర్థే కృత్వా శవశిరోధ్వజమ్

బ్రాహ్మణావసథాన్ సర్వాన్ దేవాగారాణి వర్జయేత్

వినీందన్ స్వయమాత్మాసం బ్రాహ్మణం తం చ సంస్మరన్

అసంకల్పితయోగ్యాని సప్తాగారాణి సంవిశేత్

విధూమే శనకై ర్నిత్యం వ్యంగారే భుక్తవజ్ఞనే

ఏకకాలం చరే ద్భైక్ష్యం దోషం విఖ్యాపయ న్నృణామ్

వన్యమూలఫలైర్వాపీ వర్తయే ద్వై సమాశ్రితః

కపాలపాణిః ఖట్వాంగీ బ్రహ్మచర్యపరాయణః

పూర్ణే తు ద్వాదశే వరే బ్రహ్మహత్యాం వ్యపోహతి

అకామతః కృతే పాపే ప్రాయశ్చిత్త మీదం శుభమ్

కామతో మరణా చ్ఛుద్ధిః జ్ఞేయా నాన్యేన కేనచిత్

కుధ్యా దనశనం వాథ భృగోః పతనమేవ వా

జ్వలంతం వా విశే దగ్నిం జలం వా ప్రవిశే త్స్వయమ్

బ్రాహ్మణార్థే గవార్థే వా సమ్యక్ ప్రాణాన్ పరిత్యజేత్

బ్రహ్మహత్యాపనోదార్థ మంతరా వా మృతస్య తు

దీర్ఘామయావినం విప్రం కృత్వానామయమేవ వా

దత్త్వా చాన్నం సువిదుషే బ్రహ్మహత్యా వ్యపోహతి

అజ్ఞానము వలన మోహము వలన ఇటువంటి పాపులతో అధ్యయనము కాని అధ్యాపనము కానీ జరిపినచో ఒక సంవత్సరమున పతీతు డగును.

బ్రహ్మ హత్య గావించినవాడు అడవిలో కుటీరమును నిర్మించుకొని 12 సంవత్సరములుండవలయును. శవ శిరాకారమును ధ్వజముగా ధరించీ ఆత్మశుద్ధి కొరకు భిక్షాటనము గావించ వలయును. భిక్షలో బ్రాహ్మణ గృహములను దేవ మందిరములను విడువవలయును. తాను చంపిన బ్రాహ్మణుల తలచుకోనుచు తనను తాను నిందించుకొనుచు ముందు నిశ్చయించుకోన కుండా ఏడు ఇండ్లలో భీక్ష నాచరించవలయును. ఆ ఇండ్లలో పొగ రాకున్నపుడు నిప్పు చల్లారిన తరువాత, ఇంటిలోని వారందరూ భుజించిన తరువాత తాను చేసిన బ్రహ్మహత్యను నరులకు తెలుపుచు ఒకేసారి దీనమునకు భిక్షాటన గావించవలయును. ధైర్యము నవలంబించి వన్యమూల ఫలములతోనైనా జీవించవలయును. కపాల పొయై మంచము కోడును చేత పట్టుకొని బ్రహ్మచర్య పరాయణుడై 12 సంవత్సరములు ఆచరించినచో బ్రహ్మ హత్యా పాపము తొలగును. ఇది కూడా తెలియక చేసిన పాపమునకు మాత్రమే. తెలిసి చేసినచో బ్రతికున్నంత వరకు ప్రాయశ్చిత్తముల నాచరించి మరణించిన తరువాతనే శుద్దీయని తెలియవలయును. తెలిసి బ్రహ్మహత్య చేసినవాడు ఆ మరణ నిరాహారి కావలయును. ఎత్తు నుండి దూకి మరణించవలయును. మండుచున్న అగ్నిలోకానీ నీటిలో కొని పడవలయును. బ్రాహ్మణుని రక్షణ కొరకు, గోరక్షణ కొరకు ప్రాణములను విడువ వలయును. లేదా దీర్ఘ రోగి యోగి బ్రాహ్మణుని రోగమును శాంతింప చేసిననూ, దుర్భిక్షములలో బ్రాహ్మణునికి అన్నము పెట్టిననూ బ్రహ్మ హత్య పాపము తొలగును.

అశ్వమేథావభృథకే స్నాత్వా వై శుధ్యతే ద్విజః

సర్వస్వం వా వేదవిదే బ్రాహ్మణాయ ప్రదాయ చ

సరస్వత్యా స్త్వరుణయా సంగమే లోక విశ్రుతే

శుధ్యే త్త్రిషవణస్నానా త్త్రిరాత్రోపోషితో ద్విజః

గత్వా రామేశ్వరం పుణ్యం స్నాత్వా చైవ మహోదధౌ

బ్రహ్మచర్యాదిభి ర్యుక్తో దృష్ట్వా రుద్రం విమోచయేత్

కపాలమోచనం నామ తీర్థం దేవస్య శూలిసః

స్నాత్వాభ్యర్చ్య పితృన్ దేవాన్ బ్రహ్మహత్యాం వ్యపోహతి

యత్ర దేవాధిదేవేన భైరవేణా తీతేజసా

కపాలం స్థాపితం పూర్వం బ్రహ్మణః పరమేష్ఠినః

సమభ్యర్య మహాదేవం తత్ర భైరవ రూపిణమ్

తర్పయిత్వా పిత్యన్ స్నాత్వా ముచ్యతే బ్రహ్మ హత్యయా

ఇతి శ్రీ కూర్మపురాణే ఉత్తరార్థే బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్త వర్ణనం నామ త్రింశోఽధ్యాయః  

రామేశ్వర క్షేత్రమునకు వెళ్ళి సముద్రమున స్నాన మాచరించి బ్రహ్మచర్య పాలనతో రుద్రుని దర్శించిన బ్రహ్మహత్యా పాపము తొలగును. కపాల మోచనమను శివక్షేత్రమునకు వెళ్ళి స్నానమాచరించి పితృదేవతలను పూజించి బ్రహ్మ హత్యా పాతకము తొలగించు కొనవచ్చును. పూర్వము కపాలమోచన క్షేత్రమున అమీత తేజస్వీయగు భైరవుడు బ్రహ్మ కపాలమును ప్రతిష్ఠించెను. ఇచట భైరవ రూపుడగు శిపుని చక్కగా పూజించి స్నానమాచరించి పితృ తర్పణము గావించి బ్రహ్మ హత్య నుండి విముక్తుడగును. అశ్వమేధావభృథకమున స్నానము చేసిననూ శుద్ధి పొందును. వేదవిత్తైన బ్రాహ్మణునకు తన సర్వస్వమును అర్పించిననూ విశుద్ధుడగును. ప్రసిద్ధమగు సరస్వతి అరుణా నదీ సంగమమున మూడు పూటలా స్నానము చేసి మూడు రాత్రు లుపవసించిననూ బ్రహ్మ హత్యాపాతకము నుండి విముక్తుడగును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్ర సంహితలో ఉపరి విభాగమున 30వ అధ్యాయము.